182 - ఈశ్వరకృత బ్రహ్మ శిరశ్ఛేదాది వృత్తాంతములు॥ (ఈశ్వరుడు కపాలియయిన కథ)॥ 

దేవీ : హిమవంతం గిరీం త్యక్త్వా మన్దరం గన్ధమాదనమ్

కైలాసం నిషధం చైవ మేరుపృష్ఠం మహాద్యుతిమ్ 

రమ్యం త్రిశిఖరం చైవ మానసంచ మహాగిరిమ్

దేవోద్యానాని రమ్యాణి నన్దనం వన మేవచ

స్వర్గస్థానాని పుణ్యాని తీర్ధాన్యాయత నాని చ

 తాని సర్వాణి సన్యజ్య అవిము క్రే రతిః కథమ్

శ్రీ కిమత్ర సుమహత్పుణ్యం పరం గుహ్యం వదస్వ మే

యేన త్వం రమ సే నిత్యం భూతసజ గజై ర్యుతః

 క్షేత్రస్య ప్రవర త్వంచ యేచ తత్ర నివాసినః

తేషా మనుగ్రహః కశ్చిత్తత్సర్వం బ్రూహి శఙ్కర

 దేవదేవః : ఆత్యద్భుత మిమం ప్రశ్నం యత్వం పృచ్ఛసి భామిని

 తత్సర్వం సమవక్ష్యామి తన్మే నిగదత శ్శృణు

 వారాణస్యాం నదీ పుణ్యా సిద్దగన్షర్వ సేవితా

ప్రవిష్టా తీవథా గజ్జా తస్మిక్షేత్రే మమ ప్రియే

మమైవ ప్రీతిర తులా కృత్తివా సేవ సున్దరి

సర్వేషాం చైవ స్థానానాం తత్థానంలు యథాధికమ్

తేన కార్యేణ సుశ్రోణి తస్మింస్థానే రతిర్మమ

 తస్మినిజేచ సాన్నిధ్యం మమ దేవి సురేశ్వరి

క్షేత్రస్య చ ప్రవక్ష్యామి గుణా నుణవతాం వరే

 యా జూత్వా సర్వపా పేభ్యో ముచ్యతే నాత్ర సంశయః

 యది పాపోథవా షణో యద్యవ్యర్థాతిగో నరః

ముచ్యతే సర్వపాపేభ్యో హ్యవిముక్తం వ్రజేద్యది

 ప్రళ యే సర్వభూతానాం నషే స్థావర జజమే

*నాహం త్యజామి తత్థానం మమ ప్రియతరం శుభే

 యత్ర దేవా స్వగన్దరా స్సయనోరగరాక్షసాః

వక్తం మమ మహాభాగే ప్రవిశ ని యుగక్షయే

తేషాం సాక్షాదహం పూజాం ప్రతిగృహ్ణమి పార్వతి

సర్వగుహ్యోత్తరం స్థానం మమ ప్రియతరం శుభమ్

(*సహి త్యక్ష్యామి తత్థ్సానం మహగణశతై ర్వృతం)

దేవి మహాదేవుని ఇట్లడిగేను: హిమవంతము మందరము గంధమాదనము జై లానము నిషధము మహాకాంతి గల మేరుపృష్టము రమ్యమగు త్రికూటము మానన మహాపర్వతము ఆను ఈ పర్వతములను రమ్యములగు నంద నాది దేవోద్యానములను పుణ్యములగు తీర్థసానములను తీర్ధ క్షేత్రములను అన్నిటిని వదలి మీకు ఈ ఆవిముక్త క్షేత్రమందాన కి ఏల? ఇచట సుమహా పుణ్యమేమి కలదు? ఆ పరమ రహస్యము నాకు తెల్పుడు ఏల మీరు సదా భూత గణములతో కూడి ఇట విహరింతురు? ఈ క్షేత్రమునకు కల ! శేష్టత ఏమి? ఇచటనుండు వా రెవరు? వారియందు మీయనుగ్రహమేట్టిది? శం3 రా! ఆదియంతయు తెలుపుడు ఆన దేవదేవుడిట్లు చెప్పెను: భామీనీ! నీవడిగినదిది అత్యద్భుతమగు ప్రశ్న ము; అదియంతయు చెప్పెదను వినుము; నాప్రియా! ఈ పుణ్య క్షేత్రమగు వారాణసియందు సిద్ద గంధర్వ సేవిత త్రిపథగ (మూడు త్రోవలపోవు) పుణ్యనది గంగ ప్రవేశించినది; అందుచే సుందరీ! నాకు గజచర్మ వస్త్రమునందువలెనే దీని యందును ప్రీత్యధిక ము; ఇట్లు సర్వస్థానములందు త్తమము కావున ఈ స్థానమునందు నాకు రతి ( ఆనందము) ఆధికము; సురేశ్వరీ! ఇందుచేతనే ఇచటి లింగమునందును నేను సన్నిధి చేసి ఉందును గుణవతులలో శ్రేష్ట అగు దేవీ! ఈ క్షేత్ర గుణములను చేప్పెదను వినుము; వీనిని విన్న చో సర్వపాప ముక్తులగుట నిస్సంశయము; పాపుడు కాని పాషండుడు (వేద బాహ్యుడు) కానీ ధర్మార్థము లతిక్రమించిన వాడు కాని ఆవిముక్త యాత్ర చేసినచో సర్వపాపముక్తుడగును; శుభ రూపా: సర్వభూత ప్రళయమయి స్థావర చర ప్రాణులును పదార్థములును నశించినపుడు కూడ నేను నాకు ప్రియతరమగు ఈ స్థానమును నేను విడువను; యుగక్షయ (ప్రళయ కాలమున దేవగంధర్వ యక్షరగ రాక్షసులును నానోరు ప్రవే శించుదురు; అపుడును నేను ఇట వారి పూజను సాక్షాత్తుగా ప్రతిగ్రహించుచుందును ఇది నర్వ రహస్యములలో ఉత్తమమును నాకు ప్రియతరమునునగు స్థానము

