మత్స్య మహా పురాణము
9 - మన్వంతర వివరణము
సూతః: ఏవం శ్రుత్వా మనుః ప్రాహ పునరేవ జనార్దనమ్ ।
పూర్వేషాం చరితం బ్రూహి మనూనాం మధుసూదన॥
మత్స్య: మన్వన్తరాణి సర్వాణి మనూనాం చరితం చ యత్ ।
ప్రమాణం చైవ కాలస్య తదుత్పత్తిo సమాసతః॥
ఏకచిత్తః ప్రశాన్తాత్మా శృణు మార్తాణ్డనన్దన ।
యామా నామ పురా దేవా హ్యాస న్య్వ్తాయమ్బువేఽన్తరే॥
పూర్వే చ ఋషయ స్సర్వే యే మరీచ్యాదయ స్స్మృతాః ।
ఆగ్నీధ్ర శ్చాతిబాహుశ్చ పుత్త్ర స్సవన ఏవ చ॥
జ్యోతిష్మా న్ద్యుతిమాక్ హవ్యో మేధా మేధాతిథి ర్వసుః ।
స్వాయమ్భువస్యైవ మనో ర్దశైతే వంశ వర్ధనాః॥
ప్రతిసర్గ మమీ కృత్వా జగ్ము స్తే పరమం పదమ్ ।
ఏత త్స్వాయమ్బువం ప్రోక్తం స్వారోచిష మత : పరమ్॥
స్వారోచిషస్య తనయా శ్చత్వారో దేవవర్చసః ।
నభో నభస్యః(ప్రభృతిర్భావనః) ప్రభృతి ర్భరతః కీర్తివర్ధనాః॥
దత్తో నిశ్చ్యవన స్స్తమ్బః ప్రాణః కాశ్యప ఏవచ ।
ఊర్వో బృహస్పతి శ్చైవ సప్త సప్తర్షయోఽ భవః ॥
తతో దేవాస్తు తుషితా స్స్మృతా స్స్వారోచిషేఽన్తరే ।
హవీన్ద్ర స్సుకృతో మూర్తి రాపోజ్యోతి రయ స్స్మయః॥
వసిష్ఠస్య సుతా స్సప్త యే ప్రజాపతయ స్తదా ।
ద్వితీయ మేత త్కథితం మన్వన్తర మత పరమ్॥
తృతీయం తు ప్రవక్ష్యామి తథా మన్వ న్తరం శుభమ్ ।
మనుర్నా మోత్త్రమో యత్ర దశ పుత్త్రా నజ్జనత్॥
ఇష స్సహస్య ఊర్జశ్చ శుచి శ్శుక్ష స థైవ చ ।
మధుశ్చ మాధవశ్చైవ నభస్యోఽథ నభ స్తథా॥
సహః కనీయా నేతేషా ముదారః కీర్తివర్ధనః ।
భానవ స్తత్ర దేవాస్స్యు రూర్జా స్సప్తర్షయ స్సృతాః॥
(కౌకరణ్డిశ్చబుద్ధిశ్చసఖ్యఃప్రవహణస్స్మృతిః) కౌకరణ్డిః కురణ్డిశ్చ దాఖ్యః ఖణ్డ: ప్రవాహణః ।
మితశ్చ సంమిత శ్చైవ సప్తైతే యోగ వర్ధనాః॥
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను : మనువు (సత్యవ్రతుడు) మత్స్యనారాయణుడు చెప్పిన ఈ విషయమును విని ఆ స్వామితో ఇంకను ఇట్లు పలికెను: మధుసూదనా! పూర్వులగుమనువుల చరితమును నాకు విని పింపుము. అన మత్స్యమూర్తి ఇట్లు పలికెను: సూర్యపుతా: అన్ని మన్వంతరములను మనువుల చరితమును మన్వంతర కాల పరిమాణమును వారి ఉత్పత్తిని సం క్షేపముగా అంతయు తేలి పెదను. ఏక చితుడవయి ప్రశాంతమగు మనస్సుతో వినుము.
(ప్రతి మన్వంతరమునకు మనువుల భేదమును బట్టి ఆ కాలమున ఆరాధ్యులగు దేవతలును వేదములను విద్యలను యజ్ఞాది కర్మానుష్ఠానములను ప్రవర్తిల్లజేసిన ఋషులును సృష్టిని సాగించిన మను పుత్తూలును వేరు వేరుగా ఉందురు. అనువాదకుడు.)
