155 - ఆ దానవుడు అంతఃపురము ప్రవేశించి ఈశ్వరునిచే మడియుట॥

సూతః : దేవీం చాపశ్యదాయాంతీం సఖీం మాతర్విభూషితామ్

కుసుమా మోదినీం నామ తస్యశైలస్య దేవతామ్

సాపి దృష్ట్వా గిరిసుతాం స్నేహవిక్లబమానసా

క్వ పుత్త్రి గచ్ఛసీత్యుచ్చైరాలిజ్గ్యోవాచ దేవతామ్

సాచా స్యై సర్వమాచ్య శఙ్కరాత్కోవకారణమ్

పునశ్చోవాచ గిరిజా దేవతాం మాతృసమ్మితామ్

ఉమా : నిత్యం శైలాధిరాజస్య దేవతా త్వమనిన్దితా

సర్వతస్సన్నిధానం తే మమతాతీవ వత్సలా

ఆతస్తు తే ప్రవక్ష్యామి యద్విధ్యం త్వయా ధియా

అన్యత్రీసమవేశశ్చ త్వయా రష్యః ప్రయత్నతః

రహస్యత ప్రయత్నేన చేతసా సతతం గిరౌ

పినాకినః ప్రవిష్టాయాం వక్తవ్యం మే త్వయాన ఘో

తతోఒహం సంవిధాస్యామి యత్కృత్యం తదనన్దరమ్

ఇత్యుక్తా తాం తథోత్యుక్త్వా జగామ స్వం గిరిం శుభా

ఉమాపి పితురుద్యానం జగామాద్రిసుతా ద్రుతమ్

అ నరిక్షం సమావిశ్య మేఘమాలావిలప్రభమ్

తరౌ విభూషణాన్న్యస్య వృక్షవల్కలధారిణీ

గ్రీష్మే పఞ్చాగ్నిస నప్తా వర్షాసు చ జలోక్షితా

వన్యాహారా నిరాహారా శుష్కస్థణ్డిలశాయినీ

ఏవం సాధయతీ దేహం తపసా సంవ్యవస్థితా

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: తపము చేయపోవుచున్న పార్వతీదేవికి అలంకృతమై తన వయిపునకు వచ్చుచున్న కుసుమా మోదిని యను ఆ పర్వతమునందలి యొక దేవత కనబడెను ఆమె పార్వతి తల్లియగు మేనా దేవికి సఖి; ఆమె గిరిపు శ్రీని చూడగనే స్నేహ పరవశ మానసయై గట్టిగ నామెను కౌగిలించుకొని బిడ్డా! ఎక్కడకు పోవుచున్నాననెను ఆ గిరిజయు ఆమెకు శంకరుని వలన తనకు కోప కారణముగా కలిగిన అవమాన విషయము చెప్పి ఇంకను ఇట్లనెను: నీవు దేవతవు మాత్రమే కాక నాకు తల్లి వంటిదానవు; ప్రశంసింపదగిన గుణవతివి; ఆనిందితవు; ఈ శైలాధి రాజమందు ఉండు దేవతవు; ఈ పర్వతమే నీ సన్నిధి; నా పై నీకు వాత్సల్యమధికము; ఇందుచేతనే నీవు బుద్దితో యోజించి చేయవలసిన పనియొకటి చెప్పుచున్నాను అన్యస్త్రీలు ఇట ప్రవేశించకుండ నీవు ప్రయత్నపూర్వ కముగ రక్షించవలయును ఇది రహస్య ప్రదేశ్ ము; ఇతరులు ఇట చొచ్చినను నీకు తెలియక పోవచ్చును; కనుక నీవు ఈ గిరియందు సదా అవధానముతో నుండవలెను ఈ శివాంతఃపురమున ఏ స్త్రీయేన ప్రవేశించినచో పూజ్యురాలా! నీవు నాకు చెప్పవలెను తరువాత నేను తగిన విధమున చేయుదును; అనగా ఆ కుసుమా మోదిని యను శుభరూప సరేయని తన నివాసమగు పర్వత భాగమునకు పోయెను; అది సుతయగు ఉమయు త్వరగ తండ్రి యుద్యానమున కేగెను మేఘమాలతో మలినమగు (నల్లని) కాంతిగల ఆంతరిక్ష భాగమును చేరి ఆమె తన వీభూషణములు చెట్ల నారలు ధరించెను, గ్రీష్మర్తువున పంచాగ్ని నంత ప్తయగుచు వర్షర్తువున నీటితో తడియుచు వన్యాహారములనే తినుచు నిరాహారగానే గడపుచు శుష్కమగు (ఏ పడకలును లేని) నేల పై పండుకొనుచు ఇట్లు దేహమును సాధన చేయుచు తపస్సుతో ఆమె నియమవంతురాలయ్యెను

