మత్స్య మహా పురాణము
153 - పార్వతి జనన - పార్వతీదేవీ వివాహాది వృతాంత కథనము॥
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్లు సింహాసనమునందు కూర్చుండియున్న తారకాసురుని కడకు వచ్చి ద్వారపాలుడు ఎదుట నిలి చేను; వాడు శుచియై చీనాంబరము (పట్టు వస్త్రము) ధరించియుండెను॥ వాడు మోకాళ్ళు నేలకు ఆనించి చేతితో నోరు మూసికొని అల్పాక్షరములు కలిగియుండియు స్పష్టార్థములతో అలంకృతమగు వచనమును రవి సమూహములంత ప్రకాశమానమగు శ రీరముకల తారకునుద్దేశించి ఇట్లు పలికెను: ప్రభూ “కాలనేమి దేవతలను బంధించికొనివచ్చి వాకిట నిలిచియున్నాడు॥ బందీలు ఎట నుండవలయునని మనవి చేయుచున్నాడు॥ అనగా ప్రతీహారుని వచనము విని దైత్యుడిట్లనెను॥ వారు తమ ఇచ్చ వచ్చినచోట ఉండవచ్చును॥ భువనత్రయమును నాఇల్లే॥ వారికి పాశ బంధములు మాత్రము త్వరగ వదలించుడు॥ ఇట్లు చేసిన తరువాత దేవతలు నొచ్చుచున్న మనస్సులతో జగద్గురుడును (గురుడు = తండి) పద్మసంభవుడును శరణ్యుడునునగు బ్రహ్మను దర్శింపబోయిరి॥ ద్వారపాలురచే నివేదించబడి ఆ ఇంద్రాదులు శిర స్సులు ధరణికి మోపి స్పష్టములగు వర్ణములును ఆర్థములును కల వచ నములతో కనులా సనునిట్లు స్తుతించిరి॥
తుష్టువుస్పష్టవర్ణార్థవచోభిః కమలాసనమ్ ।
దేవాః : త్ర్యొజ్కారాయాజ్కురాయ ప్రసూత్యై విశ్వస్యాస్యాన నభేదస్య పూర్వమ్॥
సమ్భూతస్యాన నరం సత్త్వమూ ర్తె సంహారేచ్ఛోస్తే నమః కాలమూ ర్తే ।
వ్య క్తిం నీత్వా త్వం వపుస్స్వం మహిమ్నా చాసీరజ్ఞాత్వాభిధానా॥ దచి న్యకి॥
ద్యావాపృథ్యోరూర్ధ్వఖడ్గాధరాభ్యా మడ్డత్తస్మా త్వం విభాగం చకార।
వ్యక్తిం చై తద్యత్ర గత్వా తతో భూదేవం విద్మ స్తతణీతే వికారే॥
వ్యక్తం జన్మాజన్మనశ్శాశ్వత స్యాన నస్యానశ్చారిణో దేహభా జామ్।
ద్యౌ స్తే మూర్ధా లోచనే చౄసూర్యౌ వ్యాళిః కేశా శోత్రరౄ దిశ స్తే॥
గాత్రేష్వజాథ ద్యౌరపి చ స్థితా తే పొదౌ భూమిర్నా భిరన్డే సముద్రాః ।
మాయా కార్యం కారణం త్వం ప్రసిద్దే వేదై శ్శాన్తో జ్యోతిరాద్యంత్వముక్తః॥
వేదార్ధేషు త్వాం వివృణ్వస్తి వృద్ధా హృత్పిణ్ణన స్సన్ని విష్టం వురాణమ్।
త్వామాత్మానం లబ్ధయోగా గృణ ని సాఫ్ట్యే యాస్తా స్స ప్రసూక్ష్మాః ప్రతీతాః
తాసాం హేతుశ్చాష్ట మీవా స్తి గీతా స్వం స్వం తన్యోజ్జీవసి స్మాపిధానః ।
దృష్ట్వా మూ ర్తింస్థూలసూక్ష్మాం చకార యేవై భావాః కారణైః కేచియుక్తాః॥
సమ్భూతాస్తే త్వత్త ఏవాదిసర్జేభూయ సత్వో వాసనాం తే భ్యు పేయుః ।
త్వత్సజ్కల్పేనా నమాయాతి గూఢః కాలో ఒ మేయో ధ్వ ప్రసజ్ఞ్యావికల్పః॥
భావవ్య కి స్తస్య సంహార హేతు ర్వాసోన స్త్యం తస్య కర్తాసి చాత్మః ।
యేన్యే సూక్ష్మా యే చ తేభ్యోపి గీతా స్థూలా భూతా శ్చా నరా శేచ తేషామ్॥
తేభ్యస్ట్రాల్య స్వం పురాణప్రతీతో నూనం భూతో భూతిభా జాం ప్రభావే ।
భావీచ త్వం యుక్తభావం నిర్మస్య వ్య కస్తానే వ్య క్తవృత్తం కరోషి॥
వ్యక్తం దేవోభ క్తిభాజాం శరణ్య స్త్రీతా గోప్తా త్వంభవాన నమూర్తిః ।
వినేము రమరాస్త్సుత్వా బ్రహ్మాణ మవికారీణమ్॥
తస్థుర్మనోభి రిష్టార్థసమాప్తి ప్రార్థనా స్తతః ।
ఏవం స్తుతో విరిఞ్చిస్తు ప్రసాదం పరమం గతః॥
ఆమరాన్వరదః ప్రాహ వామహస్తేన నిర్దిశ ।
(ఆది మధ్యాంతములందేల్ల వ్యాపించియుండు) ప్రణవత్రయ స్వరూపుడును ఇపుడిట్లు అనంత భేద భిన్న మై యున్న ఈ విశ్వమునకు మొదట అంకుర మై ప్రసవరూపుడై సంభవ సృష్టి రూపుడై అనంతరము సత్వ (స్థితి) రూపుడై కడపట సంహార రూపుడునగు కాలమూర్తీ: నీకు నమస్కారము॥ నీవు నీ శరీరమును స్వమహిమతోనే వ్యక్త మొనర్చి నీ పేరితో ప్రసిద్దమగు అండము (బ్రహ్మాండము) నుండియే (స్థూల ప్రపంచముగా) రూపొంది అచింత్యుడ వయితివి॥ ఈ అండమునుండియే నీవు ద్యావా పృథివులనెడు ఊర్ధ్వా ధర ఖండములుగా విభాగ మొనర్చితివి॥
నీయందే ఈ విశ్వము వ్యక్తినొంది నీనుండియే సంభవించినది; నీవు రచించినవికారము (జగత్పరిణామము) విషయమున మాకు తెలిసినది ఇదియే॥ జన్మము (వాస్తవమున) లేనివాడును శాశ్వతుడును అనంతుడును దేహధారుల అంతఃకరణవ ర్తియునగు నీవు వ్యక్తుడవగుటయే (జగత్తుగా పరిణమించుటయే) నీ జన్మము॥ ద్యులోకము నీ శిరస్సు॥ చంద్ర సూర్యులు నీకన్నులు॥ సరాది సరీసృపములు నీ కేశ ములు॥ దేసలు నీ చెవులు; నీ ఆవయవములందే మూల ప్రకృతియు ద్యులోకమును నున్నవి॥ భూమి నీపాదములు॥ నీ నాభిరంధ్రమునందు సముద్రములున్నవి; నీవు వేదములచే మాయయు కార్యమును కారణమును శాంతుడవును ఆద్యజ్యోతియును నీవేయని చెప్పబడి ప్రసిద్ధుడవయి యున్నావు॥ వేదార్థములయందు అనుభవముగల వృద్దులగు వారు నిన్ను హృత్పిండాంతర్భాగమున అమరియున్న ప్రాచీన తమ తత్వమునుగా చెప్పుచున్నారు; యోగనిష్ణాతులు నిన్ను ఆత్మనుగా చెప్పుదురు; సప్త సూక్ష్మ తత్వములుగా ప్రసిద్ద ములగు 1॥ మహత్॥ 2॥ అహంకారము 3॥ పంచతన్మాత్రలు (సూక్ష్మ భూతములు) నీవేయని సాంఖ్యు లందురు॥ ఏఏడింటికిని హేతు వగు ఎనిమిదవత త్వముగా పేర్కొనబడిన (అవ్య క్త) తత్వమునుకూడ స్వస్వరూపముతో నీవే అధానుడవై మరుగుపడిన అసాక్షాద్భూత॥రూపముతో ఉజ్జీవింపజేయు చున్నావు॥ దృశ్యమగు స్థూల ప్రపంచమును (స్థూల భూతములను కూడ) సూక్ష్మమూర్తిని నీవే సృష్టించితి ఏ; కారణ తత్వములు అని కొందరచే చెప్పబడినవియు ఆది సర్గమం (సృష్టియందు నీ నుండి యే ఉత్పన్నమయినవి; మరల నీనుండియే అవి స్వస్వవాసనను సంస్కారమును పొందును॥ ప్రపంచము నకు భావ వ్యక్తిని (రూప స్పష్టీకరణమును) దానికి వాసమును (స్థితిని దానికి సంహార మును అనంతత్వమును (సంసారము ఆనాదికావున) కలిగించువాడవు నీవే; గూఢమును అమేయమును త త్త్వమెరుగ రానిది-పరిమితి నిర్ణయించ నలవికానిది) సంఖ్యా వికల్పమునకు అందరానిదియగు కాలము కూడ నీ సంకల్ప మాత్రము చేత అంతమునందును॥ స్థూల భూతములు అనియు సూక్ష్మభూతములు అనియు పేర్కొనబడినవి ఏవి కలవో వోని అంతర్బాగమున వానికి ఆత్మ భూతుడవై యున్న వాడవును నీవే; పురాణ (శాశ్వత) రూపుడవగు నీవే వాటికంటెను స్థూల రూపుడవయియు ప్రపంచ రూపుడవయి పరిణమించి గోచరించుచున్నావు; భూతి భాజులు (సంభూతిని-జన్మమును పొందు పొణులు) పొందు ప్రభవము (ప్రభవము = ఉత్పత్తినందు భూత రూపుడపు (వారికంటే ముందు కూడ ఉన్న వాడవు నీవే; అమరిన రూపమును నీరసించి (తొలగించి కొని) ఈ ప్రపంచమునకు భావి తరువాత కూడ ఉండువాడు) కూడ నీవే; వ్యక్త ప్రపంచము స్థితి నొందుటకు అనుకూలమగు వ్యక్త వ్యాపారమును (ప్రవృత్తిని) నీవే కల్పించుచున్నావు॥ భక్తి భాక్కులగు వారికి నీవే రక్షకుడవనుట స్పష్టము; అనంతమూర్తీ! మాకును నీవు రక్షకుడవుకమ్ము॥
అని ఇట్లు దేవతలు అవికారియగు బ్రహ్మ నుస్తుతించి వినములయి ఇష్టార్థ ప్రాప్తిని ప్రార్థించుచున్న మనస్సు లతో నిలిచిరి॥ ఇట్లు స్తుతింపబడిన బ్రహ్మయును మిగుల అనుగ్రహవంతుడయ్యెను॥ వరదుడనగుదునని వామ హస్తముతో నిర్దేశించుచు ఇట్లు పలికెను:
బ్రహ్మకృత తారక పరాజిత శ్రీవిష్ణ్వాదిదేవావస్థాప్రశ్నా ।
బ్రహ్మా:నా నీవా భర్తృకా కస్మాత్తను స్తే త్యక్తభూషణా॥
రాజతే న తథా శక మౌనవ కశిరోరుహా।
హుతాశన విముక్తోపి ధూమేన న విరాజ సే॥
భస్మ నేవ సమాచ్ఛన్నో దగ్ధదావశ్చిరోషితః ।
యమామయమయేనైవ శరీ రేణ విరాజ నే॥
దణేనాలమ్బితేనైవ కృత్వా తేన పదే పదే।
రజనీచరనాధోపి కిం భీత ఇవ భాన సే॥
రాక్ష సేన్హ క్షతారా తే త్వమరాతి తో యథా ।
తనుస్తేవరుడోచ్చుష్కః వరీత ఇవ వహ్ని నా॥
విముక్తంతు చిరాత్పాశం పాణిభిః ప్రవిలోకయ్య ।
పయోభవానచేతా స్వమసి ఛైరవ నిర్జితః॥
త్వం కిం వద స న్యజ్య పౌలస్త్య న కుబేర తామ్ ।
రు దాస్తు శూలినస్సన్తో వదధ్వం బహుశూలతామ్॥
భవతాం తేన సజ్జప్తం తేజస్తు భవతామపి।
అకి హ్చాత్కరతాం ప్రాప్తః కర స్తే న విభాసతే॥
బలం తీజోత్పలాఖేన చ కేణ మధుసూదన।
కిం భవాద్యురాలీనభువనప్రవిలోకనమ్॥
క్రియతే స్తిమితా క్షేణ భవతా విశ్వతోముఖ।
ఏవముక్తా స్సురా స్తేన బ్రహ్మణా బ్రహ్మ మూర్తినా॥
వాచః ప్రధానభూత త్వాన్మారుతం సమచోదయన్ ।
ఆకస్మికముగ భర్త గతించగా భూషణములు విడిచిన స్త్రీవలే నీశరీరమును మొగమును వాడి కేశముల కలంకర ణాదికము లేక ప్రకాశింపక యున్న దేమి? హుతాశనా నీవు పొగలేక యు అడవిని కాల్చి చాలకొలమట్లే యుండి బూడిదతో కప్పువడినవాడువలె ప్రకాశింపకున్నా వేమి? యమా వ్యాధిమయమయిన శ రీరముతో కూడి(నట్లు) అడుగడుగునను దండమును ఆసరా చేసికొని నడుచుచు ఉన్నా వేమి? నిరృతీ నీవు నిశాచరులకు ఆధిపతివై ఉండియు భయపడినట్లు తోచుచున్నావు; శత్రులను గాయపరచు నీవు రాక్ష సేంద్రా శత్రువు చేతిలో గాయపడినట్లున్నా వేః సర్పములు చాల కాలమునకు ముందే విడిచిన (వట్టి త్రాటిరూపములోనున్న) పాశమును చూచుకొనుచు వరుణా ఆగ్ని చుట్టివేసినవాడువలే తెగ ఎండిపోయియున్నా వేమి? వాయు దేవాః శత్రువులచేతిలో ఓడిపోయినట్లు చేతోరహితుడవయి యున్నా వేమి? పౌలస్త్యాః నీవు కుబేరత్వమును ధనాధి పతిత్వమును కోల్పోయినట్లు మాటాడకున్నా వేమి? ఈ రుద్రులు శూలధారులయ్యు బహు శూలములు (కడుపు నొప్పులు) కలవారమని చెప్పకయే చెప్పుచున్నారు॥ ఎవరు మీయంతటి వారి తేజమును కూడ హరించిరి? మధుసూదనా నీకరము తీక్షమును నల్లకలువవలె ప్రకాశించునదియునగు చక్రముతో ప్రకాశించక ఏమియు చేతకాని దానివలెనయినదేమి? విశ్వతోముఖా జెప్పవాల్చక నీవు నీ ఉదరమునందే జనించి రక్షింతువని) అచ్చటనే దాగియున్న భువనములను (ఎట్లు రక్షింతునయని) చూచుచున్నా వేల? ఇట్లు వేద మూర్తియగు బ్రహ్మ పలుక గా వాక్కు నకు ప్రధానుడు (ప్రకృతి మూల కారణ) రూపుడు కావున దేవతలు వాయుదేవుని ప్రేరించిరి॥
బ్రహ్మాణం ప్రతి దేవకృతస్వీయావస్థావిజ్ఞాపనా॥
అథ విష్ణుముఖైర్దేవై శ్శ్వసనః పరిచోదితః॥
ఆహ దేవం చతుర్వక్త్రం త్వం తు వేలి చరాచరమ్ ।
క్రతవో విహితాః కిల దేవ త్వయావితతింకిల జగ్ము ర్విచిత్రగుణాః॥
అపిపుష్టికృతఃతకామఫలా విహితా ద్విజనాయక దేవగుణాః ।
ఆపినాకమభూతిల యజ్ఞభుజాం భవతోవరయోగవశా త్సతతమ్॥
అపహృత్య విమానగణం స కృతో దితిజేన మహామరు భూమిసమః ।
కృతవానసి సర్వగుణాతిశయం యమ శేషమహీధరరాజతయా॥
కుజభూత(ప)వనాం క్వనుతామవిధిం చ మేరుగిరిర్గగనే ససదా।
అధివాస్తవిహార విధాపుచితో దనుజేన పరిక్షతశృజతటః॥
ప్రవిలుళ్లతరత్న గుహానివహో బహుదైత్యసమాశ్రయతాం గమితః ।
సురరాజసతస్యభయేన గతం సవిషాదశ రీర నిషజ్ఞతయా॥
ఉపయోగతయా వివృతం సుచిరం విమలద్యుతిపూరితదిగ్వదనమ్॥
భవతైవ వినిర్మితమా దియుగే సుర హేతిసహస్రమకుణ్ణభిదమ్।
దితిజస్య శరీర మవాప్య గతం శతధా మతిభేదమివాల్పమతికి॥
నాసీరధూళిధ్వస్తాడో ద్వారి ద్వారత్వకం గతాః॥
లబ్దప్రవేశాః కృచ్ఛేణ వయం తస్యా మర ద్విషః।
సభాయా మమరా దేవ ప్రకృషెర్ష్యువవేశితాః॥
వేత్రహ సై రజల్పన స్తథాపహసితాః పరై ।
మహారాస్సిద్దసర్వార్థా భవన స్వల్పభాషిణః॥
చాటుయు క్తం వచోఒత్యర్ధ మమతా బహు భాషతః ।
సభేయం దైత్యసింహస్య న శక్రస్యావిశ త్తుతామ్॥
భవద్భిరితి దైత్యస్య ప్రేష్యైర్విహసితా బహు ।
క్రతవో మూర్తిమ నస్త ముపాస నే హ్యహర్నిశమ్॥
కృతాపరాధసన్ఫ్రాసం సన్యజ ని కథంచన ।
త స్త్రీలయత్రయో పేతం సిద్దగన్షర్వజన్న రై ॥
సరాగముపధాతిష్ఠంగీయతే తస్య వేశ్మసు ।
హన్హాకృతోపకరణ్ మిత్రాంగురులాఘవే॥
శరణాగతసక్త్యాగం త్యక్త సత్యపరిశ్రయః।
ఇతి ని శ్శేషమథవా ని శ్శేషం కేనశక్యతే॥
తస్యావినయమా ఖ్యాతుం స్రష్టా తత్ర వరాయణమ్।
అంతట విష్ణువు మొదలగు దేవతల పేరణచే వాయు దేవుడు చతుర్ముఖుడగు బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను: చరాచర (ప్రపంచ విషయ) మును నీవెరుగుదువు కదా దేవా నీవు విధించిన క్రతువులు ఆశ్చర్యకర గుణములు కల వయి విస్తృతిని పొందేను, మరియు వాటిచే ద్విజనాధులును దేవగణములును పుష్టిని పొందినవారును తాము కోరిన ఫలము లను పొందినవారునునయిరీ, ఇదివరకును స్వరము దేవతలదిగానుండెన॥ కాని ఇపుడో॥నీవిచ్చిన వరయోగ సంబంధమున తారకుడు నిరంతరముగా దేవతల విమాన గణమును అపహరించుటతో స్వర్గలోక మిపుడు మరుదేశము(ఎడారి) తో సమా నమయి యున్నది॥ సర్వగుణాతిశయముతో కూడిన ఏమేరు పర్వతమును సకల వర్వత రాజముగా చేసియుంటివో అదియు నిరంతరముగా అధివాసమునకును విహారమునకును గగనమునందుపయోగించుటతో ఆ దానవుడు దాని శిఖరములను నేత్రములను భగ్న మొనర్చినాడు॥ దాని గుహలయందలి రత్నములన్ని యు దోచీ వేసి ఆ పర్వత భాగములన్నియు బహు దైత్యుల కాశ్రయముగా నొనర్చినాడు॥ దేవరాజా ఆ మేరువు వానికి భయపడి విషాదముతో నిండిన శరీరము కలిగి కూర్చుండుటకు చాలకాలము దైత్యులకు ఉపయోగించునదై తన విమల కాంతులతో దిజ్ముఖములను నింపుచు నున్నది॥ ఆడియుగమున నీవే నిర్మించినవియు మొక్కపోనివియు భేదింపనలవికానివియు అగు దేవతల వేలకొలది ఆయుధములు ఆదైత్యుని శరీరమును చేరగానే అల్పబుద్ధియగు వాని బుద్ధి పండితుల ఎదుట భేదిల్లిన విధమున భిన్న భిన్న ములయి పోయినవి॥ వాని సేనాముఖమునందలి ధూళితో సర్వావయవములును ధ్వంసము కాగా మేము వాని పొకిట ద్వారపాలురవలే నిలిచి మిగుల శ్రమమీదట ఆదేవ విరోధి సభలోనికి ప్రవేశము సంపాదించగలిగితిమి॥ గోప్పవారుగా అటనుండిన వేత్రహస్తులు మమ్ములను కూర్చుండ బెట్టగా నోరు మెదలక కూర్చుంటిమి॥ అటనున్న శత్రువులు మమ్మేగతాళి చేసిరి॥ దేవతలారా మీరు మహాపూజ్యులు॥ సర్వార్థములు సిద్ధి పొందినవారు; మీరు మీత భాషులు; ప్రశంసతో కూడినదియు అధికార్థములతో కూడినదియునగు మాట ఏదై నను ఇపుడెక్కువగా మాటాడుడు: ఇది దైత్య సింహుడగు తారకుని సభ; ఇంద్రుని సభవంటిది కాదిది॥” అని ఇట్లక్కడనున్న తారకుని సేవకులు మమ్ములను మిక్కిలిగా ఎగతాళి చేసి వెక్కిరించిరి॥ క్రతువులు మూర్తిమంతములయి అహర్నిశము వాని నుపాసించును; వదలినచో అపరాధమగునే మోయని అవి క్షణమయిన వానిని వదలవు; సిద్ద గంధర్వ కిన్నరులు తంత్రీవాద్యములతో మంద్రమధ్య తార త్రివిధలయలతో రాగయుక్తముగా వాని గృహములంధదు సన్నిహితులయియుండి గానము చేయుచుందురు॥ ఆయ్యయో వాడు వీరు మిత్రులు వీరు శత్రువులు అని కానీ వీరు గురుజనులు (బరువై నవారు) వీరు తేలిక వారు అని కాని లెక్క పెట్టడు; మరుగు చొచ్చినవారిని కూడ విడిచి వేయును; సత్యమునకు పరి శ్రయమీయనే ఈయడు॥ వాని అవి నయమును నిః శేషముగ॥ ఒక్కమాటలో ఇట్లు చెప్పవలసినదే; ఐనను కాకున్న ను వాని ఆవినయమంతయు ఎపరు నిః శేష ముగా చెప్పగలరు? సృష్టికర్తవగు నీవే ఈ విషయమున శరణము (రక్షకుడవు) కావలయును॥
సూతః : ఇత్యుక్త శ్చాత్మభూ ర్దేవ స్సురై ర్దైత్యవిచేష్టితమ్॥
సురానువాచ భగవాం స్తతస్మితముఖామ్బుజః ।
బ్రహ్మా : అవధ్య సారకో దైత్యస్సర్వైరపి సురై స్సు రాః॥
యస్య వధ్య స్స నా ద్యాపి జాత స్త్రీభువనే పుమాక్ ।
మయా స వర దానేన ఛన్దయిత్వా నివారితః॥
తపస స్సామతం రాజా త్రైలోక్యదహనాత్మకః।
సచ వవే వధం దైత్య శ్శితుత సప్తవాసరాత్॥
సచ సప్తదినో బాల శ్శఙ్కరా ద్యోభవిష్యతి ।
తారకస్య నిహస్తాసౌ భాస్కరాభో భవిష్యతి॥
సోపీదానీ మపత్నీ క శ్శజ్కరో భగవా నభుః ।
యచ్చాహము క్తవానస్య హ్యుత్తానకరతా సదా॥
ఉత్తానో వరదః పాణి రేష దేవ్యా స్సదైవతు।
హిమశైలస్య దుహితా సాతు దేవీభవిష్యతి॥
తస్యాం సకామాచ్ఛర్వాణ్యాం భగవానావకో యథా।
జనయిష్యతి తం ప్రావ్య తారకం స హనీష్యతి॥
మయాభ్యుపాయ స్సకృతో యథైవం హి భవిష్యతి ।
శేషశ్చాప్యస్య విభవోవిన శ్యే త్తదన నరమ్॥
స్తోక కాలం ప్రతీక్షధ్వం నిర్విశ జ్కేన చేతసా ।
ఇత్యుక్తా స్త్రిదశా స్తేన సాక్షాత్కమలయోనినా॥
తాం వివిక్తే సమాలోక్య బ్రహ్మోవాచ విభావరీమ్ ।
ఇట్లు దేవతలు (వాయు ముఖమున) తార కదైత్య చేష్టలు విన్న పించగా విని ఆ భగవానుడు చిరునగవు మొగమునందు తోచుచుండ వారితో నిట్లు పలికెను: దేవతలారా దేవతలందరు కూడియు తారకుని చంపజాలరు॥ ఎవనికి వాడు వధ్యుడో అట్టి పురుషుడు త్రిభువనములందు ఎచ్చటను పుట్టలేదు॥ నేను వానికి కోరిన వరములనిచ్చి త్రిలోకము లను దహించివేయగల తపస్సునుండి వానిని వారించితిని॥ ఏడు దినముల వయస్సుగల శిశువు వలన తనకు మృతి కావలెనని వాడు వరము కోరెను॥ అట్టి స ప దినవయస్కుడగు బాలుడు శంకరునీవలన ఎవడు కలుగునో॥ ఆతడే॥ రవి తేజస్కు డగు ఆత డే॥ తారక నిహంతయగును॥ భగవానుడును ప్రభువునగు శంకరుడు ఇంకను అపత్నీ కుడుగా ఉన్నాడు॥ ఇదియుగాక ఏదేవి కరము ఎల్లప్పుడును ఉతానమయి (నిట్టనిలువుగను విప్పుకొనియు) ఉండునో ఆమే కుమారుడే వానినీ చంపుననియు చెప్పియుంటినిగదా ఇదిగో ఈ దేవీకరము పరదమయి ఉతానమయియే యుండును కదా ఆదేవి ఇక ముందు హిమ శైల పుత్తియగును॥ శర్వాణియగు ఆమేయందేప్పుడు భగవానుడు కామప్రవృత్తుడే ఆ కుమారుని జని యింపజేయునో అప్పుడు అతనితో కూడి (యుద్ధముచేసి) తారకుడు తిరస్కృతుడు (నశించినవాడు) అగును॥ ఏ విధముగ ఇది జరుగునో ఆ యుపాయము నేను చేసియుంటిని॥ ఎక్కువ వ్యవధానము లేకుండగనే తరువాత కోలది కాలములోనే వాని విభవమంతయు వినాశమందును॥ మనస్సులందు భయ సందేహములు లేక కొలది కాలము వేచియుండుడు అని పద్మ సంభవుడు స్వయముగా చెప్పిన మాటవిని దేవతలు ఆయనను నమస్కరించి తమతమ అనుకూలతననుసరించి వెడలిపోయిరి॥
జగ్ము స్తే ప్రణిపత్యేశం యథా యోగ్యం దివొక సః॥
తతో గతేషు దేవేషు బ్రహ్మా లోక పితామమహః॥
నిశాంసస్మార దేవేశ స్స్వాం తనుం పూర్వసమ్బమ్ ।
తతో భగవతీ రాత్రిరుపత స్టే పితామహమ్॥
దేవకార్యార్థం విభావరీముద్దిశ్యబ్రహ్మోక్తిః॥
బ్రహ్మా: విభావరి! మహత్కార్యం దేవానాం సముపస్థితమ్॥
తత్కర్తవ్యం త్వయా దేవి! శృణు చార్థస్య నిశ్చయమ్ ।
తారకోనామ దైత్యశో స్సుర కేతు రనిర్జితః॥
తస్యాభావాయ భగవాన్జనయిష్యతి చేశ్వరః ।
సుతం స భవితా తస్య తారకస్యా న్తకారకః॥
శఙ్కరస్యాభవత్పత్నీ పురా దక్షసుతా సతీ।
సా పితుః కుపితా దేవీ కస్మింశ్చిత్కారణా న్తరే॥
భవిత్రీ హిమశైలస్య దుహితా లోకభావనీ।
విర హేణ హర స్తస్యా మత్వా శూన్యం జగత్రయమ్॥
బ్రహ్మ విభావరికి కర్తవ్యము తెలుపుట - అ॥
తవ్య తేహిమ శైలస్య కన్జరే సిద్ద సేవితే।
ప్రతీక్షమాణ సజ్జన్మ కళ్చాత్కాలం నివత్స్యతి॥
తయో స్సుత ప్తతపనో సంయోగో భవితాశుభ :
తతస్తాభ్యాంతు జనిత స్స్వల్పో వాక్కలహో భవేత్॥
తతస్తు సంశ యోఽభావే తారకస్య న దృశ్యతే ।
తయో సంయుక్తయో స్తస్మా త్పురతా కీ కారణే॥
విఘ్న స్వయా విధాతవ్యో యథా తాభ్యాం తథా శృణు।
గర్భశ్చ సేవ్యతాం మాతు స్స్వేన రూపేణ రజతా,
తతో విహస్య శర్వస్తాం విభాన్తో నర్మపూర్వకమ్ ।
భర్తయిష్యతి తాం దేవీం తతస్సా కుపితా సతీ॥
ప్రయాస్యతి తపః కర్తుం సా తస్మా తప ఆస్థితా।
జనిష్యతి సుతం శర్వాదమితద్యుతిమజ్ఞలమ్॥
స భవిష్యతి హన్హావై సురారీణా మసంశయమ్ ।
త్వయాపి దానవా దేవి హ న్తవ్యా లోక దుర్జయాః॥
