49 - పూరువంశము  

సూత : పూరోః పుత్రో మహాతేజా రాజాసీ జ్జనమేజయః  

ప్రాచీన్వత స్సుత స్తస్య యః ప్రాచీ మకరోద్దిశమ్

 ప్రాచీన్వతసుతశ్చాపి మనస్యుశ్చ తతోభవత్

 రాజా వాతా యుధో నామ మనస్యో రభవ త్సుతః 

 *దాయాద స్తస్య చాప్యానీ చ్ఛజ్కుర్నామ మహీపతిః

శజ్కో (దుందోర్బహువిదః) ర్బహువిదః పుత్ర స్సమ్పాతి స్తస్య చాత్మజః

 సమ్పాతేస్తు (సమ్యాతేస్తు) హ్యహంపొది ర్భద్రాశ్వ స్తస్య చాత్మజః

 భద్రాశ్వస్యఘృతాచ్యాంతు దశాప్సరసి సూనవః

ఋ చేపుశ్చ విలేపుశ్చ క షేపుశ్చ తథైవచ

 ఘృతేపుశ్చ విచేపుశ్చ స్థట్టిలేపు ర్బలేపుచ(శ్చ)

 ధర్మేపు స్స నతేపుశ్చ పుణ్యేపు శ్చేతి వై దశ

 ఋచేపోర్జ్వలనా నామ భార్యాపై తక్షకాత్మజా

 తస్యాం సజ్జనయామాస అనివారం మహీపతిః

 ఆ నినారో మనస్విన్యాం పుత్తా న్షన్డే వరానుభాక్

 అంశుం నరపతిం వీరం హనుం చాపి ధార్మికమ్

గౌరీ కన్యా తృతీయాచ మాన్దాతు ర్జననీ శుభా

 ఆసీ దంశోరథ సతీ యాస్మాత్ పుత్తా నజ్జనత్

 బ్రహ్మవాదపరీతాంస్తు ఉవదానా తథా పచ

 ఉవదానా సుతా నైభే చతురస్తు నిజాత్మజాక్

 రుష్య న మథదుష్య నం ప్రవీర మనఘం తథా

 చక్రవర్తీ తతో జజై దుష్యన్త త్సమితిజ్ఞుయః

శకు నలాయాం భరతో యస్య నామ్నా తు భారతాః

 దుష్య నం ప్రతి రాజానం పొగువాచాశ రీరిణీ

మాతా భస్త్రి పితుః పుత్రో యేన జాత స్స ఏవ సః

 భరస్వ పుత్తం దుష్య న సత్య మాహ శకు స్తలా

 రేతోధా స్రాయతే పుత్తః పరేతంచ యమక్షయాత్

 త్వం చాస్య ధాతా గర్భస్య నావమంస్థా శ్శకు నలామ్

 భరతస్య విన షేషు తనయేషు పురా కిల

పుత్రాణాం మాతృకో పేన యుగప త్సంక్షయే కృతే

తతో మరుద్భి రానీయ పుత్ర స్స తు బృహస్పతేః

 సజ్కామితో భరద్వాజో మరుద్బి ర్భర తస్య చ

(*దాయదస్తన్యచాప్యాసీద్దూందుర్నామ.)   

