126 - అగ్ని సూర్యుల పరస్పర తేజోనుప్రవేశము -జ్యోతిర్గోళముల దేవగృహత్వ నిరూపణము

ఋషయః : యదేవ దృవతా ప్రోక్తం శ్రుతం సర్వ మ శేషతః।

కథం దేవగృహాణి స్యుః పునర్జ్యోతీంషి వర్ణయ॥

 సూత : ఏతత్సర్వం ప్రపశ్యామి సూర్యాచన్దమసో ర్గతిమ్ ।

 యథా దేవగృహాణి స్యు స్సూర్యచన్ద గ్రహా స్తథా॥

 అగే ప్యుప్టో రజన్యోనివై బ్రహ్మణే వ్యక్తయోనినః ।

 అవ్యాకృత మిదం త్వాసే నై న తమసా వృతమ్॥

చతుశ్శుతా శిష్టేస్మి స్భ్రహ్మణా సమధిష్ఠితే ।

 స్వయమూ రృగవాం స్తత్ర లోక కర్తార్థసాధకః॥

ఖద్యోతరూపో విచర న్నా విర్బావం ఏచిన్తయ ।

జ్ఞాత్వాగ్నిం సతు కాలేవై జలపృథ్వీసమాశ్రయమ్॥

 సంహృత్య సమ్ప కాశార్థంత్రిధాతు వ్యభజత్పునః ।

 పవనోయస్తు *లో కేస్మి స్పార్థివ సోగ్ని రుచ్యతే॥

యశ్చాసౌ తపతే సూర్య శ్శుచిరగ్ని స్తు సస్మృతః ।

వై ద్యుతో జాఠర స్సౌమ్యో వై ద్యుతశ్చా పనిన్దనః॥

తేజోభి శామ్యతే కశ్చిత్కశ్చిదేవాప్యనిస్థనః ।

 కాషేనాన్యస్తు నిర్మస్థ్య సోఒద్భిశామ్యతి పావక కి॥

 అర్చిష్మా నవమానోగ్ని ర్నిష్పభ సౌమ్య వీక్షణః ।

యశ్చాసౌ మణలే శుక్ల నిరుష్ణ స్సమ్పకాశ తే॥

 ప్రభా సౌరీ త్రిభాగేన(ప్రభా సౌరీతు పాదేన) అస్తంయాతి దివాకరే ।

 అగ్ని మావిశ తే రాత్రే తస్మా తూర్యా త్ర్పకాశ తే॥

 ఉత్తిష్ఠతి పునస్సూర్వే ఆ సమగ్ని స్సమావి శేత్ ।

పాదేన తేజస శ్ఛాగ్ని సస్మా త్స తపతే దీవా॥

 ప్రకాశంచ తతోష్ణంచ సౌర్యగ్నీ మౌ తు తేజసా ।

 పరస్పరానుప్రవేశా దాపూర్యేతే దివానిశమ్॥

(*లో కేస్మి నాపక సోగ్ని రుచ్యతే.)

ఋషులు సూతునిట్లడిగిరి: నీవు ప్రతిపాదించిన ఖగోళ విషయము అంతయు వింటిమి. జ్యోతిర్టోశ ములు దేవ గృహములు అంటివి. అది ఎట్లో వర్ణించుము. అనసూతుడిట్లనెను: సూర్యచంద్రుల గతి విధానమును సూర్థ్య చంద్రాది గ్రహములు దేవగృహములగు విధమును తెలి పెదను. అవ్యక్త తత్వము (మాయాశ బలము) నుండి జన్మించిన బ్రహ్మకు ఒక రాత్రి ముగిసి మరల తెల్లవారుసరికి ఈదృశ్య ప్రపంచ నంతయు ఈ వస్తువునకు ఇది రూపము. ఇది పేరు అను విభాగము లేక రాత్రి సంబంధియగు చీకటితోనిండి (చీకటిలో . ఏ వస్తువునకుగాని ఇది రూపము. ఇది పేరు అని తెలియనట్లే యుండెను. ఈ నాలుగు వేదములును ఇది ఈ వేదమని అనుశాసించుటయు అప్పటికి జరుగ లేదు. అట్టి సమయమున లోకసృష్టి రూపమగు అర్థమును (పనిని సాధించదలచి భగవానుడగు స్వయంభూ బ్రహ్మ మిణుగురు పురుగువలె మినుకు మినుకుమని ! ప్రకాశించుచు జగదావిర్భావము ఎట్లు జరుపవలేనాయని ఆలోచింపసాగేను. అట్టి సమయమున అతనికి అగ్ని జలమును పృథివిని ఆశ్రయించి యున్నట్లు కనబడెను. స్వయంభూబ్రహ్మ జల పృథివులనుండి ఆ అగ్ని భూతమును ఒక చోటికి చేర్చి దానినంతయు మూడుగా విభజించెను. పవ(మా)నుడుగా వాయువునందు కనబడుచున్న నిర్మథనముతో ఏర్పడేడి ఆగ్ని పార్థివమగు (పృథివీ సంబంధియగు) అగ్ని; ఈ రవియే శుచియను అగ్ని; జఠరమునందుండి జీర్ణాది ప్రక్రియల చేయుచు నిర్మథనముతో కాక ఇంధనములతో పనిలేక వేలిగేడి అగ్ని వైద్యు తాగ్ని; అదియే పావకాగ్ని .

