మత్స్య మహా పురాణము
100 - స్నాన విధి
నన్దికేశ్వరః: నైర్మల్యం భావశుద్దిశ్చ వినా స్నానం న విద్యతే ।
తస్మా న్మనోవిశుద్ద్యర్థం స్నానమాదౌ విధీయతే॥
అనుద్ధృతై రుద్దృతైర్వా జలై స్స్నానం విధీయతే ।
తీర్థం ప్రకల్పయే ద్విద్వా న్మూలమ శ్రేణ మంత్రవిత్॥
నమో నారాయణాయేతి మూలమన్త ము దాహృతమ్ ।
దర్భపాణిస్తు విధినా త్వాచాన్తః ప్రయతశ్శుచిః॥
చతుర్హ స్తసమాయుక్తం చతురశ్రం సమ స్తత।
ప్రకల్యావాహయే దజ్జా మేభిర్మనైః పృథక్పృథక్॥
విష్ణుపాద ప్రసూతాసి వైష్ణవీ విష్ణుదేవతా ।
పాపిన స్వేనస స్తస్మా దాజన్మమరణా నికాత్॥
తిస్రకోట్యోర్ధకోటీచ తీర్థానాం వాయురబ్రవీత్ ।
దివి భూమ్య స్తరి క్షేచ తాని తే స ని జాహ్నవి॥
నల్గినీ త్యేవ తద్భూమౌ దేవేషు నళినీతిచ।
దక్షా పృథ్వీచ విహగా విశ్వకామా శివప్రదా॥
విద్యాధరా సుప్రసన్నా తథా విశ్వప్రసాదినీ ।
క్షేమ్యాచ జాహ్నవీ చాథ తథా శా ని ప్రదాయినీ॥
ఏతాని పుణ్యనామాని స్నానకాలే ప్రకీర్తయేత్ ।
భవే త్సన్ని హితా తత్ర గజ్జా త్రిపథగామినీ॥
స ప్రవారాభిజ మేన కర సముటయోజితమ్ ।
మూఠ్నీ కుర్యా జైలం భూయ శ్రీచతుఃపశ్చిన్ పవా॥
స్నానం కుర్యా న్మృదా తద్వ దామన్ద్యానువిధానతః ।
అశ్వక్రా నే రథక్రాంతే విష్ణు క్రా నే వసున్దరే॥
మృత్తి కే హన మే పాపం యన్మయా దుష్కృతం కృతమ్ ।
ఉద్ధృతా వరా హేణ కృష్ణన శతబాహునా ॥
నమస్తే సర్వలోకానాం ప్రభవారణీ సువతే ।
ఏవం స్నాత్వా తతః పశ్చాదాచమ్యాథ విధానతః॥
ఉత్థాయ వాససీ శుక్లే శుద్ధేచ పరిధాయవై ।
తతస్తు తర్పణం కుర్యా త్త్రైలోక్యాప్యాయనాయ వై॥
మనో నిర్మలత్వమును మనఃశుద్ధియు స్నానము లేనిదే కలుగవు. కావుననే పెద్దలు స్నానమును మొదటి దానిగా విధించిరి. పైకి తీయని (నదుల) నీటితో గాని తీసిన (బావుల) నీటితోగాని స్నానము చేయవచ్చును. మొదట సంప్ర దాయము నెరిగి 'నమో నారాయణాయ' అను మూలమంత్రముతో తీర్థ కల్పనము చేసికొనవలెను. ఎట్లన నాలుగు మూరల కొలతతో చతురస్రముగ తన చుట్టును తీర్థప్రకల్పనము చేసికొని ఈ మంత్రములతో దానియందు గంగ నావాహనము చేయవలెను! “నీవు విష్ణుపాదమునుండి పుట్టితివి; విష్ణు సంబంధినివి; విష్ణువే నీ కధిష్టానదేవత; కాపున అట్టి నీవు ఆజన్మ మరణముగా మమ్ములను పాపములనుండి రక్షింపుము. వాయుదేవుడు పేర్కొన్న భూమ్యంతరీక్ష ద్యులోక ములందలి మూడున్నర కోట్ల తీర్థములును నీయం దున్న వి. భూలోకమున నందిని-దు లోకమున నళిని ఆని నీ పేరులు. ఇవి కాక దక్షా పృథ్వీ-విహగా-విశ్వకామా-శివప్రదా-విద్యాధరా సుప్రసన్నా -లోకప్రసాదినీ. క్షేమ్యా జాహ్న వీ.శాంతిప్రదాయినీ (ఆనం దము కలిగించునది.పద్మములు కలది- సమర్థురాలు..విశాలమయినది -ఆకాశమున సంచరించునది. అన్ని కోరికలు తీర్చునది శుభము ఇచ్చునది విద్యలను ధరించునది-మిగుల తేటయైనది-లోకములకు ప్రసన్న త.తేటదనము కలిగించునది - క్షేమము కలిగించునది -జహ్ను మునినుండి వెలికి వచ్చినది జహ్ను ముని కూతురు. శాంతి నిచ్చునది) స్నాన కాలమున ఈ పుణ్య నామములను కీర్తించుట చేత త్రిపథగా (తూర్పునకు-పడమరకు పాతాళమునకు-పోవు మూడు త్రోవలు కలది) ఆగు గంగ సన్ని హితయగును; ఇట్లు స్నానీయ జలమును ఏడుమా ర్థభిమంత్రించి దోసిట నింపుకొన్న ఆ నీటిని మూడు కాని నాలుగుకాని ఐదు కాని సారులు తలపై పోసికొనవలెను.
