మత్స్య మహా పురాణము
181 - స్కంద సనకాది సంవాదము-అవి ముక్త మాహాత్మ్యము॥
సూతః : కైలానపృష్ఠ మాసీనం స్కన్దం బ్రహ్మవిదాం వరమ్ ।
పప్రచ్చు రృషయ స్సర్వే సనకాద్యా స్తపోధనాః॥
తథా బ్రహ్మర్షయస్సర్వే యే భక్తాస్తు మహేశ్వరే ।
ఋషయః : బ్రూహి త్వం స్కన భూలో కే యత్ర నిత్యం భవ స్థ్సితః॥
మహాత్మా సర్వభూతాత్మా దేవదేవ స్సనాతనః ।
ఘోర రూపం సమాస్థాయ దుష్కరం దేవదానవై ॥
ఆభూతసమ్లవం యావత్థాణుభూత స్థితః ప్రభుః ।
గుహ్యానాం పరమం గుహ్య మవిముక్త మితి స్మృతమ్॥
అవీము కే సదా సిద్దిర్యత్ర నిత్యం భవష్ఠితః ।
అస్య క్షేత్రస్య మహాత్మ్యం మదు క్తం త్వీశ్వరేణ తు॥
స్థానం పరం పవిత్రంచ తీర్థమాయతనం తథా ।
శ్మశానసంస్థితం వేశ్మ దివ్యమ నరితంచ యత్॥
భూలో కే నైవ సంయుక్త మ నరి కే శివాలయమ్ ।
అయుక్తాస్తు న పశ్య ని యుక్తాః పశ్య ని చేత సా॥
బ్రహ్మచర్యవ్రతై శ్శాన్తో స్సీద్ధా వేదా నకోవిదాః ।
ఆదేహపతనాద్యావ తేత్రం యో న విముఇ్చతి॥
బ్రహ్మచర్యవ్రతై స్సమ్యక్సమ్యగిష్టం మఫ్లర్భవేత్ ।
అపాపాత్మా గతిస్సర్వా యాతూకా చ క్రియావతామ్॥
శ్రేయసీం గతిం పుణ్యం తథా యోగగతిం లభేత్ ।
న హి యోగగతిర్దివ్యా జన్మా న్తర శతై రపి॥
ప్రాప్యతే క్షేత్రమాహాత్మ్యా త్రసాదా చ్ఛక్కరస్య తు ।
య స్తత్ర వసతే నిత్యం సంయతాత్మా సమాహితః॥
త్రికాలమపి భుజానో వాయుభక్షసమో భవేత్ ।
నిమేషమాత్రమపియో హ్యవిముక్తీ తు భక్తి మాక్॥
బ్రహ్మచర్య సమాయుక్త స్స పరం తప్యతే తపః ।
తత్ర మాసం వ సేద్వీరో జీతాత్మా విజితేంద్రియః॥
సమ్యక్తేన వ్రతం చీర్ణం దివ్యం పాశుపతం మహత్ ।
జన్మమృత్యు భయం తీర్త్వా స యాతి పరమాం గతిమ్॥
నైః శ్రేయసీం గతిం పుణ్యాం తథా యోగగతిం వ్రజేత్ ।
సూతుడు ఋషులకిట్లు చెప్పెను: తపోధనులగు సనకాది సర్వఋషులును మ హేశ్వర భక్తులగు సర్వ మహర్పు లును కైలాస పర్వతపు నెత్తమున కూర్చున్న వాడును బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడునగు స్కందుని ఇట్లడిగిరి॥ స్కందా? మహాత్ముడు సర్వభూత ములకు ఆత్మభూతుడు దేవదేవుడు సనాతనుడు ప్రభుడునగు భవుడు (శివుడు) దేవదానవులకును దుష్కరమగు ఘోర రూపమును ధరించి స్థాణు భూతుడై భూత ప్రళయమువరకును భూలోక మందెచ్చట నిరంతరము ఉండునో అట్టి గుహ్యము రహస్యము)లలో పరమ గుహ్యమగు క్షేత్రము ఆవిముక్తమని పెద్దలందురు॥ ఇచట నిత్యమును భవుడుండుటచే ఇది సదా సిద్దిప్రదము; ఈశ్వరుడు చెప్పినట్లు ఈ క్షేత్ర మాహాత్మ్యము ఇది; ఇది పరమ పవిత్ర స్థానము; ఇది తీర్థమును క్షేత్రమును; ఇచట శ్మశానమందే శివుని గృహము (శివాలయము) దివ్యమైనది॥ అంతరితమయి భూలోకముతో అంటక అంతరిక్షమునందున్నది; దీనిని యోగ సం స్కృతమగు చిత్తము కలవారు బ్రహ్మ చర్య వ్రత ములతో శాంతులయిన వేదాంత కోవిదులగు సిద్దులు చూడగలరు; ఇతరులు చూడజాలరు; దేహపాతము అగు వరకును ఈ క్షేత్రమును విడువక నివసించుట॥ లేస్సగా జహ్మచర్య వ్రతముల ననుష్ఠించుటతోను చక్కగ యజ్ఞము లాచరించుటతోను సమానము; పాప రహితులయి ఉత్తమ కర్మానుష్టానము చేసిన వారును పుణ్యమయిన యోగ సాధన చేసినవారును పొందు ఉత్తమగతి ఆ మరణాంతము ఈ క్షేత్రమున నివసించుటచే లభించును॥ ఏలయన దివ్యయోగ సాధనచే ఉత్తమ గతియును జన్మశతములచే కూడ లభించకపోవచ్చును॥ అది ఈ క్షేత్ర మాహాత్మ్యమున శంకర ప్రసాదమున సులభమగును॥ ఇచట మనోనిగ్రహము కలిగి శివునియందు చిత్తము నిలిపి నిరతము వసించువాడు మూడు వేళల భుజించినను వాయు భక్షణమున జీవించునట్లే॥ అవిముక్త క్షేత్రమున దినమునకోక నిమేష మాత్ర మయినను భక్తియుక్తుడై బ్రహ్మచర్యము కలిగి తపమాచరించుచు ఇంద్రియములను మనస్సును జయించి మానమాత్రము నీయమ పరుడై వసించువాడు మహాదివ్య పాశుపత వ్రతము ననుష్ఠించునట్లే; అట్టివాడు జన్మ మృత్యుభయము నతిక్రమించి పరమ గతినందును॥ పుణ్య లభ్యమగు నిః శ్రేయస (పార లౌకిక) గతిని యోగసిద్ది లభ్యమగు పరమగతిని అందును॥
న హి యోగగతి ర్ధివ్యా జన్మా స్తరశతై రపీ॥
ప్రాప్యతే క్షే త్రమాహాత్మ్యా త్ప్రభావా చ్చజ్కరస్యతు ।
బ్రహ్మహా యోహి గచ్చేత అవిముక్తం కదాచన॥
తస్య క్షేత్రస్య మాహాత్మ్యా ద్ర్బహ్మహత్యా నివర్తతే ।
ఆదేహపతనా ద్యావ శ్లేత్రం యో న విముణ్చాతి॥
న కేవలం బ్రహ్మహత్యా ప్రాకృతా చనివర్తతే ।
ప్రాప్యవి శ్వేశ్వరం దేవం న స భూయోనుజాయతే॥
అనన్యమానసో భూత్వా యోఒవిముక్తం న ముహ్చౌతి ।
తస్య దేవ స్సదా తుష్ట స్సర్వా న్కామాన్పయచ్ఛతి॥
ద్వారం యత్సాజ్యయోగానాం స తత్ర వసతి ప్రభుః ।
సగుణో హి భవో దేవో భక్తానా మనుకమ్పయా॥
అవిముక్తం పరం క్షేత్ర మవిము క్రే పరా గతిః ।
అవిము క్రే పరా సిద్ది రవిముక్తీ పరం పదమ్॥
అవిముక్తం ని షే వేత దేవర్షిగణ సేవితమ్ ।
యఇచ్చే న్మానవో ధీమా నునర్జన్మ న చాత్మనః॥
మేరో శ్శక్యా గుణా న్వక్తుం ద్వీపానాం తు తథైవచ ।
సముద్రాణాం చ సర్వేషాం నావిముక్తస్య శక్యతే॥
ఆ నకాలే మనుష్యాణాం ఛిద్యమానేమ మర్మసు ।
పొయూనాం శీర్యమాణానాం స్మృతి రైవోపజాయతే॥
అవిముకే హ్య శకాలే భక్తానా మీశ్వర స్స్వయమ్ ।
కర్మభిః పేర్యమాణానాం కర్ణజాపం ప్రయచ్ఛతి॥
అవిముక్తీ త్యజే ద్దేహం గతిమిషాం స గచ్ఛతి ।
ఈశ్వర పేరితో యాతి దుష్పావ్య మకృతాత్మభిః॥
అశాశ్వత మిదం జ్ఞాత్వా మానుష్యం బహుకిల్బిషమ్ ।
అవిముక్తం ని షేవేత సంసార భయమోచనమ్॥
భోగ మోక్షప్రదంపుణ్యం బహు విఘ్న వినాశనమ్ ।
విఘ్నో రాలోక్యమానోపి యో ఒవిముక్తం న ముఖ్చతి॥
స ముఞ్చతి జరాం మృత్యుం జన్మ చైత దశాశ్వతమ్ ।
అవిముక్తే ప్రసాదాత్తు శివసాయుజ్య మాప్నుగూత్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే స్కన్దసనకాదిమహర్షి సంవాదే అవిముక్త
