81 - విశోక ద్వాదశీ వ్రతము - గుడ ధేన్వాదిదానములును

 మనుః : కి మభీష్ట వియోగశోకసజ్ఘా దలముద్దర్తు ముపోషణవ్రతం చ

విభవోద్భవకారి భూతలేఽస్మిన్భవభూతేరపి సూదనంచ పుంసః

 శ్రీమత్స్యః : పరిపృష్టమిదం జగత్ప్రియం య ద్విబుధానామపి దుర్ణభం*

మహచ్చ

తవ భక్తిమత స్తథాపి వక్ష్యే వ్రత మిన్ద్రాసురమాన వేషు గుహ్యమ్

 పుణ్య మాశ్వయుజే మాసి విశోక ద్వాదశీవ్రతమ్

 దశమ్యాం లఘుభు గ్విద్వా నారభే న్నియమేన తు

 ఉదజ్ముఖః ప్రాజ్ముఖోవా దన్తధావనపూర్వకమ్

 ఏకాదశ్యాం నిరాహార స్సమభ్యర్చ్యచ కేశవమ్

 శ్రియం చాభ్యర్చ్య విధివ ద్బోజ్యమేవ పరేఽహని

 ఏవం నియమకృత్సుప్త్వా ప్రాతరుత్థాయ మానవః

 స్నానం సర్వౌషదైః కుర్యా త్పఇ్చగవ్యజలేన చ

 శుక్లమాల్యామ్బర స్తద్వ త్పూజయే చ్చ్రీశ ముత్పలై:

 విశోకాయ నమః పాదౌ జజ్ఘేచ వర దాయవై

 శ్రీశాయ జానునీ తద్వ దూరూచ జలశాయినే

 కన్దర్పాయ నమో గుహ్యం మాధవాయ నమః కటిమ్

 దామోదరాయే త్యుదరం పార్శ్వేతు విపులాయవై

నాభించ పద్మనాభాయ హృదయం మన్మథాయ వై

 శ్రీధరాయ నమో వక్షః కరౌ మధుభిదే నమః

చక్రిణే వామబాహుంచ దక్షిణం గదినే నమః

 వైకుణ్ఠాయనమః కణ్ఠ మాస్యం యజ్ఞముఖాయవై

 నాసా మశోక నిధయే వాసుదేవాయ చాక్షిణీ

 లలాటం వామనాయేతి హరయేతి పునర్భ్రువో

 అలకాన్మాధవాయేతి కిరీటం విశ్వరూపిణే

 నమస్సర్వాత్మనే తద్వ చ్చిర ఇత్యభిపూజయేత్

 ఏవం సమ్పూజ్య గోవిన్దం ధూపమాల్యానులేపనైః

తతస్తు మణ్డపంకృత్వా స్థణ్ణిలంకారయేన్ముదా

 చతురశ్రం సమన్తాచ్చారత్ని మాత్రముదక్ల్పవమ్

 సూక్ష్మం హృద్యంచ పరితో వప్రత్రయసమావృతమ్

 త్యృజ్గుళోచ్చ్రిత విస్తార న్తద్విస్తారే ద్విరజ్గుళమ్

స్థణ్డిలస్యోపరిష్టాత్తు భిత్తి రష్టాంగుళాభవేత్

 నదీవాలుకయా శూర్పే లక్ష్మ్యాః ప్రతికృతిం న్య సేత్

 స్థణ్డిలే శూర్పమారోవ్య లక్ష్మీ మిత్యర్చయేద్బుధజ

మనువు మత్స్యనారాయణుని ఇట్లడిగేను: ఇష్ట వియోగమువలన శోకము కలుగకుండ చేయునదియు కలిగిన అట్టి శోకమునుండి ప్రాణులనుద్దరించునదియు విభవములను కలిగించునదియు సంసార నాశకమునునగు ఉపవాస పూర్వకమగు వ్రత మేది? అనగా మత్యుడిట్లు చెప్పసాగెను. నీవడిగిన ఈ ప్రశ్నము జగత్రియము; దేవతలకును దుర్ణభము; గొప్పది; దేవ దానవ మానవులకును గుహ్యమగునది. ఐనను నీవు భక్తుడవు అడిగితివి కావున చేప్పేద ను. ఆశ్వయుజ మాసమున చేయు విశోక ద్వాదశీ వ్రతము ఇట్టి పుణ్యకరము.

