మత్స్య మహా పురాణము
170 - బ్రహ్మ స్వాయంభువాదులను ప్రణవాది వాజ్మయమును ప్రాణిజాతమును సృజించుట॥
శ్రీమత్స్యః : స్థిత్వాచ తస్మిన్ కమలే బ్రహ్మా బ్రహ్మవిదాం వరః ।
ఊర్ధ్వబాహు ర్మహాతేజా స్తపో ఘోరం సమాశ్రితః॥
ప్రజ్వలన్ని వ తేజోభి ర్భాభి స్స్వాభి స్తమోనుదః ।
బభా సే సర్వధర్మస్థ స్సహస్రాంశు రివాంశుభిః॥
అథాన్య ద్రూప మాస్థాయ* స్రష్టా నారాయణోఽవ్యయః ।
ఆజగామ మహాతేజా యోగాచార్యో మహాయశాః॥
సాజ్ఖ్యాచార్యశ్చ మతిమా న్కపిలో బ్రాహ్మణో వరః ।
ఉభావపి మహాత్మానో స్తువన్తౌ క్షేత్రతత్పరో॥
తౌ ప్రాప్తా వూచతు స్తత బ్రహ్మాణ మతేజసమ్ ।
పరావర వి శేష జ్ఞౌ పూజితౌ చ మహర్షిభిః॥
బ్రహ్మాత్మా దృఢ బన్దశ్చ విశాలో జగ దాస్థితః ।
గ్రామణీ సర్వభూతానాం బ్రహ్మా త్రైలోక్యపూజితః॥
తయో స్తద్వచనం శ్రుత్వా విప్రోఽభ్యాహృతయోగ విత్ ।
త్రీనిమా న్కృతవా శ్లోకా న్యథేయం బ్రహ్మణః శ్రుతిః॥
పుత్రం స్వాయమ్బువం చైవ ముత్పాదయితవా నృషిః ।
తస్యాగ్రే వాగ్యత స్తస్థౌ బ్రహ్మాణ మజ మవ్యయమ్॥
సోత్పన్న మాత్రో బ్రహ్మాణ ముక్తవా న్మానస స్సుతః ।
కిం కుర్మి తవ సాహాయ్యం బ్రవీతు భగవా నృషిః॥
బ్రహ్మా : య ఏష కపిలో బ్రహ్మా నారాయణపర స్తథా ।
వదతో భవత స్తత్వం తతురుష్వ మహామతే॥
బ్రహ్మణస్తు తదర్ధంతు తదా(గృహ్య) భూయః సముత్తితః ।॥
శు శ్రుషురస్మి యువః కిం కరోమి కృతా ఞ్జలిః॥
శ్రీమత్వుడు మనువునకు చెప్పేనని సూతుడు ఋషులకిట్లు చెప్పెను: వేదతత్వవేత్తలలో శేషుడు మహా తేజుడు అగు బ్రహ్మ విష్ణుని నాభియందుండి ఉత్పన్న మయిన ఆ హిరణ్మయ కమలమునందు నిలువబడియుండి భుజములు పైకేత్తినవాడయి ఘోర తపమాశ్రయించేను॥ అతడు తన తేజోరాశులతో గాఢముగా మండుచున్నా డేమో యను నట్లుం డేను॥ తన కాంతులతో చీకటులను పోగొట్టుచుండెను; సర్వ ధర్మములందును స్థిరుడయి నిలిచి ఆతడు తన తేజ కిరణములతో వేయి కిరణములుగల రవివలె ప్రకాశించు* చుండెను॥
(*గడచిన అధ్యాయమున చెప్పినదానిని బట్టి బ్రహ్మ విష్ణు నాజ్ఞానుసారము విశ్వసృష్టికి సంకల్పించెనేకాని అతని సంకల్పము మధు కై టభుల రాకతో విహతమయ్యెను॥ దాని విషయమున అత పెట్టి ప్రయత్నమును చేయుటకే అవకాశము దొరుక లేదు॥ మధుకైటభవధానంతరము అతనికా విషయమున యత్నించు నవకాశము కలిగెను॥॥ కాని సృష్టి- సాధారణ కార్యము కాదు॥ అతడందుల కై తనకు తెలిసిన వైదిక తత్త్వ జ్ఞానమును ఆశ్రయించి తపమాచరించసాగెను॥ ఉత్కృష్ట తేజస్సులను తన తపః సాఫల్యమున కనుకూలింపజేసికొనుటకై దేవతానుగ్రహ సంపాదనార్ద మతడూర్వ బాహుడయ్యెను॥ వేదములందు లేని ధర్మ'మే లేదు॥ ఆతడు నారాయణానుగ్రహమున అప్పటికే తనకు లభించిన సకల వేదములందలి సకల ధర్మములను తన జ్ఞానమయ తపోరూపమున విలక్షణ ప్రక్రియలతో అనుష్టించెను॥ అని ఈ వచనముల భావము॥ )
ఇట్లు బ్రహ్మ తపమాచరించుచుండగా అతనియందుఅనుగ్రహము కలిగి నారాయణుడు తాను!అవ్యయుడు (ఏ వికారములును లేనివాడు ) ఆయియును తాను ఇపుడు సృష్టిప్రవ ర్తకుడు కావలయును కావున తాను క్షీరార్ణవమున శయనించియున్న పురుషోత్తమ రూపము కాక మరి వేరు రూపములను ధరించి అతని ఎదుటకు వచ్చెను॥ ఆ రూపము లలో నొకటి మహా యశశ్శాలియు మహా తేజశ్శాలియు అగు యోగాచార్యుని రూపము; రెండవది బ్రాహ్మణ, శేషుడును మహామతీమంతుడును సాంఖ్యా చార్యుడునునగు కపిలుని రూపము॥ వీరిరువురును పరమునకు అవరమునకు (వర మాత్ముని పరా ప్రకృత్య పరా ప్రకృతుల స్వరూపమును ఆ రెండిటి॥వి శేష-) భేదమును బాగుగ ఎరిగినవారు; మహాత్ములు తమ ఆత్మను లోకకళ్యాణమునకే ఉపయోగించుచు ఉత్కృష్ట మొనర్చుకొనువారు) క్షేత్ర తత్వజ్ఞులు (అపర ప్రకృతితో ఏర్పడు పాంచభౌతిక సృష్టి రహస్యమును సంపూర్ణముగ ఎరిగినవారు;) తన తపో మహ త్వముచే అమిత తేజఃసామర్థ్యములు కలిగియున్న బ్రహ్మకడకు వచ్చిరి॥ - మహర్షి పూజితులగు ఆ ఇరువురును బ్రహ్మతో ఇట్లు పలికిరి: “హ్మ తాను ఆత్మరూపుడు; దృఢమగు అమరిక గలవాడు; విశాల రూపుడు; జగత్తును ఆశ్రయించియున్న వాడు; సర్వభూతములకును నాయకుడు; త్రైలోక్య పూజితుడు॥”
వారు ఇరువురును పలికిన ఈ మాటను బ్రహ్మ వినెను॥ ఆ వచనములందు ప్రతిపాదింపబడిన యోగమును (సృష్టి ప్రక్రియను) తాను గ్రహించెను॥ ఆ యోగాచార్య సాంఖ్యాచార్యులు , పలికిన శ్రుతి వచనమున తెలుప బడిన విధమున ఈ మూడు లోకములను సృజించెను॥ అవి పృథివీ-అంతరిక్షం॥ద్యోః అనునవి॥ ఈ లోకత్రయముతో పాటు ఋషి(మాంస నేత్రములకు అందని దేశ కాలాతీత విషయములను ఎరుగగల) చతుర్ముఖుడు 'భూః' స్వాయంభువుడు' అను మానస పుత్రుని కూడ ఉత్పాదించెను॥ (బ్రహ్మ తాను స్వయంభూ కావున ఆతని పుత్రుడు స్వాయంభవుడు॥) ఈ మానస పుత్తడు తాను పుట్టినంతనే తన పితయగు బ్రహ్మ ఎదుట మౌనియై నిలిచెను॥ మరియు అతడు “భగవానుడగు ఋషి! నీకు నేను ఏమి సాహాయ్యము చేయవలయునో తెలుపుము॥” అని బృహద్రూపుడును (బ్రహ్మ) , వేదమూర్తియును (బ్రహ్మ) అజుడును పుట్టుక లేని వాడు ) అవ్యయుడునునగు విధాతతో పలికెను॥ “నాయనా! స్వాయంభః ఈ పర బ్రహ్మ రూపుడగు కపిలుడును పరమ యోగా చార్యుడగు నారాయణుడును నీ కేమి" చేప్పెదరో దాని నాచరించుము॥" అని బ్రహ్మ స్వాయంభవునితో ననెను॥ అంతట బ్రహ్మ వచనము విని మరల॥ అతడు వారిరువురితో “నేను మీమాట విని దానినాచరించదలయున్నాను॥ "ఏమి చేయుమందురు?" ఆని కృతాంజలియై పలి కెను॥
శ్రీభగవాక్ : యత్సత్య మక్షరం బ్రహ్మ న్నష్టాదశ విధం హి తత్ ।
యత్సత్యం యదృతం తత్తు పరం పద మనుస్మర॥
ఏతద్వచో నిశామ్యైవ యయౌ స దిశ ముత్తరామ్ ।
గత్వాచ తత్ర బ్రహ్మత్వ మగమ ద్జానతేజసా॥
తతో బ్రహ్మా భువం నామ ద్వితీయ మసృజత్ప్రభుః ।
సజ్కల్పయిత్వా మనసా తమేవచ మహామనాః॥
తత స్సోప్యబ్రవీద్వాక్యం కిం కరోమి పితామహ ।
పితామహ సమాజ్ఞాతో బ్రహ్మాణం సముపస్థితః॥
బ్రహ్మా ధ్యాసంతు కృతవా న్భువశ్చ పృథివీం గతః ।
ప్రాప్తశ్చ పరమం స్థానం సతయోః పార్శ్వ మాగతః॥
తస్మిన్న పి గతే పుత్రే తృతీయ మసృజ త్ప్రభుః ।
సాజ్ఖ్యప్రవృత్తికుశలం భూర్బువం నామతో విభుమ్॥
గోపతిత్వం సమాసాద్య తయోరేవాగమద్గతిమ్ ।
ఏవం పు త్త్రా స్త్రయో హ్యేతే ఉక్తా శ్శమ్బో ర్మహ్మాత్మనః॥
తా న్గృహీత్వా సుతాం స్తస్య ప్రయయౌ స్వార్జితాం గతిమ్ ।
నారాయణశ్చ భగవాన్కపిలశ్చ యతీశ్వరః॥
యం కాలం తౌ గ తౌ ము క్తౌ బ్రహ్మా తం కాలమేవ చ ।
తతో ఘోరతమం భూయ సంశ్రితః పరమం వ్రతమ్॥
న రేమేఽథ తతో బ్రహ్మా ప్రభురేక స్తప శ్చరణ ।
శరీరార్ధం తతో భార్యాం సముత్పాదితవా ఞ్చుభామ్॥
తపసా తేజసా చైవ వర్చసా నియమేన చ ।
సదృశీ మాత్మనో దేవీం సమర్థాం లోక సర్జనే॥
తయా సమాహిత స్తత్ర రేమే బ్రహ్మా తప శ్చర్య ।
సృజ న్ప్రజానాం పతయ సాగరాం శ్చాసృజ తభుః॥
