మత్స్య మహా పురాణము
244 - వామన జననము-వామనుడు బలియజ్ఞవాటమునకు పోవుట.
శౌనకః : నిస్తేజసోసురా న్దృష్ట్వా సమస్తా నమరేశ్వరః ।
ప్రహ్లాద మథ పప్రచ్ఛ బలి రాత్మపితామహమ్॥
బలిః : తాత నిస్తేజసో దైత్యా నిరగ్గా ఇవ వహ్నినా ।
కి మేతే సహ సైవాద్య బ్రహ్మదణ్ణహతా ఇవ॥
దురిష్టం కిన్ను దైత్యానాం కిం కృత్యా వై నిర్మితా ।
నాశాయైషా సముద్భూతా మయా నిస్తేజసోసురా॥
శౌనకః : ఇతి దైత్యపతిర్వీరః వృష్టః పౌత్రేణ పార్థివ ।
చిరం ధ్యాత్వా జగాదైవ మసు రేన్తం బలిం తదా॥
ప్రహ్లాదః : చలస్తి గిరయో భూమి ర్జహాతి సహసా ధృతిమ్ ।
సర్వే సముద్రాః కుభితా దైత్యా నిస్తేజసః కృతాః॥
సూర్యాదయే యథా పూర్వం తథా గచ్ఛని న గ్రహాః ।
దేవానాం చ పరా లక్ష్మీః కారడై రనుమీయతే॥
మహదేవ న్మహాబాహో కారణం దానవేశ్వర ।
న హ్యల్ప మభిమ శ్రవ్య మిదం కార్యం సురార్ధన॥
శౌనక : ఇత్యుక్త్వా దానవపతిం ప్రహ్లాద స్సోసురోత్తమః ।
అత్య నభక్తో దేవేశం జగామ మనసా హరిమ్॥
స ధ్యానయోగం కృత్వాథ ప్రహ్లాద స్సుమనోహరమ్ ।
విచారయామాస తతో దేవదేవం జనార్దనమ్॥
ఆ స దదర్శోద రేఒదిత్యాః ప్రహ్లాదో వామనాకృతిమ్ ।
అనః స్థా న్బిభ్రతం సప్త లోకా నాదిప్రజాపతిమ్॥
తదన్తః న్వసూ స్రుద్రా నశ్వినౌ మరుత స్తథా ।
సాధ్యా న్విశ్వాం స్తథాఒదిత్యా ననర్వోరగరాక్షసాక్
విరోచనం చ తనయం బలిం చాసురనాయకమ్ ।
జమ్భం కుజమ్భం నరకం జాణ మన్యా న్మహాసురాక్॥
ఆత్మాన ముర్వీం గగనంవాయు మమ్బో హుతాశనమ్ ।
సముద్రాద్రిద్రుమసంత్సరాంసిచ పశూ నృగాక్॥
దేవా న్మనుష్యా నఖిలాం స్తథైవచ సరీసృపాక్ ।
సమ స్తలోకస్రష్టారం బ్రహ్మాణం భవమేవచ॥
గ్రహనక్షత్రభేదాంశ్చ దక్షిద్యాం శ్చ ప్రజాపతీ ।
సమ్పశ్య న్విస్మయాఽఽవిష్టః ప్రకృతిస్థః క్షణాత్పునః॥
ప్రహ్లాదః ప్రాహ దైత్యేంద్రం బలిం వైరోచనీం తథా ।
శౌనకుడర్జునునకిట్లు చెప్పెను: అసురులందరును నిస్తేజస్కులగుట చూచి అసురేశ్వరుడగుబలి పితామహుడగు ప్రహ్లాదునిట్లడిగెను; తండ్రీ! దైత్యులందరును ఇట్లు ఆకస్మాత్తుగా వహ్ని తో దగ్గులయి రేమో బ్రహ్మండము చే దెబ్బతిని రేమో యనునట్లు నిస్తేజస్కులయి రేల? దైత్యులేమైన దుర్యజ్ఞములాచరించిరా? వైరులేదయిన కృత్యమ నిర్మించగా ఆది వీరి నాళమున కై సముద్భూతమయినదా? అని పౌత్తూడడుగ వీరుడగు