136 - తారకాక్షవధము

సూతః : తాన్ని హంతుం సమఘవా నసురా నమరేశ్వరః

 లోకపాలా యయుస్సర్వే తథైవ గణపాశ్చయే

 ఈశ్వరేణోదితా స్సర్వే ఉత్పతుశ్చామ్బరేతదా

 ఖగతాశ్చ విరోజు స్తే పడవన ఇవాచలాః

ప్రయయు స్తత్పురం హన్తుం శరీరం వ్యాధయో యథా

 శః పటహనిర్దోషి ర్మృదళైః పణవై రపి

 నాదయ స్తః పురే దేవా దృష్టి స్త్రీపురవాసిభిః

హరః ప్రాప్త ఇతీవోక్తా బలినస్తే మహాసురాః

 ఆజగ్ముః పరమం క్షోభ మత్యయేష్వివ సాగరాః

 సుర తూరరవం శ్రుత్వా దానవా భీమవిక్రమాః

వినేదు ర్నదయన్తోహి నానావాద్యా న్యనేకశః

 తూర్యాపూరితవీర్యా స్తే పరస్పరకృతాగసః

పూర్వదేవాశ్చ దేవాశ్చ సూదయన్తః పరస్పరమ్

ఆకా శేపి సమప్రఖ్యే తేషాం దేహనికృ స్తనమ్

 ప్రవృద్దం యుద్దమతులం ప్రహారకృతనిస్వనమ్

 ప్రతపన ఇవాదిత్యాః ప్రజ్వలన ఇవాగ్న యః 

శ్వసన్తఇవ నాగేన్దా భ్రమ నఇవ పకిణః

జృమ్భ శ్రఇవ శార్దూలా గర్జ నఇవ తోయదాః

గిరీన్హాఇవ కమ్పన్తో దానవాశ్చ మహాబలాః

 వివృద్ధొర్మితరజ్ఞాఘమభ్యస్త ఇవ సాగరాః

 ప్రమథాశ్చ మహాశూరా దానవాశ్చ మహాబలాః

 యుయుధు ర్నిశ్చలా భూత్వా వజొఇవ మహాబలాః

కార్ముకానాం వికృష్టానాం బభూవు ర్దారుణారవాః

 కల్పానుగానాం మేఘానాం యథా వియతి వాయునా॥॥

*అయంమే శరణంయాతః కుప్యసిత్వం మృతోహ్యసి

ప్రహరాశు స్థిరోభూత్వా ఏహి దర్శయ పౌరుషమ్

 గృహాణ ఛిన్దిభిందీతి ఖాద మారయ దారయ

ఇత్యూచురుచ్చై రన్యోన్యం ప్రయయు ర్యమసాదనమ్ 

(*ఆహుశ్చాభయ మాభై షీః క్షయోస్య నిభృతేహ్యసి.)