       ఈ విషయమున వివరణము అనుబందములో చూడుడు

సూతుడు పూరువంశ వృత్తాంతమును ఋషులకు ఇట్లు చేప్పెను: పూరునకు జనమేజయుడు అతనికి తూర్పు దెస నంతటిని పాలించిన ప్రాచీన్వతుడు అతనికి మనస్యుడు అతనికి వాతాయుధుడు - అతనికి శంకుడు అతనికి బహు విదుడు అతనికి సంపాతి అతనికి అహంవాది అతనికి భద్రాశ్వుడు అతనికి ఘృతాచియను అప్పరసయందు ఋచేపు విలేపు క షేపు ఘృతేపు విచేపు స్థండిలేపు బలేపు ధర్మేపు సంతతేపు. పుణ్యేపులను పదిమంది కుమారులు. వీరిలో ఋచేపునకు తక్షక పుతియగు ,జ్వలనయందు అంతీకారుడు ఆతనికి మనస్వినీ అను భార్యయందు వీరుడగు అంశుడను నరపతియు ధార్మికు డగు శ్రీహనుడును గౌరియను కన్యయు కలిగిరి. ఈ గౌరి మాంధాతృని తల్లి యయ్యెను. అంశునకు ఉపదా నయను పత్ని యందు బ్రహ్మవిదులగు రుష్యంతుడు దుష్యంతుడు ప్రవీరుడు ఆనఘుడు అను కుమారులు కలిగిరి. అతనికి యుద్ధ విజయయగు భరతుడు అను . చక్రవర్తి కలిగెను. ఈతని పేరుననే ఈ వంశము వారికి భారతులను పేరు వచ్చెను. శకుంతల ఈతని తల్లి. శకుంతలను దుష్యంతుడు తిరస్కరించినపుడు) అశరీర వాణి దుష్యంతుని ఉద్దేశించి 'ఇట్లనెను: “దుష్యంతా:- తల్లి వస్తువులను దాచు.) తోలుతిత్తి వంటిది. కుమారుడు తండ్రికి చెందినవాడు. అతడు. తాను ఎవరివలన పునో అత డే. కాని వేరు కాదు. కనుక- కుమారుని వదలుట తన్ను తాను వదలుకొనుటయే యగును. కనుక “నీవు ఈ కుమారుని భరించుము. శకుంతల సత్యమే చెప్పినది. తనకు జన్మకారణముగా 'రేతస్సును (శుక్రమును-గర్భమును) నిలి పిన తండ్రిని యమలోకమునందలి బాధలనుండి సుతుడు కాపాడును..దుష్యంతో! (శకుంతలయందు) గర్బము. నిలిపిన వాడవు నీవు. ఈ శకుంతలను అవమానించకుము." (ఈతనిని భరించుము.  అని చెప్పబడినవాడు కనుక భరతుడు.)

పూర్వము భరతుని కుమారులు తమ తల్లి కోపమునకు గురియై ఒకేమారు అందరును నశించగా మరుత్తులు (దేవతలు) బృహస్పతి పుత్రుడగు భర ద్వాజుని ఈ భరతునికి పుత్రునిగా సంక్రమిం పజేసిరి.

భరద్వాజోత్పత్తి సత్స నతిశ్చ

ఋషయః: భరతస్య భరద్వాజః పుత్తార్థం మారుతైః కథమ్

 సజ్కామితో మహాతేజా స్తన్నో బ్రూహి యథాతథమ్

సూతః: పత్న్యా మాసన్న సత్త్వాయా ముచధ్యే సంస్థితే భువి

 భ్రాతు ర్భార్యాం స దృష్ట్వా తు బృహస్పతి రువాచ తమ్

ఉపతిష్ట స్వలజృత్య మైథునాయచ మే శుభేః

 వినయో నోపదేష్టవ్య స్వయా మే వరవర్షిని!

