మత్స్య మహా పురాణము
119 - మద్రరాజ పురూరవ స్తపశ్చర్య-గంధర్వాప్సరసల నానావిధ విహారముల వర్ణనము
సూతః: తత్రాశ్రమపదే రమ్యే త్యక్తాహార పరిచ్ఛదః ।
క్రీడావిహారం గన్దర్వైః పశ్య న్నప్సరసాం సహ॥
కృత్వా పుచ్చయం గుర్వీం గ్రథయిత్వా తథా ప్రజమ్ ।
అగ్రం నివేద్య దేవాయ గన్జర్వేభ్య స్తథాదదౌ॥
పుష్పోచ్చయప్రసక్తానాం క్రీడ నీనాం యథాసుఖమ్ ।
వేశ్యానాం వివిధాకారా నశ్యన్నపి నపశ్యతి॥
కాచిత్పుష్పోచ్చయే సత్తా లతా జాలేన వేష్టితా ।
సా స్వీయ జనస న్యక్తా కా నేనాపి సముజ్జి తా॥
కాచి తమలగన్జాడ్యా నిశ్శ్వాసపవనాహతై ।
మధు పై రాకులముఖి కా ర్తేన పరిమాక్షి తా॥
మకరన్దసమాక్రాన్త నయనా కాచిదజనా ।
కా స్తనిశ్శ్వాసవాలేన నిర జస్కీకృతేక్షణా॥
కాచి చుచ్చీయ పుష్పాణి దదౌ కా న్తస్య భామినీ ।
కా స్తసజ్ఞథితే పుష్పే రరాజ కృత శేఖరా॥
ఉచ్చీయ స్వయముద్దథ్య రమణ్యాహిత శేఖరమ్ ।
కృతకృత్య మీనాత్మానం మేనే మన్మథవర్గ నమ్॥
అన్యస్మి నహనే కుఞ్జే వి శేషకుసుమాలతాః ।
కాచిదేవం రహోనీత్వా రమణేన రంగునా॥
కాంతసనానిత లతో కుసుమాని వీచిన్వతీ ।
సర్వాభ్యః కాచి దాత్మానం మేనే సర్వగుణాధికామ్॥
రమ్యమగు ఆ ఆశ్రమమున మద్రరాజు పురూరవసుడు ఏ పరివారమును ఏ సాధనములును లేక ఒంటరియై ఆహారమును కూడ విడిచి తపమాచరించుచుండ ఆ తావులందే అప్సరసలు గంధర్వులతో క్రీడించుచుండెడివారు. అతడది. చూచుచునే ఉండియు వాటియందాస క్తి లేక పూవుల సేకరించి పెద్ద మాలను కూర్చి దానియందలి మొదటి అంశమును దేవదేవునక ర్పించి మిగిలిన అల్ప ఖండమును గంధర్వులకు (దేవజాతి వారు కదా అను ఆదరముతో) ఇచ్చే డీవాడు.
దేవవేశ్యలు (అప్సరసలు) కూడ పుష్పోచ్చయము చేయుచు యథా సుఖముగా వివిధములుగ క్రీడించుచుండ అతడు ఆది చూచుచుండియు చూడనివాడుగనే ఉండెను.
క్రీడా వర్ణనము
ఒకతె పూవులు కోయుచు ఏరుచునుండ ఆమెను తీగలు చుట్టుకొనెను. ఆమేను పాపము! సఖులును ప్రియు డును విడిచిపోయిరి. ఒక తే ముఖము కమల గంధము కలదగుటచే శ్వాసవాయువులచే ఆకర్షింపబడిన తుమ్మెదలు మొగము పై గుంపుగా క్ర మ్మి కలవరపరచగా ప్రియుడును ఆమెను విడిచి దూరముగా పోయెను. ఒక తే కంటిలో మక రందము పడెను. ! ప్రియుడు. తన శ్వాసవాయువులతో కంటియందలి ధూళిని పోగొట్టి బాధ పోగొ పెను. ఒకతె పూవులు కోసి ఏరి తెచ్చి ప్రియునకీయ ఆతడు దానితో కూర్చిన మాల తన శిరమున నలంకరించుకొని ప్రకాశించేను. ఒక తే తానై పూపులు కోసి ఏరి వానిని మాలగా కూర్చి పియుని శిరమున సలంక రించగా నాతడు తను ధన్యునిగాను మన్మథో దీపనము చేయగల సుభగునిగాను భావించెను. ఒక తే తన ప్రియుడు తనతో ఏకాంతమున విహరింపగోరి అదిగో! ఆ దట్టమైన పూబోదయందు ఎక్కువ పూలుగల తీగలున్న వని అటకుపోయి పూలు సేకరించసాగెను. అపుడు ప్రియు డామెను విలాసముగా తీగలతో కట్టివేయగా ఆమే తాను మిగిలిన తన చేలులందరకంటే సర్వాధిక గుణములుగల సౌభాగ్య వతియని భావించి తృప్తియయ్యెను.