పార్వతీరూపధారిణః ఆడినామకాసురస్య ఈశ్వరాన్తఃపురప్రవేశ॥

జ్ఞాత్వా గతాం గిరిసుతాం దైత్యస్తత్రా నరే బలీ

ఆన్దకస్యసుతో దృప్తః పితుర్వధమనుస్మర

దేవా శర్వాన్విజిత్యామౌ బకథాతా రణోత్కటః

ఆడిర్నామా న్తరపేక్ష సతతం చనమౌళినః

ఆజగామామరరిపుః పురం త్రిపుర ఘాతినః

స తత్రాగత్య దదృశే వీర కం ద్వార్యవస్థితమ్

విచిన్య గోపి స్వవరం దత్తం కమలయోనినా

హతే తదాన్దకే దైత్యే గిరి శేనామర ద్విషి

ఆడిశ్చకార పరమం తపః పరమదారుణమ్

తమాగత్యాబ్రవీద్బహ్మా తపసా పరితోషితః

కిమాడే దానవ శ్రేష్ఠ తపసా ప్రాప్తు మిచ్ఛసి

బ్రహ్మాణమాహ దై త్యస్తు నిర్మృత్యుత్వ మహం వృణే

బ్రహ్మా : న కశ్చిచ్చ వినా మృత్యుం నరో దానవ విద్యతే

యత స్తతో2పి దైత్యేశ్లో మృత్యుః ప్రాప్యశ్శరీరిణా

ఇత్యుక్తి దైత్యసింహస్తు ప్రోవాచామ్బుజసమ్భవమ్

రవస్య పరివర్లో మే యదా స్యాత్పద్మసమృవ

తదా మృత్యుర్మమ భవేదన్యథా త్వమరో హ్యహమ్

ఇత్యుక్తస్తు తదోవాచ తుష్టః కమలసమ్భవః

యదా ద్వితీయో రూవస్య నివృత్తిస్తే భవిష్యతి

తదా తే భవితా మృత్యురన్యథా న భవిష్యతి

ఇత్యుకో ఒమరతాం మేనే దైత్యస సుమహాబలః

తస్మినా తు సంస్మృత్య తద్వధోపాయమాత్మనః

పరిహర్తుం దృష్టి పథం వీరకస్యాభవత్తదా

భుజజరూపీ రస్త్రాణ ప్రవివేశ దృశః పథమ్

పరిహృత్య గణేశస్య దానవో దేవదుర్జయః

అలక్ష్మితో గణే శేన ప్రవిశ్యాథాపరాం తనుమ్

భుజజరూపం సన్య జ్య బభూవాథ మహాసురః

ఉమారూపీ చ్చలయితుం గిరీశం మూఢచేతనః

కృత్వోమాయాసతో రూపమప్రతర్యం మనోహరమ్

సర్వావయవసమ్పూర్ణం సర్వాభిజ్ఞాన సంవృతమ్

కృత్వా భగాంతరే దంతానైత్యో వజ్రోపమాన్దృఢా

తీక్ష్ణా గ్రాన్బుద్ధమో హేన గిరిశం హనుముద్యతః

