అగ్ని మహా పురాణము

Table of Contents

48 - అథ చతుర్వింశతిమూర్తి స్తోత్రమ్

హయగ్రీవుడు చెప్పెను. బ్రహ్మదేవా ! ఓంకార రూపుడగు కేశవుడు తన హస్తములో (క్రింది కుడి చెయ్యి, పై కుడి చేయ్యి, పై ఎడమ చేయ్యి, క్రింద ఎడమ చేయ్యి ఆనుక్రమమున అని ఒక మతము. పై కుడి చెయ్యి మొదలు క్రింద కుడి చెయ్యి వరకును అని మరొక మతము) పద్మ - శంఖ - చక్ర గదలను ధరించి యుండును. నారాయణుడు అదే వరుసలో శంఖ - పద్మ - గదా - చక్రములను ధరించును. ప్రదక్షిణ పూర్వకముగా ఆ భగవంతుని పాదములకు నమస్కరించుచున్నాను. మాధవుడు గదా - చక్ర - శంఖ, పద్మములను ధరించును. నే నాతనికి నమస్కరించుచున్నాను. - గోవిందుడు చక్ర - గదా - పద్మ - శంఖములను ధరించును. బలశాలియై యుండును. శ్రీ విష్ణువు గదా - పద్మ  శంఖ - చక్రములను ధరించును. ఆతడి మోక్ష ప్రదాత మధుసూదనుడు శంఖ చక్ర - పద్మ -గదలను ధరించును. నేనాతని ఎదుట భక్తితో వంగి నమస్కరించుచున్నాను. త్రివిక్రముడు పద్మ-గదా-చక్ర-శంఖములను ధరించును. వామనుడు శంఖ-చక్ర గదా-పద్మములతో ప్రకాశించుచుండును. ఆతడు సర్వదా నన్ను రక్షించుగాక.

శ్రీధరుడ కమల శంఖ చక్రధనస్సులమ ధరించి యుండును. ఆతడ అందరికిని సద్గతి ఇచ్చువాడ. హృషీ కేడు గదా-చక్ర-పద్మ-శంఖములను ధరించును. ఆతడు మనల నందరిని రక్షించుగాక. వరదాతయగు పద్మ నాభుడ శంఖపద్మ-చక్ర గదలను ధరించును. దామోదరుడ పద్మ-శంఖ-గదా-చక్రములు ధరించి విరాజిల్లు చుండును. ఆతనికి నమస్కరించుచున్నాను. గదా-శంఖచక్ర-పద్మ ధారియైన వాసుదేవుడు సంపూర్ణ జగమును సృజించెను. గదా- శంఖ పద్మ-చక్రములను ధరించిన సంకర్షణుడు ఒప్ముల నందరిని రక్షించుగాక.

యుద్ధ కుశలుడైన ప్రద్యుమ్నుడ చక్ర-శంఖ-గదా-పద్మ ములను ధరించును. అనిరుద్ధుడు చక్రగదా శంఖపద్మములను అతడు మనలను రక్షించుగాక. సురేశ్వరుడై న పురుషోత్తముడు చక్ర-కమల-శంఖ-గదలను ధరించును. అధోక్షజుడు పద్మగదా-శంఖ చక్రములను ధరించును. ఆతడు మిమ్ములను రక్షించుగాక. నృసింహుడు చక్ర - పద్మ-గదా-శంఖములను ధరించును. నేను ఆతనికి నమస్కరించుచున్నాను. గదా - పద్మ - చక్ర . శంఖములను ధరించు అచ్యుతుడు మిమ్ము లను రక్షించుగాక. శంఖ - గదా - చక్ర - పద్మములను ధరించు, బావటుడైన వామనుడు, పద్మ - చక్ర - శంఖ - గదలను ధరించు జనార్దనుడు, శంఖ - పద్మ - చక్ర - గదలను ధరించు, యజస్వరూపుడైన శ్రీహరి, శంఖ - గదా - పద్మ - చక్రములను ధరించు కృష్ణుడు నాకు భోగ మును, మోక్షమును ప్రసాదించుగాక.

వాసుదేవుడు ఆదిమూర్తి, వాసుదేవుని నుండి సంకర్షణుడు ఆవిర్భవించెను. సంకర్షణుని నుండి ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్ను ని నుండి ఆరుద్ధడు ఆవిర్భవించెను. వీరిలో ఒక్కరొక్కరు క్రమముగ కేశ వాదీమూర్తి భేదమున మూడేసి రూపములలో ఆవిర్భవించిరి. (అనగా వాసుదేవుని నుండి కేశవ - నారాయణ - మాధవమూర్తులు, సంకర్షణుని నుండి గోవింద - విష్ణు - మధుసూదనమూర్తులు ప్రద్యుమ్నుని నుండి త్రివిక్రమ - వామన - శ్రీధర మూర్తులు, అనిరుద్ధుని నుడి హృషీ కేశ - పద్మనాభ - దామోదరమూర్తులు ఆవిర్భవించినవి), ఇరువది నాలుగు మూర్తుల స్తోత్రముతో కూడిన ఈ ద్వాదశాక్షర స్తోత్రమును చదువువారును, వినువారును నిర్మలులై, సంపూర్ణ మనోరథములను పొందుదురు.

విశేషాంశము : ఈ స్తోత్రములో ఇరువది నాలుగు మూర్తుల స్వరూపముమ వర్ణించు మొదటి పండ్రెండు శ్లోకములలోని మొదటి అక్షరములను కలిపి చదివినచో “ఓం నమో భగవతే వాసుదేవాయ” అను ద్వానజాక్షరి ఏర్పడును అందుచే దానికి ఉద్వాదశాక్షరీ స్తోత్రము”. అనియు, “చతుర్వింశతి మూర్తి స్తోత్రము” అనియు పేర్లు.

అగ్ని శుహాపురాణము నందు చతుర్వింశతిమూర్తి స్తోత్రమను నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.