 ఏవ ముక్తాఒబవీ దేన మ నర్వత్నీ త్వహం ప్రభో

గర్భః పరిణతశ్చాయం బ్రహ్మ వ్యాహరతే గిరా

అమోఘ రేతా స్వంచాపి ధర్మం చైవం విగర్హి తమ్

 ఏవముక్తోబ్రవీ దేనాం స్వయమేవ బృహస్పతిః

నోపదేష్టవ్యో వినయ స్వయా మే వరవర్జిని

 కరమాణః ప్రస్యనాం మైథునాయోపచక మే

తతో బృహస్పతిం గర్బో ధరమాణ ఉవాచహ

 సన్ని విష్ణో హ్యహం పూర్వ మిహ తావ ద్బృహస్పతే

 అమోఘ రేతా స్వం తాత నావకాశ ఇహ ద్వయోః

ఏవ మ క స గర్బేణ కుపితః ప్రత్యువాచ హ

బృహస్పతిః: యస్మా త్వ మీదృశే కాలే సర్వభూతహితే సతి 

ప్రతి షేధసి యస్మా త్వం తమో దీర్ఘం ప్రవేక్ష్యసి

 తతః కామం సన్నివృత్య తస్యానన్దం బృహస్పతికి

 తత స్వపత ద్భూమౌ నివృత్తం శిశువోభవత్

సద్యోజాతం కుమారం తు దృష్ట్వా తం మమతాబ్రవీత్

 గమిష్యామి గృహం స్వం వైభర స్వైనం బృహస్పతే

ఏవ ముక్త్వా *గతాయాంతు పిత్రా త్యాగీకృతోప్యసౌ

 మాతాపితృభ్యాం త్యక్తంతు దృష్ట్వా తం మరుత శ్శితమ్  

జగృహు స్తే భరద్వాజం మరుతః కృపయాన్వితాః

 తస్మి నారేతు భరతో బహుభిః క్రతుభి ర్విభుః

 కామ్య నైమిత్తికై ర్యజై రయజ తులిప్సయా

 యతస్స యజమానస్తు పుత్తం నాసాదయ తభుః

తతః క్రతుం మరుతోమం పుత్తార్థం సముపాహరత్

 తేన తే మరుత స్తస్య మరుత్తో మేన తుష్టువుః

ఉపనిన్యు ర్భరద్వాజం వుత్తార్థం భరతాయ వై

 దాయాదోజ్గిరస స్పూనో రౌర సస్తు బృహస్పతేః

సజ్క్రామితో భరద్వాజో మరుద్భి ర్భరతం ప్రతి

(*గతా సా తు గతాయం సోపి తం త్యజత్)

ఋషులు నూతు నిట్లు ప్రశ్నించిరి: “మారుతులు భరతునికి పుత్రునిగా భరద్వాజు నెట్లు సంక్రమింపజేసిరో తెలుప వేడెదము.”

సూతు డిట్లు చెప్పెను: ఉతచధ్యుడు తన భార్య మమత గర్భవతిగా ఉండగా మరణించెను. అతని తమ్ముడు బృహస్పతి మమతను చూచి "సుందరీ! నీవు చక్కగా అలంకరించుకొని నాతో కలియుటకు సిద్దవు కమ్ము. నీవు నా కేమియు కట్టుబాటు మాటలు (నీతులు) నేర్పవలదు." అనేను. మమత “ప్రభూ! నేను గర్భవతిని. గర్భము పరిణతమయి (ప్రసవము నకు సిద్ధమయి) యున్నది. ఆ శిశువు వేదమును చెప్పుచున్నది. నీవును వ్యర్థముకాని, వీర్యము కలవాడవు. ఇటువంటి ధర్మము నిందిత మయినది.” అనెను. కాని “నీవు నాకు సత్పవర్తనము నుపదేశించ నక్కరలేదు.” అని బృహస్పతి ఆమెను బలవంతముగా లాగి మైథునము నారంభించెను. అంతట గర్బము (శిశువు) బృహస్పతిని మందలించుచు “బృహస్పతీ! నేను ముందుగా ఇక్కడ ప్రవేశించితిని. నీవును అమోఘ రేతస్కుడవు. ఇక్కడ ఇద్దరకు తావు లేదు.” ఆనెను. శిశువుతో బృహస్పతి “సర్వభూతములకు (ఆనందకర) హితకరమగు ఇటువంటి సమయమున నన్ను ని షేధించి తివి. కావున దీరమగు తమస్సును (గుడ్డితనమును) ప్రవేశింతువు.” అనెను. అంతట అతడు తన కామమును ఆనంద మును కూడ మరలించుకొనెను. ఆతని వీర్యము భూమి పై పడి వెంటనే శిశువయ్యెను. సద్యోజాతుడగు (వెంటనే పుట్టిన) ఆ శిశువును చూచి మమత బృహస్పతితో “నేను నా ఇంటికి పోవుచున్నాను. వీనిని భరించుము.” అని పోయెను. బృహ సృతియు ఆ శిశువును వదలిపోయెను. ఇట్లు తల్లిదండ్రు లిద్దరును వదలిన శిశువును చూచి మరుత్తులు జాలి చెంది తీసి కొనిరి. వాయువులచే భరింపబడినందున అతడు భరద్వాజుడనబడెను. (భరత్-వాయు భరత్-వాజు> భరద్వాజ) ఆ కాలమునందే భరతుడు పుత్రులను కోరి కామ్యములును నైమిత్తిక ములు నగు యజ్ఞములతో దేవతల నారాధించెను. కాని అతనికి సంతతి కలుగలేదు. అంతట నతడు 'మరుత్తోమము' అను యజ్ఞము నాచరించి దానియం దతడు మరుత్తులను స్తుతించెను. దానికి ప్రీతులై వారు భరద్వాజుని తెచ్చి భరతునకు పుత్రునిగా ఇచ్చిరి. ఇతడు ఇట్లు వాస్తవమున ఆంగిరః పుత్తడగు బృహస్పతికి కుమారుడు.

