166 - నారాయణ మార్కండేయ సంవాదము॥

 శ్రీమత్స్యః : ఏవమేకార్ణవీభూతే శేతే లో కే మహాద్యుతిః

 ప్రచ్ఛాద్య సలిలేనోర్వీం హంసో నారాయణ స్తదా

 మహతో రజసో మధ్యే మహార్ణవసర స్సువే

 విరజస్కం మహాబాహుమక్షయం బ్రహ్మయద్విదు

 ఆత్మరూవప్రకా శేన తమసా సంవృతః ప్రభుః

 మనసాత్వికమాదాయ తత్ర తత్సత్యమాసతే

 యాథాతథ్యం పరం జ్ఞానం యథా య ద్భ్రహ్మణో మతమ్

 రహస్యారణ్యకోద్దిష్టేయథోపనిషది శ్రుతమ్

 పురుషం బ్రహ్మ ఇత్యేతద్యత్పరం పరికీర్తితమ్

 యత్రాన్యః పురుషో న స్యాత్స ఏవ పురుషోత్తమః

నీ యే చ యజ్ఞకృతో విప్రా యే ఋత్విజ ఇతి స్మృతాః

 అస్మా దేవ పురా భూతా యజ్ఞేజ్యాః శూయతాం తథా

 బ్రహ్మాణం ప్రథమం వక్తాదుద్దాతారంచ సామగమ్

 హోతారమపి చాధ్వర్యుం బాహు ఖ్యామసృజతభుః

బ్రహ్మణో బ్రాహ్మణాచ్ఛంసీం ప్రస్తోతారంచ సర్వశః

తౌమైత్రావరుణౌ పృష్ఠాత్ప్రతిప్రస్థాతార మేవ చ

 ఉదరాత్ప్రతతిహర్తారం పోతారం చైవ పార్థివ

ఆచ్ఛావాక మథోరుభ్యాం నేష్టారంచైవ పార్థివ

 పాణిభ్యామథ చాగ్నీధ్రం సుబ్రహ్మణ్యం తు జానుతః

గ్రావస్తుతంతు పాదాభ్యామున్నే తారంచ యాజుషమ్

 ఏవమేవైష భగవాన్షోడ శైవ జగత్పతిః

ప్రవర్తనా నర్వయజ్ఞానా మృత్విజోఽసృజదుత్తమాక్

 తదేష వై వేదమయః పురుషో యజ్ఞసంజితః

 వేదా శ్చైతన్మయా స్సర్వే సాజ్గోపనిషదః క్రియాః  

మహాద్యుతియు (మహా ప్రకాశుడును) హంసరూపుడు (సంసార రూపానది ప్రవాహమయి సదా ప్రవ రిలు చుండువాడు) అగు నారాయణుడు పృథివీని నీటితో కప్పివేసి ఇట్లు ఏకార్ణవీ భూతమగు లోక మునందు మహార జోగుణరాశి మధ్యమున మహార్ణవ సరస్సుల జలముల) యందు శయనించును ఆతనినే రజోగుణ రహితుడు మహాబాహుడు ( ఆధిక శక్తిశాలి) నాశరహితుడు అగు పరమాత్ముడని తత్వవేత్తలందురు ఆ ప్రభువు అపుడు ఆత్మ (స్వ) స్వరూప మయి స్వయంసిద్ధమగు ప్రకాశముతోను తమో గుణాత్మకమగు ఆవరణముతో కూడ కప్పబడియుండును సత్వగుణమయమగు మనస్సును సాధనముగా గ్రహించిన వారు మాత్రమే) ఆ సత్య తత్వము నుపాసించగలరు బ్రహ్మ తత్వమునకు సంబంధించిన యథాతథ పరమజ్ఞానము ఆరణ్యక రహస్యము అనబడు ఉపనిషత్ నందు (ఉపనిషత్ అనగా రహస్యమని యర్థము) ప్రతిపాదింపబడినది; ఆ తత్వమున కే పురుషుడనియు బ్రహ్మమనియు పేరులు; అతని కంటే ఇతరులగు పురుషులు లేరు కావున అతడే పురుషోత్తముడు; యజ్ఞము నిర్వహించు ఊఋత్విజులును విప్రులును యజ్ఞ ములును ఇతరములగు దేవతారాధనలు ( ఇజ్యలు)ను ఆ పురుషో త్తము నుండియే జనించేను

 ప్రజాపతి దేహమున వీరి ఉనికిని ఈ విధముగా చూపవచ్చును :

