231 -  రాజధర్మము-వృక్షోత్పాతశాంతి.

 గర్గః : పరేషు యేషు దృశ్యంతే పాదపా దేవచోదితాః

రుదన్తో వా హసన్తోవా విమ్చుని రసం ముహుః

అరోగా వా వినా వాయుం శాఖాం మున్యథ(ధో)ద్రుమాః

ఫలం పుష్పం తథా కాలే దర్శయ నితీహాయనా!

 పూర్వవత్స్వం దర్శయ ని ఫలం పుష్పం తథా నరే

క్షీరం స్నేహం సురాం రక్తం మడు తోయం స్రవ స్తొచ

 శుష్య ని రోగరహితా శ్శుష్కా రోహ ని వా పునః

 ఉత్తిష్ఠన్తహ పతితాః పత నిచ తథోత్తితాః

 తత్ర వక్ష్యామి తేబ్రహ్మన్విపాకం ఫలమేవచ

 రోదనే వ్యాధిమాప్నోతి హసనే దేశ విభ్రమమ్

శాఖాప్రపతనం కుర్యా త్సడ్డామే యోథపాతనమ్

బాలానాం మరణం కుర్యా ద్బాలానాం పుష్పితం తథా

 స్వరాష్టో కురుతే భేదం ఫలం పుష్ప మథా న్తరే

 క్షరయ నర్వతః క్షీరం స్నేహం దుర్భిక్షలక్షణమ్ 

వాహనాపచయం మద్యం రక్తం సజ్జామ మాది శేత్

 మధుస్రావే భవేద్యాధి ర్జల స్రావే న వర్షతి

 అరోగ శోషణం జ్ఞేయం బ్రహ్మ నుర్భిక్షలక్షణమ్

 శుషేషు సమరోహత్సు వీర్య మన్నంచ హీయతే

 ఉత్థానే పతితానాం చ భయం భేదకరం భవేత్

 స్థానా ఙ్ఞానస్య గమనే దేశ భజ స్తథా భవేత్

 జ్వలత్స్వపిచ వృక్షేషు రుదత్స్వపి ధనక్షయమ్

 ఏతత్పూజితవృషేషు సర్వం రాజో విపద్యతే

 పుష్పే ఫలే వా వికృతే రాజ్ఞో మృత్యుం తథా

ది శేత్ అన్యేషు చైవ వృ శేష వృక్షాత్పాతే ష్వతన్దితః

ఆచ్ఛాదయిత్వా తం వృక్షం గడ్గమాల్యై ర్విభూషయేత్

 వృక్షోపరి తథా ఛత్తం కుర్యా తాపప్రశా క్షయే

శివ మభ్యర్చయే ద్దేవం పశుం చాస్మై నివేదయేత్

 రుద్రేభ్య ఇతి షడ్రోమా నృత్వా రుద్రా న్జపే త్తతః

 మధ్వాజ్యయు కేన తు పాయ సేన సమ్పూజ్య విప్రా న్కనకం చ దద్యాత్

గీతేన నృత్యేన తథార్చయేత్తు దేవం హరం పాపవినాశ హేతోః

 ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే వృక్షోత్పాత శాంతి కథనం నామ

ఏకత్రింశ దుత్తర ద్విశతతమోఽధ్యాయః

 ఏ పట్టణములయందు వృక్షములు దేవ పేరణచే ఏడ్చుచు నవ్వుచు కనబడునో మాటిమాటికి రసమును వీడు చునో రోగమును గాలియు లేక యే కొమ్మలు పడునో ఆ కాలమందును మూడు సంవత్సరముల వయస్సు కలవియు పూలు పూయునో పండ్లు పండునో కొమ్మల నడుమనే పూయునో కాయునో పాలను నూనేను మద్యమును ర క్షమును కార్చునో రోగములు లేక యే ఎండునో ఎండినవి మరల చిగుర్చునో మొలకెత్తునో పడినవి లేచునో లేచినవి పడునో అచట కలుగు పరిణామమును ఫలమును తెలి పెద వినుము; చెట్లు ఏడ్చుటచే వ్యాధులు ప్రబలును; నవ్వినచో దేశమున కలవరములు కలుగును; కొమ్మలు పడుటచే యోధులు పడెదరు; చిన్న వయసు చెట్లు వూచినచో బాలురు మరణింతురు; కొమ్మల నడుమ పూయుటచే రాష్ట్రమున జనులలో కలహములు చీలికలు కలుగును; పొలు కాని నూనె కాని కార్చినచో కరవులేర్పడును; మద్యము కార్చినచో వాహనముల నాశము రక్తము కార్చినచో యుద్ధము సంభవించును; తేనే కార్చినచో వ్యాధులు నీరుకార్చి నచో అనావృష్టి కలుగును; రోగములు లేకయే చేబైండినచో దుర్భిక్షమును ఎండినవి చిగిర్చినచో అన్న మును వీర్యమును తగ్గుటయు జరుగును; పడినవి లేచినచో రాష్ట్రపు చీలిక లతో భయమేర్పడును; ఉన్న చోటినుండి కదలిపోయినచో దేశ భంగమగును; వృక్షములు మండినను ఏడ్చినను ధనక్షయమగును; ఇట్టి వృక్షములను శత్రువులు పూజించినచో ఈ వృక్షములున్న రాజ్యపు రాజునకు సర్వస్వనాశమగును; పుష్ప ఫలములందు వైకృతము (అస్వాభావిక లక్షణములు) కల్గినచో రాజు మరణించును; ఇట్టివే మరేవయిన వృకోత్పాతములు సంభవించినను ఎచ్చరిక తో గమనించి ఆ వృక్షమును మరుగుపరచి గంధమాల్యములతో అలంకరించవలయును; పాపశాంతి కే చేట్లు పే గొడుగు నిలుపవలెను; శివునర్చించ వలెను; శివునకు పశువు సర్పించవలెను; 'రుదేభ్యః' అనుచు ఆరు హోమములను జరిపి రుద్ర మంత్రముల జపించవల యును; తేనెతో నేతితో కూడిన పాయసముతో విప్రుల పూజించి వారికి బంగారు దానమీయవలెను; హరునీ గీత నృత్యము లతో అర్చించవలయును; ఇట్లు పాపనాశమగును.

 ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున వృక్షవైకృత శాంతీయను రెండువందల ముప్పది యొకటవ అధ్యాయము.