శ్రీ భగవానుడగు నారాయణుడిట్లనేమ: నాయనా । బ్రహ్మన్: (వేద స్వరూపుడవగు స్వాయంభూః) సత్యము ('సత్' అను శబ్దమునకు అర్థమయి ఆ శబ్దమునందు నిలిచియుండు బ్రహ్మ తత్వము) అక్షరము (నశించనిది-ప్రణవము నకు అర్థమయి పరా॥ అపరా అను రెండు ప్రకృతుల రూపముతో ఉండునది) అష్టాదశ విధము (మనోబుద్ద్యహంకారములు పంచ తన్మాత్రలు-పంచస్థూల భూతములు పంచేంద్రియములు అను అపరా ప్రకృతిగల పదునెనిమిది భేదములుగా విస్త రిల్లినది) సత్యము (వాక్ -కాయ॥కర్మములతో అనుష్ఠాన రూపమున అనుష్ఠించి నిష్పన్నము చేయబడునది॥ఆనుభవములోనికి తెచ్చుకొనబడునది) ఋతము (బుడ్డీ వ్యాపారముతో ఈ తత్త్వము ఇట్టిదని నిశ్చిత రూపమున తెలిసికొనబడునది ఇట్లు మనోవాక్-కాయ-వ్యాపారములతో తెలిసికొనుట నోటితో చెప్పుట॥ శారీర కాసుష్ఠానముతో స్వాధీన మొనర్చుకొనుట అను త్రికరణ సాధ్య త త్త్వము పరమాత్మ తత్వము అని సారము) అగు పరమపదము (సర్వోన్నత స్థానమందున్న ది ప్రణవ శబ్దమునకు వాచ్యమగునదియగు వైష్ణవ తత్వము) ఏది కలదో దానిని అను స్మరించుము (అను స్మరణము॥నిరంతర మైన స్మరణము॥ అనగా ఉపాసనము) ఆని నారాయణుడనెను॥
ఈ మాటను విని ఆ స్వాయంభవుడు ఉత్తర దిశకు పోయెను॥ ఆతడచ్చటకు పోయి జ్ఞాన తేజముతో బ్రహ్మత్వమందెను॥
తరువాత మహా మనస్కుడగు చతుర్ముఖ బ్రహ్మ ‘భువుడు' అను రెండవ మానస పుత్రుని జనింపజే నేను॥ అతడును తండ్రియగు పితామహుని (బ్రహ్మదేవునితో నేనేమి చేయవలయునని పలికి అతని సమాజ్ఞతో బ్రహ్మదేవు నుపాసించి ఆతని ఉపదేశానుసారముగా యోగా బార్య సాంఖ్యాచార్యుల కడకు పోయేను॥ వారి యాదేశముచే పృథివీ స్థానమునందుండి బ్రహ్మాభ్యాసమును (పరబ్రహ్మోపాసనమును) అనుష్ఠించి ఉన్న తినంది లౌనును పరమమగు వైష్ణవ స్థానమును అందెను॥
ఇట్లా రెండవ పుత్తడును పోగా విభుడు నర్వవ్యాపి) ప్రభు (సమర్థుడగు చతుర్ముఖుడు భూర్భువుడను మూడవ మానసపుత్రుని జనింపజే నెను॥ అతడు సాంఖ్యత త్వము నెరిగి ఆ విజ్ఞానమును వృద్ధిపరచి ప్రవర్తింప జేయు టలో నేర్పరి; అతడును 'గోపతి' 'ద్యులోకాధిపతి'యయి వారు పొందిన పద్దతిని పొందెను॥
ఇట్లు మహాత్ముడు చతుర్ముఖుడు అగు బ్రహ్మకు జనించిన మొదటి సంతానమగు ముగ్గురు పుత్తూల విషయమును తెలుపుటయైనది॥
ఇట్లు నారాయణ భగవానుడును యతీశ్వరుడగు కపిలుడును చతుర్ముఖుని పుత్రయమును తమ మార్గము నకు త్రిప్పుకొని ముక్తినందించి తామును తమ ఉపాసనా మార్గమున సాధించిన ఉత్తమగతిని పొందిరి॥॥
(గమనిక: మొదటి అక్షరత త్వము ప్రణవము; దానికి అర్థమగు తత్వము పరమాత్ముడగు నారాయణుడు; ప్రణవాక్షరోపాసనచే పరమగతినందించు మార్గములు సాంఖ్య యోగములు; ఆ రెండింటికిని ఆది పరమాచార్యులుగా ఇచట నారాయణు(యోగాచార్యుడును కపిలుడును చెప్పబడినారు॥ ప్రణవమునకు విస్తరణము భూః -భువః సువః అను మూడు మహా వ్యాహృతులు; పొని ఆర్థములుగా నున్న వి పృథివి॥ ఆంతరిక్షము॥ద్యులోక ము; వీని సావయవ రూపములే ఈ చేప్పిన బ్రహ్మపుత్రయమును; అనగా వీని యర్థమును సాంఖ్యయోగ మార్గానుసార ముపాసించిన ఉపాసకులు వీని మూల మగు ప్రణ వార్తోపాసనముచే ము క్తినంద వచ్చును॥ అని భావము॥ ఇక మీదట ఈ మహా వ్యాహృతిత్రయ విస్తరణమగు గాయత్యుత్పత్తియు గాయత్రినుండి వేదాది సృష్టియు వీని యర్థమగు జగత్సృష్టియు ప్రతిపాదింపబడును॥)