యావచ్చన సతీ దేహసజానగుణగణ్చాయా ।
తత్సజు మేనతావ త్వం దైత్యాక్ హన్తుం న శక్ష్యసి॥
ఏవం కృతే తవ సప్త్వా త్వయా సాత్మ బుభూషూ।
సమాప్తనియమా దేవీ తదా చోమా భవిష్యతి॥
తదాస్వమేవ తద్రూపం శైలజా ప్రతిపత్స్యతే ।
తను స్తవాపి సహజా గౌరీగర్భా భవిష్యతి॥
దేవతలు వెడలిన అనంతరము లోక పితామహుడును దేవేశుడును అగు బ్రహ్మ సృష్ట్యాదియందు మొట్ట మొదట ఏర్పడిన తన రూపమేయగు విభావరిని [(ప్రళయ కాల రాత్రిని)] స్మరించెను॥ [మాయా శబళ బ్రహ్మత త్వపు ఒక దశ యందలి రూపము ఈ విభావరీ రూపము అని దీనిని బట్టి స్పష్టమగుచున్నది॥ ఈ హేతువు చేతనే శ్రీదేవీ సప్త శతీపాఠ పూర్వాంగముగా రాత్రి సూక్త పఠనము సంప్రదాయమునందు ఏర్పడెను॥ అనువాదకుడు॥] పిమ్మట వెంటనే భగవతి దేవతారూప యగు రాత్రి బ్రహ్మదేవుని ఎదుట నిలిచెను॥ ఆ సమయమున ఆచ మరెవ్వరును లేరు॥ అట్టి వివిక్త స్థానమందు ఆ విభావరిని చూచి ఆమె నుద్దేశించి బ్రహ్మ ఇట్లు పలికేను: విభావరీ దేవతలకొక మహాకార్యము ఇపుడు తటస్థించియున్నది॥ దాని విషయమున నీవు చేయవలసిన పని నిశ్చిత స్వరూపమును తేలి పేద; వినుము॥ తారకుడను దే త్యేంద్రుడు దేవతలకు ధూమ కేతువు వలె పీడాకరుడై ఉండు టేకాక జయింపబడకయున్నాడు॥ వాని నాశము కొరకై భగవానుడగు ఈశ్వరుడు కుమారుని జనియింప జేయును॥ అతడు తారకుని అంతమొందించు వాడగును॥
శంకరుని భార్యయగు దక్షపుత్త్రి సతియుండెను గదా ఆమేయొక కారణాంతరమున తన తండ్రి విషయమున కుపితురాలయ్యెను॥ (దేహత్యాగమును కూడ చే నెను॥) లోక భావని (సృష్టికిని స్థితికిని హేతుభూత) యగు ఆదేవి హిమ శైల పుత్తియగును॥ సతీదేవి విరహముచే హరుడు జగ యమును శూన్యమయినట్లు భావించి సిద్ద సేవితమగు హిమవత్పర్వత కందరమునందు తపమొనరించును॥ అతడట్లు కొంత కాలమామె జననమున కై ప్రతీక్షించుచు ఆట వసించును॥ (పార్వతియు ఆతనికై తపస్సు నాచరించును॥) ఆట్టు మిక్కిలిగా తపస్సాచరించిన వారికిరువురకును లోక శుభకరమగు కలయిక (వివాహ రూపమున) జరుగును॥ అనంతరము వారికిరువురకును స్పల్పమగు వాకలహము జరుగవలయును॥ ఏలయన-ఆట్లు జరిగినచో తారకుని నాశము విషయమున సంశయము ఉండదు॥ అందులకై నీవు సుర ఆస క్తి కారణముగా సంయోగము చెందుచుండు ఆ పార్వతీ పరమేశ్వరులకు సంతానము కలుగుటలో వీఘ్న ము కలిగించవలసియున్నది॥ అది ఎట్లందువే మో - చేప్పెదను వినుము॥
నీవు పార్వతీ మాతయగు మేనా గర్భమును ఆశ్రయించియుండి ఆ గర్భ(స్థ పిండ)మునకు నీవర్ణము కలుగు నట్లు చేయుము॥ అందువలన వివాహానంతరము శివుడు: శృంగార వినోద పూర్వకముగా మాటలాడుచు (ఆమె దేహచ్చాయ విషయమున) విభ్రాంతినొంది వినోదమున కై ఆమెను బెదరించును॥ (రాత్రిదేవీ దేహచ్చాయ నలుపు కావున ఆమె మేనా గర్భమునందు వసించి నాటినుండియు పార్వతీ దేహచ్చాయ సహజముగ తేలు పే చుయి నను నల్లగా కనబడునట్లు చేయును॥ వివాహానంతరము శివుడు పార్వతి యందపుడపుడు కనబడు నలుపుచాయనే గమనించి సల్లని దానా అని ఎగతాళి చేయుచు ఇట్టి నీవు నాకక్కరలేదని ఇట్లు బెదరించును॥) ఆంతట పార్వతి కుపితురాలయి (ఆ నల్లని దేహచ్చాయను వదలించుకొని తెల్లని చాయ సంపాదించి) గౌరి॥గౌరచ్ఛాయ కలదియగుటకై తపస్సాచరించ పోవును॥ ఆ మేయట్లు తపమవలంబించి శివుని వలన అమిత తేజోమండల మండితుడగు కుమారుని జనింపజేయును॥ అతడు నిస్సంశయముగ తారకాది) దైత్యుల చంపువాడగును॥ దేవీ నీవును లోకములకు దుర్జయులుగానున్న దైత్యులను చంపవలయును॥ కాని నీవు సతీదేవి (రూపయగు పార్వతీ దేహముతో సంబంధము కలిగి (ఆమె దేహమునందా వేశించి) యున్నంతవరకును నీవు దైత్యవధ చేయజాలవు॥ పార్వతి తన తపోబలమున నిన్ను తననుండి వేరుపరచును॥ తరువాత ఆమె గౌర దేహచ్చాయతో గౌరియే శివునికడకేగును॥ తరువాత శివుని యనుగ్రహమున కుమారుని కనును॥ ఈ నడుమ కాలములో నీవు మహిషుడు శుంభనిశుంభులు మొదలగు దానవులను చంపవలయును॥ దానిచే తారకుని బలమును తగ్గును॥ వారు శ్రీవలన మరణమును కోరుట కుమారునివలన మరణము కోరుట యను వరములును నెరవేరి మరణింతురు॥ పిమ్మట పార్వతీ పుత్రుడు న ప దిన వయస్క శిశువుగా తారకుని వధించును॥ అని బ్రహ్మదేవుడు విభావరికి చెప్పిన వచనపు - తాత్పర్యము॥) నీవు ఇట్లు చేయగా అమెయు తన స్వస్వరూపమును పొందగోరి పూనిన తపో నియమమును ముగించును॥ అంతట పార్వతియును తన స్వస్వరూపమును పొందును॥ నీదేహమును సహజ స్వరూపము నొందినదయి గౌరీ రూపమే తనయందు కలదిగా నగును॥ (నీరూపము-విభావరీ రూపము-ఆకృతియందు గౌరిగాను॥ దేహచ్ఛాయ మాత్రము నల్లనిదిగాను నగును॥)
రూపాం నచ సంయుక్తా త్వముమాయా భవిష్యసి ।
ఏకానం శేతిలోకస్త్వాం వరదే పూజయిష్యతి॥
తథా త్వం బహుధాకారై స్సర్వగా కామసాధనీ।
ఓంకారవక్తా గాయత్రీ ప్రయతై ర్బహ్మ వాదిభిః॥
ఆక్రా నిరూర్జితా కారా రాజభిశ్చ మహీభుజైః ।
త్వం భూరితి విశాం మాతా శూదై సేవ్యేతి పూజితా॥
జాస్తి ర్మునీనా మనోభ్యా దయా నియమినామపి ।
త్వం మహోపాయసన్హోహా నీతి ర్నయనిసర్పిణామ్॥
పరిచ్ఛిత్తిస్వధర్మాణాం త్వమీహాప్రాణిహృచ్ఛయా।
త్వం యుక్తి స్సర్వభూతానాం త్వం గతి స్సర్వదేహినామ్॥
త్వంచ కీర్తిమతాం కీర్తి స్వం మూ ర్తి స్సర్వదేహినామ్ ।
రతి స్వం ర క్త చిత్తానాం ప్రీతి స్వం హృద్యదర్శినామ్॥
త్వం కాని స్సర్వభూషాణాం త్వం శానిర్దుష్టకర్మణామ్ ।
త్వం భా ని స్సర్వభూతానాం త్వం శ్రా న్తిః కామయాయినామ్॥
జలధీనాం మహావేలా త్వంచ లీలా విలాసినామ్ ।
సంభూతిస్సత్ పదార్ధానాం స్థితి స్వం లోకపొలినామ్॥
త్వం కాళరాత్రి న శ్శేషభువనావళినాశనీ ।
ప్రియకంఠగ్రహానన్దదాయినీ త్వం విభావరీ॥
ఇత్యనేక విధై రేవి రూపై కే త్వ మర్చితా ।
యే త్వాం వేత్స్యంతీ వర దే పూజయిష్యంతి వాపి యే॥
తే సర్వకామా నాప్స్య స్తి నియతా నాత్ర సంశయః ।
నీవు ఇట్లు ఉమ (పార్వతి) రూపాంశముతో కూడిన దానవయ్యేదవు॥ వరదురాలవగు విభావరీ లోకము నిన్ను (పార్వతితో) ఏకాత్మక తత్వము అనియు 'అనంత' ఈమె సాక్షాతార్వతియే కాని ఆమెకు అంశ భూతురాలు కాదు॥' అనియు భక్తితో పూజించును॥ ఆవిధముగా నీవు ఆనేక విధములుగా ఉండు ఆకారములతో సర్వమునందునుండి కోరికలను సిద్ధింపజేయుదువు॥ వేదతత్వ వేత్తలగు ఉపాసనాపరులగు విప్రులు 'ఓంకార వక్త్ర' - ఓంకారము ముఖముగా గలది - వేద స్వరూప' ఆనియు 'గాయత్రి' ఆనియు క్షత్రియులు 'ఊర్జితమగు-బలశక్తులతో కూడిన - ఆకారముగల ఆక్రాంతి” అనియు వైశ్యులు 'భూదేవత' అనియు శూద్రులు 'మాతా' ఓ అమ్మతల్లి' అనియు నిన్ను పూజించి సేవింతురు॥ నీవు మునులయందు కలవరపరచనలవిగాని క్షాంతి ‘ఓర్పు’ గా నియమవంతులయందు దయ'గా నయశాస్త్రము ననుసరించి వ రించు వారియందు మహోపాయ సందోహములతో కూడిన 'నీతి'గా 'స్వధర్మము'లకు 'పరిచ్చి తి’ ‘పరిమితి'గా ప్రాణుల హృదయములందు వసించు ‘ఈహ’ ‘వాంఛ’ ప్రయత్నము'గా ఉందువు॥ కీర్తిమంతులయందు 'కీర్తి' సర్వ దేహధారులయందును ‘మూర్తి' 'ఆకృతి'గా అనురాగయుత చిత్తము కల వారియందు 'రతి' 'పరస్పరానురాగము'గా హృద్య॥మనోహరమగు వానియందుగల సౌందర్యమును చూచి యానందించు వారి హృదయములందలి ప్రీతి' 'ఆనందానుభవము'గా సర్వ భూషణములందలి 'కాంతి'గా దుష్ట కర్మాచరణములందలి 'శాంతి'గా సర్వభూతముల హృదయములందలి 'క్రాంతి' ఓఒక దాని జూచి మరియొక టీయను కొనుట'గా తమ ఇచ్చవచ్చినట్లు నడుచుకొనువారియందు 'క్రాంతి' 'అలసట'గా సముద్రములందు “చెలియలికట్ట'గా విలాసవం)తులయందు 'లీల' 'ఒయ్యారము'గా నత్తాత్మక పదార్థములందలి ‘సంభూతి' 'పుట్టుక'గా లోక పాలకులయందు స్థితి''లోక వ్యవస్థ॥లోక జీవనము 'గా సకల భువన నాశ నియగు 'కాళరాత్రి'గా ప్రియ కంఠా శ్లేషము వలని యానందము నంద జేయు 'రాత్రి' ‘విభావరి'గా ఇట్లనేక విధముల దేవీరూపవై లోకమునందు నీవర్చింపబడేదవు॥ వర దురాలవగు దేవీ ఎవరు నియతులై నీ తత్వమునేరుగుదురో పూజింతురో వారికి అన్ని కోరికలును ఈ డేరును; ఇందేమియు సంశయములేదు॥
బ్రహ్మాజ్ఞప్తవిభావర్యాః హిమాచలగమనమ్॥
ఇత్యుక్తా తు నిళా దేవీ తథోత్యు క్త్వా కృతాఞ్జలిః॥
జగామ త్వరితా దేవీ గృహం హిమగిరే ర్మహత్।
తత్రాసీనాం మహాహర్మ్యే రత్న భూషాసమాశ్రయామ్॥
దదర్శ మేనా మాపాఱుచ్ఛవివక్తసరోరుహామ్।
కిణ్చా చ్చ్యామముజోదగ్ర స్తనభారావనామితామ్॥
మహౌషధిగణాబద్దమ న్తరాజని షేవితామ్ ।
శుద్దహంసాత కానప్టజీవర క్షామహోర గామ్॥
మణిదీపగణజ్యోతిర్మహాలోకప్రకాశితే ।
ప్రకీర్ణ బహుసిద్ధార్థ చానూనపరిచారి కే॥
శుచిచీనాంశుకచ్ఛన్న భూశయ్యా స్తరణోజ్వలే।
ధూపామోదమనోరమ్యే సద్దసర్వోపయోగి కే॥
తతః క్రమేణ దివసే గతే దూరే విభావరీ ।
విజృమ్భితసుఖోదర్కే తతో మేనామహాగృహే॥
ప్రసు పప్రాయ పురుషే నిద్రాభూతోపచారి కే ।
శివలో కే శివే నూల్నే బ్రా నరాత్రివిహజ్ఞమే॥
రజనీచరస్చ రిభూతై రావృతచత్వరే ।
గాడకణగ్రహాలగ్న సుభగే సుజనే తతః॥
కించిదాభమతాం ప్రాప్తి మేవానే తామ్బుజద్వయే ।
ఆవివేశ ముఖే రాత్రిః సుస్ఫుటం కృత సజ్గమా॥
బ్రహ్మ ఇట్లు పలుక సరేయని నిజాదేవి విభావరి॥కాళరాత్రి రూపయగు మహామాయ కృతాంజలియై త్వరి తముగా దేవతాత్ముడగు హిమవంతుని మహాగృహమున కేగెను॥ అచట ఆమెకు మహా హర్మ్యమునందు కూర్చుండిన హిమవత్పత్ని మేనాదేవి కనబడెను॥ ఆమె రత్నభూషణములు దాల్చి కొంచెము తెల్లనైన ముఖపద్మ కాంతితో ఉం డెను॥ కొంచెము నలు పెక్కిన మొనలు కలిగి పైకెత్తినట్లున్న స్తన భారముచే ముందునకు వంచబడినట్లుండెను॥ మహౌషధి సమూహముతో కూర్చి కట్టబడిన మంత్రరాజము మహామంత్ర రక్షాబంధము) ఆమే దేహము సొశ్రయించి ఉండెను॥ శుద్ధమగు హంసాతకము (బంగారు?)తో చేయబడి కట్టబడిన జీవర జాప్రద మహాసర్పము కలిగి ఉండెను॥
విభావరి అచటకు వెళ్ళిన సమయము పగలు; అయినను ఆయుండిన గృహాంతర్బాగము మణిదీప గణముల జ్యోతిస్సులనుండి వెలువడు గొప్ప వెలుగుతో ప్రకాశితమై తెల్ల ఆవాలు చాల వేదజల్లబడి ఎందరో పరిచారికలు కలిగి శుచియగు చీన వస్త్రములు కప్పియుంచిన గొప్ప పడకల పరపులతో ప్రకాశించుచు ధూపముల వాసనలతో మనోహరమయి సర్వ ‘సర్జ’ రసాదిరస ద్రవ్యముల ॥ ఉపయోగముతో కూడియుండెను॥ క్రమముగ పగలు గడ చేను॥ అది దూర మయ్యెను॥ రాత్రి అయ్యెను॥ అపుడు ఆమేనాదేవీ మహాగృహము అత్యధికమగు సుఖ వి శేషము కలది యయ్యెను॥ పురుషులలో చాలమంది గాఢ నిద్రయందు మునిగిరి॥ పరిచారిక లు నిద్రతో తూగుచుండిరి॥ శివ ప్రీతికరమగు ఆ ప్రదేశమంతయు శుభకరమును క్రొత్తదిగ కనబడునదియునై ఉండెను॥ రాత్రి సంచారి పనులు ఆటునిటు సంచరించు చుండెను॥ రాక్షసులు సంచరించుచుండిరి॥ ముంగిళ్ళయందు క్షుద్ర భూతములు తిరుగుచుండెను॥ పరస్పర ప్రీతి పాత్రులగు ప్రియాప్రియులు గాఢ కంఠాలింగనమున మునిగిరి॥ ఇట్టి రాత్రికాలమున మేనా నేత్ర పద్మద్వయముకూడ విశ్రాంతి కై కొంచెము కలవరపడుచుండెను॥ అదే సమయమున రాత్రి దేవి మేనాదేవితో సంగమము (కూడిక) చెంది ఆమె ముఖమునుండి మేనో శ రీరమున ప్రవేశించేను॥
జన్మదాయా జగన్మాతుః క్రమేణ జఠరా న్తరమ్ ।
ఆవి వేశాతులం జన్మ మన్యమానా క్షపా తువై ॥
అజీజయ చ్ఛవిం దేవ్యా గుహారణ్యా విభావరీ ।
మేనాయాం పార్వత్యుత్పత్తిః॥
తతో జగతి నిర్వాణ హేతు ర్షి మగిరి ప్రియా॥
బ్రా హ్మీ ముహూర్తీ సుభగా ప్రాసూయత గుహారణమ్ ।
తస్యాంతు జాయమానాయాం జ నవ స్థాణు జడ్గమాః॥
అభవన్సుఖిన స్సర్వే సర్వలోక నివాసినః।
నార కాణామపి తదా సుఖం సర్వగతం మహత్॥
అభవత్కూర సత్వానాం చేతశ్శా గ్రంచ దేహినామ్।
జ్యోతిషామపి తేజ స్వం సుతరాం చాభవత్తదా॥
ఘనా శ్రీతాశ్చాషధయ స్వా దువ నీ ఫలానిచ ।
గన్ధవ స్త్రీచ మాల్యానీ విమలంచ నభో భవత్॥
మారుతశ్చ సుఖస్పర్శే దిశ శ్చ సుమనోహరాః ।
తదాచోద్భూతఫలిన పరిపాక గుణోజ్వలాః॥
అభవత్పృథివీ దేవీ శాలిమాలా తిసున్దరా ।
తపాంసి దీర్ఘ చీర్ణాని మునీనాం భావితాత్మ నామ్॥
తస్మిన్జితాని సాకల్యే కాలే నిర్మలచేతసామ్।
విస్మృతానితు శాస్త్రాణి ప్రాదుర్భావం ప్ర పేదిరే॥
ప్రభావం తీర్థము వ్యానాం తదా పుణ్యతమం త్వభూత్ ।
అస్త్రి ఒమరాశ్చాస న్విమానేషు సహస్రశః॥
సమ హేన్దహరిబ్రహ్మవాయువహ్ని పురోగమాః ।
పుష్పవృష్టిం ప్రముముచు స్తస్మింస్తుహినభూధరే॥
జగుర్గనర్వముఖ్యాశ్చ ననృతుశ్చాప్సరోగణాః ।
మేరుప్రభృతయశ్చాపి మూర్తిమన్తో మహాచలాః॥
తస్మిన్మహోత్సవే ప్రాప్తి దివ్య భూభృతి మానవాః।
సాగరాసరిత శ్చైవ సమాజగ్ముశ్చ సర్వశః॥
హిమశై లో2భవల్లో కే తదా సర్వైశ్చరాచరై।
సేవ్యశ్చైవాభిగమ్యశ్చ స శ్రేయాంశాల్చలో త్తమః॥
అనుభూయోత్సవం దేవా జగ్ముస్స్వానాలయాన్ముదా ।
దేవనాగేంద్రగందర్వశ్రీ లలీలావరాజనాః॥
హిమ శైలసుతా దేవీ త్వహంపూర్వికయా తతః।
క్రమేణ వృద్ధిమానీతా లక్ష్మ్యా వాణ్యా వరై ర్బుధ్ర,
క్రమేణ రూపసౌభాగ్యప్రబోధై ర్భువనత్రయమ్ ।
అజయద్రూపలక్ష్మ్యా పినిస్సాధారైర్నగాత్మజా॥
నిరుపమానమగు జగన్మాతృ జననము జరుగబోవుచున్న దని ఎరిగి రాత్రి దేవి ఆ జగన్మాతృ మాతృ గర్భాంతర్భాగమును ప్రవేశించెను॥ తత్తణమే అచ్చట వ్యాపించి విభావరీదేవి గుహునకు అరణియగు (గుహుడనగా కుమార స్వామి; గుహుడను అగ్ని జనించుటకు అరణివంటిది పార్వతి॥ ప్రాచీన సంప్రదాయమున అగ్నిని ఉత్పత్తి చేయుటకై మథించు కొయ్యపనిముట్టునకు అరణియని పేరు॥ ఇది రెండు భాగములు-క్రింది భాగము॥ గుంతతో ఉండు నది పూర్వారణి; మథించు పైభాగము ఉత్తరారణి॥) పార్వతి దేహకాంతిని జయించి ఆమె శరీర చ్చాయ నలుపగు నట్లోనరించెను॥ అటు తరువాత బ్రాహ్మముహూర్తమునందు సుభగ (భర్తకు ప్రీతిపాత్రము) అగు హిమవత్పత్ని మేనా దేవి జగత్తునందంతట నిర్వాణము (సుఖము॥ మోక్షము నకు హేతువగు గుహారణిని (గుహున కు జన్మస్థాన మగు పార్వతిని) కనెను॥
ఆ పార్వతి జనించుచుండ స్థిరచరములగు సర్వలోక నివాసి ప్రాణులు అన్ని యు సుఖవంతములయ్యెను॥ నరక వాసులకును ఆ సమయమున సర్వ శరీర వ్యాపియగు మహాసుఖము కలిగెను॥ క్రూరమగు అంతఃకరణ వృత్తి కల ప్రాణుల చేతస్సు కూడ శాంతమయ్యెను॥ జ్యోతిస్సుల కన్నిటికిని అపుడు మిక్కిలిగ తేజస్సధికమయ్యేను॥ ఓష ధులును మనము (అధిక వీర్యము) చే ఆశ్రయించబడినవి (మహాశ క్తిమంతములు) అయ్యెను॥ పూవులు సుగంధయుతము లును ఆకాశము విమలమును అయ్యెను॥ వాయువులు సుఖ స్పర్శములును దిశలతిమనోహరములును నయ్యెను॥ పృథివీ దేవియు ఉద్బూతమగు ఫలము పంట కలదియు వరి పైరు పంటల వరుసలతో అతి సుందరియు పంటల పరి పాకముతో నిండినదియు నయ్యెను॥ చాల కాలమునుండియు భావితాత్ములయి ఉత్తమ సంస్కారము నొందించబడిన అంతఃకరణ వృత్తి కలవారయి నిర్మలచిత్తులై ఆచరించినను ఫలవంతములు కాక యుండిన తపస్సులును ఆ సమ యమున సాకల్యము నొంది ఫలించేను॥ శాస్త్ర పండితులు చదివి మరచిన శాస్త్రములును ఆ సమయమున వారి చీ తము లందు సాక్షాత్కరించెను॥ ఉత్తమ తీర్థముల ప్రభావము ఎప్పటికంటే పుణ్యతమమయ్యెను॥ మహేంద్ర హరి బ్రహ్మ వాయువహ్ని ప్రముఖులగు దేవతలు వేలకొలది మంది ఆంతరిక్షమునందు విమానములయందుండి హిమవంతుని మీద పూలవాన కురియించిరి॥ గంధర్వ ముఖ్యులు పాడిరి; అప్సరోగణములు వర్తించేను॥ మానవులుగా మూ ర్తిమంతములయి మేరువు మొదలగు మహాపర్వతములన్నియును సాగరములును నదులును అన్నియును దివ్య హిమాచలు ఏ ఇంట చేరువ అయిన ఆ దివ్య మహోత్సవమున కై వచ్చెను॥ ఆ పర్వతోత్తముడగు హిమాచలుడు ఆ సమయమున సర్వభూతములలో మేలగువాడును సర్వ చరాచర భూతములకును ఆశ్రయణీయుడును సేవనీయుడును నయ్యెను॥ దేవతలును దేవనాగ గంధర్వ పర్వత జాతులవారును వారి వారి లీలా విలాసవతులగు స్త్రీలును ఆ ఉత్సవము ననుభవించి తమ తమ నివాసములకు సంతోషముతో వెడలిపోయిరి॥ లక్ష్మీవాణీ దేవతలును దేవతా శ్రేష్ఠులును (వారి స్త్రీలును) నేను ముందు నేను ముందనుచు ఆ హిమ శైలపుత్రిని క్రమముగా పెంచి పెద్ద చేయుచుండిరి॥ ఆ పర్వతపుత్రి పార్వతి అనే ధారణములగు రూప సౌభాగ్య ప్రబోధముల (వికాసముల) తోను రూపలక్ష్మితోను క్రమముగ లోకత్రయమును జయించేను॥
నారదస్యేంద్రోలోక గమనమ్॥
ఏతస్మిన్నంతరే శక్రో నారదం దేవసమ్మతమ్ ।
దేవర్షిమథ సస్మార కార్యసాధనసత్వరః॥
సతు శక్రస్య విజ్ఞాయ కాజ్క్షితం భగవాం స్తదా।
ఆజగామ ముదా యుక్తో మ హేన్షస్య నివేశ నమ్॥
తంతు దృష్ట్వా సహస్రాక్ష స్స ముత్థాయ మహాసనాత్ ।
యథారేణతు పాద్యేన పూజయామాస వాసవః॥
శక్రప్రణీతాం తాంపూజాం ప్రతిగృహ్య యథావిధి।
నారదః కుశలం దేవమపృచ్చతాకశాసనమ్॥
పృష్టేతు కుశ లే శక్రః ప్రోవాచ వచనం విభుః ।
ఇంద్రః : కుశలం జగతాం తావత్సమ్భూతం భువనత్రయే॥
తత్ఫలోద్బవసమ్పతో త్వంభవాతండ్రితోమునే ।
వేదవై తత్సమస్తం త్వం తథాపి పరిచోదకః॥
నిర్వృతిం పరమాం యాతి నివేద్యార్థం సుహృజ్జనే ।
తద్యథా శైలజా దేవీ యోగం యాయాతినాకినా॥
శీఘం తదుద్యతే సర్వైర సత్పవై ర్విధీయతామ్ ।
అవగమ్యార్థ మఖిలం తతస్త్వామ స్త్యో నారదః॥
నారదస్య హిమాచలగమనమ్॥
శక్రం జగామ భవనాద్దిమ శైలనివేశ నమ్ ।
తత్ర ద్వార్ సై స్సమౌనీన్ద శ్చిత్రవేత్రలతాకులై ॥
వన్దితో హిమ శై లేన నిర్గతేన పురో మునిః ।
సహసా ప్రవేశ్యభవనం భువోభూషణతాం గతమ్॥
నివేదితే స్వయం హైమే హిమశై లేన విస్తృతే ।
మహాసనే మునివరో నిషసాదాతులద్యుతిః॥
యథార్హం చార్యపాద్యంచ శైలస్తస్మై న్య వేదయత్ ।
మునిస్తు ప్రతిజగ్రాహ తదర్ఘ్యం విధివత్తదా॥
గృహీతార్ఘ్యం మునివర మపృచ్ఛ చ్ఛ్లక్ష్ణయా గిరా ।
కుశలం తపస శ్శైల శ్మనైః ఫుల్లాననామ్బుజ॥
ఇదే సమయమునందు ఇంద్రుడు దేవపూజ్యుడును దేవర్షియు నగు నారదుని తమ దేవకార్యమును సాధించు కొను త్వర తో స్మరించేను॥ భగవానుడా నారదుడును ఇంద్రుని కోరిక నెరిగి మోదయుక్తుడయి మహేంద్రభవనమునకు వచ్చెను॥ సహస్రనేత్రుడా వాసవుడు (ఇంద్రుడు) ఆతని చూచి తన మహాసనమునుండి లేచి యథార ములగు పాదము (మొదలగు ఉపచార పూజల)తో పూజించేను॥ ఇంద్రుడు యథావిధిగా ఒనరించిన ఆ పూజనందు కొని నారదుడు పాకా సురుని అణచినవాడగు ఇంద్రుని కుశలమడిగేను॥ ఆ కుశలప్రశ్నమునకు సమాధానముగా విభుడగు ఇంద్రుడు ఈ వచనము పలికెను॥ భువనత్రయము నకును కుశ లము కలిగించు అంకురము (దేవి) జనించినది॥ ఆ మొలక నుండి ఫలము సంభవించి సంపన్న మగుటలో నీవును అతంద్రీతుడవు (ప్రయత్న పరుడవు) కమ్ము; నీవును ఈ విషయ మంతయును ఎరుగుదువు; ఐనను నీపు అడుగుచున్నావు॥ అదియు గాక తన హృదయమందలి విషయము సుహృజనము నకు తెలుపుట చే పరమ సుఖము కలుగును॥ కావున నీవడిగినది చెప్పుచున్నాను॥ ఆది ఎట్టిది యనిన- శైలజాదేవి పినాకి (శివుని)తో వివాహ సంబంధముతో కూడిక నందవలయును॥ కావున మన పక్షము వారందరును॥ అందులకై ప్రయత్నము చేయవలయును॥
