అగ్ని మహా పురాణము

Table of Contents

291 - అథ గజశాంతిః

శాలిహోత్ర ఉవాచః

శాలిహోత్రుడు చెప్పెను : గజరోగములను తొలగించు గజశాంతిని చెప్పెదను. పంచమి తిథియందు విష్ణ లక్ష్మీ, ఐరావతములను బ్రహ్మ శంకర ఇంద్ర, కుబేర, యములను, చంద్రసూర్యులను, వరుణుని. వాయు, అగ్ని, పృథివీ, ఆకాశములను. ఆదిశేషుని, శైలములను దేవయోనులగు విరూపాక్షి మహాపద్మ భద్ర సుమనస్ కుమద, ఐరావత పద్మ పుష్పదంత, వామన, ఆంజనములను గజములను అష్టదిగ్గజములను పూజించి హోమములు చేసి దక్షిణలు ఇవ్వవలెను. శాంతికలశ జలముతో గజాభిషేకము చేయించినచో అవివృద్ధి పొందును. ఇపుడు నైమిత్తిక శాంతిని వినుము. మకరాది సంక్రాంతుల యందు నగర బహిర్భాగమున ఈశాన్యమున ఏనుగులను పూజించవలెను. స్థండిలమున పద్మ మధ్యమున విష్ణువును లక్ష్మిని, పిదప అష్ట వశములందు క్రమముగా బ్రహ్మ సూర్య, పృథివీ, స్కంద, ఆనంత, ఆకాశ, శివ, చంద్రులను పూజించవలెను. పూర్వాది క్రమమున ఇంద్రాది దిక్పాలకులను పూజించవలెను. వారి ఆయుధములగు వజ్రశక్తి, దండ తోమర, పాశ, గదా, శూల, పద్మాదులను పూజించవలయును. దళము బాహ్యభాగమున చక్రమునందు సూర్యుని, అశ్వినీ దేవతలను పూజించవలయును. దక్షిణమున అష్టవసువులను సాధ్యదేవతలను నైఋతమున భార్గవాంగిరస దేవతలను వాయు వ్యమున మరుద్గణములను, దక్షిణమున విశ్వేదేవతలను, ఈశాన్యమున రుద్రులను పూజించవలయును. వృత్త రేఖానిర్మిత మగు అష్టదళ కమలమునకు బహిర్భాగమున సూత్రకారులగు ఋషులను, సరస్వతిని, పూర్వభాగమున నదీపర్వతములను ఈశాన్యాదులయందు పంచమహా భూతములను పూజించవలయును. పిమ్మట పద్మచక్రగదా శంఖములతో ప్రకాశించు చతు ష్కోణము చతుర్ద్వారమగు మండలము నిర్మించి, ఆగ్నేయాదులందు కలశ స్థాపనకూడ చేసి నాలుగు ప్రక్కలంమను పతాకా తోరణములను ఏర్పరచవలయును. అన్యద్వారములందు ఐరావతాది నాగ రాజులను పూజించవలెను. పూర్వాడిదిక్కులందు దేవతలకు వేరువేరుగా ఓషధీ యుక్తముగు పాత్రనుంచవలెను. గజములను పూజించి ప్రదక్షిణము చేయపలయును. దేవతలందరికిని, సూరుచొప్పున హోమము చేయవలయును. పిమ్మట గజరాజ. అగ్ని దేవతలతో బయలుదేరి వాద్యము లను మ్రోగించుచు ఇంటికి తిరిగి వెళ్ళవలయును. బ్రాహ్మణులకును గజచికిత్సకాదులకును దక్షిణలివ్వవలెను. పిదప కాలజ్ఞుడగు పురుషుడు గజరాజు నధిరోహించి దాని చెవిలో "ఓ గజరాజమా! మహారాజు నిన్ను తీగజ పదమునందు నియ మించినాడు. నీవు గజ శ్రేష్టుడవు ఈ రాజులు నేటి నుండి గంధమాల్య ఉత్తమా క్షతాదులతో నిన్ను పూజింతురు. అతని ఆజ్ఞచే ప్రజలు కూడ సర్వదా నిన్ను పూజింతురు. నీవు యుద్ధభూమి యందును, మార్గము నందును గృహము నందును సర్వదా మహారాజును రక్షించవలయును. ఓ నాగరాజ! తిర్యగ్భావమును విడిచి నీ దివ్యత్వమును స్మరించుము పూర్వము దేవాసుర సంగ్రామమునందు ఐరావత పుత్రుడగు అరిష్ట నాగమునకు శ్రీగజము అను పదమును దేవతలు ఇచ్చిరి. ఆ శ్రీ గజము తేజస్సంతయు నీ శరీరమున ప్రతిష్ఠితమైయున్నది. ఓ గజేంద్రమా! నీకు కళ్యాణముగుగాక! నీలోపల నున్న దివ్య భావ సంపన్నమగు తేజస్సు ఉద్బుద్దమగుగాక! నీవు రణాంగణమున రాజును రక్షించుచుండుము. ఆ గజరాజము మరల మరణించినచో శాంతి చేసి మరొక గజ కర్ణములో పైమంత్రమును జపించ వలయుకు. అభిషిక్త మగు గజరాజు పై శుక ముహూర్తమున రాజు అధిరోహించ వలయును శస్త్ర ధారులగు వీర శ్రమలు ఆతని ననుసరించ వలెను. రాజు హస్తి శాల యందు నేలపై చిత్రించిన కమలము బయట దిక్పాలకులను పూజించ వలయును. కేసరముల స్థానమున మహా ఐడ్ యగు వాగరాజమును భూదేవి సరస్వతులను, మధ్య భాగమున గంధ పుష్ప చందనములతో డిండిమమును పూజించి, హోమము చేసి రస పూర్ణ మగు కలశను బ్రాహ్మణునకు దానము చేయవలయును, గజాధ్యక్షుని, గబి రక్షకుని, జ్యోతి మ్కని కూడ సత్కరించి ఆ డిండిమమును గజాధ్యక్షునికి ఇవ్వవలెను. ఆతడు దానిని మ్రోగించవలెను. అతడు దాని జఘనముపై కూర్చుండి, శుభ గంభీర స్వరమున డిండిమ వాదనము చేయవలయును. 

అగ్ని మహా పురాణమున గజ శాంతి కథన మను రెండు వందల తొంబది ఒకటవ అధ్యాయము సమాప్తము.