ఈ నడుమ కాలములో ఆడి అను దైత్యుడు పార్వతి ఇట్లలిగిపోయిన విషయము తెలిసికొనెను వాడు చాల బలశాలి; అంధకాసురుని కొడుకు; బకునికి ఆన్న ; చాలగర్వి; యుద్ధమున దేవతలనందర జయించినవాడు; యుద్ధమున ఎదురు లేనివాడు; తన తండ్రియగు ఆంధకుని శివుడు చంపుటచే ఆపగబూనినవాడు; చంద్రమౌళిపై కసి తీర్చుకొన వేచియుండెను వాడిపుడిది ఎరిగి శివుని యంతః పురమునకు రాగా వానికి ద్వారమందు వీరకుడు కనబడెను ఆపుడు వానికి మునుపు బ్రహ్మ తనకిచ్చిన వరము గురుతునకు వచ్చెను ఆ వర కథ ఇది; పూర్వము శివుని చేతిలో అంధకుడు చచ్చిన తరువాత ఈ ఆడి పరమదారుణమగు ఉత్తమ తపమాచరించెను బ్రహ్మ మెచ్చి దానవ శేషా! ఆడి! ఈ తపఃఫలముగా నీకేమి కావలయుననెను మృత్యువు నొకుండరాదనీ వాడన బ్రహ్మ దానవాః మృత్యువు లేని ప్రాణి ఏదియు లేదు ఏదో సమయమున ఏదోయొక దానినుండి ప్రాణి మరణించి తీరును అనగా ఆ దైత్య సింహుడు పద్మభవునితో పద్మ నంభవా! నాకు రూప పరివర్తనము కలిగినపుడు నాకు మరణము కలుగవచ్చును లేనిచో నేనమరుడనే కావలయును ఆనేను అది విని తుష్టుడై కమలభవుడు నీకు రూప పరివృత్తిచే రెండవ రూపము కలిగినచో మృత్యువు కలుగును లేనిచో కలుగదు ఆనేను దీనితో తనకు అమరత్వము లభిం చేనని సుమహాబలుడు ఆగు ఆ దైత్యుడు తలచేను ఇపుడు వానికి ఇతరులు తను చంపుటకు ఇది యుపాయమైనదియని తోచియు వీరకుని దృష్టి మార్గమునుండి తప్పించుకొనదలచి సర్పరూపుడై ఒకానొక రంధ్రమునుండి వాడంతఃపుర ములోన ప్రవేశించెను ఇట్లు ఆ గణేశుని దృష్టి మార్గమునుండి తప్పుకొని దేవతలకు జయింపనలవియే కాని ఆ ఆడి దానవుడు వీరకునకు కనబడకుండ లోన ప్రవీషుడే అట భుజంగ రూపమువిడి చేను ఆ మూఢచిత్తుడు శివుని మోసగింపదలచి ఉమా రూపియయ్యెను వాడు ఊహింపనలవి కానీ యంత సరిగా మనోహరమగు ఉమారూపము దాల్చేను అది ఆమెకు గల అన్ని గుర్తులు పైకి కనబడుచున్నది; సర్వావయవ సంపూర్ణము; (అన్ని ఆంశములందును పార్వతిని పోలియుండెను) వాడు తన బుది మోహము చే గిరిశుని చంపుట కుద్యతుడై తన రహస్యాంగమున వజ్రమువంటి వాడి మొనలుగల దృఢ దంతముల నమర్చుకొనెను

