106 - ప్రయాగ మాహాత్మ్యము 

యుధిష్ఠిరః : ఏతచ్ఛ్రుత్వా ప్రయాగస్య య త్వయా పరికీర్తితమ్

విశుద్ద మేద్య హృదయం ప్రయాగస్య తు కీర్తనాత్

అనాశకఫలం బ్రూహి భగవం సత్ర కీదృశమ్

కంచ లోక మవాప్నోతి విశుద్ద స్సర్వకిల్బిషైః

 మార్కణ్డేయః : శృణు రాజ స్ప్రయాగస్య త్వనాశకఫలం విభో

ప్రాప్నోతి పురుషో ధీమా ఇద్దధానో జితేన్దియః

అహీనాజ్గో హ్యరోగశ్చ పళ్చోన్షియసమన్వితః

అశ్వమేధఫలం తస్య గచ్ఛతస్తు పదేపదే

కులాని తారయేద్రాజక్ దశపూర్వాక్ దశాపరాక్

ముచ్యతే సర్వపాపేభ్య స్సగచ్ఛే త్పరమంపదమ్

యుధిష్ఠిరః : మహాభాగ్యం హి ధర్మస్య యత్వం వదసి మేప్రభో

అల్పేనైవ ప్రయత్నేన బహూక్ ధర్మా నవాప్నుయాత్

అశ్వమేధై స్తు బహు భిః ప్రాప్యతే ప్రాకృతై రపి

ఇమం త్వం సంశయం బ్రూహి పరం కౌతూహలంహి మే

మార్కణ్డేయః: శృణు రాజన్మహద్దుహ్యం మహాపాపప్రణాశనమ్

పద్మగరేణ యతోక్త మృషీణాం సన్నిధౌ పురా

పశ్చియోజనవి స్తీర్ణం ప్రయాగస్యతు మణ్డలమ్

ప్రవేశో యస్య తద్భూమౌ స్కోశ్వమేధః పదేపదే

వ్యతీతా స్పురుషా నప్త భవిష్యాంశ్చ చతుర్ధశ

నర స్తారయతే సర్వా న్యస్తు ప్రాణాన్పరిత్యజేత్

ఏవం జ్ఞాత్వాతు రాజేక్ట్ర సదా శ్రద్ధాపరో భవ

అశ్రద్దధానాః పురుషాః పాపోపహతచేతసః

న ప్రాప్నువని తం స్థానం ప్రయాగం దేవర క్షితమ్

యుధిష్ఠిరః : స్నేహా ద్వా ద్రవ్యలో భార్వా యతు కామవశం గతాః

కథం తీర్థఫలం తేషాం కథం పుణ్య మవాప్నుయుః

విక్రయ స్సర్వభాక్తానాం కార్యాకార్య మజానతః

ప్రయాగే కా గతి స్తస్య తన్మే బ్రూహి మహామతే  

మార్కణ్డేయః : శృణు రాజ న్మహద్దుహ్యం సద్యః పాపప్రణాశనమ్

మాసమేకం నర స్స్నాయా త్ప్రయాగే నియతేంద్రియః

ముచ్యతే సర్వపాపేభ్యో యథాదిష్టం స్వయంభువా

యుధిష్ఠిరుడు మార్కండేయు నిట్లడిగెను: అయ్యా! తాము కీర్తించిన ప్రయాగ మాహాత్మ్యమును విని నా హృద యము విశుద్దమయినది. భగవన్! ఆచట నెట్టి యాచరణమున ఆనాశక (ఎన్నటికిని నశించని) ఫలము కలుగునది తెలు పుము. దానిచే నరుడు సర్వపాపముక్తుడై యే లోకములనందును? అన మార్కండేయు డతని కిట్లు వచించెను: రాజా! ప్రయాగ తీర్థయాత్రచే అనాశక ఫలమునందు విధము వినుము. వివేకవంతుడును శ్రద్ధాళువును జితేంద్రియుడు నగు పురు. షుడు ఆ యాత్రచే అనాశకఫలమునంది అంగవికలుడును రోగియు కాక పంచేంద్రియ సుఖము లనుభవించును; అడుగడు గున అశ్వమేధఫలము నందును; తనకు ముందు వెనుకల పది తరముల వారిని తరింపజేయును; సర్వపాప వినిర్ముక్తుడై పరమపద మందును.

