3 - బ్రహ్మనుండి వేదాదికము ఉత్పత్తి చెందుట

మనుః: చతుర్ముఖత్వ మగమ తస్మాల్లోక పితామహః

 కథంచ లోకా నసృజ ద్బహ్మా బ్రహ్మవిదాం వరః

 మత్స్య: తప శ్చచార ప్రథమ మమరాణాం పితామహః

ఆవిర్భూతా స్తతో వేదా స్సాక్షోపాజ్ఞపదక్రమాః

 పురాణం ధర్మశాస్త్రాణి ప్రథమం బ్రహ్మణా స్మృతమ్

నిత్యశబ్దమయం పుణ్యం శతకోటిప్రవి స్తరమ్

అన నరం తు వ త్తేభ్యో వేదా స్తస్య వినిస్సృతాః

 మీమాంసా న్యాయవిద్యాశ్చ ప్రమాణాష్టకసంయుతాః

 వేదాభ్యాసరతస్యాస్య ప్రజాకామస్య మానసాత్

మనసః పూర్వసృష్టి వై జాతా స్తేనైవ మానసా

 మరీచి రభవ త్పూర్వం తతోఒత్రి ర్భగవానృషిః

అఖిరా శ్చాభవత్పశ్చాత్పుల స్త్య స్తదనన రమ్

 తతః పులహనామా వై తతః క్రతు రజాయత

 ప్రచేతాశ్చ తతః పుత్రో వసిష్ఠ శ్చాభవతు నః

 పుతో భృగు రభూత్తత్ర నార దో పి చిరా దభూత్

 దశైతా న్మానసా నుత్తా జోవపుత్రా నజీజనత్

 తత్పుత్తానథ వ జ్యామి హ్యాత్మహీనా నజాపతే

 ఆజుష్టా దక్షిణాద్దశ ప్రజాపతి రజాయత

ధర్మస్తు నాభిదేశాత్తు హృదయా తుసుమాయుధ :

 భూమధ్యా దభవ తోధో లోభ శ్చాధర సమ్భవః

 బుద్దే ర్మోహ స్సమభ వదహజారా ద ధూన్మనః

ప్రమోద శ్చాభవత్కర్లా న్మృత్యు ర్లోచనయోర్నృప

ఏతే నవ సుతారాజ న్కన్యా చదశమీ పునః

 అ జ్గజాఇతివిఖ్యాతా దశామీ బ్రహ్మణ సుతాః  

మనువు ఇట్లడిగెను: లోక పితామహుడగు బ్రహ్మ ఏల చతుర్ముఖు డయ్యెను? బ్రహ్మ (వేద)వేత్తలలో శ్రేష్ఠుడు అగు బ్రహ్మ లోకములను ఎట్లు సృష్టించేను?

మత్స్యము ఇట్లు చెప్ప నారంభించెను: దేవతలకును పితామహుడగు బ్రహ్మ మొదట తపస్సు ఆచరించెను. అంతట ఆంగములతో ఉపాంగములతో పదములతో క్రమముతో ఘన జట మొదలగు వానితో) కూడ వేదములు అతనికి సాక్షాత్కరించెను. నిత్య శబ్దమయమును పుణ్యకరమును శతకోటి గ్రంథ (32 అక్షరములు గ్రంథము అని పరిభాష) విస్తరము కలది అగు పురాణమును ధర్మశాస్త్రములతోకూడ మొదట బ్రహ్మ స్మరించి పూర్వ కల్పములందు తనకు తెలిసిన వానినే కొనెను. తరువాత అతని ముఖముల నోళ్ల నుండి వేదములును ఎనిమిది (ప్రత్యక్షము అనుమానము ఉపమానము ఆగమము అర్థాప త్తి అసంభవము ఐతిహ్యము పురాణము ) ప్రమాణములతో కూడ న్యాయ విద్యలు బయటకు వచ్చెను. వేదములను ఆవృతము చేయుచునే యున్న వాడును ప్రజలను సృష్టింప సంకల్పించిన వాడు నగు అతని మానసమునుండి సంకల్పముచే మొదట సృష్టింపబడిన పుత్రులు మానస పుత్రులైరి. వారు వరునగా- మరీచి అత్రి అంగిరుడు పులస్త్యుడు పులహుడు క్రతువు ప్రచేతుడు వసిష్ఠుడు భృగువు నారదుడు. వీరందరును జీవ పుత్తులు తమ నుండి పుత్తులనుత్పన్ను లను చేసి జీవింప జేసినవారు. వీరిలో నారదుని విషయ మాలోచింప వలెను.) ఆత్మ హీనులు (దేహము లేనివారు అగు బ్రహ్మ పుత్రుల దేలి పెదను. బ్రహ్మ కుడి బొటన వేలినుండి దక్షుడు (ఇతడు మాత్రము దేహము కలవాడు. సృష్టిని కొనసాగించి ప్రజాపతి ఐనవాడు.) నాభినుండి ధర్మము హృదయమునుండీ మన్మథుడు కనుబొమ్మల నడుమనుండి క్రోధము క్రింది పెదవినుండి లోభము బుద్ధినుండి మోహము అహంకారమునుండి మనస్సు చెవినుండి ప్రమోదము సంతోషము) కన్ను లనుండి మృత్యువు అను కుమారులును అంగజ అనేది కన్యయు కలిగిరి.