దైత్యపతి ప్రహ్లాదుడు చాలతడవు ధ్యానించి ఇట్లు పలికెను: ఆకస్మికముగా గిరులు చలించుచున్నవి; భూమి నిబ్బరము కోల్పోవుచున్నది; సముద్రములు క్షోభిల్లు చున్నవి; దైత్యులు నిస్తేజస్కులుగా చేయబడిరి; సూర్యాదిగ్రహములు ఎప్పటివలె నడుచుటలేదు; ఈ హేతువులను బట్టి దేవతలకు పరమలక్ష్మి కలుగనున్న దని యూహించవచ్చును; మహాబాహూ! ఇది మహాకారణమే; సురవైరీ: ఇది అల్పకార్యమని తలచకుము; అని దానవ పతితో పలికి అసురోత్తముడును అత్యంతహరి భక్తుడును అగు ప్రహ్లభుడు మనసా హరిని ధ్యానించెను; ప్రహ్లాదుడును మనోహరమగు ధ్యానయోగమనుష్టించి దేవదేవుడగు జనార్ధనుని తనచిత్తమున విచారణచేసికొనెను; ఆప్రహ్లాదునకు అదితియుదరమునందు వామనరూపుడై తనయుదర మందు సప్తలోకములను ధరించిన ఆది ప్రజాపతియగు నారాయణుడు కనబడెను; అతని లోపల వస్తువులు రుద్రులు అశ్వినులు మరుత్తులు సాధ్యులు వి శ్వే దేవులు ఆదిత్యులు గంధర్వులు నాగులు రక్షస్సులు విరోచన తనయుడు అసుర నాయకుడునగు బలిజం భకుజంభనరక బాణాది మహాసురులు తానును (ప్రహ్లాదుడు) భూమి ఆకాశము వాయువు జలము అగ్ని సముద్ర వృక్ష పర్వత నదీ సరస్సులు పశువులు దేవ మానవ సరీసృపములు సర్వలోక సష్టియగు బ్రహ్మరుద్రుడు గ్రహనక్షత్ర విశేషములు దక్షాది ప్రజాపతులు కనబడిరి. ఇవియన్నియు చూచి విస్మయావిష్టుడయియు ప్రహ్లాదుడు క్షణములో మరల తేరుకొని దైత్యేంద్రు డును విరోచన పుత్రుడునగు బలితో ఇట్లనెను:
బలిం వ్రతి ప్రహ్లదోవదిష్టవిష్ణుమహిమా.
ప్రహ్లాదః : వత్స జ్ఞాతం మయా సర్వం యదర్థం భవతామియమ్॥
తేజసో హాని రుత్పన్నా తచ్ఛృణుష్య యథార్థతః ।
దేవదేవో జగద్యోని రయోని ర్జగదాదికృత్॥
అనాది రాదిర్విశ్వస్య వరేణ్యా వరదో హరిః ।
పరమ్పరాణాం పరమం పరః పరవతామపి॥
ప్రమాణంచ ప్రమాణానాం సప్తలోకగురో ర్గురుః।
ప్రభు కి ప్రభూణాం పర మో మహాత్మా అనాదిమధ్యో భగవా నన న్తః॥
త్రైలోక్య మం శేన సనాథ మేష కర్తుం మహాత్మాఒదితిజోవతీర్ణః ।
న యస్య రుద్రో న చ పద్మ యోని రినో న సూర్యేష్ణు మరీచిముఖ్యాః॥
జాన స్తి దైత్యాధిప యత్స్వరూపం స వాసుదేవః కలయావతీర్ణః ।
యోఒసౌ కలాం శేన నృసింహరూపీ జఘాన పూర్వం పితరం మమేశః॥
య స్సర్వయోగీశ మనోనివాస స్స వాసుదేవః కలయావతీర్ణః ।
