మత్స్య మహా పురాణము
64 - ఆర్ద్రానంద తృతీయావ్రతము
ఈశ్వరః: తథైవాన్యాం ప్రవక్ష్యామి తృతీయాం పాపనాశ నీమ్ ।
నామ్నా లో కే తు విఖ్యాతా మార్ద్రానన్దక రీ మహ॥
యదా శుక్లతృతీయాయా మషాఢర్క్షం భవే త్వచిత్ ।
బ్రహ్మర్క్షంతు మఘర్క్షంవా హస్తో మూలర్జ వచ॥
దర్బగన్దోదకై స్నానం తదా సమ్య క్సమాచరేత్ ।
శుక్లమాల్యామ్బర ధర శ్శక్షగన్దాను లేపనః॥
భవానీ మర్చయే ద్భక్త్యా శుక్లపు ష్పై సుగన్దిభిః ।
మహాదేవేన సహితా ముపవిష్టాం మహాసనే॥
వామదేవ్యై నమః పాదౌ శఙ్కరాయ నమో హరమ్ ।
జజ్ఘే శోక వినాశిన్యై ఆనన్దాయ నమః ప్రభో॥
రమ్భాయై పూజయే దూరూ శివాయచ పినాకినః ।
ఆనన్దిన్యై కటిం దేవ్యా శ్శూనం శూలపాణయే॥
మాధవ్యై చ తథా నాభి మథ శమ్బో ర్భవాయ వై ।
స్తనా వానన్దకారిణ్యై శఙ్కర సేన్దుమౌళయే॥
ఉత్కణ్ఠిన్యై నమః కణ్ఠo నీలకణ్ఠాయవై హరమ్ ।
కరా పుత్పలధారిణ్యై భద్రాయ జగతాం పతేః॥
బాహూచ పరిర మ్భిణ్యై నృత్తశీలాయ వై హరమ్ ।
దేవ్యా ముఖం విలాసిన్యై వృ షేశాయ పునర్విభోః॥
స్మితంచ స్మరలీ లాయై విశ్వవ క్త్రాయవే విభుమ్ ।
నేత్రే మదనవాసిన్యై విశ్వధామ్నేతి శూలినమ్॥
భ్రువౌ నృతప్రియాయైచ తాణ్డ వేశాయ శూలినమ్ ।
దేవ్యా లలాట మిన్ద్రాణ్యై హవ్యవాహాయ వై విభో॥
స్వాహాయై మకుటం దేవ్యా విభో ర్గజ్గాధరాయ వై ।
విశ్వకాయౌ విశ్వముఖౌ విశ్వపాదకరౌ శివౌ॥
ప్రసన్నవదనో వన్దే పార్వతీపరమేశ్వరౌ ।
ఈశ్వరుడు గౌరి కిట్లు చేప్పెను: ఇట్టిదియే పాపనాశ నియగు మరియొక తృతీయా వ్రతమును చెప్పెదను. దీనికి లోక మున ఆర్ధానందకర తృతీయా వ్రతమని ప్రసిద్ది. శుక్ల పక్షమున తదియనాడు ఆషాఢ ద్వయము కానీ రోహిణీ మఘాహ సమూల నక్షత్రములలో నేదైన కాని ఉన్న దినమున యజమానుడు దర్భలతో పవిత్రమయిన సుగంధ జలము లతో స్నాన మాడవలెను. తెల్లని వస్త్రములను తెల్లని పుష్పములను తెల్లని సుగంధపు పూతలను తాల్చవలేను. భవానీ మహాదేవులను మహాసనమున నిలిపి సుగంధవంతములగు తెల్లని పూవులతో పూజించవలెను.
పూజా మంత్రము: 1. వామదేవ్యై నమః శంకరాయ నమః-హర స్య పాదౌ పూజయామి; 2. శోక వినాశిన్యై నమః ఆనందాయ నమః ప్రభోః - జంఘే పూజయామి; 3. రంభాయై నమః శివాయ నమః - పినాకినః ఊరూ పూజయామి; 4. ఆనందిన్యై నమః శూలపాణయే నమః- శూలినః దేవ్యాశ్చ కటిం పూజయామి; 5. మాధవ్యై నమః భవాయ నమః - శంభోః నాభిం పూజయామి; 6. ఆనందకారిణే నమః ఇందుమౌళ యే నమః -శంకరస్య స్తనౌ పూజయామి; 7. ఉత్కం రిన్యై నమః నీలకంఠాయ నమః హరస్య కంఠం పూజయామి; 8. ఉత్పలధారియ్యై నమః- భద్రాయ నమః -జగతాం పతేః కరౌ పూజయామీ; 9. పరిరంభిజ్యై నమః నృత శీలాయ నమః-హరస్య బాహూ పూజయామి;10. విలాసిన్యై నమః దృ షే శాయ నమః-విభోః దేవ్యాశ్చ ముఖం పూజయామి; 11. స్మర లీలాయై నమః విశ్వవకాయ నమః-విభోః స్మితం పూజ యామి; 12. మదనవాసిన్యై నమః విశ్వధామ్నే నమః శూలినః నేత్రే పూజయామి; 18. నృతప్రియాయై నమః తాండవే శాయ నమః - శూలినః భుజౌ పూజయామి; 14. ఇంద్రా జ్యై నమః హవ్యవాహాయ నమః-దేవ్యాః విభోశ్చ లలాటం పూజ యామి; 15. స్వాహాయై నమః గంగాధరాయ నమః - దేవ్యాః విభోః మకుటం(శిరః) పూజయామి.