ఇట్లు ఇంద్రుడు చెప్పగా విషయమంతయు ఎరిగి అట్లే యగుగాక యని పలికి నారదుడు ఇంద్రుని కడ వీడ్కోలు అందుకొని ఇంద్ర భవనమునుండి హిమాలయుని భవనమునకు పోయెను॥ అచ్చట బహు విధములగు వేత్రలతలను (మేము బేత్రములను) ధరించి తమ తమ విధులందు వ్యాకులు లై యున్న ద్వారపాలకుల నమస్కారము లందుకోని (వారు పోయి తెలుపగా) ముందుకు వచ్చిన హిమాలయుడు శీఘ్రమే లోనికి ప్రవేశింపజేయగా నారదుడు భువనముల కే అలంకారమగు ఆ పర్వతుని భవనమును ప్రవేశించెను॥ అచట ఆమల ప్రకాశుడగు ఆ మునివరుడు స్వయముగా హిమాలయు డే పరచి చూపిన సువర్ణ మహాసనమునందు కూర్చుండెను॥ ఆ పర్వతుడు ఆయనకు యథార్ట్ ముగా అర్ఘ్యపాద్యాదికములను నివేదించేను నారదముని ఆ అర్యాదికమును యథావిధానముగా గ్రహించెను॥ పిమ్మట హిమాలయుడు వికసిత ముఖ పద్మముతో మెల్లగా మృదువగు వాక్కుతో ఆ మునివరుని తపోవిషయమున కుశలమడిగేను॥
మునిరన్వసి రాజాన మపృచ్ఛత్కుశలం తదా।
నారదః : అహోఒవతారితా స్సర్వే సన్ని వేశా మహాగిరే॥
పృథుత్వం మనసా తుల్యం కన్హరాణాం తవాచల ।
గురు త్వం తే గుణెఘానాం స్థావరా దతిరిచ్యతే॥
ప్రసన్నతాచ తోయస్య మనసోప్యధికా ఒభవత్ ।
న లక్షయామ శైలేన్ల కుర్రాప్యధిక తామతః॥
నానాతపోభిర్మునిభిడ్జ్వలనారసమప్రభై ।
పావనైః సావితో నిత్యం త్వత్కన్గర సమాశ్రయైః॥
అవమాన్య విమానంచ గగనేతు విరాగిణః ।
పితుర్థృ హే ష్వివాసన్నా దేవగన్దర్వజన్న రాః॥
అహోధన్యోసి శైలేన్హ యస్య తే కన్దరం హరః ।
అధ్యా స్తే లోక నాధో హి సమాధానపరాయణః॥
ఇత్యుక్తవతి దేవర్షా నారదే సాదరం గిరా।
హిమ శైలస్య మహిషీ మేనా మునిదిదృషయా॥
అనుయాతా దుహితాతు స్వల్పాళిపరిచారికా ।
లజ్జాప్రణయత్రస్తాజ్గీ ప్రవివేశ నివేశనమ్॥
తత్ర స్థితో మునివర శ్మైలేన సహితోవశీ ।
దృష్ట్వాగతం తపో రాశీం మునీం శైల పియా తదా॥
వవన్డే గూఢవదనా పాణిపద్మకృతాజ్జలిః ।
తాం విలోక్య మహాభాగో దేవర్షి రమితద్యుతిః॥
ఆశీర్భరమృతోద్ధార రూపాభి స్తాం వ్య వర్గయత్ ।
తతో విస్మితచిత్తాతు హిమవద్దిరిపుత్తాకా॥
ఉదై క్ష న్నారదం దేవీ ముని మద్భుత రూపిణమ్ ।
ఏహి వత్సేతి చాప్యుక్తా ఋషిణా స్నిగ్ధయా గిరా॥
కణ్ణి గృహీత్వా పితర మజే తు సముపావిశత్ ।
ఉవాచ మాతా తాం దేవీ మభివర్ణయ పుత్రి కే॥
భగవ నం తతోధన్యం పతిమాప్స్యసి సమ్మతమ్ ।
ఇత్యుక్తాతు తతో మాత్రా వస్త్రా నపిహితాననా॥
కిఞ్చిన్నమముఖీ భూత్వా వాక్యం నోవాచ కించన ।
తతః పునరుజాచేదం వాక్యం మాతా సుతాం తదా॥
వెంటనే నారదమునియు పర్వతరాజును పర్వతరాజ్యపు కుశలమడిగేను॥ తరువాత అతనిని నారదుడు సాదరముగ ఇట్లు ప్రశంసించెను॥ (హిమవంతుడు స్థూలదృష్టికి వర్వత శ్రేష్టము; తత్త్వదృష్టితో అతడు దేవతాత్ముడై న శివోపాసకుడు॥ ఈ నారదుడు చేయు ప్రశంస అందులకు తగినట్లు భావన చేయవలసియుండును॥)
మహాగిరీ! నీ శరీరపు అన్ని సన్ని వేశములు (అమరికలును) అవతాంతములుగా నున్నవి॥ నీవు పర్వత మాత్రుడవు కాక దేవతావతార రూపుడవు అని తెలుపుచున్నవి॥) అచలమా! (స్థిర ప్రజ్ఞుడవగు ఉపాసకుడా!) నీ కందరముల (ఎత్తైన శిలల నడుమనుండు లో తగు విశాల ప్రదేశముల) విశాలత నీ మనస్సులోతులతో సమానము; స్థావర రూపుడవగు నీ గురుత్వము (బరువు) దేవతాత్ముడవగు నీ గుణగణముల గురుత్వము (గొప్పదనము) వలెనే లోకము లందలి అన్నిటి గొప్పదనమును మించియున్న ది॥ నీయందలి నీటి ప్రసన్నత (తేటదనము! నీ మనస్సునందలి ప్రసన్నత నిర్మలత్వమువలెనే గొప్పది; శైలేంద్రమా ! ఇంతకంటే గొప్పదనము ఎచ్చటను మాకు కనవచ్చుటలేదు॥ ఏలయన॥॥ నీకందరములు తమ ఆశ్రయ స్థానములుగా చేసికొని నానా తపస్సుల ననుష్ఠించువారును ఆగ్ని తో రవితో సమానముగా తేజోవంతులునగు పావనమునులు నిన్నెడతెగక పావనుని చేయుచున్నారు॥ తమ యానములగు విమా నములను అలక్ష్యము చేసి అంతరిక్ష సంచార మునందు 'విరక్తి చెంది దేవగంధర్వ కిన్నరులు తండ్రి ఇండ్లయందువలే నీ ప్రదేశములందు వసించుచు నీకు చేరువయై యున్నారు॥ శైలేంద్రా! అహో! నీవు ధన్యుడవు; ఏలయన॥లోకనాథుడగు హరుడు యోగ సమాధానము (చిత్తమును పరతత్వమున సమాహితము చేయుట) పరాయణము పరమలక్ష్యముగా నీకందరమును ఆశ్రయముగా చేసికొని ఇపుడున్నాడు॥ నీ హృదయాంతరాళమును పరమేశ్వరుని ఆవాసముగా చేసి కొన్న మహోపాసకుడవు నీవు॥)
ఇట్లు దేవర్షియగు నారదుడు సాదరమగు వాక్కుతో పలుకునంత లో హిమాచలుని రాణియగు మేనాదేవి మునిని దర్శించు కోరిక తో తన కూతురగు పార్వతి తన వెంట రాగా కొలదిమంది చెలులును పరిచారికలును తోడురాగా లజ్జా ప్రీతులతో ముడుచుకొనిన అవయవములతో ఆ గృహ ప్రదేశమును ప్రవేశించేను॥ నిగృహీతేంద్రియుడగు ముని వరుడు నారదుడు అక్కడ హిమ శైలుని దగ్గరనుండెను॥ తపోరాశియగు ముని అటకు వచ్చియుండుట చూచి శైలుని ప్రియపత్ని హస్త పద్మములతో కృతాంజలియై చేతితో నోరు కప్పుకోనీ ( పెద్దలతో మాటాడునపుడు ఇది ఆచారము) నమస్కారమనుచు నమస్కరించేను॥ మహాభాగుడును ఆమిత తేజోవంతుడునగు ఆదేవర్షి ఆమెను చూచి అమృత ప్రవాహరూపములగు ఆశీస్సులతో ఆ శైల పత్నియగు మేనను వర్ధిల్లజేసెను॥ అంతట దేవియగు హిమవద్దిరి పుత్రి విస్మితచిత్తురాలయి ఆశ్చర్యకర రూప తేజస్సులుగల మునిని మొగమెత్తి చూచెను॥ మునియు ప్రీతియు క్తమగు వాక్కుతో ‘బిడ్డా! ఇటు రమ్ము!' అనెను॥ పార్వతి తండ్రిని కంఠమున గ్రహించి అతని తొడ పై కూర్చుండెను॥ తల్లియగు మేన ఆదేవితో "పుతీ! భగవానుని అభివందనము చేయుము॥ దానిచే ధన్యుడును పూజ్యుడునునగు పతిని పొందేదవు అనెను॥ తల్లి ఇట్లు పలుక ఆమెవస్త్రపు అంచుతో మొగము కప్పుకొని కొంచెముగా మొగము వంచుకొనెనే కాని ఏమియుననలేదు॥ ఆంతట తల్లి మరల పుత్రితో ఇట్లు పలి కెను:
వత్సే వందయ దేవర్షిం తతో దాస్యామి తే శుభం ।
రత్న క్రీడనకం రమ్యం స్థాపితం యచ్చిరం మయా॥
ఇత్యుక్తాతు తతో వేగా దుద్దృత్య వదనం తదా ।
వవందే మూర్ద్ని సస్ధాయ కరపఙ్కజకుట్మలమ్॥
కృతేతు వన్లనే తస్యా మాతా సభిముఖీన తు ।
చోదయామాస శనకై స్తస్యాఃసౌభాగ్యశంసినామ్॥
శరీర లక్షణానాంతు విజ్ఞానాయతు కౌతుకాత్ ।
సా శ్రీస్వభావద్దుహితృచినార్థాం దృశ ముద్వహత్॥
జ్ఞాత్వాతు హీఱితం శై లోమహిష్యా హృద యేన తు ।
అనుధీర్జాకృతి ర్మేనే రమ్య మేత దుపస్థితమ్॥
నోదిత శైలమహిషీ సఖ్యా మునివర స్తదా ।
స్మితాననో మహాభాగో వాక్యం ప్రోవాచ నారదః॥
న జాతో ఒస్యాః పతిర్భదే లక్షజై శ్చ వివర్జితా ।
ఉత్తానహస్తా సతతం చరణె ర్వ్యభిచారిభిః॥
స్వచ్ఛాయయా భవి ష్యేయం కిమన్య ద్బహు భణ్యతే ।
శ్రుత్వైతత్సంభ్రమావిష్టో ధ్వస్తధైర్యో హిమాచలః॥
నారదం ప్రత్యువాచేదం సాశ్రుకణ్ఠో మహాగిరిః ।
“బిడ్డా! దేవర్షిని నమస్కరించుము॥ నామాట వినినచో - నేను నీకై చాల కాలమునుండి ఒక రతనాల మంచి ఆటవస్తువును దాచి ఉంచితినిక దా! అది నీకిత్తును॥” తల్లి పలికిన ఈ మాట విని పార్వతి శీఘముగా మొగమెత్తి తన కేలు దామర మొగల జంటను తల పై నిలిపి మునిని నమస్కరించెను॥ తరువాత పార్వతీమాత తన కన్నులయందు శ్రీ స్వభావ సిద్దముగ తల్లులకు తమ బిడ్డల విషయముననుండు చింతను తోపజేయు కను చూపుతో చూచుచు పార్వతికి కలుగబోవు సౌభాగ్య లబ్దిని తెలుపు శరీర లక్షణములెట్లున్నవో ముని నడుగుమని తన సఖిని పేరించెను॥ హిమ వంతుడు తన హృదయమున తన రాణి హృదయాభిప్రాయమును ఎరిగియు తన మొగమున తన మనస్సులోని భావము బయట పడ నీయ లేదు॥ కానీ ఇది ఏదియో శుభమే జరుగనున్నదని మాత్రము తల చేను॥
హిమవంతుని రాణియగు మేన సఖి అడుగగా మహాభాగుడగు నారదుడు చిరునవ్వు తన మొగమున తోప ఈ వాక్యమును పలికేను:
“ఆమ్మాయీ! భద్రేః (యోగ్యురాలవగు మేనాదేవీ!) ఈమెకు పతి ఇంకను పుట్టియుండ లేదు॥ అదియునుగాక॥ ఈ కన్య (మంచి) లక్షణములు లేనిది; ఈమె చేతులు ఎల్లప్పుడును వెల్లకిల తిరిగియుండును॥ ఈమె పాదములు ఎల్లప్పుడును తమ నీడ ఉన్న చోట నిలువక చంచలములయి పోవుచుండును॥ ఈమె ఇట్టిది॥ ఇంకను వేరుగా ఎక్కువగా చెప్పవలసినదేమున్నది?” అనిన నారదుని మాటలు విని మహాగిరియగు హిమాచలుడు ధైర్యము నశించి తడబడుచు కన్నీటిచే డగ్గు త్తిక పడు కంఠము కలవాడగుచు నారదునితో ఈ విధముగా మారు పలికెను:
నారద హిమవతోః పార్వతీ విషయకః సంపాదః॥
హిమవా : సంసారస్యాతిదోషస్య దుర్వేదాహి గతిర్యతః॥
సృష్ట్యామవశ్యంభావిన్యా కేనాప్యతిశ యాత్మనా ।
కర్త్రా ప్రణీతా మర్యాదా స్థితా సంసారిణా మియమ్॥
యో జాయతేహియద్వీర్యా జ్ఞనితు స్సహ్యసాధకః ।
జనతాప్యస్య జాతస్య న కిఞ్చిదితి చ స్ఫుటమ్॥
స్వకర్మణేవ జాయనే వివిధా భూతజాతయః ।
అణ్డజా హ్యణ్డజా జ్ఞాతాః పునర్జాయేత మానవః॥
మానుషోపి సరీసృప్యాం మనుష్యత్వేపి జాయతే ।
తతాపి జాతె శ్రేష్టాయాం ధర్మస్యోత్కర్షణేన తు॥
అపుత్తజన్మిన శేషాః ప్రాణినః సమవస్థితాః ।
మనుజా సత్ర జాయ నే యతో న గృహధర్మిణః॥
క్రమేణాశ్రమసమాప్తి రహ్మ చారివ్రతాదను ।
తస్య కర్తు ర్ని యోగేన సంసారో యేన వర్ధితః॥
సంసారస్యహి నోత్పత్తి స్సర్వే స్యుర్యది నిర్గృహాః ।
తతః కర్తాతు శా స్ట్రేషు సుతలాభః ప్రశంసితః॥
ప్రాణినాం మోహనార్థాయ నరకత్రాణసంశ్రయాత్ ।
స్త్రీయా విరహితా సృష్టి ర్జన్తూనాం నోపపద్య తే॥
శ్రీజాతిశ్చ ప్రకృత్యైవ కృపణా దైన్య భాగినీ ।
శాస్త్రాలోచనసామర్థ్యాద్యుజితాస్తాస్తు కర్మణా॥
తాసాం చోపరి మావజ్జా భవేదితిచ వేధసా ।
శా స్త్రీషూక్త మసన్దిగం బహు ద్వారం మహాఫలమ్॥
దశపుత్తమా కన్యా యా న స్యాచ్చీలవర్జితా ।
వాక్యమేతత్పలభష్టం పుంసాం జ్ఞానిప్రకోపనమ్॥
కన్యాహి కృపణా శోచ్యా పితుర్దుఃఖవివర్దినీ ।
యాపి స్యాత్పూర్ణసర్వార్థ పతిపుత్తాధ నాదిభిః॥
కింపునర్దర్భగా హీనా వతీపుత్తధనాదిభిః ।
త్వంచోక్తవానుతాయా మే శరీరే దోషసజ్గ్రహమ్॥
అహో ముహ్యామి శోచామి గ్లామి సీదామి నారద ।
అయుక్తమపి వక్తవ్య మప్రాప్యమపి సాంప్రతమ్॥
“నేను ఏల దుఃఖపడుచుంటినన సంసారము అతి దోషయుక్తము; దీని గమనము ఎరుగుట సుసాధ్యము కాదు; ఏలయన తప్పక జరిగియే తీరవలసి జరుగుచుండు నృష్టియందు సర్వాతిశాయియగు పరమాత్మరూపుడగు అనిర్వచనీయ శ క్తిగల సృష్టికర్తచే సంసారస్థులగు జీవులకు ఈ చెప్పబోవు విధమున మర్యాద (వ్యవస్థ) చేయబడినది; ఎట్లన ఎవడు॥ ఎవని వీర్యము వలన జనించునో ఆ తండ్రికిని ఈ పుత్రుడు పుణ్యలోక ముల సాధించువాడు కాడు; కనిన తండ్రియు ఈ జనించిన జీవునకు ఏమియు మేలు కీడులు చేయగలవాడు కాడు; వివిధ భూత జాతులును ఆయా ప్రాణులుగా స్వక ర్మానుసారముగనే జనించుచుండును; అండజములు అండజములనుండియే పుట్టును; ఈ జన్మమందండజముగానున్న జీవుడే మరియొక జన్మమున మానవుడు కావచ్చును; మానవుడుగా ఇపుడున్న జీవుడును మరియొక జన్మమున సరీసృప నియందైనను మానవ యోనియందైనను జనించవచ్చును॥ ఆందునను తాను చేసికొనిన కర్మ ఫలానుసారము ధర్మోత్కర్షముననుసరించి శేషప్రాణి జాతియందు జీవుడు పుట్టును॥ మనుష్యులు తప్ప మిగిలిన ప్రాణులు ఆయా కర్మానుష్టానమునకో పుణ్యలోక ప్రాప్తికో పుత్తులు కలుగవలయునను విషయమును ఎరుగవు; వాటికి పితృ పుత్ర సంబంధమును బట్టి తండ్రి కొరకై కుమారుడో కుమారుని కొరకై తండ్రియా చేయు కర్మములునులేపు; ఏలయనగా మానవులు పుట్టుకతోనే భౌత స్మార్త కర్మానుష్ఠాన యోగ్యతగల గృహస్థులుగా పుట్టుటలేదు॥ బ్రహ్మచారి వ్రతముతో ఆరంభమయి క్రమముగా ఆయా యాశ్రమములు సంప్రాప్తించును; ఇదియును ఏ సృష్టికర్త సంసారమును వర్ధిల్లజేయునో ఆకర్త చేయు ఆజ్ఞచేతనే జరుగును॥ అందరు మానవులును నిర్గృహులు (గృహమనగా గృహిణీ గృహముచ్యతే యను న్యాయానుసారము గృహమనబడు ఇల్లాలు; ఆమె లేనివారయి గృహస్థులు కాని వారు) ఆయినచో సంసారము ఉత్పన్నము కానేకాదు; ఆందుచేతనే సృష్టికర్త చేత శాస్త్రములందు పుతీ లాభముకం టే పుత్రలాభము మేలని ప్రశంసింపబడినది; ఇట్లు చెప్పుట మానవులను మమకార మోహమున నిలుపుటకును నరకమునుండి కాపాడుటకును అని ఎరుగవలయును॥ కాని స్త్రీ లేనిదే సృష్టి జరుగు అవకాశము లేదు॥ స్త్రీ జాతి ప్రకృతి సిద్దము గానే దీనత్వమునకు పాత్రము; దయనీయ మయినది); (స్త్రాలు సృష్టికర్త చేతనే ఇట్లు శాస్త్ర విచారణా సామర్థ్యము కాని కర్మానుష్ఠానయోగ్యత కాని లేసివా రైరి; ఐనను ఈ హేతువుచే వారిని ఆవజ్ఞా (అవమాన) దృష్టితో చూడరాదనియు వారిని ఆదరించుట బహు పుణ్యలోక ద్వారమును మహాఫలప్రదముననియుశీలరహిత కాని కన్య పదిమంది పుత్రులతో సమరాలనియు సృష్టికర్తయే శాస్త్రములందు అసందిగ్ధముగా -స్పష్టముగా- చెప్పియున్నాడు; కాని ఆలోచించగా ఈ వాక్యము నిష్ఫలమయినదియు పురుషులకు మనో వ్యథను ప్రకోపింపజేయునదియు నయియున్నది; ఏలయనగాకన్య (కూతురు) దయనీయురాలును (ఆమె విషయమున) శోకింపవలసినదియు తండ్రికి దుఃఖమును వృద్ధి చేయునదియునై యున్నది; పతి పుత్త ధనాదుల విషయమున ఏకొరతయులేక సర్వార్థ పూర్ణురాలై నను ఇంతే; మరి దుర్భగ (భర్తృ ప్రీతికి నోచుకొననిది)యు పతిపుత్త ధనాదులందు కొరత కలదియు ఐనచో ఇక చెప్పవలసినదేమి? ఆది కాక మీరు నాకూతు శ రీమునందు ఆనేక దోషములున్న వని పలికితిరి॥ ఆయ్యో! అది విని నాకు మతిపోవుచున్నది; శోకము కలుగుచున్నది! శ్రమయగుచున్నది; శ రీర మును చిత్తమును పట్టుతప్పుచున్నవి॥ నారదా! ఇప్పటి నా స్థితిలో తగని విషయమే యైనను పొందరానిదేదైనను ఈ విషయ మిట్టిదని తాము చెప్పవలయును॥
అనుగ్రహాన్మమ చ్చింది దుఃఖం కన్యాశ్రయం మునే ।
పరిచ్ఛిన్నే పి సన్దిగ్ధే మనఃపరీభవాస్పదమ్॥
తృష్ణా ముష్ణాతి నిష్ణాతా ఫలలాభాశ్రయా శుభా ।
స్త్రీణాం హి పరమం జన్మ కులానా ముభయాత్మనామ్॥
ఇహాముత్ర సుఖాయోక్తా స్సత్పతిప్రాప్తిసంజ్ఞికాః ।
దుర్లభస్సత్పతిః స్త్రీణాం విగుణోపి పతిః కిల॥
న ప్రాప్యతే వినా పుణ్యేః పతిర్నా ర్యాః కదాచన ।
యతో నిస్సాధనో ధర్మః పరిమాళోజీ తా రతిః॥
ధనం జీవితపర్య స్తం పతో నార్యాః ప్రతిష్ఠితమ్ ।
నిర్గనో దుర్బగో మూర్ఖ స్సర్వలక్షణవర్జితః॥
దైవతం పరమం నార్యాః పతిరుక్త స్సదైవ హి ।
త్వయా చోక్తం చ దేవరే న జాతోఒస్యాః పతిః కిల॥
ఏతదౌర్భాగ్యమతుల మసజ్జ్యం గురు దుస్సహమ్ ।
చరాచరే భూతసర్లే యద ద్యాపీచ నో మునే॥
న స జాత ఇతి బ్లూ షే తేన మే వ్యాకులం మనః ।
మనుష్యదేవజాతీనాం శుభాశుభ నివేదకమ్॥
లక్షణం హస్తపాదాభ్యాం విహితై ర్లక్షణైః కిల ।
సేయముత్తానహ స్తేతి త్వయోక్తా మునిపుజవ॥
ఉత్తానహ స్తతా ప్రోక్తా యాచతా మేవ నిత్యదా ।
శుభోదయానాం ధన్యానాం న క దాచి తయచ్చతామ్॥
స్వచ్ఛాయయాస్యాశ్చరణా త్వయాచ వ్యభిచారిణే ।
తత్రాపి శేయసాం హ్యాశా నమునే ప్రతిభాతి నః॥
శరీర లక్షణా శ్చాన్యే పృథక్ఫలని వేదినః ।
సౌభాగ్యధనపుత్రాయుఃపతిలాభానుశంసినః॥
తైశ్చ సర్వై ర్విహీనేయం త్వమాత్త మునిపుజవ।
త్వం మే సర్వం విజ్ఞానాసి సత్యవాగసి చాప్యతః॥
ముహ్యామి మునిశార్దూల హృదయం దీర్యతీవ మే।
ఇత్యుక్త్వా విరత శ్మైలో మహద్దుఃఖం నివేద్య తు॥
అనుగ్రహముతో మునీ! కన్య విషయమున నొకుగల దుఃఖమును ఛేదించుము॥ సంశయము కలిగించిన విషయములో ఇది ఇంతే; ఇంతకంటే మేలు కలుగు అదృష్టము లేదు; అని నిశ్చయము కలిగినను మనస్సు అవమానమునకు పాలుపడియున్న ను ఇంకను ఫలముకలుగు నేమోయను విషయమునగల ఆశ మనస్సును దొంగిలించి తన వశము చేసి కొనును గదా! ఏలయన స్త్రీల జన్మము ఉభయ వంశముల (పుట్టిన మెట్టిన ఇండ్ల) వారలకును మేలు కలిగించునది; స్త్రీకి మంచి మగడు దొరకుట ఈ ఇరు పక్షముల హరికిని ఇహ పరఫల సాధకము; గుణహీనుడేనను స్త్రీలకు మొదలు భర్త దొరకుటయే దుర్లభము॥పుణ్యములు లేనిదే పతియే ఎన్నడును దొరకడు అందుర నిన సత్పతి దొరకుట మరియు దుర్లభము గదా! ఏలయన తాను సాధనము చేయక యే ధర్మ ఫలమును పరిమితిలేని సుఖానుభవమును జీవితాంతమువరకు ధనమును స్త్రీకి భర్తయందే ఆధారపడి యున్నది; నిర్ధనుడు కురూపుడు దుర్భగుడు॥ (సౌందర్యాది లక్షణములు లేనందున స్త్రీల ప్రీతికి పాత్రుడు కాని వాడు) మూర్ఖుడు ఏసల్లక్షణములును లేనివాడు ఐనను స్త్రీకి సదా పతియే పరమ దైవతమని శాస్త్రము చెప్పుచున్నది॥ కాని మీరో-దేవరీ! ఈమెకు ఇంక ను పతి పుట్టనే లేదంటిరి; ఈ దౌర్భాగ్యము సాటిలేనిదియు లెక్క చేసి పరి మితి నిర్ణయించనలవి కానిదియు చాల బరువయినదియు (తల్లి దండ్రులకు) దుస్సహమును; చరాచర భూత సృష్టియందే ఇప్పటికిని ఆతడు (ఈమెకుపతి) పుట్టలేదంటి రే! దానితోనే నా మనము వ్యాకులమైనది; మనుష్య దేవ జాతులవారలకు శుభా శుభములను తెలుపు లక్షణములను హ స్తపాదములందు అమరినచిహ్నములను బట్టియేక దా! ఇది ఇట్లుండ ముని పుంగవా! ఈమె ఉత్తానహస్త (అర చేయి పైకి వచ్చునట్లు పెట్టుకొని యుండునది) యంటిరి; ఈ లక్షణము ఎల్లప్పుడును యాచించు కొనువారలకే కాని శుభోదయము (శుభసమృది) కల ధన్యులకును ఇతరులకు ఇచ్చు దాతలకును ఎన్నడును అట్లుండదు॥ ఈమె పాదములు తన నీడ యున్న చోటి నుండి కదలి పోవుచు చంచలములయి యుండునంటిరి॥ ఆ లక్ష ణమునందు కూడ ఆమెకు శ్రేయము లభించునాశనాకు కనబడుట లేదు॥ సౌభాగ్యము ధనము పుత్రులు ఆయువు పతి లభించునని తెలుపు వేరు వేరు ఫలముల ఆయా శరీర లక్షణములు ఎన్ని యో కలవుకదా! అవియు ఏవియు ఈ మేకు లేవని ముని పుంగవా! మీరంటిరి, నాకు తెలిసినంతవరకు మీరు సర్వజ్ఞులు; సత్యవచనులు; కావునను మీ మాటవిని మునీశా రూలా! నాకు మోహము (ఏమియుతోచక పోవుట) కలుగు చున్నది; హృదయము బ్రద్దలగు చున్నట్లున్న ది॥ ఆని ఇట్లు తన మహా దుఃఖమును తెలిపి హిమవంతుడు ఊరకుండెను॥
శ్రుత్వైతదఖిలం తస్మాచ్చైలరాజముఖామ్బుజాన్ ।
స్మితపూర్వమువాదం నార దో దేవపూజితః॥
నారదః : హరస్థానేత్మహతి త్వయా దుఃఖం నివేద్యతే ।
అపరిచ్చిన్న వాక్యార్థో మోహం యాసి మహాగిరే॥
ఇమాం శృణు గిరం మత్తో రహస్యపరినిష్ఠితామ్ ।
సమాహితో మహా శైల మయో క్రస్య విచారణే॥
న జాతో స్యాః పతిర్దేవ్యా యన్మయోక్తం హిమాచల।
స న జాతో మహా దేవో భూతభావోద్భవోభవః॥
శరణ్య శ్శాశ్వత శ్శాస్తా శఙ్కరః పరమేశ్వరః ।
బ్రహ్మ విష్ణ్వాస్త్రమునయో గర్బజన్మజరార్ధితాః॥
తస్యై తే పరమేశస్య సర్వే క్రీడనకా గిరే ।
*బ్రహ్మాణ్డం తత్తదిచ్ఛిత స్సమ్భూతం భువనప్రభోః॥
విష్ణుర్యుగే యుగే జాతో నానాజాతిమహాతనుః ।
మన్య సే మాయయా జాతం విష్ణుం చాపి యుగే యుగే॥
ఆత్మనో న వినాశో స్త్రీ స్థావరా నేపి భూధర ।
సంసారే జాయమానస్య ప్రియమాణస్య దేహినః॥
నశ్యతే దేహ మేవాత్ర నాత్మనో నాకే ఉచ్యతే ।
బ్రహ్మాదిస్థావరానోఒయం సంసారో యః ప్రకీర్తితః॥
స జన్మమృత్యుదుఃఖాల్తో హ్యవశ ః పరివర్తతే ।
మహాదేవోచల స్థాణు ర్న జాతో జనకోజరః॥
భవిష్యతి పతి సోఒస్యా జగన్నాధ్ నిరామయః ।
యదుక్తంచ మయా దేవీ లక్షజ్ఞ ర్వర్జితాపి చ॥
శృణు తస్యాపి వాక్యస్య సమ్య క్వేన విచారణమ్ ।
లక్షణం దైవకోహ్యజ్క శరీరావయవాశ్రయః॥
వంశాయుర్ధనసౌభాగ్యపరిమాణప్రకాశకః ।
ఆనన్తస్యా ప్రమేయస్య సౌభాగ్యస్యాస్య భూధర॥
నై వాజ్కో లక్షణాకార శ్శరీరే సంవిధీయతే ।
అతస్యా లక్షణం గాత్రే శైల నా స్తి మహామతే॥
(*ఆస్తే బ్రహ్మ తదిచ్ఛాత స్సంభూతో భువనప్రభుః)
