32 - శర్మిష్ఠా దేవయానుల సంభాషణము యయాతికి శుకశాపము

శౌనకః : శ్రుత్వా కుమారం జాతంతు దేవయానీ శుచిస్మితా

చిన్తయామాస దుఃఖార్తా శర్మిష్ఠాo ప్రతి భారత

తతోఽభిగమ్య శర్మిష్ఠాo దేవయాన్య బ్రవీదిదమ్

దేవయానీ : కిమిదం వృజినం సుభ్రూః కృతం తే కామలుబ్ధయా

శర్మిష్ఠా: ఋషిః కశ్చి దీహాగత్య ధర్మాత్మా వేదపారగః

స మయా ను వరః కామం ప్రార్థితో ధర్మసంహితమ్

నాహ మన్యాయతః కామ మాచరామి శుచిస్మి తే

తస్మాదృషే ర్మమాపత్య మితి సత్యం బ్రవీమి తే

దేవయానీ: శోభనం భీరు సత్యం చేదథ సంజ్ఞాయతే ద్విజః

గోత్రనామాభిజనత శ్శ్రోతు మిచ్చామి తం ద్విజమ్

శర్మిష్ఠా: ఓజసా తేజసా చైవ దీప్యమానం రవిం యథా

తందృష్ట్వా మమ సంప్రష్టుం శ క్తి ర్నా నీ చ్ఛుచిస్మితే

దేవయానీ : యద్యేత దేవం శర్మిష్ఠే న మన్యు ర్విద్యతే మమ

అపత్యం యది తే లబ్దం జ్యేష్ఠం శ్రేష్టాత్తు వై ద్విజాత్

శౌనకః : అన్యోన్య మేవ ముక్త్వాచ సంప్రహస్యచ తే మిథః

జగామ భార్గవీ వేశ్మ తథ్యమి త్యభిజానతీ

యయాతి ర్దేవయాన్యాంతు పుత్త్రావజన యన్నృప

యదుంచ తుర్వసుంచైవ శక్రవిష్ణూ ఇవాపరౌ

తస్మా దేవతు రాజర్షే శ్శర్మిష్ఠా వార్షపర్వణీ

ద్రుహ్యుం చానుంచ పూరుంచ త్రీన్కుమారా నజీజనత్

తతః కాలే తు కస్మింశ్చి ద్దేవయానీ శుచిస్మితా

యయాతిసహితా రాజ న్జగామ రహితం వనమ్

దదర్శచ తదా తత్ర కుమారా న్దేవరూపిణః

క్రీడమానా న్చుచీ న్చుద్దా న్విస్మితా చేద మబ్రవీత్

దేవయానీ: క స్యై తే దారకా రాజ న్దేవపుతోపమా శ్శుభాః

వర్చసా రూపత శ్చైవ దృశ్యనే సదృశా స్తవ

శౌనకః : ఏవం దృష్ట్వాతు రాజానం కుమారా న్పర్యపృచ్ఛత

కిం నామధేయం గోత్రం వః పుత్త్రకాః కస్య పజ్జితాః

విబ్రూత మే యథా తథ్యం శ్రోతుమిచ్ఛామి తత్త్వహమ్

తేఽదర్శయ న్ప్రదేశిన్యా త మేవ నృపస త్తమమ్

శర్మిష్ఠాం మాతరం చైవ తస్యా ఊచుశ్చ దారకాః

ఎప్పుడును పవిత్రమగు చిరునవ్వుతో ఉం డెడి దేవయాని శర్మిష్ఠకు కుమారుడు కలిగెనని విని దుఃఖముతో ఆర్తురాలయి శర్మిష్ణ విషయము ఏమేమో ఆలోచించెను. తరువాత ఆమె శర్మిష్ట ఉన్న చోటికి పోయి ఆమెతో ఇట్లు పలి కేను. “చక్కని కనుబొమలుకల సుందరీ! నీవు కామ సుఖమునకు ఆసపడి ఎటువంటి పాపము