5 - దక్షసృష్ట్యా ది వివరణము

 ఋషయః: దేవానాం దానవానాం చ గంధర్వేరగరక్షసామ్

 ఉత్ప త్తిం విస్తరేణాథ సూత బ్రూహి యథావిధి

 సూత: సజ్కల్పా ద్దర్శ నాత్పర్శా త్పూ ర్వేషాం సృష్టి రుచ్యతే

 దక్షా తాచేతసా దూర్వం సృష్టి ర్మైథునసమ్భవా

ప్రజా సృజే త్యథాదిష్టః పూర్వం దక్ష స్వయమ్బువా

 యథైవ చ ససర్జాదౌ తథైవ శృణుత ద్విజాః

యథా తు సృజత స్తస్య దేవర్షిగణపన్న గాః

తే వృద్ధి మగమం ల్లో కాస్తథా మైథునయోగతః

 దక్షః పుత్రసహస్రాణి పక్చాక ద్వా వ్యజ్జనత్

 తాంస్తు దృష్ట్వా మహాభాగా నిసృకు ర్వివిధాః ప్రజాః

 నారదః ప్రాహ హర్యక్షా స్టోక్షపుత్రా నమస్థితాక్

 భూమేః ప్రమాణం తద్ జ్ఞాత్వా అత ఊర్ధ్వం సమాసతః

 తత సృష్టిం విశే షేణ కురుధ్వ మృషిసత్తమాః

తే తు తద్వచనం శ్రుత్వా ప్రయయు స్సర్వతోదిశమ్

అద్యాపి న నివర్తనే సముద్రాదివ సిన్హవః

 హర్యక్షాదిషు నషేషు పున ర్దక్షః ప్రజాపతిః

 వై రిణ్యామేవ పుత్రాణాం సహస్ర మసృజ తభుః

 శ బలా నామ తే విప్రా స్సమేతా స్సృష్టి హేతవః

 నారదోనుగతః పశ్చాత్స పునః పూర్వవ త్సుతార్

భువః ప్రమాణం సర్వత్ర జ్ఞాత్వా భాతృ న్పునఃపునః

 ఆగత్య చాథ సృష్టించ కరిష్యథ విశేషతః

తేపి తేనైవ మార్గేణ జగ్ము ర్ర్బత్య న్యథా పురా

 తతః ప్రభృతి న భ్రాతుః క నీయా స్మార్గ మృచ్ఛతి

 అన్విష్య దుఃఖ  మాప్నోతి తేన తాం పరివర్జయేత్

 తత స్తేష్వపి నషేషు, షష్టిం కన్యాః ప్రజాపతిః

వై రిణ్యాం జనయామాస దక్ష ప్రాచేతస స్తథా

 ప్రాదా త్స దశ ధర్మాయ కాశ్యపాయ త్రయోదశ

 సప్తవింశతి సోమాయ చతస్కోరిష్టనేమయే

 ద్వే చైవ భృగుపుత్రాయ ద్వే కృశాశ్వాయ ధీమతే

 ద్వే చై వాజిర సే తద్వ త్తాసాం సామాని విస్తరాల్

 శృణుధ్వం దేవమాతృణాం ప్రజావి స్తర - మాదితః

 మరుత్వతి వసు ర్హామీ రేవా భాను గరున్లతీ

సజ్కలా చ ముహూర్తా చ సాధ్యా వై విశ్వభామినీ

ధర్మపత్య స్సమాఖ్యాతా స్తాసాం పు త్త్రాన్ని బోధత

ఋషులు సూతు నిట్లు ప్రశ్నించిరి: సూతా! దేవతలు దానవులు గంధర్వులు నాగులు రాక్షసులు మొదలగువారి ఉత్పత్తిని ఇక మీదట మాకు విస్తరించి చెప్ప వేడుచున్నాను. 