దశమినాడు లఘు భోజనము చేసి సంప్రదాయమెరిగి. నియమముతో వ్రతమారంభించవలెను. ఏకాదశినాడు పలు దోముకొని స్నానాదికము నేర వేర్చి నిరాహారుడై ఉత్తరాముఖుడో ప్రాజ్ముఖుడో అయి కేశవుని లక్ష్మిని యథావిధిగ అర్చించి ద్వాదశినాడు పారణ చేయవలయును. ఎట్లన ద్వాదశినాడు ఉదయమున లేచి సర్వౌషధులతోను పంచగవ్య సహిత జలముతోను స్నానమాడి తెల్లని పుష్పములను వస్త్రములను ధరించి కలువపూలతో విష్ణునర్చించవలయును.

(పూజా మంత్రము:) 1. విశోకాయనమః పాదౌ పూజయామి; 1. . వరదాయనమః జంఘే పూజయామి ; 8. శ్రీశాయనమః జానునీ పూజయామి; 4. జలశాయినేనమః - ఊరూ పూజయామి; 5. కందరాయనమః-గుహ్యం పూజ యామి; 6. మాధవాయనమః కటిం పూజయామి; 7. దామోదరాయనమః ఉదరం పూజయామి; 8. విపులాయ నమః పార్శ్వే పూజయామీ; 9. పద్మనాభాయనమః నాభిం పూజయామి; 10. మన్మథాయనమః హృదయం పూజయామి; 11. శ్రీధరాయనమః,వక్షః పూజయామి; 12. మధుభిదేనమః కరౌ పూజయామి; 18. చ కిణేనమః.వామబాహుం పూజ యామి; 14. గది నేనమః_దక్షిణ బాహుం పూజయామి; 15. వైకుంఠాయనమః కంఠం పూజయామి; 16. యజ్గముఖాయ నమః-ఆన్యం పూజయామీ; 11. అశోకనిధయేనమః నాసాం పూజయామి; 10. వాసుదేవాయనమః అక్ష్మిణీ పూజయామి; 19. వామనాయ నమః లలాటం పూజయామి; 20. హరయేనమః భుజౌ పూజయామి; 2. మాధవాయనమః ఆలకోన్ పూజయామి; 22. విశ్వరూపిణేనమః-కిరీటం పూజయామి; 28. సర్వాత్మనేనమః శిరః పూజయామి; ఇట్లు అంగపూజ జరిపి పిమ్మట గంధ ధూపమాల్యములతో విష్ణుని పూజింపవలెను.

మండపము ఏర్పరచి దానియందు పిడిమూర కొలత భుజముతో చతురసము మనోహరమగు సన్నని అరుగు ఉత్తరపు విలువలతో చేసి దానిచుట్టును మూడు ప్రాకారములు చేయవలెను. వానిలో బయటిది మూడంగుళముల ఎత్తు నడుమది రెండంగుళముల ఎత్తు లోపలిది ఎనిమిదంగుళముల ఎత్తు ఉండవలెను. ఏటి ఇసుకతో లక్ష్మీ ప్రతిమ చేసి చేటలో ఉంచవలెను. ఆ చేట నరుగ మీద ఉంచి లక్ష్మిని పూజించవలయును.