చేసితివి!” శర్మిష్ణ: “ధర్మాత్ముడును వేదపారంగతుడును కోరిన వరము లేవయిన ఈయగలవాడును అగు ఋషియొకడు ఇక్కడకు వచ్చేను. నేనతనిని ధర్మమునకు విరుద్ధము కాని కోరికను వేడితిని. శుచిస్మితా! నేను న్యాయవిరుద్దమగు ఏకామపర మగు పనిని చేయుదానను కాను. ఆ ఋషివలననే నాకీ సంతానము కలిగినది. నేను నీకు సత్యమునే చెప్పుచున్నాను. నీవు నా ఈ మాటలనమ్మి నిర్మలమగు చిరునవ్వు నవ్వుము. )" దేవయాని: “చాల మంచిదే. నీవు భయపడకుము! ఇదే నిజ మయినచో ఆ బ్రాహ్మణుని విషయము నీకు బాగుగ తెలిసియున్న చో అతని గోత్రము నామము వంశము అంతయు వినగోరుచున్నాను.” శర్మిష: “సూర్యునివలెఓజస్సు- తేజస్సు కలిగి ప్రకాశించుచుండుటచే ఆతనిని చూడగానే నేనతని నవి ఏవియు అడుగజాలకపోయితిని.” దేవయానీ: “ఇది ఇంతేయైనచో శర్మిష్ణా! నీ మొదటి సంతానము వర్ణమున ! శ్రేష్టుడగు బ్రాహ్మణుని వలననే కలిగినది అనుచున్నావు కనుక నాకు కోపము ఉండదు.”

శర్మిష్ణా దేవయానులు ఇట్లు మాటలాడుకొని ఒక రిని చూచి మరొకరు నవ్వుకొనిరి. శర్మిష్ఠ మాటలు నిజమే యను నమ్మిక తో దేవయానియును తన గృహమునకు పోయేను.

ఇట్లు యయాతికి దేవయానియందు ఇంద్రుడు విష్ణువువంటి యదుతుర్వసు లను ఇరువురు కుమారులు కలిగిరి. శర్మిష్టకు యయాతివలన ద్రుహ్యువు అసువు పూరుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి.

తరువాత ఒకానొక కాలమున శుచిస్మిత యగు దేవయాని యయాతితో కలిసి ఏకాంతోద్యాసమునకు పోయెను. ఆమెకు అచ్చట దేవరూపులగు కుమారులు ముగ్గురు కనబడిరి. వారు శుచులును శుదులునై యుండిరి. ఆడు కొనుచుండిరి. వారిని చూచి ఆశ్చర్యపడుచు దేవయాని (యాతీతో ఇట్లనెను. "రాజా! ఈ కుమారు లెవ్వరివారు? వీరు దేవకుమారులవలె చక్కగా ప్రకాశించుచున్నారు. వర్చస్సులోను రూపమునందును నిన్ను పోలియున్నారు.” ఇట్లు రాజు నడిగినపిమ్మట దేవ యాని ఆ కుమారులనే ఇట్లడిగేను: “మీ పేరులేమి? గో "ము ఏమి? ఎవరి కుమారులు? మీరు పండితులు అన్ని విష యములు బాగుగా ఎరిగినవారు. నేనిది యంతయు వినగోరుచున్నారు. ఉన్నది ఉన్నట్లు వివరించి చెప్పుడు.”

ఆ బాలురు తమ చూపుడు వేలితో ఆ రాజస త్తమునే చూపిరి. శర్మిష్ఠ మా అమ్మ అనియు వారా దేవయానితో చెప్పిరి.

