మత్స్య మహా పురాణము
36 - ఇంద్ర యయాతి సంవాదము
శౌనకః : స్వర్గతస్తు స రాజేనో నివస శేవపద్మని ।
పూజిత స్రిదశై స్సాధ్యే ర్మరుద్భి ర్వసుభి స్తథా॥
దేవలోకా ద్భ్రహ్మలోకం సఙ్చర న్పుణ్యకృ ద్వశీ ।
అవస తృథీవీపాలో దీర్ఘ కాల మితి శ్రుతిః॥
స కదాచి న్నృప శేస్ఠో యయాతి శుక్ర మాగమత్ ।
కథా నే తత్ర శ కేణ పృష్ట స్స పృథివీపతిః॥ శక్రః ॥
యదా పూరు స్తవ రూపేణ రాజ న్షిరాం గృహీత్వా ప్రచచార లో కే ।
తదా స రాజ్యం సమదాయేన తస్మై త్వయా కిముక్తః కథయేహ సత్యమ్॥
యయాతికి గజ్జాయమునయో ర్మధ్యే కృత్నో ఒయం విషయ స్తవ ।
మధ్యే పృథివ్యా స్వం రాజా భాతరో న్యాధిపా స్తవ॥
తే తే ధికాశ్శిష్టతమా స్తితిక్షవో తథా తితిక్షు తితిక్షో ర్విశిష్టః ।
అమాను షేభ్యో మానుషశ్చ ప్రధానో విద్వాం సఖై వావిదుషః ప్రధానః॥
ఆక్రుశ్యమానో నాక్రోశే న్మన్యు రేవం తితీక్ష్యతే ।
ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చాస్య విగ్ధతి॥
నారుస్తుద స్స్యా న్న నృశంసవాదీ న హీనతః పరమ ప్యాదగీత ।
యయా స్వవాచా పర॥ ఉద్విజేత న తాం పదే దుశతీం పాషలో క్యామ్॥
అరుస్తుదం పరుషం తీక్ష వాచం వాకంట కై ర్వితుద స్తం మనుష్యమ్ ।
విద్యా దలక్ష్మీకతమం జనానాం ముఖే నిబద్దాం నిరృతిం వహన్తమ్॥
సద్భిః పురస్తా దభిపూజిత స్స్యా త్సద్ళి స్తథా వృష్ణతో నన్దిత స్స్యాత్ ।
సదా సతా మతివాదం తితి మే తృతాం వృతం బౌదదీ తార్యవృతః॥
వాక్సాయకా వదనా న్నిష్పత ని తై రాహత శోచతి రాత్ర్యహాని ।
పర స్య నామర్మసు నిష్పత ని తాన్పట్టితో నావసృజే త్పరేషు॥
నాస్తీదృశం సంవతనం త్రిషు లో కేషు కిఞ్చన ।
యథా మైత్రీచ భూతేషు దానంచ మధురాచ వాక్॥
తస్మా త్సాన్వం(తస్మాత్సత్యం) సదా వాచ్యం న వదే త్పరుషం క్వచిత్ ।
పూజ్యా మ్బూజయే దన్యా న్నా భిశాపం కదాచన॥
ఇతి శ్రీ మత్స్యమహాపురాణే శౌనక శతానీకసంవాదే చంద్రవంశానువర్ణనే
యయాతిచరితే షట్త్రింశోధ్యాయః॥
శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను. రాజేంద్రుడగు యయాతి స్వర్గమును చేరి దేవభవనమునందు నివసింపసాగెను. అచట నతనిని దేవతలు సాధ్యులు మరుత్తులు వస్తువులు మొదలగువారు పూజించు (ఆదరించు)చుండిరి. అతడు పుణ్యమును ఆచరించినవాడును ఇంద్రియనిగ్రహము కలవాడును (కావున తన తపోబలమున సంపాదించిన పుణ్యలోకములలో) దేవలోక బ్రహ్మలోకములలో ఒక దానినుండి మరియొక దానికి సంచరించుచు చాలకాలము ఉండెను. అని పరంపర లో వినుచున్నాము. ఇట్లు ఒకప్పుడు ఆ నృప శేషుడు యయాతి ఇంద్రలోకమునకు పోయెను. మాటల సందర్భములో ఇంద్రుడు యయాతిని ఇట్లు అడిగెను: “రాజా! పూరుడు నీ రూపమును గ్రహించి వార్ధకముతో లోకమున వ్యవహరించినందుకు సంతసించి నీవు నీరాజ్యము నతని కిచ్చినప్పుడు అతనికి ఏమీ ఉపదేశించితివో నిజము చెప్పుము.” యయాతి: “గంగా యమునా నదుల నడుమ నున్న ఈ దేశమంతయు నీ విషయము! పరిపాలనలో ఉండు ప్రదేశము). ఈ భూభాగమున కంతటికి నీవు రాజవు. నీ అన్నలు నీరాజ్యపు అంచులందును వానికి అవతలను ఉండు దేశములను పొలింతురు.
