మత్స్య మహా పురాణము
61 - అగస్త్యోత్పత్తి - అగస్త్య పూజా విధానము
నారదః : భూర్లోకోఽథ భువర్లోక స్స్వర్లోకోథ మహర్జనః ।
తపస్సత్యంచ సప్తైతే దేవలోకాః ప్రకీర్తితాః॥
పర్యాయేణతు సర్వేషా మాధిపత్యం కథం భవేత్ ।
ఇహలో కే శుభం రూప మాయురారోగ్య మేవచ॥
లక్మీశ్చ విపులా నార కథం స్యా త్పురసూదన ।
ఏతన్మే భగవ న్త్సర్వంయథావ ద్వక్తు మర్హసి॥
అగ్నిమారుతయోరిన్ద్రదత్త శాపః॥
ఈశ్వరః : పురా హుతాశనస్సార్ధం మారుతేన మహీతలే ।
ఆదిష్టః పురుహూతేన వినాశాయ సురద్విషామ్॥
నిర్ధగ్ధేషు తత స్తేన దానవేషు సహస్రశః ।
(కాలకః)తారకః కమలాక్షశ్చ కాలదంష్ట్రఃపరావసుః॥
విరోచనశ్చ సజ్గృమా ధపయాతా స్తపోధన ।
అనస్సముద్ర మావిశ్య సన్ని వేశ మకుర్వత॥
ఆశక్తా ఇతి తేఽప్యగ్ని మారుతాభ్యా ము పేక్షితాః ।
తతః ప్రభృతి వై దేవా న్మనుష్యా న్త్సభుజజ్గమాక్॥
సమ్పీడ్యచ మునీ న్త్సర్వా స్రవిశ న్తి పునర్జలమ్ ।
ఏవం యుగ సహస్రాణి దానవాః పఞ్చ సప్తచ॥
జలదుర్గగతా బ్రహ్మ న్పీడయన్తి జగత్త్రయమ్ ।
తతః పున రథో వహ్ని మారుతా వమరాధిపః॥
ఆదిదేశాచిరా దమ్బునిధి రేష విశోష్యతామ్ ।
యస్మా దస్మద్ద్విషాం చైవ శరణం వరుణాలయః॥
తస్మా ద్భవద్భ్యామద్యైవ శోష మేష ప్రణీయతామ్ ।
తా వూచతు స్తత శ్శక్ర ముభౌ తౌ బలసూదనమ్॥
అధర్మ ఏష దేవేన్ద్ర సాగరస్య విశోషణమ్ ।
యస్మా జ్జీవనికాయస్య మహత స్సంక్షయో భవేత్॥
తస్మా న్న పాపం భూయిష్ఠ ముత్స హేతాం పురన్దర ।
యస్య యోజనమాత్రేపి జీవకోటిశ తాని వై॥
నివసన్తి సురశ్రేష్ట స కథం నాశ మర్హతి ।
ఏవ ముక్త స్సురేన్ద్రస్తు కోపా త్సంరక్తలోచనః॥
ఉవాచేదం వచో రోషాదుద్వమన్నివ పావకమ్ ।
స ధర్మాధర్మ సంయోగం ప్రాప్నువ న్త్యమరాః క్వచిత్॥
భవతోస్తు విశేషేణ మాహాత్మ్యే నావతిష్ఠతోః ।
మదాజ్ఞాలజ్ఘ నం యస్మా న్మారుతేన సమన్వితః॥
ముని త్రాణనహింసాది పరిగృహ్య న కిం కృతమ్ ।
ధర్మార్థశాస్త్రరహితం శత్రుం ప్రతి విభావసో॥
తస్మా దే కేన వపుషా మునిరూపేణ మానుషే ।
మారుతేన సమం లో కే తవ జన్మ భవిష్యతి॥
యదాచ మానుషత్వేచ తవ గణ్డూష శోషితః ।
భవిష్యత్యుదధి ర్వ హ్నే తదా దేవత్వ మాప్స్వసి॥
ఇతీన్ద్రశాపా త్పతితౌ తత్క్షణా త్తౌ మహీతలే ।
అవాప్తా వేకదే హేన కుమ్భజన్మ తపోధన॥
అగస్త్యోత్పత్తిః
మిత్రావరుణయో ర్వీర్యా ద్వసిష్ఠస్యానుజోఽభవత్ ।
అగస్త్య ఇత్యుగ్రతపా స్సమ్బభూవ పునర్మునిః॥
నారదుడు ఈశ్వరు నిట్లడిగెను: “ఇహలోకమున శుభమగు రూపమును ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్య మును పరమున క్రమముగా భూర్లోక భువర్లోక స్వర్లోక మహర్ లోక జనలోక తపోలోక సత్యలోకము లనెడి ఊర్ధ్వలోక ములను పొంది సుఖించుటకు సాధనమగు విధానమును ఉపదేశింప వేడుచున్నాను.”
ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను: పూర్వము ఇంద్రుడు అగ్ని వాయువులను అసుర నాశము చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. వారును వేలకొలదిగా దానవులను దహించిరి. తారకుడు కమలాక్షుడు కాలదంష్ట్రుడు పరావసువు విరో చనుడు సంగ్రామమునుండి తప్పించుకొనిపోయి సముద్రాంతర్భాగమున నివసింపసాగిరి. వీరు చేత కానివారు కదా! యని అగ్ని వాయువులు వారిని కాల్చక విడిచిరి. నీటినుండి వారందరును దేవ మనుష్య నాగులను మునులను బాధించి మరల నీటిలో ప్రవేశించుచుండిరి. ఇట్లు పండెండు వేల యుగములు లోకత్రయమును ఈ జలదుర్గమును దుండి బాధించిరి.
అంతట దేవేంద్రుడు అగ్ని వాయువులను మరల పిలిచి ‘ఈ దేవ శత్రువులకు సముద్రము ఆవాసముగా నున్న ది. కనుక మీరు ఈ సముద్రమును ఎండింపజేయుడు. అని కోరెను. వారును “ఇంద్రా! సగరమును శోషింప జేయుట ఎంతో అధర్మము. ఏలయన అందుచే వానియందలి ప్రాణులకు ఎన్నిటికో నాశము కలుగును. సముద్రమునందే కాదు-సముద్రమునకు యోజనముల దూరమునకూడ దాని సాధార ముగా చేసికొని వందలకొలది ప్రాణులు జీవించుచున్నవి. ఇట్టిదాని నెండింపజేయుట తగునా? ఇట్టి పాపము మేము చేయలేము.” అనిరి. ఈమాట విని . ఇంద్రుడు. కోపముతో: కను లెర్ర జేసి నిప్పులే క్రక్కుచున్నాడేమో అన్నట్లు చూచుచు రోషవచనములు ఇట్లు పలికెను: “దేవతలకు ఏ పాపమంటుట ఎక్కడనులేదు. విశేషించి మహా మహిమ వంతులగు మీకు అట్టిది లేనేలేదు. ఐనను మీరు నా ఆజ్గను ఉల్లంఘించితిరి. దీనిచేత మునులకు హింస దానవులకు రక్షణ మొదలగు దోషములెన్ని యో సంభవించును. ఇది ధర్మార్థ శాస్త్ర విరుద్ధము. కనుక మీరు ఇద్దరును మానవలోకమున ఒకే ఒక మానవ దేహముతో మునులుగా జన్మింతురుగాక! అందునను అగ్నీ : నీవు అప్పుడు కూడ నీ పుక్కిటితో సముద్రమును ఎండింప జేయుదువు. ఆపుడు మరల నీకు దేవత్వము లభించును.” అనగానే అగ్ని వాయువులు ఇద్దరును భూతలమునకు వచ్చిపడిరి. మిత్రావరుణుల (మిత్రుడు వరుణుడు అను జంట దేవతల) వీర్యమువలన కుంభమునుండి ఒకే దేహముతో జన్మించిరి. అగ్ని దేవుడు అగస్త్యమునిగా వసిష్ఠునికి తమ్ముడై జన్మించెను. నారదః : సమ్భూత స కథం భ్రాతా వసిష్ఠస్యాభవ న్మునిః ।
కథంచ మిత్రావరుణౌ పితరౌ తస్య తౌ స్మృతౌ॥
జన్మ కుమ్బా దభూచ్చాస్య కథంవా పుర సూదన ।
ఏత దాచక్ష్వ భగవన్య భావ ద్విబుదోత్తమ॥
ఈశ్వరః: పురా పురాణపురుషః కదాచి ద్గన్దమాదనే ।
భూత్వా ధర్మసుతో విష్ణు శ్చచార విపులం తపః
తపసా తస్య భీతేన విఘ్నార్థం ప్రేషితా వుభౌ ।
శక్రేణ మాధవానజ్గావప్సరోగణసంయుతౌ॥
యదా న గీతవాద్యేన నాజ్గహారాదినా హరిః ।
న కామమాధవాభ్యాం చ (విషయాన్ప్రతిచక్షుషోః) విషయాన్ప్రతిచక్రమే॥