శైలరాజ ముఖపద్మమునుండి వెలువడిన ఈ వచనమును విని దేవపూజితుడగు నారదుడు చిరునగవుతో ఇట్ల నేను; మహాహర హేతువగు విషయమున నీవు దుఃఖము ప్రకటించుచున్నావు॥ మహాగిరీ! వాక్యార్థ మును స్పష్టముగ ఎరు గక వ్యామోహమందుచున్నావు॥ రహస్యార్థమును వివరించు నామాటను విని నే చెప్పిన దాని విచారణమునందు మనస్సు సమాహిత మొనర్చుము॥ హిమాచల: ఈ మేకు పతి పుట్టలేదంటినే: దాని యర్థము ఏమన॥ అతడు మహాదేవుడు (శివుడు)ను భూతముల వ్య క్రస్థితిని ఉద్భవింపజేయు వాడునగుటచే భవుడనబడును; అంతే కాని అతడు పుట్టినవాడుకాడు; శరణ్యుడు॥ శాశ్వతుడు॥ఎల్లరను శాసించువాడు -శంకరుడు (శుభమును కలిగించువాడు పరమేశ్వరుడు (ఈశ్వరులకును ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మునులు మొదలగు వారి కెల్లరకు గర్భజన్మ జరా బాధలు కలవు; వారెల్లరు పర మేశుని చేతి ఆట వస్తువులు; ఈ బ్రహ్మాండము ఆభువన ప్రభుని ఇచ్ఛ సంకల్పము॥ ఇచ్ఛాశ కి) వలన జనించును; విష్ణువు ప్రతి యొక యుగమునందును నానాజన్మలనందు మహాతనువు (శరీరము) కలవాడై పుట్టును; ఇట్లు అంటినని యుగ యుగము నను విష్ణువు కూడ మాయకువశుడై పుట్టు నను కొనుచున్నావేమో! స్థావర ప్రాణులగు వృక్షములవరకుగూడ ఏ దేహము నందును ఆత్మకు వినాశములేదు; సంసారమున పుట్టుచుచచ్చు చునుండు దేహికి దేహమే నశించును కాని ఆత్మకు నాశము లేదు॥ కానీ ఇతరమగు దేహి జన్మమృత్యు దుఃఖములతో బాధనందుచు దేనియందును అవశుడై తన యధీనమందేమియు లేక) దేహమునుండి దేహమునకు మారుచుండును॥ కాని మహాదేవుడో॥ అచలుడు-స్థాణువు - ఎప్పుడును స్థిరుడు॥ అతడు ఇతరము (రు)లను జనింపజేయునే కాని తాను జనింపడు; జర (వార్ధక్యము) సందడు॥ జగన్నాధుడు నిరామయుడు ఏదోషమును లేని వాడు) అగు అతడు ఈ మేకు పతియగును॥ ఈదేవి లక్షణ వర్జిత అనిన నా మాటకు కూడ లెస్సగా విచారణము ని పైరుగుము॥ లక్షణము అనునది దైవకము (మన సంకల్పము లేక యే కలుగునది); ఆది శరీరావయవముల నాశయించియుండు గురుతు; (అవయవములందు గోచరించు ఆ లక్షణము వంశము - ఆయువు-ధనము సౌభాగ్యము॥ ఇట్టివాని పరిమాణమును (ఎంతయను విషయము తెలుపును; అనంతము॥ఆప్రమేయము (హద్దు కాని పరిమాణము కాని లేనిది) ఆగు ఈమె సౌభాగ్యమునకు లక్షణము అని చెప్పదగిన ఆంకము (గురుతు) ఏదియు ఈ శరీరమునందు నిరూపింపదగినది లేదు॥ ఇందువలన మహామతీ! శైలా! ఈమె శరీరమున లక్షణములు లేవంటిని॥
యచ్చాహము క్తవానస్యా హ్యుత్తానకరతా సదా ।
ఉత్తానో వరదః పాణి రేష దేవ్యా స్సదైవ తు॥
సురాసురమునివ్రాతవర దేయం భవిష్యతి ।
యచ్చ ప్రోక్తం మయా పాదౌ స్వచ్చాయావ్యభిచారిణె॥
అస్య శ్శృణు మమైకాపి వాగ్యు క్రీం శైలసత్తమ ।
చరణా పద్మసఙ్కాశావస్యామలనఖోజ్వలో॥
సురాసురాణాం నమతాం కిరీటమణికా స్తిభిః ।
విచిత్రవర్ణార్భా స్యేతే స్వచ్ఛాయాప్రతిబిమ్బితే॥
ఏషా భార్యా జగద్భక్తుర్వృషాజస్య మహీధర ।
జననీ సర్వలోకస్య సమ్భూతా భూతభావనీ॥
శివేయం పావనాయైవ తంతే తే పావక ద్యుతిః ।
తద్యథా శీఘమేవైషా యోగం యాయాతినాకినా॥
తథా విధేయం విధివ త్వయా శై లేన్షసత్తమ ।
అస్త్యత్ర సుమహత్కార్యం దేవానాం హిమభూధర॥
సూతః : ఏవం శ్రుత్వాతు శై లేన్లో నారదాత్సర్వమేవ హీ।
ఆత్మానం న పునర్జాతం మేనే మేనాపతి సదా॥
నమస్కృత్య వృషాజ్కాయ మహాదేవాయ ధీమతే ।
ఉవాచ చాపి సంహృషో నారదంతు హిమాచలః॥
హిమవా : దుస్తరాన్నర కార్టోరాదుద్దృతోస్మి త్వయా విభో ।
పాతాళాదహముద్దృత్య సప్తలోకాధిపః కృతః॥
హిమాచలోస్మి విఖ్యాత స్వయా మునివరాధునా ।
హిమాచలాచ్చతగుణం ప్రాప్తోస్మీతి సమున్నతిమ్॥
ఆనన్దదివిజాహారి హృదయం మేధునా మునే ।
నాధ్యవస్యతి కృత్యానాం ప్రవిభాగ విచారణమ్॥
యది వాచామధీశ స్యాంత్వద్గుణానాం విచారణే ।
భవద్విధానాం నియత మమోఘం దర్శనం మునే॥
తవాస్మాంప్రతి చాపల్యం వ్యక్తం మమ మహామునే ।
భవద్భిరేవ కృత్యోహం నివాసాయాత్మరూపిణామ్॥
మునీనాం దేవతానాంచ స్వయం కర్తాపి కల్మషమ్।
తథాపి వస్తున్యేక స్మిన్నాజ్ఞా మే సంప్రదీయతామ్॥
ఈమె ఎప్పుడును ఉత్తానకరయైయుండునంటిని; అదియేమి అనిన ఈ దేవీకరము ఎల్లప్పుడు వరము లిచ్చుటకై ఉత్తానమయి వెల్లకిలనయి అరచేయి బయటపడుచు నుండును॥ ఈయమ సురలకును అసురులకును వరములొసగునది యగును॥ ఈమే చరణములు తమ నీడయున్న చోట నిలువక చరించుచుండునంటినిగదో! శైలస తమా! ఈ మాటకు నా వచోవివరణము వినుము; పద్మ సమానములును నిర్మల నఖములతో ఉజ్వలములునునగు ఈమె చరణములు ఈమెను నమస్కరించు సురాసురుల విచిత్ర వర్ణములుకల కిరీట మణి కాంతులతో ప్రకాశించుచుండ ఆచరణముల ప్రతిబింబము లాకిరీట మణులందు ప్రతిబింబించుచుండును; ( నమస్కరించు వారు మారిన కొలదిని ఆ ప్రతిబింబముల స్థానములును మారుచుండును॥) మహీధరా! ఈ మే జగద్భర్త యగు వృషభధ్వజునకు భార్యయగును; భూత సృష్టికర్తయగు సర్వ లోక జననియే అగ్ని ప్రకాశయగు ఆశీవ (శివుని పత్ని) మిమ్ములను పవిత్రుల జేయుట కే సీ క్షేత్రమునం భార్యయందు సంభవించినది; కావున శైలేంద్రస తమా! ఈమె శీఘముగా పినాకి (శిపుని)తో కూడునట్లు నీవు యథావిధిగా చేయ వలయును॥ హిమ భూధరమా! ఇందు దేవతల సుమహాకార్యముకూడ కలదుసుమా! అనగా మేనాపతియగు ఆ శైలేంద్రుడు నారదుని వలన ఇట్లంతయు వినిన మీదట తాను మరల పుట్టినట్లే భావించెను॥ ధీమంతుడును వృషభ ధ్వజుడునునగు మహాదేవునకు (స్వచిత్తమున) నమస్కరించి హిమాచలుడు చక్కగ హరము చెంది నారదునితో ఇట్లనెను: విభూ! నీవు నన్ను దు స్తర ఘోర నరకములో పడకుండ లేవనెత్తితివి; నన్ను పాతాళమునుండి పైకెత్తి ఏడు ఊర్ద్వ లోకములకును అధిపతిగా జేసితివి; ఇంతవరకును మునివరా! హిమాచలుడని విఖ్యాతుడనయి యుంటిని; ఇపుడంతకంటే నూరు ఇంతల సమున్న తినందితిని॥ మునీ! ఇపుడు నా హృదయము ఆనందామృతము ననుభవించుచున్నది॥ కాని నేను వాక్కులకు అధీశుడగు బృహస్పతియే బ్రహ్మయో॥ అయియుండినను మీగుణముల విచారణమున యత్నించి మీ ఆయా కృత్యముల ప్రవిభాగమును విచారించుటలో కూడ నా హృదయమునకు శక్తి చాలదు; తమవంటి వారి దర్శనము వ్యర్థము కాదు; మహామునీ! ఇందు మావిషయమున మీకు గల చాపల్యము (చూడవలెననుకొనగానే వచ్చి చూచి అనుగ్రహించుట) నాకు స్పష్టముగ గోచరించుచున్న ది, నేను స్వయముగ పాపముల చేయువాడ నేయేనను తమవంటి వారిచే తమవంటి మునులకును దేవతలకును నివాసమునకు యోగ్యుడుగా చేయబడితిని॥ అయినను ఒక విషయమునందు నాకు మీరు ఆజ్ఞనీయవలయును॥
ఇత్యుక్తవతి శై లేంద్రే స తదా హర్ష నిర్బరే ।
ఉవాచ నారదో వాక్యం కృతం సర్వమితి ప్రభో॥
సుర కార్యే య ఏవార్థ స్తవాపి సుమహత్తరః ।
ఇత్యుక్త్వా నారదశీఘం జగామ త్రిదిదం తతః॥
స గత్వా దేవసదనం మ హేన్దం సద్గదర్శ హ ।
తతోభిరూ పే స మునీరుపవిష్ణో మహాసనే॥
పృష్టశ కేణ ప్రోవాచ హిమజాసంశయాం కథామ్ ।
నారదః : మమానురూపం కర్తవ్యం తన్మర కృతమేవ హీ॥
కంతు పఞ్చశర స్యైవ సమయోఒయ ముపస్థితః ।
ఇత్యుక్తా దేవరాజస్తు మునినా కార్యదర్శినా॥
చూతాజ్కురాస్త్రం సస్మార భగవాన్పాక శాసనః।
ఇంద్రస్మారితమదనసమాగమ స్తయోస్సంవాదశ్చ॥
సంస్మృతస్తు తదా క్షిప్రం సహస్రా మేణ ధీమతా॥
ఉపత సే రతిపతినవిలాసం రషధ్వజః ।
ప్రాదుర్భూతంచ తం దృష్ట్వా శక్రః ప్రోవాచ సాదరమ్॥
శక్రః : ఉపదేశేన బహునా కిం త్వాం ప్రతివదే ప్రియమ్ ।
మనోభవోసి తేన త్వం వేత్సీ భూతమనోగతమ్॥
తద్య థార్థక మేవం త్వం కురు నాకసదాం పియమ్ ।
శజ్కరం యోజయ క్షిప్రం గిరిపుత్యా మనోభవ॥
సంయుతో మధుమా సేన ఋతునా గచ్ఛ దుర్జయః ।
ఇత్యుక్తో మదన స్తేన శ కేణ స్వార్థసిద్ధయే॥
పోవాచ పఞ్చ బానోథ వాక్యం భీత శ్శతక తుమ్ ।
కామః : అనయా దేవసామగ్ర్యా దేవరాజ(మునిదానవభీమయా) మయా ప్రభో॥
దుస్సాధశ్శజ్కరో దేవః కిం న వేతి జగతభో।
తస్య దేవస్య వేత్త త్వం కరణంతు యదవ్యయమ్॥
ప్రాయః ప్రసాదః కోపోపి సర్వోహి మహతాం మహాక్ ।
సర్వోపభోగసారా హి సున్దర్య స్వర్గసమ్బవాః॥
అధ్యా! శితంచ యత్సౌఖ్యం భవతా నష్ట చేష్టితమ్ ।
ప్రమా దాదథ విభ శ్యేదీశం ప్రతి విచిన్య తామ్॥
ప్రాగేవ చేహ దృశ్యంతే భూతానాం కార్యసమ్భవాః ।
విశేషంకాజ్క్షతాం శక్ర సామాన్యాద్భ్రంశనం ఫలమ్॥
పర్వతరాజిట్లు హర్ష నిర్భరుడై పలుకగా నారదుడును ప్రభూ! సర్వమును నరిపోయినది; దేవకార్యమేదియో అదియే నీ సుమహత్తర కార్యమును; కనుక ఇక వేరుగా చెప్పవలసినదియు చేయవలసినదియు ఏమియు లేదు॥” అని పలికి శీఘ్రమే అటనుండి స్వర్గ మేగెను॥ అతడట దేవేంద్ర భవనమునకు పోయి అతనిని సందర్శించేను॥ ఆ ముని యచట మనోహర మహాసనమున కూర్చుండెను॥ ఇంద్రుడడుగు పార్వతీ విషయక వృత్తాంతమతనికి తెలిపి “నేను చేయతగినది చేసితిని॥ ఇక ఇపుడు మన్మథునికి పనిపడు సమయము వచ్చినది॥” అనెను॥ కార్యదర్శి (ఏపని ఎట్లు చేయవలెనో తెలిసి తెలుపు) నారదుడిట్లు పలుక పాకాసురుని చంపిన భగవానుడు దేవరాజు అస్త్రముగా చూతాంకురము (మామిడి పూ మొలకను) ధరించు మన్మథుని తలచెను॥ ధీమంతుడగు సహస్రాకుడు సంస్మరించినంతనే మత్స్యధ్వజుడగు రతి
ప్రవిష్టః కర్ణరంద్రేణ భవస్య మదనో మనః ।
శజ్కర సమథాకర్ణ్య మధురు మదనాశ్రయమ్॥
సస్మార చాద్రిదుహితాం(దక్ష) దయితాం రక్తమానసః ।
తతస్సా తస్య శనకై స్తిరోభూయాతినిర్మలా॥
సమాధిభావనా తస్థా లక్ష్యప్రత్యక్షరూపిణీ ।
తత స్తన్మయతాం యాతః ప్రత్యూహనిహతాశయః॥
వశిత్వేన బుబోధేశో వికృతిం మదనాత్మికామ్ ।
ఈషతోపసమావిష్ణో ధైర్యమాలమ్బ్య ధూర్జటిః॥
నిరా సే మద నస్థిత్యా యోగమాయాసమావృతః ।
స తయా మాయయాఒఒ విష్ణో జజ్వాల మదన స్తతః॥
ఇచ్ఛాశరీరో దుర్జయో రోషదోషమహాశ్రయః ।
హృదయాన్నిర్గత సోథ వాసనావ్య సనాత్మక॥
బహిఃస్థలం సమాలమ్బ్య హ్యుపత స్థా యషధ్వజః ।
అనుయాతోథ హృద్యేన మిత్రేణ మధునా స్మరఽ॥
సహకారతరోర్దృష్ట్వా మృదుమారుల నిర్థుతమ్ ।
స్తబకం మదనో రమ్యం హరవక్షసి సత్వరమ్॥
ముమోచ మోహన నామ మార్గణం మకరధ్వజః ।
శివస్య హృదయే శుద్దే నాశ శాలీ మహాశరః॥
పపాత పరుషః ప్రాంశుః పుష్పబాణా విమోహనః ।
తతః కరణసన్దేహో విద్దస్తు హృదయే భవః॥
బభూవ భూధరాకమ్ప్యధైర్యోపి మదనోన్ముఖః ।
తతః ప్రభుత్వాద్భావానాం సంక్షోభం సమపద్యత॥
బాహ్యం బహు సమాసాద్య ప్రత్యూహప్రసవాత్మకమ్ ।
క్రమముగ మన్మథుడు మెల్లగ దగ్గరకు రాగా రాగా అతనికి శంకరుడు కనబడెను॥ విప్పారినతామర పూ రేకులవంటి కనులు మూసికొని సూటియగు స్థానమున స్థిరముగ నాసాగ్రమునందు కన్నులు నిలిపి చూచుచు॥అతి మనోహరమయి సింహచర్మముతో పాటు వేలాడు ఉత్తరీయమునుదాల్చి చెవులయందలి సర్పముల నోళులనుండి విడువ బడు ఊర్పు వాయువులచే పచ్చనై చెక్కిళ్ళవరకు సొర పిందెలవంటి జడలు వ్రేలాడుచు॥వాసుకి సర్పమును మొలత్రాడుగా చుట్టుకొని నాభి మూలమున ముడిగా అమర్చుకొని యున్న ఆ శివుని మన్మథుడు చూచెను॥ క్రిందికి వంగిన చెట్లుగల సానువులయందు వ్యాపించిన తుమ్మెదల ఝుంకారమునందు ప్రవేశించి మన్మథుడు చెవి రంధ్రపు మార్గమున శివుని మనస్సును ప్రవేశించెను॥ మన్మథునితో వ్యా ప్తమయిన ఆ ధ్వనిచే శివుడు తన మనస్సు రంజితము కాగా పార్వతిని తలచెను॥ ఆమె అతని ప్రీతికి పాత్రురాలు; అతి నిర్మలయగు ఆ పార్వతియు అంత వరకు అంతరిత అయియుండియు శివుడు స్మరించగనే సమాధి భావనయందు కనవచ్చు ప్రత్యక్ష రూపము కలదై నిలిచెను॥ విఘ్నముచేత తన హృదయము దెబ్బ తినగా శివుడు పార్వతితో తన్మయ భావననందియు ఇంద్రియనిగ్రహము కలవాడు కావున ఇది మదనునిచే కలిగిన మనోవికార మనీ ఎరిగేను॥ కొంచెము కోపమందెను॥ ధైర్యము నవలంబించేను॥ తన మనమున మదనుని ఉనికిని తొలగించుకొనగోరి దూరటి యోగమాయను (శ కి త్రయాత్మికయగు శ్రీదేవిని) తనయందు స్యోపింపజేసికొనెను॥ అంతట మదనుడు ఆ యోగమాయావ్యాప్తిచే మండెను॥ (ఆ మంటతో బాధనందియు) వాడు కామరూపుడును సుకర ముగ జయింపరాని వాడును రోషాది మహాదోషములకు ఆశ్రయుడును కావున వాసనా (చిత్త సంస్కార) జనిత వ్యసన రూపుడై శివ హృదయమునుండి వెలికి వచ్చెను॥ బహిఃస్థలమాశ్రయించి నిలిచెను॥ వాని వెంట మనోహరుడగు వసంతుడునుండెను॥ వాని ప్రభావమున తీయ మామిడి చెట్టునందు మంద మారుత చలితమగు - మామిడి పూగుత్తి మదను నకు కనబడెను॥ సత్వరముగా మకరధ్వజుడు మోహనమును బాణమును ధనువున సంధించి హరుని వక్షమున ఆ చూత కుసుమ స్తబక భావితమగు ఆ శరమును వదలెను॥ సులభముగ నశించు లక్షణముగల ఆ మహాశరము శివుని శుద హృదయమున పడెను॥ అది పరుషమును దీర్ఘమును మిగుల మోహకళ కి కలదియు; కావున శివుడు ఆ దెబ్బ తిని నంతనే తాను సహజముగ పర్వతమువలె అచలమగు ధైర్యము కలవాడయినను ఇంద్రియనిగ్రహము కోల్పోయి మదన పరవశుడయ్యెను॥ బహిఃప్రపంచమునందలి విఘ్న జనక సామగ్ర రూపమగు ఆయా రాగ భావముల ప్రభావమే అధికమగుటచే శివుని చిత్తమున సంక్షోభము కలిగెను॥
ధూర్జటిపాలస్థనేత్రవహ్ని నా మదనభస్మీకరణమ్॥
తతః కోపానలో ద్భూత ఘోరహుకారభీషణే॥
బభూవ వదనే నేత్రం తృతీయం దహనాకులమ్ ।
రుద్రస్య రౌద్రవపుషో జగత్సంహార భైరవమ్॥
తద శ్రికస్థే మదనే వ్యస్సారయత ధూర్జటిః ।
తేన నేత్రస్ఫులిజ్గేన క్రోశ తాం నాకవాసినామ్॥
గమితో భస్మసాత్తూర్ణం కన్దర్పః కామిదర్పదః ।
స తు తం భస్మసాతృత్వా హర నేత్రోద్భవోనలః॥
వ్య జృమ్బత జగద్దగుం జ్వాలాసజ్ఞాతఘస్మరః ।
తతో భవో జగద్దెతో ర్వ్యభ జజ్జాతవేదసమ్॥
సహకారే మధౌ చనే సుమనస్సు పరేష్వపి ।
భృజేషు కోకిలా న్యేషు విభాగేన స్మరానలమ్॥
స బాహ్యా న్తర విధేన హరేణ స్మరమార్గణః ।
రాగ స్నేహసమిద్దానర్ధావం స్త్రీవహుతాశనః॥
వీభక్తలోకసజ్జాభకరో దుర్వార జృమ్బితః ।
సమాప్త స్నేహసమ్పృక్తం కామినాం హృదయం కీల॥
జ్వలత్యహర్నిశం భీమో దుశ్చికిత్స్యం సుఖాత్మకమ్ ।
విలోక్యహరహుజార జ్వాలాభస్మీకృతం న్మరమ్॥
విలలాప రతిః క్రూరం బన్దునా మధునా సహ ।
తతో విలప్య బహుశా మధునా పరిసా న్వితా॥
జగామ శరణం దేవమినుమౌళిం త్రిలోచనమ్ ।
భృజ్గానుయాతాం సజృహ్య పుష్పితాం సహకార జామ్॥
లతాం పవితకస్థానే పాణా పర భృతాం సలీమ్ ।
నిర్వర్యతు జటాజూటం కుటిలై రల కై రతికి॥
ఉద్దూశ్య గాత్రం శుభ్రేణ హృద్యేన స్మరభస్మ నా ।
జానుభ్యామవనిం గత్వా ప్రో వాచేందువి భూషణమ్॥
ఆంతట రౌద్ర శరీరుడగు రుద్రుని కోపాగ్ని సంజనిత ఘోరహుంకార భయానకమగు ముఖమునందలి తృతీయ నేత్రము జగత్రళయ భయంకరమయి అగ్ని వ్యాప్తమయ్యెను॥ ఆ యగ్నిని ధూర్జటి తన సమీపస్థుడగు మదనునియందు వ్యాప్త మొనర్చెను॥ నాక వాసులు దేవతలు గగ్గోలు పెట్టుచున్న ను లెక్కింపక ఆ నేత్రాగ్ని కణరాశి కాముకులకు మదన పారవశ్యము కలిగించు కందర్పుని కడు శీఘ్రముగా భస్మీభూతుని జే నెను॥ కాని ఆ అగ్ని మదనదహనానంతరము జగముల దహింప విజృంభించెను॥ జ్వాలా సమూహములతో లోకములను తిని పొట్ట నింపుకోన ఆ తపడుచున్న ఆ అగ్ని నీ శివుడు లోకానుగ్రహార్థమై తీయమామిడి చెట్టు॥వసంత ఋతువు॥ చంద్రుడు॥మంచి పూవులు - తుమ్మెదలు కోకిలలు ॥ వీని యందు పంచేను॥ ఇది మన్మథుడు శివుని పై ప్రయోగించగా శివుని అంతః కరణమునందు ఆ దేవుని బహిరంగముల యందును వ్యాపించి విజృంభించి ఆగ్ని రూపమునంది శివ నేత్రాగ్ని సంపర్కమున తీవహుతాశ ను డైనందున మన్మథ సంబంధమున అనురాగ స్నేహముల బలమున ప్రజ్వలించును॥ అందున కే అది ఇట్లు ఈ పదార్థములయందు విభజింప బడియు వారింప శక్యము కాక విజృంభించి లోకమునందలి ప్రాణుల హృదయములకు సంక్షోభము కలిగించు చుండెను॥ కాముకులగు స్త్రీ పురుషుల హృదయములందలి స్నేహానురాగములనేడునూనేతో తడిసి ఇంక ను అది జ్వలించి సుఖాత్మక ముగా కనబడుచు లోకములను బోధించుచున్నది॥ ఈ కామాగ్ని భయంకరమయినది; చికిత్స చేయనలవి కానిది॥॥
ఇది ఇట్లుండ - మదనుని పత్ని రతి తన పతి హర హుంకార జనిత జ్వాలలచే భస్మీకృతుడగుట చూచి తన సోదరుడగు వసంతుని శోకూడ క్రూరముగా విలపించెను॥ వసంతుడు ఓదార్చిన మీదట ఆమె చంద్రమౌశియగు త్రిలోచనుని శరణు వేడెను॥ తుమ్మెదలు వేంటనంటుచున్న పూచిన మామిడి రెమ్మను దర్భపవిత్రముగా చేత ధరంచి ఆడు కోకిల తన చెలిక తైగా తన వంక ముంగురులనే జటాజూటముగా అమర్చికొని హృద్యమై తెల్లనిదగు తన పతి భస్మమునే భూతిగా ధరించి మోకాళ్లను నేలకు ఆనించి ఇట్టి శివ సేవా దీక్షా నియమములతో) రతి శివునితో ఇట్లు పలుకుచు ఆ దేవుని సుతించెను॥
రతీదేవికృత వస్తుతి
రతిః : ఓం నమశ్శివాయాస్తు నిరామయాయ నమశ్శివాయాస్తు మనోమయాయ ।
నమశ్శివాయాస్తు సురార్చితాయ తుభ్యం సదా భక్షకృపాపరాయ॥
నమో భవాయాస్తు భవోద్భవాయ నమోఽస్తు తే ధ్వస్తమనోభవాయ ।
నమోస్తు తే గూఢమహావతాయ నమస్స్వమాయాగహనాశ్రయాయ॥
నమోస్తు శర్వాయ నమశ్శివాయ నమోస్తు సిద్ధాయ పురా న్తకాయ ।
నమోస్తు కాలాయ నమః కలాయ నమోస్తుతే జ్ఞానవరప్రదాయ॥
నమోస్తుతే కాలక లాతిగాయ నమో నిసర్గామలభూషణాయ ।
నమ స్వమేయానకమర్ధనాయ నమశ్శరణ్యాయ నమోగుణాయ॥
నమోస్తుతే భీమగుణానుగాయ నమోస్తు నానాభువనాదిక ।
నమోస్తు నానాజగతాం విధాత్రే నమోస్తు తే చిత్రఫలప్రయో కే॥
సర్వావసానే వ్యవినాశినే తే నమోస్తు చిత్రాధ్వర భాగబో క్రే ।
నమోస్తు కర్మప్రభవస్య ధాత్రే నమస్సదా తే భవసజహర్రే॥
అనన్తరూపాయ సదైవ తుభ్యమమేయమానాయ నమోస్తు తుభ్యమ్ ।
శశాఙ్కచిహ్నాయ నమోస్తు తుభ్యమమేయమానాయ నమోస్తు తుభ్యమ్॥
వృ షేన్గయా నాయ పురా న్తకాయ నమః ప్రసిద్దాయ మహౌషధాయ ।
నమోస్తు భక్తాభిమత ప్రదాయ నమోస్తు సర్వార్తిహరాయ తుభ్యమ్॥
చరాచరాచార విచారవర్యమాచార్యముతేక్షితభూతసర్గమ్ ।
త్వామిన్దుమౌళిం శరణం ప్రపన్నా ప్రియాప్రమేయం మహతాంమ హేశమ్॥
ప్రయచ్ఛ మే కామయతస్సమృద్ధిం పునః ప్రభో జీవతు కామదేవః ।
వైధవ్యహ రౌ భగవన్న మస్తే ప్రియం వినా త్వాం ప్రియజీవితేషు॥
త్వత్తేజపరః కో భువనేషింహా స్త్రీ ప్రభుః ప్రియాయాః ప్రభవః ప్రియాణామ్ ।
త్వమేవ చైకో భువనస్య నాథో దయాళురున్మూలితభక్తభీతిః॥
(ఓమ్)-లోకముల కెల్ల శాంతియగుగాక! ఏ దోషమును నాశమును లేనివాడును మనోమయుడును శుభకరుడును సురార్చితుడును భక్త కృపాపరుడునునగు భగవానునకు నమస్కారము॥ సంసార రూపుడు సంసార జనకుడు మన్మథ నాశకుడు రహస్య మహా వ్రతముల నాచరించువాడు స్వమాయకు గూఢముగా ఆశ్రయ భూతుడు అగు దేవునకు నమస్సు॥ దుష్ట హింసకుడు సిద్ధుడు త్రిపురాంతకరుడు కాలరూపుడు కొల ! పేరకుడు జ్ఞాన వర ప్రదుడునగు మహా దేవునకు నమస్కా రము॥ కోలావయవములకు అతీతుడు స్వస్వరూపమనేడు నిర్మల భూషణముకలవాడు అమేయుడు అంధకాసుర నాశ కుడు శరణ్యుడు నిర్గుణుడునగు పర మేశునకు నమస్కారము॥ భయంకర గుణములు తన వెంటనుండు వాడు నా భువనముల కును ఆదికర్త నాసా జగన్నిర్మాత చిత్ర వివిధ) ఫలదాతయగు శివునకు వందనము॥ సర్వావసానమునందుకూడ నశిం చని నేత్రములు కలవాడు నానావిధ యజ్ఞ భాగ భోక్త కర్మ సంజనిత ఫల నిర్మాత సంసార సంబంధ నాశకుడు అగు మహా దేవునకు ప్రణామము॥ అనంత రూపుడు అసహ్యకోపుడు చంద్ర చిహ్నడు అమేయమగు కొలత కలవాడు అగు నీకు నమస్సు॥ వృషభేంద్ర వాహనుడు పురాంతకరుడు ప్రసిద్దుడు మహౌషధ రూపుడు భక్తాభిమత ప్రదుడు సర్వార్తి హరుడు నగు నీకు నమస్సు; చరాచర జగమండలి సకల ప్రాణుల॥సకల పదార్థముల నడువడిని ఎరుగు వారిలో శ్రేష్ఠుడు ఆచార్య (గురు) రూపుడు సంకల్పమాత్రమున భూతసృష్టి యొనర్చువాడు చంద్రమౌళి సర్వప్రియుడు అప్రమేయుడు గొప్పవారిలో గొప్పవాడు మహేశుడునగు నిన్ను శరణు పొందితిని॥ ప్రభో! కామునకు (నా పతికి) కీర్తి సమృద్ది నిమ్ము॥ కామ దేవుని మరల బ్రదికింపుము॥ ప్రియ జీవితమును కరుణతో ఇచ్చుటకు సర్వప్రాణి ప్రియమగు ఆత్మ రూపుడవగు నీవు తప్ప ఈ భువనములందు మరెవ్వరు కలరు ? మదన ప్రియ యగు నాకు ప్రభువును ప్రియముల నొసగువాడును పరా పరార్థము ల నిర్మించి భక్తుల కోసగువాడును సర్వ భువన నాధుడును దయాపరుడును భక్తభీతి నాశ కుడును నగువాడు నీవు తప్ప మరి ఎవ్వరును లేరు॥