యమక్షరం వేద విదో విదిత్వా విశ ని యం జ్ఞానవిధూతపాపొ॥
యస్మి నవిష్టా న పునర్బవ ని తం వాసుదేవం ప్రణమామి నిత్యమ్ ।
భూతా న్య శేషాణి యతో భవ యథోర్మయ స్తోయనిదే రజస్రమ్॥
లయం చ యస్మి నళయే ప్రయా న్తి తం వాసుదేవం ప్రణమామ్యజసమ్ ।
న యస్య రూపం న బలప్రభావె న యస్య భావః పరమస్య పుంసః॥
విజ్ఞాయతే శర్వపితామహాద్యై స్తం వాసుదేవం ప్రణమామ్యజ సమ్ ।
రూవస్య చతుర్ద్రహణే త్వగిష్టా స్పర్శే గ్రహితీ రచనా రసస్య॥
శ్రోత్రంచ శబ్దగ్రహణే నరాణాం హ్రాణంచ గన్దగ్రహణే నియుక్తమ్ ।
నమ్రాణగ్రాహ్య శవణాదిభి ర్య స్సర్వేశ్వరో వేదితు మక్షయాత్మా॥
శక్య స్త మీడ్యం మన సేవ దేవం గ్రాహ్యం తతో హం హరి మీశి తారమ్ ।
యేనై కదంష్ట్రాగ్ర సముద్ధృతేయం ధరా చ తాం ధారయతీహ సర్వాక్॥
యస్మింశ్చ శేతే సకలం జగచ్చ తమాద్యమీశం ప్రణతోస్మి విష్ణుమ్ ।
అంశావతీర్ణేన చ యేన గర్బేహృతాని తేజాంసి మహాసురాణామ్॥
నమామి తం దేవ మజస్ర మీశ మ శేషసంసార తరోః కుఠారమ్ ।
దేవో జగద్యోని రయం మహాత్మా స షోడశాంశేన మహాసురేంద్ర॥
స దేవమాతు ర్జఠరం ప్రవిష్టో హృతాని వ స్తేన బలా ద్వపూంషి ।
నాయనా! నేనంతయు నేరిగితిని; మీకందరకును తేజోహాని కలిగిన హేతువు యాథార్థ్యముతో తెలి పెదను; వినుము; దేవదేవుడును జగత్కారణుడును తనజన్మకు కారణమగునది లేని వాడును జగదాది కర్తయు అనాదియు విశ్వమున కాదియు వరేణ్యుడు (శ్రేష్ఠుడు - ప్రార్థనీయుడును వరదుడును హరియు (పాపములను హరించువాడును) గొప్పవాని యన్నింటిలో గొప్పవాడును గొప్పవారికిని గొప్పవాడును ప్రమాణములకును ప్రమాణభూతుడును సప్తలోకగురుడు(తండ్రి) అగు బ్రహ్మ కును తండ్రియు ప్రభులకును పరమ ప్రభువును మహాత్ముడును ఆదిమధ్యాంతరహితుడును భగవానుడును ఆగు మహాత్ముడి విష్ణువు త్రైలోక్యమును సనాధము (రక్షణక లది)గా చేయుట కై అంశముతో అదితి గర్భమునందవతరించినాడు; రుద్ర_ హ్మేంద్ర రవీందులకును మరీచ్యాది ప్రజాపతులకును - ఆతని స్వరూపమెరుగరానిది; తన కలాంశముతో నృసింహ రూపుడై మునుపు మా తండ్రిని చంపిన ఈ శుడు సర్వయోగీశ మనోనివాసుడునగు వాసుదేవుడీతడు; వేదతత్వవిదు లీయక్షరునెరిగి జ్ఞానబలమున తమ పాపముల పోద్రోలి ఆతనియందే లయమందుదురు; వారు మరల జన్మించరు; అట్టి వాసుదేవుని నమస్కరింతును; సముద్రమునుండి ఆలలువలే అతని నుండియే సమస్త భూతములునతని నుండి జనించి ప్రళయమున నతనియందే లయమందును; రుద్ర బ్రహ్మాదులును ఆ పరమపురుషుని రూప బల ప్రభావ భావముల నెరుగజాలరు; రూపస్పర్శ రన శబ్ద గండ గ్రాహులగు చక్షు స్వక్ జిహ్వా శ్రోత్రఘాణములును అతనిని గ్రహింపజాలవు;
