మత్స్య మహా పురాణము
- సూర్యాది ప్రతిమాలక్షణము-రవి ప్రతిమాలక్షణము.
సూత : ప్రభాకరస్య ప్రతిమా మీదానీం శృణుత ద్విజాః ।
రథస్థం కార యే ద్దేవం పద్మహస్తం సులోచనమ్॥
సప్తాశ్వం చైకచక్రంచ రథం తస్య ప్రకల్పయేత్ ।
ముకుటేన విచిత్రేణ పద్మగర్బసమప్రభమ్॥
నాసాభరణభూషాభ్యాం భుజాభ్యాం కృతపుష్కరమ్ ।
స్కనసే పుష్కరే తే తు లీలయైవ ధృతే సదా॥
చోలకచ్ఛన్న వపుషం క్వచి చ్చీ తేషు దర్శయేత్ ।
వస్త్రయుగ్మసమో పేతం చరణే తేజసా వృత్తె॥
ప్రతీహారౌ తు కర్తవ్యో పార్శ్వయో ఫణపిజ్జుశా ।
కర్తవ్యో ఖడ్గహస్తా తౌ పార్శ్వయోః పురుషా వుభౌ॥
లేఖనీకృతహస్తం చ పార్శ్వే ధాతార మవ్యయమ్ ।
నానాదేవగభై ర్యుక్త మేవం కుర్యా ద్దివాకరమ్॥
అరుణ సారథీ శ్చైవ పద్మినీపత్రసన్నిథః ।
అశ్వాశ్చ వలితగ్రీవాః ప్రస్థితా స్తస్య పార్శ్వయోః॥
భుజఙరజ్ఞుభి ర్బద్ధా స్సప్తాశ్వ రశ్మి సంయుతాః ।
పద్మస్థం వాహనస్థం వా పద్మహస్తం ప్రకల్పయేత్॥
వహ్ని ప్రతిమాలక్షణమ్.
వహ్నే స్తు లక్షణం వక్ష్యే సర్వకామఫలప్రదమ్ ।
దీప్తం సువర్ణవపుష మర్ధ చన్హాసనస్థితమ్॥
బాలార్కసదృశం తస్య వదనం చాపి దర్శయేత్ ।
యజ్ఞోపవీతినం దేవం లమకూర్చధరం తథా॥
కమట్టెలుం వామక రే దక్షిణే త్వక్ష సూత్రకమ్ ।
జ్వాలా వితాన సంయుక్తం స్వధాస్వాహాసముజ్జ్వలమ్॥
కుబ్ధస్థం ఏపి కుర్వీత మూఠ్నీ సప్తశిఖాన్వితమ్ ।
యమప్రతిమాలక్షణమ్.
అథో యమం ప్రవక్ష్యామి దణ్ణపాశధరం విభుమ్॥
మహామహిషమారూఢం కృష్ణా జ్ఞానచయోపమమ్ ।
సింహాసనగతం చాపి దీప్తాగ్ని సమలోచనమ్॥
మహిషం చిత్రగుప్తంచ కరాళాః కిజరా స్తథా ।
సమన్హా దర్శయేత్తస్య సౌమ్యాసౌమ్యా స్స్తురాసురా॥
నిరృతి ప్రతిమలక్షణమ్.
రాక్ష సేంద్రం తథా వ్య లోకపాలం చ నైరృతమ్ ।
నరారూఢం మహామాయం రక్షోభి ర్బహుభి ర్యుతమ్॥
ఖడ్గహస్తం మహానీలం కజ్జలోచలసన్ని భమ్ ।
నరయుక్త విమానస్థం పీతాభరణభూషితమ్
వరుణప్రతిమాలక్షణం - వాయుప్రతిమాలక్షణం చ.