విశ్వము తమ శరీర మై అన్ని వైపులకు తమ ముఖములును పాదములును కరములును కలిగి ప్రసన్న ములైన ముఖములు కలవారగు పార్వతీ పరమేశ్వరులను నమస్కరించుచున్నాను.
ఏవం సమ్పూజ్య విధివ దగ్రత శ్శివయోః పునః॥
పద్మోత్పలాని రజసా నానావర్ణాని కారయేత్ ।
శజ్ఖచక్రే సకట కే స్వస్తికాజ్కుశ చామరాః॥
యావ న్తః పాంసవస్తత్ర రజసః పతితో భువి ।
తావద్వర్షసహస్రాణి శివలోకే మహీయతే॥
చత్వారి ఘృతపాత్రాణి సహిరణ్యాని శ క్తితః ।
దత్వా ద్విజాయ కరక ముదన్న సమన్వితమ్॥
ప్రతిపక్షం చతుర్మాసం యావదేవం సమర్చయేత్ ।
తతస్తు చతురో మాసో న్పూర్వవ త్కరకోపరి॥
చత్వారి సక్తుపాత్రాణి తిలపాలౌ ణ్యన న్తరమ్ ।
గన్దోదకం పుష్పవారి చన్దనం కుజ్కు మోదకమ్॥
దుగ్ధం మధు ఘృతం చైవ గోశృజ్గోదక మేవచ ।
పుష్పోదకం తథా వారి కృష్ణ చూర్ణసమన్వితమ్॥
ఉశీర సలిలం తద్వ ద్యవచూర్ణోదకం తతః ।
తిలోదకంచ సంప్రాశ్య వస్తే న్మార్గశిరాదిషు॥
మా సేషు పక్షద్వితయం ప్రాశనం సముదాహృతమ్ ।
సర్వత్ర శుక్లపక్షాణి ప్రశస్తాని సదార్చనే॥
ఇట్లు పార్వతీ పరమేశ్వరులను యథావిధిగా పూజించి మరల వారిముందు ముగ్గు పొడితో పద్మములు కలువలు శంఖచక్రములు కడియములు శంఖచక్ర ములు చామరములు అంకుశములు ముగ్గులు వేయవలెను. అచ్చటి భూమి పై ఎన్ని ముగ్గు ధూళికణములు పడునో అన్ని వేల ఏండ్లు యజమానుడు శివలోకమున ఆదరపాత్రుడై యుండును. తడు వాత అచ్చట బ్రాహ్మణునకు యధాశక్తిగా నాలుగు నేతి పాత్రలను అన్న పానీయములను బంగారమును కరక (గరిగ అను మట్టి పాత్ర) పై నాలుగు సకు ( పేల పిండి) పాత్రలను నాల్లు తిల పాత్రలను కూడ ఉంచి అవియును దానమీయ వలెను. ఇట్లు నాలుగు మాసములు ప్రతి శుక్లపక్షమునందును చేయుచుండవలయును. మార్గశిరము మొదలు కార్తిక మాసము వరకు పం డెండు మాసములలో వరుసగా ఈ నుంచి గంధము వేసిన నీరు-పుష్పములు(గులాబీల వంటివి) వేసిన నీరు-చందనము కుంకుమపూవు వేసిన నీరు.పాలు. తేనే.నేయి.గో శృంగములో పోసిన నీరు-పుష్పజలము.నల్ల (నూవుల) పొడి కలిపిన నీరు.వట్టి వేళ్లు వేసిన నీరు.యవల పొడి వేసిన నీరు-నూపులు వేసిన నీరు ఆ వ్రత దినము లందు రెండు పక్షములలో దేనియందయినను ఆహారముగా ఉపవసింపవలెను. వ్రతమునకు శుక్లపక్షమే చాల మంచిది.
