190 - శూల భేదాది తీర్థ మహిమాను వర్ణనము॥

మార్కణ్డేయః : తదా ప్రభృతి బ్రహ్మాద్యా ఋషయశ్చ తపోధనాః

సేవ నే నర్మదాం రాజ నాగక్రోధవివర్జితాః

యుధిష్ఠిరః : యస్మి న్ని పతితం దృష్టం శూలం దేవస్య భూతలే

తస్య పుణ్యం సమాఖ్యాహి యథావ న్మునిసత్తమ

మార్కణ్డేయః : శూలబేదేతి విఖ్యాతం తీర్థం పుణ్యతమం మహత్

తత్ర స్నాత్వార్చయే ద్దేవం గోసహసఫలం లభేత్

కి త్రిరాత్రం కారయేద్యస్తు తస్మిం క్షీర్దే నరాధిప

 అర్చయిత్వా మహాదేవం పునర్జన్మ నవిద్యతే

 భీమేశ్వరం తతో గచ్చే న్నారదేశ్వర ముత్తమమ్

 ఆదిత్యేశం మహాపుణ్యం *స్మృతం కిల్బిషనాశనమ్

 నన్ది కేశం పరిక్రమ్య పర్యాప్తం జన్మనః ఫలమ్

 వారుణేశం తతః పశ్యే త్స్వత శ్రేశ్వర మేవచ

 సర్వతీర్థఫలం తస్య పక్చాయతనదర్శనాత్

 తతో గచ్ఛేత్తు రాజేశో యుద్ధం వై యత్ర సౌధితమ్

 కోటితీర్థంతు విఖ్యాత మసురా యత యేర్ధితాః

యత్ర తే నిహతా రాజ స్థానవా బలదర్పీతాః

 తేషాం శిరాంస్యగృహన సర్వే దేవా స్సమాగతాః

 శ్రీస్తు సంస్థాపితో దేవ శూలపాణి ర్మ హేశ్వర

 కోటిర్వినిహతా తత్ర తేన కోటీశ్వర స్సృతః

దర్శనా త్తస్య తీర్థస్య సదేహ స్వర్గ మారు పాత్

 తదా త్విస్త్రాణ ముద్రత్వా ద్వజం కీలేన య స్త్రీతమ్

 తదా ప్రకృతి లోకానాం స్వర్గమార్గో నివారితః

*సఘృతం శ్రీఫలం దద్యా తృత్వా చా నే ప్రదక్షిణమ్

 పర్వతం సహదీపంతు శిరసాచైవ ధారయేత్

సర్వకామసుసమ్పూర్ణో రాజా భవతి పాణ్డవ

మృతో రుద్రత్వ మాప్నోతి తతో సౌ జాయతే పునః

స్వర్గాదేత్య భవే దాజా రాజ్యం కృత్వా దివం వ్రజేత్

మహాదేవం తతః పశ్యే త్తయోదశ్యాంతు మానవః

 స్నాతమాత్రో నర స్తత్ర సర్వయజ్ఞఫలం లభేత్

(*తథా ఘృతమధుస్రవం)

(*సఘృతం శ్రీఫలం జగ్ధ్వా)

మార్కండేయుడిట్లు చెప్పెను; ధర్మరాజా! ఆది మొదలుకొని బ్రహ్మాది దేవతలును తపోధనులును రాగక్రోధాది దోషరహితులై నర్మదను సేవింతురు; అనగా ముని సత్తమా! ఏ ప్రదేశమునందు మహా దేవుని శూలము పడినదిగా కన బడునో ఆ ప్రదేశపు మాహాత్మ్యము ఉన్న దియున్నట్లు చెప్పమని ధర్మజుడడుగ ముని మరల ఇట్లు చెప్పెను: అది శూల భేదమను పుణ్మతమ మహా తీర్థము; అందు స్నానమాడి శివునర్చించినచో గోసహనదాన ఫలము లభించును; అచట తిరాత దీక్షతో మహా దేవునర్చించినచో పునర్జన్మముండదు తరువాత వరుసగా భీమేశ్వర నారదేశ్వరాదిత్యేశ్వర నంది కేశ్వర వారుణేశ్వర తీర్థములు కలవు: ఆందు స్నానమాడుట మహా పాతక నాశకము; తరువాత స్వతంత్రేశ్వరము; ఆందు స్నానమాడి ఆచటనున్న పంచాయతన (ఆది త్యాంబికా విష్ణుగణనాధ మహేశ్వర) మూర్తులదర్శించినచో సర్వ తీర్థ యాత్రా ఫలమబ్బును; తరువాత కోటి తీర్థము; అచ్చట పూర్వము దేవదానవ యుద్ధము జరిగెను; ఆందు బలదర్పితు లగు దానవుల అనేకుల శిరస్సులను దేవతలు ఖండించి అచట శూలపాణి యగు మ హే కోటీశ్వరుని ప్రతిష్టించిరి ఆచట కోటి మంది దానవులు వినిహతులగుట చే ఆదికోటి తీర్థమనబడెను దాని దర్శన మాత్రముననే మానవులు స్వర్గ మారోహించు చుండుట చూచి ముదబుద్దిగల ఇంద్రుడు ఆ మార్గమును వజముతో కీలించి ఆటంక పరచెను; నాటినుండి మానవులకు దీనివలన లభించు స్వర్గపు మార్గము నివారింపబడెను; అచట నేయిమారేడుపండు దానమొనర్చి పర్వతమును ప్రదక్ష్మి ణించి పర్వతముపై దీపము వెలిగించి దానితో కూడ కొండను శిరస్సునందు నిలుపుకొనవలయును; దానిచే సర్వకామ పూర్తి యగును; తుదకు రుద్రలోక ప్రాప్తియగును: తరువాత స్వర్గము (రుద్రలోకము) నుండి మరలి భూలోకమున రాజై పుట్టి రాజ్యమేలి మరల స్వర్గమారోహించును: తరువాత హాదేవ తీర్థము; అందు త్రయోదశినాడు స్నానమాడినంత మాత్రముననే సర్వయజ్ఞ ఫలము లభించును

