మత్స్య మహా పురాణము
205 - కృష్ణాజిన దానము.
మనుః : కృష్ణాజినప్రదానయ్య విధిం కాలం మమానమ ।
బ్రాహ్మణం చ తథా ఒచశ్వ తత్ర మే సంశ యో మహా॥
మత్స్య : వైశాఖీ పూర్ణిమాస్యాంతు గ్రహణే శశి సూర్యయోః ।
పూర్ణమాసీ తు యా మా మే హ్యాషాఢ కార్తికీ తథా॥
ఉత్తరాయణం ద్వాదశీవా తస్యాం దత్రం మహాఫలమ్ ।
ఆహితాగ్ని ర్ద్విజో యస్తు తద్దేయం తస్య పార్థివ॥
యథా యేన విధానేన తన్మే నిగదతశ్శృణు ।
గోమయే నొపలి స్తే తు శుచౌ దేశే నరాధిప॥
ఆదా వేవ సమా సీర్య శోభనం శస్త మావికమ్ ।
తత స్స శృఙం సఖుర మా స్తరే తృష్ణమార్గకమ్॥
కర్తవ్యం రుక్మశృజం తద్రౌప్యదస్తం తథైవ చ ।
లాజూలం మౌక్తికై శ్ఛన్నం తిలయుక్తం తథైవ చ॥
తిలై స్తు స్థగితం కృత్వా వానసా ఓ చ్ఛాదయే ద్భుధః ।
సువర్ణనాభం తత్కుర్యా దలజ్కృత్య విశేషతః॥
రత్నై కన్టెర్యథాశక్త్యా తస్య దీక్షచ విన్య సేత్ ।
కాంస్యపాత్రాణి చత్వారి తేషు దద్యా ద్యథా క్రమమ్॥
మృన్మయేషు చ పాత్రేషు వూర్వాదిషు క్రమేణ తు ।
ఘృతం క్షీరం దధి ఔద్ర మేవం దద్యా ద్యథావిధి॥
చమకస్య తథా శాఖా మవణం కుమ్బమేవ చ ।
బాహ్యోపస్థాపనం కృత్వా శుభచిత్తో నివేశయేత్॥
[కృష్ణాజినమనగా నల్లని మచ్చలుగల ఇజ్జీ అను మృగపు చర్మము.]
కృష్ణాజినమును ఎట్టి బ్రాహ్మణునకు ఏకాలమున ఏ విధానమున దానమీయవలయునో తెలుపుమని మనువడుగ మత్సుడిట్లు తెలి పెను: వైశాఖ పూర్ణిమ చంద్ర సూర్యగ్రహణములు మాఘ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ కార్తిక పూర్ణిమ ఉత్త రాయనము ద్వాదశి తిథి. ఈ కాలములందు ఇది దానమిచ్చుట మహాఫలదము; ఆహితాగ్ని యగు విపుడు దానయోగ్యుడు; విధానమిక తెలి పెదను; వినుము! నరాధిపా! గోమయముతో అలికిన శుచి ప్రదేశమున మొదట ప్రశ స్తము శోభనమునగు కంబళము (తివాచీ) పరచవలేను; కొమ్ములు గిట్టలుకల కృష్ణాజినమును దాని పై పరచి దానికి బంగరు కొమ్ములు వెండి దంతములు ముత్తెములతో నూవులతో తోక కుచ్చు అమర్చి నూవులతో ఆచర్మము కప్పి దాని పై నూతన వస్త్రమును ఉంచి దాని నడుమ బంగరునుంచి రత్న గంధాదులతో యథాశ క్తిగ అలంకరించవలయును; వీటియందు నాలుగు దిక్కు లందు నాలుగు కాంస్యపాత్ర లుంచవలెను. అట్లే నాలుగు మట్టి పాత్రలందు వరుసగా తూర్పు మొదలుగనే నేయిపాలు పెరుగు తేనె పోయవలెను. సం పెంగ కొమ్మ ను రంధ్రములేని కడవను వీనికి బయటగా శుభచిత్తముతో ఉంచవలెను:
నవ్యవస్త్రం శుభం పీతం సర్వాజ్గేషుని వేశయేత్ ।
తథా మృన్మయపాత్రాణి పాదయో స్తస్య దాపయేత్ ॥
యాని పాపాని కాయేన మయా లో భా త్కృతాని వై ।
లోహపాత్రాది దానేన ప్రణశ్యంతు మమాశు వై॥
తలపూర్ణం తతః కృత్వా వామపాదే నివేశ యేత్ ।
యాని పాపాని కామ్యాని కామోత్థాని కృతాని వై॥
కాంస్యపాత్ర ప్రదానేన తాని నశ్యంతు మే సదా ।
మధుపూర్ణం తు తత్కృత్వా పాదే వై దక్షిణే న్య సేత్ ॥
పరాపవాద వైశున్యా త్పృష్టమాంసస్య భక్షణాత్ ।
తత్రోత్తితం చ మే పాపం తామహితా త్ర్పణశ్యతు॥
కన్యా నృతం గవాం చైవ పర దారప్రధర్షణమ్ ।
రౌవ్యపా త్రప్రదానేన క్షిప్రం నాశం ప్రయాతు మే॥