ఓనిలోనొక యగ్ని (సౌరాగ్ని) తేజస్సులతోనే శాంతించును. తన ప్రకాశమును కోల్పోవును.) మరి యొకటి (వైద్యులౌగ్ని) ఇంధనములతో పనిలేక యే వెలుగును. అది నీటితో చల్లారదు.) నిర్మథ్యాగ్ని మాత్రము కాష్టములతో వెలుగును. నీటితో శమించును. పవమానాగ్ని యనబడేడి నిర్మథ్యాగ్ని ప్రార్థివాగ్ని) జ్వాలలుండియు ప్రభలు తక్కువయ.గుటచే సౌమ్యుడుగా కనబడు చుండును. రవి మండలమునందు వేరొక యుష్ణముతో పనిలేక యే ప్రకాశించు అగ్ని కి సంబంధించి సౌర ప్రభయందలి మూడు పాదములు అగ్ని యందు ప్రవేశించును. అందువలన అగ్ని రాత్రులందు రవికంటే అధికముగా నున్నట్లు ప్రకాశించును. మరల రవి ఉదయించునపుడు ముందటి దినమున అ సమయకాలమున రవినుండి ప్రకాశము పొందిన ఆగ్ని మరల రవిని ప్రవేశించును. అందుచే అగ్ని పగటివేళల నాలుగవవంతు తేజస్సుతో మాత్రమే వెలుగును. ఇట్లు ఆగ్నేయ సౌర ప్రకాశములు రాత్రింబవళ్ళలో పరస్పరాను ప్రవేశమున పరస్పర పూరణము చేసికొనుచుండును.

