209 - యముడు సత్యవంతుని సూక్ష్మ దేహము కొనిపోవుట - సావిత్రీయమ-సంవాదము.

 శ్రీమత్స్యః : తస్య పాటయతః కాష్ఠం జజ్ఞే శిరసి వేదనా

స వేద నార్త స్సజ్గస్యు భార్యాం వచన మబ్రవీత్

 ఆయా సేన మమానేన జాతా శిరసి వేదనా

 తమశ్చ ప్రవిశామీవ న చ జానామి కిడ్చాన

త్వదుత్సజ్గే శిరః కృత్వా స్వపు మిచ్ఛామి సాంప్రతమ్

రాజపు శ్రీ మేవ ము క్త్వా తదా సుష్వాప పార్థివః 

తదుత్సణే శిరః కృత్వా నిద్రయాఒ విలలోచనః

సత్యవతః ప్రాణహరణార్థం సావిత్ర్యాస్సమమే యమాగమనమ్

 పతివ్రతా మహాభాగా తత స్సా రాజకన్యకా

 దదర్శ ధర్మరాజం తు స్వయం తం దేశ మాగతమ్

 నీలోత్పలదళ శ్యామం పీతామ్బరధరం ప్రభుమ్ 

విద్యుల్లతానిబద్ధాజ్ఞం సత్య మివ తోయదమ్

కిరీ టేనారవర్లైన కుణ్ణలాభ్యాం విరాజితమ్

హార భారార్పీతోరస్కం విచిత్రాద భూషితమ్

మహతా పరివారేణ కాలేన సహ మృత్యునా

స తు సమాప్య తం దేశం దేహా త్సత్యవత స్తదా

ఆజ్ఞుష్ఠమాత్రం పురుషం పాశ బద్(దబంధ)వశం గతమ్

 ఆకృష్య దక్షిణా మాశాం ప్రయయౌ సత్వరం తదా

 సావిత్ర్యపి వరారోహా దృష్ట్వా తం గతజీవితమ్

 ఆ అనువవ్రాజ గచ్ఛంతం ధర్మరాజ మతంద్రితా

కృతాఞ్జలి రువాచాథ హృదయేన ప్రవేపతా

మత్యుడు మనువుతో ఇట్లు చెప్పెను: కట్టెలు కొట్టు చుండగా సత్యవంతునకు తలనొప్పి వేయసాగెను; వేద నతో బాధపడుచువచ్చి అతడు భార్యతో ఇట్లు పలి కెను; ఈ (కట్టెలు కొట్టిన ) శ్రమతో నాకు తలనొప్పి కలిగినది; చీక టిలో ప్రవేశించు చున్నానేమో అనిపించుచున్నది; నాకేమియు తెలియుట లేదు; నీ తొడ పై తలనుంచి నిద్రించవలెననిపించు చున్నది; అని రాజ పుత్తితో చెప్పి నిద్రతో కండ్లు కూరుకొని పోవుచు ఆ రాజు కుమారుడు ఆమె ఒడిలో తల పెట్టుకొని నిదురించెను; పతి వ్రతయు మహా భాగయు ఆగు ఆ రాజ పుత్తికి స్వయముగా తానొక్కడు మాత్రమే అచటికి వచ్చిన యముడు కనబడెను; అతడు నల్ల కలువపూరేకువలె నల్లనివాడు; పచ్చని వస్త్రము ధరించిన ప్రభువు; అతడు తన చుట్టును మెరపు తీగలు చుట్టుకొనినదియగు నీటితో నిండిన మేఘమువలె నుండెను. రవి నమాన కాంతిగల కిరీటముతోను కుండలములతోను ప్రకాశించుచుండెను; ఆతని పక్షః స్థలమున బరువగు అనేక హారములును భుజములందు పలువన్నెల భుజకీర్తులునుం డేను. ఆతని వెంట గొప్ప పరివారమును కాలుడును మృత్యువును కూడ నుండిరి.

ఇట్టి ధర్మరాజు ఆ ప్రదేశమునకు వచ్చెను; సత్యవంతుని దేహమునుండి బొటనవ్రేలియంత పరిమాణముగల (సూక్ష్మ దేహాత్మక) పురుషుని తీసి అతనిని (కర్మఫల రూప) పాశముతో బంధించి త్వరితముగ దక్షిణ దిక్కునకు పోయెను; ఉత్తమశ్రియగు సావిత్రియును తన పతి గత జీవితుడగుట చూచి ఏమియు తడవు చేయక సోమరితనము చూపక ఆ ధర్మరాజుననుసరిచి పోవసాగెను; అంతట ఆట్లు పోవుచు దోసిలి పట్టి వణ కుచున్న హృదయముతో ఆమె ఇట్లు పలికెను:

సావిత్రీయమ సంవాదః.