అట్లే మృత్తిక ను అభిమంత్రించి ఆది- రాచికొని కూడ స్నానము చేయవలెను. మంత్రార్థము : అశ్వములచే రథములచే విష్ణునిచే పాద ము లుంచబడినదియు ధనమును ధరించునదియు అగు మృత్తికా! నేను చేసిన దుష్కృత సిద్ద పాపములను పోగొట్టుము. వరాహరూపుడు నల్లనివాడు శతబాహుడు నగు విష్ణునిచే ఎత్తబడినావు; సర్వలోకముల నేడు అగ్ని పుట్టుకకు కారణమవు; నీకు నమస్కారము; ఇట్లు స్నానమాడి యథావిధానముగ ఆచమించి తెల్లని శుద్ద వస్త్రముల ధరించి త్రిలోక (స్థిత దేవతాదులతృప్తి కై తర్పణము (తృప్తి కలిగించునది) ఈయవలెను.
దేవా యక్షా స్తథా నాగా గంధ ర్వాప్సరస స్సురాః ।
క్రూరా స్సర్పా స్సువర్ణాశ్చ తరవో జజ్గమాః ఖగాః॥
విద్యాధరా జలధరా స్తథై వాకాశ గామినః ।
నిరాధారాశ్చ యే జీవా యేచ ధర్మరతా స్తథా॥
తేషా మాప్యాయనాయైత తియతే జలతర్పణమ్ ।
కృత్వోపవీతం దేవేషు నివీతీతు భవేత్తతః॥
మనుష్యాం సర్పయేద్భక్త్యా బ్రహ్మపుత్తా నృషీం స్తథా ।
సనకశ్చ సనన్దశ్చ తృతీయశ్చ సనాతనః॥
కపిల శ్చా సురి శ్చైవ వోడుః పఞ్చ శిఖా స్తథా ।
సర్వే తే తృప్తిమాను మద్దత్తేనామ్బునా సదా॥
మరీచి మత్యజిరసం పుల స్త్యం పులహం క్రతుమ్ ।
ప్రచేతసం వసిష్ఠంచ భృగుం నారదమేవచ॥
దేవా నహ్మఋషీ తర్వాం సర్పయే దక్షతోద కై ।
ఆపసవ్యం తతః కృత్వా సవ్యం జానాచ్య భూతలే॥
అగ్ని ష్వాత్రా స్తథా సౌమ్యా హవిష్మంత సష్మపాః ।
సుకాలినో బర్హిషద స్తథాన్యే వాజ్య పాః పునః ॥
సంతర్ప్య పితరో భక్త్యా సతిలోదక చందనైః ।
యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ॥
వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయచ ।
ఔదుంబరాయ దఘ్నాయ నీలాయ పరమేష్టినే॥
వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వై నమః ।
దర్భపాణిస్తు విధినా పితృ నంతర్పయే ద్బుధః॥
పిత్రాదీ న్నా మగోత్రేణ తథా మాతామహానపి ।
సంతర్ప్య విధినా భక్త్యా ఇమం మంత ముదీరయేత్ ॥
యే బాంధవా బొంధ వేయా యేఒన్యజన్మని బాంధవాః ।
తే తృప్తి మఖిలా యాంతు యశ్చాస్మతోభివాంఛతి॥
తతశాచమ్య విధివ దాలిఖే త్పద్మమగ్రతః ।
అక్షతాభిః సపుష్టాభిః సజలారుణచందనమ్॥
(మంత్రార్థము): దేవ యక్ష నాగ గంధర్వాపరః సుర క్రూర సర్పసుపర్ణ(గరుడ) తరు (చెట్టు) జంగమ (సంచరించు ప్రాణులు) ఖగ (పక్షులు) విద్యాధర జలధరా (మేఘములు) కాశ గామి ప్రాణులు-ఇవి అన్నియును నిరాధార జీపు లును ధర్మరతులగువారును తృప్తి నొందుట కీ తర్పణ మిచ్చుచున్నాను. అనుచు ఉపవీతముగా (జందెము సవ్యముగా) దేవతర్పణముచే ఏ పిమ్మట నివీతము జందెము తావళమువలె వేసికొనుట)గా నుండి భక్తితో మనుష్యులకును సనక సనందన సనాతన కపిలాసురివోడు పంచశిఖు లనేడు బ్రహ్మపుత్రులగు ఋషులకు మరీచ్యత్యంగిరః పుల స్య పులహక్రతు ప్రచేతో వసిష్ఠ భృగునారదులను దేవర్షి బ్రహ్మర్షులకు అక్షతోదకములతో తర్పణము నీయవలెను. తరువాత అపసవ్యముతో ఎడమ మోకాలిని నేల పై తాకించి అగ్ని ష్వాత సౌమ్య హవిష్మత్ ఊష్మపసుకాలిన్ బర్హిషద్. ఆజ్యపులు అనేడు పితృ దేవతా వర్గములకు తన పితరులకు భక్తితో తిలచందనోదకములతో తర్పణ మీయవలెను. ప్రాణుల నియమించువాడు ధర్మ ముతో రంజింపజేయువాడు మృత్యురూపుడు అంతమొందించువాడు సూర్యపుత్రుడు నల్లనివాడు సర్వభూత నాశకుడు ఔదుంబరదఘ్న నీలపర మేష్టి వృకోదర చిత్ర చిత్రగుప్త నామములతో వ్యవహరింపబడు నీకు తర్పణమనుచు యమునకు ఆయా నామగోత్రములతో పితృ పితామహ మాతామహాదులకు తర్పణ మిచ్చి “ఈ జన్మ మందో పూర్వజన్మములందో నాకు బంధువులో బంధు బంధువులో అగు వారు నా నుండి తృప్తి కోరు పితరు లెవ్వరై నను తృప్తి చెందుదురు గాక!" యని దర్భపాణీయై అందరకు తర్పణ మీయవలెను.
