82 - ధాన్యాది పర్వత దానములు

 నారదః : భగవ శ్రోతుమిచ్ఛామి దానమాహాత్మ్యముత్తమమ్

 యదక్షయం పరే లోకే దేవర్షిగణసేవితమ్

 ఈశ్వరః : మేరోః ప్రదానం వక్ష్యామి దశధా మునిసత్తమ

 యత్ప్రదానా న్న రో లోకా నాప్నోతి సురపూజితాన్

 పురాణేషుచ వేషుమ యజ్ఞే ష్వాయత నేషు చ

 న తత్ఫల మధీతేషు కృతేష్వాహ యదశ్నుతే

 తస్మా ద్విధానం వక్ష్యామి పర్వతానా మనుక్రమాత్

 ప్రథమోధాన్య శైల స్స్యా ద్వితీయో లవణాచలః

 గుడాచల స్తృతీయస్తు చతుర్థో హేమపర్వతః

పఞ్చమ స్తిల శైల స్స్యా త్షష్ఠః కార్పాసపర్వతః

 సప్తమో ఘృత శైలశ్చ రత్న శైల స్తథాఽష్టమః

 రాజతో నవమ స్తద్వ ద్దశమ శ్శర్కరాచలః

 వక్ష్యే విధాన మేతేషాం యథావ దనుపూర్వశః

ఆయనే విషువే పుణ్యే వ్యతీపాతే దీనత్రయే

శుక్లపక్షతృతీయాయా ముపరాగే శశిక్షయే

 వివాహోత్సవయజ్ఞేషు ద్వాదశ్యా మథవా పునః

 శుక్లాయాం పఞ్చదశ్యాంవా పుణ్యర్క్షేవా విధానతః

 తీర్దేవాఽఽయత నేవాపి గోష్ఠేవా ప్రాజ్గణే వనే

ధాన్య శైలాదయో దేయా యథాశాస్త్రం విజానతా

 మణ్డపం కారయే ద్భక్త్యా చతురశ్ర ముద జ్ముఖమ్

 ప్రాగుదక్ప్రవణే దేశే ప్రాజ్ముఖం వా విధానతః

గోమయే నానులిప్తాయాం భూమా వా స్తీర్యవై కుళాక్

 తన్మధ్యే పర్వతం కుర్యా ద్విష్కంభపర్వతాన్వితమ్

నారదుడు ఈశ్వరుని ఇట్లడిగెను: పరలోకమున అక్షయ ఫలద మైనదియు దేవతలును దేవరులు ను ప్రశం సించునదియు మహా మహిమము కలదియు నగు ఉత్తమ దానమును తెలుప వేడుచున్నాను. అనగా ఈశ్వరుడిట్లు చెప్పెను: పది విధములగు మేరు పర్వత) దానము అనునది కలదు. దానిని చేసిన నరుడు సుర పూజితములగు ఊ తమ లోకము లందు సుఖించును, ఇవి చేయుటచే కలుగునంత ఫలము పురాణములను వేదములను అధ్యయనము చేయుటచే కాని వాని యందు చెప్పబడిన ఆయా యాగాది పుణ్య కార్యములను చేయుటచే కాని లభింపదు. ఆవి వరుసగా ధాన్య లవణ సుడ సువర్ణ తిల కార్పొస దూది) ఘృత రత్న రజత. శర్కరా మేరు పర్వత) దానములు. క్రమముగా వీని విధానము తెలి పెదను. (ఉత్తర/దక్షిణ) అంచునములు-వీషువము (దివారాత్ర పరిమాణము సమమగు దినములు రెండు వ్యతీపాత యోగము అవమ-త్రిద్యుస్పృక్ దినములు-{ప్రతిమాసం శుక్లపక్ష తృతీయ-చంద్ర.సూర్య) గ్రహణములు- అమావాస్య వివాహములు ఉత్సవములు. యజ్గములు ద్వాదశి- పూర్ణిమ-పుణ్య (శుభ) నక్షత్రమున్న దినము. ఈ కాలములందును పుణ్య తీర్థ క్షేత్రములు.గోవులు నిలుచు ప్రదేశము. ఇంటి ముంగిలి.వనము-ఇట్టి దేశ ముల దును వీటిని రుథా విధానముగ సీయవలెను. తూర్పునకో ఉత్తరమునకో వాలుగా ఉండు ప్రదేశమున భక్తితో ఉత్తర మో తూర్పో మొగముండునట్లు చతు. రన మండపము (పందిరి) ఏర్పరచవలయును. దానియందు గోమయముతో అలికిన ప్రదేశమున, దర్భలను పరచు వలయును. ఆచోటి నడుమ శాఖా పర్వతములతో కూడిన ప్రధాన పర్వతమును మేరువును) నిర్మించవలెను.