స్వాయంభువ మన్వంతరమున యాములు అనువారు దేవతలు. లోగడ తెలిపిన మరీచి మొదలుగా నారదుని వరకును గల పది మందియు ఋషులు. ఆ గ్నీధ్రుడు అతి బాహుడు. పుత్రుడు సవనుడు(లు) జ్యోతిష్మాన్ ద్యుతిమాన్ హవ్యుడు మేధ మేధాతిథి వసువు అను పది మంది కుమారులు. వీరు ప్రతిసర్గమును (పాంచ భౌతికములగు శరీరములు గల ఆయా ప్రాణి విశేషముల సృష్టిని) జరిపి వీరు పరమ పదమున కేగిరి.
స్వారోచిషమనువునకు నభుడు నభస్యుడు ప్రభృతి భరతుడు అను నలుగురు కుమారులు. దత్తుడు నిశ్చ్యవనుడు స్తంబుడు ప్రాణుడు కాశ్యపుడు ఊర్వుడు బృహస్పతి అనువారు ఏడు మంది ఋషులు. తుషితులు అనువారు దేవతలు. వసిష్ఠుని కుమారులగు హవి ఇంద్రుడు సుకృతుడు మూర్తి ఆపుడు జ్యోతి అయస్మయుడు అను ఏడుగురును సృష్టిని కొనసాగించు ప్రజాపతులు. ఉత్త్రముడు మనువుగా ఉండగా ఆయన కుమారులు పది మందియు ప్రజాపతులు. వారు ఇషుడు. సహస్యుడు ఊర్జుడు శుచి శుక్తుడు మధుడు మాధవుడు నభ స్యుడు నభుడు సహుడు అనువారు. ఈ కడపటి వాడు .ఉదారుడు చాల కీర్తి శాలియును. భానువులు అనువారు ఊర్డులు అను గణము వారు సప్తఋషులు. వారి పేరులు కౌకరండికుడు కురండి దాఖ్యుడు ఖండి ప్రవాహణుడు మీతుడు సంహితుడు అనునవి.
మన్వన్తరం చతుర్థం తు తామసం నామ విశ్రుతమ్ ।
(కావ్యః) కవిః పృథు స్తథా చాగ్ని రశ్వః కపిల ఏవ చ॥
(అహన్యహన్యనామానౌ) తథైవ జన్యధీమన్తౌ మునయ స్సప్త తామ సే ।
సాధ్యా దేవగణా యత్ర కథితా స్తామ సేఽన్తరే॥
అకల్మష స్తథా ధన్వీ తపోబల తపోధనౌ ।
తపోరతి స్తపస్యశ్చ సుతపాశ్చ పర స్తపః॥
తపోద్యుతి స్తపోనాధ స్సర్వే సజ్గ్రామ విత్త్రమాః ।
తామసస్య సుతా స్సర్వే దశ వంశ వివర్ధనాః॥
పఞ్చిమస్య మనో స్తద్వ ద్రైవతస్యా నరం శృణు ।
దేవబాహు స్సుభాహుశ్చ పర్జన్య స్సోమపో మునిః॥
హిరణ్యరోమా సప్తాక్ష స్సప్తైతే ఋషయ స్సృతాః ।
దేవాశ్చ భూతర జన స్తథా ప్రకృతయ స్పృతాః॥
అరుణ స్తత్త్వదర్శీ చ ధృతిమాక్ హవ్యప స్స్వజిత్ ।
యుక్తో నిరుత్సుక సత్యో నిమేషో నః ప్రకాశకః॥
ధర్మవీర్యబలో పేతా దశైతే రైవతాత్మజాః ।
చాక్షుషస్యాఽ న్తరే దేవా లేఖా నామ పరి శ్రుతాః॥
వసవోఽథ ప్రవాచాఽథ పారిసూనా ది వౌకసః ।
చాక్షుషస్యాఽ న్తరే ప్రోక్తా దేవానాం పఞ్చ యోనయః॥
భృగు సుధామా విరజా స్సహిష్ణు ర్నాద ఏవ చ ।
వివస్వా నత్రీనామా చ సప్త సప్తర్షయోఽపరే॥
ఊరుప్రభృతయ స్తద్వ చ్చాక్షుషస్య సుతా దశ ।
ప్రోక్తాః స్వయమ్బవే(చేమే) వంశే యే మయా పూర్వమేవ తు॥
అన్తరం చాక్షుష స్యైత న్మయా తే పరికీర్తితమ్ ।
సప్తమం చ ప్రవక్ష్యామి య ద్వైవస్వత ముచ్యతే॥
అత్రి శ్చైవ వసిష్ఠశ్చ కశ్యపో గౌతమ స్తథా ।
భరద్వాజ స్తథా యోగీ విశ్వామిత్రః ప్రతాపవాక్॥
జమదగ్ని శ్చ సప్తైతే సాంప్రతం యే మహర్షయః ।
సాధ్యా విశ్వే చ రుద్రాశ్చ మరుతో వసవోశ్వినౌ॥
ఆదిత్యాశ్చ సురా స్తద్వ త్సప్త దేవగణా స్మృతాః ।
ఇక్ష్వాకుప్రముఖాశ్చాపి తస్య పుత్త్రాఃస్మృతా భువి॥
నాలుగవది యగు తామసమన్వంతరమున కవి పృథువు అగ్ని అశ్వుడు కపిలుడు జన్యుడు ధీమాన్ అనువారు సప్తఋషులు. సాధ్యులు అను గణమువారు దేవతలు. అకల్మషుడు ధన్వి తపోబలుడు తపోధనుడు తపోరతి తపస్యుడు సుతపుడు తపోధ్యుతి తపోనాథుడు అను తామసుని కుమారులు పది మందియు యుద్ధ విద్యల నెరిగిన వారిలో శేషు లను వంశవృద్ది చేయు వారును ఐరి.