కాచి త్పశ్యతి భూపాలం నళినీషు పృథక్ఫృథక్ ।
క్రీడమానాపి గన్దర్వై రసమా నామ కామినీ॥
కాచి చ్చాతాడయత్కార్త ముద కేన శుచిస్మితా ।
తాడ్యమానాథ కా నేన ప్రీతిం కాచి దుపాయణా॥
కార్తేన తాడయామాస జాత స్వేదా వరాజనా ।
అదృశ్యత పరారోహా శ్వాసనృత్య త్పయోధరా॥
కాస్తానుతాడితోదృష్ట కేశపాశ నిబన్లనా ।
కేశాకులముఖీ భాతి మధు వైరివ పద్మినీ॥
స్వచకుస్సదృశైః పుష్పే స్సన్నే నళినీవనే ।
భర్తా కాచిచ్చిరాతాప్తా కా నేనాన్విష్య యత్నతః॥
స్నాతా శీతాపదేశేన కాచితౌఢజనా భృశమ్ ।
రమణాలిజ్ఞనం చకే మనోభిలషితం చిరమ్॥
జలార్గోవసనం సూక్ష్మ మజలీనం శుచిస్మితా ।
ధారయ స్త్రీ జనం చకే కాచి త్తత్ర సమన్మథమ్॥
కంఠమాల్య గుణైః కాచి తానేనాకృష్యతామ్బసి ।
త్రుట్యత్ సగ్జామపతితం రమణం ప్రాహస చ్చిరమ్॥
కాచి లగ్న సఖీద త్తజానుదేశే నఖా నరే ।
సమానా కా నరమణా కాచిద్దృష్టా హతం చిరమ్॥
కాచి దృష్టికృతాదిత్యా కేశనిస్తోయకారిణీ ।
శిలాతలగతా తత్ర దృష్టా కామార్తచక్షుషా॥
కృతమాల్యం విలులితం సజానం కుచకుజుమమ్ ।
రత్న క్చానకాస్తాభ మభవ త్తత్సరోదకమ్॥
సుస్నా తదేవగన్దర్వ దేవరామాగణేనచ ।
పూజ్యమానంచ దదృశే తత్ర దేవం జనార్ధనమ్॥
సాటిలేని కాముకియగు ఒకతే గంధర్వులతో తాను క్రీడించుచుండియు ఆ సరస్సులయందు వేరువేరుగ ప్రతి ఫలించుచున్న ఆరాజును చూచుచుండెను. నిర్మలమయిన చిరునవ్వు నిర్మల హృదయము కల ఒకతే నీటితో ప్రియుని కొట్టి మరల నాతడు తను నీటితో కొట్టగా సంతోషించెను. ఒకతే ప్రియుడు తను కొట్టుచుండ పోనిమ్మని ఊర కుల డేను. అందుచే ఆమెకు ఒడలు చెమట పట్టుటయు నిట్టూర్పు వాయువులచే ఆమె వక్షోజములు నృత్యము చేయుటయు కానవచ్చెను. ప్రియుడు తను వెంటాడి కొట్టుటచే ఒక తేకు కొప్పు శిథిలమైనందున మొగమంతయు వెంట్రుకలు క్రమ్మగా తుమ్మెదలు క్రమ్మిన పద్మలతవలే కానవచ్చెను. ఒక తే తన కన్ను లను పోలు తామరలు కొలనినిండ ఉండుటచే తన ప్రియుడు వెదకి వేదకి చాల సేపటికా మేను గుర్తించి దగ్గరకు వచ్చెను. ఒకానొక ప్రొడాంగన సుఖానుభవములో నేర్పు మీరిన శ్రీ) స్నానము చేయుటచే చలి వేయు చున్నదను నేపమున తనకు చిరాభిలషితమగు తన ప్రియుని ఆలింగనమును పొందగలిగేను. స్నానమాడినందున తాను ధరించిన నన్న ని వలువ తన ఒడలికంటుకొనిపోయిన ఒక తే చూపణకు కామభావమును ఉద్దీపింప జేసెను. ఒక తెను ప్రియుడు ఆమె కంఠమందలి హారములు పట్టిలాగెను. లా గుచుండగా ఆ దారమును తెగినందున ఆ ! ప్రియుడు ముందునకు మొగ్గిపడగా అమే సవ్వేను. ఒక తే మోకాళ్ళపై ఆమెకు చేరువగానున్న చేలి తన గోళ్ళతో క్షతము చేయగా ఆమె తడబాటుతో పోయి తన ప్రియుని పై పడి అతనితో చాల సేపు మాటలాడుచు కనబడెను. ఒకతె సూర్యునికి ఎదురుగా నిలిచి వెంట్రుక లార బెట్టుకొనుచుండియు కామార్తములగు నేత్రములతో తన ప్రియుని చూచుచు శిలాతలము పై కూర్చుండియుండుట కానవచ్చెను. ఇట్లా సరస్సు నీరంతయు మాల్యములతో నిండేను. కెలికి వేయబడెను. స్తన కుంకుమముతో కలిసెను. ఇట్లది రత్నములు పొదిగిన బంగారు సొమ్ములవలె సయ్యేను.