(అతడు తననుండి పదునారు మంది ఋత్విజులను జనింపజేసిన క్రమము: ముఖమునుండి బ్రహ్మ సు సామ వేద జ్ఞుడగు ఉద్దాతను - బాహువులనుండి హోతను ఆధ్వర్యుని బ్రహ్మ హృదయము నుండి బ్రాహ్మణాచ్చంసినీ ప్రస్తో తను వీపునుండి మైత్రావరుణుని ప్రతి ప్రస్థాతను ఉదరమునుండి పోతను ప్రతిహర్తను - తొడలనుండి అచ్చా వాకుని నేషను - ముంజేతులనుండి ఆగ్నీధ్రుని మోకాళ్ళనుండి సుబ్రహ్మణ్యునీపాదములనుండి గ్రామ స్తుత్ ను ఉన్నే తను-ఇట్లు సర్వయజ ప్రవర్తకులగు ఋత్విజులను సృజించెను ఈ హేతువుననే ఈ పరమ పురుషునకు వేదమయుడనియు యజ్ఞ పురుషుడనియు నామము వేదములును వేదాంగములును ఉపనిషత్తులును యాగాది క్రియలును ఈ భగవన్మయములే )

ప్రజాపతి దేహావయవములుగా షోడశ (16) ర్విజులు॥

అవయవములు:

వక్త్రము-

బాహువులు-

హృదయము –

వృష్ట (పార్శ్వ)ము

ఉదరము-

ఊరువులు-

పాణులుజానువులు

పాదములు

ఋత్విజులు

1 బ్రహ్మ

2 ఉద్దాత

3 హోత

4 ఆధ్వర్యువు

5 బ్రాహ్మణాచ్ఛంసి

6 ప్రస్తోత

7 మైత్రావరుణుడు

8 ప్రతిప్రస్థాత

9 పోత

10 ప్రతీహర్త

11 అచ్చా వాకుడు

12నేష్ట

13 అగ్నీధ్రుడు

14 సుబ్రహ్మణ్యుడు

15 గ్రావస్తుత్

16 ఉన్నేత

ప్రధానులు

1 బ్రహ్మ                      2 ఉద్దాత      3 హోత        4 అధ్వర్యువు

సహాయులు

5 బ్రాహ్మణాచ్ఛంసి    6 ప్రస్తోత 7 మైత్రావరుణుడు 8 ప్రతివ్రస్థాతా 9 పోత

10 ప్రతిహర్తా 11 అచ్చావాకుడు 12 మేష్టా 13 ఆగ్నీధ్రుడు 14 సుబ్రహ్మణ్యుడు

15 గ్రావస్తుత్ 16 ఉన్నే తా

*అతడు తననుండి పదునారు మంది ఋత్విజులను జనించజేసిన క్రమము: ముఖమునుండి బ్రహ్మను సామ వేదజ్ఞుడగు ఉద్గాతను బాహువులనుండి హోతను అధ్వర్యుని బ్రహ్మ ' (హృదయము నుండి) బ్రాహ్మణాచ్చంసిని ప్రస్తో తను వీపునుండి మైత్రావరుణుని ప్రతి ప్రస్థాతను ఉదరమునుండి పోతను ప్రతిహర్తను తొడలనుండి ఆచ్చావాకుని నేషను - ముంజేతులనుండి ఆగ్నీధ్రుని మోకాళ్ళనుండి సుబ్రహ్మణ్యుని పాదములనుండి గ్రావస్తుత్ ను ఉన్నతను- ఇట్లు సర్వయజ ప్రవర్తకులగు ఋత్విజులను సృజించెను ఈ హేతువుననే ఈ పరమ పురుషునకు వేదమయుడనియు యజ్ఞ పురుషుడనియు నామము వేదములును వేదాంగములును ఉపనిషత్తులును యాగాది క్రియలును ఈ భగవన్మయము లే 

(* ఈ పదునారుమంది ఋత్విజులలో బ్రహ్మ ఉద్గాత హోత ఆధ్వర్యువు అను నలుగురును ప్రధానులు; మిగిలిన పండ్రెండు మందిలో బ్రాహ్మణాచ్ఛంసిపోతా- ఆగ్నీధ్రుడు-అను మువ్వు 1 ను బ్రహ్మకును ప్రస్తోతాప్రతిహర్తా సుబ్రహ్మణ్యుడు అను ముగ్గురును ఉద్గాతకును మైత్రావరుణుడు ఆచ్చావాకుడు గ్రావస్తుత్-అను మూవురును హోత కును ప్రతి ప్రస్థాతనే ఉన్నత-అను త్రయమును అధ్వర్యునకును యజ్ఞ నిర్వహణమున సహాయులుగా నుందురు 