భరతస్తు భరద్వాజం పుత్తం ప్రాప్య తతోబ్రవీత్

ఆదాయ త్వాం హితార్థాయ కృతార్ధ్రోహం త్వయా విభో

 పూర్వంతు వితథే తస్మి నృతే వై పుత్త్రజన్మని

 తత స్త్వవితథో నామ భరద్వాజో నృపోభవత్

తస్మా దేవ భరద్వాజా దాహ్మణాః క్షత్రియా భువి

ద్వ్యాముషాయణకౌలీనా స్మృతాస్తు ద్వివిధా హి తే

 తతో జాతే ఒప్యవితథే భర తోపి వనం(దీవం)  య

 భరద్వాజాభిధం పుత్త మభిషిద్య చ తం నృపః

 దాయాదేవితథ స్యాభూ దృవమన్యు ర్మహాయశాః

మహాభూతోపమాః పుత్తాశ్చత్వారో భవమన్యవః

 బృహత్తత్రో మహావీర్యో నరో -గర్గశ్చ వీర్యవాన్

 నరస్య సజ్కృతిః పుత్ర స్తస్య పుత్రో మహాయశాః

 గురుశ్చ ర గ్రిదేవశ్చ సాజ్కృతే స్తావుభౌ స్మృతౌ

 గర్గస్య చైవ దాయాద శ్శిబి ర్విద్వా న్బభూవహ

 స్మృతా శైబ్య సతో గర్గ్యాః క్షతో పేతా ద్విజాతయః

 ఆహార్యతనయ శ్చైవ ధీమా నాసీ త్తర క్షకః

 తస్య భార్యా విశాలాతు సుషువే పుత్రోకత్రయమ్

 త్యూషణం పుష్కరం చైవ కవిం చైవ మహాయశాః

 తరక్షుక సుతా హ్యేతే సర్వే బ్రాహ్మణతాం గతాః

 కావ్యానాంతు సుతా హ్యేతే త్రయః ప్రోక్తా మహర్షయః

 గర్గాస్సజ్కృతయః కావ్యాః క్షతో పేతా ద్విజాతయః

 సంవృతాజ్ఞిరసః పుత్రో బృహత్ క్షత్రశ్చ వశ్యతే

బృహత్ క్ష త్తస్య దాయాదో హ స్త్రీ నామ బభూవ హ

 యేనేదం నిర్మితం పూర్వం పురంతు గజసాహ్వయమ్

 హ సినశ్చాపి దాయాదా శ్రయః పరమకీ ర్తయః

 అజామీళో వ్యుమీడశ్చ పురుమీఢ స్తథైవ చ

 అజామీఢస్య భార్యాస్తు తిస్రః క న్యాః కులోద్వహాః

 నీలినీ ధూమినీ చైవ కేశినీ చైవ విశ్రుతాః

 స తాసు జనయామాస పుత్త్రా న్వై దేవవర్చసః

 తపసోంతే సుమహతో జాతా వృద్ధస్య ధార్మికాః 

తనకు పుతుడుగా లభించిన భరద్వాజునితో భరతుడు “విభూ! నాకు హితకరుడవగు నీవు లభించుటచే కృతార్థుడ నయితిని.” అని అతనిని ప్రశంసించెను. తనకు కుమారులు కలుగుట వితథము (వ్యర్థము-అసత్యము) అయి ఉన్నప్పుడులభించినందున భరత, డీతనికి అవితథుడు (అసత్యము కానివాడు) అని పేరుంచి అతనిని తన రాజ్యమున పట్టాభిషిక్తుని చేసి తాను వనమునకు పోయెను. *ద్వ్యాముషాయణుడగు ఈ భరద్వాజుని వంశ మున పుట్టినవారు కొందరు బ్రాహ్మణులును మరికొందరు క్షత్రియులు - ఇట్లు రెండు విధములవారు లేదా ఈ రెండు జాతుల ధర్మముల ననుసరించువారు) జనించిరి.