 నమో దేవ్యై నమశాన్త్యై నమో లక్ష్మ్యై నమశ్శ్రియై

నమః పుష్ట్యై నమస్తుష్ట్యై వృష్ట్యైహృష్ట్యై నమో నమః

 విశోకదుఃఖనాశాయై విశోకా వరదాఽస్తు మే

విశోకాచాస్తు సన్తత్త్యే విశోకా సర్వసిద్ధయే

 తతశ్శుక్లామ్బరై శ్శూర్పం వేష్ట్య సమ్పూజయేత్ఫలైః

 భవ్యైర్నా నావిధై స్తద్వ త్సువర్ణ కల శనచ

 రజనీషుచసర్వాసు పిబేద్దర్బోదకం పునః

 తతస్తు గీతనృత్యాది కారయేత్సకలాం నిశామ్

 యామత్రయే వ్యతీతేతు తత ఉత్థాయ మానవః

 అభిగమ్యచ విప్రాణాం మిథునాని సమర్చయేత్

 శక్తితస్త్రీణి చైకం చ వస్త్రమాల్యానులేపనై  

 శయనానిచ పూజ్యాని నమోఽస్తు జలశాయినే

 తతస్తు గీత వాద్యా న్తే రాత్రౌ జాగరణే కృతే

 ప్రభాతేచ జలస్నానం కృత్వా దమ్పత్య మర్చయేత్

 భోజనంచ యథాశక్త్యా విత్తశాఠ్యవివర్జితః

 భుక్త్వా శ్రుత్వా పురాణాని తద్దినం చాతివాహయేత్

అనేన విధినా సర్వం మాసిమాసి సమాచ రేత్

 వ్రతా నే శయనం దద్యా ద్గుడధేనుసమన్వితమ్

సోపధానకవి శ్రామ స్వాస్తరావరణం శుభమ్

యథాస లక్ష్మీ ర్దేవేశ త్వాం పరిత్యజ్య గచ్చతి

 తథా సురూప మారోగ్య మశోకశ్చాస్తు మే సదా

 యథా దేవేన రహితా న లక్ష్మీ ర్జాయతే క్వచిత్

 తథా విశోకతా మేఽస్తు భక్తిరగ్ర్యాచ కేశవే

 మన్త్రేణానేన శయనం గుడధేనుసమన్వితమ్

 శూర్పంచ లక్ష్మ్యాసహితం దాతవ్యం భూతి మిచ్ఛతా

 ఉత్పలం కరవీరంచ బాణ మమ్లానకుజ్కుమమ్

 కేతకీ సిన్దువారంచ మల్లికాగన్దపాటలమ్

 కదమ్బం మాలతీ (కుజ్కుమం) చాపీ శస్తాన్యేతాని సర్వదా

 (లక్ష్మీ పూజా మంత్రములు: 1. దేవ్యై నమః-2. శాంత్యై నమః-6. లక్ష్మ్యై నమః-4. శ్రియై నమః-5. పుష్యే నమః 6. తుష్యై నమః.7 వృష్యై నమః-8. హృష్యై నమః.9. విశోకాయై నమః-10. దుఃఖనాశాయై నమః అను నప్ లక్ష్మీ పూజా మంత్రములు. వీనిలో ఆమెను పూజించి ఈ ఆర్ఘ్యము నిచ్చు మంత్రములతో ప్రార్థించవలెను. శ్లోకములు లేకుండ జేయు లక్ష్మీ దేవి నాకు వరముల నిచ్చునది యగుగాక ! విశోకయగు లక్ష్మి సంతానము కలిగించుగాక ! ఉన్న సంతతికి యోగ క్షేమముల నిచ్చు గాక! పిమ్మట ఆ చేటను తెల్లని క్రొత్త వస్త్రములతో.. చుట్టవలెను. దానిని నానా విధ భక్ష్యములతో ఫలములతో పూజించి దేవికి సువర్ణ కలశము నర్పించవలెను. రాత్రులయందు దర్భలు వేసి ఉంచిన ఉదకమును త్రాగి ఉండవలయును. రాత్రింబంతయు నృత్యగీతాదికముతో గడుపవలెను.