ఇమం లోకం మాతృభక్త్యాపితృభక్త్యాతు మధ్యమమ్

 గురుశుశ్రూషయా చైవ బ్రహ్మలోకం సమశ్నుతే

 సర్వే తస్యా దృతా ధర్మా యస్యైతే త్రయ ఆదృతాః

అనాదృతాస్తు యస్యైతే సర్వా సస్యాఫలాః క్రియాః

 యావ త్తయ స్తే జీవేయు స్తావ న్నా న్యం సమాచరేత్

తేషాం చ నిత్యం శుశ్రూషాం కుర్యా తియహితే రతః

 తేషా మనుపరోధేన పారత స్త్ర్యం యదాచరేత్

త త్త న్ని వేదయే తేభ్యో మనోవచన కర్మభిః

 త్రిష్వ ప్యేతేషు కృత్యంహ పురుషస్య సమస్యతే

యమః : కృతేన కామేన నివర్తయాశు ధర్మో న తేభ్యోపి హి ఉచ్యతే చ

 మమోపరోధ స్తవ చ క్లమ స్స్యా త్తథాధునా తేన తవ బ్రవీమి

గురుపూజారతి ర్భక్తా త్వం చ సాధ్వీ పతివ్రతా

 వినివర్తస్వ ధర్మజ్ఞే గ్లాని ర్బవతి తేజధునా

 సావిత్రీ : పతీర్హి దైవతం స్త్రీణాం పతి రేవ పరాగతిః 

అనుగమ్యః స్త్రియా సాధ్వ్యా పతిః ప్రాణధనేశ్వరః

మితం దదాతి హి పితా మితం భ్రాతా మితం సుతః

 అమితస్య ప్రదాతారం భర్తారం కా న పూజయేత్

నీయతే యత్ర భర్తా మే స్వయం వా యత్ర గచ్ఛతి

 మయాఒపి తత గ నవ్యం యథాశక్తి సురోత్తమ

 పతి మాదాయ గచ్ఛ న మనుగత్తు మహం యదా

 త్వాం దేవ న హి శశ్యామి తదా త్యజ్యెమి జీవితమ్

మనస్వినీ తు యా కాచి ద్వైధవ్యాక్షర దూషితా

 ముహూర్తమపి జీవేత మణనారా హ్యమజ్జితా

యమః పతివ్రతే మహాభాగే పరితుప్టోస్మి తే శుభే

 వినా సత్యవతః ప్రాజై ర్వరం వరయ మా చిరమ్

 సావిత్రీ : వినష్టచక్షుషో రాజ్యం చక్షుషా సహ కారయ

 చ్యుతరాజ్యస్య ధర్మజ్ఞ శ్వశురస్య మహాత్మనః

యమః  దూరం పథే గచ్చ నివర్త భద్రే భవిష్యతీదం సకలం త్వయో కమ్

 మమోపరోధ స్తవ చ క్లమ స్స్యా త్తథాధునా తేన తవ బ్రవీమి

ఇతి శ్రీమత్స్య మహాపురాణే సావిత్ర్యుపాఖ్యానే సావిత్రీయమసంవాదో నామ

నవోత్తర ద్విశతతమోధ్యాయః

మాతృభ క్తిచే ఈ (భూ)లోక సుఖములను పితృభక్తి చేత మధ్యమ (అంతరిక్ష) లోక సుఖములను గురు శుశ్రూష చేత బ్రహ్మలోక సుఖములను (జీవుడు) పొందును; ఈ మూడు భక్తి (సేవా) నియమములను ఎవరు ఆదరింతు పాటింతురో వారు అన్ని ధర్మములను ఆదరించినవారే; ఎవరు ఇవి పాటించరో ఐరాచరించు సర్వక్రియలును నిష్పలములగును; వీరు మువ్వురును జీవించియున్నంత వరకును ఇతర ధర్మ సేవనమేమియు చేయ పనిలేదు; వారికి ప్రీతిని తనకు హితమును కలిగించుట యందాసక్తుడే ఎడతెగక వారి శుశ్రూష చేయుచుండవలెను; వీరి సేవాదికమునకు ఆటంకము లేకుండునట్లు ఇతర కార్యములేవయిన తాను చేసినను అవి వీరికి తెలుపుచు చేయుచుండవలెను. ఇట్లు పురుషుడు (జీవుడు) చేయు పనులన్నియు ఈ మువ్వురియందే ఇముడుచున్నవి.

