మత్స్య మహా పురాణము
210 - సావిత్రి యమ సంవాదము - సావిత్రికి ద్వితీయ వరప్రాప్తి.
సావిత్రీ : కుతః క్లేశ కుతో దుఃఖం సద్బి స్సహ సమాగమే ।
సతాం; తస్మా న్న మే గ్లాని స్త్వత్సమీ పే సురోత్తమ॥
సాధూనాం వాప్యసాధూనాం సన్త ఏవ సదా గతిః ।
నై వాసతాం నైవ సతా మసన్తో నైవ చౌత్మనః॥
విషాగ్ని శతుశ హేభ్యోన తథా జాయతే భయమ్ ।
అకారణం జగద్వేరిఖలేభ్యో జాయతే యథా॥
నన్తః ప్రాణా న్పరిత్య క్వో పదార్థం కుర్వతే యథా ।
తథాసన్తోపి సన్యజ్య పరపీడాసు తత్పరాః॥
త్యజత్యసూ నయం లోక సృణవ ద్యస్య కారణాత్ ।
పరోపఘాతశ క్తి స్తం పర లోకం తథాసతః॥
నికాయేషు నికాయేషు తథా బ్రహ్మా జగద్గురుః ।
అసతా ముపఘాతాయ రాజో న కృతవా న్వయమ్॥
నరా నరీక్షయే ద్రజా సాధూ నమ్మానయే త్సదా ।
నిగ్రహం చాసతాం కుర్యా త్స లో కే లోక జిత్తమః॥
రక్షణార్థా యథా ధాన్యం వర్గయ నే తథా ప్రజాః ।
నిగ్ర హేణాసం రాజా సతాం చ పరిపాలనాత్॥
ఏతావదేవ కర్తవ్యం రాజ్ఞా స్వర్గమభీప్సనా ।
రాజకృత్యం హి లోకేషు నా స్యన్య జగతాం పతే॥
ఆ అసతాం నిగ్రహాదేవ సతాంచ పరిపాలనాత్ ।
రాజభి శ్చాష్యశాస్త్రానా మసతాం శాసితా భవాక్॥
తేన త్వ మధికో దేవో దేవేభ్యః ప్రతిభాసి ।
జగద్విధార్యతే సద్భి స్సతా మగ్ర్య స్తథా భవాక్॥
తేన త్వా మనుయాన్త్య మే క్లమో నామ న విద్యతే ।
యమః : తుష్టోస్మి తే విశాలాక్షి వచనై ర్ధర్మసజతైః॥
వినా సత్యవతః ప్రాణా న్వరం వరయ మా చిరమ్ ।
సావిత్రీః : సహోదరాణాం భ్రాతృణాం కామయామి శతం విభో॥
అనపత్యః పితా ప్రీతిం పుత్త్రలాభా త్ప్రయాతు మే ।
సావిత్రి యమునితో ఇట్లనెను: సత్పురుషులకు సజ్జనులతో సమాగమము లభించిన తరువాత క్లేశము ఎక్కడిది? దుఃఖము ఎక్కడిది? సత్పురుషులు సదాసజ్జనులకును అసజ్జనులకును గతి యగుదురు; కాని అసజ్జనులు మాత్రము సజ్జనులకుగాని ఆసజ్జనులకుగాని కడకు తన కేకాని గతి (ఉపకార కులు) కారు; అకారణముగనే లోకమునకు అపకారము చేయు (శత్రువులగు) ఖలుల వలన భయముండునట్లు విషము వలన కానీ అగ్ని వలన కాని శత్రువుల వలన కాని శస్త్రముల (ఆయుధముల) వలనకాని భయముండదు; సజ్జనులు తమ ప్రాణముల వదలియైనను పరార్థమును (పరోపకారమను. ఆర్తము ప్రయోజన మును) చేయుదురో అట్లే అసజ్జనులును తమ ప్రాణములు పోగొట్టుకొని యైనను పరపీడ కలిగించుటలో ఆసక్తులయి యుందురు; సజ్జన లోకము సమూహము) పర లోక సుఖసాధనమునకై ప్రాణములనైన గడ్డిపోచవలె వదలు కొన సిద్దమగునో దానిని పరాకార సమర్థులగు అసజ్జనులు తృణమువలెనే వదలుదురు; ఆయా జనసమూహము లందున్న ఆసజ్జనులను దండించుట కై బ్రహ్మతానై రాజును ఏర్పరచి సృష్టించెను; రాజు నరులను పరీ-క్షించవలయును; అసజ్జనులను నిగ్రహించ దండించ వలయును; లోక మందు ఇట్టివాడే లోక య(సుఖములను)మును జయించు వారందరలో ఉత్తముడు; ప్రజలు తమ రక్షణమును బీజర క్షణమును లోకరక్షణమును చేసికొనుటకై ఎట్లు ధాన్యమును పరీక్షించి మంచి దాని నుంచుకొని చెడుదానిని వదలి ఆ మంచి ధాన్యమును మరల పేరువేసి వృద్ధి పర తురో అట్లే రాజు కూడ సజ్జనులను పరిపాలించుచు అసజ్జనులను నిగ్రహించుచు ప్రజలను వర్దిల్ల చేయవలయును. స్వర్గమును పొందగోరు రాజు చేయదగినది ఇంత మాత్రమే; జగత్తులకు పతి అగు ధర్మరాజా! లోకములందు రాజు చేయదగిన