మనుః: బుద్దే ర్మో హో హ్యహజారా న్మనోభూ దితి కీర్తితమ్

 అహజారసుతః కోవా బుద్ధి ర్నామ కి ముచ్యతే

మత్స్యః: సత్త్వం రజస్తమ శ్చె వగుణత్రయ ముదాహృతమ్

సమానస్థితి రేతేషాం ప్రకృతిః పరికీర్తితా

 కేచి తధాన మిత్యాహు రవక్త మపరే జగుః

 ఏతై రేవ సమం సృష్టం కరోతి వికరోతి చ

 గుణేభ్యః శుభ్యమాణేభ్య సయో దేవా విజజ్ఞిరే

 ఏకా మూర్తి స్త్రీయే భాగా ధహ్మ విష్ణు మహేశ్వరాః

అవికారా త్పధానాత్తు మహత్తత్వం ప్రజాయతే

 మహా నితి యతః ఖ్యాతి గ్లోకానాం జాయతే సదా

 అహజారస్తు మహతో జాయతే మానవర్గనః

 ఇన్షియాణి తతః పజ్చ వజ్యే బుద్ధి వశాని తు

 ప్రాదుర్బవ స్తి చాన్యాని తథా కర్మవశాని తు

 శోత్రం త్వక్చక్షుషీ జిహ్వా నాసికా చ యథాక్రమమ్

 పాయూపస్థం హ స్తపాదం వా క్చే తీన్జియసజహః

శబ్ద స్పర్శశ్చ రూపంచ రసో గంధశ్చ పశ్చిమః

 ఉత్సర్గానన్ద మాదానగతివాచశ్చ యాః క్రియాః

 మన ఏకాదశం చైషాం కర్మబుద్ధిగుణాన్వితమ్

 ఇన్స్టియావయవా సూక్ష్మా యాన్యుని మనీషిణః

 శయని యస్మాత్తన్మాత్రా శ్శరీరం తేన తత్సృతమ్

శరీర యోగా జీవశ్చ శరీరం రక్షతే బుధః

 మన సృష్టం వికురుతే నోద్యమానం సిసృషయా

 ఆకాశం శబ్దతన్మాత్రా దభూ చ్ఛబ్దగుణాన్వితమ్

 ఆకాశ వికృతే ర్వాయు శ్శబ్దస్పర్శగుణో భవత్  

బహ్మ నుండి వేదాదికము జనించుట

వాయోశ్చ స్పర్శతన్మాతా తేజ ఆవిర భూ త్తతః

 త్రిగుణం చ వికారేణ తచ్చబ్దస్పర్శరూపవత్

 తేజోవికారా దభవ త్తత ఆప శ్చతుర్గుణమ్

 రసతన్మాత్రసమ్భూతం శబ్దస్పర్శర సాత్మకమ్

 *భూమిస్తు గగ్ధత న్మాత్రా దభూ త్పఇచిగుణా తతః

 ప్రాయో గన్గగుణా సాతు బుద్ధి రేషాం గరీయసీ

 ఏభి స్సమ్పాదితం భు జే పూరుషః పజ్ఞ్చవింశకః

 ఈశ్వరో వాచకశ్చాపి జలాత్మా కథ్యతే బుధై

ఏవం షడ్వింశకం ప్రోక్తం శారీర మిహ మానవమ్

 సాజ్ఞ్యం స జ్ఖ్యాత్మక త్వాచ్చ కపిలాదిభిరుచ్యతే

(*రూపం గంధగుణా క్ష్మాతు పరేషాం యా బలీయసీ)

మనువు మరల ఇట్లడిగెను: బుద్ధికుమారుడు మోహము అహంకారపుత్రుడు మనస్సు ఆంటిరి. బుద్ధి అనగా ఏమి? అహంకార కుమారుడగు మనస్సు అనగా ఎట్టిది?