శౌనకః : ఇత్యు క్త్వా సహితా స్తేతు రాజాన ముపచక్రము

నాభ్యనన్దత తాన్రాజా దేవయాన్యా స్తదా న్తి కే

క్రన్దన్త సేతు శర్మిష్ఠ మధ్యయు ర్బాలకా స్తదా

శ్రుత్వాతు తేషాం బాలానాం సవ్రీడ ఇవ పార్థివః

దృష్ట్వాతు తేషాం బౌలానాం ప్రత్యయం పార్థివం ప్రతి

బుద్ధ్వాచ త త్త్వతో దేవీ శర్మిష్ఠా మిద మబ్రవీత్

దేవయాని : మదధీనా సతీ కస్మా దకార్షీ ర్వి ప్రియం మమ

తమేవాసుర ధర్మంత్వ మాస్థితా న బిభేషి మామ్

శర్మిష్ఠా: యదుక్త మృషి రిత్యేవం తత్సత్యం చారుహాసిని

 న్యాయతో ధర్మత శ్చైవ చరన్తీ న బిభేమి తే

యది త్వయా వృతో భర్తా వృత ఏవ మయా తదా

సఖీభర్తా హి ధర్మేణ భర్తా భవతి శోభనే

పూజ్యోఽసి మమ మూన్యాచ జ్యేష్ఠాచ బ్రాహ్మణీ, హ్యసి

త్వత్తోహి మే పూజ్యతమో రాజర్షిః కిం న వేత్థ తత్

శౌనక: శ్రుత్వా తస్యాస్తు తద్వాక్యం దేవయా న్యబ్రవీ దీదమ్

రాజ న్నాద్యేహ వత్స్యామి విప్రియం మే త్వయా కృతమ్

సహసాఽప్యుత్థితాం శ్యామాం దృష్ట్వా తాం సాశ్రులోచనామ్

తూర్ణం సకాశం కావ్యస్య ప్రస్థితాం వ్యధిత స్తదా

అనువవ్రాజ సమానః పృష్ణత సాన్త్వయ న్నృపః

న్యవర్తత న నా చైవ క్రోధసంర క్తలోచనా

అవిబ్రువన్తీ కిఞ్చిత్సా రాజానం సాశ్రులోచనా

అచిరా దేవ సంప్రాప్తా కావ్యస్యోశనసోఽ న్తికమ్

సాతు దృష్ట్వైవ పితర మభివాద్యా గ్రతస్థ్సితా

అనన్తరం యయాతిస్తు పూజయామాస భార్గవమ్

దేవయానీ: అధర్మేణ జితో ధర్మః ప్రవృత్తి మధరోత్తరమ్

శర్మిష్ఠయా నివృత్తాఽస్మి దుహిత్రా వృషపర్వణః

త్రయోఽస్యాం జనితాః పుత్త్రా రాజ్ఞా తేన యయాతినా

దుర్బగాయా మమ ద్వౌ తు పుత్త్రౌ తాత బ్రవీమి తే

ధర్మజ్ఞ ఇతి విఖ్యాత ఏష రాజా భృగూద్వహ

అతికా న్తశ్చ మర్యాదాం కావ్యైత త్కథయామి తే

ఇట్లు పలికి వారందరును రాజు కడకు పోయిరి. కాని తాను దేవయాని ఎదుట ఉండుటచే అతడు వారిని ప్రీతితో అభినందించలేదు. ముద్దు చేయలేదు.) ఆందుచే అపుడా బాలురు ఏడ్చుచు శర్మిష్ఠ కడకు పోయిరి. బాలుర మాటలు విని ఏడుపు విని రాజు సిగ్గుపడిన వాడువలె అయ్యెను. ఆ బాలురకు రాజు విషయమున గల ప్రత్యయము (విశ్వాసము-తి) చూచి పొ స్తవ స్థితిని గుర్తించి దేవయాని శర్మిష్ఠతో ఇట్లు పలికెను: “నీవు నా అధీనమందుండుదాన వయి కూడ నాకు ప్రీతికరము కాని పనిని చేసితి వేల? నీవు నీ స్వాభావికమగు ఆసుర ధర్మమునే ఆశ్రయించియున్నావు. . కాని నాకు భయపడుచున్నా వు కావు.” శర్మిష్ఠ: "చారుహాసినీ! 'ఋషి' అని నీతో నేను చెప్పినది నిజమే. న్యాయమును ధర్మ మును అనుసరించి నడుచుచున్నాను కావున నేను నీకు భయపడుటలేదు. నీవు భర్తను వరించినపుడే నేనును వరించి తిని. స్త్రీకి తన సఖీ భర్త తనకును భర్తయగును. నీవు నాకు పూజ్యవు-మానవు-జ్యేష్ఠురాలవు -బ్రాహ్మణివి. ఈ రాజర్షి నీకం టెను నాకు పూజ్యతముడు. నీకీ మాత్రము తెలియదా?”