వరుణంచ ప్రవక్ష్యామి పాశహస్తం మహాబలమ్ ।
శజ్ఖస్ఫటిక వర్ణాభం సితహారామరావృతమ్॥
రషాసనగతం శాస్త్రం కిరీటాజద ధారిణమ్ ।
వాయురూపం ప్రవక్ష్యామి ధూమం తు మృగవాహనమ్॥
చిత్రామ్బరధరం శాన్తం యువానం కుఞ్చిహ్తభ్రువమ్ ।
మృగాధిరూఢం వరదం పతా ధ్వజసంయుతమ్॥
సూతుడు ఋషులకిట్లు చెప్పెను: ద్విజులారా! ఇపుడు రవి ప్రతిమను తెలి పెదను వినుడు; ఈదేవుడు రథస్థుడు. వరదహస్తుడు-సులోచనుడు. సప్తాశ్వమగు ఏక చక్రరథము ఇతనిది; ఇతడు విచిత్రముకుటధారి; తామర పూవులోపలి వన్నె కల దేహచ్ఛాయవాడు; నానాభరణ భూషిత భుజుడు; పద్మములను చేతుల ధరించును; అవి అపుడపుడు విలాసముగ భుజముల పై ఉంచుకొనుచుండును: చొక్కా ధరించునట్లును కొన్ని మూర్తులందు చూపుటకలదు; ఇతడు సాధారణముగా వస్త్రద్వయము (దోవతి- ఉత్తరీయము) ధరించును: పాదములు తేజోవృతములు; ఇతని రెండు పార్శ్వములందును దండుడు పింగళుడు అను ప్రతిహారులుందురు; వారు ఖడ్గహస్తులు; పార్శ్వమందు లేఖిని ధరించి బ్రహ్మ ఉండును; నానా దేవగణము ఈ రవిని కొలుచుచుండును. ఈ రవికి సారథియగు ఆరుణుడు తామర ఆకువంటి దేహచ్చాయ కలవాడు; అతనికి రెండు ప్రక్కలందును ఏడు ఆశ్వములు నర్ప పాశ ములతో బంధింపబడినవై కిరణములతో కూడినవై మేడలు ముందునకు ఎత్తుగా చాచి కొని బయలు దేరుచున్నట్లుండవలయును; రవి పద్మమునందు నిలిచియున్నట్లు కాని వాహన(రథ)ము నందు కూర్చున్నట్లు కాని మూర్తిని నిర్మించవచ్చును.
వహ్ని ప్రతిమాలక్షణము.
సర్వకామ ఫలప్రదమగు వహ్ని ప్రతిమాలక్షణమును తెలి పెదనుః వహ్ని కాచిన బంగారువలె ప్రకాశించు దేహము కలవాడు; ఆర్ధచంద్రాననమం దుండును; అతని ముఖము బాల సూర్య నమాన తేజసము; అతడు లంబ కూర్చమును (వ్రేలాడు గడ్డమును మీనలును) యజ్ఞోప వీతమును కలిగియుండును: ఎడమచేతియందు కమండలువును కుడి చేతియందు అక్షమాలను ధరించి జ్వాలా సమూహముతోను స్వధా స్వాహా దేవులతోను ప్రకాశించుచుండును; మేష వాహనము పయినున్నట్లు కాని హోమకుండమందున్నట్లు కాని అగ్ని మూర్తిని నిర్మించవచ్చును. ఇతని శిరము పై న ప్రజ్వాలలు మాత్రము వెలుగుచుండును.
యమ ప్రతిమలక్షణము.
విభుడగు యముడు దండపాక ధరుడు; మహా మహిషారూఢుడు; నల్లని కాటుక రాశివన్నె వంటి వన్నే వాడు; సింహా సనమందుండును; జ్వలించు ఆగ్ని వంటి కన్నులవాడు; అతనికి అన్ని వై వులను మహిషము చిత్రగుప్తుడు భయంకరులగు కింకరులు సౌమ్యమూర్తులగు రాక్షసులు నుందురు.
నిరృతి ప్రతిమాలక్షణము.
నిరృతి నరునెక్కియుండును; మహామాయావి; బహు రక్షోగణయుతుడు; ఖడ్గహస్తుడు; మహానీలుడు; కాటుక కొండవంటివాడు; మనుష్యులను పూన్చిన విమానమందుండును; పచ్చని ఆభరణములతో అలంకృతుడు.
వరుణ వాయు ప్రతిమాలక్షణమ్.
వరుణుడు పాళహస్తుడు-మహాబలుడు-శంఖస్ఫటిక నమాన వర్ణుడు; తెల్లని హారములతో వస్త్రములతో కప్ప బడినవాడు; మత్స్యాసనమందుండును. కిరీటమును భుజకీర్తులును ధరించియుండును.
వాయువు ధూమ్రవర్ణుడు; మృగ(జింక)వాహనుడు; పలువన్నెల వింతగొలుపు వస్త్రములు ధరించియుండును: యువకుడు: మృగాధిరూఢుడును వరదుడును పతాకల (చిరుజెండాల)తోను ధ్వజముల (పెద్ద జెండాల)తోను కూడి యుండును.