తతో గచ్చేత్తు రాజేంద్ర తీర్థం పరమశోభనమ్

 నరాణాం పాపనాశాయ హ్యగస్త్యేశ్వర ముత్తమమ్

తత్ర స్నాత్వానరో రాజ న్ముచ్యతే బ్రహ్మహత్యయా

కార్తీక స్య తు మాసస్య కృష్ణపక్షే చతుర్దశీ

ఘృతేన స్నాపయేద్దేవం సమాధిస్టో జితేంద్రియః

 ఏక వింశకులో పేతో న చ్యవే దైశ్వరా త్పురాత్

ధేనుం చోపానహచ్చత్రం దద్యాచ్చ ఘృతకమ్బళమ్

 భోజనం చైవ విప్రాణాం సర్వం కోటిగుణం భవేత్

 తతో గచ్ఛేచ్చ రాజేన్ద బలా కేశ్వర ముత్తమమ్

 తత్ర స్నో త్వా నరో రాజ సౌంహాసనపతి ర్భవేత్

 నర్మదాదక్షిణే కూలే తీర్థం శక్రస్య విశ్రుతమ్

 ఉపోష్య రజనీ మేకాం స్నానం తత్ర సమాచరేత్

స్నానం కృత్వా యథాన్యాయ మర్చయిత్వా జనార్ధనమ్

 గోసహస్రఫలం తస్య విష్ణులోకం స గచ్ఛతి

ఋషితీర్థం తతో గచ్చే త్సర్వపాపహరం నృణామ్

స్నా తమాతో నర సత్ర శివలోకే మహీయతే

నారదస్యతు తతైవ తీర్థం పరమశోభనమ్

స్నా తమాతో నర స్తత గోసహసఫలం లభేత్

 దేవతీర్థం తతో గచ్చే దృహ్మణా నిర్మితంపురా

తత్ర స్నా త్వా నరో రాజ నహ్మ లో కే మహీయతే

 అమర కఱకం గచ్ఛే దమరై స్థాపితం పురా 

 తమాతో నర సత్ర రుద్రలో కే మహీయతే

తోత గచ్ఛేత్తు రాజేంద్ర తురాయజ్ఞమ ముత్తమమ్

 తత్పజాయతనం దృష్ట్వా ముచ్యతే బ్రహ్మహత్యయా

ఋణతీర్థం తతో గచ్ఛే దృణేభ్యోముచ్యతే ధ్రువమ్

 వటేశ్వరం తతో దృష్ట్వా పర్యాప్తం జన్మనః ఫలమ్

 భీమేశ్వరం తతో గచ్చే త్సర్వవ్యాధివినాశనమ్

 స్నాతమాత్రో నరో రాజ నర్వదుఃఖైః ప్రముచ్యతే

తరువాత పరమ శోభనమగు రాజేంద్ర తీర్థ ము: తరువాత నరులకు పాపనాశ కమగు అగస్త్యేశ్వర ము: అందు స్నా నముచే బ్రహ్మహత్యా దోష నివృత్తి యగును; కార్తిక కృష్ణ చతుర్దశినాడు అట చిత్త సమాధితో జితేంద్రియుడై శివుని నేతితో అభిషేకించినచో అతడు తన ఇరువదియొక తరముల దారిలో కూడ శివపుర వాసియగును; ఆట చేసిన ధేనూపానత్ (చెప్పులు) ఛత మృత కంబళ వీపాన దానములు అన్ని యు ఇతరత్రకంటే కోటి గుణము ఫలము నిచ్చును; తరువాత ఉత్తమమగు బలో కేశ్వరము; అందు స్నానము చే నరుడు సింహాసనాధిపతి యగును; ఇవియన్నియు నర్మదకు ఉత్తర తీరమందలి తీర్థములు) ; నర్మదా దక్షిణ తీరమున శక్రతీర్థ ము; అచట ఒక రాత్రి (దినమంతయు) ఉపవ సించి స్నానమాడి జనార్దనునర్చించినచో గోనహస్ర దానఫలమునంది తుదకు విష్ణులోక ప్రాప్తుడగును; తరువాత నరు లకు సర్వపాపహరమగు ఋషితీర్థము: అందు స్నానమాడిన మాత్రమున శివలోకప్రాప్తి యగును; తరువాత పరమ శోభనమగు నారద తీర్థము; ఆందు స్నా నమాడుటచే గోగహనదాన ఫలమబ్బును; తరువాత దేవ తీర్థము; ఆది పూర్వము స్వయముగా బ్రహ్మచే నిర్మితము: అందు స్నానమాడినచో బ్రహ్మలోక ప్రాప్తియగును; తరువాత అమరకంటక తీర్థము : అది దేవతలే నిర్మించినది: దానియందు స్నానము చే రుద్రలోక ప్రాప్తియగును: తరువాత తురా సంగమ తీరము: అందలి పంచాయతన మూర్తి దర్శనముచే బ్రహ్మ హత్యాదోష నివృత్తియగును: తరువాత వడేశ్వర తీర్థము: దాని దర్శన మాత్ర మున జన్మ సాఫల్యమగును: తరువాత వటేశ్వరము: ఆది సర్వ వ్యాధి నాశకము: అందు స్నానము చే సర్వ దుఃఖ మోచనమగును:

తతో గచ్చేత్తు రాజేంద్రరావణేశ్వర ముత్తమమ్

 తత్ర స్నాత్వానరో రాజన్సర్వపాపైః ప్రముచ్యతే

 తతో గచ్చేత్తు రాజేంద్ర నదీసజ్ఞమ ముత్తమమ్

 సోమతీర్థం తతో గచ్ఛేచ్చంద్ర క్షేత్ర మనుత్తమమ్

తత్ర స్నా త్వా నరో రాజ న్భక్త్యా పర మయా యుతః

తత్తణా ద్దివ్యదేహస్థ శ్శివవన్మోదతే చిరమ్

షష్టివర్ష సహస్రాణి శివలోకే మహీయతే

 తతో గచ్ఛేత్తు రాజేంద్ర పిజు ళేశ్వర ముత్తమమ్

 అహోరాత్రోపవా సేన త్రిరాత్రఫల మాప్నుయాత్

 తస్మిం సీర్ణేతు రాజేంద్ర కపిలాం యః ప్రయచ్ఛతి

 యావ తస్యా రోమాణి తత్ససూతికులేషచ

  తావద్వర్షసహస్రాణి రుద్రలో కే మహీయతే

 యస్తు ప్రాణపరిత్యాగం తత్రకుర్యాన్న రాధిప

అక్షయం మోదతే కాలం యావచ్చన్దవిపాకరౌ

 నర్మదాత టమాశ్రిత్య తిషే యు ర్యత్ర మానవాః

 తే మృతా స్వర్గ మాయా నీ స న సుకృతినో యథా

సురేశ్వరం తతో గచ్చే న్నా మా కర్కోట కేశ్వరమ్

 గజ్జిఒవతర తే తత్ర దినే పుణ్యే న సంశయః

 నన్దితీర్థం తతో గచ్చేత్స్నానం తత్ర సమాచరేత్

 తుష్యతే తస్య నశ్లీశ సోమలో కే మహీయతే

తతో ద్వీపేశ్వరం గచ్చే ద్వ్యాసతీర్థం తపోవనమ్

 నివర్తితా పురాతత్ర వ్యాసభీతా మహానదీ

 హుజారితా తు వ్యా సేన దక్షిణేన తతో గతా

ప్రదక్షిణంతుయః కుర్యా త్తస్మిం క్షీర్దే నరాధిప

 స్వర్ణే స మోదతే కాలం యావచ్చన్జదివాక రౌ 

వ్యాస స్తత భవేత్ప్రీతో వాఞ్చితం లభతే ఫలమ్

 సూత్రేణ వేష్టయిత్వాలు దీపో దేయ స్స వేదికః

 క్రీడతే హ్యక్షయం కాలం యథా రుద్ర స్తథైవ సః

తరువాత రావణేశ్వర తీర్థము; అందు స్నానము సర్వపాప మోచక ము; తరువాత నదీ సంగమ తీర్థము; తరు పోత సోమతీర్థ ము; ఇది ఉత్తమమగు చంద్ర క్షేత్రము; అందు పరమభక్తితో స్నానమాడినవారు తత్ క్షణమే దివ్య శరీరము నంది అరువదివేల సంవత్సరములు శివుని లోక మందుండి శివుని వలెనే సుఖింతురు; తరువాత పింగళేశ్వర తీర్థ ము; అచ్చట ఒక ఆహోరాత్రము ఉపవసించినచో త్రిరాత్రోపవాస ఫలము లభించును; అచట కపిలా గోదానము చేసినచో దాని శరీరమందు కల రోమములన్ని వేల సంవత్సరములు రుద్రలోకమున సుఖించును; అచ్చట ప్రాణత్యాగ మొనర్చినచో చంద్రసూర్యులున్నంత అనంత కాలము అక్షయ సుఖములందును; నర్మదా తీరమందే నివసించు మానవులు పుణ్యమాచ రించిన వారు వలేనే మరణానంతరము స్వరమందుదురు; తరువాత సురేశ్వర తీర్థము; తరువాత కర్కోట లేశ్వర తీర్థము; అందు పుణ్యదినమున గంగానది దిగివచ్చును; తరువాత నంది తీర్థము; అందు స్నానమాడిన వారు నందీశ్వరుని ఆను గ్రహమున సోమలోక ప్రాప్తులగుదురు; తరువాత ద్వీ పేశ్వర తీర్థము; తరువాత వ్యాసతీర్థ ము; అది తపోవనము; అచట వ్యాసుని హుంకారమునకు భయపడి ఆ మహానది దక్షిణమునకు మరలెను; దానిని ప్రదక్షిణించినచో చంద్రసూర్యు లున్నంతకాలము స్వర్గమందు సుఖింతురు; వ్యాసానుగ్రహమున వాంఛితార్థ ప్రాప్తియగును; వేదికపయి దీపమునుంచి దానికి దారములు చుట్టి దానమిచ్చినచో శుద్రుడువలే అక్షయకాలము సుఖించును