- అందునను రాత్రి మూడవ జాము గడచిన వెంటనే ఆరంభించి.యథాశక్తిగా ముగ్గురనుగాని ఒకరినికాని వీప్ర దంపతులను స్వయముగా వారి కడకు పోయి పిలుచుకొనివచ్చి వారిని--చారికి దాన మీయ సిద్దపరచిన శయనాది సామగ్రిని కమముగా వస్త్రమాల్యాదికముతో అగ్చించవలెను. పూజయందు 'జలశాయినే నమః' అను మంత్రమును వినియోగించ వలెను.

 ఇట్లు గీత వాద్యాదులతో రాత్రి ముగియు వరకు గడపి జాగరణము ముగించి ఉదయము స్నానమాడి దంప తుల నర్చించి వారికి శయనాదిక మీయవలెను. యథాశ క్తిగా ధన. శాఠ్యము లేక గ్రాహ్మణ సంతర్పణము చేసి తానును భుజించి పురాణ శ్రవణముతో ఆనాడు గడుపవలెను.

ఇట్లు ప్రతి మాసమునను సంవత్సరము ముగియు వరకు) జరిపి.. వతాంతమున గుడ ధేనువు.దీండ్లు.పరపులు మొదలగు పరికరములు-దుప్పటి మొదలగునవి, వీనితో కూడ మంచము లను చైటతో కూడ లక్ష్మీదేవిని విప్రున(ల)కు దానమీయవలెను. దీనిచే సర్వ శుభములున్లు కలుగును.

పూజ కై 1. కలువ తెలుపు-ఎరుపు-నీలము. ఏదైనను) 2. కర వీరము (ఎర్రగన్నేరు-దానిపంటి "ఆకులుగల చెట్టు నకే పూ పైడి తెల్లని పూవులును కరవీర .) 8. తెల్లుపూవు-4. పొడని గన్నేరు. 6. కుంకుమపూ పు. 6. మొగలి '8. పేం కణము. 8. మల్లె.9. సంపెంగ.10. మంకెన 11. కడిమి.12. మాలతీ పుష్పములు వరుసగా పండ్రెండు మాసములందును ప్రశ స్తములు లేదా ఇవి ఎప్పుడును పూజకై మంచివి.