ఇట్టి స్థితియందు కూడ చక్కగా స్నానమాడిన దేవస్త్రీలును దేవగంధర్వ స్త్రీలును దేవదేవుడగు జనార్దనుని పూజించుచుండుటను ఆరోజు చూచెను.
క్వచిచ్చ దదృశే రాజా లతాగృహగతా స్స్త్రియః ।
మణ్ణయ న్య స్వగోత్రాణి కా న్తసంన్య స్తమానసాః॥
కాచిదాదర్శనవ్యగ్రక రా దూతీముఖోద్గతమ్ ।
శృణ్వతీ శాస్త్రవచన మధికా న మథాబభౌ॥
కాచి త్సత్వరితా దూత్యా భూషణానాం విపర్యయమ్ ।
కుర్వాణా నైవ బుబుధే మన్మథావిష్టచేతసా॥
వాయునున్నా తిసురభి కుసుమాకరమట్టితే ।
క్వచిత్సిబన్యో (నీ) దదృశే ప్రదేశే నీలశాడ్వలే॥
పాయయామాస రమణం పయః కాచిద్వరాజనా ।
కాచిత్పపౌ వరారోహా కామ్రపాణిసమర్పితమ్॥
కాచిత్స్వనేత్రచవల నీలోత్పలయుతం పయః ।
పీత్వా పప్రచ్ఛ రమణం క్వగతే తే మమోత్పలే॥
పురూరవసుని తపశ్చర్య-గంధర్వాపర సల విహారము ।
త్వయైవ పీతా నూనంపై ఇత్యుక్తా రమణీన సా ।
తథా విదిత్వా ముగ్గత్వా ద్బభూవ వీడితా చిరమ్॥
కాచిత్కాస్తార్పితం సుభూ? కానపీతావ శేషితమ్ ।
సవి శేషరసాపానం పపౌ మన్మథవర్ధనమ్॥
ఆపానగోష్ఠీషు తథా తాసాం స నరపుబ్ధవః ।
శుశ్రావ వివిధం గీతం త స్త్రీస్వర విమీ శితమ్॥
ప్రదోషసమయే తాశ్చ దేవదేవం జనార్దనమ్ ।
రాజన్సదోపనృత్యన్యో నానా వాద్య పురస్సరాః॥
యామమా! తే గతే రాత్రే వినిర్గత్య గుహాముఖాత్ ।
ఆవస ని యుతాః కాస్తే సత్తద్విరచితాం గుహామ్॥
నానాగన్హాన్వితతలాం నానాగన్గసుగన్దినీమ్ ।
నానావిచిత్రశయనాం కుసు మోత్కరమజ్జతామ్॥
ఏవ మప్సరసాం పశ్య శ్రీడితాని స వర్వతే ।
తవ స్తేపే మహారాజః కేశ వార్పితమానసః॥
ఒకానొక చోట కొందరు (దేవ) స్త్రీలు తమ ప్రియులయందు తమ మనస్సులు లెస్సగా నిలిపి లతాగృహ గతలయి తమ గాత్రముల నలంకరించుకొనుచుండుట రాజు కాంచేను. ఒకతే చేత ఆద్దముంచుకొని చూచుకొనుచు తన దూతి వచించు తన ప్రియుని వచనములు వినుచు మీగుల అందముతో ఒప్పెను. గ్రామ భావ పరవశ యగు ఒక తె తను దూతి త్వర పెట్టుచుండ అందుచే జరుపుచున్న తన అలంకరణములో భూషణముల తారుమారును గురుతింపక పోయేను. ఒకానొక చోట వాయు పేరణచే కదలు అతి సుగంధి పుష్పయుతమగు నల్లని పచ్చికబయట ఆయా పానీ యముల తావు శ్రీలాతనిని కనవచ్చిరి. ఒక ఉత్తమాంగన తన ప్రియునిచే పాలు త్రావించుచుండెను. మరియొక తన ప్రియుడందించు పాలు తాపుచుండెను. ఒకతే తన కన్ను లవలే చంచలములగు నల్ల కలువ రెక్కలతో కూడి ఉన్న పాలు త్రావి నా ఆ కలువపూలెక్కడకు పోయెనని యడిగెను. నీవే అవి త్రావియుండవచ్చునని ప్రియు డనగా అపుడది గుర్తించి తానంతటి అమాయికురాలయినందులకు చాల సేపు సిగ్గుపడియుండెను. విశిష్టములగు రుచులు గల రసములతో మీ శితమగు కామవర్ధక