178 - ఈశ్వరుడు అంధకాసురుని చంపుట (శివుని భైరవత్వమును తెలుపుకథ)

ఋషయః : శ్రుతః పద్మోద్భవ స్సూత విస్తరేణ త్వయోదితః

సమాసా ద్భవమాహాత్మ్యం భైరవస్య విధీయతామ్

సూత:  : తస్యాపి దేవదేవస్య శృణుద్వం కర్మ చోత్తమమ్

ఆసీ ద్దైత్యోఽన్దకో నామ భిన్నాజ్ఞానచయప్రభః

తపసా మహతా యుక్తో హ్యవధ్య స్త్రీదివౌకసామ్

స కదాచి న్మహాదేవం హర్వత్యా సహితం విభుమ్

క్రీడమానం తదా దృష్ట్వా హర్తుం దేవీం ప్రచక్ర మే

తస్య యుద్ధం తదా ఘోర మభవ త్సహ శమ్భునా

అవ న్తీవిషయే ఘోరే మహాకాలవనం ప్రతి

ఆస్మిన్యుద్దే తదా రుద్ర శ్చాన్ద్ర కేనాతిపీడిత

సుషవే బాణమత్యుగ్రం నామ్నా పాశుపతంహితత్

రుద్రబాణవినిర్భేదరుధిరా దన్దక స్య హ

అన్దకాశ్చ సముత్పన్నా శ్శతశోఽథ సహస్రశః

తేషాం విదార్యమాణానాం రుధిరా దపరే పునః

బభూవు రన్దకా ఘోరా యైర్యాప్త మఖిలం జగత్

అన్దకాసురశరీరోత్పన్నర క్తపానార్థమీశ్వరకృతమాతృగణ సృష్టిః

ఏవం మాయావినం దృష్ట్వా తంచ దేవ స్తదాన్దకమ్

పానార్థ మన్దకస్యాపి ససృజే మాతర స్తదా

ఋషులు సూతునితో ఇట్లనిరి: సూతా! నీవు పద్మోద్భవ వృత్తాంతమును విస్తరముగా మాకు చెప్పి వినిపించితివి భై రవమాహాత్మ్యమును సంగ్రహముగా చెప్పి వినిపింపగోరుచున్నాము ఆన సూతుడిట్లు , చెప్పనారంభించెను; దేవదేవు: డగు భైరవుడు నిర్వర్తించిన ఉత్తమ కర్మమును చెప్పేద వినుడు; అంధకుడను దైత్యుడుండెడివాడు; వాడు అపుడే పగులగొట్టిన కాటుకరా శివలే మేర యువాడు మహా తపమాచరించినవాడు; దేవతలకును అవధ్యుడు; వాడో ప్పుడు పార్వతితో కూడి విహరించుచున్న విభుని మహా దేవుని చూచి దేవి సపహరింప సమక లైను అవంతీదేశమున ఘోరమగు మహాకాలవనమందు ఈ ఓషయమయి ఆంధకునకు శంభునితో యుద్దము " జరిగేను దానియందు శివుడు అంధకునిచే మిగుల బాధనం దెను ఆపుదీశ్వరుడు పాశుపతమను అత్యుగ్ర దాణమును ప్రయోగించేను రుద్రుడు తనబాణముతో అంధకుని చీల్చగా 'వాని రక్తమునుండి మరల - అట్టివారే మరి కొందరంధకులు జనించిరి వారితో సమస్త జగము వ్యా ప్రమయ్యేను ఇట్లా " యంధకుడు మాయావియగుట చూచి ఆదేపుడు ఆంధ కుని - (రక్తమును) త్రోవుటకుమాతృ కలను దేవతలను సృజించెను (మహాకాలవనము ఉజ్జయిని దగ్గర ఉండెను)