మత్స్యము ఇట్లు పలి కెసు: సత్వము రజస్సు తమస్సు అనునవి మూడు గుణములు. వీటి మూడిటి సమత్వస్థితిని ప్రకృతి ప్రధానము అవ్యకము అందురు. ప్రకృతి ఈ మూడు గుణములతోనే సృష్టి జరుపును. సృష్టిలోని పదార్థముల పరిణమింప జేయును. లయముకూడ పొందించును. క్షోభము (స్పందము) పొందిన మూడు గుణములనుండి ఒ కే మూర్తి యగు ప్రకృతినుండి ముగ్గురు దేవతలు జనించిరి. వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వికారము నొందని ప్రధానమునుండి మహత్తత్వము పుట్టును. దాని మూలముననే లోకములకు మహాన్ దృష్టికి గోచరమగునంత పెద్ద పరిమాణము కలవి) అను ప్రసిద్ది ఏర్పడును. మహత్ నుండి మానగర్వమును వృద్ధి చేయు అహంకారము దానినుండి బుద్ది వశములగు, ఐదు జ్ఞానేంద్రియములు - త్వక్చకుః శ్రోత్ర జిహ్వాక్రణములును కర్మ వశములగు ఐదు వాక్పాణిపాద పాయూపస్థములను కర్మేంద్రియములును జనించెను. వరుసగా స్పర్శము రూపము శబ్దము రసము గంధము  అనునవి. జ్ఞానేంద్రియములకు గోచరములగు విషయములు. వచనము ఆదానము గతి ఉత్సర్గము ఆనందము (ఆనందింప చేయుట) అనునవి కర్మేంద్రి యములు చేయు పనులు. ఈ ఇంద్రియముల జ్ఞాన కర్మ లక్షణములుగల మనస్సు వీనితో పదునొకండవది. విద్వాంసులు మాత్రము దర్శింపగల సూక్ష్మములగు ఇంద్రియావయవములు పంచతన్మోత్రలను పంచభూత సూక్ష్మాంశములను) ఆశ్ర యించి ఉండును. అందుచేత ఈ ఇంద్రియ తన్మాత్రల సంఘాతము శరీరము అనబడును.

 ప్రకృతి ఆపరమేశ్వరుని సృష్టి సంకల్పముచే పేరింపబడినదగుచు పరమేశ్వరుని మనస్సు ప్రకృతిని పరిణ మింప జేయును. శబ తన్మాతనుండి శబ గుణము కల ఆకాశమును అది పరిణమించగా శ బస్పర్శ గుణములుగల వాయు వును అది పరిణమించగా శబ్ద స్పర్శరూప గుణములు కల అగ్నియు అది -పరిణమించగా శబ్ద స్పర్శ రూపరసములుగల జలమును అది పరిణమించగా శబ్ద స్పర్శ రూప రసగంధములు గుణములుగాగల పృథివియు ఉత్పత్తి పొందెను. వీటి అన్నింటిలో బుద్ది శ్రేష్టమయినది. ఐదు మహాభూత సూక్ష్మములు అహంకారము బుద్ది అవ్య క్తము మనస్సుతో కూడ పదునొకండు ఇంద్రియములు ఇంద్రియ విషయములు అను ఇరువదినాలు తత్వములకు అతీతుడగు(ఇరువది ఐదవపురుషుడు (జీవుడు) ఈ ఇరువది నాల్గింటిచే సాధింపబడిన సుఖదుఃఖాదులను అనుభవించుచుండును. అంతర్యామి అగు ఈశ్వరునకు వాచకుడనియు జలాత్మ అనియును పేరులు. ఇతడిరువదియారవవాడు. అందుచే మానవశ రీరము నా శ్రయించి చేయుత త్వ విచారణమును షడ్వింశక మందురు. ఇట్లు ఇది సంఖ్యా రూపము కావున దీనిని సాంఖ్యము అని కపిలుడు మొదలగు వారందురు. (సంఖ్యా అనగా జ్ఞానము అని అర్థము.)