గుడధేన్వాదిదానాని

మనుః : గుడధేనువిధానం చ సమాచక్ష్వ జగత్పతే

 కింరూపం కేనమన్త్రేన దాతవ్యం తదిహోచ్యతామ్

 శ్రీమత్స్యః : గుడధేనువిధానస్య యద్రూప మిహ యత్పలమ్

 తదిదానీం ప్రవక్ష్యామి సర్వపాపవినాశనమ్

 కృష్ణాజినం చతుర్హస్తం ప్రాగ్గ్రీవం విన్య సే ద్భువి

 గోమయేనానులిస్తాయాం దర్బానా స్తీర్య సర్వత

లఘ్వైణకాజినం తద్వ ద్వత్సస్య పరికల్పయేత్

 ప్రాజ్ముఖీం కల్పయేద్ధేను ముదగాస్య స్వవత్సకామ్

 ఉ త్తమా గుడ ధేను స్స్యాత్తదా భారచతుష్టయమ్

 వత్సం భారేణ కుర్వీత భారాభ్యాం మధ్యమా స్మృతా

 అర్ధ భారేణ వత్సస్యా త్కనిష్ఠా భార కేణతు

 చతుర్థాం శేన వత్సస్స్యా ద్గృహీ విత్తానుసారతః

 ధేనువత్సౌ స్య సేదేవం సితమాల్యామ్బరావృతౌ

 శుక్తికర్ణా విక్షుపాదౌ సీతముక్తాఫలేక్షణౌ

సితసూత్ర సిరాజాతౌ సితకమ్బళకమ్బళౌ

 తామ్రమ స్తకృష్ఠౌ తౌ సీత చామర రోమకౌ

 విద్రుమభ్రూయుగో పేతౌ నవనిత స్తనాన్వితౌ

క్షౌమపుచ్ఛౌ కాంస్యదోహా విన్ద్రనీలక తారకౌ

 సువర్ణశృజ్గాభరణౌ రాజతాఖురసంయుతౌ

 నానాఫలసమాయుక్తా ఘ్రాణగన్దకరణ్డకౌ

 ఇత్యేవం రచయిత్వా తౌ ధూపదీపై రథార్చయేత్

 యాలక్ష్మీ స్సర్వభూతానాం యాచ దేవే ష్వవస్థితా

ధేనురూ పేణ సా దేవీ మమ(శాన్తిం ప్రయచ్చతు) పాపం వ్యపోహతు

 దేహస్థా యాచ రుద్రాణీ శఙ్కరస్య చ యా ప్రియా

 ధేనురూ పేణ సాదేవీ మమపాపం వ్యపోహతు

 విష్ణోరఁ క్షసి యా లక్ష్మీ స్వాహా యాచ విభావసో

 చన్ద్రార్క ఋక్షతారాణా మనురూపాచ యారమా

చతుర్ముఖస్య యాలక్ష్మీ ర్యాలక్ష్మీ ర్ధనదస్యచ

 యాలక్ష్మీ ర్లోకపాలానాం సాధేను ర్వర దాఽస్తు మే

 స్వధా యా పితృముఖ్యానాం స్వాహా యజ్ఞభుజాం తథా

 ధేనురూ పేణ సాదేవీ మమ పాపం వ్యపోహతు

సర్వపాపహరే దేవి తత్వం శాన్తిం ప్రయచ్ఛమే

 ఏవమామన్త్ర్య తాం ధేనుం బ్రాహ్మణాయ నివేదయేత్

విశోక ద్వాదశీ కల్పమున ప్రాసంగికముగా పేర్కొనిన , గుడ ధేనుదానము అనునది ఏమి? దాని స్వరూపమును విధానమును దానమున వినియోగించు మంత్రమును తెలుపుమని మను వడుగగా మత్స్య నారాయణు డిట్లు' చెప్పెను: సర్వ పాప వినాశనమగు గుడ ధేను స్వరూపమును దాన విధానఫల వినియోజ్య మంత్రములను తెలి పెదను; వినుము.

నాలుగు మూరల పొడవుగల కృష్ణాజినము(నల్లని మచ్చలుగల ఇజ్జీచర్మమును గోమయముతో అలికి నాలుగు వైపుల దర్భలను పరచిన ప్రదేశమున తూర్పు మొగము అగునట్లు పరచవలెను. అట్టి ప్రదేశముననే ఉత్తరమునకు మొగ మగునట్లు చిన్న కృష్ణాజినము కూడ దానికి దగ్గరగా పరచవలెను. (మొదటిది ఆవుకొరకును- రెండవది దూడ కొరకును.)

గుడముతో ఆవును దూడను చేసి , తూర్పు మొగముగా , ఆవును ఉత్తరపు మొగముగా దూడను నిలుపవలెను. యథాశ క్తిగా ఆవును నాలుగు ‘బారువ'లు దూడను ఒక బారువ-ఇదే వంతున ఆవును రెండు బారువలు. దూడను ఆర బారువ-ఆవును ఒక బారువ దూడను పావు బారువ తూకముగల బెల్లముతో చేయవలెను. వీనికి ము తైపు చిప్పలతో చెవులు --చెరకుగడతో కాళ్లుము తైములతో కండ్లు" - తెల్లని దారములతో నాడులు.తెల్ల కంబళితో గంగడోలు-పలుచని రాగి రేకుతో మొగము-వీపు. తెల్లని చామరముతో తోక కుచ్చు-పగడములతో కనుబొమలు - వెన్నతో చన్నులు - పట్టుదారముతో తోక కాడ - కంచుపాత్రతో పొదుగు - ఇంద్రనీలముతో కనుగుడ్లు - బంగారు కొమ్ములు వెండి గిట్టలు "సం పెగ పూలతో ముక్కులు' అమర్చవలెను. వానిముందు నానా ఫలములుంచవలెను. ఇట్లు సిద్దపరచిన ఆ ఆవును , దూడను గంధ' ధూప దీపాదిక ముతో నైవేద్యముతో అర్చించవలెను.

