90 - రౌప్య పర్వత దానము

 ఈశ్వర : అతఃపరం ప్రవక్ష్యామి రౌప్య శైల మనుత్తమమ్

 యత్ప్రదానా న్న రో యాతి సోమలోకం ద్విజోత్తమ

 దశభిః పలసాహస్రై రుత్తమో రజతాచలః

 పఞ్చభి ర్మద్యమః ప్రో క్త స్తద ర్ధేనాధమ స్మృతః

 అశక్తో వింశతే రూర్ధ్వం కారయే ద్భక్తిత స్సదా

 విష్కంభపర్వతాం స్తద్వ త్తురీయాం శేన కల్పయేత్

 పూర్వవ ద్రాజతా న్కుర్యా న్మన్దరాదీ స్వధానతః

 కలధౌతమయాం స్తద్వ లో కేశా నారయే ద్బుధ

బ్రహ్మవిష్ణ్వర్కవ త్కార్యో నీతమ్బోఽత్ర హిరణ్మయః

రాజత స్స్యా దతోఽన్యేషాం సర్వస్మిన్నిహ కాఞ్చనమ్

 శేషంచ పూర్వవత్కుర్యా ద్ధోమజాగరణాదికమ్

 దద్యా త్తతః ప్రభాతేతు గురవే రజతాచలమ్

 విష్కమ్బశైలా నృత్విగ్భ్యః పూజ్య వస్త్రవిభూషణైః

 ఇమం మన్త్రం పఠే ద్దద్యాద్దర్భపాణి ర్విమత్సరః

 పితృణాం వల్లభం యస్మా ద్విష్ణోర్వా శఙ్కరస్యచ

 పాహి రాజత తస్మా త్త్వం శోకసంసార సాగరాత్

 ఇత్థం నివేద్య యో దద్యా ద్రజతాచల ముత్తమమ్

 గవా మయుతహస్రఫల మాప్నోతి మానవః

 సోమలో కే సగన్దర్వైః కిన్న రాప్సరసాం గణైః

 పూజ్యమానో వస్తే ద్విద్వా న్యావదాభూత సమ్లవమ్  

ఇతి శ్రీమత్ప్యమహాపురాణే రజతాచల దానమాహాత్మ్య కథనం నామ నవతీత

మోఽధ్యాయః

 ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను: ఇక మీదట రౌప్య పర్వత (వెండికొండ) దాన విషయము తేలి పెదను. ఇది సర్వోత్తమము. దీని నాచరించినవారు సోమలోక ప్రాపులగుదురు. దీనికే పదివేల పలములు కాని ఐదువేల పలములు కాని రెండున్నర వందల పలములు కాని తూకముకల వెండి కావలయును. శ క్తిలేనివారు భక్తితో ఇరువది పలములకు తక్కువ కాని వెండితోనైన చేయవచ్చును. ప్రవలేనే చతుర్థాంశముతో విష్కంభ పర్వతములను వెండితోనే మందరాది పర్వతముల సాయా దిశ లందును బంగారుతో లోకపాలురను బంగారుతో నెత్తము చేయించి దాని పై బ్రహ్మ విష్ణు రవి రుద్రుల స్వర్ణ ప్రతిమలను చేయించవలెను. మిగిలిన పర్వతముల విషయమున వెండినుపయోగించిన వానికి ఈ రౌప్య పర్వత దానములో బంగారు ఉపయోగించవలెను. హోమ జాగరణాదికము పైవలెనే చేయవలెను. తెల్లవారిన పిదప ఈ రజతా చలములోని నడుమ భాగమును ఆచార్యునకును విష్కంభ పర్వతములను ఋత్విక్కులకును నీయవలెను. (దాన కాలమున) వారినందరను వస్తాభరణములతో పూజించవలయును. దర్భపాణియై విమత్సరుడై - ఈ అర్థ మునిచ్చు మంత్రమును పఠించవలయును: “రజతమా! నీవు పితరులకును విష్ణు శంకరులకును ప్రియ మైన దానవు. ఇట్టి నీవు సంసార సాగరమునుండి నన్ను దాటించుము.” ఇట్లు ఆవాహనము చేసి ప్రార్థించి రజతాచల దానము నొనరించువారు వేయి పది వేల (1000x10000) గోవుల దానమిచ్చినంత ఫలము నందుదురు. గంధర్వ కిన్న రాప్సరో గణముల పూజలనందుకొనుచు కల్పాంతమువరకును సోమలోకమునందు వసింతురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున రజతాచల దాన మాహాత్మ్య కథనమను తొంబదియవ అధ్యాయము.