ఆశ్వలాయన శ్రాత సూత్రములుపూర్వషట్క-చతుర్థాధ్యాయారంభము) స్నాతకుడు (గురుకులమున వేద విద్యా ధ్యయనము చేసి విద్యా సమాప్తి వ్రత స్నాన మొనర్చిన యాతడు కాని బ్రహ్మచారి (గురుకులమున వేద విద్యా ధ్యయన మొనర్చువాడు కాని ఉపకుర్వాణ బ్రహ్మచారి) కాని మరెవ్వరైన దీక్షితుడు (ఆదివరకే యజ్ఞ మాచ రించిన పవిత్ర జన్ముడు) కాని ఉన్నతకు దీక్ష ఇచ్చును ఉన్నత-నేష్టకు ఆగ్నీ ద్రునకు-సుబ్రహ్మణ్యునకు గ్రావస్తుత్ కుదీక్ష ఇచ్చును నేష్ట-ప్రతి ప్రస్తాతకు పోతకుప్రతిహరకు ఆచ్ఛావాకునకు దీక్ష ఇచ్చును; ప్రతి ప్రస్థాత అధ్వర్యునకు-బ్రాహ్మణాచ్ఛంసికి ప్రస్తోతకు మైత్రావరుణునకు దీక్ష ఇచ్చును అధ్వర్యువు-గృహపతికి (యజమానునకు)- బ్రహ్మకు - ఉద్గాతకు-హోతకు దీక్ష ఇచ్చును శతపథ బ్రాహ్మణము-మధ్యమకాండము 16; 1 బ్రా

నారాయణవక్త్రా న్మార్క ణ్డేయవినిర్గమః పునః ప్రవేశశ్చ

 స్వపిత్యకార్ణవే తోయే యదాశ్చర్య మభూత్పురా

 శ్రూయతాం తద్యథా విప్రా మార్కణ్డేయః కుతూహలాత్

 గీర్ణో బగవత స్తస్య కక్ష్యా వేవ మహామునిః

 బహువర్ష సహస్రాయు స్తస్యైవ ఘనతేజసా

ఆటం స్తీ ర్దప్రసజ్గేన పృథివీం తీర్థగోచరః

 ఆశ్రమాణిచ పుణ్యాని దేవతాయతనానిచ

 దేశా న్రాష్టాణి చిత్రాణి పురాణి వివిధోనీచ

 జపహోమపర శ్శాన్త స్తపో ఘోరం సమాస్థితః

 మార్క ణ్డేయ స్తత స్తస్య శనై ర్వ క్త్రాద్వినిస్సృతః

 ని ష్క్రమ స్తం స ఆత్మానం జానీతే దేవమాయయా

 ని ష్క్రమ్య చాస్య వద నాదేకార్ణవమథో జగత్

 సర్వత స్తమసా చ్ఛన్నం మార్క ణ్డేయోఽన్వవై క్షత

 తస్యోత్పన్నం భయం తీవ్రం సంశయశ్చాత్మజీవితే

దేవదర్శనసస్తు ష్టో విస్మయం పరమం గతః

 సోఽచి న్తయజ్జులా నఃస్థ్రో మార్కణ్డేయశ్చ శ జితః 

కింను స్యాన్మమ చిత్తేఽయం మోహస్స్వపోను భూయతే

 వ్య క్తమన్యత మో వావస్తేషాం సమావితో మమ

 న హీదృశం జగతేశ మయు క్రం సత్యమర్హతి

 నష్టచన్ద్రార్కపవనే నష్టపర్వత భూతలే

 కతమస్స్యాదయం లోక ఇతి చిన్తామవస్థిత:

 దదర్శ చాపి పురుషం స్వప స్తం పర్వతోపమమ్

 సలిలేర్ధమధోమగ్నం జీమూతమివ సాగరే

 తప క్షమిప తేజోభిర్గోయు క్తమివ భాస్కరమ్

శర్వర్యం జాగ్రతమివ భాసన్తం స్వేన తేజసా

దేవం ద్రష్టుమిహాయాతః కోభవానితి విస్మయాత్

 తథైవచ మునిః కుక్షిం పునరేవ ప్రవేశితః

 స ప్రవిశ్య శనైః కుక్షిం మార్కణ్డేయస్సువిస్మితః

తథైవచ పునర్భూయో విజాసన్త్స్వప్న దర్శనమ్

స తథైవ యథా పూర్వం స ధరామటతే పురా

 పుణ్యతీర్థ జలో పేతాం వివిధాన్యాశ్రమాణీ చ

 క్రతుభిర్యజమానాంశ్చ సమాప్తవర దక్షిణైః

 అపశ్య ద్దేవకుక్షిస్థా న్యాజకా ఇ్ఛతశో ద్విజోక్

 సద్వృత్త మాశ్రితా న్త్సర్వా స్వర్ణా న్భ్రాహ్మణపూర్వకాక్

చతుర శ్చాశమా న్త్సమ్య గ్యథోద్దిష్టా న్మయా తవ  

పూర్వ మొక ప్రళయ సమయమున ఏకార్ణవ జలమున ఈ పురుషోత్తముడు నిద్రించుచుండ జరిగిన యాశ్చర్య కుతూహలకర విషయమును తెలిపేదను వినుడు బహు సహస్ర వత్సరాయువుగల మార్క) డేయ మహాముని ఆ భగ వాసునిచే ప్రళయ సమయమున మింగ బడి ఆతని కుక్షి యందు ఆ దేవుని తేజస్సులోనే వ్యాపుడై యుండెను అచటనే తీర్థయాత్రా ప్రసంగమున పృథివియందు సంచరించుచు పుణ్యములగు తీర్థములందు ఆ శ మములందు దేవాలయములందు దేశములందు రాష్ట్రములందు విచిత్రములగు వివిధ పురములందు సంచరించుచు జపహోమపరుడును శాంతుడునునె ఘోర తపస్సాచరించెను అతడు మెల్లగా అతని నోటినుండి వెలికి వచ్చుచు ఇది ఈ భగవానుని మాయవలననే జరుగుచున్న దని గుర్తించేను వేలికి వచ్చిన తరువాత అతడు జగమంతయు ఏకార్ణవమయి ఆంధకారావృతమయి యుండుట చూచేను: అతనికి తీవ్ర భయమును తన జీవితము విషయమున బ్రదుకుదునా లేదాయను) సంశయమును కలిగెను అతడు భగవ దర్శనము చే సంతుష్టు డయ్యెను; మిగుల ఆశ్చర్యమును కూడ పొందేను అత డట్లు జలమధ్యమం దుండియే భయముతో నా చిత్తమునం దీదియేమయిన మోహము కలిగేనా స్వప్నము ననుభవించుచున్నా నా? అనుకొనెను ఒక వేళ ఆ జగత్పదార ములు ఒక విధముగా నుండగా మరియొక విధముగా నున్న వని (నశించకయున్నను నశించినవని) నేనే పొరపడుచున్నా నేమో ! ఏలయన జగత్తునకు ఇంతటి క్లేశము (నాశము) సంభవించుట యుక్తము కాదు గదా! చంద్ర రవి వాయువులును పర్వతములును భూతలమును నశించిన తరువాత ఈ లోకము ఏ లోకమని భావించవచ్చును? అని చింత నందుచుండగనే ; పురుషుడు నిద్రించుచు కనబడెను అతడు మేఘమువలే సముద్రమునందు మునిగిన సగము శరీర

తేజస్సులతో వేడిమి నిచ్చుచు కిరణయుకుడగు భాస్కరుడువలే నత డుండెను స్వ తేజస్సులతో వెలుగుచు రాత్రియందు కూడ మేల్కాంచినవాడువలే నుండెను జగమంతయు చీకటితో నిండి రాత్రివలే నుండెను ఆ మహాపురుషుడు మాత్రము మేల్కాంచి యుండెను) “నేను భగవానుని దర్శించుటకు వచ్చితిని; మరి నీ వెవ్వడవు?” అని మార్కండేయుడా పురుషునితో అనుచుండగనే మరల మార్కండేయుడు భగవానుని కుక్షి యందు ప్రవేశింపజేయబడెను మార్కండేయు డట్లు మెల్లగ కుడియందు ప్రవేశించి మిగుల విస్మయపడుచు ఇదియంత యు స్వప్న దర్శనమని భావించుచు మరల ఎప్పటివలే భూ సంచారము చేయుచు ఆ దేవుని కుడియందు పుణ్యతీర్థ జలములను వివిధాశ్రమములను సమగ్రము లును  శ్రేష్టములును నగు దక్షిణలతో యజనము చేయుచున్న యజమానులను వారి చే యజింప జేయబడుచున్న యాజకులను వందలకొలది మంది బ్రాహ్మణులను చూచెను వారేకాక బ్రాహ్మణాది వర్ణములవారు సద్వర్తనులయి నేను మత్యుడు నీకు తెలిపిన ఆయా వర్ణాశ్రమ ధర్మములను లెస్సగ ఆచరించుచు అతనికి కనబడిరి