ధన్యాఃప్రవిష్టా స్సుశ్రోణి మమ భక్తా ద్విజాతయః

 మద్భక్తిపరమా నిత్యం యే మద్భక్తాస్తు తే నరాః

 తస్మినాణా న్పరిత్యజ్య గచ్చంతి పరమాం గతిమ్

సదా యజతి రుద్రేణ సదా దానం ప్రయచ్ఛతి

 సదా తపస్వీ భవతి ఆవిము క్రస్థితో నరః

యో మాం పూజయతే నిత్యం తస్య తుష్యామ్యహం ప్రియే

 సర్వదానాని యో దద్యా త్సర్వయజ్ఞై ర్యజే న్నరః

సర్వతీర్థాభిషిక్తశ్చ స ప్రపద్యేత మామిహ

అవిముక్తం సదా దేవి యే వజ స్త్రీ సునిశ్చితాః

 తే తిష్టస్తీహ సుశ్రోణి మద్భక్తాశ్చ త్రివిష్ట పే

 మతసాదా త్తతో దేవి దీప్య ని శుభలోచనే

 దుర్దర్షా దుర్దరా శ్చైవ భచ ని విగతజ్వరః

 అవిముక్తం శుభం ప్రాప్య మద్భక్తః కృతనిశ్చయా

నిర్దూతపాపవిమలా భవ నీ విగతజ్వరాః

పార్వతీ : దక్ష యజ్ఞ స్వయా దేవ మతియార్థం నిషూదితః

అవిముక్తగుణానాం తు న తృప్తి రిహ జాయతే

 ఈశ్వర: క్రోధేన దక్షయజ్ఞస్తు త్వతీయార్థ వినాశితః

మమ ప్రియే మహాభాగే నాశితోయం వరాననే

 ఆవిము క్తే యజ నే యే మద్భక్తః కృతనిశ్చయాః

న తేషాం పునరావృత్తిః కల్పకోటిశ తై రపి

దేవీ : దుర్లభాస్తు గుణా దేవ అపాము కేతు కీర్తితాః

సర్వాం స్తాన్మమ త త్వేన కథయస్వ మ హేశ్వర

 కౌతూహలం మహాదేవ! హృది స్వం మమ వర్తతే

 తత్సర్వం మమ త త్వేన ఆఖ్యాహి పరమేశ్వర 

ఈశ్వరః : ఆక్షయా హ్యమరా శ్చైవ హ్య దేహాశ్చ భవ ని తే

మత్ప్రసాదా ద్వరారో హే మామేవ ప్రవీశంతి వై

 బ్రూహి బ్రూహి విశాలాక్షి కిమన్య చ్ఛ్రొతు మిచ్ఛసి

సుశ్రోణి (మంచి పిరుదులు గల సుందరీః) ధన్వులు నా భక్తులగు త్రివర్ణికులు నా భ క్తియే ప్రధానము గాగల ఇతర నరులును అచట ప్రవేశింతురు: ఆచట మరణించి పరమగతినందుదురు; ఆవిముక్తమందుండు నరుడు నదా రుద్రము (నమక చమకముల తో నన్నా రాధించినవాడే; సదా దాన మొనర్చినవాడే; సదా తపస్వియే; (ఆట్టి వానికే ఈ క్షేత్రము లభించునని యర్థము) నన్ను నిరతము పూజించువాని విషయమున నేను తృపుడనగుదును; నర్వదానము లాచరించినవాడు సర్వయజ్ఞములతో దేవతల నారాధించినవాడు సర్వతీర్థ స్నానమాచరించినవాడు ఇటకు వచ్చి నన్ను శరణంద గలుగును; దేవీ! సునిశ్చయముతో ఈ ఆవిముక యాత్ర చేయువారును ఇట నివసించువారును వరమున నాయనుగ్రహమున స్వర్గ మున వసించి ప్రకాశింతురు; శుభలోచనా! అట్టివారు ఎవరికి తిరస్కరించను భరించను ఆలవికానివారై సంతాపర హిఁ" అవిముక్త శుభ క్షేత్రము చేరి కృతనిశ్చయులై నాకు భక్తులయి పాపములను దులుపుకోని విమలులగుదురు; అనగా, మరల ఇట్లనెను: దేవా! ఒకప్పుడు నా ప్రీతి కై దక్ష ధ్వంస మొనర్చితిరి; ఆట్లే ఇపుడు ఆవిముక్త క్షేత్రగుణములను కొంకను తెలిపి నాకు తృప్తి కలిగింపుడు ఆవి ఎంత విన్న ను తృప్తి కల్గుటలేదు ఆన ఈశ్వరుడిట్లనెను: దేవీ! నేను నీప్ర॥॥ క్రుద్ధుడనై దక్షయజ్ఞ వినాశ మొనర్చితిని (ఆట్లే ఇపుడి ఆవిముక్త క్షేత్ర గుణముల తెలిపి నీకు ప్రీతి కలిగింతును! మేలగు ముఖము కలదానా! కృతనిశ్చయులై మద్బక్తులై ఆవిము క్తమందుండువారు శత కోటి కల్పముల తరువాత కూడ పునర్జన్మమునంద రు; ఆన దేవి ఇట్లు పలికెను: దేవా! అవిముక్త క్షేత్రమందు ఇతరత్ర దుర్లభములగు గుణములున్నవని కీర్తించితిరి మహేశ్వరా! వాటినన్నిటిని పాటి తత్వముతో కూడ తెలుపుడు; మహాదేవా! నా హృదయమందీ విష యమున చాల కుతూహలము కలదు; అన ఈశ్వరుడనేను: వరారోహా! ఆవిముక్రవాసులు నా ప్రసాదమున ఆక్షయులు ఆమరులు ఆదేహులు ఆయి నన్ను ప్రవేశింతురు; విశాలాక్షీ ! మరి ఇం కేమి వినగోరుదువు?