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఆ అసురులను చంపుటకై శివుని ఆదేశమున అమరేశ్వరుడగు ఇంద్రుడును లోకపాలురును ప్రమథ గణాధిపతులును బయలుదేరి వెళ్ళిరి. ఈశ్వరాజ్ఞానుసారముగా వారందరును ఆకాశమునకు ఎగిరి అచట సంచరించుచు యెక్కలుగల పర్వతముల వలె ప్రకాశించుచుండిరి. శరీరమును నశింపజేయ, బోవుచున్న వ్యాధులవలె త్రిపుర దుర్గమును నశింపజేయదలచిపోవుచు వారు శంఖములను పటహము (తప్పెట)లను మృదంగములను పణవములను మోగించసాగిరి. ఇట్లు వాద్యములు మోగించుచు దుర్గమున కనబడిన ఆ దేవ సేనను చూచి త్రిపుర వాసులు బలశాలురగు మయాది మహాసురులతో హరుడే దుర్గ మునకు వచ్చెనని తోచుచున్నదని చెప్పిరి. దానవులు తామెంత భీమ విక్రములయ్యును దేవతల వాద్య ధ్వనులను విని ప్రళయ కాలమునందలి మహా సాగరములవలే కలవరమందసాగిరి. పోరును సోనో వాద్యములను అనేక విధములయిన పోటీని మోగింపసాగిరి. ఇరుపక్షముల వారును తమతమ వాద్యములను మోయించుటతోపాటు తమతమ వీర్యములను ప్రశంసించుకోనుచు ఒకరికి మరియొకరు శస్త్రాస్త్ర ప్రయోగములతో ఆపకారములు చేసి కొనసాగిరి. దేవదానవులు వీరిని పోరును వారిని వీరును చంపుకొనుచుండిరి. సమతలమయి ప్రకాశించుచు నిరాలంబమగు ఆకాశమునందును వారి పరస్పర ప్రహారముల ధ్వనులతో పరస్పర దేహావయవ. దేహ ఖండనములతో సాటిలేని యుద్ధము సాగుచుండెను. ఇరుపక్ష ములవారును యుద్ధ విజృంభణావేశ వశమున మిగుల వేడిమితో వెలుగు సూర్యులవలె ప్రజ్వరిల్లు అగ్నులవలె బుసకొట్టు నాగములవలె ఆకాశమున భ్రమించు పక్షులవలె విజృంభించు వ్యాఘములవలే ఉరిమెడి మేఘములవలే కంపిల్లు గిరీంద్రములవలే క్షణక్షణమును వృద్ధినందు చున్న తరంగ శ్రేణులతో కూడి క్షోభిల్లు సాగరములవలె మహాబల (దార్థ్య) సంపన్న ములగు వజములవలే నిశ్చలు లగుచు మహాశూరులగు ప్రమథులను మహాబలులగు దానవులును నిశ్చలులయి యుద్ధము చేయసాగిరి. గాఢముగా వారాక రించుచుండిన ధనువుల టంకారములు ప్రళయ కాలానుసారి మేఘములు ప్రళయ వాయు పేరితములగుచు చేయు దారుణ రవములను పోలియుండెను. ఓ వీడు నన్ను శరణు జొచ్చినాడు.' 'నా పై నీవు కోపించువాడవా?’ 'ఇదిగో! చచ్చితివిరా! 'స్థిరముగా నిలువుము.''సన్ను కొట్టగలిగినచో శీఘ్రముగా కొట్టుము’ ‘రమ్ము; నీ పౌరుషమును చూపుము.' 'పట్టుకోనుము.' 'నరకుము’ ‘చీల్చుము.’ ‘తినుము.' చంపుము.' 'బ్రద్దలు చేయుము.' ఇట్లు పరస్పరము బిగ్గరగా అనుకొనుచు పోరుచు యమలోకమునకు పోవుచుండిరి.