అనిన మార్కండేయుని పలుకులు వినిన యుధిష్ఠిరు డిట్లనెను: ప్రభూ! తాము చెప్పుదానిని బట్టి నరుడు అల్ప ప్రయత్నముతోనే బహు ధర్మాచరణఫలములనందు మహాభాగ్యము కలుగునని తెలియుచున్నది. కాని ప్రాకృత జనులును ఇంత సుక రముగ అనేకాశ్వమేధ ఫల మేట్లంద కలుగుదురని సంశయించుచున్నాను. ఇది తీర్ప వేడుచున్న నా కుతూ హలము తీర్పు డనెను. ఆతనికి మార్కండేయు డిట్లు తెలి పేను: రాజా! మహాపాప ప్రణాశ కమును మహాగుహ్యము నగు . విషయము చెప్పెదను. ఇది పూర్వము ఋషుల సన్నిధియందు చతుర్ముఖుడు చెప్పెను. ప్రయాగ మండలము ఐదు యోజనముల విసృతి కలది. ఆట ప్రవేశించి (పై జెప్పిన గుణములతో కూడి యాత్ర సేవించి)న యాతని కడుగడుగున నశ్వమేధ ఫల మబ్బును. గడచిన-గడువనున్న -ఏడేసి తరములవారి నతడు తరింపజేయును. అట ప్రాణత్యాగము చే కూడ ఈ ఫల మబ్బును. ఇది యెరిగి రాజేంద్రా! సదా శ్రద్ధాపరుడవు గమ్ము. పాపోపహతచిత్తులును అశ్రద్దధానులు నగు వారు దేవర క్షితమగు ఆ ప్రయాగ స్థానమును చేరి దాని సేవింపజాలరు.

ఆన విని యుధిష్ఠిరు డిట్లనెను: ద్రవ్యమునందు ప్రీతి లోభములకు వశులై కామవశులై ఈ యాత్ర చేసిన వారికి కలుగు తీర్థయాత్రఫలము ఎట్టిది? వారి కే గతి కలుగును? ఇది చేయదగు నిది చేయరాదనునది లేక యచట ధనాశ తో కామబుద్ధితో సర్వ ద్రవ్యముల నమ్ముకొను వ్యాపారి కే ఫలము కలుగునో తెలుపుము. అన మార్కండేయు డతని కిట్లు చెప్పెను: రాజా! మహాగుహ్యమును వినినంతనే పాపనాశకమునగు నది చెప్పెద వినుము. ప్రయాగయందు నరుడు నియ తేంద్రియుడై మాసకాలము స్నాన మాడినచో సర్వపాపముక్తు డగునని స్వయంభూ బ్రహ్మ చెప్పెను.