ఉత్తరేచైవ భూమ్యర్దే తథాహ్యగ్నిశ్చ దక్షిణే ।

 ఉత్తిష్ఠతి పునసూర్యే రాత్రా వావిళతే హ్యపః॥

 తస్మాత్తామ్రా భవన్హ్యాపో దివా రాత్రిప్రవేశ నాత్ ।

 అస్తంగతే పునసూర్యే అహో వై ప్రవిశ త్యపః॥

తస్మా న్న కం పున శ్శుక్లా హ్యాపో దృశ్య నీ భాసురాః ।

 ఏతేన క్రమయోగేన భూమ్య ర్దే దక్షిణోత్తరే॥

ఉదయాస్తమయేహ్యత్ర అహోరాత్రం విశత్యపః ।

 యశ్చాసౌ తపతే సూర్య స్సోపః పిబతి రశ్మిభిః॥

 సహస్రపాద స్వేపోగ్ని ర్వృతః కుమ్బనిభస్తు సః ।

 ఆద త్తే సతు నాడీనాం సహ సేణ సమ స్తతః॥

 అపో నదీసముద్రేభ్యో హ్రదకూ పేభ్య ఏవచ ।

 తస్య రశ్మి సహస్రంతు శరద్ వర్షా దివానిశమ్॥

 తాసాం చతుశ్శతం నాడ్యో వద్ద నే చిత్రమూ ర్తయః ।

చన్దనా శ్చైవ మేధ్యాశ్చ కా నకా శ్చతసా స్తథా॥

అమృతానామ తాస్సర్వా రశ్మయో వృష్టివర్జనాః ।

 మద్రవాశ్చ తేన్యోన్యం రశ్మయ శ్రిశతం స్మృతాః॥

 చన్దాస్తా నామత స్సర్వా శ్శీతో భానో ఛభ సయః ।

ఏతా మేధ్యా స్తథాన్యాశ్చ హోదిన్యో హిమసర్జనాః॥

శుక్లాశ్చ కకుభశ్చైవ గావో విశ్వభృతశ్చ యాః ।

శుక్లా నామతస్సర్వా శ్రీశ తం ఘర్మసర్జనాః॥

 సమం బిభర్తి తాస్సర్వా న్మనుష్యాక్ దేవతాః పితలాక్ ।

 మనుష్యానోషధీభిశ్చ స్వధయాచ పితృనపి॥

 అమృతేన సురా నర్వా నతత పరివర్తయః ।

 వస నేచైవ గ్రీష్మేచ శతైస్స తపతేత్రిభిః॥

 వర్షాసుచై వ శరది చతుర్బి స్సమవర్షతి ।

 హేమ న్తశిశిరేచైవ హీమోత్సర్గం తిభిఃపునః॥

 ఓషధీషు బలంధ త్తే స్వధాచ సుధయా పునః ।

 భూయోమరత్వ మమృతే త్రయస్ట్రిషు నియచ్ఛతి॥

 ఏవం రశ్మిసహస్రంతు సౌరం లో కార్థ సాధనమ్ ।

 భిద్యతే ఋతుసూర్యమాసాద్య సహస్రం బహుధా పునః॥

 ఇత్యేత న్మజ్ఞలంశుక్లం భాస్వరం లోకసంజ్ఞితమ్ ।

నక్షత్రగ్రహసోమాసాం ప్రతిష్ఠా యోని రేవచ॥

ఇట్లు అగ్ని భూమికి ఉత్తరార్ధ దక్షిణార్ధములందు స్థాన పరివర్తనమున తన తేజమును పువర్తనము చేసికొనుచు ప్రకాశాధిక్యమును పొందుచు కోల్పోవుచు నుండును. ఇట్లే సూర్యుడుదయించగానే రాత్రి (కాల ప్రభావము) నీటియందు ప్రవేశించును. అందుచే పగటి వేళలందు నీరు అగ్ని వలేనే ఎర్రగా కనబడును. మరల రవి అస్తమించగనే పగలు (పగటికాలపు ప్రభావము) నీటియందు ప్రవేశించును. అందుచేతనే నీరు రాత్రులందు రవినలే తెల్లగా కనబడును. ఈ క్రమమున భూమి దక్షిణే తరార్థము లందు రవ్యగ్ని ప్రకాశముల పరస్పర ప్రకాశ పఠివర్తనముచే ఉదయా స్తమయ ప్రభావానుసారము రవియు ఆగ్ని యు జలములందు ప్రవేశించుచు వాటి వర్ణమును కూడ మార్చును.

ఈ సౌరాగ్ని (రవి మండలము) వేయి కిరణములతో పరి వారితమే ఒక కడవవలె నున్నది. అతడు తన వేయి నాడులతో నదీ సముద్రహద కూపాడులనుండి నీరు పీల్చి తనయందు నింపుకొనును.

సూర్యుని వేయి కిరణములలో నాలుగు వందల కిరణములు శరద్వరా కాలములందు వాన కురియును. ఆ కిరణములు చల్లనివి పవిత్రములు తక్కువ వేడిమి నిచ్చునవి. వాటికి అమృత కిరణములని నామము. ఇవికాక మూడు వందల కిరణములు హేమంత శిశిర ఋతువులందు రవియందు సేకరింపబడియున్న జలమును హిమ రూపమున లోకమున కందించును. ఈ కిరణ సముదాయమునకు చంద్రములు అని పేరు. ఇవియన్నియు పవిత్రములును ఆనందము కలిగించునవియును. మరి మూడువందల కిరణములు వసంత గ్రీష్మములందు ఘర్మమును ఆవిరిని వదలును. వినికి శుక్ల కిరణములని వ్యవహారము.

ఇట్లు రవి తన సహస్రకిరణప్రకృతిద్వారమున ఓషధులతో మానవులను స్వధాద్రవ్య కవ్యముతో పితరులను అమృతముతో దేవతలను ససుముగా పోషించుచున్నాడు.

ఈ సహస్ర కిరణములు కూడ ఋతుభేదమున మరియు అనేక విధముల మార్పును పొందుచుండును.

ఇట్లు శుక్లవర్ల మై ప్రకాశ శీలమైన 'లోక'మను సంప్రదాయసిద్ధ వ్యవహార నామముగల రవియే నక్షతములకు. (తారా)గ్రహములకు సోమునకు గూడ జన్మ హేతువును స్థితికారణమునై యున్నాడు.