ఇట్లు యోగా చార్యుడగు నారాయణుడును సాంఖ్యా చార్యుడగు కపిలుడును (ఈ ఇరువురును నారాయణ మూర్తులే ముక్తులయి వెడలిన తరువాత చతుర్ముఖుడు (పద్మోద్భవ బ్రహ్మ) మరల ఘోరతమమగు పరమతపో తమవలంబించి ఆనుష్టించెను॥ ప్రభుడగు అతడు ఆంతటి తపమాచరించుచుండియు ఒంటరి తనమున అతనికానందము కలుగలేదు॥ (ఇది ద్వైత భావనా పూర్వకమగు జగత్సృష్టికి ఆరంభ దశను తెలుపుచున్నది॥) ఆందుచే అతడు తన శారీరకమగు పరితృ ప్తి కె శుభ రూపురాలగు స్త్రీని తనకు భార్యగా నుండదగిన యామెను సృజించుకొనెను॥ ఆమే తపమున తేజమున వర్చస్సున నియమ పాలనమున తనకు సమానయనియు తానదివరకు నంకల్పించిన లోకసృష్టియందు సమర్థురాలనియు బ్రహ్మ ఎరిగెను॥ ఈ మారతడు ఆమెతో కూడి అచ్చట ఆ పద్మమునందే తపమాచరింప సాగెను॥ ఇపుడతనికి వెనుక టీవలే ఒంటరి తనపుభావన లేక తృప్తి కలిగెను॥ *ఆమె తోడ్పాటుతోనే ఆతడు ప్రభు డై మున్ముందు ప్రజాపతులను సాగ రాదిక మును సృజింపగలిగేను॥
(*ఈ స్త్రీయే గాయత్రి (సరస్వతీ) మూలతత్త్వము; బ్రహ్మ తాను కనిన స్త్రీని తన భార్యగా చేసికొనుట అనగా అర్థము ఏమో లోగడనే ఈ పురాణా రంభాధ్యాయములందు చెప్పబడినది॥ భారతీయ వాజ్మయము ప్రతీకోపాననా రూపమును ప్రతిపాదించునది॥ ఇచటి విషయములు తాత్విక విచారణకు తీసికొని ఉపాసింపక యథాతథముగా గ్రహించు టతో ఆ స్తికులు ఈ వాజ్మయపు పరమ' ప్రయోజనము పొందక పోవుచున్నారు॥ నాస్తికులు ఈ వాజ్మయమునందు దోషా రోపము చేసి ఆ మార్గమున తమ ప్రచారము సాగించుచు' హేతు వాదమను పేర' ముందునకు సాగుచున్నారు॥ ॥ వారును॥ వారి మార్గముననుసరించు వారును సాధించునదేమో ఆ పరమ సత్య స్వరూపునకే తెలియును॥)
తతో జగాద త్రిపదాం గాయత్రీం దేవపూజితామ్ ।
అపరాంశ్చైవ చతురో వేదా న్గాయత్రిసమృవాక్॥
అత్మన స్సదృశా న్పుత్త్రా సృజద్వై పితామహః ।
విశ్వే ప్రజానాం పతయే యేభ్యో లోకా వినిస్సృతాః॥
వి శ్వేశం ప్రథమం తావ న్మహాతాపన మాత్మజమ్ ।
సర్వమన్త్రహితం పుణ్యం నామ్నా ధర్మం స సృష్టవాక్॥
దక్షం మరీచి మత్రించ పులస్త్యం పులహం క్రతుమ్ ।
వసిష్ఠం గౌతమం చైవ భృగు మజ్గిరసం మునిమ్॥
అథై వాద్భుత మిత్యేతే జ్ఞేయాః వైతామహర్షయః ।
త్రయోదశగుణం ధర్మ మారభన్త మహర్షయః॥
ఆదితిర్దితిర్ధనుః కాలా॥ అనాయు స్సింహికా మునిః ।
తామ్రా క్రోధాచ॥ సురసా వినతా కద్రు రేవచ॥
దక్షస్యాపత్య మేతావై కన్యా ద్వాదశ పార్థివ ।
మరీచేః కశ్యపః పుత్ర స్తపసా నిర్మితః కిల॥
తస్మై కన్యా ద్వాదశాన్యా దక్షస్తాః ప్రదదౌ తదా ।
నక్షత్రాణిచ సోమాయ తదా వై దత్తవా నృషిః॥
రోహిణ్యాదీని సర్వాణి పుణ్యాని రవినన్దన ।
లక్ష్మీ ర్మరుత్వతీ సంధ్యా(సాధ్యా) విశ్వేశాచ మతా శుభా॥
దేవీ సరస్వతీచైవ బ్రహ్మణా నిర్మితాః పురా ।
ఏతాః పఞ్చవరిష్టాశ్చ సురశ్రేష్టాశ్చరార్థివ॥
దత్తా భద్రాయ ధర్మాయ బ్రహ్మణా దృష్టకర్మణా ।
యా రూపార్థవతీ పత్నీ బ్రహ్మణః కామరూపిణీ॥
సుర భిస్సా హితా భూత్వా బ్రహ్మాణం సముపస్థితా ।
తతస్తా మగమద్భ్రహ్మా మైథునం లోకపూజితః॥
లోకసర్జన హేతుజ్ఞో గవామర్థాయ సత్తమః ।
జజ్ఞిరేచ సుతా స్తస్యాం విపులా ధూమపన్ని భాః॥
రక్తసన్ద్యాభ్రసఙ్కాశాః ప్రాదహం సిగ్మతేజసః ।
తే రుదన్తో ద్రన నశ్చ గతవ న్తః పితామహమ్॥
రోదనాద్ద్రవణాచ్చైవ రుద్రా ఇతి తత స్మృతాః ।
నిరృతి శ్చైవ శమ్బుర్వై తృతీయ శ్చాపరాజితః॥
మృగవ్యాధఃకపర్దిచ దహనోఽథఖరశ్చవై ।