దేవీ : అవిము క్తే మహా క్షేత్రే అహో పుణ్య మహో గుణః

 న తృప్తి మధిగచ్ఛామి బ్రూహి దేవః పునర్గుణా

 ఈశ్వరః : మ హేశ్వరి వరారో హే శృణు తాంస్తు మమ ప్రియే

 ఆవిముక్తే గుణా యే తు తథాస్యానపి తాఞ్చృణు

శాకపర్ణాశినో దాస్తా స్సమక్షాళ్యా మరీచిపాః

 దంతోలూఖలినశ్చాన్యే ఆశ్మకుట్టా స్తథాపరే

 మాసి మాసి కుశాగ్రణ జలమాస్వాదయ ని వై

 వృక్ష మూలని కేతాశ్చ శిలాశయ్యా స్తథా పరే

ఆదిత్యవపుష స్సర్వే జితక్రోధా జితేన్డియాః

 ఏవం బహు విధై ధర్మై రన్యత్ర చరితవ్రతాః

త్రికాలమపి భుజ్జానా యే విముక్త నివాసినః

తపశ్చరని పొన్యత్ర కళాం నార స్తి షోడశీమ్

 యేవిముక్తీ వస క్లీహ స్వర్డే ప్రతివస ని తే

మత్సమః పురుషో నా స్త్రీ త్వత్సమా నా స్త్రీ యోషితామ్

ఆవిముక్తసమం క్షేత్రం న భూతం న భవిష్యతి

 అవిముక్తీ పరో యోగో హ్యవిము క్రే పరాగతిః

 అవిముక్తీ పరో మోక్షః క్షేత్రం నై వాస్తి తాదృశమ్

 పరం గుహ్యం ప్రవక్ష్యామి త త్త్వేన వరవర్జిని

 అవిముక్తే మహా క్షేత్రే యదుక్తం హి మయా పురా

 జన్మా స్తరశతై రేవి యోగోయం యది లభ్యతే

 మోక్షః శతసహ సేణ జన్మనా లభ్యతే న వా

 ఆవిముకే వసే ద్దేవి మద్భక్తః కృతనిశ్చయః

ఏకేన జన్మనా దేవి! యోగం మోక్షం ప్రవిద్థతి

 అవిముకే నరా దేవి యే వ్రజ ని సునిశ్చితాః

తే విశ ని పరం స్థానం మోక్షం పరమదుర్లభమ్

పృథివ్యా మీదృశం క్షేత్రం న భూతం న భవిష్యతి

 చతుర్మూర్తి స్సదా ధర్మస్ తస్మి నన్ని హితః ప్రియే

 చతుర్ణామపి వర్ణానాం గతిస్తు పరమా స్మృతా

దేవీ : శ్రుతా గుణా స్తే క్షేత్రస్య ఇహచాన్యత్ర యే ప్రభో

 వదస్వ భువి విప్రేంద్రాః కం వా యజ్ఞై ర్యజంతి తే

దేవి యనెను: దేవా! ఆవిము క్రమహా క్షేత్రమం దద్భుతమగు పుణ్యమును గుణములును గలవు; అవి ఎంత విన్నను నాకు తృప్తి కలుగుట లేదు; దేవా! అవి ఇంకను తెలుపుడు అన ఈశ్వరు డిట్లు వచియించేను: మహేశ్వరీ! వరారోహా! నా ప్రియా! అవిముక్త క్షేత్రగుణములు చేప్పేద వినుము; శాకములు ఆకులు తినువారు ఇంద్రియ నిగ్రహము - కలవారు నిరత స్నాతులు సూర్యకిరణముల తావి జీవించువారు దంతములు రోలుగా చేసికొని ధాన్యములు నమలితిని జీవించువారు రాతిపై ధాన్యము అరగదీసి తిని బ్రదుకువారు నెలకొక మారే దర్భాగ్రమునకు వచ్చినంత నీరు ఆహారముగా గ్రహించి జీవించువారు చెట్ల మొద నివాసముగా రా ళ్లే పడక గా నుండువారు రవితేజస్కులు జితక్రోధులు జితేంద్రియులు గయి ఇట్టి బహువిధ ధర్మములు పాటించి ఇతరత్ర వ్రతము లాచరించుచు తప మొనర్చువారు కూడ మూడు వేళల ధుచుచునే అవిముక్తమందు వసించువారి పదారవ పొలునకు సరిపోలరు; అవిముక్త వాసులు స్వర్గవాసులే; నా వంటి పురుషుడును నీవంటి స్త్రీ యు ఆవిముకమువంటి క్షేత్రమును ఇదివరకు లేవు; ఇకముందుండవు; ఇచట పరమయోగము పరమ  పమ మోక్షము లభించును; కావుననే ఇటి క్షేత్రము మరిలేదు; వరవర్షినీ! మహా రహస్యము తెలి పెదను; నూరు జన్మముల కైన యోగసిద్దియు లక్ష జన్మముల కై న మోక్షమును లభించునో లభించదో చెప్పజాలము; కాని సునిశ్చితులై అవిము క్షమును ప్రవేశించి ఆచట వసించువారు ఒక జన్మము తోనే యోగసిద్ధినంది పరమ దుర్లభమగు మోక్ష మందగలరు; - పృథివియందు దీనికి సాటియగు క్షేత్రము మరిలేదు; ప్రియా! ఇచట ధర్మము సదా నాలుగు పాదముల సన్నిధినంది నడుచును; ఈ క్షేత్రము నాలుగు వర్ణముల వారికిని పరమ గమ్యము; అన దేవి ఇట్లనెను: ప్రభూ! నేను నీ వలన ఈ క్షేత్ర గుణములను ఇతరత్ర కల గుణములను తెలిసికొంటిని; విపేంద్రులు (ద్విజులు) యజ్ఞములు చేయునపుడు వారిచే ఆరాధింప " ఓడు దేవత ఎవరు?