ఏత తత్వా త్మకం కృత్వా జగ ద్దేవా నజీజనత్

 సావిత్రీం లోకసృష్ట్యర్థం హృది కృత్వా సమాస్థిత

 తత స్తాం జపత స్తస్య భూత్వా దేహ మకల్మషమ్

 స్త్రీరూప మకరో దర్ధ మఠం పురుషరూపవత్

 సరస్వతీ మోహాద్బహ్మణః పఞ్చముథోత్పత్తిః

 శతరూపా చ సజ్జ్యోతా సావిత్రీ చ నిగద్యతే

 సరస్వత్యథ గాయత్రీ బ్రహ్మాణీచపర స్తప

తత స్వదేహ సమ్భూతా మాత్మజా మిత్యకల్పయత్

 స ఆస్తే వ్యఢత స్తత కామబాణార్డితో విభుః

అహో రూప మహో రూప మితి చాహ ప్రజాపతిః

 తతో వసిష్ట ప్రముఖో భగినీమితి చుక్రుశుః

బ్రహ్మా న కించి దదృశే తన్ము ఖాలోక నాదృతః

 అహో రూప మహో రూప మితి ప్రాహ పునః పునః

 తతః ప్రణామసక్తాం తు పురస్తా దవలోకయత్

అథ ప్రదక్షిణం చకే సా పితుర్వరవర్ణినీ

 పుత్తేభ్యో లజ్జితస్యాస్య తదూపాలోక నేచ్చయా

 ఆవిర్భూత మథో వక్తం దక్షిణం పాణ్డుగండవత్

విస్మయస్ఫుర దోష్ఠం చ పాశ్చాత్యముదగా త్తత 

 చతుర్థ మభవ త్పశ్చా తామం కామశ రాశురమ్

 తతోన్య దభపత్తస్య కామానుగతయా తదా

 ఉత్పతస్త్యా స్తదాకాశ మాలోక్యచ కుతూహలాత్

 సృష్ట్యర్థం యత్కృతం తేన తపః పరమదారుణమ్

 తత్సర్వం నాశ మగమ త్స్వసుతోపగ మేచ్చయా

*తతోర్ధ్వవ మభవ త్ప్చమం తస్య ధీమతః

 ఆవిర్భూతం చ త త్రోవ తద్వక్ర మపరం ప్రభోః

 స తు తా న బ్రవీద్బహ్మా వ్యగ్రా నాతనిసమ్బవాక్

 ప్రజా సృజధ్వం సమ్భూతా స్సదేవాసురమానుషాః

 ఏవ ముక్తా స్తత స్సర్వే ససృజు ర్వివిధాః ప్రజాః

 గతేషు తేషు సృష్ట్యర్థం ప్రణమ్రవదనా మీమామ్

 ఉపయే మే న విశ్వాత్మా శతరూపా మనిన్దితామ్

స బభూవ తయా సార్ధ మతికామాతురో విభుః

సలజ్జిం చడ మే దేవః కమలోదరమన్దిరే

యావదబ్దశ తం దివ్యం యథాన్యః ప్రాకృతో జనః

 కాలేన మహతా తస్య తద్వ త్పుతోభవ న్మనుః

 స్వాయమ్బువ ఇతి ఖ్యాత స్స విరాడితి నశ్శుతమ్

 తద్రూపగుణసామాన్యా దధిపూరుష ఉచ్యతే

 వై రాజా యత్ర తే జాతాః ప్రభవ స్సంశితవ్రతాః

 స్వాయమ్భువా మహాభాగా సప్తసప్త తథాపరే

 స్వారోచిషాద్యా స్సర్వే తే బ్రహ్మతుల్యస్వరూపిణః

 ఉత్తమ ప్రముఖా స్తద్వ దేతేషాం సప్తమోధునా

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే బ్రహ్మణో వేదాద్యుత్పత్తిర్నామ తృతీయోధ్యాయః

(*తతః పున స్సమభవత్పఞ్చమం)

