194 - ఋషి గోత్ర ప్రవర విషయ పరిచయము॥

[బ్రహ్మ మానస పుత్రులగు సప్త మహరులను బట్టి ఏర్పడిన సప్త ప్రధాన గోత్ర వర్గములును -ఎనిమిదవవాడుగా అగస్త్యుడు కూడ గ్రహింపబడగా మొత్తమెనిమిది ప్రధాన ఋషి గోత్రముల వర్గములగుననీ సంప్రదాయము చెప్పుచున్న ది బౌధాయనముని ఈ విషయమున ఇట్లు చెప్పెను:

“విశ్వామిత్రో జమదగ్ని ర్భర ద్వాజోథగౌతమః

 అత్రిర్వసిష్ఠః కశ్యప ఇత్యేతే సప్తఋషయః

సప్తానామృషీణా మగస్త్యాష్టమాసాం యదపత్యం తత్ గోత్రం ఇత్యాదక్షతే

ఈ చెప్పిన ప్రధాన ఋషుల ఆపత్యము (ఆపత్యమనగా స్త్రీ సంతానము కూడ కావచ్చును కాని ఇచట పురుష సంతతి మాత్రమే గ్రహించవలెను) [అనగా కుమారులును వారికి తరువాతి తరములవారును] గోత్రము అని వ్యవహ రింపబడును

గోత్రములను పేర్కోనునపుడు ప్రవర ఋషులను కూడా పేర్కొనుట సంప్రదాయము; ప్రవక శబ్దమునకు అర్థము విషయమున మాధవాచార్యులు “ప్రవరము అనునది ఆయా గోత్రములను ప్రవర్తిల్లచేసిన ముని వ్యక్తిని అదే పేరు గల మరియొక మునినుండి వేరుపరచు ముని సమూహము" అని చెప్పిరట కాని అది దోషగ్రస్త లక్షణము అని స్మృతి కౌస్తుభిమను ధర్మశాస్త్ర గ్రంథమును రచించిన అనంత దేవుడు ఖండించేను॥॥ అనంత దేవుడు ప్రవరను గూర్చి ఇటు చెప్పెను: “ప్రవరణము-ప్రవరము రెండు పదములును సమానార్థకములు, ఈ పదములకు ప్రార్థనము అని అర్థము; ఆయా శ్రాతస్మార్త కర్మానుష్టానములందు యజమానుడు స్వయముగా గానీ యజమానుని పక్షమున ఋత్విక్కులు కాని అగ్ని ని ఉద్దేశించి ప్రార్థన మొనర్పవలేను దాని యందు యజమానుని వంశ పూర్వులలో జనించియుండిన మంత్ర కర్త (ద్రష్ట) లగు ఋషులను పేర్కొనవలేను ఆ ఋషులే ప్రవర ఋషులు” అని అనంతదేవుడును అతని తమ్ముడు ‘సంస్కార కౌస్తుభ’ రచయితయగు జీవదేవుడును చేప్పిన వచనముల సారాంశము

గోత్ర ప్రవరాదికము - క్షత్రియ వైశ్యుల గోత్రములు॥

ఈ చేప్పిన విషయము బ్రాహ్మణులకు సంబంధించిన గోత్రముల విషయమున అన్వయించును వీరితో పాటు ద్విజులే అయి ఉండిన క్షత్రియ వైశ్యులలో క్షత్రియులను 'మానవ్య' గోత్రము వారినిగాను, వైశ్యులను ‘భలందన’ గోత్రము వారినిగాను చెప్పవలెననియు-వీరికి పూర్వము పురోహితులుగా (విద్యా గురువులుగా) ఉన్న వారి గోత్రములే వీరి గోత్రములు అనియు రెండు పక్షములు ఉన్న వి వీనిలో రెండవ పక్షము చాల నముచితము అభిజన కృత గోత్రము బ్రాహ్మణులది కాగా విద్యా కృత గోత్రము క్షత్రియ వైశ్యులది; ఆనగా వీరికిద్దరకును ఆర్ష గోత్రము ఈ విధముగా అన్వయించును

ఈ మత్స్యపురాణమున భృగువు - అంగిరుడు అత్రి-విశ్వామిత్రుడు-కశ్యపుడు – వసిష్ఠుడు-అగస్త్యుడు-అనువారి గోత్ర ప్రవరముల వివరణము మాత్రమున్నది]

