మత్స్య మహా పురాణము
279 - హిరణ్యాశ్వ దాన విధానము.
శ్రీమత్స్యః : అథాత స్సమ్పవశ్యామి హిరణ్యాశ్వవిధిం పరమ్ ।
యస్య ప్రదానా ద్భువనే చాన న్యం ఫల మశ్నుతే॥
పుణ్యాం తిథి మథాసాద్య కృత్వా బ్రాహ్మణవాచనమ్ ।
లో కేశావాహనం కుర్యా త్తులాపురుష దానవత్॥
ఋత్విజ్మణపసమారభూషణాచ్ఛాదనాదికమ్ ।
స్వల్పే త్వేకాగ్ని వత్కుర్యా ద్దేమవాజీమఖం బుధః॥
స్థాపయే ద్వేదిమధ్యేతు కృష్ణాజినతిలోపరి ।
కౌశేయవన్తసంవీతం కారయే ద్దేమవాజినమ్॥
శ క్తిత శ్రీపలాదూర్ధ్వ మాసహస్రపలా తథా ।
పాదుకోపానహచ్ఛత్రం చామరాసనభాజనైః॥
పూర్ణకుమ్బాష్టకో పేతం మాల్యేనుఫలసంయుతమ్ ।
శయ్యాం సోపన్కరాం తద్వ ద్దేమమార్తాణసంయుతామ్॥
తత స్సర్వేషధీస్నాన స్నాకతో విప్రపుజువైః ।
ఇమ ముచ్చారయే న్మ గృహీతకుసుమాక్జాలిః॥
నమస్తే సర్వదేవేశ వేదాహరణలమ్పట ।
వాజిరూ పేణ మా మస్మా తాహి సంసారసాగరాత్॥
త్వమేవ సప్తధా భూత్వా ఛశోరూ పేణ భాస్కర ।
యస్మా ద్రృమయ సే లోకా నతః పాహి సనాతన॥
ఏవ ముచ్చార్య గురవే తమశ్వం విని వేదయేత్ ।
దత్వా పాపక్షయా ద్ళానో క్లోక మభ్యతి శాశ్వతమ్॥
గోఖి ర్విభవత స్సర్వా నృత్విజశ్చాపి పూజయేత్ ।
సర్వధన్యోపకరణం గురవే వినివేదయేత్॥
సర్వం శయ్యాదికం దత్వా భుజ్జా తాతైల మేవచ ।
పురాణశ్రవణం తద్వ తారయే దోజనాదికమ్॥
ఇమం హిరణ్యాశ్వవిధిం కరోతి య స్సమ్పూజ్యమానో దివి దేవసఖైః ।
విముక్తపాప స్స పదం మురారేః ప్రాప్నోతి సిద్ధే రభిపూజిత స్సర్॥
ఇతి పఠతి య ఏత దేమవాప్రదానం సకలకలుషయుక్త స్సోశ్వమేదేన యుక్తః ।
కనకమయవిమానే నా ర్కలోకం ప్రయాతి త్రిదశపతివధూభిః పూజితో యోభివ శ్యేత్॥
యో వా శృణోతి పురుషోలధన స్మరేద్వా హేమాశ్వదాన మభినన్దతి చేహ లో కే ।
సోపి ప్రయాతి హతకల్మషశుద్ధదేహ స్థానం పురస్టోరమ హేశ్వర దేవజుష్టమ్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మహాదానానుకీర్తనే హిరణ్యాశ్వప్రదానికో
నామ ఏకోనాతీత్యుత్తరద్విశతతమోధ్యాయః॥
శ్రీమత్సుడు మనువునకిట్లు చెప్పెను: ఇపుడిక షోడశమహాదాన క్రమమునందలి పొర ణ్యాశ్వదాన విధానమునుల ఉత్తమమయినది; దీని నీచ్చీనందువలన దాత భువనములందు విలక్షణముగ ఆనంతమగు ఫలము నందును; పుణ్యకరమగు శుభతిథియందు ఏపులచే పుణ్యాహవాచనమును లోకపాలకోవాహనమును ఋత్విజులను మండప మును సంభారములను భూషణములను వస్త్రములు మొదలగు వానిని తులాపురుష దానమునందువలెనే జరుపవలెను; స్వల్ప ప్రక్రియతో జరుపదలచినవారు ఏకాగ్ని విధానముతోనే ఈ హిరణ్యాశ్వ దాన యజ్ఞమును జరుపవలేను; బంగరు గుర్రమును. తన శ క్తి ననుసరించి మూడు పలములకంటే ఎక్కువగ సహస్ర పలములకు మించని బంగారుతో చేయించి దానిని