మాహాత్మ్యే ఏకాశీత్యుత్తరశతత మోధ్యాయః॥
దివ్యయోగగతి నూరు జన్మాంతరములకును॥ లభించకపోవచ్చును; కాని అవిము క్షమున మాత్రము ఈ క్షేత్ర మాహాత్మ్యమున శంకర ప్రసాదమున అది లభించును; బ్రహ్మ హత్య చేసినవాడును ఒక మారైన ఈ క్షేత్రమున కేగినచో తన్మాహాత్మ్యమున అది నివర్తిల్లును; దేహపాతమగువరకు అతడిచట వసించుటచే ఆ బ్రహ్మహత్యా దోష మేకాక పూర్వ కృత దోషములును నశించును; వాడు విశ్వేశ్వరుని సన్నిధీనందును; మరల జన్మించడు; ఆనన్య మనస్కుడై ఇట విడు వక వసించువాని విషయమున దేవుడు సంతుష్టుడయి సర్వకామముల నొసగును; సాంఖ్యయోగ తత్వములకు ద్వార భూతుడగు ప్రభువు ఆగు భవుడు మహాదేవుడు సగుణరూపుడై భక్తులయందలి దయతో ఆట వసించుచున్నాడు; అవి ముక్తము పరమ క్షేత్రము; అచట ఉండుటచే పరమసిద్ధి పరమపదము పరమగతి దొరకును; పునర్జన్మము కలుగరాదను కొను ధీమంతుడగు వాడు దేవర్షిగణసేవితమగు అవిముక్తమును సేవించవలయును; మేరు పర్వతమునకు ద్వీపములకు సముద్రములకు గల గుణములనే న చెప్పగలము కానీ ఈ అవిముక్త క్షేత్ర గుణముల చెప్పజాలము; ఆంత కాలమున మాన వుల (ప్రాణుల) మర్మస్థానములు భిన్న మగుచుండగా ప్రాణ వాయువులు శిథిలమగుచుండగా స్మృతియే లేకుండ పోవును; ఆప్పుడును ఈశ్వరుడు ఆయా కర్మలచే పేరితులై బాధలనందు తన భక్తులకు తాను స్వయముగా కర్ణములందు మంత్రోవ దేశమునిచ్చును॥ అవిముక్తమున దేహత్యాగ మొనర్చువాడు ఉత్తమ సంస్కారమందిన ఆత్మలు లేనివారికి పొందరాని ఇష్టపరమ గతిని ఈశ్వర పేరణచే పొందును॥ ఈ మానుష్యలోకము ఆశ్వతమును బహుపాపయుక్తమును; ఇది ఎరిగి సంసారభయ మోచనమగు ఆవిము క్తమును సేవించవలయును; ఇది భోగ మోక్షప్రదము॥పుణ్యము॥ బహు విఘ్న వినాశనము; వీఘ్న సహితుడయినను అవిముక్తమును విడువక ఆట వసించువాడు అశాశ్వతమగు ఈ జన్మమును జరా మృత్యువులను వీడి శివప్రసాదమున శివ సాయుజ్యమందును॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున స్కంద సనకాది మహర్షి సంవాదరూపమగు అవిముక్త క్షేత్ర మాహాత్మ్యమను నూట ఎనుబది ఒకటవ అధ్యాయము॥
Summary of chapter 181 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya initiates the detailed exposition of Vārāṇasī-māhātmya, revealing to King Vaivashvata Manu the unsurpassed spiritual glory of Kāshī, also known as Avimukta-kshetra. Mahādeva declares that Kāshī is His eternal, imperishable abode resting upon His trident, untouched by cosmic deluges. Any living entity departing from the mortal frame within this sanctified realm receives the divine Tāraka Mantra directly from Mahādeva, attaining immediate spiritual liberation without undergoing future births.