చంద్రాదీనాం సూర్యకిరణాప్యాయన కథనమ్

 చంద్రఋక్షగ్రహాస్సర్వే విజ్జియా రశ్మి సమ్బవాః ।

 సుమమ్నా సూర్యరశ్మిర్యా ఓణం శశిన మేదతే॥

 హరి కేశః పున స్తస్మినోవై నక్షతయోనికృత్ ।

 దక్మిణీ విశ్వకర్మాతు రశ్మి రాప్యాయయే ద్బుధమ్॥

 విశ్వావసున్తు యః పశ్చా చ్చుకయోనిస్తు స స్మృతః ।

 సంవర్దనస్తు యోరశ్మి స్సయోని ద్రోహితస్యలు॥

 షష్ఠ స్వర్వావసూ రశ్మిర్యోనిస్సతు బృహస్పతేః ।

 శనైశ్చరం పునశ్చాపి రశ్మి రాప్యాయయే త్స్వరాట్॥

 న క్షీయ నే యతస్తాని తస్మా న్న క్షత్రతా సృతా ।

 చేత్రాణ్యేతాని వై సూర్య మాపతంతి గభస్తిభిః॥

 తేషా మన నక్షేత్రాణాం సూర్యో నక్షత్ర తాగి గతః ।

 అస్మాల్లో దముం లోకం తీర్జానాం సుకృతాత్మనామ్॥

 తారణా త్తార కాణ్యేతే శుక్ల త్వాచ్చైవ తారకాః ।

 దివ్యానాం పార్థివానాంచ వంశానాంచైవ సర్వశ॥

 తపసా తేజ సో దానా దాదిత్య సేన చోచ్యతే ।

భవతి స్యన్దనార్ఖతు ధాతు రేష నిగద్యతే॥

 సవనా తేజస శ్చైవ తేనాసౌ సవితాస్మృతః ।

బహ్వర్థ శ్చదిరిత్యేష ప్రధానో ధాతురుచ్యతే॥

 శుక్లల్వే హ్యమృతత్వేచ శీతత్వే హోదనేపిచ ।

 సూర్యాచన్దమనో ర్దివ్యే మణలే భాస్వరే ఖగే॥

జలతేజోమయే శుక్లే వృత్తకుమ్బనిభే శుభే ।

 విశ ని కర్మ దేవాస్తు స్థానాన్యేతాని సర్వశ॥

 మన్వన్తరేషు సర్వేషు ఋషో సూర్యగ్రహాశ్రయాః ।

 తాని దేవగృహాణి స్యు స్థానాఖ్యాని భవ స్తిహి॥

 సౌరం సూర్యో విశజ్ఞానం సౌమ్యం సోమ స్తథైవచ ।

 శాక్రం శుక్రో విశనం షోడశార ప్రభాస్వరమ్॥

 బృహస్పతిర్ బృహస్తంచ లౌహితంబోపి లోహితః ।

 శనైశ్చరో విశబ్ధాన మేవం శానైశ్చరం తథా॥

 బుధోపి వై బుధస్థానం స్వరాసు రాసుమేవచ ।

నక్షత్రాతు సర్వాణి నక్షత్రాణ్యావిశ నివై ॥

చంద్రుడు నక్షత్రములు గ్రహములు ఇవి యన్నియును సూర్యుని ర శ్ములు అనేది నాడుల నుండియే జనించి తృప్తిని పుష్టి ని పొందునని తెలియవలయును. ఎట్లన సుషుమ్నా అనెడి నాడి రశ్మి షేణుడగు చంద్రుని పరిపోషించును. హరి కేశము అను రశ్మి నక్షత్ర ములను దక్షిణమునం దుండెడి విశ్వకర్మయను నొడి బుధుని వెనుక నుండెడి విశ్వావసుసోడి శుకుని సంవర్గన నాడి అంగారకుని ఆర్వావసువను ఆరవనాడి బృహస్పతిని స్వరాట్ అను నొడి శనైశ్చరుని ఆప్యాయన మొందించును. క్షయము నొందపు కావున నక్షత్రములు (న-క్ష-త్ర) ఇవి సూర్యుని క్షేత్ర(స్థాన)ములుగా నుండి తమ కిరణ ములతో సూర్యుని తపింపజేయును. సూర్యుడు అసంత క్షేత్ర రూపములగు ఆ నక్షత్రములలో తానును సక్షతత్వము పొందియున్నాడు. ఈ లోకమునుండి పై లోకములకు దాటిపోయిన సుకృతాత్ములను దాటించునవి కావునను తెల్లనివి కావు నను తారకలు (తరింప-దాటునట్లు-చేయునవి) అని వీనికి పేరు. పృథిపిగతులగు వారిలో దీవ్యవంశ ముల వారిని వారి తపోబలమును తన తేజోబలమును ఆశ్రయించి తనలోనికి గ్రహించును కావున సూర్యునకు ఆదిత్యుడు ( ఆద తే-తనలోనికి తీసికొనును) అని పేరు. స్వస్థనము-సవింపజేయుట అను ఆర్థము నిచ్చు 'సూ' అను ధాతువునుండి ‘సవితా' అను పద మేర్పడినది. తేజస్సును ప్రసరింపజేయు వాడు కావున సూర్యుడు “సవిత' అనబడును. 'చది' అను ధాతువునుండి ‘చంద్ర’ అనేడు శబ్దము ఏర్పడినది. తెల్లగోఅమృతరూపుడై చల్లనై - ఆనందింపజేయువాడై - ఉండును అని అర్థము. ఇట్టి సూర్య చంద్రుల మండలములు ప్రకాశవంతములు దివ్యములు ఆకాశ గాములు తెల్లనివి గుండ్రని కుండలవంటివి. వీరిలో రవి తేజో మయుడు చంద్రుడు జలమయుడు. తమ సుకృతములచే దేవత్వ మండిన కర్మదేవులు ఆయా మన్వంతరములం దెల్ల ఈ రవి నక్షత చంద్రగ్రహ లోకములందు తమ పుణ్యానుసారము ప్రవేశింతురు. ఇవీ వారికి స్థానము లగును. కావున వీనికి ‘దేవ గృహములు’ 'కర్మదేవులకు ఇండ్లు' అని పేరు ఏర్పడినది. ఇంతే కాదు. సూర్య శుక్ర బృహస్పత్యంగారక శనైశ్చర బుధ రాహుపులు ఇతర నక్షత్రములు కూడ వాస్తవమున దేపతాత త్వములే. వీరును తమ సుకృతమున కర్మదేవులై ఆయా జ్యోతిర్గోళ ములను తమ తమ ఇండ్లుగా పొందిరి. ఈ కనబడు జ్యోతిర్లోకములు కేవలము జడ పదార్థములు కావు. వానికి ఆధిష్ఠాతలుగా రవ్యాది దేవతలున్నారు. 