ఊర్ధ్వపాదే చ యే కార్యే తామ్రస్య రజతస్య చ ।
జన్మా త్తర సహ సేషు కృతం పాపం కుబుద్దినా॥
సువర్ణ పాత్రదానాత్తు నాశయాశు జనార్ధన ।
హేమముక్తావిద్రుమం చ దాడిమం బీజపూరకమ్॥
అశ్వత్థపత్రం శ్రవణే ఖురే శృజ్గాటకాని చ ।
ఏవం కృత్వా యథోక్తేన సర్వశాకఫలానిచ॥
ఈ చర్మపు అన్ని అంగములందు వేరువేరుగ కోత్త పసుపు పచ్చని వస్త్రములను పాదములకడ మృణ్మయ పాత్రములను ఉంచవలేను. నేను లోభము చే చేసిన కాయిక పాపములన్నియు నేచేయు, ఈలోహ పాత్రాది దానముచే శీఘమే నశించుగాక! అను మంత్రముతో లోహపోతమును దాని ఎడమ పాదముకడ నూవులతో నింపి ఉంచవలెను; నేను కామవశమున చేసిన పాపములు నేచేయు ఈ కాంస్య పాత దానముతో నశించుగాకయనుచు తేనెతో నింపిన కంచు పొత్రను చర్మపు కుడి పాదముకడ ఉంచవలెను; పరుల నిందించుట వారి పై కొండెములు చెప్పుట పృష్టమాంస భక్ష ణము. వీనిచే కలిగిన పాపము తామ్ర పాత్ర దానముచే నశించుగాక! కన్య విషయమున ఆనృతము పలుకుటవలన గోవులను పర దారలను అవమానించుట వలన కలిగిన పాపము నేచేయు ఈరాగి వెండి పాత్రల దానమున నశించుగాక! అనుచు ఈ రాగి వెండి పాత్రలను చర్మపు పై (ముందరి) ఎడమ, కుడి, పాదములకడ ఉంచవలెను; జన్మి నర సహ సములందు దుర్బుద్ధితో నే జేసిన పాపమంతయు నేజేయు ఈ స్వర్ణపాత్ర దానమున నశించుగాక; జనార్ధనా! యనుచు బంగరు పాత్ర నుంచవలెను; బంగారు ముత్తెములు పగడములు దానిమ్మపండ్లు మాదీఫలములు ప్రశస్త పాత్రమందుంచి చెవులయందు గిట్టలయందు కొమ్ముల నడిమిచోటునందు ఇంకను సర్వశాక ఫలములతో కూడ ఉంచవలయును.
తత్ప్రతిగ్రహవిద్విద్వా నాహితాగ్ని ర్ద్విజోత్తమః ।
స్నాతో వస్త్రయుగచ్ఛన్న స్వశక్త్యా చాప్య లజ్కృతః॥
ప్రతిగ్రహశ్చ తస్యోక్తః పుచ్ఛదేశే మహీపతే ।
తత ఏవం సమీ పే తు మస్త్ర మేన ముదీరయేత్॥
కృష్ణ కృష్ణ గళో దేవః కృష్ణాజినధర స్తథా ।
తద్దినా ధూమపాపస్య ప్రీయతాం మే వృషధ్వజః॥
అనేన విధినా దత్వా యథావత్కృష్ణమార్గకమ్ ।
న స్పృశే త్తం ద్విజం రాజక్ చితియూప సమో హి సః॥
దానే చ శ్రాద్ధకాలే చ దూరతః పరివర్జయేత్ ।
స్వగృహా త్ర్పేష్య తం విప్రం మజ్గళ స్నాన మాచరేత్॥
పూర్ణకుమ్భేన రాజేౄ శాఖయా చమకస్య తు ।
కృత్వా చాచార్యః కలశం మ శ్రేణానేన మూర్ధని॥
ఆప్యాయస్వ సముద్రజ్యేష్ణా ఋచో వాచ్యాస్తు షోడశ ।
అహ వాసనీ వీత ఆచా న్త శ్శుచితా మియాత్॥
తత్సర్వం కుమ్భసహితం నీత్వా క్షేపం చతుష్పథే ।
కృతేనానేన యా తుష్టి ర్న సా శక్యా సురై రపి॥
వక్తుం హి నృపతి శేష్ట తథాఒప్యుద్దేశత శ్శృణు ।
సమగ్రభూమి దానస్య ఫలం ప్రాప్నోత్యసంశయమ్॥
సర్వలోకాంశ్చ చరతి కామచారీ విహజవత్ ।
ఆభూత సమ్లవం యావ త్స్వర్గం ప్రాప్నో త్యసంశయమ్॥
న పితా పుత్తమరణం వియోగం భార్యయా సహ ।
ధనదేశపరిత్యాగం న చై వేహాప్నుయా త్క్వచిత్॥
కృషేప్సితం కృష్ణమృగస్య చర్మ ద్విజాయ దద్యాచ్చ సమాహితాత్మా ।
యథోక్త మేత న్మరణం న శోచేత్ప్రాప్నో త్యభీష్టం మనసః ఫలం తత్॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే కృష్ణాజినప్రదానికో నామ
పంచో త్తర ద్విశతతమోధ్యాయః ।