ఖడ్గాపవర్జితాః కేచి త్క్కేచిచ్ఛిన్నాః పరశ్వథైః

 కేచి న్ముద్ధర భిన్నా జ్ఞాః కేచి ద్బాహుహతాశ్చతే

పట్టసై ర్నో దితాః కేచి తేచి చ్ఛూలవిదారితాః

 దానవా శ్శరపుష్పాభా స్సబాణాః పర్వతాఇవ

 నిపత న్యర్ణవజలే భీమనకతిమిజ్గలే

వ్యసుభి శ్శరవిద్దాళైః వతమానై స్సు రేత రైః

 సమ్బభూ వార్ణ వే శబ్ద స్సజలామ్బుదనిస్వనః

తేనఁ జేన చోద్విగ్నా నక్రా స్తిమితిమజ్జిలాః

మత్తా లోహితగన్దేన క్షోభయన్తో మహార్ణవమ్

పర స్ప రేణ కలహం కుర్వాణా భీమమూర్తయః

వమన్తో భక్షయన్తశ్చ దానవానాంచ లోహితమ్

సర థా నౌ యు ధా న్తాశ్వా నవస్త్రాభరణామ్బరా

 అగ్రసంస్తిమయో దైత్యాక్ ద్రావయన్తో జలేచరాః

 యుద్దం యథాసురాణాంచ ప్రమథానాంచ వర్తతే

అమ్బరేచ తథాయుద్ధం యోధయన్తో జలేచరాః

యథా భ్రమని ప్రమథా స్సదైత్యా స్తథాభ్రమ నే తిమయ స్సనక్రాః

  తథైవ ఛిన్దని పరస్పరస్తు తథై వక్రన్ద నిచభిన్న దేహాః

వ్రణా ననై ర జర సం స్రవది సురాసురై ర్నక్రతిమిఱ్ఱలై శ్చ

  కృతోముహూ ర్తేన సముద్రదేశ స్సర క్షతోయై స్సముదీర్ణ తోయః

సితం మహామ్బోధరపర్వతాభం ద్వారం మహా నం త్రిపుర స్యశ క్రః

 నిపీడ్యతస్థా మహతా బలేన యుక్తస్సు రేశో మహతా జవేన

తద నరేవై తనుజో హరస్య బాలార్కజామ్బూనద తుల్యవర్ణః 

స్కన్దః పుర ద్వార మథో రురోధ బాలో స్తశృఙం ప్రపతన్ని వార్కః

యమశ్చ విత్తాధిపతి స్స దేవై స్సో మ్పతిః పాశవరాయుధశ్చ

  దేవారణ స్తస్య పురస్య ద్వార మాపశ్చిమం పశ్చిమతో నిరుద్దమ్

తస్యాపి రుద్ర స్తపనాయుతాభ స్సహానుగై ఫ్లేవర ఫేన దేవకి

 తన్మస్థిర ద్వార మరేఃపుర స్య రుద్ద్వవత స్టే భగవాం శ్రిణేత్రః

తుఱ్ఱని వేశ్మాని సగోపురాణి సువర్ణ కైలాసశ శిప్రభాణి

  ప్రహ్లాద రూపాః ప్రమథావరుద్దా జ్యోతీంషి మేఘా ఇవ సాశ్మవర్షాః

ఉత్పాట్య చోత్పాట్య గృహాణి తేషాం సశైలమాలాసన వేదికాని

 ప్రక్షిప్యచోప్లాప్య సముద్రమద్యే కాలామ్బుదాభాః ప్రమథా వినేదుః

రక్తాని చా శేషవనై ర్యుతాని సాశోక ఖడ్గాని సకోకిలాని,

 గృహాణ (గృహణహేతాత) హేనాధ పితస్సుతేతి భ్రాతేతి కాంతేతి ప్రియేతి చాపి

ఉత్పాట్యమానేషు గృ హేష నార్యోహ్యనార్యశబ్దా బహుధా ప్రచుక్రుశుః 

కొందరు ఖడ్గములతో ముక్కలయిరి. మరికొందరు గండ్ర గోడండ్రతో తెగిరి. కొందరు ముద్దరములతో ఖండితులయిరి. మరికొందరు భుజ ప్రహారములతోనే నలిగిచచ్చిరి. కొందరు పట్టసములతో నొచ్చిరి. కొందరు శూలములతో చీలికలయిరి. దానవులు శరములనేడు పూల తో ప్రకాశించుచు బోణములు గుచ్చు కొనిన కొండలవలే నయి భయంకరములగు నక్రములతో తిమింగిలములతో నిండిన సముద్ర జలమున పడుచుండిరి. బాణముల దెబ్బలుతిని ప్రాణములుపోయి పడుచుండిన రాక్షసులతో సముద్రమునుండి సజల మేఘముల ఉరుములవంటి ధ్వనులు ఉప్పతిల్లెను. నక్రములు (ఒక విధమగు సముద్ర జంతువులు)ను తిమింగిలములును ఆ ధ్వనులకు భయపడియు ఆ రాక్షసుల ర కపు వాసనకు మత్తెక్కియు సముద్రజలమును క్షోభింపజేయు చుండెను. అవి భయంకర రూపములయి పరస్పరము కల హించుచు రాక్షస ర క్తమును భక్షించు(త్రాపు)చు క్రక్కు.చునుండెను. సముద్రమునందలి తిమింగలములు సముద్రమున పడిన దానవులను వారి రథములను ఆయుధములను ఆశ్వములను ఆభరణములను వస్త్రములను కూడ మింగివేయుచు తమకు ఆపనిలో అడ్డము తగిలిన వేరు తిమీ తిమింగిలములను తరిమివేయుచుండెను. అంబరము (ఆకాశము) నందు ప్రమథులును దానవులును పోరుచున్నట్లే అంబరము (జలము)నందు జలచర జంతువులును పోరుచుండెను. యుద్ద క్రమమున ప్రమథులును దైత్యులును గిరగిర తిరుగుచున్న జై సముద్రమున జలచరములును తిరుగుచుండెను. అట్లే పరస్పరము నరకుకొనుచుండెను. అట్లే దేహము లు నరకుకొని చీల్చుకొని అర చుచుండెను. తమ గాయపు నోళ్ళ నుండి రక్తమును స్రవించుచుండిన నక్ర తిమింగలాది మహాజల జంతువులతోను సురాసురులతోను ఒక ముహూర్త కాలములోనే రక్తము కలిసిన నీటితో సముద్రమంతయు వృద్ధి పొందినదయ్యెను.

