93 - నవగ్రహ స్వరూప కథనము 

ఈశ్వరః : పద్మాసనః పద్మకరః పద్మగర్బసమద్యుతిః ।

 సప్తాశ్వ సప్తరజ్జుశ్చ ద్విభుజ స్సవితా రవిః॥

 శ్శ్వేత శ్వేతామ్బరధర శ్వేతాశ్వ శ్వేతభూషణః ।

గదాపాణి ర్ధ్వబాహుశ్చ కర్తవ్యో వరద శ్శశీ॥

 రక్తమాల్యామ్బరధర శ్శక్తిశూలసమన్వితః ।

 చతుర్భుజో మేషగమో వరద స్స్యా దరాసుతః॥

 పీతమాల్యామ్బరధరః కర్ణికారదళద్యుతిః ।

 ఖడ్గచర్మగదాపాణి స్సింహస్లో వరదో బుధః॥

 దేవదై త్య గురూ తద్వ తీత శ్వేతా చతుర్భుఔ ।

దణ్డినౌ వరదే కార్యే సాక్షసూత్రక మణ్డలూ॥

ఇంద్రషనీలద్యుతి శ్శూలీ వరదో గృధ్రవాహనః ।

ప్రాసబాణాసనధరః కర్తవ్యోఒర్కసుతస్సదా॥

 సదా కరాళ కి ఖఢ్చ చర్మశూలధర స్తథా ।

 నీల స్సింహాసనస్థశ్చ రాహురత్ర ప్రశస్యతే॥

ధూమ్రా ద్విబాహవ స్సర్వే గదినో వికృతాననాః ।

 గృధాసనగతా నిత్యం కేతవో నృవరప్రదాకి॥

సర్వే కిరీటినః కార్యా గ్రహా లోకహితావహాః ।

ద్వ్యజ్గుళేనోహ్ఛ్రితా స్సర్వే శతమష్టోత్తర శ్శుభాః॥

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే నవగ్రహస్వరూపకథనం నామ త్రినవతిత మోధ్యాయః॥

ఈశ్వరుడు నారదునకు నవగ్రహ స్వరూపము ఇట్లు తెలి పెను! రవి పద్మము ఆసనము (పీఠము)గా గలవాడు; చేతులయందు పద్మమునుండును. పద్మపు లోపలి భాగపు కాంతివంటి దేహకాంతికలవాడు. ఏడు గుర్రములు వాహనము అయి వాటి ఏడు తాళ్లను చేతులధరించి రెండు భుజములతో ఒప్పారును. చంద్రుడు తెల్లని దేహము వస్త్రములు గుర్రములు భూషణములు కలిగి గదాపాణియే ద్విభుజుడై ఉండును. అంగారకుడు రక్త మాల్యాంబరధరుడు మేష వాహనుడు చతుర్భు జుడు శ క్తి శూల హస్తుడు నై యుండును. బుధుడు పీత (పసపు పచ్చని మాల్యాంబర ధరుడు పచ్చగన్నేరు పూ రేకుల కాంతివంటి కాంతి కలవాడు ఖడ్గచర్మ(డాలు)గదాపాణి_సింహవాహనుడు నై యుండును. గురుశుక్రు లిరువురును చతుర్బు. జులు దండాక్ష మాలాకమండలు ధరులు; బృహస్పతి పసపు పచ్చని శుక్రుడు తెల్లని. దేహకాంతి కలవారు. శనీ ఇంద్ర నీల సమానకాంతి. శూలాయుధము.గృధ్రవాహనము కలిగి.ప్రాసధనువులు ధరించినవాడు. రాహువు భయంకరుడు. ఖడ్గము. డాలు శూలము ధరించినవాడు-నల్లనివాడు. సింహాసనస్థుడు; కేతువులు ధూమ్ర వర్ణులు.ద్విబాహువులు-గదలు దాల్చినవారు వికృతముఖులు గృధవాహనులు నయియుందురు. (ఇచట కేతువు ఒక డుగా మాత్రము కాక ధూమకేతువులు మొదలగు అనేక గ్రహములుగా భావన చేసి చెప్పబడినది.) అన్ని గ్రహములును కిరీటములు గలవిగాను రెండు భార తీయాంగుళముల ఎత్తుకలవిగాను నిర్మింప జేయవలెను. ‘ఇచట శతమష్ణోత్తరాః శుభాః’ అనునది సరిగా అవగతము చేసికొనుట కవకాశము లేకున్నది. ప్రతి మొక గ్రహమునకు సంబంధించిన మంత్రమును కనిష్ట సంఖ్యగా నూట ఎనిమిది మారులైన జపించిన యెడల శుభము కలిగింతురు అని ఆర్థము కావచ్చును.

ఇది శ్రీమత్స్య మహా పురాణమున నవగ్రహ స్వరూప కథనమను తొంబది మూడవ అధ్యాయము.