ఈ దానము గ్రహించు ఆహితాగ్ని యగు బ్రాహ్మణుడును స్నానము చేసి దోవతి ధరించి ఉత్తరీయము వేసికొని యథాశ క్తిగా అలంకరించుకొనవలయును; అతడు దీనిని తోక వై పున ప్రతిగ్రహించవలయును; దానమంత్ర మిది: “నల్లని కృష్ణాజినమా! నల్లని కంఠము కల వాడు కృష్ణాజినము దాల్చినవాడునగు వృషభధ్వజుడు నీదానముచే ప్రీతినందు గాక! నా పాపములు తొలగుగాక!” ఇట్లు కృష్ణాజిన దానమయిన తరువాత దాత ఆ విప్రుని తాకరాదు; ఏలయన ఆత డపుడు చితియందలి యూపకాష్టముతో సమానుడు; ఆతనిని దానకాల కొద్దకాలములందు దూరముగ విడువదగును; (తాక రాదు.) అంతట ఆ విప్రుని అతని ఇంటికి పంపి దాత మంగళస్నానము చేయవలయును; చంపక శాఖతో కూడిన కుంభ మందలి జలముతో ఆచార్యుడు ఆ కుంభమును దాత శిరము పైగానుంచి అతని తల పై “ఆప్యాయస్వ” “సముద్ర జ్యేష్ఠాః” ఆను ఈ మొదలగు పదునారు ఋక్కులతో జలము ప్రోక్షించపలెను; తరువాత దాత క్రొత్త వస్త్రములను (జతనుండి చించని వానిని) ఒకటి దోవతిగా మరియొకటి ఉత్తరీయముగా ధరించి ఆచమించినచో శుచియగును; ఆ కుంభమును మిగిలిన పదార శేషమును నాలుగు తోవలు కలిసిన చోట పారవేయవలెను; దీని చే కలుగు భగవత్పీతి ఇంతయని చెప్పుట దేవత లకును శక్యముకాదు; ఐనను ఉద్దేశ (నామగ్రహణ) మాత్రమున చేప్పేద వినుము; నమగ భూదాన ఫలమబ్బును; ఇందు సంశయమే లేదు; కామచారియై వక్షవలే సర్వలోక సంచారియగును; ఆ ప్రళయాంతముగా స్వర్గ ప్రాపుడె సుఖించును; వానికి పితృ పుత భార్యాదులతోడి వియోగము సంభవించదు; ధనత్యాగ దేశ త్యాగములు కలుగవు; కృష్ణునకును ఇష్టమగు కృష్ణ మృగ చర్మమును సమాహితచిత్తుడై విప్రునకు దానమిచ్చినచో ఈ యథోక్త దానఫలమున శోక రాహిత్యమును మనో భీష్టఫలసిద్ధియు కలుగును.
[గమనిక : ఇందు చెప్పినవనీలో “ఆప్యాయ స్వ” అనునది (ఋగ్వేద-1 మం-91 సూ క్షము) మొదలుగ ఎనిమిది ఋక్కులున్న వి; “సముద్ర జ్యేష్ఠాః” (ఋగ్వేద.7 మం. 4) సూక్తము మొదలుగ నాలుగు ఋక్కులున్న వి. ఇవి మొత్తము పండ్రెం డే; మూలమునందు షోడశ (పదునారు) అని యున్న ది; అదీ “ద్వాదశ” (వం డ్రేండు) అని యుండవలెనేమో; సంప్రదాయమున తెలియ వలెను.]
ఇది శ్రీమత్స్యమహాపురాణమున మను మత్స్య సంవాదమున కృష్ణాజీన ప్రధాన విధానమను రెండు వందల ఐదవ యధ్యాయము.
Summary of chapter 205 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya reveals the sacred Pitṛ-kavacha and devotional stotra, a powerful spiritual armor and prayer designed to invoke the protective grace of the divine ancestors. Bhagavān Matsya explains that reciting this sacred hymn purifies the subtle body, shields the practitioner from dark forces, neutralizes malicious astrological afflictions, and removes ancestral curses known as Pitṛ-dosha. The text mandates that reciting this stotra during daily morning prayers or before ancestral ceremonies fills the household with divine light, harmony, and lasting prosperity.