ఏవం వర్ష శతం సాగ్రం మార్కణ్డేయస్య ధీమతః

 చరతః పృథివీం సర్వాం న కుక్ష్య న్త స్సమీక్షితః

 తతః కదాచి దశ వై పునర్వక్త్రా ద్వినిస్సృతః

 సుప్తం న్యగ్రోధశాఖాయాం బాల మేకం నిరై క్షత

 తథై వై కార్ణవజలే నీహారేణావృతామ్బరే

 అవ్య క్తః క్రీడలే లో కే సర్వభూతవివర్జితే

 స ముని ర్విస్మయావిష్ణః కౌతూహలసమన్వితః

బాలమాదిత్యసఙ్కాశం నాశక్నో దభివీక్షి తుమ్

 నారాయణమార్కణ్డేయసంవాద:

సోఽచిన్తయ తదై, కాన్తే స్థిత్వా సలిలసన్నిధౌ

 పూర్వదృష్ట మిదం మేనే శ జితో దేవమాయయా

 అగాధ సలిలే తస్మి న్మార్కణ్డేయ స్సువిస్మితః

 ప్లవం స్తథా ర్తి మగమ దృయా త్సన్త్స స్తలోచనః

 తస్మై స భగవాహ స్వాగతం  బాలయోగవాక్

బభాషే మేఘతుల్యేన స్వనేన పురుషోత్తమః  

మా భైర్వత్స నభేతవ్య మిత ఆయాహి మే స్త్రీకమ్

 మార్కణ్ణి యముని స్వాహ బాలగీతం శ్రమపీడితః

 మార్కజేయః : కో మాం నామ్నా కీర్తయతే తపః పరిభవన్మమ

దివ్యం వర్షసహస్రాఖ్యం ధర్షయన్నివ మే వచః

 న హ్యేష వ స్సమాచారో దేవేష్వపి మ మోచితః

 మాం బ్రహ్మాbచ దేవేశో నీరా యురితి భాషతే

 క స్తమో ఘోర మాసాద్య మ మేతి త్యక్తజీవితః

 మార్కణ్డేయేతి మాముక్త్వా మృత్యు మీడితుమర్హతి

 సూత : ఏవమాభాష్య తం క్రోధాన్మార్కట్టే యో మహామునిః

 తథైవ భగవాన్బూయో భాషతే మధు సూదనః  

ఇట్లా ధీమంతుడగు మార్కండేయుడు సంపూర్ణముగ నూరేండ్లు పృథివీ సంచారము చేసినను భగవానుని కుక్షికి కొన మాత్రము దొరుక లేదు; కాని ఆట్లు సంచరించుచునే ఒకానొకప్పు డతడు ఆ కుక్ష్మి నుండి వెలికి వచ్చెను అతని కీ మారు మరికొమ్మ పై నిద్రించుచున్న బాలు డొకడు - నబడెను అత డ డై ఏకార్ణవ జలమున మంచుతో కప్పబడిన ఆంతరిక్షము నడుమ ఏ ప్రాణియును లేని లోకమున అవ్యక్త రూపుడై క్రీడించుచుండెను ఆ మువి విస్మయా విష్టుడును కుతూహలవంతుడును నయ్యెను కాని సూర్య సమానుడగు ఆ బాలుని మాత్రము సమగ్రముగా పరిశీలించి చూడ జాలక సోయెను అత డపుడు ఏకాంతమందు జల-సన్నిధియందు స్థానమందు) నిలిచియుండి ఎంత యో ఆలోచించెను ఇది ఏమని ఆలోచించుచునే ఇది నే నిదివరకు చూచినదేయని అత డనుకొనెను ఆ దేవుని మాయతో భయపడెను మిగుల ఆశ్చర్యముతో అతడు ఆ ఆగాధ సలిలమందు తేలుచు ఈదులాడుచు మిగుల శ్రమ - చెందుచు భయగ్రస్త లోచను డయ్యెను భగవానుడగు ఆ యోగి బాలుడు అతనికి స్వాగతము పలికెను ఆ పురుషోత్తముడు మేఘ సమాన ధ్వనితో “నాయనా! మార్కండేయా! భయపడకుము నా దగ్గరకు రమ్ము” ఆనేను “నా తపమునకు పరాభవము కలిగించుచు దివ్యవర సహస్రముల పరిమాణముగల నా వయస్సును ఆలక్ష్యము చేయుచు నన్ను పేరుతో పిలుచుచున్న ఈత డెవ్వడు? ఈ నీ తక్కువపరచు నడువడి దేవతలయందు కూడ నేను ఆలవాటుగా చూచియుండలేదు దేవేశుడగు బ్రహ్మ కూడ నన్ను 'దీరాయూ!' అని పలుకరించును ఇట్టి నన్ను తాను ఘోరాంధకారమందుండియు జీవిత త్యాగమునకును సిద్దపడి మార్కండేయా! అని నన్ను పిలిచి మృత్యువును దర్శింపగోరుచున్న ఈత డెవ్వడు?” అని మార్కండేయ మహాముని పలికినంత భగవానుడును మధు సూదనుడు నగు బాలుడు మరల ఆట్లే మేఘ గంభీర ధ్వనితో ఇట్లు పలికెను:

శ్రీభగవాక్ : అహం తే జనకో వత్స హృషీ కేశో మహాగురుః

ఆయుఃప్రదాతా పౌరాణః కిం మాం త్వం నోపసర్పసి

 మాం పుత్రకామః ప్రథమం పితా తేఽజ్గిర సో మునిః

 పూర్వమారాధయామాస తవస్తీవ్రం సమా! శితః

 స తప్త్వా దీర్ఘతపసా త్వాం వృణౌ దమితౌజనమ్

 ఉక్తవానహ మాత్మస్థం మహర్షి మమితౌజసమ్

 కస్సముత్సహతే చాన్యో యో న భూతాత్మకాత్మజః

ద్రష్టు మేకార్ణవగతం క్రీడంతం యోగమాయయా

 తతః ప్రహృష్టహృదయో విస్మయోత్పుల్లలోచనః

 మూర్ట్ని బద్దాఞ్జలిపుటో మార్కణ్డేయో మహాతపాః

 నామగోత్రే తతః ప్రోచ్య దీర్ఘాయు ర్లోకపూజితః

 తస్మై భగవతే భక్త్యా నమస్కార మథాక రోత్

 మార్కణ్డేయః : ఇచ్చేయం తత్వతో మాయా మిమాం జ్ఞాతుం తవానఘ

 యదేకార్ణవమధ్యస్థ శ్శేషే త్వం బాలరూపవాక్

 కింసంజ్ఞశ్చైవ భగవన్లో కే సంజ్ఞాయ సే ప్రభో

 తర్కయే త్వాం మహాత్మానం కోహ్యన్య స్థ్యాతుమర్హ తి

నాయనా! నేను నీ తండ్రిని; హృషీ కేశుడను; హృషీక ములకువిషయేంద్రియములకు ఈశుడను) మహాగురు డను గురువులకును గురుడను) నీకు (నులోకమందలి ప్రాణులకును) ఆయువును ఇచ్చువాడను; పురాణ (ప్రాచీనతమ)

తత్వమను నేనే; నీవు నా కడకు రాకున్నా వేల? మొదట పూర్వకాలమున నీ తండ్రియగు ఆంగిరస అంగిరో వంశజుడగు) మృకండుముని పుత్రుల కోరి తీవ్ర తవ మాశ్రయించి తల్సాధనమున నన్ను మెప్పించెను; అమిత శక్తివంతుడవగు నీవు కుమారుడుగా కావలెనని వర మడిగెను ఆత్మనిష్ఠుడు ఆ మీతేజః శాలియగు ఆతని కోరికకు నేను సరే యంటిని సర్వ భూతాత్ముడగు ఆటి మహర్షి కుమారుడు కాక మరెవ్వరు ఏకార్ణవగతుడయి యోగమాయతో క్రీడించు నన్ను చూడగలడు? ఆనగా దీర్ఘాయుష్కుడు లోకపూజితుడు మహా తపస్కుడగు మార్కండేయుడు హర్ష పూర్ణ హృదయముతో ఆశ్చర్యమున విప్పారిన కన్నులతో తల పై నిలిపిన దోసిలితో తన పేరును గోత్రమును పేర్కొని నారాయణుని నమస్కచెను పూజ్య భగవన్! నీవు బాలరూపుడవై ఏకార్ణవమందున్న హేతువును నీ మాయకు గల వా స్తవ రూపమును తెలియగోరు చున్నాను ప్రభూ! భగవన్ ! నీవు ఏ సంజ్ఞ(నామము )తో లోక మున వ్యవహరింపబడుదువు? నీవు మహాత్ముడ(పర మాత్ముడవని యూహించుచున్నాను కానిచో మరి ఎవ్వరు ఈ ఏకార్ణవ జలమున ఉండగలరు? అనేను