సూతుడు ఇట్లు చెప్పనారంభించెను: దక్ష ప్రజాపతికంటే ముందు వారు చేసిన సృష్టి సంకల్పమున దర్శన మాత్రమున స్పర్శనము వలన జరిగెడిది. ప్రాచేత సుడగు: దక్షుని మొదలుకొని సృష్టి స్త్రీపురుషుల సంయోగమువలన సంతా నోత్పత్తి జరుగుటతో ఆరంభమయినది. స్వయంభువుని ఆజ్ఞానుసారము దక్షుడు సృష్టి జరిపిన విధము తెలిపేదను వినుడు. అతడు జరిపిన సృష్టిలో దేవతలు ఋషులు నాగులు మొదలగు వారందరును అన్ని ప్రాణులును మైథునము (స్త్రీ పురుషుల కూడిక) వలన జనించి వృద్ధి పొందిన విధమును తెలిపేదను. దమునకు మొదట ఏబదివేల మంది కుమారులు కలిగిరి. వారు వివిధ ప్రజలను సృష్టింపదలచియుండుట చూచి నారదుడ వారితో ఇట్లు పలికెను. ఋషి సత్తములారా! మీరు మొదట భూమి పరిమాణమెంతయో పూర్తిగా తెలిసికొని పిమ్మట దానియందు సరిపోవునంత మంది ప్రజలను సృష్టించుడు. వారు ఆ మాట విని అందులకై బయలు దేరి అన్ని వైపులకు వెళ్ళిరి. సముద్రములోనికి పోయిన ''నదులు మరలిరానట్లు హర్యక్షుడు మొదలగు ఆ దముని కుమారులు ఇప్పటికిని మరలి రాకున్నారు. అంతట దక్షుడు వైరిణి అను భార్యయందు వేయిమంది కుమారులను క నేను. శ బలులు అను పేరుగల ఆ దక్షపుతులు సృష్టికి హేతుభూతులై యుండిరి. నారదుడు వారీకడకును వచ్చి మొదటి వలెనే ఇట్లు పలికెను. ఋషులారా! మీరు పోయి భూప్రమాణమును మీ అన్నల జాడను కూడ తెలిసికొనివచ్చి పిమ్మట సృష్టిని విశేషముగ ఆరంభించుడు. అనగe -విని వారును అన్ని దిక్కులకును పోయిరి. కాని మరలి రాలేదు. అందుచేతనే లోకములో తప్పిపోయిన అన్నల జాడ కనుగొనుటకు తమ్ములు పోరు. అట్లు ఒక వేళ వేద కుటకు పోయినచో కీడు కలుగును. కనుక అట్లు చేయరాదు. శ బలులు కూడ ను మరలి రాకపోగా ప్రాచేతసుడగు దక్షుడు వై రిణి యను భార్యయందు ఆరువదిమంది కూతుండను కనెను. వారిలో పదిమందిని ధర్మునకును పదుముగ్గురను కశ్యపునకును ఇరువది ఏడుమందిని సోమునకును నలుగురను అరిష్ట నేమికిని ఇద్దరను భృగు పుత్రునకును ఇద్దరను కృశాశ్వునకును ఇద్దరను అంగిరసునకును ఇచ్చెను. ఈ దేవమాతల వలన జరిగిన ప్రజా విస్తరమును ఆదినుండి చెప్పెదను. వినుడు. మొదటి పదిమందియును మరుత్వతి వసువు జామి- రేవా భానువు అరుంధతి సంకల్ప ముహూర్త సాధ్యా విశ్వ అను వారు ధర్ముని భార్యలు.