 ఈ అవితథుని కుమారుడు భవమన్యుడు. అతనికి వాయ్వాది మహాభూతములతో తుల్యులగు నలుగురు కుమారులు బృహతతుడు మహావీర్యుడు నరుడు గర్గుడు అనువారు కలిగిరి. నరునకు సంకృతి అతనికి గురుడు రంతిదేవుడు కుమా రులు. ఈ గర్గుని కుమారుడు విద్వాంసుడగు శిబి. ఇతని కుమారులు శైబ్యులు గార్డులు అను పేరున క్షత్రియ ధర్మము పాటించు బ్రాహ్మణు లయిరి. వీరిలో ఆహార్యునికి తరకుకుడు ఆతనికి విశాల అను భార్యయందు త్ర్యూషణుడు పుష్క రుడు కవి అనువారు కలిగి బ్రాహ్మణు లయిరి. కొవ్యులు అను పేర ప్రసిద్దులలో ఈ మువ్వురును మహర్షు లయిరి. గర్గులు సంకృతులు కావ్యులు వీరందరును క్షత్రధర్మముతో వర్తించు బ్రాహ్మణులు. వీరిలో సంవృతాంగిరుడు అను నతని కుమారుడు బృహత్ క్షత్తుడు. అతని కుమారుడు హస్తి. అతని పేరుతోనే హస్తినాపురము నిర్మితమయ్యెను. ఇతనికి అజామీఢుడు వ్యుమీడుడు పురుమీఢుడు ఆను ముగ్గురు కుమారులు. అతనికి వంశోద్దారక లగు నీలిని భూమిని కేశిని అను ముగ్గురు భార్యలు. అతడు మహాతపస్సు చేసి తన వార్ధకమున భరద్వాజుని అనుగ్రహమున దేవవర్చసులగు ముగ్గురు కుమారులను పొందెను.

(*ఒకరికి జన్మించి మరొకరికి దత్తుడై కాని మరొక హేతువుచే కాని ఇద్దరు తండ్రులకు కుమారుడుగా ఐన ఒకే వ్యక్తి.)