శుచిస్తు ప్రయతో భూత్వాహింసక శ్శద్ధయాన్వితః

ముచ్యతే సర్వపాపేభ్య సగచ్చే త్పరమంపదమ్

విస్రమ్భపాతకానాంతు ప్రయాగే శృణు యత్ఫలమ్

త్రికాలమేవ స్నాయీత ఆహారం భైక్ష మాచరేత్

త్రిభిర్మాసైః ప్రముచ్యేత ప్రయాగే నాత్ర సంశయః

అజ్ఞానేనతు తత్సర్వం తీర్థయాత్రాదికం భవేత్

సర్వకామసమృద్దస్తు స్వర్గలోకే మహీయతే

స్థానంచ లభతే నిత్యం ధనధాన్యసమాకులమ్

ఏవం జ్ఞానేన సమ్పూర్ణ స్సదా భవతు లోభవా

తారితాః పితర స్తేన నరకా తపితామహా

 ధర్మానుసారీ ధర్మజ్ఞ త్వయావృష్టః పునఃపునః

త్వత్ప్రియార్థం మయాప్రోక్తం గుహ్య మేత త్పనాతనమ్

అచట, శరీరమున చిత్తమున శుచియు ప్రయతుడును అహింసకుడును శ్రద్ధావంతుడునగు వానికే పాపము క్తియు పరమపదప్రాప్తియు నగును; (పైకి పుణ్యము చేయువారుగా కనబడుచు); రహస్యముగ పాపములే యచట చేయువారికి కలుగు ఫలము దీనితోనే నీవు తెలిసికొనుము, 'ఆట్టివారు ఆచట మూడు పూటల స్నానము చేయుచు భిక్షాటనముచే జీవిం చుచు మూడు మాసములు గడపినచో ఆజ్ఞానకృతమగు పాపము నశించును. తీర్థయాత్రిఫల మబ్బును. సర్వకామపూర్తి నందును. స్వర్గ సుఖముల నందును, పిదప ధనధాన్య సమృద్ధి కలవారి యింట జనించును. లోభవంతుడే యగుగాక! అత డినీ ఎరిగి జ్ఞానవంతుడై ప్రయాగతీర్థ సేవ చేసినచో అతని పితృ పితామహాదులును నరకమునుండి తరింతురు. ధర్మానుసారినగు నన్ను ధర్మము నేరుగ గోరి నీవు మరి మరి యడిగినది గుహ్యము సనాతనమునగు విషయము నీ ప్రీతి కై చేప్పితిని.