సూతః : ఇత్తం స్తుత శ్శజ్కర ఈశ ఈశో వృషాకపి ర్మన్మథ నయా తు ।
తుతోష దోషాకరఖడ్గధారీ హ్యువాచ వై నాం మధురం నిరీక్ష్య॥
శఙ్కరః : *తే భవిష్యతి కామోఒయం మదనో లోకవి శ్రుతః ।
అనంగోలోక విఖ్యాతః ఖ్యాతిం సుత్తి: గమిష్యతి॥
సూతః : ఇత్యుక్తా శిరసా వన్ద్య గిరీశం కామవల్లభా ।
జగా మోపవనం రమ్యం రతిస్తుహినభూభృతః॥
రురో దార్తాచ బహుశా దీనా రమ్యస్థలేతు సా ।
మరణవ్యవసాయాత్తు నివృత్తి గిరిశాజ్ఞయా॥
అథ నారదవా కేశన చోదితో హిమభూధరః ।
కృతాభరణసంస్కారాఅం కృతకౌతుకమజ్ఞశామ్॥
స్వర్గపుష్పకృతాపీడాం శుభచీనాంశు కాచితామ్ ।
సఖీభ్యాం సంయుతాం శై లో గృహీత్వా తనయాం తతః॥
జగామ శుభయోగేన తదా సమ్పూర్ణమానసః ।
రతీహిమవత్సంవాదః॥
స కాననాన్య తిక్రమ్య వనాన్యుపవనానిచ॥
దదర్శ రుదతీం నారీమప్రతర్యమహౌజసమ్ ।
రూ పేణసదృశీం లో కే *రమ్యాం సుర మనోహరామ్॥
కౌతు కేన పరామృశ్య తాం దృష్ట్వా రుదతీంగిరిః ।
ఉపసర్ప్య తత స్తస్యా నికటం సో2థ పృచ్ఛత॥
హిమవాన్ : కాసి కస్యాసి కల్యాణి కీమర్థం త్వం చ రోదిషి ।
నై తదల్పం మహాస త్వే కారణం లోక సున్దరి॥
సూతః : సా తస్య వచనం శ్రుత్వా ప్రోవాచ మధునా సహ ।
రుదతీ శోక జననం శ్వసతీ దైన్యవర్గ నమ్॥
రతిః : కామన్య దయితాం భార్యాం రతిం మాం విద్ధి సువత ।
గిరావసి న భగవాన్దిరీశ స్తపసి స్థితః॥
తేన ప్రత్యూహరుషేన విస్ఫార్యాసలలోచనమ్ ।
*విముచ్యాగ్ని శిఖాజ్వాలాం కామో భస్మావ శేషితః॥
అహంతు శరణం యాతా తం దేవం భయవిహ్వలా ।
స్తుతవత్యథ సంస్తుత్యా తతో మాం గిరిశోబ్రవీత్॥
(*భవిచేతిత కామోయం కాలాత్కాంతోచిరాదపి॥)
(*రమ్యేషు వనసానుషు)
(*దగోసౌజుషకేతుస్తుమమకాంతోతివల్లభః)
మన్మథుని పత్ని ఇట్లు స్తుతించగా శంకరుడు సుఖము కలిగించువాడు వృషాకపి (ధర్మరక్షకుడు) చంద్ర ఖండ ధారియగు ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను అనుగ్రహపు చూపుచూచి ఇట్లు పలికెను॥ “పుత్త్రీః! నీవు కోరినట్లే ఈ మగ నుడు అనంగుడు (శరీరము లేనివాడు) అని లోక ప్రసిద్దినందును॥" ఆనగా కాముని ప్రియురాలు రతి శిరసు వంచి గిరీశుడగు శివుని నమస్కరించి హిమ వంతమునందలి రమ్యమగు ఉపవనమునకు పోయేను॥ అచట ఆమే శివుని ఆజ్ఞ ననుసరించి మరణ ప్రయత్నమునుండి వీర మించెనేకానీ ఆర్తురాలయి ఒక రమ్య స్థలమున దీనభావముతో విలపించెను॥
తరువాత హిమవంతుడు నారదుని ప్రేరణచే తన తనయయగు పార్వతిని ఆభరణములలో అలంకరింప జేసి శుభ సమయోచిత శుభ సంస్కారములతో సంస్కరింపజేసి స్వర్గ మందలి (కల్పవృక్షపు పూవులను శిరస్సున అలంకరివ జేసి శుభమగు పట్టు వస్త్రము ధరింపజేసి ఇద్దరు సఖులామె వెంట వచ్చుచుండ శుభయోగము సమకూ రేనని నిండిన మనస్సుతో బయలుదేరి పోవుచుండెను॥ అతడట్లు కాననములను పసములను ఉప వనములను గడచి పోవుచుండ తోవలో నతనికి ఊహింపనలవి కాని మహాతేజస్సుకలది లోక మందెచ్చటను సాటిలేని రూపము కలది రమ్యరూపము కలది దేవతల మనస్సులనుకూడ హరించునది అగు శ్రీ ఏడ్చుచు కనబడెను॥ హిమవంతుడా మేను ప్రీతితో పరామర్శించి ఆమే సమీపమున కేగి ఆమెను ఇట్లడిగెను॥ “కల్యాణీ! నీవు ఎవరవు? ఎవరిదానవు? నీవెందుల కై ఏడ్చుచున్నావు? గొప్ప నిబ్బ రము కల దానవును లో కేక సుందరియు అగు నీవు ఏడ్చుట కేదో గొప్ప కారణమే యుండునను కొందును॥” ఆనగా విని అంత వరకు వసంతునితో కూడి ఏడ్చుచుండిన ఆమె ఇంకను ఏడ్చుచు నిట్టూర్చుచు విను వారికి శోకమును జాలియు కలుగు నట్లు ఈ మాట పలి కెను: నన్ను మన్మథుని భార్యయగు రతిగా ఎరుగుము॥ ఈ గిరియందు భగవానుడు గిరీశుడు (శివుడు) తపమందున్నాడు॥ తనకు కలిగిన తపో విఘ్న మునకు కోపించి అతడు తన ఆగ్ని నేత్రము తెరచి అగ్ని శిఖాజ్వాలను వదలి కాముని భస్మావ శేషితునిగా జేసెను॥ నేను భయవిహ్వలనయి ఆ దేవుని శరణు జొచ్చి స్తుతించితిని॥ ఆ సంస్తుతి మెచ్చి శివుడిట్లు పలి కెను;
తుష్టాహం కామదయితే కామ స్తవ భవిష్యతి ।
స్తోత్రం తవాప్యధీయానో నరో భక్త్యా మదాశ్రయః॥
లప్స్యతే కాజైతం కామం నివర్త్య మరణా దతే ।
ప్రతీక్ష తీచ తద్వాక్యమాశా వేశాదిభిర్యహమ్॥
శరీరం పరిరక్షి ష్యే కంచితాలం మహామతే ।
ఇత్యు క్రస్తు తదా రత్యా శైలస్సమమభీషితః॥
పాణా వాదాయ దుహితాం గనుమైచ్ఛత్స్వకం పురమ్ ।
భావినోవశ్యభావిత్వాద్భవిత్రీ భూత భా వినీ॥
లజ్జమానా సఖిముఖే నోవాచ పితరం గిరిమ్ ।
పార్వతీహిమవతో స్తపో విషయక సంపాదః॥
శైలపుత్రీ : దుర్బగేన శరీ రేణ కిం మమానేన కారణమ్॥
కథంచ తాదృశం ప్రాప్తుం సుఖం మే స పతిర్భవేత్ ।
తపోభిః ప్రాప్యతేభీష్టం నాసాధ్యం తపస్యత॥
దుర్భగత్వం వృథా లోకో వహతే సతి సాధనే ।
తపసి భ్రష్ట సన్దేహ ఉద్య మో2థ జిగీషరూ॥
జీవితాద్దుర్భగాచ్చేయో మరణం హ్యతపస్యతః ।
సాహం తపః కరిష్యామి యదహం ప్రాప్య దుర్లభమ్॥
భవిష్యామి న సన్దేహో నియమైశ్శోషయే తనుమ్ ।
ఇత్యు కశైలరాజస్తు దుహితా స్నేహవిక్లబః॥
ఉవాచ వాచా శై లేన్హ గద్గద స్నేహవర్ణయా ।
హిమవాన్ : ఉ మాఋతి చపలే పుత్తి న క్షమం తావకం వపుః॥
సోడుం క్లేశాత్మరూపస్య తపససౌమ్యదర్శనే ।
భావిన్యప్యభిచర్యాణి పదార్థాని తవై ఏ తు॥
భావినోఒర్గా భవ న్యేవ హరేనానిచ్చతో ఒఏ హి ।
తస్మాన్న తపన తే స్త్రీ బాలే కీడ్చాత్సయోజనమ్॥
భవనాయైవ గచ్ఛామి చిన్తయిష్యామి తత్ర వై ।
ఇత్యుక్తాతు యదా నైవ గృహాయాభ్యోతి శైలజా॥
తతస్స చిన్తయావిష్ణో దుహితాం ప్రశంస సః ।
తతో నరిక్షే దివ్యా వాగభూర్భువనభూతయే॥
ఉమాతి చపలే పుత్తి త్వయోల్తా తనయా తదా ।
ఉమేతి నామ తేనాస్యా భువనేషు భవిష్యతి॥
సిద్దించ మూర్తిమత్యేషా సాధయిష్యతి చింతితామ్ ।
ఏతచ్ఛ్రుత్వా న వచనమాకాశాతాశపాణ్డురః॥
అనజ్ఞాయతు తాం శై లో జగామాశు స్వమన్దిరమ్ ।
“కాముని ప్రియురాలా! నేను తుష్టి చేందితిని॥ నీ ఈ కోరిక నెర వేరును॥ నీవు నన్ను ద్దేశించి చేసినస్తుతి భక్తితో అధ్యయనము చేసి నన్ను శరణు జొచ్చిన నరుడు తాను కోరిన కోరికల నీ డేర్చుకొనును; ఇటువంటి దుర్మరణమును పొందడు॥"
నేను ఆశా బలముతో ఆ శివుని వాక్యపు ఫలమును ఎదురు చూచుచు ఓ మహా తేజశ్శాలీ: కొంత కాలము ప్రతీక్షం తును॥ అని రతి పలి కెను॥ ఈ మాటవిని హిమాచలుడు సంభ్రమమును భయమును చెంది తన కూతురగు పార్వతిని చేత గ్రహించి తన పుర మునకు తిరిగిపోదల చెను॥ భవితవ్యము అవశ్యభావి కావున భూతభవత్ (వర్తమాన) భావి సంఘటనము॥ లకు హేతు భూతురాలగు శ క్త్యాత్మిక పార్వతి బిడియ పడుచు తన తండ్రితో ఇట్లనెను: తండ్రీ! దుర్భగమగు (ప్రియ ప్రీతి పాత్రముకాని) ఈ శరీరముతో ప్రయోజనమేమి? ఆట్టి అనిర్వచనీయ సుఖము లభించుట కనుకూలముగా ఆట్టి పతి ఎట్లు లభించును? తపస్సుచే అభీష్టము లభించును॥ ఏలయన తపమాచరించు వానికి సాధ్యము కాని దేదియులేదు॥ లోకము (నందలి జనము) సాధనములు ఉండియు దుర్భగమగు చున్నది॥ దేవతానుగ్రహమును సాధించలేక పోవుచున్న ది॥) తపస్సువలన సాధ్యముకాని దేదియు లేదను నిశ్చయముతో భ్రష్ట సం దేహు డై జిగీషతో (కార్యసాధన సంకల్పముతో) ఉద్యమమునకు పూనవలయును॥ తపస్సు చేయక దురదృష్టవంతమగు జీవితము గడపుటకంటె మరణమే మేలు॥ కావున తపస్సాచరింతును॥ ఏలయన నేను దుర్లభమగు దానినిగూడ పొంది తీరుదును॥ ఏ మాత్రమునందు సందేహము లేదు॥ నియమములతో నా తనువు నెండింపజేసికొందును॥ అని పార్వతి పలుక గా శైలరాజు పు శ్రీ స్నేహముతో వివశుడై డగ్గుత్తి కచే స్నేహ పూర్ణముగా వినబడు వర్ణములుండునట్లు ఇట్లు పలికెను॥ ఉమా (అమ్మాయీ! వద్దు; పుత్రీ! నీవు అతి చపలు రాలవు; (మనస్సులోనికి వచ్చిన ఆలోచనములను వెంటనే ఆచరించవలెనని త్వరపడెదవు॥ నీవు సౌమ్యదర్శనవు సుకుమార రూపవు; క్లేశ ప్రధాన క్రియాసాధ్యమగు తపః శ్రమను నీ తనువు సహించ జాలదు; నీ విషయములో ఏవేవి జరుగవలసి యున్నవో అవి తప్పక జరిగి తీరును: మనకు ఇష్టమున్న ను లేకున్న ను భవితవ్య విషయములు సంభవించియే తీరును; కావున బాలా! (అమాయికురాలా!) తపస్సువలన నీకు వేరుగకలుగు ప్రయోజనము ఏమియు లేదు॥ నేనిపు డింటికీ పోవుదును॥ అక్కడనే యాలోచించును॥ ఆని ఇట్లు తండ్రి ఎంత చెప్పినను శైలజ ఇంటికి రానిష్టపడ లేదు; రాలేదు॥ అనంతరము హిమవంతుడు ఈ పుత్తి పట్టుదలకు చింతావిష్ణుడయ్యును తుదకు ఆమెను ప్రశంసించెను॥ అనంతరము అంతరిక్షమునుండి భువన శుభకరమగు ఈమాట వినబడేమ॥ అతి చపలవగు పుత్రీ! వద్దు (ఉమా) అంటీవి కావున ఈమే నామము భువనములందు 'ఉమా' అని ప్రసిద్ధమగును॥ ఇంతేకాదు; మూర్తీభవించిన సిద్ది రూప యగు ఈమె తన చింతనమును సిద్ధింపజేసికొనును॥ అను ఈ ఆంతరిక్ష వచనమును విని రెల్లు పూవువలె తెల్లని ఆ హిమవంతుడు ఆమెను తపమాచరింప ననుమతించి త్వరితముగా స్వగృహమున కేగెను॥
హిమవద్గిరౌ పార్వతీతపశ్చరణమ్॥
సూతః : శైలజా ప్రయయౌ శైలమగమ్యమపి దైవతైః॥
సఖీ భామనుయాతా తు నియతా నగరాజజా ।
శృజం హిమవతః పుణ్యం నానాధాతువిభూషితమ్॥
దివ్యపుష్పలతాకీర్ణం సిద్ధగన్ధర్వ సేవితమ్ ।
నానామృగగణాకీర్ణం భ్రమరైర్జుష్టపాదపమ్॥
దివ్యప్రస్రవణ్ పేతం దీరి కాభిర లజ్కృతమ్ ।
నానావృక్షిగణాకీర్ణం చక్రవాకోపశోభితమ్॥
జలజైస్థ్సలజైః పుష్పైః ప్రోత్ఫుల్లెరుపశోభితమ్ ।
చిత్రకన్జర సంస్థానం గుహాగృహమనోరమమ్॥
విహజసజసంఘుష్టం కల్పపాదపసజ్కులమ్ ।
తత్రాపశ్యన్మహాశాఖం శాఖనం హరితచ్ఛదమ్॥
సర్వర్తుకుసుమో పేతం మనోరథశతోజ్జ్వలమ్ ।
నానాపుష్పసమాకీర్ణం నానావిధఫలాచితమ్॥
తతం సూర్యస్య రుచిభిర్భిన్న సంహతపల్లవమ్ ।
తతామ్బరాణి సన్య జ్య భూషణానిచ శైలజా॥
సంవీతా వల్కలై ర్దివ్యైర్డర్భనిర్మితమేఖలా ।
త్రిస్స్నాతా పాటలాకారా బభూవ శరదాం శతమ్॥
శతమే కేన శీర్దేన పర్లేనావర్తయ త్తదా ।
నిరాహారా శతం సాభూత్సమానాం తపసాం నిధిః॥
తత్రచోద్వేజితాస్సర్వే ప్రాణిన స్తపసోగ్ని నా ।
తతస్సస్మార భగవాన్మునీ నప్త శతక్రతుకి॥
దేవేన్ద పేరితస పరీణాం పార్వతీతపోవనగమనం తత్సంవాదశ్చ॥
తే సమాగమ్య మునయస్సర్వే సముదితా స్తతః ।
పూజితాశ్చ మ హేన్దేణ పప్రచ్ఛు స్తతయోజనమ్॥
కిమర్థం హి సురశ్రేష్ఠ సంస్మృతాస్తు వయం త్వయా ।
శక్రః ప్రోవాచ శృణ్వస్తు భగవన్తః ప్రయోజనమ్॥
స్రవద కవసాభ్య క్తకపాలకృతభూషణాత్ ।
శ్వసదుగభుజజేన్జకృతభూషణభీషణాత్॥
శ్మశానవాసినో రౌద్ర ప్రమథానుగతాత్సతి ।
సురేన్దముకుట వ్రాతనిఘృష్ణచరణోరిహా॥
హరిర స్త్రీ జగద్ధాతా శ్రీకాన్తో ఒన స్తమూర్తిమాక్ ।
నాధో యజ్ఞభుజామ స్తి తథేన్దః పాక శాసనః॥
దైవతానాం నిధిశా స్త్రీ జ్వలనస్సర్వకామకృత్ ।
వాయుర స్త్రీ జగద్ధాతా యఃప్రాణస్సర్వదేహినామ్॥
తథా వైశ్రవణో రాజా సర్వార్థసహితః ప్రభుః ।
ఏభ్య ఏకతమం కస్మాన్న త్వం సమాప్తు మిచ్ఛసి॥
ఉత్థానదేహసమాప్త్యా సుఖం తే మన సేప్సితమ్ ।
ఏవమేతత్తవాప్యత ప్రభావో నాకసమ్పదామ్॥
అస్మిన్డే హే పరేచాపి కల్యాణప్రాప్తయ స్తవ ।
పితు రేవా స్త్రీ తే సర్వం సురేభ్యో యన్న విద్యతే॥
ఆత సతాప్తయే క్లేశ స్తవావ్యతాఫల స్తవ ।
ప్రాయేణ ప్రార్థ్యతే హ్యత్రసుస్వలో హ్యతిదుర్లభః॥
అస్య తే విధియోగః స్యాద్ధాతా కర్తాత్ర చైవ హి ।
పుత్త్రీః: లోక ములందు ఆయా విషయములలో లభించు సుఖము రెండు విధములని పెద్దల భావన; ఒకటి దైహిక సుఖములవలన కలుగు తృప్తి; రెండవది కేవలము చిత్తమున కలుగు ఈ తృప్తి; నీవు పతిగా కోరు శివుడు ప్రకృతి (స్వభావము) చేతనే దిగంబరుడు; భీముడు {భయజ్కరుడు;) శ్మశానశాయి; కపాలము ధరించిన భిక్షుకుడు; దిస మొలవాడు; వికృతమగు (బేసి) కన్నులవాడు; స్థిర క్రియుడు (శాశ్వతములగు పనులు చేయువాడు; మొండిపట్టుతో పనులు చేయు వాడు); ప్రమత్తుల॥ఉన్మత్తుల ఆకారము కలవాడు; రోతగొలుపు సామగులను సేకరించుకొని యుండువాడు; భూతములకు ప్రభువు; అతని వలన నీకు తీరు కోరిక ఏమి? నీవు నీ ఈ శరీర సుఖమునే కోరుచుంటివనిన భయంకరుడు రోత గొలుపువాడు రక్తము కారుచు వసపూత కలిగిన కపాలములు ఆభరణములుగా ధరించిన వాడు బుసలుకొట్టు సర్పరాజములు భూషణములుగా దాల్చిన భయంకరుడు శ్మశానవాసి రౌద్రులగు ప్రమధులు తన అనుచరులుగా గలవాడు ఆగు ఈ మహాదేవుని వలన నీకు కలుగు సుఖ మేమున్నది?
దేవతల కిరీట సమూహముల ఒరపిడి తిను పాదపద్మములు కలవాడు శత్రునాశకుడు లోక నిర్మాత శ్రీకాంతుడు అనంతమూర్తిధరుడు అగు హరియున్నాడు; యజ్ఞ భోక్తలగు దేవతలకధిపతి పాకాసుర సంహారి అగు ఇంద్రుడున్నాడు: దేవతలకు నిధివంటివాడు సర్వకాలప్రదుడునగు అగ్ని ఉన్నాడు; లోకరక్షకుడు శరీర ధారులకు ప్రాణభూతుడు నగు వాయువున్నాడు, సర్వధనాధిపతియు ప్రభువు విశ్రవసుని పుత్రుడు రాజరాజునగు కుబేరుడున్నాడు; వీరియందుండి ఎవరినైన నీవు పతిగా పొందగోరరాదా? లేక ఒక వేళ మరియొక శరీరమున సుఖముల పొందగోరి తప మాచరించుచున్నావా? ఇంతేయగు నేని అట్లయినను నీవు తపమాచరింపనక్కర లేదు; ఏలయన ఇచ్చటనే ఈ దేహముతోనే నీ తండ్రి ఇంటనే నీకు స్వర్గ సంపత్ సుఖము లభించుచునే యున్నది; ఇచట నీకన్ని శుభ సుఖములును కలవు; దేవతల వలన కూడ లభించనిదెల్ల నీకు నీ తండ్రినుండియే లభించును; కావున నీవందుల కై తపమాచరించుచు శ్రమ పడుట కూడ వ్యర్థము; ఆది కాక కల్యాణీ! ఎంత స్వల్ప ఫల మేయైనను మనసు కావలెనని మీగుల కోరినది దుర్లభమయి దూరము పోవుట లోక సహజము; నీవిట్లు తపస్సాచరించుచు శ్రమపడుట విధియోగము; బ్రహ్మ నీకిట్లు విధించినాడు కాబోలును; అని మునులు పార్వతితో పలికిరి॥
సూతః : ఇత్యుక్తవత్సు కుపితా మునివర్యేషు శైలజా॥
ఉవాచ క్రోధర క్తాక్షీ స్పురద్భిర్దశనచ్ఛదైః ।
దేవీ : అసద్గహస్య కానీతి ర్వ్యసనస్య క్వ యంత్రణా॥
విపరీతార్థ బోద్ధారస్సత్పథే కేన యోజితాః ।
ఏవం మాం వేత్థ దుషజ్ఞాం హ్యస్థానాసద్గహప్రియామ్॥
న మాం ప్రతి విచారో స్త్రీ యతో ఒహం కామయే విభుమ్।
ప్రజాపతిసమాస్సర్వే భవనస్పర్వదర్శినః॥
నూనం న వేత్త తం దేవం జగతశ్శాశ్వతం ప్రభుమ్ ।
ఆజమీశానమవ్యక్తమమేయమహిమోదయమ్॥
ఆస్తానద్దర్మసద్భావసమ్బోధస్తావదద్భుతః ।
విదుర్యం న హరిబ్రహ్మ ప్రముఖ హి సురేశ్వరా॥
య త్తత్సర్వం భవాత్వోత్తం భువనేషు విజృమితమ్ ।
ప్రకటం సర్వభూతానాం తదప్యత నవేత్త కిమ్॥
కస్యైతద్దగనం మూర్తి కన్యాగ్నిః కస్య మారుతః ।
తస్య భూః కస్యవసవః కశ్చన్గారవిలోచనః॥
కస్యార్చయ స్తి లో కేషు లిజం భక్త్యా సురాసురాః ।
యం బ్రువ నీశ్వరం దేవా *విష్ణ్వింద్రాద్యా మహర్షయః॥
భావం ప్రభవం చైవ తేషామపి న వేత్త కిమ్ ।
అదితిః కస్య మా తేయం కస్మా జ్ఞాతో జనార్దనః॥
అదితేః కశ్యపాజ్జాతా దేవా నారాయణాదయః ।
మరీచేః కశ్యపః పుత్లహ్యదితిర్గక్షపుత్రికా॥
మరీచిశ్చాపి దక్షశ్చ సురౌతు బ్రహ్మణః కిల ।
బ్రహ్మా హిరణ్మయా త్వజ్ఞాద్దివ్య సిద్ధివిభూషితాత్॥
కస్య ప్రాదురభూద్ద్యా నాతముజ్జాః ప్రాకృతాంశ కాః ।
ప్రకృతౌతు తృతీయాయామధుద్విడ్జనన క్రియా॥
జాతస్ససర్జ షడ్వర్గాన్బుద్దిపూర్వాం త్స్వకర్మజాక్ ।
అనజః కో భవేద్వేధా బ్రహ్మణ్వ్య క్తజన్మనః॥
యస్సయోగేన సక్షోభ్య ప్రాకృతం కృతవానిదమ్।
బ్రహ్మణసిద్ధిసర్వార్థ మైశ్వర్యం లోకకర్తృతామ్॥
(*విధీంద్రాధ్యా మహర్షయః॥)
మునివర్యులు ఇట్లు పలికినది విని శైలజ కుపితురాలయి క్రోధర క నేత్రముతో కంపించు పెదవులతో ఇట్లు పలికెను॥ “ఆలోచనలతో నడుచువానికి నీతిఏమున్నది? వ్యసనపరునకు ఆదుపు ఏమున్నది? మంచిని చెడుగుగా చెడుగును మంచిగా ఆలోచించు వానిని మంచి త్రోవలో పెట్టువా రెవ్వరున్నారు? మీరు ఈ విధముగా నన్ను ప్రజ్ఞాహీను రాలనుగా తగని స్థానమున తగని విధముగా ప్రీతి కలిగియున్న దాననుగా తలచుచున్నా రుగదా! నా విషయమున మీరు సరిగా విచారణ చేయుటలేదు॥ నేను ఇట్లు మాటాడుట అహంకారము చే అని మీరనుకొనవచ్చును; ఏమనిన మీరందరును ప్రజాపతులతో సమానులు; సర్వజ్ఞులు కూడ; ఐనను మీరు ఆ (మహా) దేవుని నరిగా ఎరిగినట్లు లేదు; అతడు శాశ్వతుడు జగత్ర్పభువు అజుడు పుట్టుక లేనివాడు); ఈశానుడు (సర్వమునకు నియంత) అవ్యక్తుడు (స్పష్ట రూపము లేనివాడు) అమేయ (ఎరుగరాని) మహిమ సమృద్ధిక లవాడు; ఆది అట్లుండనిండు; ఆతడు ప్రతిష్ఠించిన ధర్మపు ఉనికిని సరిగా ఎరుగుటకూడ ఆశ్చర్యకరమగు విషయమే; హరి బ్రహ్మాది సురేశ్వరులును అతనినెరుగజాలరు; ఆ మహానుభావుని విభు త్వము వలన స్వయముగనే జనించినదై లోక ములయందు విజృంభించి ప్రకటమైయున్న మహామహిమను కూడ మీ రెరుగ మోక దా! గగనము వాయువు భూమి వరుణుడు (జలములు) అతని మూ ర్తియేక దా! చంద్రసూర్యు లాతని కన్నులు కదా! సురాసురులును భక్తితో అతని లింగ చిహ్నమును ఆర్చించుచున్నా రే! బ్రహ్మేంద్రాది దేవతలును మహర్షులును అతనిని సార్థకమగు ఈశ్వర నామముతో పిలుతురుగదా! ఆ శివమూర్తుల ప్రభావమును పుట్టుక ను కూడ మీరు ఎరుగ నట్లున్నది; ఈ అదితి ఎవరిమాత? జనార్ధను డేవరినుండి జనించెను? నారాయణాది దేవతలు అదితికశ్యపులకు జనించిరి॥ మరీచి పుత్రుడు కశ్యపుడు; దక్షుని పుత్రి ఆదితి; ఈ మరీచి దక్షులిరువురును బ్రహ్మ పుత్తలు; దివ్యసిద్ధి విభూషిత మగు హిరణ్మయాండమునుండిక దా బ్రహ్మ జనించేను? ప్రకృత్యంశ ములన్నియు ఆ ఈశ్వరుని ధ్యానము (సంకల్పము) వలననే కదా ప్రక్షోభము (ప్రథమ స్పందము) నంది సృష్టి ప్రాదుర్భవించేను! మూల ప్రకృతినుండి మూడవదియగు (1॥ ప్రకృతి॥2॥మహత్॥3॥ అహంకారము) ఆహంకార తత్వమునందుండి నిష్పన్న మయిన పద్మమునుండి 'లోక జన వ్యాపారము ( ఆ ఈశ్వరునినుండియే) కలిగెను గదా! ఇట్లు ప్రాదుర్భవించిన మూల ప్రకృతి ఆయా జీవుల కామ-కర్మ కృతములయిన షడ్వర్గములను (జాయతే-ఆ స్త్రీ-విపరిణము నే-వర్ష తే॥ఆపక్షీయతే నశ్యతి అను షడ్భావ - వికారములతో కూడిన ప్రాణి సృష్టిని సృష్టించేను కదా! అజాతకుడు (పుట్టుక లేనివాడు) అనబడు బ్రహ్మకూడ ఆవ్యక తత్వమునకును జన్మకారణమగు పరబ్రహ్మ రూపుడగు ఈశ్వరునినుండియే కదా జనించెను? తన ధ్యాన (సంకల్ప బలమున ఈశ్వరుడే మూల ప్రకృతియందు క్షోభము (స్పందము) కలిగించి ఇదియంతయు సృష్టించి బ్రహ్మయు సర్వార్థసిద్దినంది॥ సృష్టికి ఈశ్వరుడై (సమర్థుడై) లోక కర్తయగునట్లు చేసెను!