శ్రీభగవాక్ : ఆహం నారాయణో బ్రహ్మ న్త్సర్వభూ స్సర్వనాశనః

అహం సహస్రశీర్షాఖ్యై (ద్యై) ర్యః పదై రభిసంజ్ఞితః

 ఆదిత్యవర్ణః పురుషో మఖే బ్రహ్మమయో మఖః

 అహమగ్నిర్హవ్యవహో యాదసాం పతి రవ్యయః

అహమిన్ద్రపదే శక్రో వర్షాణాం పరివత్సరః

అహం యోగీ యుగాదిశ్చ యుగాన్తో వర్ష మేవచ

 అహం సర్వాణీ రత్నా ని దైవతాన్యభిలానిచ

భుజజ్గానా మహం శేషస్తార్క్ష్యో వై సర్వపక్షి ణామ్

 కృతాన్త స్సర్వభూతానాం విశ్వేషాం కాలసన్నిభః

అహం ధర్మ స్తపశ్చాహం సర్వాశ్రమనివాసినామ్

అహంచైవ సరిద్దివ్యా క్షీరోదశ్చ మహార్ణవః

 యత్సత్యం చైవ పరమ మహ మేకః ప్రజాపతిః

 అహం సాజ్ఖ్యమహం యోగోఽప్యహం తత్పరమం పదమ్

అహమిజ్యా క్రియావాపి హ్యహం విద్యాధిపస్స్మృతః

 అహం జ్యోతిరహం వాయు రహం భూమి రహం నభః

 అహమాపస్సముద్రాశ్చ నక్షత్రాణి దిశో దశ

బ్రాహ్మణ శేషా! నారాయణుడు *సర్వకారణుడు సర్వపోషకుడు సర్వ స్థితికర్త సర్వనాశ కుడు సహస్ర శీరాది పదములతో వ్యవహరింపబడువాడు ఆదిత్యవర్ణుడగు పురుషుడు యజ్ఞమం దారాధింపబడు బ్రహ్మ(వేద)మయ పురుషుడు యజ్ఞము హవిస్సును వహించు ఆగ్ని జలచర ప్రాణుల కధిపతియగు సముద్రాధి దేవత (వరుణుడు , అవ్యయ (ఏ మార్పును లేని తత్త్వము ఇంద్రుని నామములలో శక్రవదముచే వ్యవహరింపబడు తత్వము వర ములలో పరివత్సరము (ఆనేడు వర్షము) యోగి యుగాది యుగాంతము వర్షము సర్వ రత్నములు సర్వ దేవతలు సర్పములలో శేషుడు సర్వ పక్షులలో గరుత్మంతుడు సర్వ భూతములందు కాల సమానుడగు యముడు ఆయా ఆశ్రమ ధర్మములందుండు వారి ధర్మ తపస్సులు దేవనదియగు గంగ క్షీర సాగరము పరమ సత్యము ప్రథమ ప్రజాపతి సాంఖ్యము యోగము పరమ పదము దేవతా 7 ధన (ఇజ్యా) క్రియ విద్యాధిపతి అగ్ని వాయు పృథివ్యాకాశ జలములను పంచభూతములు సముద్రములు నక్షత్రములు దశ దిశ లు నేనే

(* శ్లో50 సర్వభూః: సర్వం భవతి అస్మాత్ ఈ విశ్వమంతయును ఈతని నుండియే కలుగును; కావున సృష్టిక ర్త, 

సర్వం భవతి అస్మిన్ అనేన; ఈ విశ్వమంతయును ఈతని చేతనే ఈతనియందే నిలిచియుండును; కావున 'స్థితి'కర్త 

ఇట్లు ఈ రెండు అర్థములును ఇచటి 'సర్వభూః' అనెడు పదమునుండియే లభించును )