మాహేశ్వరీం తథా బ్రాహ్మీం కౌమారీం మాలినీం తథా

సౌవర్ణి మథ వాయవ్యాం శాక్రీం వై నాయకీం తథా

సౌరీం సౌమ్యాం శివాం దూతీం చాముణ్డా మథ వారుణీమ్

వారాహీం నార సింహీంచ వైష్ణవీం చ చలచ్చిఖామ్

శతానన్దాం భగానన్దాం పిచ్చిలాం భగమాలినీమ్

బలా చాతిబలాం రక్తాం సురభీం సుఖమణ్డికామ్

మాతృనన్దాం సునన్దాంచ బిడాలీం శకునీం తథా

రై వతీం శాజ్కరీం చన్ద్రాం లాంగలీం కుదినీం తథా

జయాoచ విజయం చైవ జయన్తీం చాపరాజితామ్

కాలించైవ మహాకాళీం దూతీంచైవ తథైవచ

సుభగాం దుర్బగాంచైవ కరాళీం నన్దినీం తథా

అదితించ దితించైవ మారీం వై మృత్యు మేవచ

కర్ణ (ర్మ)మోటీం తథా యామ్యా ములూఖీంచ ఘటోదరీమ్

వజ్రహస్తాం పిశాచీంచ కపాలీం రాక్షసీం తథా

భుసుణ్డిం శాజ్కరీం లమ్బాం చన్ద్రాంచ కర భాం తథా

మోటాం సులోచనాం ధూమ్రాం వర వాణీం కరాళికామ్

విశాలదంష్ట్రిణీం శ్యామాం త్రిజటీం కుక్కుటాం తథా

వినాయకీoచ వైతాళీ మున్మ నాం బడ బాం తథా

సిద్ధించ లేలిహానాంచ కేకరీం గర్దభీం తథా

ఉత్కటాం బహుపుత్త్రీంచ ప్రేతయానాం వీటజ్కినీమ్

క్రౌఞ్చిం శైలముఖీం చైవ వినతాం పరమాం దనమ్

ఉమాం రంభాం మేనకాంచ సలిలాం చిత్రరూపిణీమ్

స్వధాం స్వాహాం వషట్కారాం ధృతిం జ్యేష్ఠాం కపర్దినీమ్

మాయాం విచిత్రరూపాంచ కామరూపాంచ సజ్గమామ్

ముఖేవిలాసాం మజ్గళ్యాం మహానాసాం మహాముఖీమ్

కుమారీం రోచనాం భీమాం సదామాంసమదోద్దతామ్

లమ్బాక్షిం కాలజిహ్వాంచ కుమ్బకర్ణాం మహాసురీమ్

కేశినీం కునఖీంచైవ పిజ్గళాక్షీంచ తామసీమ్

ఉల్కాముఖీం ధూమ్రశాఖాం కంపినీం పరిక మినీమ్

మోహినీం కుణ్డలిం చన్ద్రాం నిర్భయాం బాహుశాలినీమ్

కరకర్ణీం తథై కాక్షీం విశోకాం నర్గినీంతథా

జ్యోత్స్నాముఖీం చ గభసాం నికుమ్బాం రక్తకంపనామ్

ఆధికారాం మహాచిత్రాం చన్ద్ర సేనాం మనోరమామ్

ఆదర్శనాం హరత్పాపాం మాతజ్గీం లమ్బమేఖలామ్

అబలాం వఇ్చనాం కాళీం ప్రాణదాం లాజలావతీమ్

చిత్తం చిత్తజలాం కో(శో)ణాం శాన్తికాం దృష్టశాలినీమ్

లమ్బ స్తనీం లమ్బసటాం వినటాం వాసచూర్ణినీమ్

స్ఖలన్తీం దీర్ఘ కేశీంచ సుచిరాం సున్దరీం శుభామ్

ఆయోముఖీం కద్రుముఖీం క్రోధనీంచ తథాశ నీమ్

కుటుమ్బికాం ముక్తికాంచ చన్ద్రికాం బాల మోహినీమ్

సామాన్యాం సహినీం లమ్బాం కోవిదారీం సమా(వా)సవీమ్

శజ్కుకర్ణీం మహా నాదాం మహా దేవీం మహోదరీమ్

హుజ్కారీం రు దసుసటాం చ చేశం భూత దామరీమ్

పిణ్డజిహ్వాం చలజ్జ్వలాం శివాం జ్వాలాముఖీం తథా

ఏతాశ్చాన్యాశ్చ దేవేశ స్సోసృజ న్మాతర స్తదా

ఆన్దకానాం మహా ఘోరా: వపు స్తద్రుధిరం తదా

తతోన్దకాసృజగిస్సర్వాః పరాం తృప్తి ముపాగతాః

తాసు తృప్తాసు సమ్భూతో భూయ ఏవాన్దకప్రజాః

ఆర్ధితస్తై ర్మహాదేవ శ్శూలముద్గరపాణిభిః

మాహేశ్వరి-బ్రాహ్మి-కౌమారి - మాలిని-సౌపర్ణివాయవ్య-శాక్రి వై నాయకిసౌరి సౌమ్య శివదూతీ చాముండవారుణీ వారాహి-నారసింహ-వైష్ణవిచలచ్చిఖ-శతానంద-దగానంద పిచ్చిలభగమాలిని - బల అతిబల-రక్త-సురభి' సుఖమండిక మాతృనందసునంద - బిడాలి శకుని రై వతి శంక రి చందలాంగలి - కుదినిజయ విజయజయ'తి అపరాజిత కాళి మహా కాళీ దూతి-సుభగ దుర్బగ-క రాళి-నందిని ఆదితిదితి మారి-మృత్యు - కర్ణ మోటియామ్య-ఉలూఖి ఘటోదరి-వజ్రహస్త - పిశాచీకపాలిరాక్షసిభుసుండి -శాంకరి - లంబ -చంద్ర-కరభ- ఘాటసులోచన ధూమవర వాణి -కరా శిక విశాలదంష్టిణి శ్యామ "త్రిజటి - కుక్కు టవినాయకివై తాళి, ఉన్మనామబడు సిద్ది - రేహానా కేకరీ గర్గభి ఉత్కట-బహుపు - పేతయాన విటంకిని-క్రౌంచి శైలముఖి-వినత-సరమ-దను ఉమ రంభ మేనక-సలిల చిత్రరూపిణి స్వధా-స్వాహా - వషట్కార-ధృతి - జ్యేషకపర్దినిమాయ-విచిత్ర రూప కామరూప-సంగమ-ముఖేవిలాస మంగళ్య-మహానాస మహాము బీకుమారి ॥॥ రోచన భీమ దామమదోద్దతలంబాడి - కాలజిహ్వా-కుంభకర్ణ-మహాసురి - కేశినికునఖి॥॥పింగళాక్షి - తామసి-ఉలా ముఖిధూమ్రశాఖా కంపిని-పరికంపిని మోహిని॥॥॥ కుండలి-చంద్రానిర్బయా బాహం శాలినికరకర్ణిఏ కాక్షి -విశోక-నందిని జ్యోత్స్నా ముఖిర భన నికుంభరక్తకంపన అధికారమహాచిత్రచంద్ర సేన మనోరమ అదర్శన హరూపొమాతంగి - లంబ మేఖలా-ఆటల - వంచనకాళి-ప్రాణద లాంగలావతి చిత్రచిత్తజలకోశాణా శాంతీక ధృష్టశాలినీలంబ స్తనిలంబసటావినటా వానచూ క్లిని స్థలంతీదీర్ఘ కేశిసుచిరాసుందరీ - శుభ- అయోముఖీ-కద్రుముఖీ -క్రోధని అతని కుటుంబిక ముక్తికచంద్రిక - బాలమో హినీ సామాన్య సహినీలంబా - కోవిదారీ మా వాసవిశంకుక స్టీ-మహానాదమహాదేవిమహోదరిహుంకారి రుద్రసు సటారు దేశీ భూతదామరిపిండ జిహ్వ-చలజ్జ్వాల శివా జ్వాలాముఖి (189 ఈ మొదలగు మహా ఘోర మాతృకలు శివునిచే సృజింప బడీ అంధకుల రక్తమును త్రావిరి ఆ అంధక రకములతో పోరందరును మిగుల తృ ప్తినందిరి వారు తృప్తినందిన యనంత రము మరల అంధక పుత్రులు జనించి శూలముద్దరములు చేతుల ధరించి వానితో మహాదేవుని బాధింవసాగిరి