ఇది ఇట్లుండ సురేశ్వరుడగు శకుడు (ఇంద్రుడు) మహా సైన్యమును తీసికొనిపోయి తెల్లనిదై మహామేఘము వలెను మహాపర్వతమువలెను ఉన్న తమయి కాంతివంతమయిన త్రిపుర దుర్గ మహాద్వారమును మహావేగముతో ముట్టడి చేసి అడ్డగించి నిలువబడెను. ఆ సమయమునందే బాల సూర్యునివలేను కాచిన బంగారువలేను ప్రకాశించు హర పుత్తడగు స్కందుడు (కుమారస్వామి) బాలుడయ్యును మహాతేజశ్శాలియగు సూర్యుడు ఆ స్తపర్వత శిఖరమును ముట్టడించినట్లు మరియొక వైపునుండి ముట్టడించెను. యముడును కుబేరుడును పాశ శ్రేష్ఠము ఆయుధముగా, ధరించిన వరుణుడును దేవ శ్రేష్టులననేకులను వెంటగొని త్రిపుర దుర్గపు పశ్చిమ ద్వారమును ముట్టడించిరి. భగవానుడు త్రినేత్రుడు.

బహువదనవతాం కిమేష శబ్దో నదతాం శ్రూయతి భిన్న సాగరాథః

వద వచ తటిమాలి కిం కి మేత ద్ధజలా రురుధు ర్ధజాను కింవా

 ఇతి మయవచ నాంకుశార్దితస్స న్విద్ము న్మాలి రవిరివ సోంశుమాలి

రణశిరసి సమాగతాన్ సురాంస్తాక్ నిజగాదేద మరిన్దమోతిహరాత్

 యమవరుణమ హేన్షరుద్రవీర్య స్తవశయనే నిధి రేష తార కాక్షః

సకలసమర శీర్షః పర్వతేన్గాయుధో య స్తపతిహి ననిర స్త స్తార కాజో గణేశౌః

 మృదిత ముపనిశమ్య తార కాక్షం అతిదీప్తానలభీషణాయతాక్షమ్

హృషితసకలలోక నేత్రసక్తాః ప్రమథా స్తోయముతో యథా నద ని

 ఇతి సుహృది వచో నిశమ్య తత్వం తటిమాలే సమయ స్సువర్ణమాలీ

రణశిరసి సితాఙ్ఞానాచలాబో నిజగాయై నమిదం మయో వచోఒన్యత్

 విద్యున్మాలి న్యథాయుక్తం తత్కరిష్యామి విక్రమాత్

యథా పురంచ నిర్ముక్తం భవే త్పరభయార్టీతమ్

 విద్యున్మాలీ తతః క్రుద్దే మయశ్చ త్రిపు రేశ్వరః

ప్రమథా న్షఘ్ను రాదిష్టా స్సహితా స్తిర్మహాసురై

 యేనయేన గత స్తంతం విద్యున్మాలీ మయశ్చసః

 తేనతేన పరంశూన్యం ప్రమథై : ప్రకృతైః కృతమ్

 అథ యమవుణమృదజశజ్జ ఘో షైః పటహాడిండిమవాద్యకప్రమో షైః

సక లతలవపుశ్చ సింహనాదైః పరమభిపూజ్య తథాసురా వితస్థుః

 సమ్పూజ్యమానో దితిజైర్మహాత్మభి స్సహస్ర శ్మి ప్రతిమో మయో బభౌ

అభిష్టత స్స త్వరత్రే స్తపోధనై ర్యథాభశృజ్ఞాభిగతో దివాకరః

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే త్రిపురోపాఖ్యానే త్రిపుర దా హే దేవాసురయుద్దే