అర్ఘ్యం దద్యా త్ప్రయత్నేన సూర్యనామాని కీర్తయేత్ ।
నమస్తే విష్ణురూపాయ నమో విష్ణుముఖాయ వై ॥
సహస్రరశ్మయే నిత్యం నమస్తే సర్వతేజసే ।
నమస్తే శివః సర్వేశః నమస్తే సర్వవత్సలః॥
జగత్స్వామి న్నమస్తే ఒస్తు దివ్యచందనభూషితః పద్మాసన ।
నమ స్తేస్తు దివ్యచంద నభూషిత:
నమస్తే సర్వలో కేశ జగత్సర్వం విబోధ సే ।
సుకృతం దుష్కృతంచైవ సర్వం పశ్యసి సర్వగ॥
సత్యదేవ నమస్తేస్తు ప్రసీద మమ భాస్కర ।
దివాకర! నమస్తేస్తు ప్రభాకరః నమోస్తుతే ॥
ఏవం సూర్యం నమస్కృత్య త్రిః కృత్వాచ ప్రదక్షిణమ్ ।
ద్విజం గాం కాంచనం స్పృష్ట్యా తతో విష్ణుగృహం వ్రజేత్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే స్నా నాది-తర్పణ- సూర్యార్ఘ్య నిరూపణం నామ శతత మోధ్యాయః॥
తరువాత యథావిధిగా ఆచ మించి తన ముందు పద్మమును లిఖించి దానిపై సూర్యనామకీర్తన పూర్వకముగా పుష్పాక్షతర క్తచందన సహితముగా సూర్యునకు అర్ఘ్యము నీయవలెను. (నామార్థములు): విష్ణురూపుడు విష్ణుముఖుడు సహ సకిరణుడు సర్వతేజోరూపుడు శుభకరుడు సర్వేశుడు అందరయందు వాత్సల్యము కలవాడు . లోకప్రభువు దివ్య చందనభూషితుడు పద్మాసనుడు కుండలములతో భుజకీర్తులతో భూషితుడు సర్వలోకేశుడు సర్వజగముల మేల్కొలుపు వాడు సర్వసుకృతదుష్కృత సాక్షి సర్వవ్యాపి సత్యదేవుడు తేజోనిర్మాతయగు రవీ! నీకు నమస్సులు. అనుచు రవి కర్ఘ్యము ఇచ్చి మున్మూరు ప్రదక్షిణించి నమస్కరించి బ్రాహ్మణుని గోవును బంగారమును తాకి తరువాత విష్ణ్వాలయము నకు పోవలెను.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున స్నాన విధియను నూరవ అధ్యాయము
Summary of chapter 100 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya concludes this section by glorifying the supreme efficacy of all devotional vows dedicated to Bhagavān Vishṇu. The Lord summarizes the spiritual underlying truth of Vrata-pālana, explaining that external rituals, fasts, and gifts serve to anchor the human mind in continuous contemplation of the Divine. Whoever observes these sacred vows with unyielding faith, devotion, and moral purity attains freedom from the three types of worldly suffering, protects their entire family lineage, and enjoys imperial prosperity on earth. Ultimately, upon casting off the mortal body, such a devout practitioner transcends the mortal world of birth and death, ascending to the supreme, eternal abode of Vaikuṇṭha, where they abide in perpetual divine bliss in the presence of Lord Janārdana.