ఈశ్వరః : దృష్ట్యా చైవతు మంత్రేణ మా మేవ హి యజంతి యే

 న తేషాం భయమస్తీహ భవం రుద్రంవ్రజంతి తే

సమన్తమ స్త్రకో దేవిః ద్వివిదో విధి రుచ్యతే

 సాజ్ఖ్యం చై వాథ యోగశ్చ ద్వివిధో యోగ ఉచ్యతే

 సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వ మాశ్రితః

 సర్వథా వర్తమానోపి స యోగీ మయివర్తతే

 ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో నరః

 తస్యాహం న ప్రణశ్యామి సవా(చ)మే న ప్రణశ్యతి

 నిర్గుణ స్సగుణశ్చాపి యోగశ్చ కథితో భువి

 సగుణ శ్చైవ విజేయో నిర్గుణో మనసః పరః

ఏత త్తే కథితం దేవి యన్మాం త్వం పరిపృచ్ఛసి

 దేవీ : యా భక్తి శ్రీవిధా పోక్తా భక్తానాం బహుధా త్వయా

తా మహం శోతు మిచ్ఛామి త త్త్వేన కథయస్వ మే

 ఈశ్వరః : శృణు దేవి మహా భాగే భక్తానాం భ క్రీ వత్సలే

ప్రాప్య సాజ్యం చ యోగం చ దుఃఖా స్తం చ నిగచ్ఛతి

 సదా య స్పేవతే భిక్షాం తతో భవతి రజ్జితః

రజ్జోనా తన్మయో భూత్వా లీయతే స తు భక్తిమా

 శాస్త్రాణాం చ వరారో హే బహు కారణదర్శినః

 న మాం పశ్య ని తే దేవి జ్ఞానవాక్యవిహదినః

 పరార్ధజ్ఞానతృప్తా యే యుక్తాః పశ్య ని యోగినః

విద్యయా విదితాత్మానో యోగస్యాపి ద్విజాతయః

ప్రత్యాహారేణ శుద్దాత్మా నాన్యథా చి క్షయేచ్చ తత్

తుష్టిం చ పరమాం ప్రాప్య యోగం మోక్షం పరంత థా

త్రిభిర్గుణె స్సమాయుక్తో జ్ఞానవా నశ్యతీహ మామ్

 ఏత త్తే కథితం దేవి కిమన్య చోతు మిచ్ఛసి

భూయశ్చాపి వరారో హే కథయామీహ సువతే

 గుహ్యం పవిత్ర మథవా యచ్చాపి హృది వర్తతే

 తత్సర్వం కథయిష్యామి శృణుష్వైకమనాః ప్రియే

దేవితో ఈశ్వరు డిట్లు పలికెను: భావనతోను మంత్రముతోను నన్నే ఎవరు యజింతు ఆరాధింతురో పొరి కీ లోకములందు భయము లేదు; వారు భవుడు (లోక కారణుడు) రుద్రుడు (జ్ఞానావరోధమును తొలగించువాడు) ఆగు నన్నే పొందుదురు; దేవీ! యజ్ఞవిధి సమంత్రకము అమంతక మునని రెండు విధములు; యోగమునుసాంఖ్యము యోగము ననీ రెండు విధములు; సర్వభూతములం దంతర్యామినై యున్న నన్ను ఏకత్వ భావన నాశ్రయించి సేవించు యోగి సర్వ విధముల లోక సంగముతో నుండియు నా యందున్నవాడే; ఏ నరుడు తనతో సమానముగా అన్ని భూతములను భావించి చూచునో అతనికి నేను కొని నా క త డు కాని లేక పోవుట యుండదు యాగము నిరుణము సగుణము విధములు; సగుణ యోగము విజ్ఞాన (అనుభవ) గోచర మగును; నిర్గుణ యోగము మనస్సున కతీతము; దేవీ! నీ వడిగి నది ఇట్లు నీకు తెలిపినాను ఆన దేవి ఇట్లడిగేను: భక్తు లనుష్టించు భక్తి త్రివిధములని మీరు చాల మారులు చెప్పి యుంటిరి; దాని వాస్తవరూపము తెలియగోరుచున్నాను; నాకు తెలుపుము; అన ఈశ్వరు డిట్లనేను: భక్తుల భ క్తియందు వాత్సల్యముగల మహాభాగా! దేవీ! వినుము; సాంఖ్యమును కాని యోగమును కాని ఆశ్రయించినవాడు దుఃఖాంతమును పొందును; ఎవడు సదా భిక్షా సేవనముతో జీవించునో అతడు భక్తితో రంజితుడై దానిదే భగవ తన్మయత్వమునంది ఆ భ క్రీమంతుడు భగవంతునిలో తల్లీను డగును వరారోహా: దేవీ! శాస్త్రముల బహు కారణ{ హేతువాదములను చూడగలిగిన వారై నను వారు జ్ఞాన సంబంధి వాక్యములతో పొదింతురే కానీ నన్ను చూడజాలరు; యోగముతో చిత్తమున నన్నే నిలిపి పరమార్థ జ్ఞానమునంది తృప్తులగు యోగులును విద్యతా త్విక జ్ఞానము)చే ఆత్మ పరమాత్మతత్వము నెరిగి యోగ తత్త్వము నెరిగిన ద్విజులు మాత్రమే నన్ను దర్శింతురు; ప్రత్యాహారము, విషయ సుఖములనుండి ఇంద్రియములను ఉపసంహరించుట)చే చిత్తమును శుద్ద మొనర్చుకొనవలెను; మరేదియు ఆలోచింపక తత్వము నే ధ్యానించవలయును; గుణ త్రయ సమాయోగమున తత్వ మెరిగిన జ్ఞానవంతుడు మాత్రమే నన్ను దర్శించును; దేవీ! నీ వడిగిన దిది నీకు చెప్పితిని; మరి ఏమి వినగోరుదువు? వరారోహా! సువ్రతా! ఇంకను మరల మరల ఎన్ని మారు లయినను చెప్పెదను; గుహ్యమును పవిత్రమును నగు ఏది విన కుతూహలము నీ హృదియందున్న ను ఆది ఎల్ల చెప్పెదను; ప్రియా! ఏక మనస్కవే వినుము

