83- లవణ వర్వత దానము

 ఈశ్వరః : అథాత స్సంప్రవక్ష్యామి లవణాచల ముత్తమమ్

 యత్ప్రసాదాన్నరో లోకా నాప్నోతి శివసంయుతాక్

 ఉత్తమ ష్షోడశద్రోణైః • కర్తవ్యో లవణాచలః

 మధ్యమస్యా త్తద ర్దేన చతుర్భి రధమ స్సృతః

 విత్తహీనో యథాశ క్త్యా ద్రోణాదూర్ద్వంతు కారయేత్

 చతుర్థాం శేన విష్కమ్భ పర్వతా న్కారయే తృథక్

 విధానం పూర్వవ త్కుర్యా ద్భ్రహ్మాదీనాంచ సర్వదా

(తద్వ ద్దేమమయా న్త్సర్వా) తద్వ ద్ధేమతరూ న్త్సర్వా లోకపాలాన్ని

వేశ యేత్

 సరాంసి వనవృక్షాదీం స్తద్వ దత్రాపి కారయేత్

 కుర్యాజ్జాగరణం రాత్రౌ దాన మన్త్రా న్ని బోధమే

 సౌభాగ్యరససమ్భూతో యతోఽయం లవణో రసః

 తదాత్మక త్వేన చ మాం పాహి త్వం పర్వతోత్తమ

 యస్మా దన్యర సా స్సర్వే నోత్కటా లవణం వినా

 ప్రియంచ శివయో ర్నిత్యం తస్మాచ్ఛా న్తిపరో భవ

 విష్ణదేహసముద్భూతం యస్మా దారోగ్యవర్ధనమ్

తస్మాత్పర్వతరూపేణ పాహి సంసారసాగరాత్

 అనేన విధినా యస్తు దద్యా ల్లవణపర్వతమ్

 ఉమాలో కే వసే త్కల్పం తతో యాతి పరాం గతిమ్  

ఇతి శ్రీమత్స్యమహాపురాణే లవణపర్వత దానమాహాత్మ్య కథనం నామ త్ర్యశీతితమోఽధ్యాయః

ఈశ్వరుడు ఇట్లు చేప్పెను: ఇప్పుడు ఇక" లవణ పర్వత దాన విషయము చెప్పెదను: అది ఉత్తమమయినది. దాని దానానుగ్రహమున మానవుడు శివున కాశ్రయమగు - లోకములను పొందును. పదునారుగాని ఎనిమిదికాని నాలుగు - కాని ద్రోణముల పరిమితికల లవణము దీని కై కావలయును. అందులకును ధనశ లేనివాడు ద్రోణ పరిమితికి తక్కువ కాకుం 5 ఎంతతో నైన చేయవచ్చును. మొత్తము పరిమాణములో నాలుగవవంతు లవణముతో విష్కంభ పర్వతముల నేర్పరచ వలేను. బ్రహ్మాది దేవతలను బంగారు వృక్షములను లోకపాలురను సరస్సులను వృక్షములను పైవలెనే చేయవలెను. రాత్రి జాగరణమును చేయవలెను. (దాన మంత్రము. లవణ రసము రుచి) సౌభాగ్య రసముతో నిండినది. దానితో ఏర్పడిన పర్వతోత్తమా! నన్ను రక్షించుము. తః లవణ రసము లేనిదే మిగిలిన రుచులు స్పుటములు కావు; గొప్పవి కావు. ఈ లవణ రసము పార్వతీ పరమేశ్వరులకు ప్రియమయినది కూడను. ఇట్టి నీవు ఓ రసమా: నాకు శాంతినిమ్ము, విష్ణు దేహమునుండి ఉద్భవించిన దానవు ఆరోగ్య వర్గ నమవు అగు లవణ పర్వతమా ! సంసార సాగరమునుండి నన్ను రాపాడుము. ఈ విధానముతో లవణ పర్వత దానము చేయువాడు కల్పకాలముపాటు ఉమాలోకమునందు వసించి ఉత్తమ గతినొందును.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున లవణ పర్వత దానమాహాత్మ్య కథనమను ఎనుబది మూడవ అధ్యాయము.