అహిర్భుధ్యుశ్చ భగవా న్కపాలీ చాపి పిజ్గళ ॥
సేవానీశ్చ మహాతేజా రుద్రా స్వేకాదశ స్మృతాః ।
ఈ॥ గాయత్రీ మూలతత్వమునుండి బ్రహ్మ తాను సృష్టిని సాగించిన విధము॥ ఆనంతరము పద్మోద్భవుడు దేవ పూజితయగు తిపదా (మూడు అష్టాక్షర పాదములుగల) గాయత్రిని ఉచ్చరించెను॥ (ఈ ఛందోరూపమునందు సర్వవేదము లయు మూలత త్వ మిమిడి యున్నది॥) అందుండి సంభూతములగు నాలుగు వేదములను గూడ అనంతర మతడు పలి కెను॥ అంతట ఆతడు తనవంటివారేయగు సర్వప్రజాపతులను పుత్రులనుగా సృజించెను॥ వారినుండియే లోకములన్నియు నిషన్న ములు అయ్యెను॥
*అందునను మొదట అతడు విశ్వమునకు అధిపతియగు ధర్ముడను కుమారుని సృజించెను॥ ఈతడు మహా తపస్వి; సర్వమంత్రములకును హితకరుడు; పుణ్యకరుడు; పవిత్రుడు,
(*మత్స్య మహాపురాణమున 170వ అధ్యాయమున॥
విశ్వేశం ప్రథమం తావ న్మహాతాపస మాత్మజమ్ ।
సర్వమంత్రహితం పుణ్యం నామ్నా ధర్మం స సృష్టవాన్॥
దక్షం మరీచి మత్రిం చ పులస్త్యం పులహం క్రతుమ్ ।
వసిష్ఠం గౌతమం చైవ భృగు మంగిరసం మునిమ్॥
అథై వాద్భుత; మిత్యేతే థేయాః వైతామహర్షయః॥
ఇచ్చట మొదటివాడు ధర్ముడు; తరువాత చెప్పబడినవారు ఇతరత్రకూడ ॥॥॥ బ్రహ్మమానస పుత్తులుగా చెప్పబడినవారే; కడపట చెప్పబడిన 'అద్భుత' శబవాచ్యుడు పం డెండవ కుమారుడనుట సమంజసము; అథ॥ అనుటను బట్టి ఇది పై వానితో పాటు సంజ్ఞావాచకమే కాని విశేషణమయి యుండదు॥ కాని కన్న డానువాదమున దీనిని విశేషణముగా భావించి అనువదించుట జరిగినది॥ ఈ
ఈ అద్భుతశ బ్లమును సంజ్ఞా వాచకముగా గ్రహించినచో మొదటివాడ గు ధర్ముడు యజ్ఞరూపుడు కాగా అద్భుతుడు 'అపూర్వము' అను యాగజన్య సంస్కార మనుకొనవచ్చును॥ మ॥ పు॥ 94)
అనంతరము దక్షుడు మరీచి ఆత్రీ పులస్త్యుడు పులహుడు క్రతువు వసిష్ఠుడు గౌతముడు భృగుడు ఆంగీరుడు అను పదిమంది ప్రజాపతులను సృజించెను॥ అందరకం టే కడపట ఓ అద్భుతుడు' అను కుమారుని కూడ సృజించెను॥ వీరు అందరును బ్రహ్మమానస పుత్రులగు ఆది ఋషులు; వీరినే పైతామహ ( పితామహునినుండి మానసులుగా జనించిన) ఋషు లందురు॥ వీరిలో ధర్ముడు పదుమూడు గుణములు ( లక్షణములు) కలవాడు; అతనిని మహర్షులును ఉపాసింపసాగిరి॥ - దక్షుడు తన కుమార్తెలలో అదితి॥దితి ॥ దనువు-కాల॥ ఆనాయువు - సింహిక-మునీతామక్రోధ-సరసవినత కద్రూ అను పండేండుమందిని మరీచీ ప్రజాపతి పుత్రుడగు కశ్యపునకు ఇచ్చి పెండ్లి చేసెను॥ - ఈ కశ్యపుడు తపో మూర్తి; ఈ దముడు తన కుమార్తెలలో మరికొందరు॥ రోహిణి మొదలగు ఇరువది ఏడు నక్షత్రములను సోమునకు ఇచ్చేను॥ వీరందరును పవిత్రమూర్తులు॥ సృష్టి ప్రక్రియను బాగుగ ఆలోచించిన బ్రహ్మచే పూర్వము సృష్టింపబడిన లక్ష్మీ॥మరుత్వతీ-సంధ్య (సాధ్య) విశ్వేశా -నరస్వతీ అను ఐదుమందిని ఆ బ్రహ్మ శుభరూపుడగు ధర్మునకు ఇచ్చెను॥ ఈ ఐదుగురును వరిష్ఠలును॥దేవతా శేష్టలును; *శబ్ద స్వరూపమును అర్థమును కల ధర్ముని పత్ని (నర స్వతి) సురభియను రూపము ధరించి లోక హితము గోరి బ్రహ్మను సేవించరాగా లోక పూజితుడును లోక సృష్టి హేతువు ఆగు ప్రక్రియను ఎరిగినవాడు నగు బ్రహ్మ గోజాతి సృష్టి సంకల్పము\తో ఆమెతో కూడెను॥ ఆమెయందు విశాలరూపులు పొగవంటివారు సంధ్యాకాలమందలి మేఘములవలే ప్రకాశించువారు తీక్ష తేజము గలవారు లోక ములనే కాల్చివేయునట్లున్న వారు కలిగిరి॥ వారు (రుదంత:-) ఏడ్చుచు (ద్రవంత:-) పరుగెత్తుచు బ్రహ్మ కడకు పోయిరి॥ ఈ హేతువుచే వారు ( ఈ రెండు పదములందలి ప్రథమాక్షరముల కూర్పుచే! 'రుద్ర' అను పదములో వ్యవహరింపబడిరి॥ వీరు నిరృతీ॥శంభుడు॥ఆపరాజితుడు-మృగవ్యాధుడు॥కపర్ది-ఖరుడు ఆహిర్భుధ్యుడు -కపాలి॥పింగళుడు॥ సేనాని అని పదునొకండు మందీ॥