సూతః : ఇత్యాకర్ణ్య న రాజేంద్ర ఓఙ్కారస్యాభివర్ణనమ్

తతః పప్రచ్ఛ దేవేశం మత్స్యరూపం జలార్ణవే

మనుః : ఋషీణాం నామగోత్రాణి వంశావతరణం తథా

ప్రవరాణాం తథా సామ్య మసామ్యం విస్తరా ద్వద

 మహాదేవేన ఋషయ శ్శప్తా స్స్వాయమ్భువే నరే

 తేషాం వైవస్వతే ప్రాప్తి సమ్భవం మమ కీర్తయ

 దాక్షాయణీ నాం చ తథా ప్రజాః కీర్తయ మే విభో

 ఋషీణాంచ తతో ,వంశా నృగువంశ వివర్ధనాక్

 మత్స్యః : మన్వన్తరేస్మి నమస్తే సప్తవై వస్వతే పురా

అశ్వమేధేతు వితతే బ్రహ్మణః పరమేష్ఠిన

 మహాదేవస్య శా పేన త్య క్త్వా దేహా న్వయం తతః

ఋషయశ్చ సముద్భూతా శ్చ్యుతే శు కే యదృచ్చయా

 దేవానాం మాతరో దృష్ట్వా దేవపత్య స్తథైవచ

సన్నం శుక్రం మహారాజు బ్రహ్మణః పర మేష్టినః

 తజ్ఞుహావ తతో బ్రహ్మా తతో జోతా హుతాశనాత్

తతో జాతో మహాతేజా భృగుశ్చ తపసాం నిధిః

 అజ్ఞారేష్వజిరా జాత స్సోర్చిళ్యోతి స్తథైవచ

 మరీచిభ్యో మరీచిశ్చ తతో జాతో మహాతపాః

 కే శై స్తు కపిశో జాతః పులస్త్యశ్చ మహాతపాః

 కే శై : ప్రలమ్బైః పులహ స్తతో జాతో మహాయశాః

 వసుమధ్యాత్సముత్పన్నో వసిష్ఠశ్చ తపోధనః

 భృగుః పులోమ్న శ్చ సుతాం దివ్యాం భార్యా మవినత

 యస్యామస్య నుతా జాతా దేవా ద్వాదశ యాజ్ఞికాః

 భువనో భౌవన శ్చైవ సుజన్య స్సు జన స్తథా

 శుచిః క్రతుశ్చ మూర్ధాచ యాజ్యశ్చ వసుధశ్చహ

 ప్రభవశ్చావ్యయ శ్చైవ దక్షోథ ద్వాదశ స్తథా

 ఇత్యేతే భృగవో నామ దేవా ద్వాదశ కీర్తితాః

 పౌలోమ్న్యాం జనయద్విప్రా శ్లేవానాంచ కనీయసః

 చ్యవనంచ మహాభాగ మాప్నువానం తథైవచ

ఆప్ను వానాత్మజ శ్చార్వో జమదగ్ని స్తథాత్మజః 

సూతుడు ఋషులతో ఇట్లు చెప్పెను: రాజేంద్రుడగు వైవస్వత మనువు ఓంకారాభి వర్ణపమును విని అనంతరము జలార్ణవమునందు మత్స్యరూపముననున్న దేవేశుడగు నారాయణునీ ఇట్లు వేడెను: ప్రభూ! ఋషుల సొమములను నామము లనుబట్టి ఏర్పడిన గోత్రములను ఏయే వంశములవారు ఏ గోత్రమున జనించిరో ఎరుగు విధమును గోత్ర నామములతో సంబద్ధములయియున్న ప్రవరముల సమానత్వా సమానత్వములను (ఇవి వివాహాది కార్యముల విషయమున సగో త్రత్వమును నిర్ణయించుటకును గోత్ర భేదముల గుర్తించుటకును ఉపకరించును కావున) నాకు సవిస్తరముగా తెలుప వేడెదను స్వాయంభువ మన్వంతరమున మహాదేవుడు (శివుడు) ఋషులను శపించెనుక దా! వైవస్వత మన్వంతరము వచ్చిన తరువాత మరల పారు పుట్టిన విధమును దక్ష పుత్తికల సంతతులను వారినుండి వర్ధిల్లిన ఋషి వంశములను భృగు వంశ ప్రవర్తకులను నాకు తెలుపవేడెదను