తదా కామమధుస్త్రీణాం విషాద మగమద్గణః ।
సంక్షోభాయ తత స్తేషాం స్వోరుదేశా న్న రాగ్రజః॥
నారీ ముత్పాదయామాస త్రైలోక్య జన మోహినీమ్ ।
సంక్షుబ్ధా స్తు తథా దేవా స్తథైవచ సురావుభౌ॥
అప్సరోభి స్సమక్షం హి దేవాం స్త్రీ నబ్ర వీ ద్ధరిః ।
ఊర్వశతిచ నామ్నేయం లో కే ఖ్యాతిం గమిష్యతి॥
తతః కామయమానేన మిత్రేణాహూయ చోర్వశీ ।
ఉత్తా మాం రమయ స్వేతి బాడ మి త్యబ్రవీచ్చ సా॥
గచ్ఛన్తీ ప్రాన్తరే తస్మిక్ స్తోక మిన్దీవరేక్షణా ।
వరుణేన వృతా పశ్చా వరుణం నాన్వమన్యత॥
మిత్రేణాహం వృతా పూర్వ మద్య భార్యా న తే ప్రభో ।
ఉవాచ వరుణ శ్చిత్తం మయి విన్యస్య గమ్యతామ్॥
గతాయాం బాఢ మిత్యుక్త్వా మిత్ర శ్శాప మదా త్తదా ॥
గచ్చ త్వం మాను షే లోకే భజ సోమసుతాత్మజమ్॥
భజ స్వేతి యతో వేశ్యాధర్మ ఏష త్వయా కృతః ।
జలకుమ్బే తతో వీర్యం మి త్రేణ వరుణేన చ॥
ప్రక్షిప్త మథ సఞాతౌ ద్వావేవ మునిసత్తమౌ ।
నిమిర్నామ నృపః పూర్వంస్త్రీధి ర్ద్యూత మదీవ్యత॥
తద న్తరే జగామాథ వసిష్ఠో బ్రహ్మణ స్సుతః ।
తస్య పూజా మకుర్వంస్తు శశాప స మునిర్నృపమ్॥
విదేహ స్సమ్బవ స్వేతి శ ప్త సేనాప్యసౌ మునిః ।
అన్యోన్యశాపాచ్చ తయో ర్విశ రీర విచేత సోః॥
జగ్మతు శ్శాపనాశాయ బ్రహ్మాణం పద్మసమ్భవమ్ ।
అథ బ్రహ్మసమాదేశా ల్లోచనే ష్వవసన్ని మి:॥
నిమేషా:స్యుశ్చలోకానాం తద్విశ్రమాయ నారద ।
వసిష్ఠోఽప్యభవ తస్మిక్ జలకుంభేతు పూర్వవత్॥
తత శ్శ్వేత శ్చతుర్బాహు సాక్షసూత్రకమణ్డలుః ।
అగస్త్య ఇతి శాన్తాత్మా బభూవ ఋషిసత్తమః॥
మలయ స్యైక దేశే తు(వైశ్వానరవిధానవిత్) వైఖానసవిధానతః ।
సభార్య సంవృతో విప్రై స్తపశ్చక్రే సుదుష్కరమ్॥
ఈశ్వరుడిట్లు చెప్పగా నారదుడు ‘అగస్త్యుడు కుంభమునుండి ఎట్లు జన్మించెను? వసిష్ఠునకు తమ్ము డేట్లయ్యెను? వీరికి మిత్రావరుణు లెట్లు తండ్రులై రి? ఇదంతయు తెలుపుము.’ అని వేడెను. ఈశ్వరుడిట్లు చెప్పెను: ఒకానొక సమయమున పురాణ పురుషుడగు విష్ణుడు ధర్ముని కుమారుడగు నారాయణుడను మునియై గంధమాదన పర్వతమున విస్తృత తప మాచరించెను. అతని తపమునకు భయమందిన ఇంద్రుడు అతని తపము భగ్న మొనర్పగోరి వసంతుని మన్మథుని వారి కప్పరాగణములు తోడుగా ఆటకు పం పెను. వారు ప్రయోగించిన నాట్యగీత వాద్యములతోగాని వసంత మన్మథుల ప్రవృత్తులతోకాని ఆముని విషయ సుఖముల వైపునకు ప్రవృత్తుడు కాలేదు. తమ యత్నములు వమ్ముకాగా వారందరును విషాదమందీరి. వారీ నింకను కలత పరచదలచీ సోరాయణముని తసి తొడలనుండి త్రైలోక్య జన మోహినియగు యువతిని జనింపజేసి చూ పెను. చూచి పోరును కలతపడిరి. సొ ఊరువులనుండి జనించినందున ఈమెకు ఊర్వశియను నామమున ప్రసిద్దయె (అప్సరయై యుండునని నారాయణముని వసంత మన్మథులకును అప్సరలకును ఇతర దేవతలకును చెప్పెను.