తార కాక్ష వధో నామ షట్త్రింశదుత్తరశతత మోధ్యాయః

సహజముగనే భయంకర నేత్రుడును దానవేశ్వరుడునగు తార కాకుడు రోషముతో మరింతగా మొగమును కన్నులును ఎర్రగానయి రుద్రుడు చూచుచుండగా అతని సమీపమందే ప్రమథ కుల పరమానందకరుడగు నందీశ్వరుని వడ్లంగివాడు సరసమగు (మెత్తని) చందనపు కొయ్యను చెక్కినట్లు తీక్ష మగు గండ్ర గొడ్డలితో చెక్కెను. శిలాదపుత్తు డగు నంది తన్నట్లు తార కానుడు గండ్ర గొడ్డలితో గాయపరచగా తన ఖడ్గమును ఒరనుండి పెరికి ఆ తార కాక్షుని చంపదలచి శరభమృగమువలె వాని పెకి దుమికెను. ప్రమథ గణాధిపతియగు నందీ వాడియగు పాదరగల ఆ ఖడముతో యజ్ఞోప వీతము ఉండు క్రమములో ఎడమ భుజము పై నుండి కుడి డొక్క క్రిందీవరకు ఏటవాలుగా) తారకాకుని, నరకి వేసి సింహనాదము చేసెను. తార కార్డు డిట్లు నంది చేతిలో మరణించగా ప్రమథగణ సైనికులు మహా భయంకర శంఖధ్వనులు చేసిరి. ప్రమథుల శంఖధ్వనులను దేవతల వాద్యధ్వనులను విని విద్యున్మాలితో మయుడు విద్యున్మాలీ! ఈ ధ్వని ఏమి? అనేక కంఠములనుండి ఒకేమారు వచ్చిన ధ్వనియా ఇదీ ఒక లత చెందుచున్న సముద్రముల ధ్వనియా.గజపాలురు అడ్డ గించగా కోపించి ఘీంకరించుచున్న ఏనుగుల ఘీంకార ధ్వనియా? అని అడిగేను. మయుని ఈ మాట విద్యున్మాలికి అంకుశపు పోటువలే బాధాకరమయ్యెను. యమ వరుణ మ హేంద్ర రుద్రులతో సమానుడగు వీరుడును' నీకు శయనమున దాచుకోన్న నిధివంటి వాడును సకల యుద్ధములందు అగ్రగామియు వజ్రాయుధము వంటివాడు నగు తారకాక్షుడు ప్రమథ గణము చేతిలో చంపబడి రణరంగమున పడినాడు. ఆ ఉత్సాహమున ఒక చోట చేరి నినాదములు చేయుచున్న దేవతల కోలాహల మిది. ప్రజ్వలించు అగ్నివలే భయంకర నేత్రు డా తార కాకుడు రణమున మర్ధితు డ్యునని వినగానే దేవత లును ప్రమథులును ఎల్లరును ఇందులకై సంతోషించిన సకల లోక జనుల సంతోషమునకు ప్రోత్సాహకముగా చేయుచున్న నాదములు ఇవి. అని పలి కెను. ఆ మాటలు విని మయుడు. 'విద్యున్మాలీ! ఇపుడేమి చేయవలెనో ఆది చేయుదును. మన త్రిపుర దుర్గమునకు పర బల భయము లేకుండ చేయుదును.' అని పలికెను. తరువాత మయుడును విద్యు న్మాలియు క్రుద్దులయి తమ ఆదేశానుసారము తమకు సహాయులై యున్న అసురులతో కూడి ప్రమథులను చావగొట్ట నారంభించిరి. వారు ఇద్దరును ఏ ఏ త్రోవలో పోయిరో ఆ చోట నెల్ల ప్రమథులు వారి నడ్డగించి అచట రాక్షసు లేవ్వరును లేకుండునట్లు చంపివేయుచుండిరి. ఇది చూచి సంతోషముతో యమ వరుణాదులు మృదంగ పటహడిండిమాది వాద్యములు మోగించుచుండిరి. భుజాస్పాలనములతోను సింహనాదములతోను తమ సంతోష ప్రకటనము చేయుచుండిరి. సూర్య సమాన తేజుడగు మయుని మహాత్ములు దైత్యు లందరును - సత్త్వగుణాభిరతులగు తపోధనులు ఆకాశాన్నత భాగము నలంకరించిన మధ్యాహ్న సూర్యుని అభిష్టవము చేసినట్లు స్తుతించుచుండిరి.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున తార కాక్ష వధమను నూట ముప్పది యారవ అధ్యాయము.