తత స్స శ జ్కరో దేవ స్వన్దకై ర్వ్యాకులీకృతః

జగామ శరణం దేవం వాసుదేవ మజం విభుమ్

తతస్స భగవాన్విష్ణు సృష్టవో ఇ్ఛుష్క రేవతీమ్

యా పపౌ సకలం తేషా మన్దకానామనృక్షణాత్

యథా యథా చ రుధిరం పిబత్యన్దక సమ్భవమ్

తథా తథాధికం దేవీ సంతుష్యతి జనాధిప

పీయమానే తథా తేషా మన్దకానాం తథాసృజీ

అన్దకాస్తు క్షయం నీతా స్సర్వే తే త్రిపురారిణా

మూలాన్దకం తు విక్రమ్య తదా శర్వ లోకధృత్

చకార వేగా చ్చూలాగే సచ తుష్టావ శజ్కరమ్

అన్దకస్తు మహావీర్య స్తస్య తుష్ణో భవోద్భవః

సామీప్యం ప్రదదౌ నిత్యం గణేశ త్వం తథే వచ

తతో మాతృగణాస్సర్వేశ జ్కరంవాక్యమబ్రువః

భగవ నృక్షయిష్యామ స్సదేవాసుర మానుషమ్

త్వత్ప్రసాదా జగత్సర్వం - తదనుజ్ఞాతు మర్హసి

శఙ్కరః : భవతీభిః ప్రజాస్సర్వా రక్షణీయా న సంశయః

అస్మాద్ఘోరా దభిప్రాయా న్మనశ్మీఘ్రం నివర్త్యతామ్

'అంధకులతో వ్యాకులీకృతుడై శంకర భగవానుడు - ఆజుడు విభుడు దేవుడు" సగు వాసుదేవుని శరణు వేడెను, అంతట విష్ణు భగవానుడు శుష్క రేవతి యను దేవతను సృజింపగా ఆమె క్షణములో ఆంధకర క్రపానము చేసెను ఆమె ఆంధక ర క్తము త్రావిన కొలదిని ఎండిపోవసాగెను ఆమే ఆట్లు వారి రక్తమును త్రావీన మీదట (క్రొత్తవారు పుట్టక పోగా ఉన్న అంధకులను త్రిపురారి క్షయమందించెను అంతట త్రిలోకధర్తయగు శంకరుడు శర్వుడు విక్రమించి ( మొదటి) మూలాంధకుని మహావేగమున తన శూలాగ్రమున నిలుపగా మహావీర్యుడగు చాడును శంకరుని స్తుతించేను భవోద్భవుడు(సంసార మూలకారణుడు) ఆగు శంకరుడు వాని విషయమున తుష్టుడయి వానికి నిత్యము తన సాంనిధ్య మును గణేశత్వమును ప్రసాదించేను అంతట మాతృకలు శంకరునితో “భగవన్! దేవాసుర మనుషులతో కూడిన సకల జగత్తును భక్షింతుము నీ అనుగ్రహము కావలెను అనుజ్ఞ నీయ వేడుచున్నాము” అనిరి శంకరుడు ఇట్లనెను “మీరు ప్రజల నందరను రక్షించవలయును; ఇది నిన్సంశయము కదా! కనుక ఈ ఘోరాభిప్రా యమును మరల్చుకొనుడు