జ్యోతీంషి సుకృతా మేలే జ్ఞేయా దేవగృహస్తువై ।

స్థానాన్యేతాని తిష్టని యావదాభూతసమ్లవమ్॥

 సూర్యాద్యుత్పత్తికథనమ్

 మన్వన్తరేషు సర్వేషు దేవస్థానాని యానివై ।

 అభిమానినోనుతిష్టని తాని దేవాః పునః పునః॥

 అతీతాంశ్చ సహాతీతై రాష్ట్రవ్యా భావ్యే స్సురై స్సహ ।

 వర నే వర్తమానే స్తు సురై సార్ధంతు స్థానినః॥

సూర్యో దేవో వివస్వాంశ్చ అష్టమ స్వదితే స్సుతః ।

ద్యుతిమాకి ధర్మయు క్తస్తు సోమో దేవో వసు స్స్మృతః॥

 శుక్ర దైత్యస్తు విజ్ఞేయో భార్గవోఒసురయాజకః ।

 బృహస్పతి ర్వేధసశ్చ దేవాచార్యోఒ జిరస్సుతః॥

 బుధో మనోహర శైవత్వపు తస్తు స స్స్మృతః ।

 శనైశ్చరో విరూపశ్చ సంజ్ఞాపుతోం వివస్వతః॥

  ఆగ్నే ర్వి కేశ్యాంజజ్ఞిరే యువానః కేతవోసృప ।

 నక్షత్రనామ్నా ఋ వాణి దాక్షాయణ్యస్తు తా స్మృతాః॥

 స్వర్భాను సింహికాపుతో భూతసమ్మోహనోఒసురః ।

 చన్దారగ్రహనక్షత్రే ష్వభీమానీ ప్రకీర్తితః॥

 స్థానాన్యే తాని చోకాని స్థానిన్య శ్చైవ దేవతాః ।

 శుక్ల మగ్నిమయ్య దివ్యం సహస్రాంశో ర్వివస్వతః॥

 సహస్రాంశు స్వీజస్థాన మమ్మయం తై జసం తథా ।

 ఆప్యం స్థానం మనోజ్ఞస్య పథ్చారశ్మి ర్బృహస్పతిః॥

 శుక్రషోడశర శిస్తు యశ్చ దేవో హ్యపాం స్వయమ్ ।

 లోహితో నవరశ్మిస్తు స్థానమాప్యంతు తస్యతత్॥

 బుధే ద్వాదశ రశ్మిస్తు హరితాళంతు తపృహం ।

 అష్టరశ్మి గృహం ప్రోక్తం కృష్ణం మందస్య చ స్వయమ్॥

 స్వర్భానో ఛాదు సంస్థానం భూతనస్తాపనాలయమ్ ।

 శుక్లా నామ్నా తు సూర్యస్య రశ్మయస్తు హిరణ్మయాః॥

తారాణాం తాపకా హ్యేతా శ్శుక్లతత్వాచ్చైవ తారకాః।

ఈ చెప్పిన కారణములచే ఈ జ్యోతిర్గోళములన్నియు సుకృతము చేసికొనిన కర్మదేవుల ఇండ్లయినందున దేవ గృహము లయ్యెను. ఇవి ప్రళయకాలము వరకు ఇప్లే యుండును. ప్రతి మన్వంతరమునందును ఆయా స్థానములకు అధి మానులగు దేవతలు ఇట్టే వానిని మరల మరల తమ ఇండ్లుగా చేసికొందురు. అతీత మన్వంతరములందు అతీత దేవత లును వర్తమానమన్వంతరములందు వర్తమానదేవతలుసు భావి మన్వంతరములందు భావి కర్మదేవులును ఇట్టే ఉండిరి. ఉన్నా రు ఉందురు.

ఇక వీరి దేవతాత్వములు ఇట్లుండును: ఆదితి కుమారులలో ఎనిమిదవవాడగు 'వివస్వాన్' అను నతడే సూర్య దేవుడు; ద్యుతి (కాంతి) కలవాడు ధర్మయుక్తుడు నగు సోమ(చంద్ర)దేవుడు వసువులలో నొకడు; శుక్రుడు అసురుల యాజకుడు (యజ్ఞాదులు చేయించు పురోహితుడు) ఐనను దేవతా కోటిలోని వాడు; దేవాచార్యుడు బృహస్పతి అంగిరుని కుమారుడు; బ్రహ్మాంశ సంభూతుడు; బుధుడు మనోహర రూపుడు త్విషి(చంద్ర)పుత్రుడు; శనైశ్చరుడు విరూపుడు.రవికి సంజ్ఞాదేవియందు కలిగినవాడు; వేణుపులు అసువారు అగ్ని దేవునకు ఏ కేశి అను భార యందు జనించినవారు; దాక్షా యుణులు (దక్షపుత్రికలు) నక్షత్రములు; భూతము ప్రాణులకు సమ్మోహము కలిగించు స్వర్భానుడు (రాహువు) సింహికా పుత్తుడగు అసురుడీ యెనను చంద్రార్క గ్రహనక్షత్రములందు ఒక డుగా అభిమతు డై ఆరాధింపబడు చున్నాడు.