ధాన్యద్రోణసహస్రేణ భవేద్గిరి రిహో త్తమః

 పఇ్చ శతై ర్మధ్యమ స్స్యాత్కనిష్ఠ స్స్యాత్త్రిభి శ్శతైః

మేరు ర్మహావ్రీహ్మయశ్చ మధ్యే సువర్ణశృజ్గ త్రయసంయుత స్స్యాత్

 పూర్వేణ ముక్తాఫల వజ్రయుక్తో యామ్యేన గోమేధిక పుష్యరాగై

పశ్చాచ్చ గారుత్మతనీలరత్నై సౌమ్యేన వైడూర్యసరోజరాగైః

 శ్రీఖణ్డఖణ్డైర భితః ప్రవాళై ర్లతాన్విత శ్శు క్తిశిలాతల స్యాత్

బ్రహ్మా చ విష్ణు ర్భగవాన్పురారి ర్దివాక రోఽప్యత్ర హిరణ్మయ స్స్యాత్

 మూర్ధన్యవస్థాన మమత్సరేణ (కార్యంత్వనేకైశ్చపునర్ద్విజాద్యైః) కార్యం త్వనే కై స్సురసిద్ధస జ్ఘైః

చత్వారి శృజ్గాణిచ రాజతాని నితమ్బభాగేష్వపి రాజత స్స్యాత్

తథేక్షుదణ్డావృతకన్దరస్తు ఘృతోదక ప్రస్రవణశ్చ దిక్షు

శుక్లామ్బరా ణ్యమ్బుధరావళి స్స్యౌ త్పూర్వణ పీతానిచ దక్షిణేన

 వాసాంసి పశ్చాదథ కర్భురాణి రక్తానిచైవోత్తర తోయదాళిః

రౌప్యా న్మహేన్ద్ర ప్రముఖా నథాష్టౌ సంస్థాప్య లోకాధిపతీన్క్రమేణ

 నానాఫలాళిశ్చ సమ న్తతస్స్యా న్మనోహరం మాల్యవిలేపనంచ

వితాన మస్యోపరి పఞ్చవర్ణమమ్లానపుష్పాభరణాన్వితం చ

 ఇత్థం నివేశ్యామర శైల మగ్ర్యం మేరో సువిష్కంభగిరీ న్క్రమేణ

తురీయభాగేన చతుర్దశంవై సంస్థాపయే త్పుష్పవిలేపనాడ్యమ్

  పూర్వేణ మన్దర మనేకఫలై శ్చ యుక్తం యుక్తం గణైః కనక రుద్రకదమ్బచిహ్నమ్

 కామేన కాఞ్చనమయేన విరాజమాన మాకార యే త్కుసుమవస్త్రవిలేపనాడ్యమ్ క్షీరారుణోదసర సాచ వనేన చై వం రౌ ప్యేన శుక్తిఘటితేన విరాజమానమ్