పిమ్మట ఈ ఆర్థమునిచ్చు మంత్రముతో వాటిని ప్రార్థించవలెను. (మంత్రార్థము:). సర్వ భూతములందును సర్వదేవతలయందును సర్వదేహములందును ఉన్న దియై శంకరుని ప్రియురాలగురు దాణిగా విష్ణుని వక్షసునందు లక్ష్మిగా అగ్నియందు స్వాహాగా చంద్ర రవి నక్షత్ర తారలయందు కాంతిరూపయగు లక్ష్మిగా " చతుర్ముఖునందు వాణిగా కుబేరునందు ధనముగా లోకపాలుకయందు ఆందూ రూపములతో లక్ష్మిగా పితృదేవతలయందు స్వధారూపగా నున్న లక్ష్మియే 'ధేను రూపముననుండి నాపాపమును పోగొట్టుగాక! సర్వపాపహరయగు దేవీ: లక్ష్మీ! ఇట్టి నీవు నాకు శాంతిని ఇమ్ము.

ఇట్లు ఆగుడ ధేనువు, నామంత్రించి, దానిని బ్రాహ్మణునకీయవలయును.

విధానమేవం ధేనూనాం సర్వాసా మిహ పఠ్యతే

 యాస్తు పాపవినాశిన్యః పఠ్యన్తే(నవ) దశ ధేనవః

 తాసాం స్వరూపం వక్ష్యామి నామానిచ నరాధిప

 ప్రథమా గుడధేను స్స్యాద్ఘృతధేను స్తథాఽపరా

తిలధేను న్తృతీయాతు చతుర్థి జలసంజ్ఞితా

 పజ్ఞ్చమీ రసధేనుస్స్యాత్ షష్ఠి ధాన్యాహ్వయా తథా

 సప్తమీ శర్కరాధేను రష్టమీ లవణస్యచ

 రత్నధేనుశ్చ నవమీ దశ మీ స్యా త్స్వరూపతః

 కుమ్బాః స్యుర్ద్రవధీనూనా మితరాసాంతు రాశయః

సువర్ణదేనుం చాప్యత్ర కేచి దిచ్చన్తి మానవాః

నవనీతేన థై లేన తథాఽన్యేపి మహర్షయః

 ఏతదేవ విధానంస్యా త్తఏవోపస్కరా స్మృతాః

మన్త్రా వాహనసంయుక్తాస్సదా పర్వణీపర్వణి

యథాశ్రద్దం ప్రదాతవ్యా భుక్తిముక్తిఫలప్రదాః

 గుడధేనుప్రసజ్గేన సర్వా స్తావన్మయాదితాః

 అనేకయజ్ఞఫలదా స్సర్వపాపహరా శ్శుభాః

వ్రతానా ముత్తమం యస్మా ద్విశోక ద్వాదశీవ్రతమ్

 తదజ్గత్వేన చై వాత్ర గుడధేనుః ప్రశస్యతే

అయనే విషువే పుణ్యే వ్యతీపాతేఽథవా పునః

 గుడధేన్వాదయో దేయా స్సోపరాగాదీపర్వసు

విశోక ద్వాదశీ పుణ్యా సర్వపాపహరా శుభా

 యాముపోష్య నరో యాతి త్వష్ణోః పరమం పదమ్

 ఇహలో కేచ సౌభాగ్య మాయు రారోగ్యమేవచ

 వైష్ణవం పద మాప్నోతి మరణే స్మరణా ద్దరేః

నవార్బుదసహస్రాణి దశ చాష్టౌచ ధర్మవిత్

నచోగ్రదుఃఖ దౌర్గత్యం తస్య సఙ్ఞాయతే నృప

 నారీవా కురుతే యాతు విశోక ద్వాదశీవ్రతమ్

నృత్తగీతపరా నిత్యం సాఽపి తత్ఫలమాప్నుయాత్