తతో గచ్ఛేత్తురాజేంద్ర ఏరణీతీర్థ ముత్తమమ్

 సజ్గమేతు నరస్స్నా త్వా ముచ్యతే సర్వకిల్బిషైః

 ఐరణ్డీ త్రిషు లోకేషు విఖ్యాతా పాపనాశినీ

 అథవా(చా)శ్వయుజే మాసి శుక్లపక్షస్య చాష్టమీ

 శుచిర్భూత్వా నరస్నాత్వా సోపవాసపరాయణః

బ్రాహ్మణం భోజయేదేకం కోటి ర్భవతి భోజితా

ఐరణీసజమే స్నా త్వా భక్తిభా వానురఙ్ఞాతః

 మృత్తికాం శిరసి స్థాప్య అవగాహ్యచ వై జలమ్

 నర్మదోదక సమ్మిశ్రం ముచ్యతే సర్వకిల్బిషైః

 ప్రదక్షిణంతు యఃకుర్యాత్తస్మిం క్షీర్దే నరాధిప

 ప్రద ఓణీకృతా తేన సప్తద్వీపా వసున్దరా

తత స్సువర్ణసలిలే స్నాత్వా దత్వాతు కొజనమ్

 కాజ్చో నేన విమానేన రుద్రలో కే మహీయతే

తత స్స్వర్గాచ్చ్యుతః కాలా ద్రాజా భవతి వీర్యవాక్

 తతో గచ్చేత్తు రాజేన హీనునద్యాస్తు సజమమ్

త్రైలోక్యవిశ్రుతం దివ్యం తత్ర సన్నిహిత శ్శివః

 తత్ర స్నాత్వా నరో రాజ స్థాణాపత్య మవాప్నుయాత్

స్కన్దతీర్థం తతో గచ్ఛే త్సర్వపాపప్రణాశనమ్

 తత్ర గత్వాతు రాజేన తతస్స్నా నం సమాచ రేత్

 ఆజన్మ సక్చాతం పాపం స్నానమాత్రా ద్వ్యపోహతి

*తత ఆజీరసం గచ్ఛేత్స్నానం తత్ర సమాచరేత్

 గోసహస్రఫలం తస్య రుద్రలో కే మహీయతే

 గణతీర్థం తతో గచ్చేత్సర్వపాపప్రణాశనమ్

 తత్ర గత్వాతు రాజేఫ్ఘస్నానం తత్ర సమాచరేత్

గోసహస్రఫలం తస్య శివలో కే మహీయతే

 సప్తజన్మకృతైః పావై ర్ముచ్యతే నాత్ర సంశయః

 వటేశ్వరం తతో గచ్ఛే త్సర్వతీర్థ మనుత్తమమ్

తత్ర స్నా త్వా నరో రాజ నోసహస్రఫలం లభేత్

(*లిజ్గసారంతతోగచ్ఛేత్)

తరువాత ఐరండి (ఉపనదీ) నర్మదా సంగమ తీర్థము; ఇది ఉత్తమము; ఇందు స్నానమాడినచో సర్వపాపము కి యగును; త్రిలోక విఖ్యాతమును పాపనాశక మునగు ఇందు ఆశ్వయుజ శుషమినాడు స్నానమాడి శుచియై ఉపవాసము చేసి ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినను కోటిమందిని భుజింపజేసినట్లగును; భ క్తిభావముతో ఐరండి నర్మదా సంగమము నందు శిరస్సున మృతిక ఉంచుకొని స్నానమాడి ఆ సంగమ తీర్థ ప్రదక్షిణము చేసినచో సమ స భూప్రద క్షిణ ఫలము లభించును; తరువాత సువర్ణ తీర్థము; ఆందు స్నానమాడి సువర్ణ దానము చేసినచో కాంచన విమానము పై రుద్రలోక మేగును; అందు సుఖించును; తరువాత స్వర్గమునుండి జారినను వీర్యశాలియగు రాజగును; తరువాత ఇవనదీ నర్మదా సంగమ తీర్థము; ఆది త్రిలోక విఖ్యాతమగునది; శివుడచట సదా సన్నిహితుడై యుండును; అందు స్నానమాడిన వారు గణాధిపతిత్వమందుదురు; తరువాత స్కంద తీర్థము; అది సర్వపాప ప్రణాశక ము; అచటి కేగి యందు స్నానమాడిన మాత్రమున ఆజన్మ సంచిత పాపము నశించును; తరువాత ఆంగిరస తీర్థ ము; అందు స్నానమాడినచో సహస్ర గోదాన ఫలమంది రుద్రలోక ప్రాపుడగును; తరువాత సర్వపాప ప్రణాశనమగు గణతీర్థము; అందు స్నానమాడినవారు సహస్ర గోదాన ఫలమంది శివలోక మున సుఖింతురు సప్త జన్మకృత పాపములనుండి ముక్తులగుదురు; తరువాత వటేశ్వర తీర్థము; ఇందు స్నానము కూడ పైదానివలెనే ఫలప్రదము