శర్మిష్ఠ చెప్పినది విని దేవయాని ఇట్లు పలి కెను: ”రాజా! నీవు నాకు ప్రీతికరము కాని పని చేసితివి. నేను ఇక ఇక్కడ ఉండను.” అని చటున లేచి ఆ సుందరి కన్నీరు కార్చుచు శుక్రుని దగ్గరకు పోవుటకై బయలుదేరెను. అది చూచి యయాతి మనస్సులో వ్యథనొందెను. వెంటనే అతడును కళవళ పడుచు ఆమెను బ్రతిమాలుచు. ఆమె వెంటనే పోవసాగెను. దేవయాని వెనుకకు మరలలేదు. క్రోధముతో ఎర్రనే న కన్నులతో కన్నీరు కార్చుచు త్రోవలో రాజుతో ఏమియు మారుపలుకక త్వరితముగా కావ్యుడగు ఉశనసుని (శుక్రుని కడకు చేరెను. ఆమె తండ్రిని దర్శించుచునే అతనికి అభివాద నము చేసి అతని ఎదుట నిలువబడెను. తరువాత వెంటనే యయాతియును భార్గవుని నమస్కరించెను. దేవయాని: “అధర్మము ధర్మమును జయించినది. క్రిందు మీదు-మీదు క్రిందు ఐనది. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ నన్ను వెనుకకు నెట్టివేసినది. ఈ యయాతిరాజువలన ఆమెకు ముగ్గురు కుమారులు కలిగినారు. దుర్భగను ( పెనిమిటి అనురాగమునకు నోచుకోననిదానను) అగు నాకు ఇద్దరు కొడుకులు మాత్రమే కలిగినారు. తండ్రీ! నామాట నిజము. భృగు వంశ శ్రేష్ఠుడవు నీవు. ఈ రోజు కూడ ధర్మజ్ఞుడు అని ప్రసిద్ధి పొందినవాడేక దా! తాను ఆట్టివాడయ్యు ఇంతటి నీకు అల్లుడయ్యును. ఇతడు మర్యాదను అతిక్రమించినాడు. అని నీకు చెప్పవలసివచ్చు చున్నది."

శుక్రః : భర్మజ్ఞ స్త్వం మహారాజ

యోఽధర్మ మకృథాః ప్రియమ్

తస్మా జ్ఞరా త్వా మచిరా ద్ధర్ష యిష్యతి(దుర్జయ) మానద

యయాతిః : ఋతుంవై యాచమనాయా భగవ న్త్సత్యచేతసా

దుహితు ర్ధాన వేన్ద్రస్య ధర్మ మేత త్కృతం మయా

ఋతుంవై యాచమానాయా న దదాతి పుమా న్వృతః

భ్రూణ హే త్యుచ్యతే బ్రహ్మన్త్స చేహ బ్రహ్మ వాదిభిః

ఋతుకామాం ప్రియాం యస్తు గమ్యాం రహసి యాచితః

నో పైతి హి స ధర్మేషు భ్రూణ హే తుచ్యతే బుదై

ఇత్యేతాని సమీక్ష్యాహం కార ణాని భృగూద్వహ

అధర్మభయసంవిగ్న శ్శర్మిష్ఠా ముపజగ్మివాక్

శుక్రః : నన్వహం ప్రత్యవేక్ష్య స్తే మదధీనోఽసి పార్థివ

ధర్మలో పే పతత్యేవ మిథ్యా చరసి పార్థివ

మిథ్యా చరసి ధర్మం త్వం చౌర్యవానసి పార్థివః

శౌనక : క్రుద్ధేనోశ నసా శప్తో యయాతి ర్నా హుష స్తదా

పూర్వం వయః పరిత్యజ్య జరాం సద్యోజన్వపద్యత

యయాతి: ఆతృప్తో యౌవనే తస్యాం దేవయాన్యాం భృగూద్వహ

ప్రసాదం కురు మే బ్రహ్మ న్జరేయం న విశేత మామ్

శుక్రః : నాహం వృథా వదా మ్యేత జ్జరాం ప్రాప్తోసీ పార్థివ

జరాం త్వేతాం త్వమన్య స్త్మై సంక్రామయ య ఇచ్ఛతి

యయతిః : రాజ్యథా క్స భవే ద్బహ్మ న్పుణ్యధా క్కీర్తిభాక్తథా

యో మే దద్యా ద్వయః పుత్ర స్తద్భవా ననుమన్య తామ్

శుక్రః : సజ్క్రామయిష్యసి జరాం యథేష్టం నహుషాత్మజ

మా మనుధ్యాయ భావేన న చ పాప మవాప్స్యసి

వయో దాస్యతి తే పుత్త్రో య స్స రాజా భవిష్యతి

ఆయుష్మా నీర్తిమాం శ్చైవ బహ్వపత్య స్తథైవ చ

ఇతి శ్రీమత్స్యమహాపురాణే శౌనక శతానీక సంవాదే చన్దవంశానువర్ణనే యయాతి చరితే యయాతే ర్జరాప్రాప్తికథనం నామ ద్వాత్రింశోధ్యాయః