అహం వర్ష మహం సోమః పర్జన్యోఽహ మహం (రవిః) విభుః

క్షీరోదే సాగ రేవాహం సముద్ర బడ బాముఖ

అహం సంవర్తకో భూత్వా పిబంస్తోయ మహం హవిః

 అహం పురాణః పరమం తథై వాహం పరాయణమ్

 అహం భూతస్య భవ్యస్య వర్తమానస్య సర్వతః

యత్కిఞ్చిత్పశ్య సే విప్ర యచ్చ్రుణోషి నకిఞ్చన

యచ్చానుభవ సే లో కే తత్సర్వం మామనుస్మర

విశ్వం సృష్టం మయా పూర్వం సృజే చాద్యాపి పశ్యమామ్

 యుగే యుగే చ స్రక్ష్యామి మార్కణ్డేయాఖిలం జగత్

 దేతదఖిలం సర్వం మార్కణ్డేయావధారయ

 శుశ్రూషః పరధర్మే ప్సుః కుక్షౌచర సుఖం మమ

మమ  బహ్మా శరీరస్థో దేవాశ్చ ఋషిభిస్సహ

 వ్యక్తమవ్య క్తయోగం మా మవగ చ్చా సుర ద్విషమ్

 అహమేకాక్షరో మన్త్రస్యా (శ్చా)క్షర శ్చైవ తారకమ్

 పరస్త్రివర్గా దోజ్గార స్త్రీవర్గార్ధనిదర్శనః

ఏవ మాది పురాణోఽసౌ వదన్నేవ మహామతిః

 వక్త్రమావృతవానాశు మార్కణ్డేయం మహామునిమ్

 తతో భగవతః కుం ప్రవిష్టో మునిసత్తమః

 స తస్మిన్ముఖ మేకాన్తే శుశ్రూష ర్హంస మవ్యయమ్

 అయం స యో వివిధతనుo పరిశ్రితో మహార్ణ వే వ్యపగతచంద్ర భాస్కరే

శనైశ్చర న్పృభురవి హంససంజ్ఞితోఽసృజజగద్విహరతి కాలపర్యయే

ఇతి శ్రీమత్స్యమహాపురాణే నారాయణనాభిపద్మోద్భవకథనే నారాయణ మార్కణ్డేయనవాదో నామ షటష్ట్యుత్తర శతతమోఽధ్యాయః

వర్షము సోముడు (ఓషధులకు పుష్టి నిచ్చు దేవత) పర్జన్యుడు మేఘాధిష్టాన దేవత) రవి క్షీర సాగరము సముద్రమందలి బడబాగ్ని సంవర్తకాగ్ని అయి ప్రళయమున జలము హవిస్సును శ్రావు అగ్ని -పురాణ(అతి ప్రాచీన) త త్వము పరాయణము (ఎల్ల భూతములకును చివరి గమ్యము) భూత భవిష్యద్ వర్తమానములకు ఆదికారణము - విప్రాః నీవు చూచునది వినునది అనుభవించునది అంతయు నేనే అని తెలియుము పూర్వము సృజించునది ఇపుడు సృజింపబడ నున్నది అంతయు నేనే యుగయుగమునందును నేనే అఖిల జగమును సృజింతును నీవును నా కుక్ష్మి యందు సుఖ ముగా సంచరించుచు నేను వ్యవస్థ చేసిన ధర్మములను ఎరుగుచు ఉండుము బ్రహ్మ యు దేవతలతో ఋషులతో కూడి నా శరీరమందే యున్నాడు వ్య క్తము అవ్య క్తము అగు తత్వములును అసుర' నాశకుడును ఏకాక్షర మంత్రమగు అకారము త్ర్యక్షరమగు తారకసంసారమునుండి తరింపజేయు ప్రణవమంత్రము నేనే; ధర్మార్థ కామము లనెడు మూడు పురుషార్థములను (వేదరూపమున నిరూపించుచు ఈ త్రివర్గముకంటె ఆవల నున్న తత్త్వమును నిరూపించు ఓంకారమును నేనే; ఆని ఈ మొదలగునవి చెప్పుచునే మహామతిశాలియు పురాణుడునగు ఈశ్వరుడు నారాయణుడు మార్కండేయ మహా మునిని తన నోటిలోనికి తెచ్చుకొనెను అంతట ఆ మునిస ముడును భగవానుని కుక్ష్మియందు ప్రవేశించి ఏకాంతమున అవ్యయుడు హంసరూపుడును అగు భగవానుని సేవించుచుండెను వివిధ తనువుల ధరించి లోకముల ప్రవర్తింప జేసి చంద్ర సూర్యులునులేని మ హైకార్ణవమున ఈ వివిధ రూపములతో మెల్లగా సంచరించుచు మరల కాలము వచ్చినపుడు తత్పరిణామానుసారము జగములను సృజించుచు విహరించు హంసరూప భగవానుని స్వరూపము ఇది

ఇది శ్రీమత్స్య మహాపురాణమున నారాయణ మార్కండేయ సంవాదమను నూట ఆరువది ఆరవ అధ్యాయము