ఆమెను చూచి కామ వశీభూతుడై మిత్రుడు ఉదయించు సూర్యునకు అభిమాని యగు దేవత) తన్నా నందింప జేయుమని ఊర్వశిని కోరెను. ఆమె యంగీక రించెను. నల్లకలువలవంటి కన్నులుకల ఆ సుందరి అతని వెంట కొంచెము దూరము పోగానే వరుణుడు (అస్తమించు సూర్యున కభిమానియగు దేవత) ఆ మేను చూచి అతడును ఆమెను తన్నా నందింప జేయుమని కోరెను. నన్ను ముందుగా మిత్రుడు వరిం చెను కావున నేనిప్పుడు అతనికి భార్యగానున్నాను. (అతని కోరిక తీర్చువరకు) నేను నీకోరిక తీర్చబోలనని యామె వరుణుని కోరిక అంగీకచకపోయెను. అట్లయినచో నీవు నీచిత్తమునై న నాయందు నిలిపి పొమ్మని వరుణుడు పలికెను. ఊర్వశి సరేయని మిత్రునితో వెళ్ళెను. నీవు చేసిన ఈపని వేశ్యాధర్మము. కావున నీవు భూలోకమునకుపోయి అచట సోముని పొత్తుని (కి భార్యవై ఆతనిని) ఆశ్రయింతువు. ఆని మిత్రుడామెను శపించెను. (అతడును ఆమెతో సుఖించలేదు.) (ఊర్వశీ విషయక మయిన కామ వశమున స్థానము తప్పిన) తమ వీర్యమును మిత్రావరుణులు ఇద్దరును (అపుడచట లభించిన యొక) జలకుంభమున నిలిపిరి. (దానినుండి) లోగడ చెప్పిన ముని సత్తములు వసిష్టాగస్త్యులు జనించిరి.
(మొదట బ్రహ్మ మానసపుత్తుడుగా చెప్పబడిన వసిష్ఠుడుమరల మిత్రావరుణుల కుమారుడై అగస్త్యునితో పాటు ఎట్లు జన్మించెనను ప్రశ్నకు ఈ ఉపాఖ్యానము సమాధానముగా నున్నది, ఛాందోగ్యోపనిషత్తునందు వసిష్ట పదముతో చెప్పబడిన ముఖ్య ప్రాణత త్వమునకును వసిష్ఠుడు బ్రహ్మ మానసపుత్తడనుటకును వాయుదేవుడే ఇంద్రశాపమున జలకుంభమునుండి వసిష్ఠుడుగా, పుట్టెననుటకును వేదాంత శాస్త్రానుసారము, సమన్వయము కూడ ఈ కథవలన కుదురుచున్నది. ఇదియంతయు. తత్వ విచారణ మార్గమున ఆలోచించుటచే తెలియవలసిన విషయము. పురాణములు ఇట్లు సర్వవిధ విజ్ఞానమును అందించుచున్నవి.)