దానకాలేచ సర్వత్ర మన్త్ర మేత దుదీరయేత్ ।
గౌరీ మే ప్రీయతా మద్య అఘనాశాయ మంగళా॥
సౌభాగ్యాయాఽస్తు లలితా భవానీ సర్వసిద్దయే ।
సంవత్సరాన్తే లవణం కుసుమం కుజ్కుమం తథా॥
చన్దనం నేత్రపట్టంచ సహిరణ్యామ్బుజేన చ ।
ఉమామహేశ్వరం ప్రామం తద్వ దిక్షుఫలై ర్వృతమ్॥
స్వాస్తరావరణాం శయ్యాం సోపధానాం నివేదయేత్ ।
సపత్నీ కాయ విప్రాయ గౌరీ మే ప్రీయతా మీతి॥
ఆర్ద్రానన్దక రీ నామ తృతీయా పాపనాశన ।
యా ముపోష్య నరో యాతి శంభో స్త త్పరమం పదమ్॥
ఇహలో కే పరానన్దం ప్రాప్నోతి ధనసమ్పదమ్ ।
ఆయురారోగ్య సన్తత్యా న క్వచి చ్చోక మాప్నుయాత్॥
య ఇదం శృణుయా న్నిత్యం శ్రావయే ద్వాపి మానవః ।
నారీవా కురుతే యా తు కుమారీ విధవాఽపివా॥
సాఽపి తత్ఫల మాప్నోతి దేవ్యనుగ్రహలాలితా ।
ప్రతిపక్ష ముపోష్యైవం మన్త్రార్చన విధానవిత్॥
రుద్రాణిలోక మాప్నోతి పునరావృత్తిదుర్లభమ్ ।
శక్ర లో కే స గన్దర్వైః పూజ్యతేఽబ్ధాయుతత్రయమ్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాతే మత్స్యమసంవాదే ఆర్ద్రానన్దరృతీయా వ్రతకథనం నామ చతుష్టష్టితమోఽధ్యాయః॥
దాన కాలమున “ఇపుడు గౌరి నాయందు ప్రీతురాలై మంగళ (శుభక రురాలు) పాపనాశమును లలిత సౌభాగ్య మును భవాని సర్వసిద్ధులను కలిగించుగాక !” అను అర్థ మిచ్చు మంత్రము చెప్పవలెను.
ఇట్లు సంవత్సరమయిన తరువాత లవణము కుంకుమపూవు చందనము నేత్రపటము (కండ్లపై ధరించు ముసుగు వస్త్రము) బంగారు తామరపూవు చేరకుగడ-పండ్లు - ఉమా మహేశ్వర ప్రతిమ.పరపులతోను ఇతర పరికరముల లతోను కూడిన మంచముబ్రాహ్మణ దంపతులకు “గౌరీ మే ప్రీయ తామ్” అను మంత్రముతో దానము చేయవలెను.
ఈ ఆర్దానందకర తృతీయా వ్రతము పాపనాశకము ; దీనియం దుపవాసముతో ప్రతము చేసినవారు ఇహలోక మున ధనసంపత్తి ఆయురారోగ్యసంతతి పరమానందములు పొంది శోకరహితులై వరమున శంభులోకమును పొందుదురు.
దీనిని వినినను చదివినను ఆచరించినను సువాసినియు కన్యయు విధవయు ఐనను దేవ్యనుగ్రహపాత్రమయి ఈ చెప్పిన ఫలమునందును. ప్రతిపక్షమునందును మంత్రార్చన విధానము ననుసరించి ఉపవసించి వ్రతము చేసినవారు పునరా వృత్తి రహితమగు రుద్రాణీలోకము పొందుదురు. ఇంద్రలోకమున ముప్పది వేల సంవత్సరములు గంధర్వులచే పూజించ బడుదురు.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఆర్ద్రానందకర తృతీయా వ్రతమను అరువది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 64 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the Sārasvata-Vrata, a holy vow observed on the fifth lunar day of the bright fortnight to invoke the divine grace of Goddess Sarasvatī, the personification of supreme wisdom, learning, and eloquent speech. The practitioner maintains physical purity, observes a vow of silence during morning hours, and worships Goddess Sarasvatī alongside Bhagavān Brahmā using white lotus flowers, white sandalwood paste, milk, and sweet rice. The devotee presents offerings of sacred books, writing instruments, and manuscript materials at the altar. Completing this vow grants the worshipper extraordinary intellectual clarity, flawless memory, mastery over sacred scriptures, persuasive speech, and high honor among scholars and royal assemblies.