సజ్గమేశం తతో గచ్ఛేత్సర్వదేవనమస్కృతమ్

స్నాతమాతో నర స్తత్ర చేంద్తంత్వం లభతే ధ్రువమ్

కోటితీర్థం తతో గచ్చే త్సర్వపాపహరం పరమ్

తత్ర స్నాత్వా నరో రాజ్యం లభతే నాత్ర సంశయః

తత్ర తీర్థం సమాసాద్య దానం దద్యాచ్చ యో నరః

తస్య తీర్థప్రభావేన సర్వం కోటిగుణం భవేత్

అథ నారీ భవే తాచి త్స్నానం తత్ర సమాచరేత్

గౌరీతుల్యా భవేత్సాఽపి త్వింద్ద్రప్రత్నీ న సంశయః

ఆజ్గరేశం తతో గచ్ఛేత్స్నానం తత్ర సమాచరేత్

స్నాతమాత్రో నర స్తత్ర రుద్రలోకే మహీయతే

అజ్గారకచతుర్థ్యంతు స్నానం తత్ర స మాచరేత్

అక్షయం మోదతే కాల మవిశ జ్కితమానసః

ఆయోనిసజ్గమే స్నా త్వా న పశ్యేద్యో నిసజ్కటమ్

పాణ్డవేశంతు తత్రైవ స్నానం తత్ర సమాచరేత్

అక్షయం మోదతే కాల మవధ్యస్తు సురై రపి

విష్ణులోకం తతో గత్వా క్రీడతే భోగసంయుతః

తత్ర భుక్త్వా మహాభోగా న్మర్త్యరాజోఽభిజాయతే

కళేశ్వరం తతోగచ్చేత్స్నానం తత్ర సమాచరేత్

ఉత్తరాయణసమ్ర్పాప్తో యదిచ్చే త్తస్య తద్భవేత్

చంద్రభాగాం తతో గచ్ఛేత్స్నానం తత్ర సమాచరేత్

స్నాతమాత్రే నర స్తత్ర సోమలో కే మహీయతే

తతో గచ్చేత్తు రాజేంద్ర తీర్థం శక్రస్య విశ్రుతమ్

పూజితం దేవరాజేన దేవై రషి నమస్కృతమ్

తత్ర స్నాత్వా నరో రాజందానం దత్వాతు కాఇ్చనమ్

ఆథవా నీలవర్ణాభం వృషభం య స్సముత్సృజేత్

వృషభస్యతు రోమాణి తత్త్రసూతికులేషుచ

తావద్వర్షసహస్రాణి నరో హర పురే వసేత్

తత స్వర్గా త్పరిభ్రష్ణో రాజా భవతి వీర్య వా

అశ్వానాం శ్వేతవర్ణానాం సహస్రాణాం నరాధిప

స్వామీ భవతి మ ర్త్యేషు తస్య తీర్థ ప్రభావతః

తరువాత సర్వదేవ నమస్కృతమగు సంగమేశ తీర్థము; ఆందు స్నానము చే ఇంద్రత్వము ప్రాప్తించును: తరు వాత సర్వ పాపహర మును ఉత్తమము మునగు కోటి తీర్థము: అందు స్నానముచే రాజ్య ప్రాప్తియగును; ఆందు చేసిన దానము కోటిగుణిత ఫలమునిచ్చును; అందు స్నానమాడిన స్త్రీ గౌరి వంటిదియగును: ఇంద్రపత్ని యగును: తరువాత ఆంగారక తీర్థము; అందు స్నానమాడినచో రుద్రలోక ప్రాప్తియు ఆంగారక చతుర్థి దినమున స్నానము చే అనంత కాలము సుఖమును కలుగును; ఆయోని (ఉపనదీ) నర్మదానదీ సంగమమున స్నానమాడిన వారికి యోని నంక టము (పునర్జన్మము) రాదు; తరువాత పాండవేశ తీర్థ ము: ఆందు స్నానము చే ఆక్షయకాల సుఖమును సురలచే కూడ ఆవధ్యత్వమును విష్ణులోక సుఖ మును సుఖానంతరము మర్వలోకమున రాజై పుటుటయు కలుగును; క ళేశ్వర తీరమందుత్తరాయణమున స్నానమాడిన వారికి సంకల్పితార్థములు సిద్దించును: తరువాత చంద్రభాగా తీర్థము; అందు స్నానమాత్రమున చంద్రలోక ప్రాప్తి యగును తరువాత ప్రసిద్ధమగు శక్ర తీర్థము ఆది ఇంద్రుడును దేవతలును నమస్కరించునది అందు స్నానమాడి సువర్ణ దానము చేయుట పుణ్యప్రదము అందు నీల వృషోత్సర్గము చేసినచో ఆ వృషభమునకును దాని సంతతికిని శ రీరములందు కల రోమములన్ని సహస్ర వర్షములు శివపుర మున వసించి భోగానంతరము వీర్యవంతుడగు రాజగును వేయి తెల్లని గురములకు అధిపతియగును