 తస్మా దగ్రే హరే ర్నిత్య మనస్తం గీత వాదనమ్

 కర్తవ్యం భూతికా మేన భక్త్యాతు పరయా ముదా

 ఇతి పఠతి య ఇత్థం సర్వదా యస్తు సమ్య జ్మధుముర నర కారే రర్చనం సాధు పశ్యేత్  

మతిమపిచ నరాణాం యే దదాతీన్ద్రలోకే

వసతి స విబుధౌఘైః పూజ్యతే కల్పమేకమ్

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే విశోక ద్వాదశీవ్రత గుడ ధేన్వాదిదానకథనం నామైకాశీతీత మోఽధ్యాయః

 పాపహరములగు ధేనువులు ఇట్టివి గుడ-ఘృత-తిల-జల.రస-ధాన్య-శర్కరా.లవణ-రశ్న - స్వరూప (గోరూవ) ధేనువు లనునవి పది కలవు. సువర్ణ నవనీత తైల ధేనువులను కూడ కొందరు మహర్షులు చెప్పి వారు. వీటిలో ద్రవ ధేనువులను అవి నింపిన మట్టి కడవలతో చిన్న పాత్రలతో కాని) అమర్చవలెను. గట్టి ద్రవ్యములైనచో రాసులుగా అమర్చవలయును. అన్ని టి విషయమునను ఇదే విధానము; ఇవే మంత్రములు. ఆవాహనాది పూజలతో ఆయా పర్వము లందవి ఈయవలయును. గుడ దేను ప్రసంగమున ఇవి చెప్పుటయైనది. ఇవి అన్నియు సర్వపాపహరములు; అనేక యజ్గ ఫలప్రదములు.

విశోక ద్వాదశీ వ్రతము వ్రతములలో నెల్ల ఉత్తమమయినది. దానికి అంగ భూతము ఈ గుడ దేను దానము.

ఈ ధేను దానములు ప్రత్యేకముగా ఈయవలెనని (ఉత్తర దక్షిణ) అయనములు విషువ (రాత్రింబవళ్ళు సమముగా ఉండు) కాలము వ్యతీపాత యోగమున్న దినము. ఇట్టివి తగిన కాలములు.

ఈ విశోక ద్వాదశి పుణ్యప్రదము-సర్వపాపహరము -శుభకరము; ఈ దినమున ఉపవాసము ముక్తిప్రదము. దీనిచే ఇహమున ఆయురారోగ్య సౌభాగ్యములు -మరణ కాలమున (ఇది చేసినవారికి) హస్మరణ మాత్రమున విష్ణులోక ప్రాప్తి కలుగును. ఇరువది ఏడు వేల ఆర్బుదముల సంవత్సరములపాటు దారిద్ర్యమును తీవ్ర దుఃఖములును " లేక సుఖింతురు. నృత్తగీతాది పూర్వకముగా నియమముతో ఈ వ్రతము చేసిన శ్రీ కిని ఈ ఫలము కలుగును. కనుక హరి ఎదుట నృత్తగీతములు భక్తితో చేయుట కర్తవ్యము. దానిచే సకల సంపదలును ము క్తియు లభించును.

ఈ వ్రతమును వినినను చదివినను ఇతరులకు తెలిపినను చూచినను కలకాలము ఇంద్రలోకమున దేవ పూజితుడే సుఖించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున విశోక ద్వాదశీవ్రత -గుడ ధేన్వాది దాన కథనమను

ఎనుబది యొకటవ అధ్యాయము.