మత్స్య మహా పురాణము
59 - ఆరామప్రతిష్ఠావిధానము - వృక్షారోపణమహిమము
ఋషయః : పాదపానాం విధిం సూత! యథావ ద్విస్తరా ద్వద ।
విధినా కేన కర్తవ్యం పాదపోద్యాపనం బుధే: ॥
యేచ లోకా స్మృతా స్తేషాం తానిదానీం వదస్వ నః ।
యత్ఫలం లభతే ప్రేత్య (నభూమినతటాకిషు)॥
తత్సర్వం శ్రోతు మిచ్ఛా మో వక్తు మర్హసి సువ్రత ।
సూతః: పాదపానాం విధిం వక్ష్యే తథై వోద్యానభూమిషు॥
తటాక విధివ త్సర్వ మాసాద్య జగదీశ్వర ।
ఋత్విజ్మండలసంభారా నాచార్యం స్థాపయేద్బుధః॥
బ్రాహ్మణా న్పూజయేత్తద్వ ద్దేమవస్త్రానులేపనైః ।
సర్వౌషధ్యుద కై సిక్త్వా విటపా న్తవిభూషితాక్॥
వృక్షా న్మాల్యై రలజ్కృత్య వాసోభి ర్వేష్టయే త్తతః ।
సూచ్యా సౌవర్ణయా కార్యం సర్వేషాం కర్ణ వేధసమ్॥
అఞ్జనంచైవ దాతవ్యం తద్వద్దేమశలాకయా ।
ఫలాని సప్త చాష్టౌవా కలధౌతాని కారయేత్ ॥
ప్రత్యేకం సర్వవృక్షాణాం సప్తధాన్యాధివాసయేత్ ।
సప్తధాన్యే స్థితాన్ కృత్వా వస్త్రగన్దానులేపనై: ॥
ధూపానుధూపితా న్చ్రేష్టాం స్తామ్రపాత్రై రధిష్ఠితాన్ ।
కుమ్బా న్త్సర్వేషు వృశేషు స్థాపయిత్వా నరేశ్వర॥
సహిరణ్యా న శేషాంస్తా న్కృత్వా బలినివేచనమ్ ।
యథాస్వం లోకపాలానా మిన్ద్రాదీనాం విధానతః॥
వనస్పతేశ్చ విధివ దోమః కార్యో ద్విజాతిభిః ।
తతశ్శుక్లామ్బరధరాం సౌవర్ణకృత శేఖరామ్॥
సకాంస్యదోహనాం స్వర్ణశృజ్గాడ్యాం చ సుశీలినీమ్ ।
పయస్వినీం వృక్షమధ్యా దుత్సృజేద్గా ముదజ్ముఖీమ్॥
వృక్షములను నాటి ఉద్యానవనము (ఆరామము)లను ప్రతిష్టించు (ప్రజల వినియోగమున కై నిలుపు) శాస్త్ర విధానమును దానివలన కలుగు ఫలమును తెలుపుమని మునులడుగ సూతుడిట్లు చెప్పనారంభించేను: వినుడు. తటాక ప్రతిష్ణా విధానమునందు వలెనే సర్వ సం భారములను సమకూర్చుకొనవలెను. ఋత్విక్కులను ఆచార్యుని అట్లే నియమించు కొనవలెను. అట్లే పూజాలంకరణ సామగ్రితో వారిని ఆలంకరించి పూజించవలెను.
ప్రతిష్టించ-ప్రజలకు దత్తము చేయ-బోవు ఉద్యానమునందలి వృక్షములను సర్వౌషధుల-నర్వసుగంధముల. జలములతో తడుపవలేను. కొమ్మల చివరలను పూలమాలలతో వస్త్రములతో అలంకరించవలెను. బంగారు తీగతో చెవులు కుట్టవలెను. బంగారు కడ్డిలతో కాటుక పెట్టవలెను. ఏడెనిమిది బంగారు ఫలములను చేయించవలెను. అన్ని చెట్లను స ప్రధాన్యములయందు అధివాసము (మిశ్రిత ధాన్యములందు నిలుపుట) చేయవలెను. వస్త్రములతో గంధాను లేపనములతో అలంకరించి పొగవేసి తామ పాత్రములందు నిలుపవలేను. అన్ని చెట్ల దగ్గరను నీటితో కడవలను బంగారును ఉంచి వాటి కన్నీటికిని ఇంద్రాది దేవతల నుద్దేశించి బలిని నివేదించవలెను. వనస్పతి దేవతలకును విప్రులచే హోమము జరిపించవలెను. తెల్లని వస్త్రముతో కప్పినది బంగారు శిరోలంకారము కలది బంగారు కొమ్ములు కలది పాలు పిదుకుటకు కంచుపాత్ర కూడ కలిగినదియగు పాడియావును ఉత్తరా ముఖముగా చెట్ల నడుమగా విడువవలేను. .