భరద్వాజప్రసాదేన విస్తరం తేషు మే శృణు

 అజామీఢస్య కేశిన్యాం కణ్వ స్సమభవతిల

 మేధాతిథి స్సుత, స్తస్య తస్మా త్కాణ్వాయనా ద్విజాః

 అజామీఢస్య ధూమిన్యాం బృహద్వా నభవ న్నృపః

 బృహద్బృహద్వతః పుత్రో బృహతశ్చ బృహన్మనాః

బృహన్మన స్పుతశ్చాపి బృహద్దను రితి స్మృతః

 బృహద్దనోర్ బృహదిషుః పుత్ర స్తస్య జయద్రథః

 అశ్వజి తనయ స్తస్య సేనజి త్తస్యచాత్మజః

 అథ సేనజితః పుత్తా శ్చత్వారో లోకవి శుత్రాః

 రుచిరాశ్వశ్చ తవ్యశ్చ రాజా దృఢరథ, స్తథా

 వత్స శ్చావ నికో రాజా యస్య తే పరివర్తకాః

 రుచిరాశ్వస్య దాయాదః పృథు సేనో మహాయశాః

 పృథు సేనస్య పారస్తు పారా న్ని పోథ జజ్జీవాక్

 నీప స్యైకశతం చాసీ తుత్తాణా మమితాజసామ్

 నీపా ఇతి సమాఖ్యాతా రాజాన స్సర్వ ఏవ తే

 తేషాం వంశకర శీమా న్నీ పానాం కీర్తివర్ధన

 కాశ్యప(కావ్యశ్చ)  స్సమరో నామ సచేష్టసమరోభవత్

 సమరస్య  చరో భాను సుదర్శ ఇతి(వరఃపారస్సదశ్వ ఇతి) తే త్రయః

 పుత్తా స్సర్వగుణోపేతా పారపుత్రః పృథుర్భవః

 పృథోస్తు సువతోనామ సువ్రతే నేహ కర్మణా

 జజ్ఞే సర్వగుణో పేతో విభాజ స్తస్య చాత్మజః

విభ్రాజస్య తు దాయాద స్వణుహో నామ వీర్యవాక్

 బభూవ శుక జామాతా కృత్వాభర్తా మహాయశాః

అణుహస్య తు దాయాదో బ్రహ్మదతో మహీపతిః

 యుగదత్త స్సుత స్తస్య విష్వక్సేనో మహాయశాః

 విభాజః పున రాజాత స్సుకృతేనేహ కర్మణా

 విష్వక్సేనస్య పుస్తు ఉద క్సేనో బభూవ హ

 పాల్యాయ స్తస్య పుత్తస్తు తస్యాసీ జ్జనమేజయః

 ఉగ్రాయుధేన తస్యార్థే సర్వే నీపాః ప్రణాశితాః

వీరి వంశ విస్తరమును చెప్పెదను వినుడు: అజమీడునకు కేశినియందు కణ్వుడు అతనికి మేధాతిథి కుమారు లయిరి. వీరికి కాణ్వాయనులని వ్యవహారము.

ఈ అజమీడునకు ధూమినియందు బృహద్వాన్ అతనికి బృహత్ - అతనికి బృహన్మనసుడు అతనికి బృహ : ధనువు అతనికి బృహదిషుడు అతనికి జయద్రథుడు. అతనికి అశ్వజిత్ అతనికి సేనజిత్ అతనికి రుచిరాశ్వుడు కావ్యుడు దృఢరథుడు అవ ని జనపద రాజగు వకుడు అను నలుగురు కుమారులయిరి. రుచిరాశ్వునకు - పృథు సేనుడు అతనికి " పొరుడు అతనికి నీపుడు అతనికి నూటొక్కమంది కుమారులు కలిగిరి. వీరిలో సమరుడు అను నతడు నీపుల వంశమును కీర్తిని వృద్ధి చేయు వాడయ్యెను. అతనికి చరుడు భానుడు సుదర్శుడు కలిగిరి. పారునకు పృథుడు అతనికి సువ్రతుడు ఆత, నికి విశ్రాజుడు ఆతనికి శుకుని అల్లుడును కృత్వా అను నామెకు భర్తయు అగు' అణుహుడు అతనికి బ్రహ్మదత్తుడు అతనికి యుగదత్తుడు. అతనికి. విష్వక్సేనుడు కలిగిరి. ఇతడు సుకృతవశమున మరల జన్మించిన విభోజుడు" అని. కీర్తి పొందెను. విష్వక్సేనునకు ఉద క్సేనుడు అతనికి పాలాయనుడు అతనికి జనమేజయుడు. కలిగెను. - ఇతని నిమి త్తమయి ఉగ్రాయు ధుడు , అనునతడు నీపులనందరను నశింపజేసెను.