తతో గచ్ఛేత్తు రాజేంద్ర బ్రహ్మావర్త మను త్తమమ్

తత్ర స్నా త్వా నరో రాజం స్తర్పయే తిపితృదేవతాః

ఉపోష్య రజనీ మేకాం పిణ్డం దత్వా యథావిధి

కన్యాగతే యదాదిత్యే అక్షయం సతతం భవేత్

తతో గచ్ఛేత్తు రాజేంద్ర కపిలాతీర్థ ముత్తమమ్

తత్ర స్నా త్వా నరో రాజ న్కపిలాం యః ప్రయచ్ఛతి

సమ్పూర్ణాం పృథివీం దత్వా యత్ఫలం తద వాప్నుయాత్

నర్మదే శం  పరం తీర్థం న భూతం న భవిష్యతి

తత్ర స్నోత్వా నరో రాజ న్నశ్వమేధఫలం లభేత్

నర్మదాదక్షిణే కూలే సజ్గమేశ్వర ముత్తమమ్

తత్ర స్నా త్వా నరో రాజంత్సర్వయజ్ఞఫలం లభేత్

తత స్సర్వగతో రాజా పృథివ్యా మభిజాయతే

సర్వలక్షణ సమ్పూర్ణ స్సర్వవ్యాధివివర్జితః

నార్మదే చోత్తరే కూలే తీర్థం పరమశోభనమ్

ఆదిత్యాయతనం రమ్య మీశ్వరేణతు భాషితమ్

తత్ర స్నాత్వాతు రాజేంద్ర దానం దత్వాతు శ క్తితః

తస్య తీర్థప్రభావేన దత్తం భవతి చాక్షయమ్

దరిద్రా వ్యాధితా యేచ యేచ దుష్కృతకర్మిణః

ముచ్యంతే సర్వపాపేభ్యో రవిలోకం ప్రయాంతితే

మాఘమా సేతు సంప్రాప్తే శుక్లపక్షస్య సప్తమీ

వస్తే దాయతనే యస్తు నిరాహారో జితేంద్రియః

న జరావ్యాధితో మూకో న చాంధో బధిర స్తథా

సుభగో రూపసమన్న స్త్సీణాం భవతి వల్లభః

ఏవం తీర్థం మహాపుణ్యం మా ర్కణ్డేయేన భాషితమ్

యే న జానంతి రాజేంద్ర వఞ్చితాస్తే న సంశయః

గార్గేశ్వరం తతో గచ్ఛే త్స్నానం తత్ర సమాచరేత్

స్నా తమాత్రో నర స్త త్ర స్వర్గ లోక మవాప్నుయాత్

మోదతే స్వర్గలోక స్ట్రో యావదీంద్ర శ్చతుర్దశ

సమీపత స్థ్సితం తస్య నాగేశ్వర తపోవనమ్

తత్ర స్నాత్వా తు రాజేంద్ర నాగలోక మవాప్నుయాత్

చతుర్భి ర్నా గక న్యాభిః క్రీడ తే కాలమక్షయమ్

కుబేర భవనం గచ్ఛే త్కుబేరో యత్ర సంస్థితః

తరువాత బ్రహ్మావర్త తీర్థము; రవి కన్యారాశియందుండగా ఇందు స్నానమాడి ఒక యహోరాత్రము ఉపవసించి యథావిధిగా పితరులకు పిండ దానము చేసి తర్పణ మిచ్చినచో అక్షయ ఫలము లభించును తరువాత కపిల తీర్థ ము అందు స్నానమాడి కపిలా గోదానము చేసినచో సంపూర్ణముగా భూమియంతయు దానము చేసినట్లగును; తరువాత నర్మ దేశ తీర్థము; దానివంటిది ఇదివరకులేదు; - ఇకముందు ఉండదు అందు స్నానము చే అశ్వమేధ ఫలము లభించును తరు పాత సంగమేశ్వర తీర్థము; ఆందు స్నానమాడుటచే సర్వయజ్ఞ ఫలము లభించును ఆ ఫల భోగానంతరము భూలోక మందు సర్వలక్షణ సంపూర్ణుడు ఏ వ్యాధియు లేనివాడునగు రాజై పుట్టును: తరువాత నర్మదోత్తర తీరమున ఆదిత్యాయతన తీర్థము; దీనికి ఈ పేరు ఈశ్వరుడే పెట్టెను దీనియందు స్నానమాడి యథాశ క్తిగ చేసిన దానమును ఆ తీర్థ ప్రభావముచే ఆక్షయమగును: దరిద్రులును వ్యాధిగ్రస్తులును దుష్కృతమాచరించినవారును దీని స్నానము చే సర్వపాప ముక్తులయి రవి లోక ప్రాప్తులగురురు మాఘ శుక్ల సప్తమినాడు ఈ తీర్థమున నిరాహారులును జితేంద్రియులునై యుండినవారికి ముసలి తనము వ్యాధి మూగతనము గ్రుడ్డితనము చెవుడు కలుగవు; వారు రూప సంపన్నులు స్త్రీలకు ప్రీతిపాత్రులునగుదురు; మార్కండేయుడిట్లు వచించిన ఈ తీర్థ మహిమనెరిగి దీనిని సేవింపనివారి జీవితము వంచితము (వ్యర్థమయిన ట్లే) తరు వాత గాథేశ్వర తీర్థము దానియందు స్నాన మాత్రమున పదునలుగురింద్రులంత కాలము స్వర్గలోక సుఖము కలుగును; దాని దగ్గరనే నాగేశ్వర తపోవనమను తీర్థము గలదు; అందు స్నానముచే నాగలోక ప్రాప్తుడై నలుగురు నాగకన్యలతో విహరించి సుఖించును కుబేర లోక ప్రాప్తుడునగును