విదుర్విష్ణ్వాదయో యచ్చ స్వమహిమ్నా సదైవ హి ।
కృత్వాన్యం దేహమ న్యాదృకొదృకృత్వా పునర్హ రిః॥
కురుతే జగతః కృత్యముత్తమాధమమధ్యమమ్ ।
ఏవమేవహి సంసారో యో జన్మమరణాత్మకః॥
కర్మణశ్చ ఫలం హ్యేతన్నా నారూపసముద్భవమ్ ।
అథ నారాయణో దేవస్వం చ్చాయాం సమాశ్రయత్॥
తతేరితః ప్రకురుతే జన్మ నానాప్రకారకమ్ ।
సాపి కర్మణ ఏవోల్తా పేరణావివశాత్మనామ్॥
యథోన్మాదాదిదుష్టస్య మతి రేవహి సా భవేత్ ।
ఇష్టాన్యేవ యథార్థాని విపరీతాని మన్యతే॥
లోకస్య వ్యవహారేషు స్పషేషుహసతేసదా।
ధర్మాధర్మఫలావాబ్రీ విష్ణు రేవ నిబోధితః॥
అథా నాదిత్వమస్యా ప్తి సామాన్యాత్తు తరాత్మనా ।
నహ్యస్య జీవితం దీర్ఘం దృష్టం దే హేతు కుత్రచిత్॥
భవద్భిర్యస్య నో దృష్టమ నరజమథాపివా ।
దేహినాం ధర్మ ఏవైష క్వచిజ్జయేత్క్వచిన్మియేత్॥
క్వచిద్దర్భగతో నశ్యత్కచిట్టీవేజ్జరామయః ।
క్వచిత్సమాశ్శతం జీవేత్క్వచిద్బాల్యే విపద్యతే॥
శతాయుః పురుషో యస్తు సోన నస్స్వల్పజన్మనః ।
జీవితో యో న ప్రియతే తస్మాత్సోమర ఉచ్యతే॥
అదృష్ట జన్మ నిధనా హ్యేవం విష్ణ్వాదయో మతాః ।
ఏతత్సంశుద్దమైశ్వర్యం సంసారే కో లభేదిహ॥
తత్త క్షయాదియోగాత్తు నానాశ్చర్యస్వరూపిణః ।
తస్మాద్విత్త సురా నర్వా న్మలినా కల్పభూతికాక్॥
నాహం భద్రాః కిలేచ్చామి ఋతే శర్వాత్పినాకినః ।
స్థితంచ తారతమ్యేన ప్రాణినాం పరమం త్విదమ్॥
ధీబలైశ్వర్యకార్యాప్రమాణం మహతాం మహత్ ।
యస్మాన్న క్విద పరం సర్వం యస్మాతవర్తతే॥
యస్యైశ్యర్యమనాద్య క్తం తమహం శరణం గతా ।
ఏష మే వ్యవసాయశ్చ దీర్ఘోతివిపరీతకః॥
యాత వా తిష్టతేవాథ మునయో మద్విధాయకాః ।
స్వమహిమ సంపన్ను డగు ఆ ఈశ్వరుని విష్ణ్వాది దేవతలును ఎరుగ యత్నించుచుందురుగదా! ఈశ్వర సంకల్పముననే విష్ణువు అసాధారణములగు అట్టి దేహముల (అవతారముల)ను ధరించి ఉత్తమ మధ్యమాధమభేదములుగల, లోక వ్యాపారముల నిర్వర్తించుచున్నా డుగదా! జన్మ మరణాత్మకమగు నంసారపు స్వరూపము ఇటువంటిది; ఇది॥ యంతయు॥ నానారూపములును నానా విధోద్భవములునుగల ఈ జగమంతయు॥ప్రాణుల కర్మఫల రూపమయినది; ఇది॥ ఇట్లుండ నారాయణుడును ఆ ఈశ్వరుని పేరణతోనే తన ఛాయయగు వైష్ణవ మాయాశ్రయముతో నానావిధ జన్మములను దాల్చును॥ వివశాత్ములయి విష్ణ్వాదులందరునుపొందు పేరణ కూడ ఉ న్మాదాది దోషదూషితులయిన వారి మతిప్రవృత్తి వంటిదే కాని వేరుకాదు॥ లోక మునందు జరుగు ప్రాణుల ఆయా వ్యవహారములనుచూచి ఈశ్వరుడు, తనలో తాను నవ్వుకొను చుండును॥ మానవులాచరించు ధర్మాధర్మములకు పుణ్యపాప ఫలములు లభించుటకు, ఈశ్వరాధీనుడై విష్ణువే హేతుభూతుడని శాస్త్రములు నిర్దేశించుచున్న వి॥ ఈ జీవునకు సామాన్య సిద్దానముగా ఆదిత్వము చెప్పబడెనే కాని ఈతడు ఏదేహమందును దీర్ఘకాలముండడు; అంతేకాదు; ఈ జీవుని అంతరంగము॥ (అంతఃకరణము) మీరుకాని మరెవ్వరు కాని చూచియుండ లేదు॥ ఒక చోట పుట్టుట మరి యొక చోట చచ్చుట అనునది దేహధారియగు జీవుని ధర్మము; అతడు ఒక చో గర్బ మందుండగనే మరి యొక చో వార్ధకమున ఇంకొక చోట వ్యాధి చేత వేరొక చోట నూరేండ్లు జీవించి ఇంకొక దేహమున బాల్యమున మరణించును॥ స్వల్ప కాలము జీవించు వాని కంటె నూరేండ్లు జీవించువాడు అనంత కాల జీవిగా కనబడును; (ఆట్లే సృష్టి కాలమంతయు) మరణించక జీవించియే యుండు వాడు ఆమరుడనబడు చున్నాడు; అల్ప కాల జీవులగు మానవులకు వారి దేవతల) మరణములు కనబడవు! ఆంతే; ఇట్లే విష్ణువు మొదల వారి చావుపుట్టుకలు సాధారణులు చూడలేకున్నా రు; (కావునవారిని వీరు అమరులని తలచుచున్నారు); (ఈశ్వరునికిగల ఇటువంటి జన్మ మరణాదులు బొత్తుగా లేని) ఈశ్వరత్వమును ఈ సంసారమును మరి ఎవ్వరు పొంద గలరు॥ అక్కడ ఈ ప్రపంచమున) జీవన మరణాదులు ఉండుటచే నానాశ్చర్య స్వరూపులు ఈ దేవతలందరును; కావున వీరందరును మలిన రూపులు; వీరి ఈశ్వరత్వము అల్పమయినది! పూజ్యులారా నేను శర్వుడు సర్వ ప్రాణి సంహారీ; శర్వుడనగా సర్వప్రాణులును నశించినను తాను మాత్రము నశించకుండు వాడనీ ఇచ్చట ఆర్థము॥) పినాక ధనుర్ధారియగు శివుని తప్పమ రెవ్వని నేని పతిగా కోరను! ఐశ్వర్యాది షడ్గుణములును ఇతరులగు దేవతలయందు తార తమ్యముతో (ఒకరి యం దేక్కువ - మరియొకరియందు తక్కువ ఉన్న వి; కాని ఈశ్వరుని యందు ఇది పరమమయి అత్యుత్కృష్టమయి) యున్నది; జ్ఞానబలైశ్వర్యాది లక్షణములు దేవునియందు మహత్తులలో మహత్ వరిమాణముననున్న వి; ఆతని కంటే మరి గోప్పది కాని ఇతరము కానిలేదు; సర్వమును ఆతని నుండి యే ప్రవర్తిల్లుచున్న ది॥ అతని ఈశ్వరత్వ మునకు ఆదియు అంతమును లేవు; అట్టి ఈశ్వరునే నేనాశ్రయించుచున్నాను॥ ఇదియే నా నిశ్చయముసు॥ నా ప్రయత్న మును; ఇది లోక విరుద్ధమయినదే కావచ్చును; నన్ను ఆయాకార్య ములందాజ్ఞాపించు యోగ్యతగల ఋషులారా! మీరిది విని సంతోషముతో) ఉన్న ను సరియే; (కోపించి) వెడలిపోయినను సరియే; (నానిశ్చయము మారునది కాదు॥) అని పార్వతి సపరులతోపలి కెను॥
సూతః : ఏవం నీశమ్య వచనం దేవ్యా మునివరా స్తదా॥
ఆనందాశ్రుపరీతాక్షాస్సస్వజుస్తాం తతస్సతీమ్ ।
ఊచుశ్చ పరమ ప్రీతాశైలజాం మధురం వచః॥
మునయః : అత్యద్భుతాఒస్యహో దేవి జ్ఞానమూర్తిరివామలా ।
ప్రసాదయసి నో భావం భవభావ పతి శయాత్॥
న తు విదో వయం తస్య దేవ స్యైశ్వర్యమద్భుతమ్ ।
నిశ్చయస్యాస్యదృఢతాం వేత్తుం వయమహాగతాః॥
అచిరాదేవ తన్వజి కామ స్తే స భవిష్యతి ।
క్వాదిత్యస్య ప్రభా యాతి రత్నేభ్యః క్వ ద్యుతిః పృథక్॥
కోర్థో వర్ణాళికావ్య క్తః కథం త్వం గిరిశం వినా ।
యామో నై కాభ్యుయేన తమభ్యర్ధయితుం వయమ్॥
అస్మాకమపి వై సోబర్థసుతరాం హృది వర్తతే ।
ఆత స్వమేవ సా బుద్దిర్యతో నీతి స్వ మేన హీ॥
అతో నిస్సంశయం కార్యం శఙ్కరోపి విధాస్యతి ।
సప్తర్షిణాం శఙ్కరతపోవనగమనమ్॥
ఇత్యుక్తాః పూజితా యాతా మునయో గిరికన్యయా॥
ప్రయయుగ్గిరిశం ద్రష్టుం ప్రస్థం హిమవతో మహత్ ।
గజ్గామ్బు ప్లావితాత్మానం పిజిబద్ద జటాసటమ్॥
భృజ్ఞానుయాతపాణిగ్ధమన్గార కుసుమ సజమ్ ।
సమాప్య తే గిరేః ప్రస్థం దదృశుశ్శజ్కరాశ్రమమ్॥
ప్రశాస్త్రా శేషసత్త్వాఘం నవ స్తిమిత కాననమ్ ।
నిశ్శబ్దాభసలిలప్రపాతం సర్వతోదిశమ్॥
తత్రాపశ్యం స్తతో ద్వారి వీరకం వేత్రపాణినమ్ ।
సప్త తే మునయః పూజ్యా వినీతాః కార్యగౌరవాత్॥
ఊచుర్మధుర భాషిణ్యా వాచా తే వాగ్విదాం వరః ।
ద్రష్టుం వయమహాభూతాశ్శరణ్యం గణనాయకమ్॥
త్రిలోచనం విజానీహి సుర కార్యప్రచోదితాః ।
త్వమేవ నో గతి సత్ర యథా కాలానతిక్రమః॥
సాప్రార్థనైషా ప్రాయేణ ప్రతీహారమయః ప్రభుః ।
ఇట్లు పలికిన దేవీవచనములు విని తమ కన్నుల ఆనందాశ్రువులుకమ్మ వారు ఆతపస్వినిని అభినందించిరి; పరమ ప్రీతులయి వారు మధురవచనములతో ఆమెతో ఇట్లనిరి; అహో! దేవీ! అత్యద్భుతస్వ భావురాలగు నీవు నిర్మలజ్ఞాన రూపురాలవువలె కనబడుచున్నావు; నీవు సర్వ భావముతో భవుని (శివుని) ఆశ్రయించిన దానవయి మా భావమును ప్రసన్న మొనర్చుచున్నావు; కాని మేము ఆమహాదేవుని అద్భుతమగు ఐశ్వర్యమును (ఈశ్వరత్వమును) నీవువలె పిరుగము; నీ నిశ్చయమునందలి దృఢత్వమును పరీక్షించి ఎరుగదలచి ఇచటకు వచ్చినాము॥ సుందర రూపా! అచిరకాలముననే నీ సంకల్పము నేర వేరును; సూర్యతేజము సూర్యుని కాని రత్న కాంతి రత్నములను కాని విడిచి ఎక్కడ కై న పోవునా? వర్ణరాశి రూపమగు శబ్దము చే ప్య క్రముకాక అర్థము వేరొక చోటికి పోదుగదా! ఆష్లే నీవును పర మేశుని విడిచియుండవు; కావున మేమును అనేకాభ్యు పాయములతో (నై నను) ఆ ఈశ్వరుని అభ్యర్థించుటకు నీవక్షమున) పోవుచున్నా ము; మా హృదయములందును (చాల కాలముగా) ఈ విషయమే మిక్కిలిగా ఉండినది॥ ఈ కార్య సాధనమునకు కావలసిన నీతి ఉపాయ) రూపురాలవును నీవే; కావుననే అందులకు కావలసిన బుద్ధి (ఆలోచనలు - నిశ్చయము) కూడ నీవేయయి యున్నావు; (నీకు శివునియందుగల దృఢనురాగ విషయక నిశ్చయమే ఈ కార్యము సిద్ధించుటకు కావలసిన ఆ లోచ నమును ఉపాయమును మాకు స్పురింపజేయును॥) ఈ హేతువున నీశంకరుడును నిస్సంశయముగ ఈ కార్యమును నెర వేరునట్లు చేయును॥
అని ఇట్లు పలికి సప్తమునులును గీరి పుత్రిచే పూజలందుకొని శివుని దర్శింపగోరి (అతడును) హిమవ త్పర్వత సానువునకు బయలుదేరిరి॥ ఆ సానువు చాల గొప్పది॥ శివుని వలెనే ఆ సానువును సమానముగ గంగా జలముతో తడుపబడిన శరీరము కలది; పచ్చని జడలను జూలును దాల్చి శివునివలెనే ఆ సానువు పచ్చని గైరిక ధాతువులతో అలంకృతము; శివుని చేతియందలి మందార కుసుమ మాలలను తుమ్మెదలనునరించుచుండెను॥ సానువు నందలి వృక్షశాఖలయందు పూచిన పుష్ప శ్రేణులను తుమ్మెదలు వెంటాడుచుండెను॥ ఇట్టి హిమవత్సానువునందలి శంకరాశ్రమమును ఆ ఋషులు దర్శించిరి॥ అచటి మృగ సమూహములు ప్రశాంతములై యుండెను॥ వన ప్రదేశము కోమలమును నిశ్చలమునై యుండెను॥ నిశ్శబ్దములును కలత లేనివియునగు జల ప్రపాతములు దానీయన్ని దిశలందుండెను॥ ఆ ఆశ్రమద్వారమున పూజ్యులగు ఆ సప్త మునులకును తనచేత పేప బెత్తము ధరించిన వీర కుడు కనబడెను॥ తాము వచ్చి నపని గొప్పదియగుటచే వారు వినయవంతులయి మాటలాడుటలో మేటి నేర్పరులు కావున మధుర భాషణయుతము లగు వాక్కులతో ఆతనితో నిట్లనిరి: లోక శరణ్యుడును ప్రమథగణ నాయకుడునునగు త్రిలోచనుని ఈశ్వరుని దర్శింప మేమిటకు వచ్చితిమి॥ దేవకార్య పేరణ మారాకకు హేతువని తెలియుము॥ కాలాతిక్రమము జరగకుండుటలో నీవే మాకు శరణ్యుడవు కావలయును॥ ఏలయన సాధారణముగా ద్వారపాలుర అనుకూలత చేతనే ప్రభువులు దర్శనమిత్తురు॥
ఇత్యుక్తో మునిభిస్సోథ గౌరవాత్తానువాచ సః॥
సమస్వాస్యా పరాం సన్ద్యాం స్నా త్వా మందాకినీజలే ।
క్షణేన భవితా విప్రా స్తత్ర ద్రక్ష్యథ శూలినమ్॥
ఇత్యుక్తా మునయ సస్టు సే తత్కాలప్రతీక్షిణః ।
గమ్భీరామ్బుధరం ప్రావృటృషితాశ్చాతకా యథా॥
తతః క్షణేన నిష్పన్న సమాధాన క్రియావిధిః ।
వీరాసనం బిభేదే మృగచర్మనియామితమ్॥
తతో వినీతో జానుభ్యామవలమ్బ్య మహీం తథా ।
ఉవాచ వీర కో దేవం ప్రణయైక సమాశ్రయః॥
సమాప్తా మునయస్సప్త త్వాం ద్రష్టుం దీప్తతేజసః ।
విభో సమాదిశ ద్రష్టుమవగత్తు మహార సి॥
ఇత్యుక్తా ధూర్జటి స్తేన వీర కేణ మహాత్మనా ।
భూభజసంజ్ఞయా తేషాం ప్రవేశం తం దదౌ తదా॥
మూర్ధక మేన తాంత్సప్త వీరకోపి మహామునీక ।
ఆజుహావ విదూరస్థాక్ దర్శనాయ పినాకినః॥
త్వరబద్ధార్డచూడా స్తే లమ్బకృష్ణాజినామ్బరాః ।
వివిశుర్వేదికాం శుద్దాం గిరీశస్య విభూతిభిః॥
బద్దపాణిపుటాక్షి స్తనానాపుష్పోత్కరా స్తతః ।
పినాకిపాదయుగళం వన్ద్యం నాక నివాసినామ్॥
తతస్స్నిగ్ధేక్షి తాశ్శాంతా మునయశ్శులపాణినా ।
గిరిశం తే తతో దృష్ట్వా సమ్యక్తుష్టువురాదృతాః॥
మునులు పలికిన తమాట విని వీర కుడాదరమున వారితో ఇట్లనెను: “విప్రులారా! ఈశుడు మందాకినీ జలమున స్నానమాడి సాయం సంధ్యను ఉపాసించి క్షణకాలములో ఇటకు వచ్చును॥ అచ్చట మీరు పరమేశుని దర్శింతురుగాని॥”
ఈమాట విని మునులు వర్షాకాలమున దప్పిగొన్న చాతకములు గుభీర మేఘము వచ్చు సమయము కొరకు వలె శివుడు వచ్చు సమయమున కై ప్రతీక్షించుచు నిలిచిరి॥ తరువాత క్షణకాలములో శివుని యోగ సమా ధానానుష్టానము ముగి సేను॥ మృగచర్మమున నియమపూర్వక ముగ అమర్చుకొనిన వీరాసనమును శివుడు వదలెను॥ ఆంతట వీరకుడు వినయవంతుడై ప్రీతిభావముతో నిండిన మనస్సుతో మోకాళ్ళు వంచి నేలకు ఆనించి ఇట్లు శివునితో మనవి చేసెను; విభూ! దీపించు తేజస్సుకల స ప్రమునులు మిమ్ము దర్శింప ఇటకు వచ్చినారు॥ దర్శ నమునకు అనుజ్ఞ ఈయవలెనని ఎరుగ ప్రార్థించుచున్నాను॥ అనిన మహాత్ముడగు వీర కుని వచనము విని శివుడు కను బొమ విరుపు సెగతోనే వెంటనే వారికి ప్రవేశ మనుమతించేను॥ వీరకుడును అచటికి దూరమున నిలిచియున్న సప మహర్షులను శివుని దర్శనమునకై రావలసినదిగా తన శిరఃకంపముతోనే పిలిచెను॥ ఆ పిలుపునందుకొను త్వరలో ఊడిన జుట్టును సగమే ముడివేసికొని తమ కృష్ణాజినములును వస్త్రములును వేలాడుచుండ విభూతులతో శుద్దమగు పర మేశుని వేదికను ప్రవేశించిరి॥ చేదోయి దొన్నెలతో స్వర్ణ పుష్పముల రాసుల నీళుని పై వేద జల్లుచు వారు దేవ తలకును వంద్యుడు అగు పినాకపాణి పాదపద్మములకు వందనమాచరించిరి॥ అంతట శూలపాణి యు (పేమార్ధ దృష్టులు తమపయి ప్రసరింపజేయ ఆ సప్తర్షులు ఆదర పూర్వకముగ గిరీశుని చూచుచు ఆదేవుని లెస్సగా నిట్లని స్తుతించిరి॥
మునయః : అహో కృతార్థా వయమేవ సాంప్రతం సురేశ్వరో యత్ప్రకటో భవిష్యతి॥
జగత్యసౌ ధన్య తమో హిమాచల స్వదాశ్రయం యస్య సుతా తపస్యతి ।
స దైత్యరాజోపి మహాబలోదయో విమూలితా శేషసురోపి తారకః॥
త్వదీయమంశం ప్రవిలోక్య కల్మషాత్స్వకం శరీరం పరి మోక్ష్యతే హియః ।
స ధన్యధీర్లోక పితా చతుర్ముఖో హరీశ్చ యత్సమమవహ్ని దీపిత॥
త్వదజ్ఘ్రియుగ్మం హృదయేన బిభ్రతో మహాభితాపప్రశ మైక హేతుకమ్ ।
త్వమేవ చై కో వివిధాకృతిక్రియః కిలోతి వాచా విధురై ర్విభాష్యతే॥
అథాద్య ఏవం త్వమవైషి నాన్యథా జగత్తదానిర్ఘృణతాం తవ స్పృ శేత్ ।
న వేతి వా దుఃఖమిదం భవాత్మకం విహన్యతే తే ఖలు సర్వతః క్రియా॥
ఉపేక్ష సే చేజ్జిగ తాముపద్రవం దయామయత్వం తవ కేస కథ్యతే ।
స్వయోగమాయామహిమాగుహాశ్రయం న విద్యతే నిర్మల భూతి గౌరవమ్॥
వయంచ తే ధన్యత రాశ్శరీరిణాం యదృశం త్వాం ప్రవిలోకయామ హే ।
అదర్శనం తేనమనోరథో యథా ప్రయాతిసాఫల్యతయా మనోగతమ్॥
జగద్విధానై కవిగే జగన్ముఖం కరిష్య సేతో వలభిచ్చరా వయమ్ ।
వినేము రేవం మునయో విసృజ్య తాంగికం గిరీశ శ్రుతిభూమీసన్నిధౌ॥
ఉత్కృష్ట కేదార ఇవావనీతలే సుబీజముష్టిం సుఫలాయ కర్షకాః ।
సూతః : తేషాం శ్రుత్వాతు తాం రమ్యాం ప్రక్ర మోపక్రమక్రియామ్॥
వాచం వాచస్పతీరివ ప్రోవాచ స్మితసున్దరమ్ ।
శఙ్కరః : జానే లోకవిధానస్య కన్యా సత్కార్యము త్తమమ్॥
జాతా ప్రాలేయ శైలస్య సజేతక నిరూపణా ।
సత్యముతజ్ఞతాస్సర్వే దేవకార్యార్థముద్యతాః॥
తేషాం త్వర ని చేతాంసి కింతు కార్యం వివక్షితమ్ ।
లోకయాత్రానుగ నవ్యా విశేషేణ విచక్షజై॥
సేవ నే తే యతో ధర్మం తతామాణ్యాత్పరే స్థితాః ।
ఈశ్వరావివాహోద్యమనామ సప్తర్షీణాం హిమాచలగమనం॥
ఇత్యుక్తా మునయో జగ్ము స్వరితాస్తుహినాచలమ్॥
తత్ర తే పూజితా స్తేన హిమ శై లేన సాదరమ్ ।
ఊచుర్మునివరాః ప్రీతాస్స్వల్ప వర్ణ త్వరాన్వితాః॥
ఇపుడు మీదర్శనముచే మేమే ధన్యులమగుచున్నాము॥ ఈవిధముగా సురేశ్వరుడును లోకప్రసిద్ధి వడయు చున్నాడు॥ మీయనుగ్రహమను నిర్మల జలముతో తడియగోరి ఒకానొక శ్రీయును తపమాచరించుచున్న ది; తపః ఫలమందుకోననున్నది॥ ఈ హిమాచలుడును లోకమున ధన్యతముడు; ఏలయన నీ ఆశ్రయము నర్థించి ఆతని పుత్రియే తపమాచరించుచున్నది॥ మహాబల సమృద్ధి కలవాడై సమ ససురులను నిర్మూలించిన తారకాసురుడు గూడ ధన్యుడే; ఏలయన వాడు నీ యంశ భూతమగు తత్వమును (కుమారస్వామిని) దర్శించి తన పాపములనుండి ము కినందబోవుచున్నాడు॥ - ఆ తారకుని వలన కలిగిన భయ సంభ్రమములకు వశులై ఆ సంభమాగ్ని చే ఉద్దీపితులయి మహాభితాప ప్రశాంతి హేతువగు మీ పాదపద్మములను తమ హృదయముల దాల్చి మిమ్మరాధించు బ్రహ్మయు విష్ణువును ధన్యులు; వాస్తవమున నీవొక్కడవే ఐయుండియు వివిధాకృతులతో వివిధ క్రియలు నిర్వర్తించుచున్నా వు; ఇట్టి నిన్ను సరిగ ఎరుగలేక జనులు వాక్కులను శ్రమ పెట్టుకొని వివిధములుగ నిన్ను గూర్చి పలుకుచుందురు॥ ఒక వేళ ఆద్యుడవగు నీవు ఈ విధముగా జరుగు లోకోప ద్రవమును ఎరిగియైయున్నావు; అనినచో లోకమప్పుడు నీవు నిర్దయుడవని నిన్ను నిందించవలసివచ్చును॥ ఈ సంసారాత్మక (లోకమందలి ప్రాణుల దుఃఖమును నీవేరుగకున్నావా? (ఎరుగుదువు;) నీవు చేయు ఈ సృష్టిస్థితి క్రియలు అన్ని విధములుగా (ఈ తార కాదులచే) దెబ్బ తినుచున్నవి: ఇట్టి ఈ జగదుపద్రవమును నీవు చూచుచు ఊరకున్న చో దయామయుడవని నిన్నె వరును ప్రశంసించారు॥ స్వయాగమాయా మహిమలకు గూఢముగా (ఎవరికిని ఎరుగరాక) ఆశ్రయమయియున్న నీ 'నిర్మలైశ్వర్య గౌరవము నెవ్వరును కొని యాడరు॥ ఇట్టి నిన్ను దర్శింపగలుగుచున్నందున మేము ప్రాణులన్నిటికంటే ధన్యతరులము; మొదట మేము మాకు మీదర్శనము కాదేమో యనుకొంటిమి; ఇపుడు తమ దర్శనము చే మామనోరథము సఫలమయినది॥ జగృృష్టిస్థితి సంహార కర్తవును జగములకు ఆదిభూతుడవును అగు నీవు ఎవరు కోరినను కోరకున్న ను మేము కోరినంత కంటే అధిక ములగు కార్యమునే చేయుదువు; ఐనను మేమీంద్రుని సందేశమును గొని నీకడకు వచ్చితిమి; అని ఇట్లు మునులు తమ హక్కులను పర మేశుని శ్రవణ భూమి సమీపమున ఆర్పణ చేసి వంగి నమస్కరించిరి॥ అది కర్షకులు మంచి పంట పండుట కై మేలగు పంటభూమియందు విత్తనముల నాటినట్లుండెను
తగిన విధముగ ఆరంభించి కొనసాగించిన స ప్రమహర్షుల రమ్య స్తుతి వచనములు విని పరమేశుడు చక్కని చిరునగవుతో మనోహరవచనములు బృహస్పతివలె ఇట్లు పలికెను॥ మీరు వచ్చిన పని నేను చేయు లోక విధానము నందలి ఉత్తమ సత్కార్యమునకు అంగ మనియు అందులకై ఈ సర్వ సం కేత ములనేరుకపరచు దేవి హిమ శైల పుత్రిగా జనించినదనియు నేనెరుగుదును॥ దేవతలందరును చాల తహతహపాటుతో ఉన్నారనుటయు నిజమే; మీరు దేవకార్యార్థమే పూని వచ్చితిరి॥ ఆ దేవతల మనస్సులును త్వరపడుచున్నవి॥ కాని నిర్వహింపదలచిన కార్యము నెరవేరుటకై విచక్షణులగువారు లోక వ్యవహారానుసారముగానే పని చేయవలయును॥ ఏలయన ఉత్తములగు వారు ధర్మ వ్యవస్థ ననుసరించి ధర్మమునందు ప్రవర్తింతురు॥ ఇతరులు దానిని ప్రమాణముగా గ్రహించి నడుచుకొందురు॥ అనిన పర మేశుని మాటలు వినుచునే త్వరితముగా సప్తమునులును హిమవంతుని భవనమునకు ఏగిరి, అచట ఆ పర్వత రాజుచే సాదర పూజలనందుకొని ప్రీతులయి మునివరులు అల్ప వర్ణము (వచనము)లతో త్వర తో ఇట్లు శైలేంద్రునితో పలికిరి॥
మునయః : దేవో దుహితరం సాక్షాత్పనాకీ తవ మార్గతే ।
తచ్ఛీఘ్రం పావయాత్మానమాహుత్యే వానలార్పణాత్॥
కార్యమేతచ్చ దేవానాం సుచిరం పరివర్తతే ।
జగదుద్ధరణాయైష విధాతవ్యస్సముద్యమః॥
సూతః : ఇత్యుక సైస్తదా శైలో హర్షావిష్టావదన్మునీకి ।
అసమర్థోభవద్వక్తుము త్తరం ప్రార్థయచ్ఛివమ్॥
తతో మేనా మునీన్వన్ద్య ప్రోవాచ స్నేహవిక్లబా ।
దుహితుస్తాన్మునీం శ్చైవ చరణాశ్రయమర్థ విత్॥
మేనా : యదర్థం దుహితుర్జన్మ నేచ్ఛన్యపి మహాఫలమ్ ।
తదేవోపస్థితం సర్వం ప్రక్ర మేడై వ సామతమ్॥
కుల జన్మవయోరూపవిభూత్యృద్ధియుతో ఒపి యః ।
వరం తస్యాః పితాహూయ సుతా దేయా హ్యయాచతః॥
తత్సతా తపో ఘోరం కథం పుత్రీ ప్రహాస్యతి ।
పుత్తీవా క్యాద్యదత్రా స్త్రీ విధేయం తద్విధీయతామ్॥
ఇత్యుక్తా మునయస్తే తు ప్రియయా హిమభూభృతః ।
ఊచుః పునరుదారార్థం నారీచిత్తవిశోధకమ్॥
మునయః : ఐశ్వర్యమవగచ్ఛస్వ శబ్కరస్య సురాసురైః ।
ఆరాధ్యమానపాదాబ్దయుగళ త్వాత్సునిర్వృతైః॥
తస్యోపయోగి యద్రూపం సైవం యతాప్తయే చిరమ్ ।
ఘోరం తపస్యతే కన్యా తేనరూపేణ నిర్వృతిః॥
య స్తద్వతాని దివ్యాని నయిష్యతి సమాపనమ్ ।
తత్ర సాహితా తావత్తస్మాతైవ భవిష్యతి॥
ఇత్యుక్త్వా గిరిణా సార్ధం తే యయుర్యత శైలజా ।
జితార్కజ్వలనా కారా తవ స్తేజోమయీ హ్యుమా॥
హిమాలయా! సాక్షాత్ పినాక ధారి నీ కొమరితను పత్నిగా కోరుచున్నాడు; కావున ఆహుతిని అగ్ని యందర్పించి నట్లు ఆమె నతని యందర్పించి నిన్ను నీవు పవిత్రునిగా జేసికొనుము; ఇందు చాలకాలముగా ఏర్పడిన దేవకార్యమును ఇమిడియున్నది; కావున జగదుద్ధరణార్థమయి నీవు ఈ పూనిక నెర నేర్చవలయును॥ అనిన మునులమాట విని పర్వతరాజు హరావిష్ణుదే వారితో ఏదో చెప్పనారంభించెను॥ కాని మాటాడజాలక పోయెను॥ కేవలము శివుని ప్రార్థించి ఊరకుండెను॥ అంతట మేనాదేవి పుతీ ప్రీతిపారవశ్యముతో మునుల నమస్కరించి భగవానుడగు ఈశ్వరుని పాదము లను ఆశ్రయించిన ఆర్థవంతమగు వాక్యమిట్లు పలికేను! కూతురు 'పుట్టి ఉభయవంశ ములవారిని తరింపజేయును గావున ఆమే జన్మము మహాఫలప్రద మే; ఐనను ఆమె తల్లిదండ్రులను విడిచిపోవునను భయముచే కూతురు పుట్టవలెనని కోరరు: క్రమ పరిణామముగా ఇపుడదియే తటస్థించినది; కులజన్మ వయోరూ పైశ్వర్య సమృద్ధి కల వరుడు లభించినచో అతడు కోరకున్న ను కన్న తల్లిదండులాతని కామె నీయవలయును॥ ఆ శివుని యందే ఆసక్తురాలయిన మా పు తొ తన్నా యన కీయనిచో ఆ ఘోర తపమెట్లు విడుచును? కనుక ఆమె మాటననుసరించి ఈ విషయములో ఏమి చేయదగునో ఆ పని చేయుడు; అని పలికిన హిమవత్పతియగు మేనా వచనములు విని మునులు ఆమె మనస్సు పరీక్షింపగోరి ఉదారార్థ వంతమగు మాట ఇట్లు వచించిరి॥ దేవతలు ఆ మహాదేవుని పాదాబ్జ ద్వంద్వమును ఆరాధించి మిగుల సుఖమందు చున్నా రనిన ఆ శంకరుని ఐశ్వర్యమెట్టిదో ఎరుగుము; ఆ శివునకు ఉపయోగించి ప్రీతి కలిగించు రూపమును పొందగోరి నీ పుత్రి ఘోర తపమాచరించుచున్నది; ఆమె రూపముతో శివప్రాప్తి యను మహానందము లభించును॥ ఏ శంకరుడు ఆమె ఇంతవర కాచరించుచుండిన వ్రతములను ముగింప జేయునో అతనియందే ఆమె ఆవధానము నిలిపి యున్నది; అట్టి ఆమె ఇపుడతని ఇల్లాలగును॥ ఆని ఇట్లు పలికి ఆ సప్త మునులును హిమవంతుని కూడి-రవి వహ్ని తేజముల మించిన తేజము కలదియు తప స్తేజోమయ రూపయునగు పార్వతి తపమాచరించుచోట కేగిరి॥
ప్రోచుస్తాం మునయస్నిగ్ధ సన్మాన్యపథమాగతమ్ ।
రమ్యం ప్రియం మనోహారి మా రూపం తపసా దహ॥
ప్రాత స్తే శఙ్కరః పాణి మేష పుత్తి గ్రహీష్యతి ।
వయమర్థితవక్షస్తే పితరం సర్వ ఆగతాః॥
పిత్రా సహ గృహం గచ్ఛ వయం యామస్స్వమన్దరమ్ ।
ఇత్యుక్తా తపసస్సత్యం ఫలమ స్త్రీతి చిన్య సా॥
త్వరమాణా యయా వేశ్మ పితుర్ధివ్యార్థశోభితమ్ ।
సా తత్ర రజనీం మేనే వర్గాయుత సమాం సతీ॥
వరదర్శనసజ్ఞతమహోత్కణా సీమాద్రీజా ।
పార్వతీ వివాహార్థం హిమవద్ధిరౌ గృహాలజ్కరణా నిర్మాణమ్॥
తతో ముహూర్తే ! బ్రాహ్మే తు *తస్యాశ్చక్రుస్సుహృత్ప్రియాః
నానామఙళ సన్హోహం యథావతమపూర్వకమ్ ।
దివ్యమజ్జనమజ్ఞానాం మన్దిరే బహుమజ్ఞు॥
ఉపాసత గిరిం మూర్తా ఋతవస్సార్వకామికాః ।
వాయవో వారిదాశాసనంమార్జనవిధే గిరేః॥
హర్మ్యేషు శ్రీస్వయం దేవీ కృత నానార్థ సాధనా ।
కా నిస్సర్వేషు భావేషు బుద్ధిశ్చాభవదా కులా॥
చిన్తామణిప్రభృతయో రత్నా శైలం సమ స్తోతః ।
ఉపతస్థుర్నగాశ్చాపి కల్పకాశ్చ మహాద్రుమాకి॥
ఓషధ్యో మూర్తిమత్యశ్చ దివ్యౌషధిసమన్వితాః ।
రసాశ్చ ధాతవశ్చైవ సర్వే శైలస్య కిజరా॥
కిజరా స్తస్య శైలస్య వ్య గ్రాశ్చాజ్ఞానువర్తినః ।
నవ్యస్సముదా నిఖిలాస్థావరం జజ్గమంచ యత్॥
తత్సర్వం హిమ శైలస్య మహిమానమవర్దయత్ ।
(*తస్యాశ్చక్రుస్సురస్త్రియః॥)
మునులు ఆ పార్వతితో ప్రీతి పూర్వకముగా ఇట్లనిరి: సర్వజనాదరణీయమును రమ్యమును మనోహరమును ప్రీతికరము నునగు నీరూపమును తపోగ్ని తో దహించుకొనకుము॥ పుత్రీ! రేపటి ఉదయమే శంకరుడు నీపాణిని గ్రహించును॥ మేమందరమును వచ్చి ఈ విషయమును ॥ మీతండ్రిని అర్థించితిమి॥ నీవు నీతండ్రితో స్వగృహ మేగుము; మేమును మా ఇండ్ల కేగుదుము; ఇట్లు పలికిన న పరుల మాట విని పార్వతి తపమునకు ఫలము కలుగుననుట సత్యమయ్యేనని సంతసముతో దివ్య పదార్థ శోభితము అగు పితృ భవసమునకు త్వరితముగా ఏగెను॥ అచట ఆ హైమ వతికి వరునేప్పుడు చూతునాయను తహతహతో ఆ రాత్రి పది వేల యేండ్లుగా తోచెను॥ తరువాత బ్రహ్మ ముహూర్త మున ఆమె ప్రియసఖులు యడాగా సంప్రదాయముగ క్రమముతో సకల మంగళాలం కార సముదాయములతో ఆమెనలంక రించిరి॥ బహు మంగళ భరితమగు మందిరమున ఆ మేకు ఆయా యవయవములందు అనేకాభరణములలంకరించబడెను॥ ఆరు ఋతువులును మూర్తీభవించి సర్వకామముల పూరించుచు హిమవంతుని సేవించెను॥ వాయువులు కసవూడ్చెను; మేఘములు నీరు చల్లేను॥ లక్ష్మీ దేవి ఆతని హర్మ్యములందు నానా పదార్థ సాధనములు అమర్చేను; సర్వ పదార్థము లందును సర్వ భావములదును కొంతియు సమృద్ధియు వ్యాపించేను॥ చింతామణి మొదలగు రత్నములును పర్వ తములును కల్పవృక్షాది మహా వృక్షములును వచ్చి హిమవంతుని కొలిచెను॥ ఓషధులు దివ్యౌషధములతో రసములతో ధాతువులతో కూడి మూర్తీభవించి హిమ శైలమునకు కింకరులయ్యెను॥ అతని కింకరులును ఆ శైలుని ఆజ్ఞానువర్తులై వ్యగ్ర తతో పనులు చేయుచుండిరి॥ నదులును సముద్రములును సకల పదోర సముదోయమును హిమవంతుని మహత్వమును మంత వృద్ధి పరచెను॥
గందమాదనపర్వతే వివాహార్థ మీశ్వరాలజరణమ్॥
అభవన్మునయో నాగా యక్షగన్దర్వకిన్న రాః॥
శఙ్కరస్యాపి విబుధా గన్ధమాదనపర్వతే ।
సర్వే మణ్డనసమారా స్తస్థుర్నిర్మలమూర్తయః॥
శర్వస్యాపి జటాజూటే చన్దఖడ్గం పితామహః ।
బబన్దప్రణయోదారం తత్ర స్ఫారితలోచనః॥
కపాలమాలాం విపులాం చాము మూర్య బన్ధత ।
ఉవాచ చాపి గిరిశం పుత్తం జనయ శఙ్కర॥
యో దైత్యేశోకులం హత్వా మాం రకై సర్పయిష్యతి।
సౌరిర్జ్వలచ్చిరోరత్నముకుటం చానలోల్బణమ్॥
భుజగాభరణం గృహ్య సజ్జం శమ్భోః పురోభవత్ ।
శక్రో గజాజినం తస్య వసాధ్యక్తా గపల్లవమ్॥
దగ్రే సరభసం స్విద్యద్వి స్తీర్ణముఖపజజమ్ ।
వాయుశ్చ విపులం తీక్షశృజ్ఞం హిమగిరిప్రభమ్॥
వృషం విభూషయామాస హరయానం మనోహరమ్ !