అట్టి స్తవనీయుడును మనోమాత గ్రాహ్యుడును ఈశ్వరుడునునగు హరిని వాసుదేవుని నమస్కరింతును; తన ఏకదంష్ట్రాగ్రముతో నతడు భూమిని ధరించినందుననే ఆ దేవియు ఈ సర్వభూతములను ధరించగలుచున్నది; ఈ సకల జగము నాతనియందే శయనించియున్నది; అట్టహరి అంశావతారమెత్తి దైత్యతేజములకు హానిక లిగించినాడు; సంసార వృక్షకుఠారుడగు ఆ దేవుని నేను ఆజ సమును నమస్కరించుచుందును. మహాత్ముడగు ఆదేవుడు జగత్కారణుడు. మహా సురేంద్రా! ఆతడు తన పదునారవ అంశముతో దేవమాతృగర్భమున ప్రవేశించినందున నతని బలముచే దైత్య శరీర తేజస్సులు హరింపబడినవి.
బలికృత విష్ణ్వాక్షేన
బలిః : తాత కోయం హరిర్నామ యతో నో భయ మాగతమ్॥
సని మే శత దైత్యా వాసుదేవా బలాధికాః ।
విప్రచిత్తి శిబి శ్శజ్కు రశ్వశీర్ష సభై వచ॥
అయశ్శిరాః ఖర శిరా భజ్జుకారో మహాసురః ।
ప్రతాపః ప్రమస శ్శమ్భుః కుకురశ్చ సుదుర్జయః॥
ఏతే చాన్యేచ మే స ని దై తేయా దానవా స్తథా ।
మహాబలా మహావీర్యా భూభారధరణక్షమాః॥
ఏషా మేకై కశః కృష్ణో న వీర్యార్దన సమ్మితః ।
వై కుడ్డా షేపక బలింప్రతి ప్రహ్లాద కృత నిన్దా॥
శౌనకః : పౌత్తస్యైత ద్వచ శుత్వా ప్రహ్లాదో దైత్యపుజ్గవః॥
ధీగ్ధిగిత్యాహ స బలిం వైకుణ్ఠాక్షేప వాదినమ్ ।
ఇది విని బలి ప్రహ్లాదునిట్లు ప్రశ్నించెను: తండ్రి ఏహరివలన మనకు భయమేర్పడినదనుచున్నావో - అతడు ఎంతటివాడు? బలమున ఈ వాసుదేవునికంటె ఆధికులగు దైత్యులు వందల కొలదిగా నాకడనున్నారు; విప్రచిత్తి శిబి శంకువు అశ్వశీరుడు ఆయశ్శిరుడు ఖర శిరుడు మహాసురుడగు భంగకారుడు ప్రతాపుడు ప్రమసుడు శంభుడు సమరజయు డగు కుకురుడు వీరును మరికొందరును దై తేయులును దానవులునునాకున్నారు; వీరందరును మహాబలులు మహాభుజులు భూభారమును ధరింప సమర్థులు; కృష్ణుడు వీరిలో ఏ ఒక్కరి బలములో సగము కంటెను తక్కువ బలముకలవాడు; ఆని వైకుంఠునధి క్షేపించుచు మాటలాడు పౌత్రునిమాట విని దైత్యపుంగవుడగు ప్రహ్లాదుడు బలిని ఉద్దేశించి వీధీయనెను.