కుబేర ప్రతిమలక్షణమ్-కుబేరేశాన ప్రతిమాలక్షణమ్॥
కుబేరం చ ప్రవక్ష్యామి కుణ్డలాభ్యా మలజ్కృతమ్ ।
హార కేయూరరచితం చిత్రామ్బరధరం శుభమ్॥
గదాధరకరం కుర్యా ద్వరదం ముకుటాన్వితమ్ ।
నరయుక్తవిమానస్థం మేషస్థం పాపి కారయేత్॥
వన్దేన పీతవర్ణన గుహ్య కైః పరివారితమ్ ।
మహోదరం మహా కాయం నిధ్యష్టకసమన్వితమ్॥
ఈశాన ప్రతిమాలక్షణం-సప్తమాతృణాం లక్షణం చ॥
గుహ్యకై ర్బహు భి ర్యుక్తం ధనవ్యగ్రకరై స్తథా ।
తథై వేశం ప్రవక్ష్యామి ధవళం ధవలేక్షణమ్॥
త్రిశూలపాణినం దేవం త్ర్యక్షం వృషగతం ప్రభుమ్ ।
మాతృణాం లక్షణం వర్యే యథావదనుపూర్వశః॥
బ్రహ్మాజీ బ్రహ్మసదృశీ చతుర్వక్తా చతుర్భుజా ।
హంసాధిరూఢా కర్తవ్యా సాక్షసూత్రవమజ్ఞలుః॥
మహేశ్వర స్య రూపేణ తథా మాహేశ్వరీ మతా ।
జటాముకుటసంయుక్తా వృషన్లో చన శేఖరా॥
కపాలశూలఖట్వాజవర దాఢ్య చతుర్భుజా ।
కుమారరూపా కౌమారీ మయూరవరవాహనా॥
రక్తవస్త్రధరా తద్వ చ్చూలశ క్తిధరా శుభా ।
హార కేయూర సమ్పన్నా కృకవాకుధరా తథా॥
వైష్ణవీ విష్ణుసదృశీ గరుత్మస్తం సమాస్థితా ।
చతుర్బాహుశ్చ వరదా శఙచక్రగదాధరా॥
సింహాసనగతా చాపి బాల కేన సమన్వితా ।
వారాహీం చ ప్రవక్ష్యామి మహీషోపరి సంస్థితామ్॥
వరాహసదృశీ దేవీ ఘణాచామరధారిణీ ।
గదాచక్రధరా తద్వ దానవేనవినాశినీ॥
ఇన్షాణీ మిస్త్రసదృశీం వజశూలగదాధరామ్ ।
గజాసనగతాం దేవీం లోచనై ర్బహుభి ర్యుతామ్॥
తప్తకాడ్చానవర్ణాభాం దివ్యాభరణభూషితామ్ ।
తీన్ల ఖడ్గధరాం తద్వ దానవేన్దవినాశినీమ్॥
చాముం చ ప్రవక్ష్యామి యథారూపాం యథాయుధామ్ ।
దీర్ఘ జిహ్వాం దీర్ఘ కేశీం మాంసఖజైశ్చ సమ్మితామ్॥
దంష్ట్రాకరాళ వదనాం కుర్యా చ్చైవ కృశోదరీమ్ ।
కపాలమాలినీం దేవీం ముణమాలావిభూషితామ్॥
కపాలం వామహస్తేతు మాంసశోణితపూరితమ్ ।
మ స్తిష్కా క్షణ్చు బిభ్రాణాం శక్తికాం దక్షిణే కరే॥
గృధస్థా వాయనస్థా వా నిర్మాంసా వినతోదరీ ।
కరాళవదనా తద్వత్కర్తవ్యా సా త్రిలోచనా॥
చాముణ్ణ బద్ధమణా చ ద్వీపీచర్మధరా శివా ।
దిగ్వాసాః కాళికా తద్వ ద్రాసభస్థా కపాలినీ॥
సుర కపుష్పాభరణా వర్ద నీధ్వజసంయుతా ।
వినాయకం చ కుర్వీత మాతృణా మగ్రత స్సదా॥
వీరేశ్వరశ్చ భగవా న్వృషారూఢో ధనుర్ధరః ।
వీణాహస్త త్రిశూలీ చ మాతృణా మగ్రతో భవేత్॥
కుబేరుడు హార కేయూర కుండలాలంకృతుడు. చిత్రాంబరధరుడు. శుభరూపుడు. గదాహస్తుడు. వరదుడు కిరీటధారి; నరులను పూన్చిన విమానమందు కాని మేషము పై కాని యున్నట్లు నిర్మించవలయును. ఇతడు గుహ్యక పరి వృతుడు; పీతవర్ణుడు; మహోదరుడు మహాకాయుడు అష్టనిధులతో కూడినవాడు; ధనములతో వ్యగ్రహస్తులగు గుహ్యకు లనేకు లితనిని కొలుచుచుందురు.