కృత్వోమా రూపసంస్థానంగతో దైత్యోహరాంతికమ్

యోషార మ్యాకృతిశ్చితభూషణామ్బర భూషితః

తాం దృష్ట్వా గిరిశ స్తుష్టదాలిజ్య మహాసురమ్

మన్యమానో గిరిసుతాం సర్వైరవయవా నరైః

అపృచ్ఛత్సాధు తే భావో గిరిపుత్తి న కృత్రిమః

యా త్వం మదాశయం జ్ఞాత్వా ప్రాప్తేహ వర వర్ణినీ

త్వయా విరహితశూన్యం మన్యమానో జగత్తయమ్

ప్రాప్తి ప్రసన్న వదనే యుక్తమేవంవిధం త్వయి

ఇత్యుక్తి దానవేశ్రోస్తు తం బభా షే స్మయఇ్ఛనైః

న చాబుద్ద్యద భిజ్జానం ప్రాయశ్రిపురఘాతినః

దైత్యః : యాత్రాస్మ్యహం తపః కర్తుం వాల్లభ్యాయ తవాతులమ్

రతిశ్చ తత్ర మే భూ త్తతః ప్రాప్తి త్వద నికమ్

ఇత్యుక్తశ్శజ్కరశ్శజాం కాంచితాప్యావధార యత్

హృదయేన సమాధాయ దేవః ప్రహసితాననః

కుపితా మయితన్వజీ ప్రకృత్యాచ దృఢవ్రతా

అవాప్తకామా సమాప్త కిమేతత్సంశయో మమ

ఇతి చిన్య హర స్తస్యా హ్యభిజ్ఞానం విధారయక్

నావశ్యద్వామపార్శ్వేతు తదజే పద్మలక్షణమ్

లోమావర్తంతు రచితం తతో దేవః పినాకధృక్

అబుద్ధ్యద్దానవీం మాయామాకారం గూహయం స్తతః

మేడే వజ్రాస్త్రమాదాయ దానవం తమసూదయత్

అబుద్ద్యద్వీరకో నైవ దాన వేౄం నిషూదితమ్

హరేణ సూదితం దృష్ట్వా రూపం దానవేశ్వరమ్

అపరిచ్చిన్న తత్త్వార్థా శైలపుత్యై న్య వేదయత్

దూ తేన మారుతేనాళుగా మీనా నగ దేవతా

శ్రుత్వా వాయుముఖాద్దేవీ క్రోధర విలేక్షణా

అశ పద్వీరకం పుత్త్రం హృదయేన విదూయతా

ఇతి శ్రీమత్స్యమహాపురాణే దేవాసుర సజ్గ్రామే ఈశ్వరకృతాందకాసురనందనాడి నామకాసురవధాదికథనం నామ పఞ్చపఞ్చాశదుత్తర శతతమోధ్యాయః

తరువాత ఆదైత్యుడు ఉమరూప సంస్థానము (అమరిక )తో హరుని సమీపమున కేగెను వాడిపుడు చిత్ర (ఆశ్చర్యకర) పస్త్ర భూషణములు భూషించుకోని రమ్యమగు స్త్రీరూపముతోనున్నాడు ఆమెను చూచి గిరిశుడు తుష్టుడే వెంటనే ఆ మహాసురునాలింగనము చేసికొనెను సర్వావయవ లక్షణములబట్టియు ఆమె గిరిసుతయేయని ఆతడు తలచేను గిరిపుత్రీ! ఇపుడు నీ భావము కృత్రిమము కాక (నిర్మలమై)యున్నదీ కదా! వరవర్తినీ: ఉ త్తమసుందరీ! నీవు సొయాశయము గ్రహించుటయే అందులకు ప్రమాణము; నీవు లేక నాకు జగ త్రయమును శూన్యమై తో చెను ఇట్టితి నీవు నాకడకు వచ్చితివి; నీకు ఇది (నా పైఇంత ప్రీతి) తగినదే సుమా! శివుడిట్లు పలుక దానవుడు మెల్లగ నవ్వుచు మాటాడ సాగెను; ఏలయన శివునకు మాత్రమే తెలిసిన పార్వతీ చిహ్నములు కొన్ని వానికి తెలియవు; వాడిట్లనెను: నీ ప్రీతిలభించుట క్రే సాటి లేని తపమాచరించ సాగితినే కాని ఆచ్చట నాకు మనస్సునకు హాయి కలుగలేదు అందుచే నీకడకు వచ్చితిని॥॥ ఈ మాటవినీ శంకరునకు ఒకానొక శంక కలిగి అది నిర్ణయించుకొనదలచి ఆదేవుడు చిన్నగా నవ్వుచున్న మోముతోను దృఢ నిశ్చయముతోను ఇట్లనుకొనెను సుందరియగు పార్వతి నా పైకుపితయై వెళ్లెను స్వభావముచే ఆమె దృఢవ్రత; కావున ఆమె తాను కోరిక తీర్చుకొనియే వచ్చెనా? అని నాకు సంశయము కలుగుచున్నది అనుకోనుచు ఆమెకు ఉండు గుర్తులన్ని యు పరీక్షించి నిర్ణయించుకొన దలచెను పరికించి చూడగా ఆమె ఎడమవైపున ఉండవలసిన పద్మాకారపుసుడి ఈశ్రీకి లేదు, దానితో ఇది దానవ మాయయని శిపుడు గురుతించెను అయినను తన హృదయ గత భావమాకారమున కప్పిపుచ్చుకొని తన రహస్యావయవమున వజ్రాస్తమీముడ్చుకొని ఆ దానవుని సంహరించేను ఈ యంశము లేవియు వీరకు నకు తెలియవు॥॥ హరుడు శ్రీరూపుడు ఆగుదాననేళ్వరుని చంపుట చూచియు పర్వత దేవత తనకు వాస్తవ విషయము (అది దానవుని మోసమనియు పాడు లోనికి పోవుటలో వీర కుని దోషములేదనియు) ఎరుగకయే శీఘ్రగామి కావున వాయుదేవుని దూత గా చేసి ఈ విషయమును శైలపుత్రికి తెలి పెను ఆదివిని పార్వతి క్రోధరక్తాక్షయే మనస్సున నొప్పి పడుచు తన పుత్తుడగు వీర కునీ ఇట్లు శపించెను

ఇది శ్రీ మత్స్యమహా పురాణమున దేవాసుర సంగ్రామమున ఆడి దైత్య వధమను నూటఏబదియైదవ అధ్యాయము