కృత్యము ఇంతకంటే ఇతరము ఏదియు లేదు; ఇట్లు అసజ్జన నిగ్రహముతోను సజ్జన పరిపాలనముతోను రాజు శాసింపలేని అసజ్జను లను కూడ శాసించు పొడవు నీవు; ఆ హేతువుచే దేవులందరకంటే నీవు అధికుడవగు దేవుడవు అని నాకు తోచుచున్నది; లోకము సరిగా నడు చునట్లు చేయుచు దానిని నరియగు వ్యవస్థయందు నిలుపువారు సజ్జనులే; అట్టి సజ్జనులలో శ్రేష్టుడవు నీవు; ఆ హేతువుచే నేను నీ వెంట (ఎంత దూరము) వచ్చు చున్న ను క్ల మము (శ్రమము) లేదు; అనవిని యముడు “విశాలాక్షి! ధర్మ సంబద్ధములగు నీ వచనములను విని నీ విషయమున తుష్టుడనయితిని; నత్యవంతుని ప్రాణములను తప్ప మరే దయిన వరమును శీఘ్రమే కోరుకొనుము;” న సావిత్రి “విభూ! నాకు నూరుమంది సహోదరులగు నా తల్లి కడుపుననే జన్మించిన) భ్రాతలు వర ముగా (కోరుకొనుచున్నాను;) ఇమ్ము; ఇంతవరకును (పుత్తులు లేమిచే) ఆనపత్యుడుగానున్న మా తండ్రి పుత్రలాభము వలన ప్రతినందునట్లనుగ్రహించుము;” అనెను.
తా మువాచ యమో గచ్ఛ యథాగత మనింధితే॥
ఔర్ధ్వ దైహిక కార్యేషు యత్నం భర్తు స్సమాచర ।
నానుగంతు మయం శక్య స్త్వయా లోకా నరం గత॥
పతివ్రతాసీ తేన త్వం ముహూర్తం మమ యాస్యసి ।
గురుశుశ్రూషణాద్భదే తథా సత్యవతో మహత్॥
పుణ్యం సమార్జితం యేన నయామ్యేన మహం స్వయమ్ ।
ఏతావదేవ కర్తవ్యం పురు షేణ విజ్ఞానతా॥
మాతుః పితుశ్చ శుశ్రూషా గురోశ్చ వరవర్షిని ।
గురుత్రితయ మేతత్తు సదా సత్యవతాం మతే॥
పూజితం విజిత స్వర్గ స్వయానేన చిరం శుభే ।
తపసా బ్రహ్మచర్యేణ గురుశుశ్రూషయా శుభే॥
పురుషా స్స్వర్గ మాయా న్తి హ్యగ్ని శుశ్రూషయా తథా ।
ఆచార్యశ్చ పితాచైవ మాతా భ్రాతా చ పూర్వజః॥
న చైతే హ్యవమ నవ్యా బ్రాహ్మణేన విశేషతః ।
ఆచార్యో బ్రహ్మణో మూర్తిః పితా మూర్తిః ప్రజాపతేః॥
మాతా పృథివ్యా మూ ర్తిస్తు భ్రాతా వై మూర్తి రాత్మనః ।
జన్మనా పితరౌ క్లేశం సహే తే సమ్భవే నృణామ్॥
న తయోర్నిష్మృతి శ్శక్యా కర్తుం వర్ష శతైరపి ।
తయో ర్నిత్యం ప్రియం కుర్యా దాచార్యస్య చ సర్వదా॥
తే ష్వేవ త్రిష తుషేషు తమ స్సర్వం సమాప్యతే ।
తేషాం త్రయాణాం శు శూషా పరమం తప ఉచ్యతే॥
న తై రనభ్యనుజ్ఞాతో ధర్మ మన్యం సమాచరేత్ ।
త ఏవ హి త్రయో లోకా స ఏవ త్రయ ఆశ్రమాః॥
త ఏవ చ త్రయో వేదా స ఏవ చ త్రయోఒగ్న యః ।
పితా వై గార్హపత్యోగ్ని ర్మా తాగ్ని ర్దక్షిణ స్మృతః॥
గురు రాహవనీయస్తు సాగ్నిత్రేతా గరీయసీ ।
త్రిష్వేతేష్వప్రమాద్యేషు తీన్లోకా న్జయతే గృహీ॥
దీప్యమాన స్వవపుషా దేవవ ద్దివి మోదతే ।
యమః : కృతేన కామేన నివర్త భదే భవిష్యతీదం సకలం త్వయోక్తమ్॥
మమోపరోధ స్తవ చ క్లమ స్స్యా త్తథాధునా తేన తవబ్రవీమి॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే సావిత్ర్యుపాఖ్యానే సావిత్రీయమసంవాదే సావిత్య్రై యమదత్త ద్వితీయవర లాభో నామ దశోత్తర ద్విశతత మోధ్యాయః॥