ఈశానుడు తెల్లనివాడు తెల్లని కన్నులవాడు; త్రిశూలపాణి త్రిలోచనుడు వృషభవాహనుడు.
సప్తమాతృకామూర్తి లక్షణము.
నామానుపూర్వముగా మాతృకల లక్షణమును చేప్పెదను; బ్రహ్మాణి బ్రహ్మవలెనే యుండును; ఆమె చతుర్ముఖ ములతో చతుర్భుజములతో హంసవాహనయై ఆక్ష సూత్రమును కమండలువును ధరించియుండును.
మాహేశ్వరి మ హేశ్వరునివలె నుండును: ఆమె జటాముకుటధారిణి; వృషభవాహన- చంద్రార్ధ శేఖరయుక్తురాలు; కపాలము శూలము ఖట్వాంగము వరదముద్ర కల చతుర్భుజములతో నుండును.
కౌమారి కుమారస్వామిరూపుతో నుండును. ఆమె మయూర వాహన- రక్తవస్త్రధర-శూలశక్తిధర. హార కేయూ రాలంకృత- కుక్కుటధారిణి.
వైష్ణవి విష్ణునివలె నుండును. ఆమె గరుడ వాహన- చతుర్భుజ వరద-శంఖచక్రగదాహస్త సింహాసనారూడ- బాలక సమన్విత.
వారాహి వరాహ సమానరూప. మహిషారూడ. ఘంటాచామర గదాచకధారిణి; దానవేం ద్రవినాశిని.
ఇంద్రాణి ఇంద్రుని పోలియుండును. ఈమె వజశూల గదాధర. గజాసనగత, బహు నేత్రసహిత. కాచిన బంగారుకొంతివంటి కాంతి గలది. దివ్యాభరణభూషిత. తీక్షఖడ్గధారిణి. దానవేంద్ర వినాశిని.
చాముండాదేవీ రూపమును ఆమె బుండు ఆయుధములను తేలి పేదను. ఆమెకు పొడవు నాలుక పొడవు కేశ ములు. మాంసఖండములతో నిండినది. కోరలతో భయంకరవదనము కలది. చిక్కిన పొట్టగలది. కపాల మాలలను ధరించినది; వామహస్తమున మెదడుతో పూయబడిన రక్తమాంస పూర్ణక పాలమును దక్షిణ హస్తమున శ క్తిని ధరించి యుండును. గృధమును కానీ పొయసమును కానీ ఆరోహించియుండును, మాంసరహిత దేహ. వంగిన ఉదరము కలది. భయంకర వదనముతో లోచనత్రయముతో నుండును. ఘంటలు శరీరమున కట్టుకొని వ్యాఘ్రచర్మము ధరించియుండును. శుభన్వరూప.
కాశీ కాదేవి దిగంబర, గర్దభవాహన. కపాలధారిణి. మీగుల ఎర్రనీ పూవు లామెకు ఆభరణములు. ఆమె ధ్వజముతో వర్ధ నియను జలపాత్ర విశేషముతో నుండును.
మాతృకలకు ముందుగా ఎల్లప్పుడును వినాయకుని నిలుపవలెను. వృషభ మారోహించి ధనుర్ధరుడును వీణా హస్తుడును త్రిశూలధారియునగు వీరేశ్వర భగవానుడును మాతృకలకు ముందుండును.
లక్ష్మీదేవి ప్రతిమాలక్షణమ్.