(* మత్స్య -170 అ; శ్లో॥ 84॥
“యారూపార్దవతీ పత్నీ బ్రహ్మణః కామరూపిణీ॥” ॥
రూపం॥ శబ్ద స్వరూపం- అర్థశ్చ అస్యాః - స్తః ఇతి రూపార్థవతీ॥ సరస్వతీ॥ ఇత్యర్థః ॥ :
రూపము॥శబ్ద స్వరూపమును-అర్థమును కలది॥ శబ్దము; అటువంటి బ్రహ్మదేవుని పత్ని అనగా వాగ్రూపయగు సరస్వతీ॥
ఈ ఆధ్యాయములో అన్ని ప్రతులయందును॥ ధర్ముని పత్ని యందు కలిగిన సంతానము విషయమున ఎన్నో పాఠ భేదములున్నవి॥)
తస్యామేవ సుర భ్యాంచ గావో యజ్ఞైశ్వరాశ్చ వై ॥
ప్రకృష్టాశ్చ తథా మాయా స్సుర భ్యాం పశవోఽక్షరాః ।
అజా శ్చైవ తు హంసాశ్చ తథై వామృత ముత్తమమ్॥
ఓషధ్యః ప్రవరాయాశ్చ సుర భ్యా స్తా స్సముత్తితాః ।
ధర్మా ల్లక్ష్మీ స్తథా కామం సాధ్యా సాధ్యా న్వ్యజాయత॥
భవంచ ప్రభవం చైవ హీశంచాసురహం తథా ।
అరుణ్యం చారుణించైవ విశ్వావసు బలధ్రువౌ॥
హవిష్యంచ వితానంచ విధానశ మితావపి ।
వత్సరం చైవ భూతించ సర్వాసుర నిషూదనమ్॥
సుపర్వాణో బృహత్కాన్తి స్సాధ్యా లోకనమస్కృతా ।
తమేవానుగతా దేవీ జనయామాస వై సురాక్॥
వరంవై ప్రథమం దేవం ద్వితీయం ధ్రువ మవ్యయమ్ ।
విశ్వావసుం తృతీయంచ చతుర్థం॥ సోమ మీశ్వరమ్॥
తతోనురూపమాయంచ యమ న్తస్మా దనన్తరమ్ ।
సప్తమంచ తథా వాయు మష్టమం నిరృతిం వసుమ్॥
ధర్మస్యాపత్య మేత ద్వై సుర భ్యాం సమజాయత ।
విశ్వే దేవాశ్చ విశ్వాయాం ధర్మాజ్ఞాతా ఇతి శ్రుతిః॥
దక్ష శ్చైవ మహాబాహుః పుష్కరస్వన ఏవచ ।
చాక్షుషశ్చ మను శ్చైవ తథా మధుమహోరగౌ॥
విశ్వాంతశ్చ వసు ర్బాలో విష్కమ్భశ్చ మహాయశాః ।
రురు శ్చైవాతిసత్త్వాజౌ భాస్కరప్రతిమద్యుతిః॥
విశ్వాన్దేవా న్దేవమాతో వి శ్వేశాజనయత్సుతాక్ ।
మరుత్వతీతు మరుతో దేవా నజనయత్సుతాక్॥
అగ్నిం చక్షూ రవింజ్యోతి సావిత్రం మిత్రమేవచ ।
అమరం శరవృష్టించ సుకర్షంచ మహాభుజమ్॥
విరాజంచైవ వాచంచ విశ్వం వసుమతిం తథా ।
అశ్వమన్తంచిత్రరశ్మిం తథా నిషధనం నృప॥
హూయ న్తం బాడ బంచైవ చారిత్రం మదపన్న గమ్ ।
బృహన్తంచ బృహద్రూపం తథావై పూత నానుగమ్॥
మరుత్వతీ పురా జజ్ఞే ఏతాన్వై మరుతాం గణాక్ ।
ఆ సురభియందే బ్రహ్మవలన యజ్ఞము పై ఆధిపత్యముగల గోవులు ఉత్తమములగు మాయులు (2) శాశ్వత యోగ్యత గల పశువులు మేకలు హంసలు ఉత్తమమగు ఆమృతము ఉత్తమములగు ఓషధులు జనించెను॥
లక్ష్మి ధర్మునివలన కాముని కనెను; సాధ్య అను నామె ధర్ముని వలననే సాధ్యులను దేవజాతులను క నేను॥ సాధ్యుల నామములు-భవుడు ప్రభవుడు ఈశుడు అసుర హుడు అరుణుడు ఆరుణి విశ్వావసువు బాలధ్రువుడు హవిష్యుడు వితానుడు విధానుడు శమీతుడు వత్సరుడు నర్వాసుర నాశకుడగు - భూతి సుపర్వన్ అను వారు॥ మహాకాంతి శాలినియగు సాధ్యకు కుమారులై 3॥ మనస్-మంతా-ప్రాణుడు నరుడు॥అపానుడు -వీర్యవాన్ -వినిర్భయుడు - నయుడు॥దండుడు॥ నారా యణుడు॥వృషుడు॥ప్రముంచుడు॥ అని అగ్ని పురాణమునందు కలదు॥
(సరస్వతీరూప విశేష మేయగు) సురభి ధర్మునే అనుగమించి ఆతని వలన వస్తువులనేడు దేవతాగణములను కనెను॥ వారు: వరుడు ఆవ్యయుడగు ధ్రువుడు ఈశ్వరుడగు సోముడు ఆయుడు యముడు వాయువు నిరృతి అనువారు ఎనిమిది మంది॥