సూతః : ఇత్యేవం శఙ్కరేణోక్తమనాదృత్య వచ స్తదా

భక్షయామాసు రవ్యగ్రా స్త్రైలోక్యం సచరాచరమ్

త్రైలో క్యే భక్ష్యమాణేతు తదా మాతృగణేన వై

నృసింహమూర్తిం దేవేశం ప్రదధౌ భగవాఞ్చివః

అనాదినిధనం దేవం సర్వలోకభవోద్భవమ్

దై త్యేన్ద్రవక్షోరుధిర చర్చితాగ్రమమహానఖమ్

విద్యుజ్జిహ్వం మహాదంష్ట్రం స్ఫుర త్కేసరసజ్ఞ్చ యమ్

కల్పానమారుతక్షుబ్దసప్తార్ణవసమస్వనమ్

వజ్రతీక్ష్ణ నఖం ఘోర మాకర్ణ వ్యాదీతాననమ్

మేరు శైలప్రతీకాశ ముదయార సమేక్షణమ్

హిమాద్రిశిఖరాకారం చారుదంష్ట్రోజ్వలాననమ్

నఖనిస్సృతరాషాగ్ని జ్వాలా కేసరమా లీనమ్

బద్దాజ్గదం సుముకుటం హార కేయూరభూషణమ్

శ్రోణి సూత్రేణ మహతా కాఞ్చనేన విరాజితమ్

నీలోత్పలదళ శ్యామం వాసోయుగ విభూషణమ్

తేజసాఽఽకా స్తసకల బ్రహ్మాజ్ఞానరమజ్ఞపమ్

పవనగ్రామ్యమాణానాం హుతహవ్యవహార్చిషామ్

ఆవర్తె స్సదృశాకారై సంయుక్తం దేహలోమజై

సర్వపుష్పవిచిత్రాఢ్యాం ధారయన్తం మహా సజమ్

స ధ్యాతమాత్రో భగవా నదదౌ తస్య దర్శనమ్

యాదృశేనైవ రూపేణ ధ్యాతో రుద్రేణ భ క్తితః

తాదృ శేనైవ రూపేణ దుర్నిరీక్షేణ దైవతై

ప్రణిపత్యతు దేవేశం తదా తుష్టావ శజ్కరః

శంకరుడు ఇట్లు పలికినను లెక్క పెట్టక వారు ఏ కలవర మును లేక స్థిరచిత్తముతో సచరాచరమగు త్రైలోక్య మును భక్షించిరి అపుడు శివ భగవానుడు ఆనాదినిధనుడు దేవుడు సర్వరోక సృష్టికి మూలభూతుడు దైత్యేంద్రుని వక్ష మందలి రక్తముతో పూయబడిన గోళ్ల కొనలుకలవాడు మరపువంటి సౌలుక గలవాడు పెద్ద కోరలవాడు మేరయు జూలి రాశి కలవాడు ప్రళయ వాయువుతో కలత పడు మహాసాగరము వలే ధ్వని చేయువాడు పేజములవంటి వాడి గోళ్లపాడు భయంకరుడు చెవుల వరకు తెరచిన నోరివాడు మేరుపర్వతమువలె ప్రకాశించువాడు ఉదయర వినీ పోలు కన్నులపాడు హిమా దీ శిఖరాకారుడు మనోహరములగు కోరలతో ఉజ్వలమగు మొగము కలవాడు గోళ్ల నుండి వేలికి వచ్చుచున్న రోషాగ్ని జ్వాలలనేడు జూలి పంక్తులు కలవాడు బంగారపు భుజకీర్తులు కిరీటము హారములు కటి సూత్రము సొమ్ములుగా దాల్చినవాడు నల్లకలువ రేకులవలే చామనచాయ కలవాడు వస్త్రయుగళ ము ఆలంకారముగా దాల్చినవాడు తన తేజముతో సకల బ్రహ్మాండాంతరాళమను మండపమును క్రమ్మినవాడు వాయుబలముచే త్రిప్పబడుచున్న వియు తమయందు వేల్చ బడిన హవిస్సును కొనిపోవునవియు నగు అగ్ని జ్వాలల సుడులతో సమానాకార ముకల వెంట్రుకలతో కూడినవాడు సర్వ॥॥ వర్ల విచిత్ర పుష్పములతో కూర్చబడిన మహామాలను దాల్చినపోడు నగు నృసింహమూర్తిని ధ్యానించేను॥॥ రుద్రుడు, భక్తి వూర్వక మగు ఏ రూపము కలవానిగా తను ధ్యానించెనో ఆదే రూపమున నృసింహదేవుడు ఆతనికి ధ్యానించినంతనే దర్శన మొసంగెను కాని ఆ రూపము దేవతలకును చూడశక్యము కానిది శంకరుడా దేవుని నమస్కరించి ఇట్లు స్తుతించెను:

శఙ్కరకృతనరసింహస్తుతిః

శజరః: నమస్తేస్తు జగన్నాథ నరసింహవపుర్హ రే

దైత్యనాధాసృజాపూర్ణనఖశ (పం) క్తివిరాజిత

జగత్సకలసంలగ్న హేమపిజ్గళ విగ్రహ

నతోఽస్మి పద్మనాభ త్వాం సురశక్రజగద్గురో

కల్పాన్తాంభోద(ధి)నిర్ఘోష సూర్యకోటిసమప్రభ

 సహస్రపరమక్రోధ సహస్రేన్ద్రపరాక్రమ

సహస్రవదనస్పీత సహస్రచరణాత్మక

సహస్రకాలరచిత సహస్రనియతేన్ద్రియ

సహస్రభూమీసద్ధైర్య సహస్రానన్తమూర్తిమక్

 సహస్రచన్ద్రప్రతిమ సహస్రగ్రహవిక్రమ

సహస్రరుద్రతేజస్క సహస్ర బ్రహ్మసంస్తుత

 సహస్రవాయు వేగోగ్ర సహస్రాక్ష నిరీక్షణ

 సహస్రయన్త్రమథన సహస్రబన్దమోచక

అన్ద్రకస్య వినాశాయ యా స్సృష్టా మాతరో మయా

 అనాదృత్య తు మద్వాక్యం భక్షయ న్త్యద్య తాః ప్రజాః

 కృత్వా తాశ్చ న శక్తోహం సంహర్తు మపరాజిత

స్వయం కృత్వా కథం తాసాం వినాశ మభికారయే

ఏవముక్త స్స రుద్రేణ నర సింహవపుర్దరః

ససర్జ దేవో జిహ్వాయా స్తదా వాణీశ్వరీం హరిః

హృదయాత్తు తథా మాయాం గుహ్యాచ్చ భగమాలినీమ్

 అస్థిభ్యశ్చ తథా కాళీ సృష్టా పూర్వం మహాత్మనా

 యయా తద్రుధిరం పీత మన్దకానాం మహాత్మనామ్

యా చాస్మి న్కథితా లో కే నామత శుష్క రేవతీ

 ద్వాత్రింశ న్మాతర స్సృష్టా గాత్రేభ్య శ్చ క్రిణా తతః

జగన్నాథా! నృసింహదేహధారిన్: హరీ: పాపముల హరించువాడా!) దైత్యనాథుని రక్తముతో నిండిన గోళ్ళు అనేడు శ క్త్వాయుధములు కలవాడా! నీకు నమస్కారము సకల జగమునందును వ్యాపించిన బంగారువంటి పచ్చనిచూర్తి కలవాడా! ప్రళయకాల మేఘ ధ్వనివంటి నాదము కలవాడా! పద్మనాభా! దేవతలకును ఇంద్రునకును సమస్త జగత్తునకును తండ్రీ! సహస్ర విధములగు మహాక్రోధము గలవాడా; నహ సేంద్రులంత పరాక్రమము కలవాడా! సహస్ర ముఖముల సమృద్ధి కలవాడా! సహస్రపాదాః సహస్రకాలముల రచించువాడా! సహస్ర సంఖ్యాకములగు ఇంద్రి యములను నిగ్రహించువాడా! సహస్ర భూలోకములకును మంచి ధైర్యము నొనంగువాడా! వేలుకొలదిగా అనంతమూర్తులు కలవాడా! సహస్ర చంద్ర సమానా! సహస్రగ్రహ విక్రమా; సహస్ర రుద్ర సమాన తేజశ్శాలి: సహస్ర బ్రహ్మ పరిస్తుతా! సహస్ర వాయువేగ థయంకరా! సహస్ర నేత్రములతో చూచువాడా! వేలకొలదిగా యంత్రములను మథించు వాడా! సహస్ర బంధనములనయిన విడిపించువాడా! నిన్ను నమస్కరించు చున్నాను అంధకాసుర వినాశమున కై నేను సృష్టించిన మాతృ కలు నామాట లెక్క పెట్టక ఇపుడు లోక ప్రజలను భక్షించుచున్నారు అపరాజితా! నేనే సృష్టించి వారిని పుడు నేనయి సంహరింపజాలకున్నాను అని రుద్రుడు పలికి నది విని నరసింహమూర్తియగు ఆ హరి భగవానుడు తన జిహ్వనుండి వాణీ శ్రీ శ్వరిని హృదయమునుండి మాయను గుహ్యము (రహస్యాంగము నుండి భగమాలినిని సృజించెను ఆ దేవుడు ఇదివరకే తన ఎముకలనుండి కాళిని సృజించియుండెను ఆంధకుల రక్తమును త్రావిన శుష్క రేవతి ఆమెయే ఇట్లు నలుగురను శక్తులను సృజించిన తరువాత వారికి పరివార దేవతలుగా మరి ముప్పది రెండు మంది దేవతాశక్తులను నృసింహుడు తన యవయవములనుండి సృజించెను