అన పని యముడు (ధర్మరాజు) ఇట్లనెను; సావిత్రీ! నీకోరిక నెరవేరినదికదా! (నీవు అనినట్లు పుట్టినింట నీ తలిదండ్రులను ప్రతి ఇంట మగని తల్లిదండ్రులను మగనిని గురువులను సేవించితివి;) ఇపుడిక మరణించినవారికి వెంట వచ్చి వారికి చేయవలసిన సేవ పరలోకమందేదియు లేదు; అనియు ఇటనే ఉండి వారికి పార లౌకిక కర్మలు చేయవలె ననియు శాస్త్రములందు చెప్పబడియున్నది; కనుక మరలుము; నీవిట్లు నావెంట వచ్చుటచే నీకు శ్రమము; నాకు ఆటంకము; అందుచే నీకు ఈమాట చెప్పుచున్నాను; గురువుల (పెద్దల) పూజలందు భక్తి కలదానవు; అదీ కాక నీవు సరళ ప్రవర్తనము కల పతివ్రతవు; ధర్మమెరిగిన దానవుగదా నీవు! మరలుము; నీవిపుడు ఇంకను ముందుకు వచ్చినకొలదిని ఇంకను శ్రమమగుచుండును; అన సావిత్రి అతనితో ఇట్లనెను: స్త్రీలకు పతియే దైవతము; పతియే పరమగతి (కి సాధనము); సాధ్వియగు శ్రీ పతి ననుసరించుటయే ధర్మము; పతియే స్త్రీకి తన ప్రాణమునకును ధనమునకును ఈశ్వరుడు (సొంత దారుడు; ) స్త్రీకి పిత యు సోదరుడును సుతుడును ఇగ్చునది కొంచెము మాత్ర మే; ఆమిత మగు (పుణ్య ధర్మ ఫలములను) ఈయగలిగినది పతియొక్క డే; అట్టి పతినీ ఏస్త్రీ, పూజించకుండును? సుగో త్తమా! నాపతి పరులచే ఎచటికి తీసికొని పోబడునో తాము స్వయముగానై న ఎచటికి పోవునో అచటికి నేనును యథాశ కి (చేతనే నంతవరకు) పోవలసినదే! దేవా! నాపతిని తీసికొనిపోవుచున్న నీవెంట నేను రాలేనపుడు నేను ప్రాణములనే వదలుదును; మనస్విని (అభిమానవతి)యగు ఏ శ్రీయైనను వైధవ్యమను పాపపు అక్షరములకు పాత్రమయి అలంకారములతో సౌభాగ్య లక్షణములతో ఉండవలసిన తాను ఆ అలంకారములకు దూరమై ముహూర్త కాలమయినను జీవించగలదా? అనగా ఆమెతో యముడిట్లనెను: పతివ్రతా! మహాభాగా! శుభరూపా! నీ విషయమున పంతుష్టుడనయితిని; సత్యవంతుని ప్రాణములుకాక మరేదై న కోరుము; శీఘ్రమే ఇత్తును; అనగా సావిత్రి “మహాత్ముడు ధర్మజ్ఞుడు అగు నా మామగారు రాజ్యమును కన్నులును పోయియున్నారు; వారికా రెండును వచ్చునట్లు వరమునిండు;” అన యముడు. “శుభ రూపా! నీవు చాల దూరము వచ్చితివి! వెనుకకు మరలుము; నీవడిగిన ఇదంతయు జరుగును; (ఇంకను వచ్చినచో) నాకు ఆటంక మును నీకు శ్రమమును అగును; అందుచే ఇపుడిట్లు చెప్పుచున్నాను; (నామాట వినుము).” అనెను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున సావిత్ర్యుపాఖ్యానమున యముడు (ధర్మరాజు) సత్యవంతుని సూక్ష్మ దేహమును కొనిపోవుటయు సావిత్రీ యమసంవాదము సావిత్రికి ప్రథమవరప్రాప్తియుఅను రెండు వందల తొమ్మిదవ అధ్యాయము.