బ్రహ్మ ఇట్లు షడ్వింశత్ తత్వరూపమయిన జగత్తును సృష్టించిన తరువాత దేవతలను జనింపజేసెను. అతడు లోక సృష్టి జరుపు సంకల్పముతో సావిత్రీ తత్వమును హృదయమున నిలుపుకొని సమాధిస్థితుడయ్యెను. ఆ విద్యను జపించుచుండిన అతని దేహము నిష్కల్మషమయి సగము స్త్రీరూపమును సగము పురుష రూపమును ఆయ్యెను. ఆ స్త్రీరూప మునకే శతరూప సావిత్రి సరస్వతి గాయత్రి అని వ్యవహారము. తన దేహమునుండి ఉత్పన్న యేన ఆమెను అతడు తన కుమార్తె (ఆత్మజ) అనియు ఆయనయే వ్యవస్థ చేసెను. ఐనను ఆదేపుడు ఆమెను చూచిన తత్తణమే కామబాణములచే బాధనొంది ఎటువంటి రూపము! ఎటువంటి సౌందర్యము! అని ఆశ్చర్యముతో పలి కెను. వసిష్ఠుడు మొదలగువారు అక్కా! అని అరచిరి! కాని బ్రహ్మ ఆమె మొగమును చూచు ఆసక్తి లో అది ఏమియు చూడ లేదు. మాటిమాటికి ఎంత సౌందర్యము: అని పలుకసాగెను. అంతలో తనముందు తనకు నమస్కరించు ఆసక్తితో ఉన్న ఆ సావిత్రి అతనికి కనబడెను. అంతట ఆ ఉత్తమ స్త్రీ తన తండ్రికి ప్రదక్షిణము చేసెను.

అమెసౌందర్యమును చూడదలచియు తన కొడుకుల ఎదుట ఆపని చేయుటకు సిగ్గుపడుచున్న ఆ బ్రహ్మకు వెంటనే వెలవెల పోవుచున్న చెక్కిళ్లు కల దక్షిణ ముఖమును ఆశ్చర్యముతో వణకుచున్న పెదవులు కల పశ్చిమ ముఖ మును మన్మథ బాణములచే బాధపడుచున్న (కామ పరవశమయిన) నాలుగవదగు ఉత్తర ముఖమును కలిగేను. అత డపు డట్లు కామానుచరుడగుట వలన అది చూచి ఆ సావిత్రి పైకి గంతువేయుచు ఇదే మను కుతూహలముతో పైకి ఆకాశము వైపు చూచుచుండగా ఆ బుద్ధిశాలియగు బ్రహ్మకు ఐదవదగు ఊర్ధ్వ ముఖము ఉత్పన్నము అయ్యెను. అట్లు ఆ ప్రభువు నకు అక్కడకక్కడనే మరొక ముఖము (ఐదవది) కూడ మొలచెను.

కాని తన కుమార్తెనే పొందగోరుటవలన ఆయన అంతవరకు సృష్టి చేయగోరి ఆచరించిన పర మదారుణమగు తపస్సంతయు నాశము నందెను. అది చూచి కలవరపడుచున్న తన (మానస) పుత్తులతో బ్రహ్మ మీరందరును కూడి దేవా సురమానవులు మొదలగు ప్రజలను సృష్టించుడు. అని ఆజ్ఞాపించెను. ఆ మాట విని వారందరును వెళ్ళి వివిధ ప్రజలను సృష్టించిరి.

మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే వినయముతో మిగుల వంగిన ముఖముతో నున్న దే ఏ దోషమును లేని పవిత్రురాలగు ఆశతరూపను విశ్వమునకు ఆత్మభూతుడగు ఆ బ్రహ్మ వివాహమాడెను. అతడు (లోక) విభు డయియును ఆమె విషయమున కామముచే బాధపడినవా డయ్యెను. ఆ దేవుడు. సామాన్యమానవునివలె నూరేండ్లపాటు తన స్థానమగు పద్మపు నడుమ అనెడి గృహమునందే సిగ్గుపడుచున్న ఆమెను అనుభవించెను. చాలకాలమునకు బ్రహ్మకు ఆమెయందు తన వంటి వాడే అగు మనువు కుమారుడుగా పుట్టెను. ఆతని కే 1. స్వాయంభువుడు అనియు 2. విరాట్ అనియు పేరులు మనకు అను శ్రుతముగా వినవచ్చుచున్నవి. ఇతని రూపమును- గుణములును బ్రహ్మరూప గుణములతో సమానముగా ఉండుటచే అతనికి 8. అధిపూరుషుడు అనియు పేరు. [1. స్వయంభూ యొక్క కొడుకు. . 2. వివిధ రూపములతో ప్రకాశించువాడు 8. మొదటి పురుషుని నుండి పుట్టిన మరొక పురుషుడు.) ఈ స్వాయంభువునినుండి స్వారోచిషుడు ఉత్తముడు మొదలగు పదునాలుగు మంది మనువులు బ్రహ్మతో సమానముగా రూప- గుణములు కలవారు ఉత్పన్ను లైరి. ఇపుడు వారిలో ఏడవ మనువు పాలించుచున్నాడు.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున బ్రహ్మనుండి వేదాదికము జనించుట అను తృతీయాధ్యాయము.