అంతట యముడా మెతో నిట్లనెను: అనిందితా! (నిర్మల స్వభావా!) నీవు వచ్చిన త్రోవను పొమ్ము; నీ భర్తకు జరుపవలసిన ఔర్ధ్వ దే హిక కార్యముల విషయములలో యత్నము చేయుము; అంతేకాని లోకాంతర గతుడగు ఇతనిని నీవు వెంటనంటజాలవు; భద్రా! నీవు నీ గురువులకు (అత్త ఇంటి పెద్దలగు అత్తమామలకు)ను ముఖ్యగురు డేయగు సత్యవంతునకును చేసిన శుశ్రూష చేత నీవు మహాపుణ్యమును సమర్జించితివి; ఆ హేతుపుచేతనే (నాదూతలను పంపక) నేను స్వయముగా వచ్చి ఇతనిని తీసికొనిపోవుచున్నాను. వరవర్ధినీ! విజ్ఞానవంతుడు అగు పురుషుడు ఆచరించవలసిన కర్తవ్యము తల్లిని తండ్రిని గురుని శుశ్రూషించుట అనునది మాత్రమే; వనమందుండియు నిరంతరమును సత్యవంతుడు ఈ మువ్వురను పూజించెను; సంతోషపర చెను; శుభరూపా! ఇట్లు ఇతడు చిర కాలము అనుభవించదగినంత స్వర్గమును జయించినవాడయినాడు; శుభా! తపముచే బ్రహ్మచర్యము చే గురు ( పెద్దల) శుశ్రూషచే అగ్ని శు శూషచే పురుషులు స్వర్గ నుఖ ప్రాప్తులగుదురు; ఎవ రేకాని-వి శేషించి. విప్రుడు ఆచార్యుని తన తండ్రిని తల్లిని అన్నను అవమానించ (అలక్ష్యపరచ) రాదు; ఆచార్యుడు బ్రహ్మరూపుడు; తండ్రి ప్రజాపతి రూపుడు; తల్లి పృథివీరూప: అన్న స్వయముగ తమ్ముడగు) తన రూపమే ); మానవులు జన్మించుటలో వారి తల్లిదండ్రులు పుట్టుకతోనే మహా క్లేశ మనుభవింతురు: నూరేండ్లకయినను వారి ఋణము తీర్చుకొనుట శక్యము కాదు; కావున పొరికిని ఆచార్యునకును సర్వదా ప్రీతి కలిగించవలయును; ఈ మువ్వురును సంతుష్టులయిన చో సర్వ తపస్సులును సమాప్తములగును; ఈ మువ్వుర శుశ్రూష యే పరమ తపమని పెద్దలందురు; వారి యనుమతి లేనిదే ఇతర ధర్మమేదియు ఆచరించరాదు; వారు మూవు రే మూడు పృథివ్యంత రిషద్యు) లోకములు; మూడు (డ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థ ఆశ్రమములు; మూడు (ఋగ్యజుస్సామ) వేదములు; మూడు (దక్ష్మి గార్హపత్యా హవనీయ) అగ్నులు; తండ్రి గార్హపత్యాగ్ని; తల్లి దక్షిణాగ్ని; గురుడాహవనీ యాగ్ని; ఈ అగ్ని త్రయము అన్ని టికంటెను గొప్పది; ఈ మూడిటి విషయమున గృహస్థుడు పొరపడరాదు; అట్లున్న వాడు పైజెప్పిన లోకత్రయ (సుఖ) మును జయించును; ప్రకాశించు (తేజోమయమగు) తన శరీరములో కూడి దేవునివలెనే డ్యు స్వర లోకమున సుఖించును; భద్రా! కల్యాణీ! నీకోరికలు నెరవేరినవి; కావున నీవు మరలుము; నీవనీన ఈ విషయమంతయు జరుగును; ఇంకను నీవు నన్న నున రించుటచే నాకు ఆటంకమును నీకు శ్రమమును అగును; అందుచే . ఈమాట ఇట్లు చెప్పుచున్నాను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున సావిత్ర్యుపాఖ్యానమున సావిత్రీయమ సంవాదమును యమునివలన సావిత్రికి ద్వితీయ వర లాభమునను రెండు వందల పదవ ఆధ్యాయము.
Summary of chapter 210 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents an inspiring discourse on the supreme spiritual magnificence of Satya, declaring that truth is the highest Brahman, the ultimate penance, and the immovable foundation upon which the entire universe rests. Bhagavān Matsya asserts that a thousand Ashvamedha sacrifices weighed on a scale do not equal the spiritual weight of a single truthful statement spoken with pure intent. The text emphasizes that those who maintain unyielding truthfulness in thought, word, and deed acquire divine spiritual splendour, command the respect of Devas and Rishis, and achieve immediate liberation from material existence.