వేదీ మధ్యమందు కృష్ణాజినము పై నూవులయందు పట్టువస్త్రములతో చుట్టి ఉంచవలయును; దాని దగ్గర పాదుకలు పాదరక్షలు. ఛత్త చామరానన పొత్రములు ఎనిమిది పూర్ణ కుంభములు మాల్యములు చేరకుగడలు ఫలములు ఉపన్కరములతో కూడ శయ్య బంగరు సూర్యుడు- ఇవి యన్ని యు ఉంచవలెను; తరువాత యజమానుడు బ్రాహ్మణులచే సరౌషధీ స్నానము జరి పించుకొని దోసిట పూవులు పట్టుకొని ఈ మంత్ర ముచ్చరించవలయును:
“నర్వదేవేశా: రూపమున వేదములను తెచ్చుటయందు ఆసక్తి కలవాడా! (హయగ్రీవ) ఆశ్వరూపముతో నీవును మమ్ము నంసార సాగరమునుండి రక్షించుము; భాస్కరా! నీవే ఛందోరూపమున ఏడుగానయి. (వేదమునందలి ప్రధాన ఛందస్సులు ఏడు మాత్రమే) లోకములను ప్రవర్తిల్లజేయుచున్నావు; కావున ఇట్టి నీవు మమ్ము రక్షించుము.”
ఇట్లుచ్చరించి ఆయశ్వమును గురువునకు అర్పించవలయును; దాని ఫలముగా పాపక్షయమగుటవలన శాశ్వత మగు భాను లోకమును పొందును; తరువాత యథాశక్తిగా గోవులతో ఋత్విజులను పూజించవలయును; నర్వధాన్యోప కరణములను గురునకు ఈయవ లేను. శయ్య మొదలగునవికూడ (పాత్రులకు) దానము చేసి తైలరహితమగు ఆహారమును భుజించవలయును; పురాణ శ్రవణమును భోజనాదికమును జరిపించవలెను.
ఈ హిరణ్యాశ్వ దాన మొనర్చినవాడు పాపముక్తుడై స్వర్గమున సిద్దులచే ఇతర దేవసంఘములచే పూజితు డగుచు నారాయణపదప్రాప్తు డగును; దీనిని పఠించువాడును సకల పాపముక్తుడై అశ్వ మేధఫలము నందును; కనకమయ విమానమున రవిలోక మేగి ఆట అప్పరః పూజితు డగును; అల్పధన పురుషుడు దీనిన వినినను చూచినను స్మరించి మెచ్చి నను అట్టివాడును పాపనాశమున శుద్ధ దేహుడై ఇంద్ర రుద్రాదులు వసించు లోకము లందును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున హిరణ్యాశ్వ ప్రదానీకమను రెండు వందల డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 279 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the procedures for Hiraṇyāshva-dāna, the fifth Mahādāna involving the gift of a beautifully crafted golden horse standing upon a sanctified altar platform. Bhagavān Matsya describes sculpting the golden horse with golden reins, gemstone eyes, silver hooves, and silk trappings, representing Uchchaiḥshravā, the divine horse born from the churned ocean. The donor worships Sūrya Deva and Bhagavān Vishṇu within the golden horse, presenting it to an exemplary Brāhmaṇa, bestowing swift progress, physical vitality, freedom from fear, and long residence in the solar realm.