గేయం దేవీం ప్రవక్ష్యామి నవే వయసి సంస్థితామ్ ।
సుయావనాం పీనగణ్డాం రక్తాక్షీం కుచితభ్రువమ్॥
పీవోన్నత స్తనద్వన్ద్వమణికుణ్డలమణ్డితామ్ సుమణ్డలం ముఖం తస్యా శిర సీమ స్తభూషితమ్॥
పద్మస్వస్తికళ జ్ఖైర్వా భూషితా ముత్తమాలకైః ।
కఞ్చా కాబద్ధగాత్రే చ హార భూషా పయోధరౌ॥
నాగహస్తోపమౌ బాహూ కేయూరకటకోజ్జ్వలో ।
పద్మం హస్తే ప్రదాతవ్యం శ్రీఫలం దక్షిణే కరే॥
మేఖలాభరణాం తద్వ తప్తకాఇ్చనసన్నిభామ్ ।
నానాభరణసమ్పన్నాం శోభనామ్బర ధారిణీమ్॥
పార్శ్వే తస్యా స్ప్రియః కార్యా శ్చామరవ్యగ్రపాణయః ।
పద్మాసనోపవిష్టాతు పద్మసింహాసనస్థితా॥
కరిభ్యాం స్నాప్యమానాసౌ భృఙారాభ్యా మనేకశః।
ప్రతిపాలయంతౌ కార్యె భృష్ణారాభ్యాం తథాపి॥
యడి జీజీ వతీమాలక్షణ॥ క్షేత్రపాలకప్రతిమాలక్షణం చ॥
స్తూయమానా చ లోకేశై స్తథా గన్జర్వగుహ్య కైః ।
తథైవ యక్షిణీ కార్య సిద్ధాసురని షేవితా॥
పార్శ్వయోః కలశే తస్యా స్తోరణే దేవదానవాః ।
నాగాశ్చైవ తు కర్తవ్యాః ఖడ్గఖేటక ధారిణః॥
ఆధస్తోత్ ప్రకృతి స్తేషాం నాథే రూర్ధ్వం తు పౌరుషీ ।
ఫణాశ్చ మూఠీ కర్తవ్యా ద్విజిహ్వా బహవ స్సమాః॥
పిశాచా రాక్షసా శ్చైవ భూత భేతాళ జాతయః ।
నిర్మాంసాశ్చైవ తే సర్వే రౌద్రా వికృతరూపిణః॥
నేత్రపాలశ్చ కర్తవ్యో జటిలో వికృతాననః ।
దిగ్వాసా జటిల స్తద్వచ్ఛ్వగోమాయుని షేవితః॥
కపాలం వామహ స్తే తు శిరః కేశై స్సమావృతమ్ ।
దక్షిణే శ క్తికాం దద్యా దసుర క్షయకారిణీమ్॥
మన్మథప్రతిమాలక్షణమ్.
ఆథాత స్సమవక్ష్యామి ద్విభుజం కుసుమాయుధమ్ ।
పార్శ్వే చాశ్వముఖం తస్య మకరధ్వజసంయుతమ్॥
దక్షిణే పుష్పబాణంచ వామే పుష్పమయం ధనుః ।
క్రీశ స్స్యా దక్షిణే తస్య భోజనోపస్కరాన్వితా॥
రతిశ్చ వామపార్శ్వే తు శయనోపస్కరాన్వితా ।
పటశ్చ పటహ శ్చైవ ఖరః కామాతుర స్తథా॥
పార్శ్వతో జలవాపీచ వనం నన్దన మేవ చ ।
సుశోభనశ్చ కర్తవ్యో భగవా న్కు సుమాయుధః॥
సంస్థాన మీషద్వం స్యా ద్విస్మయస్విన్న నేత్రకమ్ ।
ఏత దుద్దేశతః ప్రోక్తం ప్రతిమాలక్షణం మయా॥
విస్తరేణ న శక్నోతి బృహస్పతి రపి ద్విజాః॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే సూర్య ప్రతిమాదీలక్షణకథనం నామ షష్ట్యు త్తర ద్విశతత మోధ్యాయః॥
లక్ష్మీదేవి ప్రతిమలక్షణము.