యుధిష్ఠిరః : అద్యమే సఫలం జన్మ హ్యద్యమే తారీతం కులమ్

పీతో స్మ్యనుగృహీతోస్మి దర్శనా దేవ తే మునే

త్వద్దర్శనాత్తు ధర్మాత్మ స్ముక్తో హం సర్వకిల్బిషైః

ఇదానీం వేద దాత్మానం భగవక్ హతకిల్బిషమ్

మార్కణ్డేయః : దీష్ట్యా తే సఫలం జన్మ దిష్ట్యా తే తాతం కులమ్

 కీర్తనా ద్వర్ధతే పుణ్యం శ్రుత్వా పాపం ప్రణశ్యతి

యమునాస్నానమాహాత్మ్యమ్

యుధిష్ఠిరః : స్నా నేన యమునాయాం తు కింఫలంపై మహామునే

ఏతన్మే సర్వమాఖ్యాహి యథాదృష్టం యథాశ్రుతమ్

మార్కణ్డేయః ; తపనస్య సుతా దేవీ త్రిషు లో కేషు విశ్రుతా

సనూ ఖ్యాత మహాపుణ్యా యమునా తత్ర నిమ్నగా

యేనైవ నిస్సృతా గజ్జా తేనైవ యమునా గతా

యోజనానాం సహ సేణ కీర్తనౌ తాపనాశనీ

తత్ర స్నాత్వా చ పీత్వాచ యమునాయాం యుధిష్ఠిర

కీర్తనా ల్లభతే పుణ్యం దృష్ట్వా భద్రాణి పశ్యతి

అవగాహ్యచ పీత్వావా పునాత్యాసప్తమం కులమ్

తస్యాం స్నానఫలాదేవ స యాతి పరమాం గతిమ్

అగ్ని తీర్థ మితి ఖ్యాతం యమునాదక్షిణేత టే

పశ్చి మే ధర్మరాజస్య తీర్థంచ నరకం స్మృతమ్

తత్ర స్నాత్వా దివం యా న్తి యేమృతా ఫేఒపునర్భవాః

ఏవం తీర్థాని సర్వాణి యమునాదక్షిణేత పే

ఉత్తరేణ ప్రవక్ష్యామ్ ఆదిత్యస్య మహాత్మనః

తీర్థం నీరజ్ఞానంనామ యతదేవా స్స వాసవాః

ఉపాసతే సదా సన్గ్యాం నిత్యం కాలే యుధిష్ఠిర

దేవా సేవ ని త తీర్థం యే చాన్యే విబుధా జనాః

సదా దానపరో భూత్వా కురు తీర్థాభి షేచనమ్

అన్యేచ బహవ సీల్డా స్సర్వపాపహరా స్మృతాః

తేషు స్నా త్వా దివం యా ని యే మృతా స్తేపునర్భవమ్

గజ్ఞాచ యమునాచైవ ఉభే తుల్యఫలే స్మృతే

కేవలం జ్యేష్ఠ భావేన గజ్జి సర్వత్ర పూజ్యతే

ఏవం కురుష్వ కౌ నేయ సర్వతీర్థాభి షేచనమ్

యావజ్జీవకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి

య ఇదం కల్య ఉత్థాయ పఠ తేచ శృణోతిచ

ముచ్యతే సర్వపాపేభ్య స్వర్గ లోకం సగచ్ఛతి

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మార్కణ్డేయ యుధిష్ఠిర సంవాదే ప్రయాగ మాహాత్మ్యే షడు త్తరశతతమోధ్యాయః

అన యుధిష్ఠిరు డిట్లనేను: ఇపుడు నా జన్మము సఫలమైనది. నా వంశ పూర్వులు తరించిరి, మునీ! నీ దర్శన మున ప్రీతి చెందితిని. అనుగ్రహము నందితిని. సర్వపాపముక్తుడ నయితిని, ఆన మార్కండేయు డిట్లనెను: నీ జన్మము సఫలమగుటయు నీ వంశము తరించుటయు నీ యదృష్టమే.. ప్రయాగ క్షేత్రమును గూర్చి వినుటచే దానిని కీర్తించుటచే పాపనాశ పుణ్యవృద్దులు కలుగును. అన యుధిష్ఠిరు డిట్లనెను. మహామునీ! యమునా స్నాన ఫలమును నీవు కనివిని ఎరిగినంత తేలుపుము. ఆన ముని యిట్లనెను: రవిసుతయని త్రిలోక విశుతయగు యమున యను నామె మహాపుణ్యద యగు నదిగా ప్రసిద్ధయయి అట ప్రవహించుచున్నది. ఏ హేతువున గంగ ఉత్పన్న యైనదో ఆ హేతువుననే యమునయు ఆమెతో కలిసినది. అనగా ఆ రెండు నదులు నట ప్రయాగ తీరమున సంగమించుట ప్రాణుల పాపనాశమున కేయని యర్థము. వేల యోజనములయందుండి యా మేను కీర్తించినను పాపనాశకమగు యమునయం దచట స్నాన మాడినను జలము ఆచమించినను సమీపమందుండి ఆమెను కొనియాడినను భక్తితో దర్శించినను శుభములు కలుగుటలో సందేహమే లేదు. అట యమునా స్నానముచే జలపానముచే తానును తన ఏడు తరముల వారును పరమగతి నందుదురు. యమునా దక్షిణతటమున అగ్ని తీర్థమును దానికి పశ్చిమమున నరకమను ధర్మరాజ తీర్థమును కలవు. ఆట స్నానము చే పునరా వృత్తి రహిత లోకప్రాప్తు డగును. యమునోత్తర తటమున ఆదిత్య దేవతాక మగు నిరంజనతీర్థ మున్నది. ఇంద్రాది దేవ తలును తదితర విద్వాంసులును సంధ్యాదేవి నట ఉపాసింతురు. నీ వచట సదా తీర్థ స్నాన మాడుచు దానము చేయు చుండుము. అచట యమునా తీరమున పాపహరములు మరి యెన్నియో తీర్థములు కలవు. వానియందు స్నానముచే పునరావృత్తి రహితలోకప్రాప్తి యగును. గంగకు పెద్దరిక మిచ్చి పూజింతురే కాని వా స్తవమున గంగా యమునలు రెండును తుల్యఫలప్రదములే. కావున కౌంతేయా ! నీవు నే జెప్పిన తీరున సర్వ తీర్థ స్నాన మచట చేసినచో తత్ క్షణమే యావజ్జీవము నీవు చేసిన పాపము లన్నియు నశించును. వేకువనే లేచి ఇది చదివినను వినినను సర్వపాపముక్తుడై స్వర్గప్రాప్తు డగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట ఆరవ అధ్యాయము.