 కాళేశ్వరం పరం తీర్థం కుబేరో యత్రచోషితః

తత్ర స్నాత్వాతు రాజేంద్ర సర్వసమ్పద మాప్నుయాత్

తతః పశ్చిమతో గచ్చే న్మారుతాలయ ముత్తమమ్

తత్ర స్నాత్వాతు రాజేంద్ర శుచిర్భూత్వా సమాహితః

కాఞ్చనం చ తతో దద్యా ద్యథాక్త్యాతు బుద్ధిమాన్

పుష్ప కేన విమానేన వాయులోకం స గచ్ఛతి

యమతీర్థం తతో గచ్ఛే న్మా ఘమా సే యుధిష్టిర

కృష్ణపక్షే చతుర్ధశ్యాం స్నానం తత్ర సమాచరేత్

నక్తం భోజ్యం తతః కుర్యా న్న పశ్యే ద్యోనిసజ్కటమ్

తతో గచ్ఛేత్తు రాజేంద్ర అహల్యాతీర్థ ముత్తమమ్

స్నాతమాత్రే నర స్తత్ర హ్యప్సరోభిః ప్రమోదతే

అహల్యాచ తప స్తప్త్వా తత్ర ముక్తి ముపాగతా

చైత్రమా సేతు సంప్రాప్తే శుక్లపక్షే చతుర్ధశీ

కామదేవదినే తస్మి న్నహల్యాం యస్తు పూజయేత్

యత్ర యత్ర నరోత్పన్నో (న) వర స్తత్ర ప్రియో భవేత్

స్త్రీవల్లభో భవే చ్ఛ్రీమాఒకామదేవ ఇవాపరః

అయోధ్యాంతు సమాసాద్య తీర్థం రామస్య విశ్రుతమ్

స్నాతమాత్రో నర స్తత్ర సర్వపాపైః ప్రముచ్యతే

సోమతీర్థం తతో గచ్ఛే త్స్నా నం తత్ర సమాచరేత్

స్నాతమాత్రో నర స్తత్ర సర్వపాపైః ముచ్యతే

సోమగ్ర హేతు రాజేంద్ర పాపక్షయకరం నృణామ్

త్రైలోక్య విశుతం రాజంథ్సోమతీర్థం మహాఫలమ్

యస్తు చాంద్త్రాయణం కుర్యా త్తస్మిం స్తిర్థే నరాధిప

సర్వపాపవిశుద్దాత్మా సోమలోకం స గచ్ఛతి

అగ్ని ప్రవే శేఽథ జలే అథవాపి హ్యనాళ కే

సోమతీర్థే మృతో యస్తు నాసౌ మర్త్యేఽభిజాయతే

శుభ తీర్థం తతోగచ్ఛేత్స్నానం తత్ర సమాచరేత్

స్నా తమాత్రో నర స్తత్ర గోలోకేషు మహీయతే

తతో గచ్ఛేచ్చ రాజేంద్ర విష్ణుతీర్థ మనుత్తమమ్

యోధనీపుర మాఖ్యాతం విష్ణుస్థాన మనుత్తమమ్

అసురా యోధితా స్తత వాసుదే వేన కోటిశః

తత్ర తీర్థం సముత్పన్నం విష్ణుః ప్రీతో భవేదిహ

అహోరాత్రోపవా సేన బ్రహ్మహత్యాం వ్యపోహతి

తరువాత కుబేర స్థానమగు కాలేశ్వర తీర్థ ము; ఆందు స్నానమాడినచో నర్వ సంపదలు కలుగును; తరువాత పశ్చిమమున మారుతాలయ తీర్థము; దానియందు స్నానమాడి శుచియ నమాహిత చిత్తముతో యథాశ క్షిగ సువర్ణ దానము చేసినచో పుష్పక విమానము పై వాయు లోకమునకేగును; తరువాత యమ తీర్థము; ఆందు మాఘ కృష్ణ చతుర్దశి నాడు స్నానమాడి నక్త వ్రతము చేసినచో యోని సంకటము కలుగదు; తరువాత ఉత్తమమగు ఆహల్యా తీర్థము; అందు స్నానమాడినచో అప్సరసలతో సుఖము కలుగును; అహల్య యచట తపమాచరించి ముక్తినుదెను; చైత్ర శుక్ల చతుర్దశి కామదేవతిథి; ఆనాడు అహల్యను పూజించినవాడు తాను పుట్టినచోట నెల్ల ఎల్లరకు ఇష్టుడగును; రెండవ మన్మథుడువలె శ్రీలకు ప్రీతిపాత్రుడగును; ఆయోధ్యయను (ఒక) గ్రామమునకు దగ్గరగా రామతీర్థమను తీర్షము కలదు; దానియందు స్నా నముచే సర్వపాప ము క్తియగును; తరువాత సోమతీర్థము; చంద్రగ్రహణ సమయమున అందు స్నానమాడినంతనే సర్వపాపము క్రియగును; ఇది త్రిలోక విశ్రుతమగు మహాఫల పద తీర్తము; ఇందు చాంద్రాయణ వ్రతమాచరించినచో సర్వ పాపముకుడై సోమలోక మేగును ఇందు అగ్ని ప్రవేశము చే గానీ జల ప్రవేశము గాని అనాహార వ్రతము చేగాని ప్రాణ త్యాగ మొనర్చినచో మరల మర్త్య లోకమున జన్మించరు తరువాత శుభతీర్థ ము; దానియందు స్నానము చే గోలోక ప్రాప్తి యగును; తరువాత మహో తమమగు విష్ణుతీర్థము; దీనికే యోధనీపురమనియు పేరు ఇందు వాసుదేవుడు కోట్లకొలదిగా అసురులతో యుద్ధము చేసెను; ఇందుచే ఇది విష్ణు స్థానమగు తీర్థమయ్యెను; ఇందు ఒక అహోరాత్రముపవాసముండినంతనే విష్ణువు ప్రీతుడయి బ్రహ్మహత్యాదోషమును కూడ పోగొట్టును

తతో గచ్ఛేత్తురాజేంద్ర తాపసేశ్వర ముత్తమమ్

హరిణీ వ్యాధసంత్రస్తా పతితా యత్ర సా మృగీ

జలే ప్రక్షిప్తగాత్రా తుఅంతరిక్షం గతా చసా

వ్యాధో విస్మీతచి తస్తు పరం విస్మయ మాగతః

తేన తాపేశ్వరం తీర్థం న భూతం న భవిష్యతి

తతో గచ్ఛేత్తు రాజేంద్ర బ్రహ్మతీర్థ మనుత్తమమ్

ఆమోహక మితి ఖ్యాతం పిత్రౄంశ్చెవాత్ర తర్పయేత్

పౌర్ణ మాన్యా మమాయాంతు శ్రాద్ధం కుర్యా ద్యథావిధి

తత్ర స్నాత్వా నరో రాజ నితృపిణ్డంతు దాపయేత్

గజరూపా శిలా తత్ర తొయమధ్యే ప్రతిష్ఠితా

తస్యాంతు దాపయేత్పణం వైశాఖ్యాంతు వి శేషతః

తృప్య ని పితర స్త త్ర యావత్తిష్ఠతి మేదినీ

తతో గచ్చేచ్చ రాజేంద్ర సిద్దేశ్వర మనుత్తమమ్

తత్ర స్నాత్వా సరో రాజ గణపత్యఒతికం వ్రజేత్

తతోగచ్ఛేత్తు రాజేంద్ర లిజ్గో యత్ర జనార్దనః

తత్ర స్నాత్వాతు రాజేంద్ర విష్ణులో కే మహీయతే

నర్మదాదక్షిణే కూలే తీర్థం పరమశోభనమ్

కామదేవ స్స్వయం తత్ర తపోఽతప్యత వై మహత్

దీవ్యం వర్ష సహస్రంతు శఙ్కరం పర్యుపాసత

సమాధిభజ్గదగ్ధాస్తు శజ్కరేణ మహాత్మనా

శ్వేతపర్వా యమశ్చైవ హుతాశ శుక్లపర్వణి

ఏతే దగ్ధాస్తు తేసర్వే కుసుమేశ్వర మాస్థితాః

తరువాత తాప సేశ్వర తీర్థము; వ్యాధునివలన భయపడి ఒక ఆడులేడి ఈ తీర్థ జలమందుండి అంతరిక్షమునకు పోయెను అది చూచి చిత్రమందా వ్యాధుడాశ్చర్యపడెను; ఇట్టి మహిమక ల ద తాష నేశ్వర తీర్థ ము; ఇట్టిది ఇదివరకులేదు ఇక ముందుండదు; తరువాత అ మోహక మను ప్రఖ్యాతిగల బ్రహ్మతీర్థము ఇది చాల ఉత్తమము; దీనియందు పూర్ణిమా చూవాస్యలందు స్నానమాడి యథావిధిగా పితృ ద్ధమాచరించి పిండదాన తర్పణములు చేయవలయును; ఆచ్చట జల మధ్యమున గజరూపమగు శీల ప్రతిష్టితమయి యున్నది; వైశాఖ పూర్ణిమామావాస్యలందు ఇటపితరులకు పిండములు ఇచ్చినచో పితరులకు భూమి (సృష్టి) ఉన్నంతవరకు తృప్తి కలుగును తరువాత సిద్దేశ్వర తీర్థము అది చాల ఉత్తమమయినది; ఇందు స్నానమాడినచో గణపతి సాంనిధ్యము లభించును తరువాత లింగతీర్థము; ఆందు విష్ణువు లింగరూపుడుగా నున్నా డు; దానియందు స్నానమాడినవారు విష్ణులోక ప్రాప్తులగుదురు నర్మదా దక్షిణ తీరమందు పరమ శుభకరమగు కుసుమేశ్వరమను తీర్థము కలదు పూర్వమొకప్పుడు కామదేవుడు మన్మథుడు) సహస్ర దివ్య వర్షముల కాలము అచ్చట దివ్యమగు మహాతపమాచరించి శంకరుని ఉపాసించెను కానీ ఇతనిచే తనకు సమాధి భంగమయ్యేనని కోపించి మహాత్ము డగు శంకరుడు అతనినేకాక అతనితోపాటు శ్వేతపర్వన్ (వాయువు)-యముడు-హుతాశుడు (అగ్ని) వీరిని కూడ శుక్లపక్షపు పర్వదినమున-పూర్ణిమ నాడు దహించెను; (వీరిని తాపమందించెను) వారట్లు దగ్గులయి కూడ (తాపమందుచునే) ఈ కుసు మేశ్వర తీర్థము నాశ్రయించియుండిరి