 ఋషయః : ఉగ్రాయుధః కన్య సుతః కస్య వంశే చ కథ్యతే

 కిమర్థం తేన తే నీపా సర్వే వై సమ్పణాశితాః

సూతః : ఉగ్రాయుధ సూర్యవంశ్య స్తవ స్తే పే వరాశ్రమే

 స్థాణుభూతోబ్దసాహస్రం తం భోజే జనమేజయః

 తస్య రాజ్యం ప్రతి శుక్య నీపానాం జగ్మివానభుః,

ఉవాచ సాన్వం వివిధం జఘ్న తు స్తే హ్యుభావపి

హన్యమానా గతా నో చే గ్యస్మార్టేతో ర్న మే వచః

 శరణాగతదీక్షార్థం తస్మా దేవ శపామి వః

 యది మే స్త్రీ తప స్త ప్తం సర్వాన్తకకర్యమః

 తత స్వాకృష్యమాణాస్తు యమేన పురత స్తథా

కృపయా పరయావిష్ణో జనమేజయ మూచివా

 అజానతా నిమా న్వీరాం స్త న్మే ర క్షితు మర్హసి

జనమేజయః : అరే పాపా దురాచారా భవితారో ఒస్య కిజరాః

 తథోత్యు క స్తతో రాజా యమేన యుయుధ్ చిరమ్

 వ్యాధిభి రార కైః పావై ర్య మేన సహ తా న్బలాత్

విజిత్య మునయే ప్రాదా తదద్భుత మివాభవత్

 యమస్తుష్ట స్తత స్తస్మై ము క్రిజ్ఞానం దదౌ వరమ్

 సర్వే యథోచితం స్మృత్వా జగ్ము స్తే కృష్ణ మవ్యయమ్

ఏషాం తు చరితం గృహ్య హన్యతే నాపమృత్యు భిః

 ఇహలోకే పరేచైవ సుఖ మక్షయ మశ్నుతే

 అజామీఢస్య నీలిన్యాం విద్వా జ్ఞాజై యవీనరః

 ధృతిమాం స్తస్య పుత్ర స్తు తస్య సత్యధృతి స్మృతః

అథ సత్యధృతేః పుత్రో దృఢనేమిః ప్రతాపవాక్

దృఢనే మేసుతశ్చాపి సుధర్మా నామ పార్థివః

 ఆసీ త్సుధర్మతనయ సార్వభౌమః ప్రతాపవాక్:

 సార్వభౌమేతివిఖ్యాతః పృథివ్యా మేకరా డ్బలీ

 తస్యా న్వవాయే మహతి మహాపౌరవనన్దనః

 మహాపౌరవపుత్తస్తు రాజా రుక్మరథ స్మృతః

 అథ రుక్మరథస్యాపి సుపార్శ్వేనామ పార్థివః

 సుపార్శ్వతనయశ్చాపి సుమతిర్నామ ధార్మికః

 సుమతేరపి ధర్మాత్మా రాజా సన్న తిమానపి

తస్యాపి సన్న తిమతః కృతోనామ సుతో మహాక్

హిరణ్యనాభిన శ్శిష్యః కౌసల్యస్య మహాత్మనః

 చతుర్విరింశతిధా యేన ప్రోక్తా స్తా స్సామ సంహితాః

 సుతా స్తే ప్రాచ్యసామానః కార్తి ర్నా మేహ సామగః

 కార్తె రౌగ్రాయుధస్యాసౌ మహాపౌరవవర్దనః

 విజితో యేన విక్రమ్య వృష స్తస్య పితామహః

 నీలో నామ మహారాజా పాశ్చాలాధిపతి ర్బలీ

 ఉగ్రాయుధస్య దాయాదః క్షేమ్యా నామ మహాయశాః

 క్షేమ్యాత్సునీథ స్పంజజ్ఞే సునీథస్య నృపఞ్జయః

నృపఞ్జయాశ్చ విర థా ఇత్యేతే పౌర స్మృతాః

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే చంద్రదవంశానువర్ణ నే పూరువంశ  కథనం నా మైకోన పఞ్చాశోధ్యాయః

 ఋషులు ఇట్లడిగిరి: “ఉగ్రాయుధుడు ఏ వంశమున ఎవరి కుమారుడై జన్మించెను? ఏల అతడు నీపుల నంద రను నశింపజేసెను?”

