మత్స్య మహా పురాణము
102 - ప్రయగ మాహాత్మ్య వర్ణనము
యుధిష్ఠిర ఉవాచ : భగవన్ శ్రోతుమిచ్ఛామి పురాకల్పే యథా స్థితమ్ !
బ్రహ్మణా దేవముఖ్యేన యథావ త్కథితం మునే॥
కథం ప్రయాగే గమనం నరాణాం తత్ర కీదృశమ్ ।
మృతానాం కా గతి సత్ర స్నా తానాం తత్ర కిం ఫలమ్॥
యే వసంతి ప్రయాగేతు బ్రూహి తేషాంచ కిం ఫలమ్ ।
మార్కండేయ ఉవాచ : కథయిష్యామి తే వత్స యచ్ఛేష్టం తత్ర యత్పలమ్॥
పురా హి సర్వవిప్రాణాం కథ్యమానం యథా శ్రుతమ్ ।
ఆప్రయాగప్రతిష్ఠినా దాపురా ద్వాసు కే దాత్॥
కంబశాశ్వతరో నాగౌ నాగశ్చ బహుమూలక ।
ఏత త్ర్పజాపతేః క్షేత్రం త్రిషు లో కేషు వి శ్రుతమ్॥
తత్ర స్నా తా దివం యాంతి యే మృతా ఫేఒపునర్భవాః ।
తతోబ్రహ్మాదయో దేవా రక్షాం కుర్వంతి సంగతాః॥
అన్యేచ బహవ సీర్థాః సర్వపాపహరాః శుభాః ।
న శక్యాః కథితుం రాజన్ బహువర్ష శతై రపి॥
సంక్షే పేణ ప్రవక్ష్యామి ప్రయాగస్యలు కీర్తనమ్ ।
షష్టి ర్ధనుఃసహస్రాణి యాని రక్షంతి జాహ్న వీమ్॥
యమునాం రక్షతి సదా సవితా సప్తవాహనః ।
ప్రయాగంతు విశేషేణ సదా రక్షతి వాసవః॥
మండలం రక్షతి హరి ర్దేవతై సహ సంగతః ।
తం వటం రక్షతి సదా శూలపాణి ర్మ హేశ్వరః॥
స్థానం రక్షంతి వై దేవాః సర్వపాపహరం శుభమ్ ।
ఆధర్మేణావృతో లోకే నైవ గచ్ఛతి తత్పదమ్॥
స్వల్ప మల్పతరం పాప యదా తే స్యా న్న రాధిప ।
ప్రయాగం స్మర మాణస్య సర్వ మాయాతి సంక్షయమ్॥
యుధిష్ఠిరుడు మార్కండేయునితో ఇట్లు పలికేను: భగవన్: ప్రయాగ యాత్ర ఎట్లు చేయవలెను? ఆచట మరణించినచో కలుగు ఫలము ఏమి? స్నానము చే కలుగు ఫల మెట్టిది? అచట నివసించు వారికి కలుగు పుణ్యమేమి? ఈ విషయమున దేవ ముఖ్యుడగు బ్రహ్మ ఏమని చెప్పెనని పురా కల్పమునందు చెప్పబడినది? తెలుపుము.
మార్కండేయుడు: నాయనా! ప్రయాగ క్షేత్రమువలన కలుగు ఫలమేమో దాని శ్రేష్టత ఏమో ఆదంతయు పూర్వము బ్రాహ్మణులు చెప్పుకొనుచుండ నేను వినిన దానిని తెలి పెద; వినుము ప్రయాగ (పురము-ప్రతిష్టాన నగరము (ఇది నేటి పైథాను మాత్రమేకాదు; నేటి ఆలహాబాదు స్థానమున నొక ప్రతిష్టాన నగరముండెడిది. అది ఒకప్పుడు-దుష్యంతాదుల కాలమున పూరు వంశీయుల రాజధానిగా నుండెను.). వాసుకిహదపురము -కంబలాశ్వతరులను నాగుల స్థానములు.బహుమూలకుడను నాగుని స్థానము. అను ఈ నాలుగు అవధుల లోపలనున్నది. ప్రజాపతి క్షేత్రము అని లోకత్రయ ప్రసిద్దము; అచట స్నానము చేసినచో స్వర్గప్రాప్తి; ఆట మరణించిన వారికి పునర్జన్మము లేదు; అందుననే బ్రహ్మాది దేవతలు అందరును కూడి దీనిని రక్షించుచుందురు. ఇంకను ఇచటగల బహుతీర్ణముల సంఖ్య ఇంతయని వందల ఏండ్లకును చెప్పనలవికాదు. ఐనను ప్రయాగ క్షేత్ర కీ ర్తనమును సం షేపమున చేయుదును. అచటి గంగను ఆరువేల ధనువులు (అందరు ధనుష్కలు) రక్షించుచుండును (దురు.) యమునను సప్తాశ్వుడగు రవి కాపాడు చుండును. ప్రయాగమును ఇంద్రుడు వి శేషించి రక్షించుచుండును. ఈ ప్రయాగ మండలమునంతటిని హరి సకల దేవసహాయు డై రక్షించుచుండును. అచటి వటవృక్షమును శూలపాణియగు మ హేశ్వరుడు రక్షించును; సర్వపాపహరమగు ఆ పుణ్య స్థానమును దేవతలు రక్షింతురు. లోకమునందలి మానవుడు అధర్మావృతుడై సంతవరకును అచటికి పోజాలడు; అల్పాల్పమగు శాపయున్న వానికి మాత్రము ప్రయాగను తలంచినంతనే ఆదియు నశించును; ఆ తీర్థ మును దర్శించినను పేర్కొన్న ను. అచటి మృత్తికను స్పృశించినను. నరుడు పాపముకుడగును.