దివ్యవర్షసహ స్రేణ తుష్ట స్తేషాం మహేశ్వరః

ఉమయా సహితో రుద్ర స్తేషాం తుష్టో వరప్రదః

విమోచయిత్వా తా నర్వా న్నర్మదాతట మాస్థితః

తస్య తీర్థ ప్రభావేన పున ర్దేవత్వ మాగతాః

త్వత్ప్రసాదా న్మహాదేవ తీర్థం భవతుచోత్తమమ్

అర్ధయోజనవి స్తీర్ణం తీర్థం దిక్షు సమ స్తతః

తస్మింస్తీర్థే నరస్స్నా త్వా చోపవాసపరాయణః

కుసుమాయుధరూ పేణ రుద్రలో కే మహీయతే

వైశ్వానరో యమశ్చైవ కామదేవ స్తథా మరుత్

తవ సప్త్వాతు రాజేంద్ర పరాం సిద్ది మవాప్నుయుః

అజ్కోలస్య సమీపేతు నాతిదూరేతు తస్యవై

స్నానం దానంచ తత్రైవ భోజనం పిణ్డపాతనమ్

అగ్ని ప్రవే శేఽథ జలే అథవా చావ్యనాశ కే

అనివృత్తి గతి స్తస్య మృతస్యాముత్ర జాయతే

త్ర్యమ్బ కేనతు తోయేన యశ్చరుం శ్రవయేన్నరః

అజ్కోల్లమూలే దత్వాతు పిణ్డం చైవ యథావిధి,

పితర సస్యతుష్య నీ యావచ్చంద్రదివాకరౌ

ఉత్తరే త్వయనే ప్రాప్తే ఘృతస్నానం కరోతి యః

పురుషోవస్త్రియో వాపి వసే చ్ఛివపురే శుచిః

సిద్దేశ్వరస్య దేవస్య ప్రాతః పూజాం ప్రకల్పయేత్

శుభాం గతి మవాప్నోతి శివలోకే మహీయతే

యదాఽవతీర్ణః కాలేన రూపవా నుభగో భవేత్

మర్త్యే భవతి రాజాఽసౌ ఆసముద్రానగోచరే

క్షేత్రపాలం న పశ్యేద్యో దణ్డపాణిం మహాబలమ్

వృథా తస్య భవేద్యాత్రా హ్యదృష్ట్వా కర్ణకుజ్ఞలమ్

ఏత తీర్థఫలం జ్ఞాత్వా సర్వదేవా స్సమాగతాః

ముఞ్చన్తి పుష్పవృష్టింతు స్తువని కుసుమేశ్వరమ్

ఇతి శ్రీమత్స్య మహాపురాణే నర్మదామాహాత్మ్యే శూలభేదతీర్థాదిమహిమానువర్ణనం

నామ నవత్యుత్తరశతతమోఽధ్యాయః

వారు అట్లు ఉండగా సహస్ర దివ్య వర్షముల తరువాత రుద్రుడు సంతుష్టుడయి వారికి వరము నీయదలచి ఉమతో కూడివచ్చెను; శివుడు వారినందరను తాపమునుండి విడిపించి నర్మదా తటమందు అనుగ్రహించెను ఆ తీర్థ ప్రభావమున మరల వారందరు దేవత్వమందిరి మహాదేవా! నీ ప్రభావమున ఈ ప్రదేశోత్తమము తీర్థమగుగాక యని వారు శివుని వేడి ఆ వరములను కూడ పొందిరి అది ఆర్ష యోజన విస్తీర్ణమయి అన్ని దిక్కులందును వ్యాపించియున్నది; ఇందు స్నానమాడి ఉపవసించినవారు కుసుమాయుధ మన్మథ) రూపులయి రుద్రలోక సుఖములందుదురు; ఇట్లు మన్మథ వాయు యమాగ్నులు తపస్సిద్ధినందిన ప్రదేశము ఈ తీర్థము? దీనికి దగ్గరలో ఉన్న అంకోల వృక్షపు (ఊడుగు చెట్టు) మొదట స్నాన దానములును అచటి త్ర్యంబక తీర్థ జలముతో శ్రవణము (పాకము) చేసిన చరువుతో బ్రాహ్మణ భోజన పిండ ప్రదానములుమ జరిపినచో పితరులకు రవిచంద్రులున్నంత వరకు తృప్తి కలుగును ఉత్తరాయనమందు ఇచట భగ వానునకు ఘృతాభి షేకము జరిపినచో శివలోక ప్రాప్తియగును; ఇచట సిద్దేశ్వరునకు ! పాతః కాల పూజ జరిపినవారు శుభగతి నంది శివలోక సుఖములందుదురు: ఆ పుణ్యము ముగిసిన తరువాత భూమికి దిగివచ్చినను రూపవంతుడును స్త్రీలకు ప్రీతిపాత్రుడునునయి సర్వ సముద్రాంతర్గతమగు భూమి కధిపతియగును; ఇచట గల క్షేత్రపాలుని మహాబలుడునగు దండపాణిని కర్ణకుండలుని దర్శింపనివాని యాత్ర వ్యర్థమగును: ఈ కుసుమేశ్వర తీర్థ మాహాత్మ్య ఫలముల నెరిగి సర్వదేవతలు నిటకు వచ్చుచుందురు; దీనిపయి పూలవాన కురియుచుందురు; దీనిని స్తుతించుచుందురు

ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున శూల భేదాది తీర్థ మహిమాను వర్ణనమను నూట తొంబదవ అధ్యాయము