తాసాం నామాని వక్ష్యామి తాని మే గదత శ్శృణు

సర్వాస్తాస్తు మహాభాగా ఘణ్టాకర్ణీ తథైవచ

 త్రైలోక్యమోహినీ పుణ్యా సర్వసత్త్వవశ జ్కరీ

తథాచ చక్రహృదయా పఇ్చమీ కామచారిణీ

 శజ్ఖినీ లేఖినీ చైవ కాలసజ్కర్షణీ తథా

 ఇత్యేతాః కీర్తితా రాజ స్వాగీశానుచరా స్స్మృతాః

సజ్కర్షణీ తథాశ్వత్థా బీజభావాఽపరాజితా

కల్యాణి మధుదంష్ట్రీచ కమలోత్పలహస్తికా

ఇతి దేవ్యష్టకం రాజన్మాయానుచర ముచ్యతే

అజితా సూక్ష్మహృదయా వృద్దావేశాశ్మదంశ నా

నృసింహభైరవా బిల్వా గరుత్మద్ధృదయా జయా

 భగమాలిన్యనుచరా ఇత్యష్టౌ నృవమాతరః

 ఆకర్షణీ సమ్భటాచ తథై వోత్తరమాలికా

జ్వాలాముఖీ భీషణికా కామధేనుశ్చ బాలికా

తథా పద్మకరా రాజన్రేవత్యనుచరా స్మృతాః

అష్టౌ మహాబలా స్సర్వా దేవగాత్ర సముద్భవాః

త్రైలోక్యసృష్టిసంహార సమర్థ స్సర్వదేవతాః

తాస్సృష్టమాత్రా దేవేన క్రుద్దా మాతృగణాస్స తు

 ప్రధావితా మహారాజ క్రోధవిస్ఫురితేక్షణాః

 ఆవిషహ్యతమం తాసాం దృష్టి తేజస్సుదారుణమ్

 తమేవ శరణం ప్రాప్తా నృసింహో వాక్యమబ్రవీత్

వారి నామములు తెలిపెదను వినుము: 1 మహా భాగయగు ఘంటాకర్ణి 2 పుణ్యయగు త్రైలోక్యమోహిని 3 సర్వ సత్వవశంకరి 4 చక్రహృదయ 5 కామచారిణి 6 శంఖిని 1 లేఖిని 8 కాల సంఘర్షణీ-వీరు వాగీశ్వరి అను మొదటి శక్తికి అనుచరలు; 1 సంకర్షణి 2 అశ్వత 8 బీజభావ 4 అపరాజిత - 6 కల్యాణి 6 మధుదంష్టి 1 కమలా 8 ఉత్సలహ సికా_అనువారు ఎనిమిది మందియు మాయాదేవికి అనుచరలు; 1 అజిత-2 సూక్ష్మహృదయ 8 వృద్ద 4 వేశాశ్మదంశనా 6 నృసింహభైరవా 6 బిల్వా 1 గరుత్మవృదయా 8 జయా వీరు థగమాలినికి అను చరలు; 1 ఆకర్షణీ 2 సంభటా శ్రీ ఈ తరమాలికా 4 జ్వోలాముఖీ 6 భీషణిక 6 కామధేను 7, బాలికా 8, పద్మకరా వీరు కాళికి లేదా శుష్క రేవతికి అనుచరలు; ఈ ఎనిమిదేసి మంది (8x4-82)యును నృసింహదేవుని ఆవయవముల నుండి జనించినవారు; త్రైలోక్య సృష్టి సంహార ములు చేయు సమర్థలు; వీరందరును తాము సృష్టింపబడిన వెంటనే మొదట రుద్రుడు సృష్టించిన మాతృగణము విధమున క్రుద్దలయి క్రోధముతో మెరయు కన్నులతో వారి మీదకు పరువె త్తిరి వారి దృష్టి తేజస్సతి దారుణమయి ఎంతమాత్రమును సహింపరానిదిగా నుండెను అంతట ఆ రుద్ర సృష్టమాతృకలు నృసింహదేవునే శరణు జొచ్చిరి వారితో నృసింహుడిట్లు వలి కేను:

యథా మనుష్యాః పశవః పాలయన్తి చిరాత్పుతాన్

 జాయ న్తే యే యథే వైతే తథావై దేవతాగణాః

భవత్యస్తు తథా లోకా న్పాలయంతు మయేరితాః

 మనుజై శ్చ తథా దేవైర్యజధ్వం వై పురాన్తకమ్

నచ బాధా ప్రకర్తవ్యా యే భక్తాస్త్రీపురాన్తకే

 యేచ మాం సంస్మర న్తీహ తేచ రక్ష్యా నరా స్సదా

 బలికర్మ క(చ)రీష్యన్తి యుష్మాకం యే సదా నరాః

సర్వకామప్రదా స్తేషాం భవిష్యధ్వం న సంశయః

ఉచ్చాటనాదికం యే చ కథయన్తి మయేరితమ్

 తే చ రక్ష్యా స్సదా లోకా రక్షితవ్యం చ శాసనమ్

రౌద్రీం చై వాపరాంమూర్తిం మహాదేవః ప్రదాస్యతి

 యుష్మాన్ముఖ్యా మహాదేవ్యా , సదుక్తం పరిరక్షథ

మయా మాతృగణ స్పృష్టోఽయం విగతసాధ్వసః

 ఏష నిత్యం విశాలాక్షో మయైవ సహ రంస్యతే

 మయా సార్ధం తథా పూజాం నరేభ్య శ్చైవ లప్స్యథ

 పృథక్ప్రపూజితా లో కే సర్వాన్కామా న్ప్రుదాస్యథ

శుష్కిం సమ్పూ జయిష్యన్తి యేచ పుత్రార్థినో జనా

 తేషాం పుత్త్రప్రదా దేవీ భవిష్యతి న సంశయః

సర్వకామప్రదా లో కే భవిష్యతిచ పూజితా

 శ్రీమత్స్యః : ఏతావదుక్త్వా భగవాన్త్సహ మాతృగణేన తు

 జ్వాలామాలాకులవపు స్తత్త్రైవాన్తర ధీయత

తత్ర తీర్థం సముత్పన్నం కృతశౌచేతి యజ్ఞగుః

తత్రాపి పూర్వజో దేవో జగదా ర్తిహరో హర

 రౌద్రస్య మాతృవర్గస్య దత్వా రుద్రస్తు పార్థివ

రౌద్రీం దివ్యాం తనుం తత్ర మాతృమధ్యే వ్యవస్థిత

 సప్త తా మాతరో దేవ్య సార్ధనారీనర శ్శివః

నివేశ్య రౌద్రం తత్థ్సానం తత్రైవాన్తరధీయత

 స మాతృవర్గస్య హరస్య మూర్తి ర్జుష్టే యదా తిష్ఠతి తత్సమీ పే

దేవేశ్వరస్యాపి నృసింహమూర్తేః పూజాం విధత్తే త్రిపురాన్దకారిః

ఇతి శ్రీమత్స్యమహాపురాణే ఈశ్వరకృతః అన్దకాసురవధో నామ అష్టన ప్రత్యుత్తర శతత మోఽధ్యాయః

