మత్స్య మహా పురాణము
28 - శుక్ర దేవయానీ సంవాదము
శుక్రః: యః పరేషాం నరో నిత్య మతివాదాం స్తితిక్షతి ।
దేవయాని! విజానీహి తేన సర్వ మిదం జీతమ్॥
య స్సముత్పతితం క్రోధం నిగృహ్ణాతి హయం యథా ।
స యన్తే త్యు చ్యతే సద్బి ర్హ యో రశ్మిష సజ్జతే॥
య, స్సముత్పతిత్తం క్రోధం నియచ్ఛతి చ ధర్మతః ।
దేవయాని విజానీహి తేన సర్వ మిదం జీతమ్॥
య స్సముత్పతితం కోపం క్షమయైవ నిరస్యతి ।
యథోరగ స్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే॥
యశ్చ భావయతే ధర్మం యోఽతిమాత్రం తితిక్షతి ।
యశ్చ తప్తో న తపతి భృశం సోఽర్థస్య భాజనమ్॥
యో యజే దశ్వమేధేన మాసి మాసి శతం సమాః ।
య స్తర్పయతి చాన్నేన తయో రక్రోధనో వర॥
యత్ కుమారాః కుమార్యశ్చ వైరం కుర్యు రచేతసః ।
న త త్ప్రాజ్ఞస్తు కుర్వీత విదుస్తే న బలాబలమ్॥
దేవయానీ: వేదాహం తాత బాలాఽపి కార్యాణాం తు గతిం యతః ।
క్రోధే చై వాతివాదే వా వేద చాపి బలాబలే॥
శిష్య శ్యా శిష్యవృ త్తేర్హి న క న్తవ్యం బుభూషతా ।
అసత్స జ్కీర్ణవృ త్తేషు వాసో మమ న రోచతే॥
పుంసో యే నాభినన్దన్తి వృత్తేనాభిజనేన చ ।
న తేషు నివసే త్ప్రాజ్ఞ శ్రేయోఽర్థి పాపబుద్ధిషు॥
యే త్వేన మభిజానన్తి వృత్తేనాభిజనేన చ ।
తేషు సాధుషు వస్తవ్యం స వాస శ్శ్రేష్ఠ ఉచ్యతే॥
త న్మే మథ్నా తి హృదయ మగ్ని కామ ఇవారణిమ్ ।
వా గ్ధురు క్తం మహా ఘోరం దుహితు ర్వృషపర్వణః॥
న తస్మా దుష్టవచనం మన్యే లో కేషు త్రిష్వపి ।
యత్సపత్న శ్రియం దీప్తాం హీన శ్రీ: పర్యుపాసతే॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదా న్తర్గత శౌనక శతానీకసంవాదే చ వంశానువర్ణనే యయాతిచ రితే శుక దేవయానీ సంపాదకథనం నామాష్టావింశతిత మోఽధ్యాయః॥
శుక్రుడు ఇట్లనెను : “దేవయానీ ! ఎవడు ఇతరులు పలికిన అతివాదములను (అనరాని మాటలను) ఓ కొనునో అత డే' ఈ సమస్త విశ్వమును జయించిన వాడనీ ఎరుగుము. ఎవడు పైకి ఎగిరి పడుచున్న క్రోధమును గుర మును వలె నీ గ్రహించి పట్టుకోనునో అతనిని సత్పురుషులు -యంత నియమించుకోనుపొడుసారథి' అని వ్యవహరింతురు. గుర్రము- పగ్గములయందు చిక్కుకొనియుండును. (పగ్గములు లాగినచో గుర్ర ము నిలిచిపోవును. చిత్త్రమును నిగ్రహించినచో క్రోధము నిలిచిపోవును.) పైకి ఎగిరి పడుతున్న క్రోధమును ధర్మము నిగ్రహించి వాడే ఈ విశ్వమంతయు జయించినవాడు. పైకి లేచుచున్న కోపమును కుబుసమును పాము దూరముగా తోసివేసినట్లు ఏడు ! వేయునో వాడే పురుషుడు. ఎవడు ధర్మమును అనుషించునో ఎవడు మిగుల ఓర్పుతో ఉండునో ఎవడు ఇతరులు తపింపజేసినను తపి చడో అతడే ప్రయోజనము (శుభము ను పొందును. నెలకు ఒకటి చొప్పున నూరేండ్లు అశ్వమేధములు చేసిన వాని కం టెను నూరేండ్లు నిరంతరము. అన్న దానము చేసిన వానికంటెను క్రోధమును అణచుకొన్న వాడే మేలు. విరోధము. ఓర్పు- అనువాని బలాబలములు తెలియనందున అవివేకముచే కుమారులును కుమారికలును పసివారు) పరస్పరము కలహింతురు. కాని ప్రొజులు అట్టిది చేయరు."
"దేవయాని ఇట్లు పలికెను : “తండ్రీ ! నా వయస్సు చిన్న దే నను నాకు కార్యగతి (ఏ పని చేయవలెనో) తెలియును. క్రోధము అతివాదము అను వాని బలా బలములును నాకు తెలియును. తన శుభము కోరినవాడు ఎవ్వడును తన శిష్యుడు శిష్యుడుగా నడుచుకొనక పోవుటను సహించరాదు. సద్వర్తనము లేక ధర్మాధర్మముల సంకీర్ణపరచి నడుచు కొనువారి యొద్ద జీవించుట నాకిష్టముగాదు. సద్వర్తనము కలిగిన వారిని మంచి వంశమున పుట్టిన వారిని ఎవరు తగినట్లు గౌరవించరో . అటువంటి పాపబుద్దులయొద్ద తస మేలు కోరిన ప్రాజ్ఞుడు నివసించరాదు. . ఎవరు తాము సద్వర్తనమును సద్వంశమును కలిగి అవి కలిగినవారిని గుర్తించి ఆదరింతురో అట్టి సాధుజనుల యొద్ద నివసించుట తగినపని. ఆదియే శేషమగు నివాసము. ఇది ఇట్లుండగా వృషపర్వుని కూతురు పలికిన మహా ఘోరములగు దుర్వచనములు అగ్ని ని సంపా దీంనగోరిన వారు అరణిని మథించినట్లు నా హృదయమును మథించుచున్నవి. తన గొప్పతనము తరిగిపోవుచుండ ప్రజ్వ లించుచున్న శత్రుల గొప్పతనమును ఆశ్రయించి ఇతడు జీవించుచున్నాడు అనిపించుకొనుట కంటే దుష్టవచనము ( అపకే రి కరమగు విషయము) లోకములో మరేదియు లేదని నా అభిప్రాయము.”
ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్ర వంశానువర్ణనమున యయాతి చరిత్రమున శుక్ర దేవయానీ సంవాదము అను ఇరువది ఎనిమిదవ అధ్యాయము.
Summary of chapter 28 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya narrates the event that transformed the life of Devayānī. While sporting in a royal pleasure garden with Śarmishṭhā, who was the daughter of the Asura King Vṛshaparvan, and her maiden companions, a strong wind disturbed their garments left by a riverbank. In their hurry to dress, Princess Śarmishṭhā inadvertently put on Devayānī's royal robe. A fiery argument ensued, wherein Devayānī boasted of her father's supreme position as guru to the Asura king, while Princess Śarmishṭhā retorted arrogantly that Devayānī's father was merely a chanting beggar dependent on her royal father's charity. In a fit of rage, Princess Śarmishṭhā pushed Devayānī into a dry well and returned to the palace, believing her to be dead.