188 - కావేరీ (కౌబేరీ) సంగమ మాహాత్మ్యము॥

సూతః : పృచ్ఛంతీ చ మహాత్మానో మార్కేణ్దేయం మహామునిమ్

 యుధిష్ఠిర పురోగా స్తే ఋషయశ్చ తపోధనాః

 ఆఖ్యాహి భగవం స్తథ్యం కావేరీ(కోబేరీ)సజ్గమం మహత్

లో కానాం చ హితార్థాయ అస్మాకంచ వివృద్దయే

సదా పాపరతా యే తు సదా దుష్కృతకర్మిణః

 ముచ్యన్డే సర్వపాపేభ్యో గచ్ఛత్తి పరమం పదమ్

 ఏతదిచ్ఛామ విజ్ఞాతుం భగవ న్వత్తు మర్హసి

మార్కణ్డేయః : శృణుధ్వం సహితా స్సర్వే యుధిష్ఠిరపురోగమాః

 అస్తి వీరో మహాయక్షః కుబేర స్సత్యవిక్రమః

ఇదం తీర్థ మను ప్రాప్య రాజా యక్షాధిపోభవత్

 సిద్ధిం ప్రాప్లో మహారాజ తన్మే నిగడత శ్శృణు

కావేరీ(కౌబేరీ)నర్మదా యత్ర సంగమో లోక విశ్రుత

 తత్ర స్నాత్వా శుచిర్భూత్వా కుబేర స్సత్యవిక్రమః

తపోఒతప్యత య షెస్టో దివ్యం వర్షక తం మహత్

తస్య తుష్టో మహాదేవః ప్రగాతుం వర ముత్తమమ్

భో భో యక్ష మహాస త్వ వరం బ్రూహి యథేప్సితమ్

బ్రూహి కార్యం యథేష్టంతు యత్తే మనసి వర్తతే

 కుబేరః : యది తుట్టేసి దేవేశ యది దేయో మరో మమ

ఆద్య ప్రభృతి సర్వేషాం యక్షాణా మధిపో దవే

మార్కణ్డేయః : కుబేరస్య వచ శ్ముత్వా పరితువో మహేశ్వరః

 ఏవమస్తు తతో దేవ సతైవానర ధీయత

 సోపి లబ్దవరో యక్ష శీఘం యక్ష కులం గతః

 పూజిత స్సర్వయక్షైస్తు హ్యభిషిక్తశ్చ పార్థివ

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: యుధిష్ఠిరుడు మొదలగువారును తపోధనులగు ఋషులును, మార్కండేయ మహామునిని ఇట్లడిగిరి: భగవన్ ? లోకముల హితమునకును మాకు శుభమగుటకును సదా పాపాసక్తులయి దుష్కృతము లాచరించువారు నర్వపాపనిర్ముక్తులయి పరమపదము చేరుటకును కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ మాహాత్మ్యమును మాకు చెప్పి యది తెలుప ప్రార్థించుచున్నా ము; ఆన మార్కండేయుడిట్లు చెప్పెను; యుధిష్ఠిరాదులారా! అందరును వినుడు; వీరుడును మహా విక్రమశాలియునగు కుబేరుడను మహాయకుడుండెను ఈ తీర్థము నకు వచ్చినందుననే యతడు యక్షాధి పతియయ్యెను; మహారాజా! ఆతనికి సిద్ధి కలిగిన విధము తెలి పేదను వినుము; లోక విశ్రుతమగు కావేరీ (కౌబేరీ) నర్మదా నదుల సంగమము కలచోట సత్యవిక్రముడగు కు బేరుడను ఆయన శేష్టుడు స్నానమాడి శుచియై నూరు దివ్య వత్సరముల కొలముపాటు తపమాచరించెను; ఆతని విషయమున తుష్టుడయి మహాదేవుడు ఆతనికి ఉత్తమమగు వర మీయదలచివచ్చి “మహాసత్వము (శక్తి) గల యముడా! నీ యథేప్సిత వర మేమి? నీ మనస్సునందుగల కార్యము ఏదో తేలుపుము;” అనగా కుబేరుడిట్లనెను: దేవేశా! నీవు తుష్టువయి నాకు వరమీయదలచినచో ఇది మొదలు నేను యక్షులకు అధిపతియగుదుగాక!” అనెను కుబేరుని వచనమును విని మహాదేవుడు పరితుష్టుడయి సరేయని యంతర్ధానమందెను; ఆ కుబేరుడను యక్ష, పుంగవుడును వరమంది వెంటనే యక్ష నివాసమున కేగి సర్వయకుల పూజలనందుకొని వారిచే వారికధిపతిగా అభి షిక్తుడయ్యెను;