రైవత మన్వంతరమున దేవ బాహుడు సుబాహుడు పర్జన్యుడు సోమపుడు ముని హిరణ్యరోముడు సప్తాకుడు అనువారు సప్త ఋషులు. భూతరజసులు అను గణము వారు దేవతలు. రైవతుని కుమారులు అరుణుడు తత్వ దర్శి ధృతీమాన్ హవ్యపుడు స్వజిత్ యుక్తుడు నిరుత్సుకుడు సత్యుడు నిమేషుడు అంతఃప్రకాశకుడు అను వారు పదిమందియు ధర్మము వీర్యము బలము కలవారు. వీరు ఆ మన్వంతరమున ప్రజావృద్ధి చేయువారు.
చాక్షుష మన్వంతరమున లేఖులు వస్తువులు ప్రవాదులు పారిస్తూవులు దివౌక సులు అను ఏడు తెగల దేవత లుందురు. భృగువు సుధాముడు వీర జుడు సహిష్ణుడు నాదుడు వివస్వాన్ అత్రి అనువారు సప్త ఋషులు. లోగడ అధ్యా, 4) తెలిపిన ఊరువు పురుడు శతద్యుమ్నుడు తపస్వి సత్యవాక్ కవి అగ్ని పోముడు అతిరాత్రుడు సుదృష్టి అభి మన్యుడు అను పది మంచియు బొమషుని కుమారులు ప్రజావృద్ధి చేయువారు.
వైవస్వత మన్వంతరమున ఆత్రి వసిష్ఠుడు కశ్యపుడు గౌతముడు భరద్వాజుడు విశ్వామిత్రుడు జమదగ్ని అనువారు సప్త ఋషులు. సాధ్యులు వి శ్వేదేపులు రుద్రులు మరుత్తులు వస్తువులు అశ్వినులు ఆదిత్యులు అను ఏడు దేవ గణములు ఉండును. ఇక్ష్వాకువు మొదలగు కుమారులు ప్రజావృద్ధి చేయు వారు.
మన్వన్తరేషు సర్వేషు సప్త సప్త మహర్షయః ।
కృత్వా ధర్మస్య సంస్థానం ప్రయాన్తి పరమం పదమ్॥
సావ ర్ణేస్తు ప్రవక్ష్యామి మనో ర్భావి తథాఽ స్తరమ్ ।
అశ్వత్థామా శరద్వాంశ్చ కౌశికో గాలవ స్తథా॥
శతానన్దః కాశ్యపశ్చ రామశ్చ ఋషయ స్మృతాః ।
ధృతి ర్వరీయా న్పవన స్సువర్ణో విష్ణు రేవ చ॥
చరిష్ణు రిజ్య స్సుమతిర్ బృహత్క్షత్త్రశ్చ వీర్యవాన్ ।
భావినో దశ సావర్ణే ర్మనోః పుత్రాః ప్రకీర్తితాః॥
రౌచ్యాదయ స్తథాఽన్యేపి మనవ స్సoప్రకీర్తితాః ।
రుచేః ప్రజాపతేః పుత్రో రౌచ్యో నామ భవిష్యతి॥
మను ర్భూతే స్సుత స్తద్వ ద్బౌత్యో నామ భవిష్యతి ।
తతస్తు మేరుసావర్ణి ర్భ్రహ్మసూను ర్మను సృతః॥
క్రతుశ్చ ఋతుధామా చ విష్వక్సేనో మను స్తథా ।
అతీతానగతా శ్చైతే మనవ స్సప్త కీర్తితాః॥
పూషణో యుగసాహస మేభి ర్ధ్యాతా నరాధిప ।
స జ్కీర్తితం సర్వ మిదం మయా తు పృథివీపతే॥
స్వే స్వేఽన్తరే సర్వ మీద ముత్పాద్య సచరాచరమ్ ।
కలావసానే తే సర్వే ముచ్య న్తే బ్రహ్మణా సహ॥
ఏతే యుగ సహస్రాన్తే వినశ్య న్తి పునఃపునః ।
బ్రహ్మాద్యా విష్ణుసాయుజ్యం యాన్తి యాస్య న్తి వై ద్విజాః॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమను సంవాదే చతుర్దశ
మన్వన్తరానుకీర్తనం నామ నవమోఽధ్యాయః॥
అన్ని మన్వంతరములందును ఏడేసి మంది మహర్షులు ధర్మ వ్యవస్థ చేసి పరమ పదమును చేరెదరు.