“శిష్టులందరలో గొప్పవారును ఓర్పుగలవారును పురుషులలో అధికులు. ఎట్లన-ఓర్పు లేనివానికంటె అదికలవాడు విశిష్టుడు. మానుష ధర్మము లేనివారికంటె అదికలవాడును వివేకము లేనివానికంటే అదీకలవాడును విశిష్టతరుడు. ఇతరులు చెడు మాటలాడినను తానట్టివి ఆడ రాదు. ఇట్లున్న చో కోపము నిగ్రహింపబడును. ఆ కోపము ఆక్రోశించినవానినే నిర్గహించును. తిట్లు తినినవాని పాపము తిట్టినవానికి అంటును. ఇతరుల హృదయమునకు వ్రణము కలిగించు పనులు చేయరాదు. క్రూర వచనములు పలుకరాదు. హీనునినుండి ఎంత గొప్ప వస్తువునైన గ్రహింపరాదు. తాను ఏది పలికిన ఇతరులు నొప్పిపడుదురో) ఇతరులు ఏది పలికినచో తన మదికి నొప్పి కలుగునో అట్టి దుర్వచనములు తానితరులను పలుకరాదు. అది పాపలోకములకు పోవుటకు కారణమగును. అరుంతుదుడు (ఇతరుల హృదయ వ్రణమును రేపెడి కూరపు పనులు చేయుచు ఆట్టి మాటలాడుచు నుండువాడు) అగు పురుషుడు తీక్షవచనములు పలుకువాడు మాటలనెడి ముండ తో ఇతరుని బాధించువాడు మనుష్యులందరలో అశుభస్వరూపులని తెలియవలెను. అటి వాడు తన ముఖమునందు నిర తిని (అలక్ష్మిని) కట్టుకొని మోయువాడే. సజ్జనులు తన ఎదుటను మెచ్చుకొనునట్లును వెనుక ను ప్రశంసించునట్లును నడుచు కొనవలెను. సజ్జనులు ఒక వేళ నిందించినను ఓర్చు కొనవలెను. వారి నడువడిలో మంచివానిని తాను గ్రహించి పూజ్యమగు నడువడితో మెలగవలెను. (పరుష) వచనములు నోటినుండి వెలువడు బాణములు, వాటి దెబ్బ తినినవాడు రాత్రిం బవళ్ళును శోకించుచుండును. అవి ఇతరుల హృదయ మర్మము లందు తప్ప గ్రుచ్చు కొనవు. కనుక వివేకి యుగువాడు వాటిని ఎవరిమీదను విడువరాదు. భూతములయందు మైత్రి సానుభూతి) దానము.మధుర వచనములు పలుకుట. ఈ మూటితో సదృశమగు సంవతనము (ఇతరులను తనవైపు తిప్పుకొనునది) మరి ఏదియు లేదు. కనుక ఎల్లప్పుడును నెమ్మదిగా మాటలాడవలయును. పరుషము లేక్కడ నెప్పుడు నాడరాదు. పూజ్యులగు ఇతరులను పూజించుచుండ వలయును. అభిశాపవచనము లేన్నడు నాడరాదు.”
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానుకీర్తనమున యయాతి చరితమున ఇంద్ర యయాతి సంవాదమున యయాతి పూరునకు బోధించిన నీతులు అను ముప్పదిఆరవ అధ్యాయము.
Summary of chapter 36 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya recounts the sublime spiritual instructions imparted by King Yayāti to his son Puru prior to his departure to the forest. The discourse highlights the supreme virtue of forgiveness, the necessity of truthful speech, control over anger, and non-violence toward all living beings. King Yayāti teaches that a true monarch must regard all subjects with equal compassion, avoid arrogant speech, and recognize that temporal power and wealth vanish like fleeting clouds. He emphasizes that ultimate peace is achieved not through external conquests or accumulation of possessions, but through the inner conquest of the mind and senses, urging Puru to rule the earth strictly adhering to the eternal principles of Sanātana Dharma.