మనుష్యులును పశువులును తమ సుతులను చాల కాలము వరకు పోషించుచు పాలించుచునుండును కదా! దేవ తలు కూడ ప్రజలను ఆపై చూడవలయును కదా! కావున మీరును నామాట పాటించి లోక పాలనము సేయుడు: మను జులును దేవతలు కూడ పురాంతకుడగు శివుని ఆరాధించునట్టు చూడుడు; శివ భక్తులకును నా భక్తులకును మీకును బలు లొసంగి పూజించువారికిని ఏ బాధలును కలుగనీయక సర్వకాను ఫలములను ఇచ్చి రక్షించుచుండుడు; నేను చెప్పిన విధానము ననుసరించి ఉచ్చాటనాదికము చేయువారిని నా శాసనమును - కూడ మీరు పాలించవలయును ముఖ్యులగు మహాదేవులారా! మహాదేవుడు ఇంతటి నుండి మీకు ఉగ్రమును ఉ త్తమమును ఆగు రూపమును అనుగ్రహించును; మీరును అతని మాటను పాటించుచు - లోకరక్ష చేయుచుండుడు లోకములకు కలుగు భయమును పోగొట్టగల మాతృకలను కొందరను నేను సృష్టించితిని గదా! తమ విశాల నేత్రములతో వారు సదా ప్రజలను కను పెట్టి చూచుచు నా వెంటనే ఉండి కురు మీరును వారును 'నాతో పాటుగ నే నరులనుండి పూజలనందుకొనుచుండుడు; లోకమున నాతోకాక వేరు వేరుగ కూడ పూజలందుకొనుచు వారికి సర్వకామములను పూరించుచుండుడు; పుత్రార్జులయి ఎవరు ఈ శుష్క రేవతిని పూజింతురో వారికి ఆ దేవి పుత్ర ప్రద యగును; ఇది నిస్సంశయము; ఆమే పూజితురాలయి లోకమునందలి వారికి సర్వ కామప్రదయగును

ఆని ఇంతమాత్రము చెప్పి జ్వాలామాలలతో నిండిన శ రీర ముకల నృసింహ భగవానుడు తాను సృష్టించిన మాతృగణముతో కూడ అచ్చటనే అంతర్గాన మందెను అచ్చట కృత శౌచమను తీర్థము ఉత్పన్న మయ్యెను నర్వ జగత్తులకంటెసు ముందే యున్న వాడును జగముల ఆర్తిని హరించువాడు నగు హరుడు అచ్చటనే తాను సృష్టించిన రౌద్ర మాతృవర్గ మునకు రౌద్రమును దివ్యమును నగు మూర్తిని ప్రసాదించి అచ్చటనే మాతృకాగణ మధ్యమున తానును ఉండి పోయెను అర్దము నారిగా నుండిన ఈశ్వరుడగు ఆ శివుడు తాను సృష్టించిన మాతృగణమున ప్రధానలగు సప్త మాతృక లను ఆరుద్రస్థానమునం దుండునట్లు వ్యవస్థ చేసి తానును అచటనే అంతర్ధాన మందెను

ఈ వృత్తాంతములు జరిగిన చోటికి సమీపమందే మాతృవర్గముతో కూడ హరుని మూర్తి ప్రతిష్టితమయి ఈ నాటికిని ఉన్నది అచ్చట నేటికిని త్రిపురారియు అంధక శత్రుడునునగు హరుడు సృసింహమూర్తికి పూజ చేయు చుండును

 విశేషము: ఈ ఆధ్యాయమున అంధకాసురవధ వృత్తాంత నిమి త్తముగా రౌద్రమాతృకలుగా ప్రసిద్దలగు మాతృకాగణ మును నృసింహ మాతృకాగణమును ఉత్పన్నమయిన విధానము చెప్పబడినది ప్రథమాధ్యాయమున ఋషులు సూతు నడిగిన ప్రశ్న ములలో శివుడు భైరవు డేట్లయ్యెనను ప్రశ్నకు సమాధానము కూడ దీనియందు చెప్పబడినది ఇత గులు చేసిన ఉచ్చాటనాదులచేగాని మరి ఏ ఇతర కారణములచే గాని భూతాది బాధ కలిగినపుడు తన్ని వారణార్థ మారా ధింపబడువారు ఈ మాతృకలు ఇట్లు భీరువుల థయపడువారి భయమును పోగోట్టు భైరవీ మాతృకలను సృష్టించి శివుడు భైరవుడు అయ్యెను ఈ రౌద్ర మాతృకలును నారసింహ మాతృకలును ఉచ్చాటనాది మాంత్రిక తాంత్రిక ప్రక్రియలందు ఉపయోగపడు శ క్తి విశేషములని తెలియదగినది రౌద్ర మాతృకల 189 మందిలో ప్రధానలు ఏడుమంది 1 బ్రాహ్మి 2 మాహేశ్వరి 8 కౌమారి 4 వైష్ణవి 5 వారాహి 6 ఇంద్రాణి (క్రీ) 7 చాముండ అనువారు; మిగిలిన 182 మంది (1x26) అనుచర దేవతలు; నారసింహ మాతృకలలో నలుగురు ప్రధానలు ఒక్కొక్కరికి ఎనిమిదేసి మంది అనుచరులు

ఇది శ్రీమత్స్య మహాపురాణమున అంధకాసుర వధము-రౌద్రనారసింహ-మాతృకోత్ప త్తియను నూట డెబ్బది ఎనిమిదవ అధ్యాయము