పూర్వము ఒక నాడు నిమి అనురాజు తన భార్యలతో జూదమాడుచుండెను. అట్టి సమయమున బ్రహ్మ మానసపుత్రుడు వసిష్టుడచటికి పోయెను. నిమి అతనిని ఆదరించలేదు. అందుచే నీవు విదేహుడవు (దేహము లేనివాడవు) కమ్ము-అని వసిష్ఠుడు నిమిని శపించెను. నిమికూడ పసిష్టుని శపించెను. దానిచే నిమీ విదేహుడయ్యెను. వసిష్ఠుడు చేతస్సు (చిత్తవృత్తి ప్రవృత్తులు) లేనివాడయ్యెను. (ఇద్దరును ఇట్లు కావలసియుండగా శాపనాశమున కై ఇరువురును బ్రహ్మ కడకు పోయిరి. బ్రహ్మదేవుని ఆదేశమున నాటినుండి ‘నిమి’ (భూలోక జీవుల) కన్నులయందు నివసింపసాగెను. అతని విశ్రాంతి కై అప్పటినుండి మానవులు మొదలగు ప్రాణులకు నిమే(మి)షములు ఏర్పడెను. (నిమీ-శ = నిమిః శేతే ఆస్మిన్- ‘నిమి’ దీనియందు శయనించును కనుక నీమిశ -నిమేశ>నిమిష-నిమేష) (బ్రహ్మదేవుని ఆజ్గచేతనే) వసిష్ఠుడును జల కుంభమునందు చేరి లోగడ చెప్పినట్లు మిత్రావరుణుల కుమారుడయ్యెను. ఆతనితోపాటు ఆకడవనుండియే తెల్లని మేని చాయ నాలుగు బాహువులు జపమాల కమండలువు కలిగి శాంతాత్ముడగు అగస్త్య మహర్షి ఉద్భవించెను. ఆయన మలయ పర్వత భాగమున తన భార్యతోకూడి విప్రపరివృతుడయి వైఖానస (వానప్రస్థ) విధానముతో దుష్కరమగు తప మాచరింపసాగెను.
తతః కాలేన మహతా (కాలకాది) తారకాది నిపీడితమ్ ।
జగద్వీక్ష్య స కో పేన పీతవా స్వరుణాలయమ్॥
విన్ద్యవృద్దిక్షయకృతో మృత్యు రన్యో విధాయ చ ।
కాలకూటం వృథా చక్రే శ్వేత కేతో ర్న తృప్తికృత్॥
తతోఽస్య వరదా స్సర్వే బభూవు శ్శజ్కరాదయః ।
బ్రహ్మా విష్ణుశ్చ భగవాన్వరదానాయ జగ్మతు॥
వరం వృణీష్వ భద్రం తే యదభీష్టం భవే న్మునే ।
అగస్త్యః: యావద్భ్రహ్మ సహస్రాణాం పజ్ఞ్చవింశతికోటయః॥
వైమానికో భవిష్యామీ దక్షిణాచలవర్త్మని ।
మద్విమానోదయే కుర్యా ద్యః కశ్చి త్పూజనం మమ॥
స సప్తలోకాధిపతిః పర్యాయేణ భవిష్యతి ।
ఈశ్వరః: ఏవమస్త్వితి తేఽప్యుక్త్వా జగ్ము ర్దేవా యథాగతమ్॥
తస్మా దర్ఘ్య ప్రదాతవ్యో హ్యగ స్త్యస్య సదా బుధైః ।
నారదః: కథ మర్ఘ్యప్రదానంతు కర్తవ్యం తస్య వై ప్రబో॥
విధానం య దగ స్త్యస్య పూజనం తద్వదస్వ మే ।
ఈశ్వరః : ప్రత్యూషసమయే విద్వాన్కుర్యా దధ్యోదయే సతి॥
స్నానం శుక్ల తిలై స్తద్వ చ్ఛుక్లమాల్యామ్బరో గృహీ ।
స్థాపయే దవ్రణం కుమ్బం మాల్యవస్రవిభూషితమ్॥
పజ్ఞ్చరత్న సమాయుక్తం ఘృతపాత్రేణ సంయుతమ్ ।
ఆజ్గుష్ఠమాత్రం పురుషం తథైవ సౌవర్ణ మత్యాయతబాహు దణ్డమ్॥
