227 - రాజధర్మము-దివ్యాంతరిక్ష భౌమోత్పాత శాంతి.

మనుః : దివ్యా న్తరిక్ష భౌ మేషు యా శాంతి రభిధీయతే

తా మహం శ్రోతు మిచ్ఛామి మహోత్పాతేషు కేశవ

 మత్స్యః ; అథాత స్సమవక్ష్యామి వివిధే ష్వద్భుతాదిషు

విశేషేణతు భౌమేషు శాన్తిః కార్యా యథా భవేత్

 ఆభయా చాన్తరిక్షేషు సౌమ్యా దివ్యేషు పార్థివ

విజిగీషుః పరం రాజ న్భూతికామస్తు యో భవేత్

 విజిగీషుః పరానేవ మభియుక్త స్తథా పరైః

 తథాభిచార శజాయాం శత్రూణా మఖినాశనే

 భయే మహతి సమ్ర్పస్తే అభయా శాస్త్రి రిష్యతే

 రాజయక్ష్మాభిభూతస్య క్షత క్షీణస్య చాప్యథ

 సౌమ్యా ప్రశస్యతే శాస్త్రి ర్యజ్ఞకామస్య చాప్యథ

భూకం పేతు సముత్పన్నే ప్రాప్తే చాన్న క్షయే తథా

 అతివృష్ట్యా మనావృష్ట్యాం శలభానాం చ భీతిషు

 ప్రమ త్తేషు చ చోరేషు వైష్ణవీ శా నిరిష్యతే

పశూనాం మరణే ప్రాప్తే నరాణామపి దారుణే

 భూతేషు దహ్యమానేషు రౌద్రీ శాస్త్రి స్తష్యతే

 వేదనా శే సముత్పన్నే జనే జాతే చ నా స్తి కే

 అపూజ్యపూజనే జాతే బ్రాహ్మీ శాస్త్రి స్తథేష్యతే

 భవిష్యత్యభి షే కేచ పరచక్రభయేషుచ

స్వరాష్ట్రభేదేరివధే శాస్త్రీ రౌదీ ప్రశస్యలే

త్ర్యహాతిరి కే వవనే రూ క్షే సర్వవిగర్హి తే

 వికృతే వాతజే వ్యాధే వాయవ్యా శాస్త్రి రిష్యతే

 అనావృష్టి భయే జాతే వికృతే వర్షణే తథా

 జలాశయవికారేచ వారుణీ శాస్త్రి రిష్యతే

అపి శాపభయే ప్రాప్త్ భార్గవీ చ తథా ద్విజ

 జాతే ప్రసవవై కృత్యే ప్రాజాపత్యా మహాభుజ

 ఉపస్కరాణాం వైకృత్యే త్వాష్టీ పార్థివసత్తమ

 బాలానాం శా నికామస్య కౌమారీచ తథా నృప

 ఆగ్నేయీ శాంతిరేవ స్యా త్సమాప్తి వహ్నివే కృతే

 ఆజ్ఞాభజ్గేతు సంప్రాస్తే తథా భృత్యాదిసజ్జయే

[ఆకస్మిక ముగా జరుగు ప్రకృతి విపరీతములు (ప్రాకృతికోపద్రవములు) ఉత్పాతములు; వీనినే అద్భుతములు. ఆశ్చర్యకరములగు అసాధారణ సంఘటనలు - అనియు వ్యవహరింతురు. ఇవి 1. భౌమములు. భూమితో సంబంధించి నవి; 2. ఆంతరిక్షములు. అంతరిక్షముతో - సంబంధించినవి; 3. దివ్యములు - నక్షత్ర గ్రహాది జ్యోతిర్గోళములతో సంబంధించినవి. అని మూడు విధములు.]

కేశవా! దివ్యములు ఆంతరిక్షములు భౌమములు నను మూడు విధములగు మహోత్పాతములలో నేవి యేవి సంభవించినపుడు ఏ ఏ శాంతులు జరుపవలేనని శాస్త్రము విధించుచున్నదో తెలియ వేడెదననిన మత్సుడు మనువుతో ఇట్లనెను: నీకిక మీదట వివిధములగు ఆద్బుతములును ఉత్పాతములును సంభవించినపుడును విశ్లేషించి భౌమాంతరిక్ష దివ్వములనబడు ఇవి సంభవించినపుడును ఏయేంతీ వీధించబడినదో తెలి పేదను వినుము; పరులను జయించి వారి నంపదల తానందగోరువాడును పరులకంటే తానధికుడుగా నుండగోరువాడును ఇతరులు తన విషయమున (తన రాజ్య విషయమున) చేసిన ఆభిచార క్రియలకు పాత్రుడయిన వాడును శత్రువుల నశింపజేయదలచిన వాడును మహాభయములు సంప్రాప్తించిన వాడును జరుపవలసిన శాంతికి 'అభయా'శాంతి అని పేరు; ఇది ఆంతరిక్షోత్పాతములను శమింప జేయునది.