తతోఽభి షేకము న్త్రేన వాద్యమజ్గళ గీత కైః ।
ఋగ్యజుస్సామమన్త్రైశ్చ వారుణై రభిత స్తథా॥
తై రేవకు మ్భై స్నపనం కురుర్భ్రాహ్మణపుజ్గవాః ।
స్నాతశ్శుక్లామ్బరధరో యజమానోఽభిపూజయేత్॥
గోభి ర్విభవత స్సర్వా నృత్వజ స్తా న్త్సమాహితః ।
హేమసూత్రై స్సకటకై రజ్గుశీయైః పవిత్ర కై ॥
వాసోభి శ్శయనీయైశ్చ తథోపస్కరపాదు కై ।
క్షీరేణ భోజనం దద్యా ద్యావద్దినచతుష్టయమ్॥
హోమశ్చ సర్షపైః కార్యో యవైః కృష్ణతిలై రపి ।
పాలాశ సమిధ శ్శస్తా శ్చతుర్దేఽహ్ని తథోత్సవః॥
దక్షిణా చ పున సేభ్యో దేయా తత్ర స్వశక్తితః ।
యద్యదిష్టతమం కించి త తద్దద్యా దమత్సరః॥
ఆచార్యే ద్విగుణం దత్వా ప్రణిపత్య క్షమాపయేత్ ।
అనేన విధినా యస్తు కుర్యా ద్వృక్షోత్సవం బుధః॥
సర్వా న్కామా నవాప్నోతి పదం చానస్త్య మశ్నుతే ।
యశ్చైకమపి రాజేన్ద్ర వృక్షం సంస్థావయే న్నరః॥
సోపి స్వర్గే వ సేద్రాజన్ (యావదిన్ద్రాయుతత్రయం) యావదిన్ద్రశతత్రయమ్ ।
భూతాన్భావ్యాం శ్చ మనుజస్తారయేద్ద్రుమసమ్మితా"॥
పరమాం సిద్ధిమాప్నోతి పునరావృత్తిదుర్లబామ్ ।
య ఇదం శృణుయాన్ని త్యం శ్రావయే ద్వాపి మానవః॥
సోపి సమ్పూజితో దేవై ర్ర్బహ్మలో కే మహీయతే॥
ఇతి శ్రీ మత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే వృక్షారోపణ మాహాత్మ్యకథనం నా మైకోనషష్టిత మేఽధ్యాయః ॥
తరువాత బ్రాహ్మణులు ఋగ్యజుస్సామ వేదములనుండి వరుణ దేవతాకములైన ఆభి షేక స్నాన మంత్రము లతో మంగళ వాద్య ధ్వనుల నడుమ యజమానుని స్నానము చేయించగా అతడు తెల్లని మడుగు వస్త్రములు ధరించి ఋత్విజులనందరను శ్రద్ధతో యథాశ క్తిగా గోవులతో దక్షిణలతో బంగారుతో చేసిన చేతి మురుగులు ఉంగరములు పవిత్రములు వస్త్రములు సర్వసామగ్రితో కూడిన పరుపులు మంచములు పాదుకలు.ఇట్టి వానితో పూజించును. వారికి నాలుగు దినములవరకు పొలతో భోజనము పెట్టవలెను. నాలుగు దినములును ఆవలతో యవలతో నల్లని నూవులతో పలాశ సమిధలతో హోమము చేయవలెను. నాలుగవ దినమున ఉత్సవపు వేడుకలు జరుపవలేను. ఋత్విక్ బ్రాహ్మణులకు మరల యథాశక్తిగ దక్షీణలను తనకు తోచిన మరేదై న నీయవలెను. ఆచార్యు (ప్రధాన ఋత్విక్ )నకు మాత్రము ఒక ఋత్విక్ కు ఇళ్చినదానికి రెండింతలీయవలెను. అతనిని క్షమాపణము వేడుకొనవలెను. .
ఈ విధానమున వృక్ష ప్రతిపోత్సవమును జరుపు వివేకి కి అన్ని కోరికలు తీరును. అనంత ఫలము కలుగును. (ప్రజల నిమితమయి) ఒక వృక్షము నాటినను అతడు ముగ్గురింద్రుల జీవిత కాలము స్వర్గమందు సుఖించును. తనకు పూర్వపు-అనంతరపు తరములవారిని తాను నాటిన చెట్లంత మందిని తరింపజేయును. పునరావృత్తి రహితమగు మోక్షమును పొందును.
ఈ కల్పమును వినిన వినిపించిన వాడు కూడ దేవతలచే పూజలందుకొనుచు బ్రహ్మలోక మున సుఖించును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున వృక్షారోపణ మాహాత్మ్య కథనమను ఏబది తొమ్మిదవ యధ్యాయము.
Summary of chapter 59 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the ritual procedures and spiritual fruits of the Ānanda-Dvādaśī-Vrata, a holy vow observed on the twelfth lunar day of the bright fortnight in the month of Mārgaśīrsha to attain unshakeable inner peace and material prosperity. The practitioner worships Bhagavān Janārdana using twelve distinct divine names corresponding to the twelve months, presenting offerings of fresh flowers, incense, lighted lamps, and delicious food preparations free from salt. The devotee spends the night in spiritual vigil, listening to divine chronicles and chanting sacred mantras dedicated to Bhagavān Vishṇu. By completing this vow with sincere devotion, the practitioner eradicates all accumulated karmic suffering, experiences unbroken joy in present earthly life, and ultimately ascends to the imperishable spiritual realm of Vaikuṇṭha.