యామ్యేచ గాన్దమదనోత్ర నివేశనీయో గోధూమస్తఞ్జయమయః కలధౌతజమా

 హై మేన యక్షపతినా ఘృతమాన సేన వస్త్రైశ్చ రాజతవనేన సుసంయుత స్స్యాత్

 పశ్చా త్తిలాచల మనేక సుగన్ధపుష్పై స్సౌవర్ణపిప్పలహిరణ్మయహంసయుక్తమ్

 ఆకార యే ద్రజతపుష్పవనేన తద్వ ద్వస్త్రాన్వితం దధిసితోదసర స్తథాగ్రే

సంస్థావ్య తం విపుల శైల మథోత్తరేణ శైలం సుపార్శ్వ మపి (మాష)కాంస్యమయం సుపప్రమ్

  పుష్పైశ్చ హేమవటపాదప శేఖరాన్త మాకారయే త్కనక ధేనువిరాజమానమ్

 మాక్షీక భద్ర సరసాచ వనేన తద్వ ద్రౌ ప్యేన భాస్వరవతాచ వనం విధాయ

 హోమ శ్చతుర్భి రథ వేదపురాణవిదిర్దాన్తై రనిన్త్యచరితాకృతిభి ర్ధ్విజేన్ద్రైః

పూర్వేణహ స్తమిత మత, విధాయ కుణ్డం కార్య స్తిలై ర్యవఘృ తేన సమిత్కు  శైశ్చ

పర్వత నిర్మాణము: 1. ధాన్య పర్వతము: దీని కై కావలసిన ధాన్య పరిమాణము-(తూము-32 మానికలు-64 కొలత సేరులు. అని గుంటూరు మండలమునందును రాయలసీమలోను వాడుక;తూము=కడవ(రాయలసీమలొ))వేయి తూములుగాని ఐదు వందల తూములు కాని మూడు వందల తూములు కాని ఉండవలెను. నట్ట నడుమ చూడు బంగారు శిఖరములు తూర్పున ముత్తెముల వజముల శిఖరము-దక్షిణమున గోమేదక పుష్యరాగ" శిఖరము పడమర , గరుడ -- పచ్చల: ఇంద్ర నీలముల శిఖరము ఉత్తరమున వైడూర్య పద్మరాగముల శిఖరము ఉండవలెను. మంచి గంధపు కర్రలతోను పగడముల తోను చేసిన తీగలు ము: తైపు చిప్పలతో అమర్చిన రాతినేలలు ఉండవలెను. బంగారుతో చేసిన బ్రహ్మ విష్ణు ' రుద్ర శివుల ప్రతిమలును - సురసిద్ద ప్రముఖ దేవతల ప్రతిమలును ఈ పర్వతపు పైభాగమున , అమర్చవలేను. నాలుగు శిఖర ములును నెత్తములును వెండితో చేయవలెను. సోనా దిక్కులందును చేరకుగడలతో మూయబడిన గుహలును నేతితో నీటితో అమర్చిన సెలఏరులును కొండ ఊటలును ఉండవలెను. తూర్పున తెల్లని వస్త్రములు దక్షిణమున పచ్చని వస్త్రములు పడమర కలగలుపు వన్నెల వస్త్రములు ఉత్తరమున ఎర్రని వస్త్ర ములు మేఘములుగా అమర్చవలేను. వెండితో చేసిన స్పిలకుల ప్రతిమలను ఎనిమిది దిక్కులందును నిలుపవలేను. కొండ పై అంతటను వివిధ ఫలపుష్ప మాల్యములు అమర్చవలెను. దీనికి పైభాగమున ఐదు వన్నేల వస్త్రములతో పొడని పూవులతో ఆభరణములతో అమర్చిన చాందినీని అమర్చవలెను. ( నిర్ణయించుకొనిన ధాన్య పరిమాణములో నాలుగింట మూడు వంతుల ధాన్యముతో మేరు పర్వతము అమర్చగా మిగిలిన నాలుగవవంతు ధాన్యముతో గంధమాల్య యుక్తముగా ఆయా కుల ( శాఖా) పర్వత ములను అమర్చవలెను. ఎట్లనగా -తూర్పున బంగారుతో చేసిన రుద్రుని ప్రతి మయు ప్రమథుల ప్రతిమలును అనేక ఫల పుష్ప గంధ విలేపనములును బంగారు మన్మథ - ప్రతిమయును. వీరికందరకును వస్త్రమాల్య గంధ విలేపనములును మందర పర్వతము పై అమర్చవలెను.

దక్షిణమున గోధుమల రాశితో గంధమాదన పర్వతమును దాని పై బంగారుతో నేరేడు చెట్టు - బంగారుతో కుబేర ప్రతిమ నేతితో మానస సరస్సు చక్కని వస్త్రములు వెండితో చేసిన చెట్ల అడవులు ఉండవలెను. పడమట తిలలతో చేసిన విప్రుల పర్వతము దానిపై అనేక సుగంధ పుష్పములు బంగారుతో అశ్వత వృక్షము బంగారు హంసలు వెండితో తెల్లని పూలవనము తెల్లని వస్త్రములతో దధి ( పెరుగు) సరస్సు అమర్చవలయును. ఉత్తరమున కంచుతో సుపార్శ్వ పర్వతమును దాని పై శిఖరములు బంగారుతో పూల మొక్కలు మర్రిచెట్టు బంగారు గోవు వెడి చెట్ల అడవి తేనెతో భద్రమను సరస్సు ఏర్పరచవలయును.

ఈ మండపమునకు తూర్పున హస్త ఘన పరి సూణము కల కుండమునందు వేద పురాణ వేత్తలును పవిత్ర చరిత్రులు సమర్థులునగు నలుగుర బ్రాహ్మణులచే తిలలతో యవలతో ఘృతముతో సమిధలతో కుశ లతో హోమము చేయించవలెను. 