ఇట్లు జ్యోతిః స్థాస తత్వమును ఆ స్థానముల కభిమానులగు దేవతలను తెలిపితిని. ఆ జ్యోతిః స్థానముల భౌతిక సంస్థానమును తెలిపెదను. సహస్రాంశుడగు వివస్వంతు(సూర్యు)ని స్థానము ఆగ్ని మయ జ్యోతిర్గోళము. చంద్ర స్థానము కూడ వేయి కిరణములు గల జలమయగోళము. మనోజ్ఞుని గోళము కూడ జలమయమే; బృహస్పతి గోళము ఐదు నాడులు కలది; శు, క గోళము పడునారు నాడులు కల జలమయగోళము; ఆంగారకునిది తొమ్మిది నాడులుగల జల మయగోళము; బుధునీటి పండ్రెండు నాడులుగల పచ్చని ప్రకాశముగల గోళము; రాహు స్థానమగు గోళము భూత సంతా చము కలిగించునది; ఇతని కిరణములు హిరణ్మయములు శుక్ల సౌమకములయి తెల్లని వగుటచే తారకములని కూడా పేరు గల సూర్య కిరణములే; ఇవి తారలకు కూడ తాపము కలిగించును.

సూర్యాదిమణ్డలపరిమాణకథనమ్

నవయోజనసాహస్రై ర్విష్కమ్భ స్సవితు స్స్మృతః॥

 మణ్డలం త్రిగుణం చాస్య విస్తారో భాస్కరస్య తు ।

ద్విగుణ సూర్యవిస్తారా ద్విస్తార శ్శశిరస్స్మృతః॥

విస్తారంమణలం చాస్య వైపుల్యా చ్ఛశిన స్మృతమ్ ।

 సర్వోపరి నీసృష్టాని మజ్జలానితు తారకాః॥

యోజనార్ధప్రమాణాని తాభ్యోన్యాని గుణానితు ।

 తుల్యోభూత్వాతు స్వర్భాను సదధస్తా తసర్పతి॥

 ఉద్ధృత్య పార్థివీం ఛాయాం నిర్మి తాం మత్థలాకృతిమ్ ।

 స్వర్బానోశ్చ బృహత్థానం తృతీయంతు తమోమయమ్॥

 ఆదిత్యా త్సచ నిష్కమ్య సోమం గచ్ఛతి పర్వసు ।

ఆదిత్య మేతి సోమాచ్చ పునస్సారేషు పర్వసు॥

 స్వభాసా నుదతే యస్మా త్స్వర్భానురితి స స్మృతః ।

 చన్హతః షోడశో భాగో భార్గవస్య విధీయతే॥

 విష్కమా స్మణ్ణలాచ్చైవ యోజనానాంతు సస్మృతః ।

 భార్గవా త్పాదహీనస్తు విషైయో వై బృహస్పతిః॥

 బృహస్పతేః పాదహీనో వక్రసౌరా వుభౌ స్మృతౌ ।

 విస్తారా న్మజ్ఞలాచ్చైవ పాదహీన స్తయోర్బుధః॥

 తారానశత్రరూపాణి వపుష్మ నీహ యానివై ।

 బుధేన సమరూపాణి విస్తారా న్మజ్ఞలచ్చవ్॥

 తారానక్షత్రరూపాణి హీనానిలు పరస్పరమ్ ।

*శ తాని పజ్చచత్వారి ప్రాణి ద్వాదశ చై వచ॥

 తతోపరి నివిష్టాని మడ్డలానితు తారకాః ।

 యోజనార్దప్రమాణాని తేభ్యో హ్రస్వం న విద్యతే॥

 ఉపరిష్ణా త్తయ స్తేషాం గ్రహాయే క్రూర సర్పీణః ।

 సౌరి శ్చాజ్జిర సో వక్రో విజ్జీయా మన్హచారిణః॥

 తేభ్యోధస్తా ద్రాహు కేతూ పునశ్చా న్యే మహాగ్రహాః ।

 సోమ శ్శుక్రో బుధ శ్చైవ భార్గవ శ్చేతి శీఘ్రగాః॥

(*సాష్టషట్పఞ్చచత్వారిత్రీణిద్వేఏకేఏవచ)