ఈ వసువులు సురభి (సరస్వతి) యందు ధర్ముని వలన కలిగిన సంతతి॥
విశ్వేశా(విశ్వా) అను ధర్ముని పత్ని యందు ధర్ముని వలన విశ్వేదేవులను దేవగణములు కలిగిరి॥ వారు మొత్తము పదిమంది; వారు: మహాబాహుడగు దకుడు - పుష్కరస్వనుడు చాక్షుషుడు “మనువు (చొకుష మనువు) మధువు మహోరగుడు॥ విశ్వాంతుడు॥ వసువు బాలుడు (బాలుడగు వసువు) మహాయశ శ్శాలియగు విష్కంభుడు అత్యధికమగు సత్వమును ఓజస్సును కలవాడు భాస్కరుడువలే కాంతిమంతుడునగు రురుడు అనువారు; దేవమాతలలో నొక తెయగు విశ్వేశయను నామె ధర్ముని వలన వీరిని జనింపజే నేను॥
మరుత్వతి యను నామెకు ధర్ముని వలన మరుతులను గణదేవతలు కలిగిరి॥ వారు; ఆగ్ని -చక్షుడు రవి॥జ్యోతి॥ సావిత్రుడు॥ మిత్రుడు అమరుడు-శరవృష్టి॥మహాభుజుడగుసుకరుడు-విరాట్-వాచ్ -విశ్వుడు॥వసుమతి॥ అశ్వవంతుడు చిత్ర రశ్మినిషధనుడు॥హూయంతుడు॥ బాడ బుడు-చారిత్రుడు॥మదపన్న గుడు -బహద్రూపుడగు బృహత్॥పూతనానుగుడు అను వారు,
ఆదితి: కశ్యపా జజ్ఞే ఆదిత్యాన్ద్వా ద శైవ హి॥
ఇ న్ద్రో విష్ణు ర్బగ స్త్వష్టా వరుణో హ్యర్యమా రవిః ।
పూషా మిత్రశ్చ ధనదో ధాతా పర్జన్య ఏవ చ॥
ఏతేవై ద్వాదశాదిత్యా వరి ష్ఠా స్త్రి దినౌక సామ్ ।
ఆదిత్యస్యాశ్వినౌ నాసత్యౌ జజ్ఞాతే ద్వౌ సు తౌ వరౌ॥
తప శ్రేష్ఠా గుణి శ్రేష్ఠౌ త్రిదివస్యాపి సమ్మ తౌ ।
దనుస్తు దానవాన్దజ్ఞే దితి ధైత్యా న్వ్యజాయత॥
కాలాతు వై కాల కేయా నసురా న్రాక్షసాంస్తు వై ।
అనాయుషాయా స్తనయా వ్యాధయ స్సుమహాబలాః॥
సింహికా గ్రహమా తా వై గన్ధర్వ జననీ మునిః ।
తా మ్రా త్వప్సరసాం మాతా పుణ్యానాం భార తోద్భవా॥
క్రోధాయా స్సర్వభూతాని పిశాచా శ్చైవ పార్థివ ।
జజ్ఞే యక్షగణాంశ్చైవ రాక్షసాంశ్చ విశామ్పతే॥
చతుష్పదాని సత్త్వాని తథా గావస్తు సౌరస్తాః ।
సుపర్ణా న్ప క్షిణశైవ వీనతాయాం వ్య జాయత॥
మహీధరా స్సర్వనాగాన్దేవీ కద్రూర్వజాయత ।
ఏవం వృద్ధిం సమగమన్ విశ్వ లోకాః పరస్పరమ్॥
తదా వై పౌష్కరో రాజన్ప్రాదుర్భావో మహాత్మనః ।
ప్రాదుర్భావః పౌష్కర స్తే మహాక్ ద్వైపాయనేరితః॥
సురాణః పురుష శ్చైవ మహా విష్ణు ర్హరిః ప్రభుః ।
కథిత స్తేఽనుపూర్వోణ సంస్తుతః పరమర్షిభిః॥
యశ్చైతదగ్ర్యం శృణుయా త్పురాణం సదా నరః పర్వసు చోత్తమాంశ్చ ।
అవాప్య లోకా నహి వీతరాగః పరత్ర వై స్వర్గఫలాని భు జ్కే॥
చక్షుషా మనసా వాచా కర్మణాచ చతుర్విధమ్ ।
ప్రసాదయతి యః కృష్ణం తస్మై కృష్ణః ప్రసీదతి॥
రాజాచ లభతే రాజ్య మధన శ్చొత్తమం ధనమ్ ।
క్షీణాయుర్లభతే చాయు స్సుత కామ స్సుతాం స్తథా॥
యజ్ఞాన్ వేదాం స్తథా కామాం సపాంసి వివిధాని చ ।
ప్రాప్నోతి వివిధం పుణ్యం విష్ణుభక్త ధనాని చ॥
యద్యత్కామయతే కిఞ్చి త్తత్త ల్లో కేశ్వరా ద్భవేత్ ।
ఏష పౌష్కర నామ ప్రాదుర్బానో మహాత్మనః॥
కీర్తిత స్తే మహాభాగ వ్యాస శ్రుతినిదర్శనాత్ ।
సర్వం విహాయ య ఇమం పఠే త్పౌష్కరకం హరేః॥
ప్రాదుర్భావం మను శ్రేష్ఠ న కదాఽప్యశుభం భవేత్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే పద్మోద్భవప్రాదుర్భావకథనే బ్రహ్మాదికృత వేదాది సృష్టిర్నామ స ప్రత్యుత్తర శతత మోఽధ్యాయః॥