లక్ష్మీదేవి సూతన యౌవన వయసునం దుండును. లావు చెక్కిళ్లు ఎర్రని పెదవి వంపు తిరిగిన కనుబొమలు బలిసి ఎత్తయిన స్తనద్వంద్వము మణికుండలాభరణములు చక్కని గుండ్రని ముఖ సీమంత (పాపటతో) భూషితమగు శిరము పద్మములతో స్వస్తికములతో శంఖములతో భూషితము లే మేలగు ముంగురులు కలిగియుండును. రవికలో బిగించబడిన ఆవయవములు గలిగి హారాలంకృతములగు స్తనద్వంద్వము భుజకీర్తులతోను కటకములతోను అలంకృతము లగు ఏనుగు తొండములవంటి బాహువులు ఎడమ చేతియందు పద్మము కుడి చేతియందు మారేడుపండు మేఖల (మొలనూలు- ఒడ్డాణము) ఆభరణముగా కాచిన బంగరుబోయ నాగాభరణ సంపద శోభనములగు వస్త్రములు కలది; ఆమెకు రెండు పార్శ్వములందును హ సములందు చామరములు ధరించి వీచుచుండు స్త్రీలు అనేక లు ఉందురు; పద్మ సింహాసనమందు పద్మాననముతో ఈమె కూర్చుండి ఉండును; రెండు ఏనుగులు ఈ మేను భృంగార ములను పాత్ర విశేషములతో నీరు వంచి స్నానము చేయించుచుండ మరిరెండు ఏనుగులు భృంగారములు ధరించి స్నానము చేయించుటకు వేచియుండును; ఈమెను లోకపాలురును గంధర్వులును గుహ్యకులును స్తుతించుచుందురు.
యక్షిణీ క్షేత్రపాల ప్రతిమాలక్షణములు.
యక్షిణిని సిద్ధులును అసురులును సే నీంచుచుందురు; ఆమెకు రెండు పార్శ్వములందును రెండు కలశము లుండును, తోరణమందు దేవదానవులును నాగులును ఉందురు; నాగులకు బొడ్డునకు దిగువను సర్పాకృతియు అంతకు పై భాగమున మానవాకృతియు నుండును. వారికి రెండేసి నాలుకలు కల ఫణలు ఎన్నో యుండును.
పిశాచులు రాక్షసులు ఇట్టి వారందరును రౌద్ర వికృత రూపులు.
క్షేత్రపాలుడు జటాయుక్తుడు వికృతముఖుడు; దిగంబరుడు; కుక్కలు నక్కలు నతనిని సేవించుచుండును; శిరః కేశములతో ఆవృతమగు కపాలమాతని ఎడమచేతను దక్షిణ హస్తమందు అసుర క్షయ కారిణియగు శ క్తియునుండును.
ద్విభుజ మన్మథ ప్రతిమా లక్షణము.
ఇక ఇపుడు మన్మథ ప్రతిమా లక్షణమును తెలి పెదను; ఇతడు ద్విభుజుడు; పూవులితని యాయుధములు; ఆతని పార్శ్వమందు మకర (మొసలి రూపుకల) ధ్వజము ధరించిన ఆశ్వముఖుడు (కింనరుడు) ఉండును. దక్షిణ హ సమున పూబాణములు వామహస్తమునందు పుష్పమయధనువునుండును. అతని దక్షిణ పార్శ్వమందు భోజనపదార్థము లతో కూడిన ప్రీతిదేవియు వామపార్శ్వమందు శయన వరికరములతో కూడిన రతిదేవియు నుందురు; ఈతని పరివారములో ఒక పటము (వస్త్రము) పటహము (తప్పెట) కామాతురమగు ఒక గాడిద ఉండును; దగ్గరలోనే నీటితోనిండిన దిగుడు బావియు నందన వనమునుండును. ఇట్లు కుసుమాయుధుని సుశోభనరూపముతోనున్న వానినిగా నిర్మించవలయును? ఆతని ఉనికి కొంచెము ప్రక్కకు వంపుతిరిగి ఉండవలయును; అతడు ఆశ్చర్యముతో చెమర్చిన కన్నులు కలిగియుండును.
బ్రాహ్మణులారా! నేను ఈ ప్రతిమా లక్షణమును ఉద్దేశ (నామగ్రహణ) మాత్రమున (సంక్షేపమున) చేప్పితిని; విస్తరించి సమగ్రముగా చెప్పుట బృహస్పతికినీ ఆశక్యము.
ఇది శ్రీమత్స్య మహా పురాణమున సూర్యప్రతిమాది లక్షణమను రెండు వందల అరువదియవ అధ్యాయము.
Summary of chapter 260 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents the detailed iconographic rules for sculpting various divine manifestations of Mahādeva Śiva. Bhagavān Matsya describes the serene Umā-Maheshvara form seated together on Mount Kailāsa, where Mahādeva holds the Trident, Rosary, and Lotus while embracing Goddess Pārvatī. The text outlines specifications for the terrifying Bhairava form holding a skull bowl, the Gajāntaka form clad in elephant hide, the Natarāja form engaged in cosmic dance, the Ardhanārīshvara form representing the unified divine masculine and feminine, and the five-faced Sadāshiva form, capturing the multifaceted transcendent nature of Mahādeva.