ఇట్లడిగిన వైవస్వత మనువునకు మత్స్యరూప జనార్దనుడు ఇట్లు చెప్పనారంభించెను పూర్వము స్వాయంభువ మన్వంతరమున పర మేష్టి (పరమాకాశమునందు- ఉత్తమ స్థానమునందు ఉండువాడు) అగు బ్రహ్మ అనుష్ఠించు యజ్ఞము వితతమయి యజ్ఞ పరికర ప్రసారణము చేయబడి) ఉండగా మహాదేవుడిచ్చిన శాపముచే ఋషులు స్వయముగా దేహ త్యాగము చేసిరి తరువాత వారు వైవస్వత మన్వంతరము వచ్చిన తరువాత యాదృచ్చిక ముగా స్కన్న మయిన (పట్టు తప్పి జారిపడిన) బ్రహ్మదేవుని శుక్రమునుండి సముద్భవించిరి ఆది ఎట్లన-దేవమాతలను దేవపత్ను లను చూచిన తరి బ్రహ్మ దేవుని శుకము సలీతమయ్యెను ఇది లోకములో జరుగునట్టిది కాదు బ్రహ్మ యనగా నేమి దేవమాతలు దేవ పత్ను లు అను వారెవ్వరు అను విషయములను ప్రతీక రూపముగా శాస్త్రీయార్థమును గ్రహించినపుడే ఈ విషయము తెలి యును) దానిని బ్రహ్మ హోమము చేసెను అంతట ఆగ్ని నుండి (ఈ వైవస్వత మన్వంతరపు) ఋషులు జనించిరి వారిలో మొదట భృగు మహర్షి జనించెను అతడు మహా తేజస్కుడునుతపోనిధియును; (ముందు చెప్పబోవు ఋషుల ఉత్పత్తిని బట్టి చూడగా భృగుడు సమగ్రమగు హోమాగ్ని నుండియే జనించెనని చెప్పవలయును) నిప్పు కణికలనుండి ఆంగీరుడును అర్చిస్సుల (జ్వాలల నుండి అతియు మరీచుల (తేజః కిరణముల) నుండి మహా తపస్కుడగు మరీచియు కేశములనుండి కపీశ (కశ్యపః) పులస్త్యులును ప్రలంబములగు (పొడపుగ వేలాడుచున్న) కేశముల (కోసల) నుండి పుల హుడును వసు (అగ్ని తేజో) మధ్యమునుండి వసిష్ఠుడును జనించిరి వీరు అందరును తపోధనులు

వీరిలో భృగువు పులోముడను రాక్షసుని కూతురై నప్పటికిని దివ్యత్వము నందిన) పౌలోమిని పెండ్లాడెను ఆమెయందు ఇతనికి యాజ్ఞికులు (యజ్ఞ ప్రవర్తకులు) అగు పండ్రెండు మంది కుమారులు కలిగిరి వారు1 భువ నుడు 2 భౌవనుడు 3 వసుజన్యుడు 4 సుజనుడు 5 శుచి 6 క్రతువు 7 వూర్ధన్ 8 యాజ్యుడు 9 వసుధుడు 10 ప్రభ వుడు 11 అవ్యయుడు 12 దకుడు ఈ పండ్రెండు మందియు దేవులు దేవతలలోని వారు గానే గణింపబడుచు భృగువులని ప్రసిద్దులేరి భృగువు పౌలోమియందు ఉత్పన్నుల నొనర్చిన చిన్న కుమారులు మరికొందరు గలరు వారు- 1 చ్యవనుడు ఆప్ను వానుడు (అను బ్రాహ్మణులు); ఆప్నువానుని కుమారుడు ఔర్వుడు; అతని కుమారుడు జమదగ్ని  