చతుర్భుజం కుమ్బముఖే నిధాయ ధాన్యాని రత్నామ్బర నంయుతాని ।
సకాంస్యపాత్రాక్షతశు క్తియుక్తం మ న్త్రేన దద్యా ర్ద్విజపుజ్గవాయ॥
ఉత్క్షిప్య లమ్బోదర దీర్ఘ బాహు రతన్యచేతాఽ(యమదిజ్ముఖస్స) య
ముదజ్ముఖ స్సక్ ।
శ్వేతాంచ దద్యా ద్యది శక్తిర స్తి రౌప్యాం ఖురై ర్హేమముఖీం సవతామ్॥
ధేనుం తతః క్షీర వతీం ప్రణమ్య సవత్సఘణ్టాభరణాం ద్విజాయ ।
(అసప్తరాత్రోదయమూర్ద్వమస్య)ఆసప్తరాత్రా దుదయేఽర్ఘ్య మస్య దాతవ్య మేత త్సకలం నరేణ॥
యావ త్సమా స్సప్త దశాథవా స్యు రథోర్ధ్వమప్యత వద ని కేచిత్ ।
కాశపుష్పప్రతీకాశ హ్యగ్ని మారుత సమ్భవ॥
మిత్రావరుణయోః పుత్త్ర కుంభయోనే నమోఽస్తు తే ।
ప్రత్యబ్దం చ (ఫలైర్యోగమేవం)ఫలత్యాగ మేవం కుర్వన్న ముహ్యతి॥
హోమం కుర్యా తతః పశ్చా ద్వర్జయే న్మనసా ఫలమ్ ।
ఆనేన విధినా యస్తు పుమా నర్ఘ్యం నివేద యేత్॥
ఇమం లోక మవాప్నోతి రూపారోగ్యసమన్వితః ।
ద్వితీయేన భువర్లోకం స్వర్లోకంచ తతః పరమ్॥
సప్త లోకా నవాప్నోతి సప్తార్ఘ్యా న్యః ప్రయచ్ఛతి ।
ఇతి పఠతి శృణోతి వా య ఏత ద్వసుయుగళాంగ భవస్య సంప్రదానమ్॥
మతిమపిచ దదాతి సోఽపి విష్ణో ర్భవనగతః పరిపూజ్యతేఽమరౌఘైః॥
ఇతి శ్రీ మత్స్యమహాపురాణే మత్స్యమను సంవాదా న్తర్గ తేశ్వరనారదసంవాదే అగస్త్యోత్పత్తి తత్పూజాదికథనం నామైక షష్టితమోఽ ధ్యాయః ॥
ఇట్లు చాల కాలము గడచెను. ఈ అగస్త్యుడు తారకాది దానవులు జగములను పీడించుట చూచి కోపవశమున సముద్రమును త్రాగివేసెను. వింధ్య పర్వతవృద్దిని ఆటంక పరచెను. రెండవ మృత్యువును సృష్టించెను. కాలకూట విషమును వ్యర్థమయిన దానినిగా (శ క్తిహీనమగునట్లు) చేనేను. శ్వేత కేతువను నాతని చంపెను. ఇట్టి మహాకార్యములు చేసినందున సంతసించి శంకరుడు బ్రహ్మ విష్ణువు. మొదలగువారు అగస్త్యునకు వరమీయదలచివచ్చి “మునీ! నీకభీష్టమగు వర మేదియో కోరుము. ఇత్తుము.” అనిరి. అగస్త్యుడిట్లు వరము కోరెను. “ఇరువదియైదు కోట్ల సంవత్సరముల కాలము. నేను దక్షిణ (మలయ) మార్గమున వైమానికుడనై (అంతరిక్షమున వేలుగు జ్యోతిర్గోళమనై) ఉండవలయును. నావిమానము (జ్యోతీ రూపము) ఉదయించినపుడు నన్ను పూజించినవాడు క్రమముగా భూర్లోక మాది ఏడు ఊర్ధ్వ లోకములకు అధిపతి (వాటియందు సుఖించుటకు అధికారి) కావలయును.” అని కోరగా అట్లే యగునని వరమిచ్చి ఆదేవతలు వచ్చిన త్రోవను వెళ్ళిరి. కావున ఈ విషయము నెరిగి వివేకులై జనులు అగస్త్యునకు అర్ఘ్యము నీయవలెను.