రాజయక్ష్మ వ్యాధి (క్షయవ్యాధి)చే బాధనందువాడును గాయములతో బాధనందుచు కృశించినవాడును యజ్ఞముల నాచరింపగోరువాడును ‘సౌమ్యా’ శాంతినాచరించుట ప్రశస్తము; భూకంపములు అన్న పుకొరత అతివృష్టి, అనావృష్టి మిడు తల భయము పిచ్చివాడవలనను దొంగలవలనను ఉపద్రవములు కలిగినచో ‘వైష్ణవీ'శాంతి చేయవలెను; పశునరమరణము భూతదాహము సంభవించినచో ‘రౌద్రీ' శాంతి తగును; వేదనాశము నాస్తిక వృద్ధి అపూజ్యులను పూజించుట జరుగునపుడు 'బ్రాహ్మీ'ణాంతి ఉచితము; రాజ్యాభి షేక సమయమందును పరచక్ర భయము కలుగునపుడును స్వరాష్ట్రమున కల్లోలము లేర్పడునపుడును శత్రువధార్ధమును 'రౌద్రీ'శాంతి చేయవలెను; మూడు దినములకు అధిక కాలము రూక్షమును సర్వప్రాణులకు సహింపరానిదియునగు గాలి వీచుచున్న పుడును వాత వ్యాధులు చెలరేగినపుడును ‘వాయవ్యా” శాంతి చేయవలెను; అనావృష్టి భయ-వృష్టి వికార.జలాశయవికారములు కలుగునపుడు 'వారుణీ' శాంతి జరుపవలెను; శాపభయము కలుగుచో ఓ ‘భార్గవీ’ శాంతి ప్రసవములందు విపరీతములు (వికృత శిశు జననము ఒక ప్రాణి కడుపున మరియొక ప్రాణి జననము) సంభవించుచో 'ప్రాజాపత్య శాంతి' ఉపస్కర (పనిముట్ల) వికృతి సంభవించినచో ‘త్వాష్టి' శాంతి బాలుర క్షేమమున కై 'కౌమారీ' శాంతి అగ్ని వై కృతము జరిగినపుడును ఆజ్ఞాభంగములు భృత్య నాశాదికము జరుగునపుడును ‘ఆగ్నేయీ' శాంతి జరుపవలెను.