ఔర్వో గోత్రకర స్తేషాం భార్గవానాం మహాత్మనామ్

తత్ర గోత్రవరా న్వ్య భృగోర్వైదీ ప్తతేజసః

భృగుశ్చ చ్యవన శ్చైవ ఆప్ను వాన స్తథైవచ

ఔర్వశ్చ జమదగ్నిశ్చ వాత్యో దణ్ణి ర్న డాయనః

 వై గాయనో వీతహచ్యః వైల శ్చైపోత్ర శౌనక

 శౌనకాయనజీప ని రావేదః పార్షక(కార్పణిస్తథా) స్తథా

 వైహానరి ర్వీరూపాక్ష రౌహిత్యాయని రేవచ

వైశ్వానరి స్తథా నీలో లుబ్ద స్సావర్ణిక శ్చ సః

 విష్ణుః పౌరోషి బాలాకి రైలికానన భాగినః

 భృతభాగ్గేయ మారణ జవివో వీతిన సభా 

*మణ్డమాణ్డవ్యమూక ఫేనపా స్ఫురతి స్తథా

 స్థలపిణ్డ శ్శిఖావర్ణ శ్శార్కరాక్ష సభై వచ

 జైలధి సౌధిక శుభ్యః కుత్సన్యో మౌద్దలాయనః

 మర్కాయనో(కర్మాయనో) దేవపతిః పాణ్డు రోచిస్సగాలవః

 సాజృత్య శ్చాతకి స్సార్వ ర్యజ్ఞపిడ్డాయన స్తథా

 గార్ధ్యాయనో గాయనశ్చ ఋషి రొద్ఘాయన స్తథా

 గోష్ఠయనో వాత్స్యాయనో వైశమాయన ఏవ చ

వై కర్ణిని శ్శాజ్కరవో యాజ్ఞేయి రాష్ట్రకాయనిః

 లలాటి ర్నా కులిశ్చైవ లౌక్షిణ్య పరిమణలౌ

 ఆలుకి సౌచకి కౌత్స స్తథాన్యః ప్రజ్ఞలాయనిః

 సత్యాయని ర్మాలాయనిః కౌటిలి! కౌచహస్తిక 

సాహసో క్తి స్సకౌవాడ : కౌసి శ్చాన్దమసి స్తథా

 నైక జిహ్వా జిహ్మకశ్చ వ్యధాద్యో లోహవై రిణః

 శారద్వతిక నేతిష్యా లోలాక్షి శ్చలకుణ్ణల

 వాగాయని శ్చానుమతిః పౌర్ణిమాగతికోసకృత్

సామాన్యేన యథా తేషాం పక్షోతే ప్రవరా మతాః

 భృగుశ్చ చ్యవన శ్చైవ ఆప్ను వాన స్తథైవచ

ఔర్వశ్చ జమదగ్ని శ్చ వక్షోతే ప్రవరా మతాః

 పరస్పర మవై బాహ్యా ఋషయః పరికీర్తితాః

 బాహ్యా బాహ్య తథా చోఖే జ్ఞేయాస్త్రి ప్రవరా స్త్రిషు

 భృగుశ్చ జమదగ్నిశ్చ తథైవౌర్వశ్చ పార్థివ

మహాత్ములగు ఈ భృగు వంశము వారిలో ఔర్వుడు గోత్ర ప్రతిష్టావణుడు; దీప్త తేజస్సు డగు శృసునికి చెదిన గోత్ర ప్రవర్తక ఋషులను పేర్కొందును; భృగువు చ్యవనుడు ఆప్ను హనుడు ఔర్వుడు జమదగ్ని జాత్యుడు దండన్ నడాయనుడు వై గాయనుడు వీతి(త) హవ్యుడు పేలుడు శౌనకుడు శౌనకాయనుడు జీవంతి ఆవేదుకు కారణి (పార్షకుడు) వై హీ(హా)నరి విరూపాక్షుడు రౌహిత్యాయని వైశ్వానరి నీలుడు లుబ్ధుడు సొవర్ణికుడు విష్ణువు పౌనుడు బాలాక్షి ఐలికుడు అనంతభాగినుడు మృగుడు (భృత) మార్గే (భార్గే)యుడు మార్కండుడు జవినుడు (వీ)నీతినుడు మండుడు మాండవ్యుడు మాండూకుడు ఫేనపుడు సనతుడు (సురతి) సల పిండుడు శిఖావర్ణుడు - శార్కరాక్షి జాలధి సౌధికుడు క్షుభ్యుడు కుత్సన్యుడు వొదలాయనుడు మరా కర్మా యనుడు దేవపతి పాండురోచి గాలవుడు సాంకృత్యుడు చితకి సారి యజ్ఞపిండాయనుడు గార్ధ్యాయనుడు గాయనుడు గార్దాయనుడు గోష్టాయనుడు వాత్స్యాయనుడు వైశంపాయనుడు వై కర్ణిని శాంకరవుడు యాజ్ఞేయి భ్రష్టకాయనీ లలాటీ నాకుని లౌక్షిణ్యుడు పరికుండలుడు ఆలుకి సౌచకి కౌత్సుడు పైంగ లాయనుడు నత్యాయని మాలాయని కౌటిలీ కౌచహస్తికుడు సౌహసో క్తి కొవాక్షి కౌసి చాంద్రమసి నైక జిహ్వుడు జిహ్మ కుడు వ్యధాద్యుడు లోహవైరిణుడు శారద్వతికుడు నేతిష్యుడు లో లాక్షి-చలకుండలుడు వాగాయని అనుమతి పౌర్ణిమాగతికుడు ఆసకృత్ అనువారు వీరు; ఈ ఋషుల గోత్రములవారి) కండర కును సమాన రూపమున భృగువు -చ్యవనుడు - ఆప్ను వానుడు ఔర్వుడు జమదగ్ని - అను ఐదుగురును ప్రవర ఋషులు; ఆనగా పై చెప్పిన గోత్రములవారు పంచారేయ ప్రవ రాన్వితులు; నమాన ప్రవరాన్వితులు ఈ ఋష (లగోత్రముల వార)లు పరస్పరము ఇచ్చి పుచ్చుకొనుచు వివాహ సంబం ధములు జరుపుకొనరాదు