దర్శనా త్తస్య తీర్థస్య నామసంకీర్తనాదపి ।
మృత్తికాలంభనాద్వాపి నరః పాపా త్ప్రముచ్యతే॥
పంచకుండాని రాజేంద్ర తేషాం మధ్యేతు జాహ్నవీ ।
ప్రయాగస్య ప్రవేశే తు పాపం నశ్యతి తత్ క్షణాత్॥
యోజనానాం సహ సేషు గంగాయాః స్మరణా న్నరః।
ఆపి దుష్కృతకర్మాతు లభతే పరమాం గతిమ్॥
కీర్తనా న్ముచ్యతే పాపాత్ దృష్ట్వా భద్రాణి పశ్యతి ।
అవగాహ్యచ పీత్వా తు పునా త్యాసప్తమం కులమ్॥
సత్యవాదీ జితక్రోధీ అహింసాయాం వ్యవస్థితః ।
ధర్మానుసారీ తత్వజ్ఞో గోబ్రాహ్మణహితే రతః॥
గంగాయమునయో ర్మధ్యే స్నాతో ముచేత కిల్బిషాత్ ।
మనసా చింతయన్ కామా నవాప్నోతి సుపుష్కలాన్॥
తతో గత్వా ప్రయాగంతు సర్వదేవాభిరక్షితమ్ ।
బహ్మ చారీ వసే న్మాసం పితృన్ దేవాంశ్చ తర్పయేత్॥
ఈప్సితాన్ లభతే కామాన్ యత్ర యత్రాభిజాయతే ।
తపనస్య సుతా దేవీ త్రిష లోకేషు విశ్రుతా ॥
సమాగతా మహాభాగా యమునా తత్ర నిమ్న గా ।
తత్ర సంనిహితో నిత్యం సాక్షాద్దేవో మహేశ్వరః॥
దుష్పృఅప్యం మానుషైః పుణ్యం ప్రయాగంతు యుధిష్ఠిర ।
దేవదానవగంధర్వా ఋషయః సిద్దచారణాః॥
తదుపస్పృశ్య రాజేంద్ర స్వర్గలోక ముపాసతే॥
ఇతీ శ్రీమత్స్యమహాపురాణే ప్రయాగమాహాత్మ్యే ద్వ్యధిక శతత మోధ్యాయః॥
రాజా! అచట పంచకుండములు (తీర్థములు) కలవు. వానిలోనిదే జాహ్నవి గంగయును; ప్రయాగములో ప్రవేశించిన తత్ క్షణ మే పాపనాశమగును; యోజన సహ సములనుండియేనను ఆమెను స్మరించినంతనే ఎట్టి దుష్కృత కర్ముడును పాపముక్తుడై పరమగతినందును. దర్శించినంతనే శుభములు పొందును. స్నానమాడినను ఆ నీటిని త్రావినను ఏడు తరములవారిని పవిత్రులనొనరించిన వాడగును. ఇక సత్యవాదియు జిత కోధుడును ఆహింసకుడును ధర్మానుసారియు త త్వజుడును గో బ్రాహ్మణ హిత రతుడునునగు సజ్జనుడు గంగా యమునా మధ్యమున స్నానమాడి సంత పాపముక్తుడగును; మనసా నిరంతరము దానినే ధ్యానించుచుండువాడు సుపుష్కలమగు కామము లన్నియు నేర వేరును.
ఆందువలన సర్వదేవాభిరక్షితమగు ప్రయాగమున కేగి బ్రహ్మ చర్యముతో మాసముండి పితృ దేవతలకు దేవతలకు తర్పణ మీయవలెను. తత్పుణ్యమున అత డెచట జన్మించినను సర్వ కామపూర్తి నందును.
రవిపుత్త్రిరిగా త్రిలోక వి శంతయగు మహాభాగ యమున అచట గంగతో కలియును. అచట సా డౌన్మహేశ్వరుడు సదా సన్నిహితుడు; ప్రయాగ క్షేత్రోపాసనమున మానవులకు దుషాపమగు పుణ్యము లభించును. ఏలయన దేవదానవ గంధర్వ సిద్దచారణులును ఋషులును ఆ క్షేత్రమున ఆ నమించినంత మాత్రముననే స్వర్గ సుఖముల నందగలుపచున్నారు.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట రెం వ అధ్యాయము.
Summary of chapter 102 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the extraordinary spiritual fruits achieved by taking holy baths at Prayāga, particularly during the sacred month of Māgha when all celestial Deities, Rishis, Gandharvas, and sacred waters assemble at the holy Saṅgama. Bhagavān Matsya describes how the pale waters of Gaṅgā merge with the dark blue waters of Yamunā, creating a divine stream that bestows immediate liberation upon devout bathers. Performing ritual bathing, offering water libations to ancestors and Devas, and observing vows of purity at Prayāga ensures that a devotee cleanses seven generations of maternal and paternal ancestors from hellish conditions, elevating them directly to the celestial abodes of Brahmāloka and Vishṇuloka.