ప్రహ్లాదః : వినాశ ముపహాస్యంతి మన్యే దై తేయదానవాః॥
యేషాం త్వమీదృశో రాజా దుర్బుద్ధి రవివేక వా ।
దేవదేవం మహాభాగం వాసుదేవ మజం విభుమ్॥
త్వామృతే పాపసజ్కల్ప కోఒన్య ఏవం వదిష్యతి ।
య ఏతే భవతా ప్రోక్తా స్సమస్తా దైత్యదానవాః॥
సబ్రహ్మజా స్తథా దేవా స్థావరాన స్తమూర్తయః ।
త్వం చాహంచ జగచ్చేదం సామ్రిద్రుమనదీనదమ్॥
తిరి సముద్రద్వీపలో కాశ్చ న సమం కేశవస్య హి ।
యస్యాతివన్యవన్యస్య వ్యాపినః పరమాత్మనః॥
ఏకాం శేన జగత్సర్వం కస్త మేవం ప్రవక్ష్యతి ।
ఋతే వినాశాభిముఖం త్వామేక మవివేకినమ్॥
దుర్బుద్ధి మకృతాత్మానం వృద్ధానాం శాసనాతిగమ్ ।
శోచ్యోహం యస్య మే గేహే జాత స్తవ పితాధమః॥
యస్య త్వ మీదృశః పుత్రో దురాత్మా కృష్ణనిన్లకః ।
తిష్ఠత్యేషా హి సంసారసమృతాఘవినాశినీ॥
కృష్ణ భక్తి రహం వ దవేక్ష్యో భవతా ను కిమ్ ।
న మే ప్రియతమః కృష్ణా దపి దేహో మహాత్మనః॥
ఇత జానా త్యయం లోకో న భవా స్థితిజాధమ ।
న జానాసి ప్రియతరం ప్రాణేభ్యోపి హరిం మమ॥
నిన్గాం కరోషి తస్య త్వ మకుర్వ శౌరవం మమ ।
విరోచన స్తవ గురు ర్గురు స్తస్యాప్యహం బలే॥
మమాపి సర్వజగతాం గురో ర్నారాయణో గురుః ।
నిన్గాం కరోషి య స్తస్మిన్కృషే గురుగురో ర్దురా॥
యస్మా తస్మా ది హైశ్వర్యా దచిరా ద్రంశ మేష్యసి ।
మమ దేవో జగన్నాథో బలే తావ జనార్దనః॥
భవత్వహ ము పేక్ష్య స్తే ప్రీతిమానస్తు మే గురుః ।
ఏతావనాత్ర మ ప్యేవం నిర్ణితో జగతో గురుః॥
నావేక్షితం త్వయా యస్మా తస్మా చ్చాపం దదామి తే ।
యథా మే శిరస శ్చేదా దిదం గురుతరం వచః॥
త్వయోక్త మచ్యుతా క్షేపి రాజ్యభ్రష్ట స్తథా పత ।
యథా చ కృష్ణా న్న పరం పరిత్రాణం భవార్ణవే॥
తథా చిరేణ వశ్యేయం భవంతం రాజ్యవిచ్యుతమ్ ।
ఇటువంటి దుర్బుద్ధియు అవివేకియునగు నీవు రాజుగానున్న ఈ దే తేయదానవులు వినాశ మందుదురని నాకు తోచుచున్నది; దేవదేవుడు మహాభాగుడు అజుడు విభుడు అగువాసుదేవుని పాపసంకల్పుడవగు నీవుతప్ప ఇతరుడెవ్వడు ఇట్లు అనును? నీవు పేర్కొన్న ఈ సమస్త దైత్యదానవులును బ్రహ్మాది దేవతలును స్థావర పదార్థము లన్నియు ఆనంత రూపములగు సకల తత్వములును నీవును నేనును పర్వత వృక్ష నదీనద సముద్రద్వీప సహిత సకల జగమును కేశవునకు సరిపోలవు; అతివంద్యులకును వంద్యుడును వ్యాపియును పరమాత్ముడునునగు ఎవని ఏకాంశములో సర్వజగము రూపొందినదో అట్టి హరిని