శుక్రుడు: “మహారాజా! నీవు ధర్మజ్ఞుడవు అయి ఉండియు అధర్మము పై ప్రీతి చూపినావు. కావున త్వరలో నిన్ను ముసలితనము బాధించును. నీవు అభిమానవంతుడవు కదా! దీని కిదే దండనము.” యయాతీ: “భగవన్! నేను సత్యమునందే మనస్సు నిలిపియుండువాడను. నిజము నే చెప్పుచున్నాను. దానవేంద్రుని కూతురు ఋతుఫలమును కోరగా నేను చేసిన ఈ పని ధర్మమే కాని అధర్మము కాదు. 'ఋతు ఫలము ఇమ్మని కోరుచు తానై వచ్చి వరించగా దానిని ఈయని పురుషునకు భ్రూణహత్యా దోషము అంటును.' అని వేదతత్వ వేత్తలు (మీవంటి వారే చెప్పుదురుక దా! (భ్రూణుడు - షడంగములతో కూడ వేదమును అధ్యయనము చేసిన వాడు). “ఋతుఫలమును కోరినదియును ప్రీతికరముగ ప్రవర్తించు నదియు పొందదగినదియు అగు శ్రీ ఏకాంతమున తను కోరగా ఆమెను పొందనివాడు భ్రూణహత్యా దోషము పొందు' నని ధర్మశాస్త్రములలో పండితులు చెప్పియున్నారు. భృగువంశ శేషా! ఈ మొదలగు హేతువులను బాగుగా పరిశీలించి ఆలోచించి అధర్మమునకు భయపడి నేను శర్మిష్ణతో కూడితిని.” శుకుడు: “రాజా! నీవు నా అధీనములోనివాడవు కదా! నా విషయము నీవు ఆలోచించనక్కర లేదా? ధర్మ లోపము చేసినవాడు. పతితు డగును. అను మాట నిజమే. కాని నీవు మిథ్యా ధర్మమును అనుష్ఠించువాడవు. నీకు ప్రియమయిన పని చేసి దానిని ధర్మమనీ పైకి చూపుచున్నావు.) మనస్సులో ఒకటి పెట్టుకొని చేసిన పనిని పైకి మరి ఒకటిగా చూపుచున్నావు. కనుక నీవు దొంగతనము చేసినవాడ వై నావు.”

నహుష పుత్రుడు యయాతి క్రుద్దుడైన శుక్రుని వలన ఈవిధముగా శాపము పొందినాడు. వెంటనే అతనికి మొదటి వయస్సుపోయి ముసలితనము కమ్మినది. యయాతి! “భృగూద్వహా! నేను ఈ దేవయాని విషయములో యావన సుఖములను పొందుటలో నాకు ఇంకను తృప్తి కలుగలేదు. నన్ను అనుగ్రహించుడు. ఈ ముసలితనము నన్ను క్రమ్మ కుండునట్లు దయ చూపుడు.” శుకై కుడు: “నేను పలికిన మాట వ్యర్థము కాదు. రాజా! ఈ జర నిన్ను కమ్మనే కమ్మినది. ఇష్టపడిన మరొక నికి ఇది నీవు సంక్రమింపచేయవచ్చును.” యయాతి: “బ్రాహ్మణోత్తమా! నాకు తన యౌవనమును ఇచ్చిన కుమారుడు నా రాజ్యమునకును పుణ్యమునకును కీర్తికిని పాత్రుడు అగునట్లు తాము అనుమతించ వేడుచున్నాను.”

శుక్రుడు: “నహుషాత్మజా! నీ ఇష్టము వచ్చినవానికి ఎవ్వనికై నను నీవార్ధకమును సంక్రమింపజేయవచ్చును. భావములో నన్ను నిలుపుకొని నీవు ఈ పని చేసినచో నీకు ఏపాపమును అంటదు. నీకు యౌవనము ఇచ్చిన కుమారుడే రాజ్యమునకు అధికారియును అయుష్మంతుడును కీర్తిమంతుడును బహుసంతతిమంతుడును అగును."

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున శర్మిష్ఠా దేవయానీ సంవాదము యయాతికి శుక్ర శాపము అను ముప్పది రెండవ అధ్యాయము.