ఈ భృగుగోత్ర వర్గముల వారిలో కొందరు బాహ్యులు (ఆజామదగ్న్యులు) ఆబాహ్యులు (జామదగ్న్యులు) ఉదయులునని మూడు విధములుగా నున్నారని కొందర మతము; ఈ మూడు విధముల వారికిని సమానముగా భృగువు జమదగ్ని ఔర్వుడు ఆను మువ్వురే ప్రవర ఋషులని కొందర యభిప్రాయము,

ఈ మత్స్య పురాణానుసారము భృగు వంశోత్పన్నుల గోత్రములు ఆరు వర్గములుగా విభక్తములగును ఈ చెప్పిన వారందరును మొదటి వర్గమువారు

అతః పరం ప్రవక్ష్యామి శృణు త్వన్యా నృగూద్వహాన్

జమదగ్ని ర్భృగు శ్చైవ పౌలస్త్యో వై జభృ త్తథా

 ఋషిజ్చో భయజాతశ్చ కాయని శ్శాకటాయనః

ఔర్వేయా మారుతాశ్చైవ సర్వేషాం ప్రవరాశ్శుభాః

 భృగుశ్చ చ్యవన శ్చైవ ఆప్ను వాన సభై వచ

 పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః

భృగుదాసో మార్గ పథో గ్రామ్యాయని వటాయనీ

ఆప సమ్బ స్తథా భల్లి రైక శిః కపి రేవచ

 ఆర్షిషేణో బిన్దుభిశ్చ(గార్దబిశ్చ) కార్డమాయని రేవచ

ఆశ్వాయని స్తథా రూపిః ప్చ యాః ప్రకీర్తితాః

 భృగుశ్చ చ్యవన శ్చైవ ఆప్ను వాన సభై వచ

 ఆర్షి షేణ స్తథా రూపిః ప్రవరాః పజ్చకీర్తితాః

 పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః

 యస్కోవా వీతహవ్యోవా మతస్తు తథా దమః

 జై వస్తాయని మౌణ్ణుశ్చ పిలి శ్చైవ బలి స్తథా(చలిస్తథా)

 భాగిళ భాగవి శ్చ కౌశాపి స్వథ కాశ్యపిః

బాలపిళమదాగేపి సౌర స్తిథి సథే వచ

గ్రామదశ్చ తథై తేషామాగ్గేయః ప్రవరో మతః (గార్గేయస్త్వథజాబాలి)