అవివేకివి వినాశాభిముఖుడవు ఆగు నీపుతప్ప మరెవ్వరిట్లనగలరు? నీవు దుర్బుద్ధివి; సంస్కోరరహిత చిత్తుడవు; పెద్దల ఆదుపుమీరి నడుచువాడవు; దురాత్ముడు కృష్ణనిందకుడునగు నిన్ను కనిన ఆధము డగు నీతండ్రి నా ఇంట జన్మించినందున నేను శోచనీయుడనైతిని; కృష్ణునియందు నిలిపిన భ క్తి సంసారమందంతటను నర్వపాపనాశ నియై యున్నది; నీవు నన్నైన గమనించవలదా? మహాత్ముడగు కృష్ణునికంటె మించి నాకు నా దేహము కూడ ప్రియతరముకాదని లోకము ఎరుగును; నాకు ప్రాణములకంటెను హరిప్రియ కత)రుడని నీవేరుగకున్నా వే? నీవు నన్ను కూడ గౌరవింపక ఆతని నిందించుచున్నా వే: జలీ! నీగురుడగు విరోచనునకును గురుడనగు నొకును శ్రీహరి గురుడు; ఇట్లు గురు గురు గురుడగు కృష్ణుని నిందించుచున్నందున అచిర కాలముననే నీవు ఐశ్వర్య భ్రంశమందుదువు; బలీ! జనార్దనుడు అగు జగన్నాధుడు నాకు దేవుడు గదా! నీకు నేను అనాదరణీయుడను ఉపేక్షణీయుడను ఐనను నాగురుడగు అతడు నీయందు ప్రీతికలవాడు కావలయును కదా! నీవింత మాత్రముకూడ ఆలోచింపక జగద్గురునీ నింద చేసితివి కావున నిన్ను శపించుచున్నాను; నీవు నాతో అచ్యుతుని నిందించి పలుకుట నా శిర శ్చేదముకంటె బాధాకరముగావున నీవు రాజ్యభ్రష్టుడవు అయి పతనమందుము; ఈ సంసార సముద్రమునందు రక్షకుడు హరితప్ప మరిలేడు కావున అట్టి హరిని నిందించిన నీవు త్వరలోనే రాజ్యభ్రష్టుడవగుట చూతును.
శౌనకః : ఇతి దైత్యపతి శ్రుత్వా గురో ర్వచన మప్రియమ్॥
ప్రసాదయామాస గురుం ప్రణిపత్య పునః పునః ।
బలిః : ప్రసీద తాత మా కోపం కురు మోహహతే మయి॥
బలవలేపమ త్తేన మయైత ద్వాక్య మీరితమ్ ।
మోహోపహతవిజ్ఞానః పాపోహం దితిజోత్తమ॥
యచ్ఛక్తోస్మి దురాచార స్తత్సాధు భవతా కృతమ్ ।
రాజ్యభ్రంశం వసుభ్రంశం ప్రావ్యైవ న తథాప్యహమ్॥
విషజ్ఞో ఒస్మి యథా తాత తవై వావినయ్ కృతే ।
త్రైలోక్యరాజ్య మైశ్వర్య మన్యద్వా నాతిదుర్లభమ్॥
సంసారే దుర్లభా స్త్తు గురవో యే భవద్విధాః ।
తత్రసీద న మే కోపం కర్తుమర్హసి దైత్యప॥
త్వతోపదృష్ట్యా తాత్మాహం పరిత ప్యే న శావతః ।
ప్రహ్లాదః : వత్స కో-పే న మోహో మే జనిత సేన తే మయా॥
శాపో దతో వివేకశ్చ మో హేనాపహృతో మమ ।
యది మో హేన మే జ్ఞానం న క్షిప్తం స్యా న్మహాసుర॥
తత్కథం సర్వగం జానకి హరిం ఇ్చ చ్ఛపామ్యహమ్ ।
యోఒయం శాపో మయా దతో భవతో సుర పుజవ॥
భావ్య మేతేన నూనం తే తస్మా న్మా త్వం విషీద వై ।