ఈశ్వరు డిట్లు చెప్పగా విని నారదుడు అగస్త్యునకు ఆర్య మిచ్చుటకును పూజ సేయుటకును కల విధాన మేదో తెలుపుమని ఈశ్వరుని ప్రార్థించగా ఆ దేవు డిట్లు చెప్పెను: ప్రభాత కాలమున అగస్త్య నక్షత్రము ఉదయించు వేళ కు సంప్రదాయ మెరిగిన గృహస్థుడు నిద్ర మేల్కాంచి తెల్లని నూవులతో (నూవుపిండితో నూవులనూనెతో) స్నాన మాడ వలయును. తెల్లని పూలను వస్త్రములను ధరించవలేను. పూలను వస్త్రములను చుట్టును చుట్టి అలంకరించిన కలశమును (నీటితో నింపి) నిలిపి దానియందు పంచరత్నములను (ముత్యము పగడము మొదలగునవి) వేయవలెను. దాని దగ్గర ఒక నేతి పాత్ర ఉంచవలెను. బంగారుతో బొటన వేలంత పరిమాణము కలిగి పొడవయిన నాలుగు కాహువులుకల పురు షుని ప్రతిమ చేయించి ఆ ఘృతపాత్ర దగ్గర ఉంచవలయును. ఆ ప్రతిమతోపాటు ధాన్యములు రత్నములు నూతన వస్త్రములు కంచుపాత్రము అక్షతలు ముతైపు చిప్పలు చేర్చవలేను. ఇవన్నియు మంత్రపూర్వకముగా దానము చేయ వలెను. ఈ దానము చేయునపుడు దాత ఉత్తరాభిముఖుడై తన దీర్ఘ బాహువులను పైకెత్తవలయును. అనన్య చిత్తుడై యుండవలయును. శక్తియున్నచో తెల్లని వన్నె కలిగి వెండి గిట్టలు బంగరు మొగపుప ట్టె మెడలో గంటలు మొవ్వలు కలిగి దూడకల పాడి యావును కూడ దానము చేయవలెను. ఇట్లు అగస్త్యోదయదినము మొదలు ఏడు దినములు ఈ విధమగు దానముతోపాటు అర్ఘ్యము నగస్త్యున కీయవలయును.
ఇట్లు వరునగా పదునేడు సంవత్సరములు చేయవలయును. అంతకంటే ఎక్కువ కాలము వరకు కూడ చేయ వలయు(వచ్చు)నని కొందరందురు.
ఫలత్యాగమంత్రము: “తెల్లుపూవువంటి దేహప్రకాశము కలిగి ఆగ్ని మారుతుల వలన జనించినవాడ వై మీత్రా వరుణ దేవుల పుత్రుడవై జలకుంభమునుండి ఉత్సన్నుడవైన అగస్త్యా! నీకు నమస్కారము.”
సంప్రదాయ మెరిగి ప్రతి ఏడు ఇట్లర్యము నీయవలెను. తరువాత హోమము జరిపి మనః పూర్వకముగా ఫల త్యాగము చేయవలెను.
ఈ విధానానుసారము అగస్త్యునకు అర్ఘ్యము నగ్పించు పురుషుడు ఈ భూర్లోకమున రూపాయురారోగ్యములతో సుఖించును. తరువాత క్రమముగ భువర్లోకము మొదలగు ఊర్ధ్వలోకములను అన్ని టీని పొంది అచ్చటను సుఖించును.
అష్టవసువులలోని వారగు అగ్ని మారుతుల అంశ వలన జనించిన (వారి కుమారు డెయగు) అగస్త్యుని అర్ఘ్యదాన , విధానమును చదివిసను వినినను ఉత్తమ జ్ఞానమును పొంది విష్ణులోక మును చేరి అచట దేవతలచేత పూజల నందుకొనును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున అగస్త్యోత్పత్తి తదర్ష్య తత్పూజా విధానమును అరువది యొకటవ అధ్యాయము.
Summary of chapter 61 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya outlines the monthly constellation worship known as Māsarksha-Pūjā-Vrata, where specific Nakshatras falling on designated lunar days throughout the twelve months are dedicated to the adoration of Bhagavān Vishṇu and His various manifestations. The practitioner observes partial fasting on the prescribed star day, performs ceremonial bathing with water mixed with holy herbs, and worships the Supreme Lord with specific seasonal flowers and traditional food offerings. The Lord explains that performing this systematic monthly worship aligns human consciousness with cosmic rhythms, neutralizes astrological afflictions, ensures physical health, and bestows perpetual peace upon the practitioner's household.