సూతుడు ఇట్లు చెప్పేను: ఉగ్రాయుధుడు సూర్యవంశజుడు. అతడు ఉత్తమమగు ఆశ్రమమున స్థాణు భూతు డై (కొయ్యవలే కదలక) వేయి ఏండ్లు తపస్సు చేసెను. నీవవంశీయుడగు జనమేజయుడు ఇతనిని తనకు కుమారుడగునట్లు వేడు కొని తన నీవవంశ రాజ్యము నతని కిత్తునని వాగ్దానము చేసెను. ఇందులకు ప్రతికూలత చూపవలదని అతడు నీపు లను మంచినూటలతో బ్రతిమాలి తాను వనమునకు పోయేను కాని నీపులు ఊరకుండక ఈ ఉగ్రాయుధ జనమేజయుల నిద్దరను చంపవచ్చిం-కొట్టసాగిరి. అపుడు ఉగ్రాయుధుడు వారితో “మీరు అకారణముగా మమ్ములను చంపుచున్నారు. ఈ జనమేజయుడు నన్ను ఆశ్రయించినవాడు. అతనిని కాపాడదలచి చెప్పుచున్న నా మాట విని ఇతనిని.జనమేజయుని ఏడు “వుడు.” అనెను. 'పొ రదీ వినలేదు. అంతట - అతడు “మీరు నా మాట వినుటలేదు. కావున మిమ్ములను శపించుచున్నాను.  నేను చేసిన తపః ఫలము ఏమయిన ఉన్న చో యముడు మిమ్ముల నందర నశింపజేయుగాక ?” అనెను. వెంటనే వారి నందరను యముడు ముందునకు లాగికొని పోసాగేను. అది చూచి జాలిపడి ఉగ్రాయుధుడు “వీరు తెలియనివారు. ఈ వీరులు నా వారుగా భావించి వీరిని రక్షింప వేడుచున్నా ను." ఆని జనమేజయునితో పలికెను. వెంటనే జనమేజయుడు యమకింకరు లతో “పాపులగు దురాచారులారా! మీరు ఈ ఉగ్రాయుధునకు కింకరులు కండు.” అని చెప్పి కింకరులగు వ్యాధులు నార కీయులగు పొపులు మొదలగు వారితోపాటుగా యమునితో పోరాడి వారి నందరను జయించి ఉగ్రాయుధునకు అప్ప గించెను. అది చాల ఆశ్చర్యకరమగు విషయముగా నయ్యెను.

జనమేజయుని శక్తికి మెచ్చి యముడు అతనికి ము క్రీజ్ఞానమును వరముగా నిచ్చెను. తత్ఫలితముగా అంద రును తగినట్లు ధ్యానమును పూని అవ్యయుడగు కృష్ణుని చేరిరి. ( మోక్షము పొందిరి.)

 ఈ ఉగ్రాయుధ జనమేజయ నీపుల ఆఖ్యానమును గ్రహించినవారు అపమృత్యువు పాలు గారు. ఇహపర సుఖ ముల నందుదురు.

అజామీఢునకు నీలినీయందు యవీరుడు అతనికి ధృతిమాన్ అతనికి సత్యధృతి అతనికి దృఢనేమి అతనికి సుధర్మన్ ఆతనికి సార్వభౌముడు (ఇది ఇతని బిరుద నామము) అతని వంశమున మహాపౌరపుడు (ఇది ఇతని బిరుద నామము) అతనికి రుక్మరథుడు అతనికి సుపార్శ్వుడు అతనికి సుమతి అతనికి సన్న తిమాన్ అతనికి కృతుడు కలిగిరి. ఇతడు కోసల దేశీయుడు మహాత్ముడు నగు హిరణ్యనాభిన్ అను మునికి శిష్యుడై సామ సంహితలను ఇరువది నాలుగు శాఖాభేదములతో ప్రవచించెను. ఆతని కుమారులకు ప్రాచ్యసామన్'లు అని ప్రసిద్ధి. వారిలో కార్తి అను నాతడు ప్రసి దుడు. ఆతనికి ఉగ్రాయుధుడు. ఈతనికి మహాపౌరవవర్గ నుడు అని బిరుద నామము-(పూరువంశము వృద్ధి చేయువారిలో చాల గొప్పవాడు అని అర్థము.) ఈతడు తన విక్రమముతో పాంచాలాధిపతియు బలశాలియు వృషస్తుడు అను ప్రసిద్ధ రాజునకు పితామహుడు నగు నీలుడు అను నతనిని ఓడించి ఈ బిరుదము నందెను. ఇతనికి క్షేమ్యుడు ఇతనికి సుస్టీథుడు అతనికి నృపంజయుడు కలిగేను. ఇతని వంశీయులకు నృపంజయులు అనియు విరథులు అనియు ప్రసిద్ధి. ఇది పౌరవవంశము.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున పూరువంశ వర్ణనము అను నలువది తొమ్మిదవ అధ్యాయము.