విశ్వా నేవాంస్తు విశ్వా చ సాధ్యాసాధ్యా నజిజనత్

 మరుత్వత్యాం మరుత్వన్తో వసోస్తు వసవ స్తథా

ధానోస్తు భానవ స్తద్వ న్ముహూర్తాయాం ముహూర్తకమ్

 రేవాయాం ఘోషనామానో నాగవీథ్యస్తు జామిజాః

 పృథివీతలసమ్భూత మరునత్యా మజాయత

 సజ్కల్పాయాం తు సజ్కల్పో వసుసృష్టిం నిబోధత 

వసుసన్తతికి జ్యోతిష్మ స్తోస్తు తే దేవా వ్యాపకా స్సర్వతోదిశమ్

 వసవస్తే సమాఖ్యాతా స్తేషాం సర్గం నిబోధత

 ఆపో ధ్రువశ్చ సోమశ్చ ధర శ్చైవానిలో ఒనలః

 ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోయిష్టా ప్రకీర్తితాః

 ఆపస్య పుత్తా శ్చత్వార శ్శాన్తో వై దణ్డ ఏవ చ

 సామ్బోపి మణివక్తశ్చయజ్ఞరక్షాధికారిణః

 ధ్రువస్య కాళ పుత్తస్తు వర్చా సోమా దజాయత

 ధరస్య మారుతస్యాపి ధర్మపౌత్తా వుభౌ స్మృతౌ

 కల్పానీక స్తతః ప్రాణో రమణ శ్శిశిరోపి చ

తతశ్చ హవ్యవాహస్య పుత్రయ మభూ నృప

 శాఖస్తు ప్రథమ స్తేషాం విశాఖస్తు తతఃపరమ్

 అపత్యం కృత్తికానాం తు కార్తికేయ స్తత స్సృతః

 ప్రత్యూషస్య విభుః పుత్త ఋషి ప్రామస్య దేవలః

 విశ్వకర్మా ప్రభాసస్య పుత్ర శ్శిల్పి ప్రజాపతిః

 ప్రాసాదభవనోద్యానప్రతిమాభూషణాదిషు

 అగారారామకూ పేషు స్మృత సోమరవద్దకి

 అజైకపా దహిర్బుద్న్యో విరూపాక్షోథ రై వతః

 హర్యశ్వో బహురూపశ్చ ప్రబకశ్చ సురేశ్వరః

 సావిత్రశ్చ జయ నశ్చ పినాకీ చాపరాజితః

 ఏతే రుద్ర స్సమాఖ్యాతా ఏకాదశ గణేశ్వరాః

 కోటయ శ్చతురాశీతి స్తతాప్తాశ్చాషయా స్సృతాః

 దీక్షు సర్వాసు యే రజాం ప్రభుర్వని గణేశ్వరాః

పుత్త్రాః పౌత్త్రా స్సృతా శ్చైతే పురాణా గర్భసమ్భవాః

 ఇతి శ్రీమత్స్య మహాపురాణే మత్స్యమనుసంవాదే దక్షసృష్టికథనం నామ పఞ్చమోధ్యాయః

విశ్వకు విశ్వదేవులు సాధ్యకు సాధ్యులు మరుత్వతికి మరుత్వతులు వస్తువునకు వసువులు భానువునకు భాను వులు ముహూర్తకు ముహూర్తగణము రేవకు ఘోషులు అను దేవగణములు జామికి నాగవీథ్యాదులు అరుంధతికి పృథివీ తలమునందలి ప్రాణి సమూహము సంకల్పకు సంకల్పుడు అను వారు పుట్టిరి.

వీరిలో వసువుల సృష్టిని తెలి పెదను వినుడు. వీరు జ్యోతిష్మంతులు (ప్రకాశము కలవారు. అన్ని దిక్కు లందును వ్యాపించువారు. అంతట వ్యాపించి వసించువారు కనుక నే వారికి వసువులు అని వ్యవహారము. వారి పేరులు ఆపుడు ధ్రువుడు సోముడు ధరుడు అనిలుడు అసలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అనునవి. వీరిలో ఆపునకు శాంతుడు దండుడు సాంబుడు మణివ కుడు అను నలుగురు కుమారులు. వీరు యజ్ఞరక్ష కు అధికారులు. ధ్రువునకు కాళుడు సోము నకు వర్చసుడు ధరునకు కల్పానీకుడు ద్రోణుడు అనువారు అనిలుసకు రమణుడు శిశిరుడు అను ఇద్దరు అనలునకు శాఖుడు విశాఖుడు కార్తికేయుడు కృత్తికలయందు) అను ముగ్గురును ప్రత్యూషునకు దేవలుడు అను సమర్థుడగు ఋషి ప్రభాసునకు విశ్వకర్మయను ప్రజాపతియగు దేవశిల్పియు కుమారులు. ఈ విశ్వకర్మ ప్రాసాదములు భవనము లు ఉద్యాన ములు ప్రతిమలు ఆభరణములు గృహములు ఆరామములు కూపములు మొదలైన వాని నిర్మాణములలో దేవతలకు వడ్లంగి.

 ధర్ముని సంతానమే యగు అజైకపాద్ అహిర్భుధ్యుడు విరూపాక్షుడు రైవతుడు హర్యశ్వుడు బహురూపుడు ప్రబకుడు సురేశ్వరుడు సావిత్రుడు జయంతుడు పినాకి అనువారు ఏకాదశ రుద్రులు. వీరు గణ దేవతలు. వీరి బలగము ఎనుబదికోట్ల మంది కలరు. వీరు వారికి అధిపతులై అన్ని దిక్కులయందు నుండి లోకరక్ష చేయుదురు. గర్భము నుండి జనించిన ఆది సంతానరూపమగు ప్రజాపతి పుత్ర పౌత్తుల వివరణము ఇది.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున దక్షసృష్టికథనమను పంచమాధ్యాయము.