రవి మండల వ్యాసము తొమ్మిది వేల యోజనములు. చుట్టు కొలత దానికి మూడింతలు; చంద్రుని వ్యాసము సూర్యుని వ్యాసమునకు ద్విగుణము; తారకలు వీటికి పైగా నున్నవి. పోని వ్యాసము అర్ధ యోజనము మాత్రమే. అదే వ్యాసముతో రాహువు నక్షత్ర ములకంటె క్రిందుగా సంచరించును. ఇతడు పృథివీ ఛాయను మండలాకారమున చేసికొని యుండును. రాహు స్థానము పెద్దదే కానీ తమోమయము; అతడు చంద్రపర్వములందు పూర్ణిమలందు) సూర్యుని నుండి చంద్రుని కడకును రవిపర్వములందు (ఆమావాస్యలందు) చంద్రునినుండి సూర్యుని కడకును పోవుచుండును. తన భానువులతో (కిరణములతో) భానుని బాధించును కావున అతనికి స్వర్భానుడని పేరు. చంద్రునిలో పదునారవవంతు శుక్ర మండలము; శుక్ర మండలములో నాల్గవవంతు తగ్గించినచో బృహస్పతి మండల మగును. బృహస్పతి మండలములో నాల్గవవంతు తగ్గించినచో అంగారక మండల మగును; శని మండలము అంగారక మండలముతో సమానము. అంగా రకుని మండలములో నాల్గవవంతు తగ్గించినచో బుధ మండల మగును. తారా నక్షత్రము లన్నియు బుధ మండలముతో సమాన మండలము కలవి. ఇవి ఒకదానికంటే మరియొకటి తక్కువ తక్కువ పరిమాణము కలవి. ఇవి వందలుగా ఐదు లుగా నాల్గులుగా మూడులుగా పండ్రెండులుగా నున్న వి. ఈ తా నక్షత్ర మండలములకు పైగా నక్షత్రము లున్న వి. లోగడ చెప్పినట్లు వీనిలో ఒక్కొక్కదాని మండలము అర్ధ యోజనము; ఇంతకంటే చిన్న మండలము కల జ్యోతిస్సులు లేవు; వాటికి పైగా నున్న గ్రహములగు శని బృహస్పత్యంగార కులు మంద సంచారులు; నక్షత్రములకు క్రిందుగా రాహు కేతువులున్నవి. సోమ శుక్ర బుధులు శీఘ్ర సంచారులు; వీరును నక్షత్ర మండలమునకు క్రిందుగానే యున్నారు.