అద్యప్రకృతి దేవేశే భగవ త్యచ్యుతే హరో॥
భవేథా భక్తిమానీ స తే త్రాతా భవిష్యతి ।
శాపం ప్రాప్యాథ మాం వీర సంస్మ రేథా స్స్మృత స్వయా॥
తథా తథా యతి ష్యేహం శ్రేయసా యే జ్య సే యథా ।
ఏవముక్త్వా స దైత్యేంద్రం విరరామ మహాద్యుతిః॥
దైత్యవతియగు బలి ఆప్రీతికరమగు తన గురు (పితామహు)ని వచనమును విని ఆతనిని మరల మరల నమస్కరించుచు అతనిని ప్రసన్ను నొనర్చి కొనుట కై బ్రతిమాలసాగెను; తండ్రీ! ప్రసన్నుడవుకమ్ము; అజ్ఞానహతుడనగు నా పై కోపింపకుము; బలగర్వ మత్తుడనయి నేనీమాట ఆంటిని; దైత్యోత్తమా! నేను మోహముచే నా విజ్ఞానమును కోల్పోయితిని; పాపుడను; దురాచారుడనగు నన్ను శపించి నీవు మంచిపనియే చేసితివి; తండీ! నీపమున నాకు రాజ్యధనములు పోవునని నను నీవిషయమున ఆవినయము చూపితినన్నందులకు కలిగినంత దుఃఖము కలుగుటలేదు; త్రైలోక్య రాజ్యము కానీ ఐశ్వర్యము కాని ఇట్టి మరేది కాని లోకమున దుర్లభము కాదు; ఈ సంసారమున నీవంటి గురువులే దుర్లభులు; కావున దైత్య పతీ! అనుగ్రహించుము; కోపింపకుము; తండ్రి! నేను నీకోప దృష్టికి పరితాపపడుచున్నాను కాని శాపమునకు కాదు; ఆన ప్రహ్లాదుడిట్లనెను: నాయనా! కోపముచే నాకు మోహము జనించినది; దానిచే వివేక మపహరింపబడినందున శపించితిని; అంతే కానిచో సర్వగుడగు హరి నేరిగిన నేనెట్లు శపించియుందును? అసురపుంగవా! నేను నీకిచ్చిన శాపమవశ్యము జరుగ వలసియేయున్నది; కావున నీవు దుఃఖింపకుము; ఇది మొదలుకొని దేవేశుడు భగవానుడు అచ్యుతుడు ఈశుడునగు హరి యందు భక్తి కలిగియుండుము; అతడే నిన్ను రక్షించును; శాపఫలము కలిగిన తరువాతను కూడ నాయనా! నన్ను స్మరించుచుండుము; దానిచే నేనును నీకు ! శేయము కలిగించయత్నింతును; అని పలికి మహాద్యుతియగు బలి విరమించేను.
ఆజాయత స గోవిందో భగవా న్వామనాకృతిః ।
అవతీర్ణే జగన్నాథే తస్మి నర్వామరేశ్వరే॥
దేవాశ్చ ముముచు ర్దుఃఖం దేవ మాతాఒదితి స్తథా ।
వవు ర్వాతా స్సుఖస్పర్శా విరజస్క మభూ న్న భః॥
ధర్మే చ సర్వభూతానాం తథా మతి రజాయత ।
వోద్వేగశ్చాష్య భూతత్ర మనుజేన్గా సురేష్వపి॥
తదాది సర్వభూతానాం భూమ్యమ్బరదివొక సామ్ ।
తం జాతమాత్రం భగవా నహ్మా లోకపితామహః॥
జాతకర్మాదికం కృత్వా కృష్ణం దృష్ట్వా చ పార్థివ ।
తుష్టాన దేవదేవేశ మృషీణాం చైవ శృణ్వతామ్॥
బ్రహ్మకృత వామనమూర్తి స్తుతిః.