 భృగుశ్చ వీతహవ్యశ్చ తథా జై వసవై తసః

 పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః

శాలాయని శ్శాకటాక్షో మైత్రేయః ఖాణవ స్తథా

 ద్రోణాయనో రోక్మాయనః పిశలీ చాపి కాయనిః

 హంసజిహ్వ సథే తేషా మారేయాః ప్రవరా మతాః

భృగు శ్చైవాథ వధ్యశ్వో దివోదాస సభై వచ

ఆర్షి షేణ స్తథా రూపః ప్రవరాః పజ్ఞ్చ కీర్తితాః

 పరస్పర మపై వాహ్యా ఋషయః పరికీర్తితాః

 ఏకాయనో యాజ్ఞవతి ర్మత్స్యగన్ద స్తథైవచ

 ప్రత్యూహశ్చ తథా సౌరి శ్చాడి ర్వై కార్డమాయని

 తథా గృత్సమదో రాజ ననకశ్చ మహా నృషిః

ప్రవరాస్తు తథోక్తానా మార్గేయాః పరికీర్తితాః

భృగుర్గృత్సమద శ్చైవ ఆర్షివేవకీ ర్తితో

ఏతే తవోహ్రా భృగువంశ జాతా మహాను భావా నృప గోత్రకారాః

ఏషాం తు నామ్నాం పరికీర్తనేన పాపం సమగ్రం విజహాతి జంతుః

 ఇతి శ్రీమత్స్య మహాపురాణే గోత్ర ప్రవరానుకీర్తనే భృగుగోత్ర ప్రవర వివరణం

నామ చతుర్న వత్యుత్తర శతతమోఽధ్యాయః

  (ఇక రెండవ వర్గము వారు:) ఇక మీదట మరికొందరను భృగువంశ శ్రేష్ఠులను తెలి పెదను: జమదగ్ని భృగువు పౌలస్త్యుడు బై జభృత్ ఋషి ఉభయజాతుడు కాయని శాకటాయనుడు - వీరు 8 మంది ఔర్వుని సంతతివారునుమరుత్ సంతతివారును; వీరికందరకును-భృగువు చ్యవనుడు ఆవ్ను వానుడు ఈ మువ్వురును ప్రవర ఋషులు; ఈ ఋషు(లగోత్రములవార)లు పరస్పరము ఇచ్చిపుచ్చుకొను వివాహ సంబంధములు చేసికొనరాదు,

మూడవ వర్గమువారు: భృగుదాసుడు మార్గపథుడు గ్రామ్యాయని వటాయని ఆప స్తంబుడు భల్లి నైకశి కపి ఆర్షి షేణుడు బిందుభి కార్డమాయని ఆశ్వాయని రూపి అను పదుముగ్గురును పంచాక్తేయులు భృగువు చ్యవనుడు ఆప్ను వానుడు ఆర్షి షేణుడు రూపి- ఈ ఐదుగురును ఈ ఋషు(లగోత్రముల వార)ల ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధము కూడదు

నాలుగవ వర్గమువారు: (16 మంది) యస్కుడు (వీతహవ్యుడు) మయితుడు దముడు జై వంత్యాయని మౌంజుడు పిలి బలి భాగీకుడు భాగ విత్తి కౌశాపి కాశ్యపి బాలపి శ్రమదాగోపి సౌరుడు తిథి గ్రామదుడు అను ఈ ఋషుల (గోత్ర ముల వారల)కు భృగువు వీతరావ్యుడు వేత సుడు అనువారు ప్రవర ఋషులు ఈ గోత్రములవారు పరస్పర వివాహ సంబంధము చేసికొనరాదు

ఐదవ వర్గమువారు; శాలాయనీ, శాకటాక్షుడు- మైత్రేయుడు ఖాండవుడు ద్రోణాయనుడు గౌక్మాయనుడు ఆ పిశలి ఆపికాయని హంసజిహ్వుడు అను ఈ ఋషుల గోత్రముల వారలకు భృగువు వధ్యశ్వుడు దివోదాసుడు ఆర్షి షేణుడు రూపి అను ఐదుగురును ప్రవర ఋషులు! వీరు పరస్పర వివాహ సంబంధములు చేసికొనరాదు

ఆరవ వర్గమువారు: ఏకాయనుడు యాజ్ఞవతి మత్స్యగంధుడు ప్రత్యూహుడు సౌరి ఔక్షి కార్గమాయని గృత్స మదుడు సనకుడుఅను ఋషు(ల గోత్రముల వార)లకు భృగువు గృత్సమదుడు ప్రవర ఋషులు; వీరు పరస్పర వివా హములు జరుపుకొనరాదు

ఈ చెప్పిన గోత్ర కారులగు భృగు వంశ జాతుల నామములను కీర్తించినంత మాత్రమున నరుడు నకల పాప విముక్తుడగురు

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భృగు గోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది నాలుగవ అధ్యాయము