రాత్రౌచ జాగర మనుద్దతతూర్యనాదై రావాహనంచ కథయామి శిరోచ్చయానామ్

 త్వం సర్వదేవగణధామనిధే విరుద్ద మస్మద్గృహే ష్వమర పర్వత నాశ యాశు

 క్షేమం విధత్స్వ కురు శాన్తి మనుత్తమాం న స్సమ్పూజితః పరమభక్తిమతా మయాహి

త్వమేవ భగవా నీశో బ్రహ్మ విష్ణు ర్ధివాకరః

 మూర్తామూర్తం పరం బీజ మతః పాహి సనాతన

యస్మా త్వం లోకపాలానాం విశ్వమూ ర్తేశ్చ మన్దిరమ్

 రుద్రాదిత్యవసూనాంచ తస్మా చ్ఛాన్తిం ప్రయచ్ఛమే

యస్మా దశూన్య మమరై ర్నా రీభిశ్చ శిర స్తవ

తస్మా నా ముద్దరా శేషదుఃఖసంసారసాగరాత్

ఏవ మభ్యర్చ్య తం మేరుం మన్దరంచాపి పూజయేత్

 యస్మాచ్చైత్రరథేన త్వం భద్రాశ్వవర షేణచ

శోభ సే మన్దర క్షిప్ర మత స్తుష్టికరో భవ

 యథా చూడామణి ర్జమ్బుద్వీ పే త్వం గన్ధమాదన

 గన్ధర్వవనశోభావా నతః కీర్తి ర్దృఢాఽస్తు మే

 యస్మా త్వం కేతుమాలేన వైభ్రాజేన వనేన చ

 హిరణ్మయాశ్వత్థశిరా స్తస్మా త్పుష్టి ధృఢాఽస్తు మే

 ఉత్త రైః కురుభి ర్యస్మా త్సావిత్రేణ వనేన చ

 సుపార్శ్వ రాజ సే నిత్య మత శ్ర్శీరక్షయాఽస్తుమే  

ఈ దానవ్రత దినమున రాతియంతయు జాగరణము చేయవలెను. తీవ్రత లేని సరస మధురములగు తూర్య నాదములతో పర్వతముల నావాహనము చేయవలెను. (ఆవాహన మంత్రార్థము): సర్వ దేవ గణముల తేజస్సులకు నివాస స్థానమ (నిధి) వగు దేవపర్వతమా! మాగృహములందలి ఆశుభమును శీఘ్రముగా నశింపజేయుము. పరమ భక్తితో చేసిన నాపూజలనందుకొని అత్యుత్తమమగు శాంతిని క్షేమమును కలిగించుము. నీవే భగవానుడవగు ఈశుడవు బ్రహ్మయు విష్ణువును రవియును మూర్తిక లదీయు లేనిదియు అగు వ్యక్తి వ్యక్తి తత్త్వమును జగద్బీజమును; కావున సనాతన పర్వతమా! మమ్ములను రక్షించుము. నీవు లోకపాలురకును విశ్వమూర్తియగు విష్ణునకును రుద్రాదిత్య వసువులకును నివాస స్థానమవు; కావున అట్టి నీవు నాకు శాంతిని కలిగిం * ము. నీశిరము దేవ దేవనారీ జనముతో నిండి యుండును. కావున ఇట్టి నీవు నన్ను అశేష దుఃఖ సంసార సాగరమునుండి ఉద్దరించుము. ఇట్లు మేరు పర్వతము నర్చించి పిమ్మట మందర పర్వతమునర్చించవలెను. (మంత్రార్థ ము:) నీవు చైత్రరథ (వన) ముతోను భద్రాశ్వ వర్షముతోను శోధించుచుందువు, కావున ఇట్టి నీవు శీఘమే నాకు తుష్టి కలిగించుము. (గంధమాదనార్చనము : గంధమాదనమా! నీవు జంబూ ద్వీపమున చూడామణివి; గంధర్వ వనపు శోభతో కూడినదానవు. ఇట్టి నీచే నాకు దృఢమగు కీర్తి కలుగుగాక ! (విపుల పర్వ తార్చనము) : విపుల పర్వతమా! కేతుమాల వర్షముతోను వైబ్రెజవనముతోను శిర స్సునందు బంగారు రావిచెట్టుతోను ప్రకాశించుదానవు. ఇట్టి నీదయచే నాకు దృఢమగు పుష్టి కలుగుగాక ! (సుపార్శ్వ పర్వతార్చనము) : సుపార్శ్వ పర్వతమా? ఉత్తర కురు వర్షముతోను సావిత్రమనేడు వనముతోను నిరంతరమును ప్రకాశింతువు. ఇట్టి నీదయచే నాకు అక్షయ శ్రీ కలుగుగాక !