యావంతి దేవఋక్షాణి కోట్య స్థావచ్చతార కాః ।

 సర్వేషాంతు గ్రహాణాంవై సూర్యోదస్తా తసర్పతి॥

 విస్తీర్ణం మణ్డలంకృత్వా తస్యోర్వం చర తే శశీ ।

 నక్షత్రమణలం చాపి సోమాదూర్ధ్వం ప్రసర్పతి॥

 నక్షత్రేభ్యో బుధశ్చర్వం బుధాదూర్ధంతు భార్గవః ।

 వక్రీస్తు భార్ధ వాదూర్ధ్వం వక్రాదూర్ధ్వం బృహస్పతిః॥

తస్మా చ్ఛనైశ్చర శోర్ధ్వం దేవా చార్యా త్పర స్మృతః ।

 శనైశ్చరా దతశ్చోర్ధ్వం జ్ఞేయం సప్తర్షిమజ్ఞలమ్॥

సప్తర్షిభ్యో ధ్రువశ్చోర్ధ్వ మాస క్తం త్రిదివం ధ్రువే ।

 ద్విగుణేషు సహ సేషు యోజనా నాం శ తేషుచ॥

 గ్రహానర మథే కైక మూర్ధ్వం నక్షత్రమఱ్ఱలాత్ ।

 తారాగ్రహా నరాణిస్యు రుపర్యుపరి తే స్మృతాః॥

 గ్రహాశ్చ చౄసూర్యోచ దేవి దివ్యేన తేజసా ।

నక్షత్రేషుచ యుజ్య నే గచ్ఛన్లో నియత క్రమాత్॥

 చన్దారగ్రహనక్షత్రా నీచోచ్చమృదుసంస్థితాః ।

సమాగమేతు భేదేన పశ్య ని యుగప తజాః ॥

 పరస్పరా స్థితా హ్యేవం యుజ్య నేచ పరస్పరమ్ ।

 ఆసజ్కరేణ చ శ్రేణ తేషాం యోగాస్తు వై బుధైః॥

 ఇత్యేష సన్ని వేశో వః పృథివ్యా జ్యోతిషామపి ।

 ద్వీపానా ముదధీనాంచ పర్వతానాం తథైవచ॥

 వర్షాణాంచ నదీనాంచ చ దేవేషు సనిపై ।

 ఇత్యేషోర్కవ శేనైవ సన్ని వేశస్తు జ్యోతిషామ్ ॥

 ఆద్య నప్రాన్లతో మధ్యం సజేపస్తు ధ్రువాశ్రితః ।

 సర్వత స్తేషు విస్తీర్ఘ వృత్తాగార ఇవోచ్చితః॥

 లోక సంవ్యవహారార్థ మీశ్వరేణ వినిర్మిత  ।

 కల్పాదౌ బుద్ధిపూర్వంతు స్థాపితోఒయం స్వయమ్బువా॥

 ఇత్యేష సన్ని వేశేవ స్సర్వస్తు జ్యోతిషాత్మకః ।

 వేశ్వరూపం ప్రధానస్య పరిణామోఒ స్య యస్స్మృతః॥

 నైష శక్యః ప్రసజ్ఞ్యాతుం యాథాతథ్యేన కేనచిత్ ।

 గతాగతం మను ష్యేణ జ్యోతిషాం మాంసచక్షుషా॥ 

ఇతి శ్రీమత్స్యమహాపురాణే ఖగోళపరిసమాప్తి కథనం నామ  షడ్వింశత్యుత్తర శతత మోధ్యాయః॥

ఇతి ఖగోళసంస్థానవర్ణనమ్॥

 దేవత్వమును పొందిన నక్షత్రాచ్ము లెందరు కలలో అన్ని కోట్ల తారక లంతరిక్షమందున్న వి. (కావున ఆపి ఇన్ని యని లెక్కింపజాలము. )

అన్ని టికంటెను దిగువగా సూర్యు డున్నా డు. అతని మీదుగా చంద్రుడు. ఆతనికి పైగా బుధుడు అతని పై శుక్రుడు అతని పై కుజుడు అతని పై బృహస్పతి అతనిపై శనైశ్చరుడు అతనికి పైగా సప్తర్షి మండలము దానిలో ఊర్ద్వ మున ధ్రువుడు ఉన్నారు. ఇడ్లీ ద్యు లోకమంతయు ధ్రువునియందు నిబద్ధ మయి యున్నది.

ఈ గ్రహాదులన్నియు ఒక దానికి మరియొకటి రెండు వేల ఒక వంద) లక్షల యోజనముల ఎడముతో పై పైగా ఉన్న వి. ఈ తారాగ్రహములును చంద్ర స్యూలును ద్యులోకమున దివ్యతేజస్సుతో ప్రకాశించుచు అశ్విన్యాది నక్షత్రము లందు నియమానుసారము సంచరించుచుండును. ఇవి నీచోచ్చమృదు గతులలో సంచరించును. వీనికి సమాగమము భేదము అను స్థితులును కలుగుట కనబడుచుండును. ఈ సమాగమ భేదములు గణనవశమున పండితులు తెలిసికొందురు. వా సవమున అవి కలియుట జరుగదు. ఏలయన అవి ఒక దానిని మరియొకటి తాకని చక మున (కక్ష్యలలో నియత ముగా తిరుగుచుండును. కాని వాని కన్నింటికి దిగువగా నున్న మనకు అవి అట్లు కనబడును.

ఇట్లు పృథివీ సన్ని వేశము జ్యోతికి సన్నివేశము ద్వేప సముద్ర పర్వత నదీ వర సంనివేశము జ్యోతి రాత్మక దేవగృహ సంనివేశము సూర్యాశ్రిత జ్యోతిర్వ్యవస్థ ధ్రువాశ్రితమగు ఆద్య న ప్రాంత మధ్య ప్రదేశములందలి అంతరిక్ష జ్యోతిర్గోళ వ్యవస్థ మీకు తెలిపితిని. గుండ్రని భవనములవలే కనబడు ఈ ఉన్నత జ్యోతిర్గోళముల వ్యాస ములు మొదలగు కొలతలు లోక సంవ్యవహారార్థము ఈశ్వరుడు సంకల్పించిన విధమున కల్పాదియందు స్వయంభూ బ్రహ్మ బుద్ధి ఆలోచన పూర్వకముగా ఏర్పరచెను. మీకు నేను తెలిపిన జ్యోతిర్వ్యవస్థ దాని ననుసరించినదే; ప్రధాన (ప్రకృతి) పరిణామమే ఈ విశ్వరూపము (విరాట్స్వరూపము.) దీనిని ఉన్న దున్న ట్లు గణన చేయుట కానీ జ్యోతిర్గోళముల గతాగత రూప సంచారము కాని మాంసచకుపుతో నుండు మానవునకు సాధ్యము కాదు. 

 [ఈ చేప్పిన వానిలో – (అధ్యా-123-124-125-126-) కొన్ని ఆధునిక సిద్ధాంతములతో సరిపోవు. మరికొన్ని ప్రాచీన భారతీయ సిద్ధాంతములతో కూడ సరిపోవు. మరికొన్ని తత్వపరము లయినవి. వీనిని తాత్విక దృష్టితో విచారించి ఎరుగవలెను.                                                                                -అనువాదకుడు)

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఖగోళ వర్ణన పరిసమాప్తి యను నూట ఇరువది ఆరవ అధ్యాయము.