వీడేనుర్నయనా నస్థాశ్శమ్బోస్సూర్యానలేన్గవః॥
స్వాం ద్యుతిం లోక నాధస్య సగతిః కర్మసాక్షిణః ।
చితాభస్మ సమాదాయ కపాలే రజతప్రభమ్॥
మనుజాస్థిమయీం మాలామాబటన్ల చ పౌణీనా ।
పేతాధిపః పురో దూరే సగదస్సమవర్తత॥
నానా కారమహారత్నభూషణం ధనదాహృతమ్ ।
విహాయోదగ్రసర్పేంద్రకట కేన స్వపాణినా॥
కత్తంసం చకారేశో వాసుకిం తక్షకం స్వయమ్ ।
జలాధీశాహృతాం స్థాణుః ప్రసూనా వేష్టితాం స్రజమ్॥
తతస్తు తే గణాధీశా వినయాత్తత్ర వీరకమ్ ।
ప్రోచుర్వ్యగ్రాకృతే త్వన్నో సమా వేదయ శూలినే॥
నిష్పన్నా భరణం దేవం ప్రసాద్యేశం ప్రసాధనైః ।
సప్తవారిధయ స్తస్థుః కర్తుం దర్పణవిభ్రమమ్॥
ఇట్లు వివాహార్థము పార్వతి కలంకరణము జరుగుచుండ అట గంధమాదన పర్వతమున దేవతలందరును శంకరునలంకరింపదలచి నిర్మల మూర్తులై సకలములగు అలంకరణ సం భారముల ధరించి నిలిచిరి॥ వారిలో బ్రహ్మ విప్పారిన కన్నులతో శరుని జటాజూటమున ! పే మోదర భావమున చంద్ర ఖండమును అమర్చేను॥ చాముండ (మాతృ దేవత) శివశీరమున విపులమగు కపాలమాలను క టెను॥ డై త్యేంద్రకుల హంత యై రక్తముతో మాకు తృప్తి కలిగించు పుత్తుని కనుము శంకరా! యని ఆమే శంకరుని దీవించెను॥ యముడు ప్రకాశించు శిరోరత్న ములు కలదై అగ్ని వలే స్ఫుటముగ ప్రకాశించు సర్వాభరణమును చేత ధరించి శంకరుని ముందు నిలిచెను॥ (వానితో శివునలంకరించెను॥) ఇంద్రుడును చెమర్చు చున్న విశాల ముఖపద్ము డై వసపూత కల కొనలుగల గజచర్మమును ఉత్సాహముతో శివునిచే ధరింపజేసెను॥ వాయువు శివునికై వాహనముగా విశాలమయి పొడి కొమ్ములు కలిగి హిమగిరివలే తెల్లని కాంతి కలదై న మనోహర వృషభమును అలంకరించెను॥ సూర్య చంద్రాగ్నులు శంభుని నేత్రాంతరాళమున నిలిచి జగత్కర్మ సాక్షియగు ఆ దేవుని శరీరమున తమ కాంతినే విస్తరింపజేసిరి॥ యముడు కపాలమునందు వెండివలే మెరయు చితా భస్మమును తీసికొని తన చేతితో ఆ దేవుని కంఠమున మనుజాస్థిమయ మాలను కటి తనచేత గద ధరించి శివుని ఎదుటి భాగమున దూరముగా నిలువబడెను॥ కుబేరుడు స్వయముగా తెచ్చిన నానాకార మహారత్న భూషణమును వదలి ఈశుడు భయంకర సర్పేందములు కడియముగానున్న తన చేతితో వాసుకినీ తక్షకుని తన చెవికి ఆభరణములుగా తానే ధరించెను॥ స్థాణు (శివ) దేవుడు వరుణుడు తెచ్చినదై పూవులతో కూర్చిన మాలను కూడ ధరించుకొనెను॥ అంతట ప్రమథ గణాధీశులు వీర కునితో (ఆ పేరుగల ద్వారపాలునితో) ఆయా పనులయందు వ్యగ్రమగు ఆకృతిగల వీర జా! నీవు శూలికి మారాక నివేదింపుము॥ అని వినయమున పలికిరి॥ సప్త సముద్రములును ఆయా ఆభరణములు సమకూర్చబడిన ఈశుని లెస్సగా అలంకరించి అద్దపు విలాసమును సమకూర్ప వేచియుండెను॥
తతోవిలో కి తాత్మానం మహామ్బుధిజలోదరే ।
ధరామాలిజ్య జానుభ్యాం స్థాణుం ప్రోవాచ కేశవః॥
శోభ సే దేవ రూపేణ జగదానన్దదాయినా ।
మాతరః వైరయన్ కామవధూం వైధవ్యచిహ్ని తామ్॥
కాలోయమితి చాలక్ష్య ప్రకా రేజితసంజ్ఞయా ।
తతస్తాశ్చాదితా దేవమూచుః ప్రహసీతాననాః॥
రతిః పుర స్తవ ప్రాప్తి నాభాతి మదనోజితా ।
తతస్తాం సన్ని వార్యాహ వామహస్తాగ్రసంజ్ఞయా॥
ప్రయాణీ గిరిజావ దర్శనోత్సుకమానసః ।
స్వవివాహార్థ మీశ్వర స్య బ్రహ్మవిష్ణ్వాది దైవతై స్సహ హిమాచలగమనమ్॥
తతో హరో హిమగిరికన్దరాకృతిం సమున్నతం మృదుగతిభిస్స చోదయక్॥
మహావృషం గణతుములాహితేక్షణం సభూధరానశ నిరివ ప్రకమ్పయః ।
తతో హరిర్డతపదపద్దతిః పురస్సర శమాద్దుమనిక రేషు విశ్రమక్ ॥
ధరార జశ్శబలిత భూషణా బ్రవీతయాత మా కురుత పథోస్య సజ్కటమ్ ।
ప్రభోః పునః ప్రథమనియోగమూర్జయన్సుతోబ్రవీదుకుటిముఖోపి వీరకః॥
వియచ్చరా వియతి కిమ స్తీ కాస్తకం ప్రయాత నో ధరణీధరా విదూరతః ।
మహార్ణవాః కురుత శిలోపమం వయస్సుద్విషాం గమనమహాసుకర్దమమ్॥
గణేశ్వరాశ్చపలతయా నగమ్యతాంసురేశ్వరై స్పిరమతిభిశ్చ గమ్యతామ్ ।
న భృష్ఠాణా స్వతనుమ వేశ్య నీయతే పినాకినః పృథుముఖమడ్డలాగ్రతః॥
వృథా యమ ప్రకటితద న్తకోటరం త్వమాయుధం వహసి విహాయసంభ్రమమ్ ।
పదానయ ద్రథతురగైః పుర ద్విషం ప్రముచ్యతే బహుతర మాతృసజులమ్॥
అమీ సురాః పృథగనుయాయిభిర్వృతాః పదాతయో ద్విగుణపఠాక్ హరప్రియాః ।
స్వవాహనైః పవనవిధూత చామరై శ్చలధ్వజై ర్వజత విహారశాలిభిః॥
సురాస్స్వకం కిమితి నరాగమూర్జీతం వీచార్యతే నియతలయత్రయానుగమ్ ।
ఈశుడు సముద్రజలములందు తన రూపు (అద్దమునందువలె) చూచికొనిన తరువాత హరి తన మోకాళ్ళు: భూమిని తాకునట్లు వంచి అతనితో: “దేవా! జగదానందదాయియగు రూపముతో ప్రకాశించుచున్నావు,” అనెను॥ ఇదే సమయమని మాతృకలును వైధవ్య లక్షణములతో ఉన్న మన్మథ పత్ని యగు రతిని ఆయా ప్రకారముల॥ ఇంగిత సంజ్ఞ లతో పేరించిరి॥ తరువాత రతి తమ్మువేడుకొనగా వారు నవ్వు మొగ ములతో శివునుద్దేశించి “దేవా! మదనుడు లేక రతి తమ ఎదుట కాంతిహీనయైయున్న ది" అనిరి॥ అప్పటికే పార్వతీ ముఖ దర్శనోత్సుక మానసుడై యున్న శివుడు॥ ప్రయాణోన్ముఖుడై ఆమెను కొంచెము వేచియుండుమని తెలుపుడని ఎడమ చేతి వేళ్ళ సైగ తోనే మాతృక లకు తెలి పెను॥
శివుడు వివాహమునకై తరలి పోవుట
అనంతరము శివుడు హిమగిరి కందరమువలె తెల్లనగు మహాపృషభముమ మెత్తని కొరడా దెబ్బలతో తోలుచు॥ సాగిపోవు చుండెను॥ అదియును సమ్మర్గముగా గుమియైయున్న ప్రమధుల పై కన్నులు ప్రసరింప జేయుచు వజ్రము కొండ లనువలే వారిని భయ పెట్టుచు వణకించుచు సాగుచుండెను॥ అంతట హరియు త్వర తో అడుగులు వేయుచు ముందుగ పోవుచు శ్రమయేనపుడు చెట్ల నీడలందు విశ్రమించుచు త్రోవలోని ధరాధూళితో తనయాభరణములు వింతరంగులు కలవి యగుచుండ పోవుచు “ముందునకు నడచుచుండుడు; నిలువబడి ఈశుని తోవకు ఇబ్బంది కలిగించవలదు॥” అని జనులను॥ హెచ్చరించుచుండెను॥ ప్రభువు మొదటనే తనకిచ్చిన యాజ్ఞను మన్నించుచు వీరకుడును కనుబొమలు ముడి వేసి దేవత లారా! ఆకాశములో ఏమివింత చూచుచున్నారు ? పర్వతములారా! మాకు దూరముగా పోండు; మహా సముద్రములారా! మహాసుర సంచారమున బురదగా నేన మీ జలమును శీలవలేగట్టి పరచుకొనుడు; గణాధిపతులారా! చంచలగతితో పోవలదు॥ దేవతలతోకలిసి స్టెరగతీతో నడువుడు॥ ఓ భృంగీ! నీవు నీ యొడ లివంక చూచుకొనుచు అడ్డదిడ్డముగా పోవుచున్నావే కాని శివుడు తన విశాలముఖమండలాగ్రమును (చూపును) ప్రసరింపచేసిన త్రోవవేంట ఆయనను వహించికొని పోవుట లేదు॥ యమా; నీవు నీ దంతముల నడుమ సందులు బయల్పడ నోరుతెర చుకొని ఏ సంభ్రమమును లేక ఊరక దండాయుధమును॥ మోసికొని పోవుచున్నావు॥ (ఎచ్చరికగా లేవు; ఏలయన-త్రోవయంతయు రథముల గుర్రములును మాతృకలును తమ॥ తమ అనుచరులు తమవెంటరాగా కాలినడక తో నడుచుచున్న దేవతలును తమకువలసిన దానికి రెండింతల తోవనాక మించి శివునకు తోవవిడుచుటలేదు॥ దేవతలారా! గాలికి చామరములు కదలియాడుచుండు ధ్వజములుచలించుచుండ ఠీవితో తమ తమ వాహనములారోహించినడువుడు; మీరు మూడు విధములగులయలతో మీరు మీరు సాధన చేసిన చేసిన రోగములను పాడరేల॥?
న కిన్న రై రభిభవితుం హి శక్యతే విభూషణప్రచయసముద్భవో ధ్వనిః॥
స్వజాతికాః కిమితి న షడ్జమధ్యమైః పృథుస్వరం బహుతర మత వక్ష్యతే ।
నతానతానతనత దేహ తాజ్ఞతాః పృథక్తయా సమయకృతా విభిన్న తామ్॥
విశ జీతా భవదతిభేదశీలినః ప్రయా న్యమీ ద్రుతపదమేవ గౌడకాః ।
విసంహతాః కిమితి నషాఢవాదయస్స్వగీత కై ర్లలితపదప్రయోగ జైః॥
ప్రభోః పురో భవతి హి యస్య చాక్షతం సముద్ధతార్థక మితి తత్పరతీయతే ।
అమీ పృథగ్విరచిత రమ్యరాసకం విలాసినో బహుగమక స్వభావకమ్॥
ప్రయుజ్జుతే గిరిశయశో విసారిణం ప్రకీర్ణకం బహుతర రాగజాతయః ।
అమీ కథం కకుభి కథాః ప్రతిక్షణం ధ్వనని తే వివిధవధూవిమి శ్రితాః॥
న జాతయో ధ్వనిముర జాస్సమీరితా న మూర్ఛితాః కిమితిచ మూర్చనాత్మికాః ।
శుతి ప్రియక్రమగతిభేద సాధనం తతాదికం కిమితి న తుమ్బురేరితమ్॥
న హన్యతే బహువిధవాద్యడమ్బరం ప్రకీర్ణవీణాముర జారినామ యత్ ।
ఇతీరితే గిరీమవధానశా లినస్సురాస్పురాసపది తు వీర కాజ్ఞయా॥
నియామితాః ప్రయయుర తీవ హర్షితాశ్చరాచరం జగదఖిలం హ్యపూరయః ।
ఇతి స్తనత్కకుభి రసన్మహార్ణవే స్తనదనే విదళిత శైలకన్జరే॥
జగత్యభూత్తుముల ఇవాకులీకృతః పినాకినా త్వరితగతేన భూధరః ।
పరిజ్వలత్కనక సహస్రతోరణం క్వచిన్మిళ న్మరకత వేశ్మ వేదికమ్॥
క్వచిత్క్వచిద్విమలవై డూర్యభూమికం క్వచిద్దళ జలదరరమ్యనిర్ఘరమ్ ।
చలధ్వజప్రవరసహస్రమజ్జతం సురద్రుమ స్తబక వికీర్ణచత్వరమ్॥
సీతాసితారుణరుచిధాతువర్ణకం శ్రియోజ్జ్వలం ప్రవితతమార్గగోపురమ్ ।
విజృమితాప్రతిమధూమవారిదం సుగన్దిభిః పురపవనైర్మనోహరమ్॥
కిన్నరులు తమ విభూషణముల రాపిడివలన కలుగు ధ్వనిని మరుగు పరచునంతగా గొంతెత్తి పాడలేకున్నారే: స్వజాతీజు (లగుప్రమథు)లారా! మీరును షడ్గ మధ్యమ స్వరములతో బిగ్గరగా బహుతరముగా పాడ రేల? (కళావేత్తలగు) గౌడకులారా ! మిగుల వంగి వంగిపోవు శరీరములతో మీరందరును మీ కళలకు సంబంధించిన వ్యవస్థను విడిచి ఎవరికివారే విడిపోయి భయపడుచు త్వరలో అడుగులు వేయుచు ఆట్లు పోవుచున్న రేల? షాడవాది కళాభిజ్ఞులుకూడ అట్లు వేరువేరుగా విడి పడిపోయెద రేల ? లలిత పదప్రయోగములతో సంపన్న ములయిన మీమీ గీతక ములతో ప్రభువునకు ఎదుట ఆతీ స్పష్టార్థమగు అక్షత (ఏకొరతయు లేని) సంగీతమును స్ఫుటముగా పాడ రేల ? ఈ నాగజాతులవారును ఒక గుమిగానుండక ఎవరియంతట వారయి విడివడి రమ్యమగు నాసక నృత్త మును బహుగమక స్వభావవంతముగా అభి నయించుచు పరమ శివుని యశమును వ్యాపింప జేయుచు ప్రకీర్ణక విధానమున అభినయించుచున్నా రేల ? ఈ వివిధ జాతు లకు చెందిన దేవ యువతులును ఒక అమరిక లో నుండక ఆయా దిక్కులందేచ్చట వెచ్చటనోచేరి పరస్పర మిశ్రితలయి ప్రతిక్షణమందును ఏవేవో మాటలో పొటలో పలుకుచు ధ్వని చేయుదు రేల? చక్కని ధ్వనులుగల మృదంగ వాద్యధ్వనులు వినవచ్చుటలేదు॥ సంగీత శాస్త్రీయ మూర్చనా ప్రధానములగు మూర్చిత గీతికలు వినబడవు; ఇది యేమి? శ్రవణ ప్రీతికర మగు క్రమగతిగల సంగీత భేదములతో వివిధ సాధనములతో కూడినవియు తుంబురునిచే చెప్పబడినవియునగు వీణా మృదంగాది వాద్య విశేషములు చక్కగా మ్రోయింపబడ వేల? ఇట్లు పలుకు వీరకుని వచనములవధరించి సురాసురులు నియమబద్దులయి మిగుల హర్షముతో చరాచర జగమంతయు తామే నిండి ముందునకు సాగిపోవు చుండిరి॥
ఇట్లు దిశలు ఉరుముచున్నట్లు ధ్వనించుచుండ మహార్ణవములు మోగుచుండ మేఘములురుముచుండ గిరికందర ములు పగులు చుండ జగమంతయు తుములమగుచుండ త్వరిత గమనమున తన నగరికి తరలి వచ్చుచున్న శివునిచే హిమ వంతుడు కలతనందేను॥
ఆ హిమాలయ మహాగిరినగరమునందొక చోట మీగుల ప్రకాశించు వేలకొలది బంగారు తోరణములుండెను॥ ఒక దానికి మరియొకటి చేరువలో మరకత మణి వేదిక లుండెను॥ ఒక చోట వైడూర్యపు భూమిక లుండెను॥ ఒక చోట జల జలపారు అందమగు సెలయేళ్లుండెను॥ ఆ నగర మందంతటను వేలకొలది పతాక లు కదలియాడుచు ఆలంకారమయి యుండెను॥ ఇండ్లముంగిళ్లయందు కల్ప వృక్షముల పూలు చల్లబడి యుండెను॥ తెల్లని ఎరనీ నల్లని గేరిక ధాతువులు॥ వ్యాపించి యుండెను॥ త్రోవపొడవున భవన గోపురములు కనబడుచు శోభించుచుండెను॥ సుగంధ ధూపపు పొగలతో నిరుపమానములగు మేఘములానగరపు ఆకాశమున క్రమ్మీయుండెను॥ అంతట నా మనోహర వాయువులు వీచుచుండెను॥
పురప్రవేశ సమయే ఈశ్వరాదిక మాలోక్య పౌర నారీణా మన్యోన్యసం ల్లావః - ఈశ్వరుని పురప్రవేశము- నగరనారీ సంల్లాపము॥
హరో మహాగిరినగరం సమాసగత్తణాదివ ప్రవరసురాసురస్తుతః ।
తం ప్రవిశ శ్రమగాత్ప్రవిలోక్య వ్యాకులతాం నగరం గిరిభర్తుః॥
వ్యగ్రపురంద్రిజనం చ వియానం ధావితమార్గ జనాకులరథ్యమ్ ।
హర్మ్యగవాక్షగతామర నారీలోచననీలసరోరుహమాలమ్॥
సుప్రకటా సమదృశ్యత కాచిత్వాభరణాంశువితానవిగూడా।
కాఒప్యఖీలీకృతమణనభూషా త్యక్తసఖీప్రణయా హర మైక్షత్॥
కాచిదువాచవిలంబీతమాలా కాతర తాం సఖి మా కురు మూడే ।
దగ్గమనోభవ ఏవ పినాకీ కామయతే స్వయమేవ విహర్తుమ్॥
కాచిదపి స్వయమేవ పత స్త్రీ ప్రాహ పరాం విరహస్టలితాజీమ్ ।
మా చపలే మదనవ్యతిషజ్ఞుం శఙ్కర జం స్థలనేన వద త్వమ్॥
కాపి కృతవ్యవధానమదృష్టా యు క్తివశాధింశో హ్యయమూచే ।
ఏష స యత్ర సహస్రమఖాద్యా నొక సదామధిపాస్స్వయము కై
నామభిరిన్దుజటం నిజ సేవాప్రా ప్రిఫలాయ నతాస్తు ఘట నే ।
ఏష న చైష స ఏష యదగ్రే ఘర్మపరీతతనుశ్శశిమౌళీ॥
ధావతి వజధరోఒమర రాజో మార్గమముం వివృతీకరణాయ ।
ఏష స పద్మభవోయము పేత్య ప్రాంశుజటామృగచర్మనిగూఢః॥
సప్రణయజ్కరఘట్టిత వక్తః కిహ్చోదువాచ మితం శ్రుతిమూలే ।
ఏవమభూత్సురనారికులానాం చిత్రవిసంస్థులతా గురురాగాత్॥
శ జగసంశ్రయణాద్దిరిజాయా జన్మఫలం పరమ నీతి చోచుః।
తతో హిమగిరేర్వేశ్మ విశ్వకర్మనివేదితమ్॥
మహానీలమయ స్తమ్భం జ్వలత్కాఇ్చనకుట్టిమమ్ ।
ముక్లాజాలపరిష్కారం జ్వలితౌషధిదీపితమ్॥
క్రీడోద్యానసహస్రాడ్యం క్చాన్నద్దదీర్షికమ్ ।
మ హేన్ద ప్రము ఖాస్సర్వే సురా దృష్ట్వా తదద్బుతమ్॥
నేత్రాణి సఫలాన్యద్య మనోభిరితి తే దధుః ।
విమర్ధకీర్ణ కేయూరా హరిణా ద్వారి రోధితాః॥
కథంచిదింద్రప్రముఖా వివితుర్నా కవాసినః ।
ఇట్లు సురాసురుల స్తుతులందుకొనుచు పరమేశ్వరుడు ఒక క్షణ కాలములో ఇట్టి హిమవన్మహా నగరము చేరెను॥
ఈశ్వరుడిట్లు తరలివచ్చి పురప్రవేశము సేయుచుండ హిమవన్న గరము సంభ్రమమున కలత నొందు ముత్తైదువలతో తడబడు యాన సాధనములతో గందరగోళపడుచు త్రోవల పరుగెత్తు జనులు కల విళలరాజ మార్గము లతో రచ్చ పట్టులతో నిండి ఆకులమయ్యెను॥ హర్మ్యముల గవాక్షముల కడకు వచ్చిన ఆమరల నేత్ర పంక్తులు నల్లకలువల మాలలై కనుపట్టుచుండెను॥ వారిలో ఒకతే తన ఆభరణ కాంతికిరణములందే మరుగుపడియు మిగుల ప్రకటయే కనబడెను॥ ఒక తే తన ఆభరణాలంకరణము ముగియక యే తన చెలి పై ప్రీతినికూడ విడిచి ఆమెను వదలి తానొక్కతేయే హరుని చూడవచ్చెను॥ ఒకతె ఇంకోక తెతో “తెలివి తక్కువదానా! వేగిరపాటుతో మాలనపై వ్రేలాడ నిచ్చుకొనుచు రాకుము॥” అనెను॥ ఒకతే తాను శివుని చూడవలెనను త్వరతో పడుచుపోవుచునే శివ వీరహముతో తడబడు శరీరము కల ఇంకొక తెతో "ఈ పినాకి మన్మథునే దహించినవాడు॥ అతనికి స్త్రీలతో పొందు అక్కరలేదు॥ తానొక్కడే విహరింపగోరువాడితడు॥” అనెను॥ ఒకతెకు శివుడు కనబడనందున ఇంకొక చేతో యు క్షిగా “చపలురాలా! శివుని విషయములో మన్మథునితో సంబంధముకల మాటలేవియు పలుక కుము॥” అనెను॥ (ఆ మాటవినీ శివుడిటు మొగము త్రిప్పినపుడాతని చూడవచ్చునని ఆమె ఆశ- ఇంద్రాది దేవనాయకులును తామే పలుకు నామములతో స్తుతించి నమస్కరించుచు సేవాఫలమాశించి పూజించునదీతనినే అని ఒక తే పలికెను॥ ' ఈ చర్మ వస్త్రధారియే శివుడు॥' అని ఒక తే వలి కెను॥ “ఏవని ముందు ఇంద్రుడు వజ్రధారియై చెమర్చుచు పరుగెత్తుచు త్రోవ విశాలము చేయుచున్నాడో అతడే సుమా శివుడు!' అని మరియొకతే అనేను॥ పొడవు జడలు దాల్చి మృగ చర్మము ఒడలి పై కప్పుకొనియున్న ఎవనికడకు పోయి బ్రహ్మ ప్రేమపూర్వకముగా చెవి మొదట ఉంచిన తన నోటిని తన చేతితో మూసికొని మెల్లగా ఎదియో చెప్పు చున్నాడో అత డే శివుడు॥ అని ఒకతే పలికెను॥ ఇట్లు దేవశ్రీలు శివుని చూచి తమలో తాము అనురాగ పారవశ్యమున పలుకుచు చిత్తము కలవరపడుచుండ ఇట్టి పర మేశుని ఆశ్రయింపగోరు గిరిపుత్రి జన్మము సఫలమనుచుండిరి॥
ఆంతట విశ్వకర్మ నివేదించగా మహేంద్రాది దేవత లెల్లరును మహానీలమణిమయ స్తంభములు ప్రజ్వలించు బంగారు గచ్చు నేలలు ము తైపుజాలరుల అలంకరణములు మహౌషధీ లతాదీప ప్రకాశము వేలకొలది॥ క్రీడోద్యానములు బంగారు చుట్టుకట్టులు గల దిగుడు బావులు కల అద్భుతమగు హిమవన్న గరమును చూచి తమ నయనములు సఫలము లయ్యెనని మనస్సులందు భావించి హర్షించిరి॥ వాకిట నిలిచి హరి అందరను నిలిపి నిలిపి లోనికి విడుచుచున్నను సమ్మర్దములో భుజకీర్తులు మొదలగు ఆభరణములు చెదరుచుండ దేవతలు లోపల ప్రవేశించిరి॥
పార్వతీపరమేశ్వరయోర్వివాహమహోత్సవః॥
ప్రణతేనాచలేంద్రేణ పూజితోఽథ చతుర్ముఖః॥
చకార విధినా సర్వం విధిమంత్రపురస్సరమ్ ।
శర్వస్య పాణిగ్రహణమగ్ని సాక్షి పురస్కృతమ్॥
దాతా మహీభృతాం నాథో హోతా దేవశ్చతుర్ముఖః ।
వరః పశుపతిస్సాక్షాత్కన్యా విశ్వారణి స్తథా॥
చరాచరాణి భూతాని సురాసుర వరాణిచ ।
తత్రా ప్యేతే నియమతో హ్యభవన్వ్యగ్రమూర్తయః॥
ముమో చాభిజనా నర్వా న్సస్య శాలిర సౌషధాక్ ।
వ్యగ్రాతు వృథివీ సర్వా సర్వభావమనోరమా,
గృహీత్వా వరుణస్సాక్షాద్రతా న్యాభరణాని చ ।
పుణ్యానిను విచిత్రాణి నానారత్నమయాని చ॥
తస్థా స్వాభరణో దేవో హర్షదస్సర్వదేహినామ్ ।
ధనదశ్చాపి దివ్యాని హైమాన్యాభరణాని చ॥
జాతరూపవిచిత్రాణి ప్రయతస్సముపస్థితః ।
వాయుర్వనౌ చ సురభిస్సుఖసంస్పర్శతో విభుః॥
ఛత్తమిస్టుకరోద్గారహాసితం చ శతక్రతుః ।
జగ్రాహ ముదితసగ్వి బాహుభిర్బహు భూషణే॥
జగుర్గఛర్వముఖ్యాశ్చ ననృతుశ్చాపురోగణాః ।
పాదయన్తతిమధురం జగుర్గనర్వజన్న రాః॥
బిస్లా బిస్లో చ తోయస్య వసతే వత్సరం దివి ।
దశ కూపసమా వాపీ దశ వాపీసమో హదః॥
దశ హదసమః పుత్రో దశపు సమో ద్రుమః ।
ప్రోక్తాచే షేవ మర్యాదా నియతా లోక భావనీ॥
ఇత్యుక్తాస్తు తతో విప్రా బృహస్పతిపురోగమాః ।
జగ్ముస్వమన్దిరాగ్యేవ భవానీం వన్ద్య సాదరమ్॥
గతేషు తేషు దేవోపి శఙ్కరః పర్వతాత్మజాయ్ ।
పాణినా లమ్బమానేన శనైః ప్రావేశయచ్ఛుభామ్॥
చిత్తప్రసాదజననం ప్రాసాదమనుగోపురమ్ ।
లమ్బమౌక్తికదమానమతులం రత్న వేదికమ్॥
నిరౌతకలధౌతంచ క్రీడాగృహమనోరమమ్ ।
ప్రకీర్ణకుసుమామోదమత్తాళికులకూజితమ్॥
కిన్న రోడ్డీతసజీతం గృహా నరితభి త్రికమ్ ।
సుగనిధూపసజాతమనః ప్రాప్యమలక్ష్మి తమ్॥
క్రీడామయూర నారీభిర్వృతం వై తతవాదిభిః ।
హంససజ్జితసంఘుష్టం స్ఫాటిక స్తమ్భ వేదికమ్॥
అనావీలమతిప్రీత్యా బహుశ: కిన్న రాకులమ్ ।
శుకై ర్యత్రాభిహన్య నే పద్మరాగవినిర్మితాః॥
భిత్తయో దాడిమభాక్త్యా ప్రతిబిమ్బితమౌక్తికాః ।
పార్వతీపరమేశ్వరయోరక్షక్రీడావర్ణనమ్॥
తత్రాక్ష కీడయా దేవో విహరుముపచకమే॥
స్వచ్చేన్దనీలభూభాగే క్రీడ యత్రబింబితా ।
వపుస్సహాయతాం ప్రాప్తా వినోదర సనిర్వృతా॥
ఏవం ప్రక్రీడతో స్తత్ర దేవీశ జ్కరయో స్తదా ।
ప్రాదుర్భవన్మహాశబ్ద స్తద్గృహోదర గోచరః॥