సావర్ణి మన్వంతరమున అశ్వత్థామ శరద్వాన్ కౌశికుడు గాలవుడు శతానందుడు కాశ్యపుడు రాముడు అనువారు సప్త ఋషులు. ధృతి వరీయాన్ పవనుడు సువర్ణుడు విష్ణుడు చరిష్ణుడు ఇజ్యుడు సుమతి బృహత్ క్షత్తుడు వీర్యవాన్ అనువారు పది మంది సావర్ణి కుమారులును ప్రజావృద్ధి చేయు వారు.
వీరు కాక రౌచ్యుడు మొదలగు మరికొందరు మనువులును కాబోవుదురు. రుచి అను ప్రజాపతికి కుమారుడు రౌచ్యుడు. భూతి అను ప్రజాపతికి కుమారుడు భౌత్యుడు. వీరును కాబోవు మనువులలోనివారు.
తరువాత బ్రహ్మ కుమారుడగు మేరుసావర్ణి మనువు అగును. క్రతువు ఋతుధాముడు విష్వక్సేనుడు అనువారు మరి ముగ్గురు మనువులు.
ఇట్లు గడచిన వారు ఆరు మందియు గడ చుచున్న వైవస్వతమనువును రానున్న మనువులు ఏడు మందియు మనువులు చెప్పబడినారు. ఇట్లు మొ త్త్రము పదు నలుగురు మనువులు.
వీరు వేలకొలది దేవ యుగముల కాలము తపమాచరించి ఆ శ క్తిచే లోకసృష్టిని ప్రజాపాలనమును జరుపుదురు. రాజా ! ఇది యంతయు నీకు ఇట్లు తెలిపితిని.
ఈ మనువులు అందరును తమ తమ ఆంతర ములలో చరాచర ప్రాణులతో నిండిన జగత్తును సృష్టించి పాలింతురు. తుదకు కల్పాంతమునందు బ్రహ్మతో పాటు ముక్తిని పొందుదురు.
ఈ సృష్టియును కల్పమును ఒకటి మాత్రమే కాదు. సృష్టులును కల్పములును ఆనంతములు. ప్రతి సృష్టి యందును కల్పమునందును ఇట్లే బ్రహ్మలును మనువులును మరల మరల పుట్టుచు పోవుచుందురు. కనుక) వీరు వేలకొలది దేవ యుగములు ముగిసిన తరువాత మరల మరల నశించుచుందురు. ఆ క్రమములో బ్రహ్మ మనువులు మొదలగు వారు విష్ణు సాయుజ్యమును పొందుదురు. ఇక ముందును ఇట్టే పొందనున్నారు.
(ఇచ్చట సావర్ణి అను మనువులు ఐదు మంది. వీరిలో మొదట చెప్పిన సావర్ణి ఎవరో స్పష్టముగా చెప్పబడ
పృథువు మొదలగువారు భూమిని గోవుగా చేసి పిడుకుట-10-అ.
లేదు. మరియును మిగిలిన మనువులు కాని వారివారి అంతరములలో ఉండెడి సప్తఋషులును దేవతలును మనుపుత్తులును కాని చెప్పబడ లేదు.)
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున మన్వంతరాను కీర్తనమను నవమాధ్యాయము.
Summary of chapter 9 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya explains the structural division of cosmic time into fourteen Manvantaras that constitute a single Kalpa. Each Manvantara spans seventy-one Mahāyugas and features a unique Manu, a distinct set of Saptarshis, an Indra, and specific groups of Devas. The text enumerates the past, present, and future Manus, including Svāyambhuva, Svārochisha, Auttami, Tāmasa, Raivata, Chākshusha, the current seventh Manu Vaivashvata, followed by the future Manus Sāvarṇi, Daksha-sāvarṇi, Brahma-sāvarṇi, Dharma-sāvarṇi, Rudra-sāvarṇi, Rauchya-Deva-sāvarṇi, and Indra-sāvarṇi. The chapter emphasizes how Bhagavān Vishṇu incarnates in every Manvantara to support Indra, assist the Saptarshis, and ensure the continuous flow of divine knowledge and Vedic Dharma.