పానీయమును తన ప్రియుడు వి పిదప తనకందీయగా ఒకతె తానది త్రివెను. ఇట్లే జరుగుచుండిన ఆపానగోష్టులందు తంత్రీవాద్యముల స్వరముతో ఏమి శితమగు వివిధ గీతముల నాదేవస్త్రీలు పాడుచుండ రాజది వినెను. వారు అనుదినమును ప్రదోష సమయములందు అట్లే దేవదేవుడగు జనార్దనుని సన్నిధియందు నొ నొవాద్య సహితముగా నృత్యము చేయుచుందురు. జామురాత్రి గడచిన తరువాత గుహా ముఖము నుండి వెలికివచ్చి తమకు తమకు ఏర్పరచబడిన ఆయా గుహలను తమ ప్రియులతో కూడి ఆవాసముగా చేసికొందురు. ఆ గుహలు నానాగంధాన్వితతలములయి సుగంధముల నీనుచుండును. నానావిధములగు పడకలు కుసుమాలంకర ణములు వానియందుండును. ఈ విధముగ ఆ పర్వతమున ఆప్సరసలు చేయు ఆయా విహరణములను చూచుచుండి (యు వానియందాసక్తుడు కాక) మహారాజు కేశ వార్పితమానసుడై తపమాచరించెను.
త మూచు ర్నృపతిం గత్వా గన్గర్వాప్సరసాం గణాః ।
రాజ న్వపమం దేశ మిమం ప్రాప్తోస్యరిన్గమ॥
వయంహి తే ప్రదాస్యామో మనసః కాంక్షతా స్వరా ।
తానాదాయ గృహం గచ్చ తిషేహ యదీవా పునః॥
పురూరవాః అమోఘదర్శనా స్సర్వా భవన శ్చామిరౌజసః ।
వరం వితరతా దేతత్రసాదం మధుసూదనః॥
ఏవమ స్త్రీ త్యథోక్త స్తే స్సతు రాజా పురూరవాః ।
తత్రో వాస సుఖీ మాసం పూజయానో జనార్ధనమ్॥
ప్రియఏవ సదై వాసీ ధనర్వాప్సరసాం నృపః ।
తుతుషు సృజనా రాజ్ఞ స్తస్యాలొల్యేన కర్మణా॥
మాఘస్య మధ్యే స నృపః ప్రవిష్ట స్తమాశ్రమం రత్నసహస్ర చిత్రమ్ ।
ఉవాస మాసం ప్రియకృత్సమగ్రం శీతోష్ణభేదై ర్నృప ఫాల్గునస్య॥
ఫాల్గునామలపక్షానే రాజా స్వప్నే పురూరవాః ।
తస్యైవ దేవదేవస్య శుశ్రావ గదితం శుభమ్॥
రాత్ర్యా మస్యా మతీతాయా మత్రిణా త్వం సమేష్యసి ।
తేన రాజ న్సమాగమ్య కృతకృత్యో భవిష్యసి॥
స్వప్న మేవం న రాజర్షి కృష్ట్వా దేవేన్దవిక్రమః ।
ప్రత్యూష కాలే విధివ త్స్నాతః ప్రాయో జితేన్షియః॥
కృతకృత్యోఒవసత్కామ మర్చయిత్వా జనార్దనమ్ ।
తత్రా నరేఒత్రిరాగత్య త చాత్ర శ్రీయా జ్వలక్॥
స్వప్నంతు దేవస్య తథా న్య వేదయత ధార్మిక ।
తత శ్శు శ్రావ వచనం దేవతానాం సమీరితమ్॥
ఏవమేవ మహీపాల నాత్ర కార్యా విచారణా ।
ఏవం ప్రసాదం సమాప్తో దేవదేవా జ్ఞానార్ధనాత్॥
కృతదేవార్చనో రాజా తథా హుతహుతాశనః ।
సర్వా నామా నవాపాశు వర దానేన కేశవాత్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే భూగోళే పురూరవసో వరలాభో నామైకోన
వింశత్యుత్తర శతత మోధ్యాయః॥