కావేరి (కౌబేరీ) సజ్గమం తత్ర సర్వపాపప్రణాశనమ్

 యే నరా నాభిజాన స్తి వఞ్చితాస్తే న సంశయః

 తస్మా త్సర్వప్రయత్నేన త త స్నాయీత మానవః

 కావేరీ (కౌబేరీ) చ మహాపుణ్యా నర్మదాచ మహానదీ

 తత్ర స్నాత్వాతు రాజేన్హ హ్యర్చయే ద్వృషభధ్వజమ్

 అశ్వమేధఫలం ప్రాప్య రుద్రలో కే మహీయతే

 అగ్నిప్రవేశం యః కుర్యా ద్యశ్చ కుర్యా ధనాశ కమ్

 అనివర్యా గతి స్తస్య యథా మే శజురోఒబ్రవీత్

 సేవ్యమానో వర క్రీభిః క్రీడ తే దివి రుద్రవత్

 షష్టివర్ష సహస్రాణి షష్టికోట స్తథాపరాః

 మోదతే రుద్రలోక స్ట్రో యత్ర తతైవ గచ్ఛతి

 పుణ్యక్షయా త్పరిభ్రష్ణోరాజా భవతి ధార్మికః

భోగవా స్థానశీలశ్చ మహాకులసముద్భవః

 తత్ర పీత్వా జలం సమ్య క్చాన్గాయణఫలం లభేత్

స్వర్గం గచ్ఛత్తి తే మర్త్యా యే పిబ ని జలం శుభమ్

గజ్జాయమునయో ర్మధ్యే యత్ఫలం ప్రాప్నుయా న్నరః

కావేరీ (కౌబేరీ) సజమే స్నాత్వా తత్ఫలు తస్య జాయతే

 ఏవం తు తత్ర రాజేంద్ర కౌబేరీసమం మహత్

పుణ్యం మహత్పలం తత్ర సర్వపాపప్రణాశనమ్

  ఇతి శ్రీమత్స్యమహాపురాణే నర్మదామాహాత్మ్యే కావేరీ(కౌబేరీ) సజ్గమమహిమాను

వర్ణనం నామ అష్టాశీత్యుత్తరశతతమోధ్యాయః

ఇట్టి సర్వపాప ప్రణాశ కమగు కావేరీ (కౌబేరీ) సంగమము నేరుగనివారు జీవితమున వంచితులయిన టై; కావున నిది ఎరిగి మానవుడందు సా నమాడవలయును; కావేరీ (కౌబేరీ) నర్మదలు రెండును మహాపుణ్య ప్రదములగు మహా నదులే; పాటి సంగమమందు సర్వ ప్రయత్నములతో స్నానమాడి వృషభధ్వజునర్చించినచో అశ్వమేధ ఫల మంది రుద్ర లోకమున పూజితుడయి సుఖించును; అచ్చట అగ్ని ప్రవేశముతో గాని ప్రాయోపవేశముతోగాని దేహత్యాగము చేసినచో పునరావృతి రహిత గతినందును; ఉత్తమ స్త్రీల పరిచర్యలందుకొనుచు ద్యులోకమున రుద్రునివలే సుఖించును; రుద్ర లోకమునందు నివసించుచు కోరిన చోటి కెల్ల పోవుచు సంచరించుచు ఆరువది కోట్ల అరువది వేల సంవత్సరములు రుద్ర లోకమందుండి సుఖించును; పుణ్యక్షయానంతరము రుద్రలోక మునుండి భ్రంశమునందిపడినను ధార్మి కుడు భోగవంతుడు దాన శీలుడు మహావంశ సంజాతుడునగు రాజగును; అచటి జలమును త్రాగినచో చాంద్రాయణ వ్రతమాచరించిన ఫలము లభించును; స్వర్గ ప్రాప్తియగును; కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ స్నానముచే గంగా యమునా సంగమ స్నాన ఫలము లభించును; రాజేంద్రా! కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ మహ త్వము ఇట్టిది; ఇది పుణ్య కరము; మహా ఫలప్రదము; సర్వపాప ప్రణాశనకరము

ఇది శ్రీమత్స్య మహా పురాణ మున నర్మదా మాహాత్మ్యమున కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ మహిమాను వర్ణ నమను నూట డెబ్బది ఎనిమిదవ యధ్యాయము