మునులు ఇట్లు పలికినది విని తన మనస్సంతయు హర్షముతో నిండ పార్వతి ఇట్లనెను: పెద్దలు ఇట్లు చెప్పుదురు; జలమే లేని దేశమున కూప నిర్మాణము చేసిన వివేకి ఆ కూపమందలి జలమున ఎన్ని బిందువు లుండునో అన్ని సంవత్సరములు స్వర్గమున వసించును; వది బావులును ఒక హ్రదమును (పుణ్యమునిచ్చుటలో) సమానము; పది ప్రదములు ఒక పుత్రుడును సమానము; పదిమంది పుత్తులు ఒక వృక్షముతో సమానము; లోకస్థితి కరమగు మర్యాద (వ్యవస్థ పెద్దలచే ఇర్పరచబడినది॥ ఇట్లు ఆమె పలికిన పలుకులు విని బృహస్పతి మొదలగు ఆవిప్రులు భవానిని సాదరముగ నమస్కరించి స్వగృహముల కేరిరి॥ వారు వెళ్ళిన తరువాత ॥ శంకరదేవుడును శుభ రూపయగు పర్వతపుత్రిని చేట్ట పట్టుకొని గోపురములతో కూడినదియు చిత్తమునకు హాయిని కలిగించునదియునగు ప్రాసాదమును ప్రవేశింపజేసెను॥ మరియు ఆ ప్రాసాదము ము తేముల దండలు వ్రేలాడు చున్నట్టిది; నిరుపమానమైనది; రత్న వేదికలు కలది; పుటము వేసి శుద్ది చేసిన బంగారు కట్టడములు కలది; క్రీడాగృహములు కలిగి మనోరమమయినది; అంతట వెదజల్లబడియున్న పూల వాసనతో మత్తెక్కిన తుమ్మెదల గుంపు చేయు ఝుంకారపు రొదలతో నిండినది; కిన్నరులు ఉచ్పైఃస్వరమున పాడు సంగీత ధ్వనులు కలది; గదుల నడుమ చక్కని గోడలు కలది; సువాసనలు కల పొగల గుములతో మనస్సు నాకర్షించునది; ఇదివరకు ఎవరుసు ఎక్కడను చూచియుండనిది; ఆట నెమిళ్ళతోను (సుందరు లగు) స్త్రీలతోను వీణాది వాద్యముల మోయించువారితోను కూడినది; గుంపులే ధ్వనులు చేయుచున్న టి హంసలు కలది; స్పటిక మణి నిర్మితములగు స్తంభములును వేదికలును కలది; ఏ మాలిన్యమును లేనిది; అతి పీతియుక్తులై యున్న కింనరులతో నిండినది; దానియందలి పద్మరాగ మణుల గోడలను చూచి దానిమ్మ గింజలను భ్రాంతితో చిలుక లు॥ వాటిని తమ ముక్కులతో పొడుచుచుండును॥ ముత్తెములా ప్రాసాదపు గోడలందు ప్రతిబింబించి { రెట్టింపై కనబడుచుండును॥
ఇట్టి ప్రాసాదమునందు పరమేశ్వరుడు పార్వతితో పాచిక లాడుట మొదలు పెట్టెను॥ స్వచ్చమగు ఇంద్ర నీల ఫలకము నందాడుచు దానియందు ప్రతిబింబించిన తమ శరీరములే తోడుగా వినోదరస పారవశ్యముతో పార్వతీ పరమేశులుండిరి॥ ఇట్లా దేవీ శంకరులాడుచుండ ఆ భవనాంతరాళమునుండి , మహాధ్వని యుత్పన్నమై వినబడెను॥
తచ్ఛ్రుత్వా కౌతుకాద్దేవీ కిమేతదితి శఙ్కరమ్ ।
పప్రచ్ఛ తం శుభతనుర్హరం విస్మయపూర్వకమ్॥
ఉవాచ దేవీం నైత త్తే దృష్టపూర్వం శుచిస్మితే ।
ఏతే గణేశాః క్రీడ నే శైలేస్మిన్మతియాస్సదా॥
తపసా బ్రహ్మచర్యేణ నియమైః క్షేత్ర సేవనై ః ।
యైరహం తోషితః పూర్వం త ఏతే మనుషోత్తమాః॥
మత్సమీపమనుప్రాప్తా మమ హృద్యాశ్శుభాననే ।
కామతృప్త మహోత్సాహా మహారూపా గుణాన్వితాః॥
కర్మభిర్విస్మయం తేషాం ప్రయామి బలశాలినామ్ ।
సామరస్యాస్య జగత్సృష్టిసంహారణక్షమా॥
బ్రహ్మవిష్వైన్టగన్దర్వైస్సకిన్నరమహోరగైః ।
వివర్జితోప్యహం నిత్యం నై భిర్విరహితో రమే॥
హృద్యా మే చారుసర్వాజి త ఏతే క్రీడంతే గిరౌ ।
ఇత్యుక్తాతు తతో దేవీ త్యక్త్వా తద్విస్మయాకులా॥
గవాఔ నర మాసాద్య క్షత్ర తా న్మితాననా ।
యావ నస్తే కృశా దీరా హ్రస్వాస్థ్సూలా మహోదరాః॥
వ్యాఘీభపదనాః కేచితే చిన్మేషాజరూపిణః ।
అనేకప్రాణిరూపాశ్చ జ్వాలాస్యాః కృష్ణపిశాః॥
సౌమ్యా భీమాస్మితముఖాః కృష్ణ పిజ్జజటాసటాః ।
నానావిహజవదనా నానావిధమృగాననాః॥
కౌశేయచర్మవసనా నగ్నా శ్చాన్యే విరూపిణః ।
గోకర్ణ గజకర్ణాశ్చ బహువ క్లేక్షణోదరాః॥
బహుపాదా బహు భుజా దివ్యనానాస్త్రపాణయః ।
అనేక కుసుమాపీడా నానావ్యాశ విభూషణాః॥
వృత్తానసాయుధధరా నానాకవచభూషణాః ।
విచిత్రవాహనారూఢా దివ్యరూపా వియచ్చరాః॥
వీణావాద్య రవాఘష్టా నానార్థానకనర్తనాః ।
అది విని శుభ శరీరయగు దేవి కుతూహలముతో విస్మయముతో ఇది ఏమియని శంకరునడిగేను॥ శివుడును శుచియగు చిరునగవు కలదానా! నీవిదివరకు కని విని యుండవు; నా పీతికి పాత్రులగు గణాధిపతులీ · లమున సదా క్రీడించుచుందురు! ఆదియే ఇది; అనెను॥ తపముచే బ్రహ్మచర్యముచే నియమములచే క్షేత్ర సేవనములచే పూర్వ జన్మములందు నన్ను మెప్పించినవారే వీరు; శుభాననా! ఆ మనుజులట్లు నా హృదయమును తమ వశ మొనర్చుకొని నన్ను చేరి తమ కామముల (కోరికల) నీడేర్చుకొనిన మహోత్సాహులు; మహారూపులు॥ సద్గుణాన్వితులైన వీరిని చూచి నా కే యాశ్చర్యము కలుగుచుండును॥ దేవాదులతో కూడ ఈ జగమంతయు సృష్టింపసంహరింపగల వారు॥ వీరు; బ్రహ్మ విష్టింద్ర గంధర్వ కిన్నర మహోరగాదులేవ్వరు నాకడ లేకున్నను వీరు నన్నె ప్పుడును విడువరు; వీరు మనోహర సర్వావయవులయి॥ నామనస్సు లోగొనువారు; అట్టి వీరు ఇపుడి శైలమున క్రీడించుచున్నారు; అనిన శిపుని వచనములు విని వెంటనే దేవి ఆశ్చర్యవశురాలై ఆట విడిచి గవాక్ష రంధ్రములనుండి ఆది చూచుచు వికసితముఖి యయ్యెను॥ వారెందరందరును చిక్కినవారు పొడగరులు పొట్టివారు లావగువారు పెద్ద కడుపుల వారు పులుల॥ ఏనుగుల మొగములవారు॥ మేకల గొర్రెల రూపములవారు అనేక ప్రాణి రూపములవారు మం డెడి మొగములవారు నల్లనివారు పింగళ వర్ణులు సౌమ్యులు భయంకరులు స్మిత ము ఖులు నల్లని॥పింగ వర్ణపు జడలు జూలు కలవారు॥ నానా వక్షముఖులు సోనా మృగ ముఖులు పట్టువస్త్రములు॥మృగ చర్మములు దాల్చినవారు-దిస మొలవారు॥విరూపులు॥ ఆవు చెవులవారు ఏనుగు చెవులవారు బహుముఖ నేత్రోదరముల వారు బహుపాదులు బహుభుజులు దివ్య నానాస్త్రములు చేబూనినవారు అనేక కుసుమములు కొప్పులందు దాల్చినవారు నానా సర్పభూషణులు తోడేళ్ళ మాములవారు నానాయుధధారులు నానా కవచ నానా భూషణ ధారులు విచిత్ర వాహనారూఢులు దివ్యరూపులు గగన సంచారులు వీణాది వాద్యముల మోయించువారు నానా భూమికలు (వేషములు) దాల్చి నృత్యములొనరించువారు నయియుండిరి॥
గణేశాంస్తాం స్తదా దృష్ట్వా దేవీ ప్రోవాచ శ జ్కరమ్॥
దేవీః గణేశాః కతి సఖ్యాతాః కింనామానః కిమాత్మకాః ।
ఏకైకశో మమ బ్రూహి ధిష్ఠితా యే పృథక్ఫృథక్॥
ద్రష్టుమభ్యన్తరం నాకవాసిష్విన్దుమౌళిం ప్రవి షేషు కక్యా న్తరమ్ ।
వాహనాధ్యావరోహా గణా సైర్యుతో లోకపాలై రస్రజం ముద్గరం లోడయక్
ఖడ్గపాశాసిదణోత్కరానిర్మమః కృతాన్తః కస్య కేనాహతో బ్రూత యాతేనవధ్యో స్తి దణేన కిం దుఃస్పృహాః।
భీమమూర్త్యా ననేనానేనాసికృత్యం గిరౌ య ఏషోస్త్రఙ్ఞాన కిం వధ్యతే ।
మా వృథా లోకపాలానుగాబిభ్యత ఏవ మేవై తదిత్యూచుర స్మై తదా దేవతాః ।
దేవదేవానుగం వీరకం లక్షణా ప్రాహ దేవీ వనం పర్వతా నిర్ఘ రాణ్యగ్ని దేవానథ్ ।
భూతపా నిర్ఘ రామ్భోనిపాతేషు నిమజ్జతః ।
పుష్పజాలావనథేషు ధామస్వపి ప్రోత్తుఱ్ఱనానాదికుళ్లైష్వనుగర్జతో హేమారుతాన్ఫోటనజేపణానామతః ।
కాళ్చానోత్తుజశృఙావరోహక్షి తొ హేమరేణూత్కరా సజ్జపిజ్జద్యుతిమ్ ।
వనే చారిణామవ్యసౌ చాతిర మ్యో బభౌరూపసమ్పన్న కో శే గణాధీశితుః ।
మన్గరకన్దరే సున్దరోదారపుష్పప్రవాళామ్బుజే సిద్ధనారీభిఃపీత రూపామృతం
విస్తృతై ర్నేత్రపాత్రైరనున్మేషిభిర్వీరకం శైలపుత్రీ నిమేషా నరాదస్మరత్పుత్తగృధ్నీ వినోదార్ధినీ ।
సోఽపి తాదృక్షణావా పపుణ్యోదయో యోపి జన్మా నర స్యాత్మజత్వం గతః
క్రీడత స్తస్య తృప్తిః కథం జాయతే యోపి భావిజగద్వేధసా తేజసః కల్పిత ప్రతిక్షణం దివ్యగీతక్షణే నృత్యలోలో గణేశై స్స్వప్రణతక్షణ సింహనాదారులే గజ్జ శైలే సృజద్రత్న జాలే బృహతాలతాలేక్షణే ఫుల్లనానాతమాలాలికాలేక్షణం వృక్షమూలే విలోలో మరా ళేక్షణే స్వల్పపజ్కే జలేపజజాఢ్య క్షణం మాతురజే శుభే నిష్కళ జ్కే పరిక్రీడతే బాలలీలావిహారీ గణేశాధిపో దేవతానందకారీ ।
నికుఞ్జేషు విద్యాధరై ర్గీతశీలః పినాకీవ లీలావిలా నైస్సలీలః॥
తన పెంపుడు కొడుకయిన వీరకునకు దేవి చేసిన బాలోచిత హితోపదేశము॥
(ఇది గేయాత్మకమగు గద్యము): పార్వతి వీర కుని తన కడకు పిలుచుకొనుచు “రారమ్ము నాయనా! వీర కాః దేవదేవుడు నాకు నిన్ను పుత్రునిగానిచ్చినాడు; కావున నీవు నాకు కుమారుడవయితివి! అనుచు అతనిని తన తొడ పై కూర్చుండ బెట్టుకొని చెక్కిళ్ళు నిమురుచు అతని ముద్దు మాటల కానందించుచు తల మూస్కొని అవయవముల (ధూళి) తుడిచి దివ్య భూషణములతో కోమల పల్లవములతో గజ్జెలు మొలత్రాడు అందేలు రత్నాల భుజకీర్తులు హారములు, పుష్పమాలలు మొదలగు వానితో స్వయముగా నలంకరించెను॥ శుభ్ర విభూతులతో మంత్రించిన ఆవాలతో ॥ శరీర రక్ష చేసెను॥ పిమ్మట ఆమే వీరకునితో ఇట్లు బాలురకు చేయదగిన హితోపదేశము చేసెను; నాయనా! జాహ్నవీ జలమున ప్రవేశింపకుము॥ కల్లోలితమగు నీటితో వ్యా ప్రమయిన చోట్ల నది యొడ్డునకు కూడ పోవకుము॥ బహుదుష్ట వ్యాఘ్రము లతో నిండిన అడవులు కలవు॥ వానియందు ప్రవేశింపకుము॥ అనెను॥
అసంఖ్యాకులగు గణేశులయందును తనకతి ప్రీతిపాత్రుడగు ఈ వీరకుని విషయమున దుర్గామూర్తియగు పార్వతి పుత్ర భావముతో నంతుష్టాంతరంగయై వాత్సల్యముతో నుండును॥ అందుచేతనే ఆమె అతనితో పైవిధముగా చెప్పెను॥ ఈ విధమగు వాత్సల్యము తమతమ పుత్తుల విషయమున లోకమునందలి మాతా పితరులెల్లరు కోరు కొనునదే; కాని వారి వాత్సల్యములో మాయావరణముండును; పార్వతి చూపు వాత్సల్యము మాయ నతిక్రమించినది; మాయాతీతమయినది; ఆ వీరకుడును చిలిపి చేష్టలకు పోక సర్వగణ ప్రమథలతో కూడి బాల్యమునకు తగిన ఆటల వలని ఆనందరసమనుభవించు ఆస క్తితో ఇట్లు పలికెను: ఇదుగో! ఇచ్చట మా అమ్మ నాకు తాను స్వయముగా చేసిన భూషణాలంకార సంస్కారము; ఇదిగో వస్త్రము; ఇవిగో దీనియందు సన్న ని చుక కాలు; సింధువార పుష్పములతో కూర్చినది మాలతులు నడుమ నడుమ కూర్చినదియగు మాల ఇదిగో! మా అమ్మ నాతలలో ఉంచినది; వాద్యములు మోయించెడి ఈ గణనాధులకీ ఆటవస్తువునిత్తును; అనుచు ఆడుచున్న ఆ వీర కునివై పు పార్వతీదేవి తన చెలితోకూడి గవాక్ష మునుండి దక్షిణమునుండి పడమటకు ఆటనుండి ఉత్తరమునకు ఆటనుండి తూర్పునకు వచ్చుచు పోవుచు చూచుచు అతని ఆటల ముచ్చట కనుచుండెను॥ జగన్మాతకును ఇట్టి చిత్త భ్రమ మాశ్చర్యకరముగదా! ఆమెయే ఇటైనచో అల్ప బుద్దులు జడులు మాంసర క్త మలమూత్ర సముదాయ నిర్మిత శరీరులునగు సాధారణ జనులు పుత్తుల పై మోహ మందుటలో నాశ్చర్యమేమి ?
ఇది ఇట్లుండ ఇంతలో శివుని దర్శింపగోరి దేవతలు తమతమ వాహనముల పై వచ్చి వాటిని దిగి కక్యాంత రములు ప్రవేశించుచుండిరి॥ అంతలో ప్రమథగణనాధులు వచ్చి వారి వాహనములు (అల్లరిగా) ఎక్కుచు దిగుచు ఇట్లనుచుండిరి : అరే? ఈ యముడు తక్కిన లోకపాలురతో కలిసి ముద్దరము మాత్రము చేతిలో ఊగించుచు ఖడ్గము పాశము అసి (ఒక విధమగు ఖడ్గము) దండము మొదలగు ఆయుధములందు మమకార మేలేక యున్నా డే! ఈతడు ఎవరిపోడు ? వీనినీ ఇటు చూచి ఎవరైన పట్టుకొని కొట్టినచో ఏమీగతి! వీనికి ఇది ఏమీ! ఇంత అలక్ష్యము! ఈతని భయం కర ముఖమును ఆకారమును చూచి ఎవరు భయపడుదురు? ఈ పర్వతమున ఇట్టి యాకారముతో పని మాత్ర మేమున్నది? ఈతని ఆకారము చూచి ఇతడు ఆస్త్ర నిపుణుడని ఈతని నెవ్వరు కొట్టకుందురు? అనుచునే వేళాకోళము లాడుచున్న ప్రమథులను చూచి దేవతలు యమునితో “ఆఁ! వీరి చిలిపి చేష్టలును కొంటే మాటలును ఇంతియేలేమ్ము! లోకపాలానుచరులారా! మీరును వీరికి భయపడకుడు॥” అని ధైర్యము చెప్పుచుండిరి॥ వారిలో చేరి ఈ వీరకుడును ఆడుచుండెను॥
దేవికి ఆతని మీది మమకారము అమితము; ఆందుచే అతడు వనములందాడుకొనబోవునపుడు రక్ష సేయగోరి వన పర్వత నిర్ఘరములందును అగ్ని దేవతా మార్గములందును ప్రకృతియందు సంచరించు భూతములను పొదరిండ్ల యందు సంచరించు జల ప్రపాతములందు మునిగియుండు॥పుష్పజాల వ్యాప్త స్థానములందు సంచరించు॥ ఉన్నత నానా పర్వత నికుంజములందు ధ్వనించు వాయువులను ఉద్దేశించి ఆమె “ఓ వాయువులారా! మీరు విజృంభణము తగ్గించి వీరకుని ఇచ్చకు తగినట్లు వీచుడు॥" అని పలికెను॥ మేరు పర్వతపు ఎత్తైన శిఖరములనుండి దీగుచు (జారుడుబండ ఆట) ఆడి బంగారు రేఖలతో బంగారు ధూళితో ఒడలు నిండిపోవగా దేవతలు సంచరించు వన రమ్య దేశములందు ప్రమథ గణములు తన వెంటనుండి కొలువగా సుందర మందార వుష్పములు చిగురాకులు పద్మములు గల మందర పర్వత కందరములందు సిద్ద స్త్రీలు తన రూపామృతము తావుచుండ పార్వతి అతని వినోదములకు వేడుక పడుచు నిమిషము కూడ జెప్ప వాల్ఫక విప్పారిన కన్నులతో పుత్ర వాత్సల్యముతో వీరకుని చూచుచుండెను॥ అతడును అట్టి ఉత్సవ ములననుభవించగల్గుట తన పుణ్యోదయమనుకొనుచు తాను పూర్వ జన్మాంతరమందును ఆమెకు పుత్రుడై యుండెనని గుర్తించి ఎంతకును తృప్తినందక ఆడుకొనుచుండెను॥ ఆ శుభరూపుడు బ్రహ్మదేవుని తేజముతో సృషింపబడినవాడు కాని సామాన్యుడు కాడు; ప్రతిక్షణమునను దివ్యులు పాడు గీతముల వినుచు వారి నృత్యముల నొస క్తితో చూచుచు గణేశుల వందనములందుకొనుచు రత్న జాలపూర్ణ మై పెద్ద సాలలాల వృక్ష పూర్ణమయి సింహనాదాకులమగు గండ శైలములందు విచ్చిన నానా తమాల వృక్షములు కల తావులందు క్రీడించు హంసలు గల తావులందు చెట్ల మొదళ్ళ యందు బురద అంతగా లేని తామర కొలకుల జలములందు శుభము నిష్కలంకమునగు తల్లి ఒడియందు ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షణకాలము గణేశులకును ఆధిపతియగు ఆ వీరకుడు బాలక్రీడలతో విహార వినోదమనుభవించుచు ఆడుకొనుచుండెను॥ ఆతడు దేవతల కానందము కలిగించుచు తిరుగుచుండెను॥ విద్యాధరులాతనిపై గీతములను పొదరిండ్ల యందు కూర్చుండి పాడుచుండెడివారు॥ ఆతడు మహాదేవుడును పినాక ధారియునగు శివుని కంటే తక్కువ వాడు॥ ఐనను ఈతడును ఆతని వలేనే లీలా విలాసములతో కూడి క్రీడించుచుండెను॥
సాయజ్కాలవర్ణనమ్॥
ప్రకాశ్య భువనాభోగం తతో దినకరే గతే ।
దేశాంతరం తదా పశ్చాద్దూరమస్తావనీధరమ్॥
ఉదయ స్తే పురో భావీ యో హి చాస్తేఒవనీధరః ।
మి తత్వమస్య సుదృఢం హృదయే పరిచి న్యతామ్॥
నిత్యమారాధితశ్శ్రిమాన్పృథుమూలస్సమ స్తతః ।
నాకరోత్సవితుర్మేరురుపకారం ప్రతిష్యతః॥
యతి ష్యేమావిమం సేతి సంశ్రయేతాఖిలం బుధః ।
దీనార్లానుగతో భానుస్స్వజనత్వమపూరయత్॥
సన్ద్యాబద్దాజ్జలిపుటా మునయోభిముఖి రవిమ్ ।
యాచస్త్యాగమనం శీఘం నివార్యాత్మని భావితామ్॥
వ్యజృమ్బదథ లో కేస్మినద్వైభావరం తమః ।
కుటిల స్యేవ హృదయే కాలుష్యం దూషయన్మనః॥
జ్వలత్ఫణిఫణారత్న దీపోద్ద్యోతితభిత్తికే ।
శయనం శశిసఙాత శుభ్రవస్తోత్తరచ్చదమ్॥
నానారత్న ద్యుతిలసచ్ఛక్ర చాపవిడమ్బకమ్ ।
రత్న కిక్కిణి కాజాలం లమ్బముక్తాక లాపకమ్॥
కమనీయచలల్లోలవితానాచ్ఛాదితామ్బరమ్ ।
మన్దరే మన్షసజ్చారశనైర్గిరిసుతాయుతః॥
తస్థా గిరిసుతాబాహులతావలితకన్జరః ।
శశిమౌళిసితజ్యోత్స్నా శుచిపూరితగోచరః॥
గిరిజాప్యసితాపాణ్ణి నీలోత్పలదళ చవిః ।
విభావర్యాచ సమ్పృక్తా బభూవాతిత మోమయీ॥
తామువాచ హసన్ దేవః క్రీడా కేశిక లాయుతామ్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే దేవాసురసజ్గ్రామే పార్వతీపరమేశ్వరయోర్వివాహాదికథనం నామ త్రిపఞ్చాశదుత్తర శతత మోధ్యాయః॥
భువన విస్తారమును ప్రకాశింపజేసి ఆస్త పర్వతమునకు వెనుక దూరమున నున్న దేశాంతరమునకు రవి వెడలిపోయెను॥ మేరుపర్వతము తాను అవనీధరమే భూమికి గల సుఖదుఃఖముల బరువును మోయునదే కదా! రవియును (తనకును లోకమునకు వలెనే) మిత్రుడు (స్నేహముతో మండు వాడు॥రవి॥అని రెండర్థములు॥ ఇది కాక-ఉద యించు సూర్యునికి మిత్రుడు ఆనియు ఆ స్తమించు రవికి వరుణుడు అనియు శాస్త్ర వ్యవహారము॥) కదా! ఆతని దృఢ మిత్రత్వమును ఆలోచించియే కాని ప్రతినిత్యమును ఆ రవి తను ఆరాధించుచున్నాడు కదా ! రవి సదా మేరువును ప్రదక్షిణించు చుండును అని ఆలోచించి విశాలమగు మూలము (మూలధనము) లోక మందంతటను కల మేరువు పడ మటి సముద్రములో ఆ స్తపర్వతమునకు వెనుకగా పడిపోవుచున్న (చిక్కులలో పడిపోవుచున్న) రవికి ఏమియు ఉప కారము చేయలేదు-(ఇది దుష్టుని స్వభావము కావున) వివేకి ఎప్పుడును ఉత్తమునినే ఆశ్రయించవలయును॥ పాపము! ఆ మేరు పర్వతము రవిని “ఓయీ! నీవు మనస్సులో చింతపడకుము; నీ పునర్వృద్దికయి యత్నింతు"నని మాట మాత్రమైన ఆనలేదే! ఐనను చింతపడక భానుడు దినాంతమను ఆవసానదశ తన వెంటరాగా బాధనందక తాను సర్వ ప్రాణులకును స్వజనుడు అను మాటను నిలువబెట్టుకొనెను॥ రవికి రాబోవు భావి దుర్దశా దుఃఖమును ఆత్మల తమ మనస్సుల) యందే అణచుకొని మునులు బద్దాంజలి పుటులై రవి కభిముఖులయి మరల శీఘ్రముగ రమ్మని ప్రార్థింప సాగిరి॥
క్రమముగ ఈ లోకమునందంతట విభావరికి (లోగడ బ్రహ్మ ఏ దేవిని ప్రళయాధిష్ఠాత్రిని యోగమాయను॥ ప్రార్థించెనో ఆ దేవియే ఈ విభావరి-రాత్రి) సంబంధించిన చీకటులు చేలరేగెను॥ ఆది నజ్జనుల మనస్సును కూడ కలుషితము చేయు దుర్జనుల హృదయములందలి మాలిన్యమువలె నుండెను॥
శివుని శయనమందిరము నందలి గోడలు మహానాగముల పడగలందు జ్వలించు రత్న దీపములతో మిగుల ప్రకాశించుచుండెను॥ అందలి పానుపు నానా రత్న కాంతులతో ఇంద్ర ధనువువలే మెరయుచుండెను॥ దాని పై చంద్రుల సముదాయము వంటి తెల్లదుప్పటి పరచియుండెను॥ దానిపయి రతనాల చీరుగ జైలు వేలాడుచుండెను॥ ము తెముల గుత్తులును వ్రేలాడుచుండెను॥ మనోహరమయి చంచలమయి కదలియాడు మేలు కట్టు ఆకాశమునే క్రమ్మివేయు చున్న దో యనునట్లుండెను॥ ఇట్టి మందిరమున ఇట్టి పాన్పు పై శంకరుడు మంద నంచారుడయి మెల్లగా గిరి సుతతో కూడి కూర్చుండెను॥ క్రమముగా ఆతని కంఠము పార్వతీ బాహులతాలింగనములో మునిగేను॥ అతని శిరమందలి చంద్రుని తెల్లని వెన్నెలలతో నిండి ఆ పరిసర ములన్నియు పవిత్రములును నిర్మలములునయ్యెను॥ పార్వతియును స్వాభావికముగనే నల్లనికడ గన్నులు కలది; ఆమే మేనిఛాయ నల్ల కలువ పూ రేకుల చాయను పోలినది; ఈ కాంతి విభావరీ (రాత్రి) కాంతితో సంపర్కమునంది అతి తమోమయమై కడు నల్ల నయి తోచెను॥ తనతో క్రీడించు తమ కమున ఆ కళలనెరిగి తన కడనున్న యాదేవితో మహాదేవుడు చిన్న గ నవ్వుచు ఇట్లు పలి కెను;
ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున పార్వతీ పరమేశ్వర వివాహాది కథా నిరూపణమను నూట ఏబది మూడవ అధ్యాయము॥
Summary of chapter 153 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya narrates the ultimate defeat of the celestial army as Andhakāsura claimed complete dominion over Svarga. Homeless and stripped of their sacrificial shares, the Devas led by Indra fled from the celestial spheres and traveled to Mount Kailāsa, the sanctified abode of Mahādeva. Arriving at the holy mountain, the Devas prostrated themselves before Mahādeva and Goddess Pārvatī, offering heartfelt prayers and describing the severe oppression inflicted upon the universe by Andhakāsura. Mahādeva assured the Devas of His protection, pledging to dismantle the tyrant's power and restore Dharma across the cosmos.