ఒకప్పుడు ఆ గంధర్వాప్సరోగణములు రాజుకడకు పోయి ‘ఆరిందమా! నీవు వచ్చిన ఇది స్వర్గతుల్య దేశ ము. మేము నీకు మనఃకాంక్షిత వరముల నిత్తుము. అది గ్రహించిన తరువాత నీవిటనే యున్ననుసరే. ఇంటికి వేడ లీననుసరే; ఆనిరి. మద్రరాజు పురూరవసుడును “అమితమగు ఓజస్సుగల మీ దర్శనము వ్యర్థముకాదు. మధు సూదనుడు నన్న నుగ్రహించునట్లు వరమిండు.” అనగా వారు 'తథాస్తు' అనిరి. ఆతడును ఒక మాసము కాలము జనార్ధనుని పూజించుచు అటనే యుండెను. ఆతనికి లోలత్వము లేనందులకు ఆ గంధర్వాప్సరసలు సంతసించిరి. వారికతడు ప్రీతిపాత్రుడయ్యెను. రత్న సహస్ర చిత్రమగు ఆయాశ్రమమును ఆరాజు మాఘమాస మధ్యమున ప్రవే శించెను. ఫాల్గున మానవు శీతోష్ణ భేదములతో ప్రీతిననుభవించుచు ఒక మాసము గడ పెను. ఫొల్లున కృష్ణ పక్షాంతమున రాజగు పురూరవునకు స్వప్న మున దేవదేవుని శుభవచనము "రాజా! ఈరాత్రి గడువగనే నీకు అతిమునితో సమాగమమగుమ. అందుచే నీవు కృతకృత్యుడవగుదువు," అనుచు వినబడెను. ఇంద్ర విక్రముడగు ఆ రాజర్షి ఇట్లు స్వప్నము కాంచి పిదప ప్రత్యూష కాలమున స్నానము చేసి నియతేంద్రియు డై కృతకృత్యుడనై తినను భావముతో జనార్దను నర్చించియుండెను. అంత లోనే కాంతితో జ్వలించుచు అత్రిముని అటకు వచ్చెను. ధార్మికుడగు ఆరాజు తన స్వప్న దర్శనము నామునికి తెలి పెను. రాజా! ఇది ఇప్లేయగును. ఇందు సంశయింపవలసిన పనిలేదు. అని అత్రియు దేవతలును పలికిన పలుకులు అత - కి వినవచ్చెను. ఇట్లు దేవదేవుడగు జనార్ధనుని వలన అనుగ్రహమంది రాజు దేవతార్చనమును అగ్ని హోత్రమును జరిపి సర్వకామ పూ ర్తినొందెను.
(ఉత్తర భారతమున కృష్ణపక్షముతో మాసారంభము లెక్కింతురు. రాజు మామ మధ్యమున అనగా కృష్ణ పక్షము ముగియగానే శుక్లపక్షారంభమున ఆత్యాశ్రమమునకు పోయెను. ఆ పక్షమంతయును ఫాలున కృష్ణపక్ష మంతయును కలిసి సమగ్రమగు ఒక మాసమగును.)
ఇది శ్రీమత్స్య మహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూ ద్వీపాంతర్గత భరత వర్షాంతర్గత భరతఖండ వర్ణనమున మద్రరాజ పురూరవసుని వరప్రాప్తియను నూట పందొమ్మిదవ యధ్యాయము.
Summary of chapter 119 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents a vivid description of Uttarakuru-varsha, the northernmost sub-continent of Jambūdvīpa, celebrated as a realm of natural perfection and divine pleasure. Bhagavān Matsya reveals that the trees in Uttarakuru yield fine garments, precious ornaments, delicious food, and comfortable couches upon request. The residents possess golden complexions, enjoy eternal youth, and live in complete harmony without anger, jealousy, or suffering, spending their time in joyful devotional songs dedicated to Parameshvara.