దేవీ : త్వద్రూపం కీదృశం దేవ ముక్తాః పశ్యంతి యోగినః

 ఏష మేసంశయో దేవ నమస్తే సురస త్తమ

 శ్రీభగవా: అమూర్తం చైవ మూర్తంచ జ్యోతీరూపం తత్సృతమ్

 తస్యోపలబ్ది మన్వచ్ఛ న్యత్నః కార్యో విజ్ఞానతా

గుడై ర్వియుక్తో భూతాత్మా ఏవం వక్తుం న శక్యతే

 శక్యతే యది వక్తుం వై దేవై ర్వర్ష శతై రపి

 దేవీ : కంప్రమాణంతు తత్తేత్రంసమన్హా త్సర్వతోదిశమ్

యత్ర నిత్యం స్థితో దేవో కృత్తివాసా గజై స్సహ

 ఈశ్వరః : ద్వియోజనంతు యజ్ఞేత్రం పూర్వపశ్చిమతస్థితమ్

 అర్ధయోజనవి స్తీర్ణం తత్తైతం దక్షిణోత్తరమ్

 వారాణసీ నదీ యా చ యావచ్చుళ్లనదీ తు వై

 భీష్మచజ్జిక మారభ్యపర్వతేశ్వర మ ని కే

 గణా యత్రచ తిష్ణని తథా విఘ్న వినాయకాః

 కూశ్మాండోగ జతుండశ్చ జయ నశ్చ మదోత్కటాః

 సింహవ్యాఘముఖాః కేచి ద్విక టాః కుబ్జవామనాః

 యత్ర నన్ద మహా కాళ శ్చణ్ణఘణో మహేశ్వరః

 దణ్ణచణేశ్వర శ్చైవ ఘట్టాకర్లో మహాబలః

 ఏతే చాన్యేచ బహవో గణా రు ద్రా స్తథేశ్వరాః

 మహోదరా మహాకాయా వజ్రశక్తిధరా స్తథా

 రక స్తి సతతం దేవి హ్యవిముక్తం తపోధనాః

ద్వారే ద్వారే చ తిష్టని శూలముద్ధరణయః

 స్వర్ణశృజీం రూప్యఖురాం చలదజ్జాం పయస్వినీమ్

వారాణస్యాం తు యో దద్యా త్రివర్ణాం కజ్జలోచనే

గాం దత్వా తు వరారో హే బ్రాహ్మణే వేదపారగే

 ఆసప్తమం కులం తేన పావితం నాత్ర సంశయః 

 ఆన దేవి ఇట్లనెను: దేవా! ముముక్షువులగు యోగులు దర్శించు నీ రూప మెట్టిది? ఇది నా సంశయము; సుర సత్తమా! నీకు నమస్కారము; నా కిది తెలుపుము; అన భగవాను డిట్లనెను: ఆది వా స్తవమున జ్యోతిరూపమయినది; ఆది మూర్తము (సాకారము) అమూర్తము (నిరాకారము) అని రెండు విధములు; ఆ పరమాత్మానుభవము పొందగోరు విజ్ఞాన వంతుడు అందులకై యత్నించవలయును; నిర్గుణుడగు భూతాత్మ సర్వ భూతాంతర్యామియగు పరమాత్మ తత్వము ఇట్టిదని చెప్ప శక్యము కాదు; దేవతలకు కూడ దివ్య వర్ష శతముల కయినను సాధ్యమో కాదో చెప్పజాలము అన విని దేవి ఇట్లనెను: కృత్తివాసుడు (గజ చర్మధారి) యగు ఈశ్వరుడు ప్రమథ గణములతో నిత్యము నివసించు ఆ ఆవిముక్త క్షేత్రము అన్ని దిశలయందును వ్యాపించిన విస్తార ప్రమాణము ఎంత? అన ఈశ్వరు డిట్లనెను: ఆ క్షేత్రపు తూర్పు పడ మరల పొడవు రెండు యోజనములు; ఉత్తర దక్షిణముల వెడల్పు అర్ధ యోజనము; వారాణసీనది శుక్లనది పర్వత శ్రేష్ఠమగు భీష్మ చండికము అనువాని సమీపముగా ఈ క్షేత్రము వ్యాపించి యున్నది దీనియందు విఘ్న వినాయకులను ప్రమథ గణపతులునుఉన్నారు; వారు కూశ్మాండుడు గజతుండుడు జయంతుడు మొదలగువారు; వారెల్లరును ఆధిక దళాలురు; సింహవ్యాఘముఖులు; - వికటరూపులు; మరుగుజ్జువారు; పొట్టివారు; వీరిలో నంది-మహాకాళుడు చండఘంటుడు మహేశ్వ రుడు దండచండేశ్వరుడు మహాబలుడగు ఘంటాకర్ణుడు వీరు కాక మరియు ఇతరులు అనేకులు గణములవారగు రుద్రులు ఈశ్వరులు ఉన్నారు; వారందరు పెద్ద పొట్టలు పెద్ద దేహములు కలిగి వజ్రముశ క్తి మొదలగు ఆయుధముల దాల్చిన వారు; ఈ తపోధనులు శూలముద్ద రాయుధపాణులయి ప్రతి ద్వారమందు నిలిచి ఆవిముక్త క్షేత్రమును రక్షించుచుందురు బంగరు కొమ్ములు వెండి గిట్టలు కంఠమున కదలియాడు గంటలు మూడు వన్నే లు కల పాడియావును వారాణసియందు వేదపారగుడగు బ్రాహ్మణునకు దాన మిచ్చినచో వద్మలోచనా! వరారోహా! ఆదాత తన వంశమందలి ఏడు తరములవారిని పవితుల జేయును నిస్సంశయము,