ఇక కశ్యపుని భార్యలలో అదితియందు ఇంద్రుడు విష్ణువు భగుడు త్వష్ట వరుణుడు ఆర్యమన్ రవి పూషన్ మిత్రుడు ధనదుడు ధాత పర్జన్యుడు అను॥ ద్వాదశాదిత్యులు కలిగిరి॥ వీరిలో ద్వాదశాదిత్యాధిష్టాత యగు) ఆదిత్యునకు అశ్వి నులు నాసత్యులు అని ప్రసిద్ధిగల ఇద్దరు శ్రేష్టులగు సుతులు కలిగిరి॥ వారు తపములచే సద్గుణములచే గొప్పవారును స్వర్గమునకు పూజ్యులును; దనువునందు దానవులు దితియందు దైత్యులు కాలయందు కాలకేయులను అసురులు రాక్షసులు " అనాయుషయందు మహాబలురగు వ్యాధులు సింహికయందు (ప్రాణులను పట్టి బాధించు) గ్రహములు ముని' అనునామే యందు గంధర్వులు తామయందప్సర సలు క్రోధయందు భూత పిశాచములు " యక్షరాక్షసులు సురసయందు 'చతుష్పా త్రాణులు గోజాతులు వినతయందు గరుడాది పనులు కద్రువయందు పర్వతములు నాగులు కలిగిరి॥ ఇట్లు సర్వ లోకములు కలిగి పరస్పర మేళనముచే వృద్దినం దెను॥
మనురాజా! అపుడు ( ఆది కాలమున) మహాత్ముడగు బ్రహ్మకు కలిగిన పౌష్కర (పుష్కరము - జలము; పద్మము; దానినుండి కలిగిన) ప్రాదుర్భావ స్వరూపము ఇటువంటిది; మత్యుడు మనువునకు చెప్పినదిగా ద్వైపాయనునిచే చెప్పబడిన దానిని నేను (సూతుడు) మీకు ఋషులకు) చెప్పితిని॥ పరమరుల స్తుతులనందుకోను ప్రభుని పురాణ పురుషుని గూర్చి ఆనుపూర్వితో (క్రమముగా) మీకు తెలుపబడినది; అగ్ర్యము ( మొదటిది) ఉత్తమమునగు పురాణమును వైరాగ్య దృష్టితో ఎల్లప్పుడును విశ్లేషించి పర్వదినములందును విను నరుడు ఇహమున ఉత్తమములగు లోకసుఖములను పొంది పరలోకమున స్వర్గసుఖమును పొందును॥ చక్షువుతో దర్శించి మనస్సుతో (ఆలోచించి) వాక్కుతో స్తుతించి) కాయముతో అర్చించి) నాలుగు విధములుగ కృష్ణుని ఆరాధించి అనుగ్రహింపజేసికొను వానియందు కృష్ణుడనుగ్రహము చూపును॥ రాజు రాజ్యవృద్ధిని ధనహీనుడు ధనమును ఆల్పాయుష్కుడధికాయువును సుతకాముడు సుతులను పొందును॥ విష్ణుభక్తుడు యజ్ఞములను వేదములను కామములను వివిధ 'తపస్సులను వీటిని యథావిధిగా అనుష్టించుట చే కలుగు వివిధ పుణ్యమును పొందును॥ పలుమాటలేల? ఏది ఏది కొంచెమో గొప్పయే కోరునో అది ఎల్ల ఆ లోకేశ్వరునివలన లభించును॥ మహాభాగా! మనూ! వ్యాసప్రోక్త శ్రుతి (పురాణ సంహిత) నిదర్శించిన (నిరూపించిన)॥॥ దాని ననుసరించి నీకు మహాత్ముడగు చతుర్ముఖుని పౌష్కర ప్రాదుర్భావమును కీర్తించితిని॥ ఎవడై న ఇతర వాజ్మయ మంతయు విడిచియు హరివలన కలిగిన ఈ॥ పౌష్కర ప్రాదుర్బావ మాత్రమును అధ్యయనము చేసినను వాని క శుభములు సంభవింప కుండును; శుభములు కలుగును॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున-పద్మోద్భవ ప్రాదుర్భావ కథనమున బ్రహ్మకృత వేదాది సృష్టియను నూట డెబ్బదియవ అధ్యాయము॥ పాద్మ కల్ప వృత్తాంతమున బ్రహ్మకృత సృష్టి ప్రతిపాదనము ముగిసినది॥
Summary of chapter 170 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya provides a detailed philosophical explanation of the emergence of the cosmic lotus from the navel of Bhagavān Nārāyaṇa. The text explains that the lotus stalk represents the cosmic axis, its petals symbolize the mountain ranges and continents of the universe, and its pericarp contains the divine throne of Bhagavān Brahmā. Understanding this cosmic lotus symbol reveals the intimate relationship between the physical universe and the Supreme Unmanifest Source.