ఆశ్వానాం శాంతికామస్య తద్వికారే తథోత్థితే

ఆశ్వానాం కామయానస్య గాన్దర్వీ శాంతి రిష్యతే

 గజానాం శా నికామస్య తద్వికారే తథా స్థితే

రాజ్యంవా కామయానస్య శాంతి రాగిరసీ భవేత్

 పిశాచాదిభయే జాతే శా నిర్వై నైరృతి స్మృతా

 అపమృత్యుభయే జాతే దుస్స్వప్నే చ తథావిధే

 యామ్యాంతు కారయే చ్ఛా ప్లాం ప్రాప్తీ తు నర కే తథా

 ధననా శే తు సమ్ర్పస్తే కౌబేరీ శా స్తిరిష్యతే

ప్రథమే దీనయా మేచ రాశౌచ రవినన్దన

 హస్తే స్వాతౌచ చిత్రాయా మాదిత్యే(సావిత్ర్యే) చాశ్వినే తథా

 ఆర్యమే సౌమ్య జాతేషు పాయవ్యాం త్వద్భుతేషుచ

 ద్వితీయే దినయా మేష రాత్రైతు రవినన్దన

 ఫుష్యాగ్నే యే విశాఖాసు పిత్ర్యాసు భరణీషుచ

 ఉత్పాతేషు తథా భార్యేఆగ్నేయీం తత్ర కారయేత్

 తృతీయే దినయామేచ రాశౌచ రవినన్దన

 రోహిణ్యాం వైష్ణవే బ్రా హ్మే వాసవే వైశ్వదై వతే

 జ్యేష్ఠాయాం చ తథా మైత్ర్యే యే భవన్యద్బుతాః క్వచిత్

ఐస్ట్రీ తేషు ప్రయోక్తవ్యా శా స్త్రీ రవికులోద్వహ

 చతుర్థ దీనయా మేచ రాశౌచ రవినన్దన

 సార్పే పౌషే తథాఠాయా మహిర్బుధ్యే చ వా (దా) రుణే

 మూలేచ జలదై వత్యే యే భవన్యద్భుతా స్తథా

 వారుణీ తేషు కర్తవ్యా మహాశా ని ర్మహీ తా

 డామిత్రమణల వేలాసు యే భవ స్త్యద్భుతాః క్వచిత్

 తత్ర శా నిద్వయం కార్యం నిమిత్తే సతి నాన్యథా

నిర్ని మీత్తా కృతా శాస్త్రి ర్ని మి త్తే నోవయుజ్యతే

బాణప్రహారా న భవ ని యద్వ ద్రౌజ న్నృణాం సన్న హనై ర్యుతానామ్

 దై వోపఘాతా న భవంతి తద్వ ద్ధర్మాత్మనాం శాంతిపరాయణానామ్

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే అద్భుతశాంతివిధి ర్నామ సప్తవింశత్యుత్తర ద్విశతతమోఽధ్యాయః

అశ్వములకు వికృతి ఏర్పడినపుడు అవిశ మించుటకై ‘గాంధర్వీ' శాంతియు గజములయందు వికృతి ఏర్పడి నపుడు ఆది శమించుటకును రాజ్యమును వృద్ధి నందించుకొనగోరినపుడును 'ఆంగీరసీ' శాంతియు పిశాచాది భయము శాంతించుట కై "నైరృతీ’ కొంతీయు అపమృత్యుభయమును దానిని సూచించు దుస్స్వప్న ములును నరక భయమును సంభ వించునపుడు 'యామ్యా ' కోంతియు ధన నాశమునందు “కౌబేరీ' శాంతియు వృక్షములందును ధనమునందును వైకృత మేర్పడి నపుడును భూమి నధికముగా కోరినపుడును 'పార్థివీ' శాంతియు పగలు గాని రాత్రియందు కాని మొదటి జామునను హస్త స్వాతి చిత్రా పునర్వసు అశ్విని ఉత్తర ఫల్గుని మృగశిర నక్షత్రములందును ఉత్పాతములు సంభవించినచో ‘వాయవ్యా’ శాంతిని దీనరాత్రి ద్వితీయ యామమునందును పుష్యమి కృత్తిక విశాఖా మఖాభరణీ నక్షత్రములందును ఉత్పాతములు సంభవించినచో 'ఆగ్నే యీ' శాంతిని పగటగా ని రాత్రియందుగాని మూడవజామునను రోహిణి శ్రవణము ఉత్తరాభాద్ర ధనిష్ట జ్యేష్ట అనూరాధ. ఈ నక్షత్రములందును ఉత్పాతములు సంభవించినచో ‘ఐంద్రీ' శాంతిని పగటకొని రాత్రియందుగాని నాల్గవజామునను ఆ శ్లేష రేవతి ఆర్గ ఉ త్తరాభాద్ర శతభిషము మూల-ఈ నక్షత్రములందును ఉత్పాతములు సంభవించి నచో ఓ పొరుణి' శాంతిని జరుపవలేను; రవి మండలపు అంచులందు ఉత్పాత నిమి త్తములు కనబడినచో (ఆథయా. సౌమ్యా) రెండు డొంతులు జరుపవలయును. నిమి త్తములు కనబడనపుడు జరిపిన శాంతి నిమి త్తములు కనబడిన కాలము నాటికి ఉపయోగపడవు; కావున నిమిత్తములు కనబడినపుడు మాత్రమే శాంతి జరుపవలయును. కవచములు శిరస్త్రాణములు మొదలగు రక్షణ సాధనములు ధరించిన వీరునకు యుద్ధమున బాణము మొదలగు ఆయుధ)పు దెబ్బలు తగులన ట్లే ధర్మాత్ములై ఆవశ్యక ములయిన శాంతులు జరుపుకొనుచుండు రాజుల రాజ్యములందు ఉత్పాతాదుల భయములును పీడలును ఉండవు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున అద్భుత (ఉత్పాత) శాంతి విధియను రెండువందల ఇరువది ఏడవ అధ్యాయము.