 ఏవ మామ న్త్ర్య తా న్త్సర్వా స్ర్పభాతే విమలే పునః

స్నా త్వాతు గురవే దద్యా న్మధ్యమం పర్వతో త్తమమ్

 విష్కమ్భపర్వతాక్ దద్యా దృత్విగ్భ్యః క్రమశో మునే

 గావో దేయాశ్చతుర్వింశ దథవా దశ నారద

 శక్తిత స్సప్త చాష్టౌవా పఞ్చ దద్యా దశ క్తిమాక్

 ఏకాంచ గుర వే దద్యాత్కపిలాంచ పయస్వినీమ్

 పర్వతానాంచ సర్వేషా మేష ఏవ విధి స్మృతః

 తఏవ పూజనే మన్త్రా స్తపనోపస్కరా స్స్మృతాః

 గ్రహాణాం లోకపాలానాం బ్రహ్మాదీనాంచ నాకి నామ్

 స్వమ న్త్రేణై వ సర్వేషు హోమ శైలేషు పఠ్యతే

 ఉపవాసీ భవే న్నిత్య మశక్తౌ నక్త మిష్యతే

విధానం సర్వ శైలానాం క్రమశ శ్శృణు నారద

 దానకాలేషు యే మన్త్రాః పర్వతేషుచ య త్ఫలమ్

 అన్నం బ్రహ్మ యతః ప్రోక్త మన్నం ప్రాణాః ప్రకీర్తితాః

 అన్నా ద్బవన్తి భూతాని జగ దన్నే న వర్తతే

 అన్న మేవ యతో లక్ష్మీ రన్న మేవ జనార్దనః

ధాన్యపర్వతరూపేణ పాహి తస్మా న్నగోత్తమ

 అనేక విధినా యస్తు దద్యా ద్దాన్యమయం గిరిమ్

 మన్వన్తరశతం సాగ్రం దేవలోకే మహీయతే

అప్సరోగణగన్దర్వై రాకీర్ణైశ్చ విరాజితమ్

విమానేన దివః పృష్ఠ మాయాతి ఋషి సేవితమ్

 కర్మక్షయే రాజరాజ్య మాప్నో తీహ న సంశయః

ఇతి శ్రీమత్స్యమహాపురాణే ఈశ్వర నారదసంవాదే ధాన్యపర్వతదాన

మాహాత్మ్యకథనం నామ ద్వ్యశీతితమోఽధ్యాయః

ఇట్లు వాటిని అన్ని టిని ఆవాహనము చేసి అర్చించి నిర్మలమగు ప్రభాతము కాగానే మధ్యమ (మేరు) పర్వతమును గురు (వురోహితు)నకును మిగిలిన నాలుగింటిని నలుగుర ఋత్విక్కులకును ఈయవలెను. శ క్తిననుసరించి ఇరువది నాలుగు-పది-ఎనిమిది. ఏడు-ఐదు - ఐన పాడి కపిల గోవులను దానమీయవలయును. గురునకొకటి తప్పక. ఈయవలయును.

అన్ని పర్వతముల విషయమునను ఇదే విధానము.మంత్రము -ఉపస్కరములును. సర్వదేవతలకును హోమము కూడ పైవలెనే.

వ్రత దినమున ఉపవాసముండ వలయును. శ క్తిలేనిచో నక్త మున భుజించ వచ్చును.

అన్ని పర్వత దానములందును ప్రధానముగా చెప్పవలసిన మంత్రము. “అన్న మే బ్రహ్మమును ప్రాణములును భూతోత్పత్తి స్థితి హేతువులును లక్ష్మియు జనార్దనుడును కావున (అన్నమునకు మూలమగు) ధాన్యపర్వత రూపమున ఉన్న పర్వత రాజమా! మమ్ము కాపాడుము.

ఈ విధానముతో ధాన్య పర్వతమును { కాని ఇతర పర్వతములను కాని) దానమిచ్చినవారు సమగ్రమగు మన్వం తర శతము దేవలోకమున సుఖింతురు. సర్వత్ర వ్యాపించియున్న ఆప్సరో గంధర్వ గణములతో వ్యాప్తమైయున్న స్వర్గమును దివ్య విమానములో చేరుదురు. కర్మక్షయము కాగానే మరల కల్పాదియందు రాజరాజై జన్మిం తురు.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున ధాన్య పర్వత దాన మాహాత్మ్య కథనమును ఎనుబది రెండవ అధ్యాయము.