యో దద్యాద్భ్రాహ్మణే కిఞ్చి త్తస్మినేత్రే వరాననే

కాఞ్చనం రజతం వస్త్ర మన్నాద్యం బహువి స్తరమ్

అక్షయ్యం చావ్యయం తస్య దానం స్యాదేవ సువ్రతే

 శృణు త త్వేన తీర్థస్య విభూతిం వ్యష్టి మేవ చ

 యత్రస్నా త్వా మహాభాగే భవ ని నిరుజా నరః

దశానా మశ్వమేధానాం ఫలం యా నీ చ మానవాః

తదవాప్నోతి ధర్మాత్మా తత్ర స్నా త్వా వరాననే

 స్వల్పమల్పంచ యో దద్యా ద్ర్భాహ్మణే వేదపారగే

శుభాం గతి మవాప్నోతి అగ్నివచ్చైవ దీప్యతే

 వారాణస్యాంతుజాహ్న వ్యాః సంగమే లోక విశ్రుతే

 దత్వాన్నం చ విధానేన న స భూయోపి జాయతే

 ఏతత్తే కథితం దేవి! తీర్థస్య ఫల ముత్తమమ్

 ఉమే తే సమ్పవక్ష్యామి నిశ్చయం శృణు సువ్రతే

ఏకరాత్రోపవాసం తు కృత్వా విప్రాంస్తు తర్పయేత్

 సౌత్రామణీస్తు యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః

ఏకాహార స్తు య స్తిషే న్మాసం తత్ర వరాననే

 యావజ్జీవకృతం పాపం సహసా తస్య నశ్యతి

 అగ్నిప్రవేశం యే కుర్యు రవిముక్తీ విధానత

ప్రవిశ ని ముఖం తే మే నిస్సనిగ్గం వరాననే

 దశ సౌవర్ణికం పుష్పం యోఒవిముకే ప్రయచ్ఛతి

 అగ్నిహోత్రఫలం ధూపగన్లదానేన తచ్ఛృణు

 భూమిదానేన తత్తుల్యం గనదానఫలం స్మృతమ్

 సంమార్జనే పఞ్చశతం సహస్ర ముపలేవనే

 మాలా శతసహస్రంతు అన న్తం గీతవాద్యతః

ఎవడా క్షేత్రమున బ్రాహ్మణునకు బంగారము వెండి వస్త్రములు ఆన్నము మొదలగునవి దానము చేయునో వాని ఆ దానము అక్షయము ఆవ్యయము అగును; ఆ తీర్థపు మాహాత్మ్యమును సమృద్ధిని ఏ స్తవమున తెలి పెదను వినుము; అచట స్నాన మాడిన మానవులకు రోగబాధా నివృత్తియు దశాశ్వ మేధఫలమును లభించును వేదపారగుడగు విప్రున కచట ఏ కొంచెము దాన మిచ్చినను దాత శుభగతి నందును; అగ్ని వలే ప్రకాశించును; వరణా అసియను నదులు జాహ్నవి (గంగ)తో సంగమించు చోట యథావిధానముగ అన్న దానము చేసిన వానికి పునర్జన్మ ముండదు దేవీ! నీ కిది ఇట్లు ఆ తీర్థపు ఉత్తమఫలము తెలిపితిని; సువతవగు ఉమా? మరియొక నిశ్చయమును తెలిపేదను వినుము; ఆచట ఒక రేయిం బవలు ఉపవాసముండి బ్రాహ్మణులను ( ఆన్నా దికముతో) సంతృప్తి పరచినచో సౌత్రామణి యజ్ఞఫలము నందును; వరా ననా! అచట మాసమాత్రము ఏక భుక్త వ్రతము చేసినచో వెంటనే యావజ్జీవము చేసిన పాపమంతయు నశించును; అవిముక్తి క్షేత్రమున యథావిధానముగ ఆగ్ని ప్రవేశము చేసినచో వారు నా ముఖమందు ప్రవేశించిన ఫలమును నిస్సంశయ ముగ నందుదురు; పది బంగారు పూవులను (లేదా పది నవర సుల బంగారు పూవులను) దానము చేసిన వారికి నిత్యాగ్ని హోత్ర ఫల మబ్బును; అచట ధూప-గంధ-దానముచే భూదాన ఫలము లభించును; అచట గుడియందు క సవూడ్చుటచే ఐదు నూర్ల దాన మల ఫలము ఆలుకుటచే వేయి దానముల ఫలము మాల అర్పించినచో లక్ష దానముల ఫలము పొందును; గీతవాద్యముల జరిపించిన చో ఆనంతఫలము లభించును

దేవీ : అత్యద్భుత మిదం దేవ యథా మే త్రత్ప కీర్తితమ్

రహస్యం శ్రోతుమిచ్ఛామి యదర్థం త్వం న ముహౌసి

ఈశ్వర కృతబ్రహ్మపఞ్చమశిరశ్ఛేదనకథనమ్

ఈశ్వరః : ఆసీ త్పూర్వం వరారో హే బ్రహ్మణస్తు శిరోవరమ్

 యథేదం శృణు సుశ్రోణి తప్తకాఇ్చన సుప్రభమ్

 జ్వలన్తం పఞ్చమం శీర్షం జాతం తస్య మహాత్మనః

 స ఏవ మబ్రవీద్దేవి జన్మ జానామి తే హ్యహమ్

తతః క్రోధపరీతేన సంగ కనయనేన చ

వామాజుష్ణనఖాగ్రేణ ఛిన్నం తస్య శిరో మయా

బ్రహ్మా : యస్మా దనపరాధస్య శిరశ్ఛిన్నం త్వయా మమ

 తస్మా చ్చాపసమాయుక్తః కపాలి త్వం భవిష్యసి

 బ్రహ్మహత్యాకురో భూత్వా చర తీర్థాని భూతలే

 తతోహం గతవాన్దేవి హిమవ న్తం శిరోచ్చయమ్

 తత్రనారాయణ శ్రీమా న్మహాభిక్షాం ప్రయాచితః

 తత స్తేన స్వకం పార్శ్వం నఖా గ్రేణ విదారితమ్

 మహతీ సవతో దారా తస్యరక్తస్య నిస్సృతా

 ప్రయాతా సాతివి సీర్ణా యోజనార్ధశతం తదా

 న సమ్పూర్ణం కపాలంతు ఘోర మద్భుతదర్శనమ్

 దివ్యం వర్ష సహ సంతు సాఒపిధారా ప్రవాహితా

ప్రోవాచ భగవా న్విష్ణుః కపాలం కుత ఈదృశమ్

 ఆశ్చర్యభూతం దేవేశ సంశయం మయి వర్తతే

 కుతశ్చ శమ్భో దేవేశ సర్వం మే బ్రూహి పృచ్ఛతః

దేవి దేవునితో ఇట్లనెను: దేవా! నీవు చెప్పిన దిది అత్యద్భుతమగు విషయము; నీ వీ క్షేత్రమును విడువకుండుట లోని రహస్య హేతువును తెలుపుము; అనగా ఈశ్వరు డిట్లు తెలుపసాగేను: వరారోహా! సుశ్రోణి! ఈ విషయము ఎట్టిదో తెలి పేద వినుము; మహాత్ముడగు బ్రహ్మకు పూర్వము ఐదవ శిరస్సు జనించెను; ఆది చాల శ్రేష్ఠమయినదికాచిన బంగారువలే మంచి కాంతితో జ్వలించునది; ఇట్లుండగా దేవీ! ఆతడు నాతో నీ పుట్టుక నే నెరుగుదు ననేను; అంతట నేను క్రోధవ్యాప్తుడనయి రక్తనేత్రుడనయి నా ఎడమచేతి బొటనవేలి గోటి కొనతో ఆతని తల తెంచితిని; ఆంతట బ్రహ్మ “అనపరాధుడనగు నా తల త్రుంచితివి కనుక నీవు శాపయుక్తుడవయి కపాలధారి వగుదువు; బ్రహ్మహత్యాదోషాకులుడ వయి భూతలమందలి తీర్థములందు తిరుగుచుండుము;” అనెను; దేవీ! నే నంతట హిమవత్పర్వతమునకు పోతిని; అచట నేను నారాయణుని మహాభిక్ష కోరితిని; ఆతడు తన పార్శ్వమును చీల్చగా మహార క్ష ధార స్రవించసాగేను; ఆది ఏబది యోజనముల పొడవయ్యేను; అంతటి దానితో కూడ నాకపాలము నిండలేదు ఆశ్చర్యకరమయి కనబడు ఆ ఘోర రక్త ధార దివ్య సంవత్సర సహస్రముల పాటు ప్రవహించుచునే ఉండేను; అది చూచి విష్ణు భగవానుడు నాతో “దేవేళా! శంకరా! శంభూ! ఇటువంటి ఈ కపాలము ఎచ్చటినుండి లభించేను; ఇది ఆశ్చర్యకరమయినది; నా వీది తేలిపి వంశ యము నివారింపుము;” అనెను

ఈశ్వరః : శ్రూయతా మస్య దీవ్యస్య కపాలస్య తు సమ్భవః

 శతం వర్షసహస్రాణాం తప స్తప్త్వా సుదారుణమ్

 బ్రహ్మాసృజ ద్వపు ర్ధివ్య మద్బుతం లోమహర్షణమ్

 తపసశ్చ ప్రభావేన దివ్య కాఇనసుప్రభమ్

జ్వలతత్ప్చ మం శీర్షం జాతం తస్య మహాత్మనః

 నికృత్తం తన్మయా దేవ తదిదం పశ్య దుర్జయమ్

యత్రయత్రాగచ్చామి కపాలం తత్రగచ్ఛతి

 ఏవముక్త సతో దేవః ప్రోపోచ పురుషో త్తమః

 నారాయణః : గచ్ఛ గచ్ఛ స్వకం స్థానం బ్రహ్మణ స్త్వం ప్రియం కురు

 తస్మిం స్త్య జభద్రం తే కపాలం తస్య తేజసా

 తత స్సర్వాణి తీర్థాని గుహ్యాన్యాయతనానిచ

 గతోస్మి పృథులశ్రోణిన కించి త్ర్పతితిష్ఠతి

 తతోహం సమను ప్రాప్తో హ్యవిము క్రే మహాశయే

 అవస్థిత స్స్వ కే స్థానే శాపశ్చ విగతో మమ

విష్ణుప్రసానా త్సు శోణి కపాలం తత్సహస్రాధా

 స్పుటితం బహుధా జాతం స్వప్న లబ్దం ధనం యథా

బ్రహ్మహత్యాపహంతీర్థం క్షేత్ర మేత నయా కృతమ్ 

శ్మశాన మేత దృద్రం మే(తే) దేవానాం పర వర్ణిని

 కాలో భూత్వా జగత్సర్వం సంహరామీ సృజామిచ

 దేవేశిః సర్వగుహ్యానాం స్థానం ప్రియతమం మమ

మద్బక్తి సత్ర గచ్చ స్త్రీ విష్ణుభక్తా స్తథైవచ

 యే భక్తా భాస్కరే దేవి లోక నాధే దివాకరే

 అత్రస్ధ య స్త్య జే ద్దేహం మామేవ ప్రవిశత్యసౌ

దేవీ : అత్యద్భుత మిదం దేవ యదుక్తం పద్మయోనినా

త్రిపురా నకరస్థానం గుహ్య మేత న్మహాద్యుతే

 సన్నిధానాత్తు తే సర్వే కలాం నార ని షోడశీమ్

 యత్ర తిష్ఠతి దేవేశ్ యత్ర తిష్ఠతి శఙ్కరః

 గజాతీర్థసహస్రాణాం తుల్యా భవతి వా నవా

 త్వమేవ భక్తి రేవేశ త్వమేవ గతి రుత్తమా

 బ్రహ్మా దీనాంతు సర్వేషాం గతిరుక్తా సనాతనీ

 శ్రావ్యమేత ద్విజాతీనాం భక్తానా మనుకమ్పయా 

ఇతి శ్రీమత్స్యమహాపురాణే దేవీదేవసంవాదే ఆవిముక్తమాహాత్మ్యే ఈశ్వర కృతబ్రహ్మ శిరశ్చేదాదికథనం నామ ద్వ్యశీత్యుత్తరశతత మోధ్యాయః

ఆతనితో నేను ఇట్లంటిని “ఈ దివ్య కపొలపు ఉత్పత్తిని తెలి పేద వినుము; లక్షల దివ్య వర్షములపాటు బ్రహ్మ సుదారుణ తపమాచరించి దివ్యమును అద్బుతమును గగుర్పాటు కలిగించునదియు దివ్య సువర్ణ కాంతిమంతమును అగు దేహమును సంపాదించుకొనెను; ఆ మహాత్మునకపుడే ఐదవతలయు మొలిచెను: దేవా! నేనది తుంచితిని; ఇది చూడుముజయింపనలవి కాక నేను పోయిన చోటి కెల్ల నావెంట వచ్చుచున్నది;” అనగా పురుషోత్తమ దేవుడిట్లనెను: “నీవు బ్రహ్మకు ప్రీతి కలిగించు పని చేయవలయును; నీవు పోయిన ఏచోట అది నిన్ను విడుచునో అది నీవు నీ స్వస్థాన ముగా చేసికొనుము; అది తన తేజస్సుతో తానే నీకు శుభము కలిగించును;” అనెను నేనంతట పరమ రహస్యములగు తీర్థములు క్షేత్రములు అన్ని యు తిరుగసాగితిని; కాని పృథుశోణీ! ఏమియు మేలు కలుగలేదు; అంతట నేను మహా శయా! ఈ అవిముక్తమునకు వచ్చి నా స్వస్థానమున నిలిచితిని; విష్ణు కృపవలన నా శాపము తీరెను; ఆ కపాలము వేయిగా చీలి స్వప్న మున లభించిన ధనమువలె అదృశ్యమయ్యెను; అంతట నేనీది బ్రహ్మహత్యా నీవారక క్షేత్రముగా నిర్ణయించితిని; వరవర్ణినీ! ఇది దేవతల శ్మశానము; ఇకనుండి నేను కాలుడనయి జగమంతయు సృజించుచు సంహరించుచు నుందును; దేవేశీః ఇట్లు ఇది నర్వ రహస్య స్థానములందును నాకు ప్రియతమమైనది; నాయందును విష్ణునందును దీవి కరుడు (పగళ్ళ నేర్పరచువాడు) లోక నాథుడు అగు భాస్కరునియందును భ క్తిగల ఉపాసకులు ఆచ్చటికి పోవుదురు; ఇచట దేహ త్యాగ మొనర్చినవాడు నన్ను ప్రవేశించును; ఆనగా దేవి దేవునితో ఇట్లనెను: దేవా! పద్మయోని (పద్మము జన్మస్థానముగాగల బ్రహ్మయును ఆ పద్మమునకు జన్మకారణుడగు నారాయణుడును) చెప్పిన ఈ విషయములును వాని ననుసరించి జరిగిన ఈ ఘటనలును అత్యద్భుతముగా నున్న వి; మహాతేజశ్శాలీ: త్రిపురాంతక రా! నీవు ఇచట నిత్య సన్ని హితుడగుటవలన ఇతర క్షేతములన్నియు కలిసినను దీనీ పదునారవ వంతునకును సరిపోలవు; దేవేశుడగు శంకరుడుండు ఈ స్థానమునందు కల గంగతో తీర్థ సహస్రములును సరిపోలుతో పోలవో చెప్పజాలము; దేవేశా! ఇట్టి నీవే ఉత్తమథ క్తి రూపుడవు; ఉత్తమగతివి; బ్రహ్మాది దేవతలకును నీవే సనాతన (శాశ్వత) మగు ఉత్తమగతివి; ఇదియంతయు భక్తులగు ద్విజులయందలి అనుకంపతో వారికి వినిపించవలయును

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున దేవీదేవ సంవాద రూపమగు అవిముక్తి క్షేత్రమాహాత్మ్యమున యోగతతో పదేశము ఈశ్వరకృత బ్రహ్మశిర శ్చేదాది కథనమునను నూట ఎనుబది రెండవ యధ్యాయము