బ్రహ్మా : జయాద్యేశ జయాజేయ జయ సర్వాత్మకాత్మక ।
జయ జన్మజరాపోత జయానన్త జయాచ్యుత॥
జయాజిత జయాయ జయావ్య కస్థితే జయ ।
పరమార్థారసర్వజ్ఞ జ్ఞానజేయాత్మనిస్సృత॥
జయా శేష జగత్సాక్షి న్జగత్కర్త ర్జగద్గురో ।
జగతోస్యా కృద్దేవ స్థితిం పాలయితుం జయ॥
జయా శేష జయా శేష జయాఖిలహృది స్థిత ।
జయాదిమధ్యా న్త జయ సర్వజ్ఞాననిధే జయ॥
ముముక్షుభిరనిర్దేశ్య స్వయం హృష్ట జనేశ్వర ।
యోగినాం ముక్తిఫలద దమాదిగుణ భూషణ॥
జయాతిసూక్ష్మ దుర్జయ జయ స్థూలజగన్మయ ।
జయస్థూలాతిసూక్ష్మ త్వం జయాతీస్ధాయ సేఫ్ఘాయ॥
జయ స్వమాయాయోగస్థ శేషభోగశ యాక్షర ।
జయైక దంష్ట్రా ప్రాన్రాగ్రసముద్ధృత వసున్ధర॥॥
నృ కేసరి న్షయారాతి వక్షస్థల విదారణ ।
సామతం జయ విశ్వాత్మ న్షయ వామన కేశవ॥
నిజమాయావటచ్ఛన్న జగన్మూ ర్తె జనార్ధన ।
జయాజిత జయానేక స్వరూ వైక విధ ప్రభో॥
వర్ధస్వ వర్దితా శేషవికార ప్రకృతే హరే ।
త్వయ్యేషా జగతా మీ శే సంస్థితా ధర్మపద్ధతిః॥
న త్వామహం న చేశానో నేౄద్యా శ్రీదశా హరే ।
న జ్ఞాతు మీశా మునయ స్సనకాద్యా న యోగినః॥
త్వన్మాయాపటసంవీతే జగత్యత్ర జగత్పతే ।
కస్త్వాం వేత్స్యతి సర్వేశ త్వతసాదం వినా నరః॥
త్వమేవారాధితో యేన ప్రసాదసుముఖః ప్రభో ।
స ఏకః కేవలో దేవ వేత్తి త్వాం నేత రే జనాః॥
నందీశ్వరేశ్వరేశాన ప్రభో వర్దస్వ వామన ।
ప్రభవాయాస్య విశ్వస్య విశ్వాత్మ నృథులోచన॥
శ్రీ వామన మూర్త్యవతార ఘట్టము.
ఆంతట భగవానుడగు గోవిందుడు వామనాకృతియై జనించెను; సర్వామరేశ్వరుడగు ఆ జగన్నాథుడవతరించ గనే దేవతలును తన్మాతయగు అదితియు దుఃఖముక్తులయిరి; సుఖస్పర్శ వాయువులు వీచెను; గగనము నిర్మలమయ్యెను? సర్వభూతములకు ధర్మమందాసక్తి కలిగేను; అసురులకును భూమ్యంతరిక్ష ద్యులోక వాసులకును తదాదిగా ఉద్వేగము తగ్గేను; అతడు జనించినంతనే లోక పితామహుడగు బ్రహ్మ ఆతనికి జాతకర్మాధికము జుపి అతనిని దర్శించి ఋషులు వినుచుండ ఆ దేవదేవేశునిట్లు స్తుతించేను: జయజయ ఆద్యా! ఈశా! అజేయాః సర్వాత్మకాత్మకా! జన్మజరారహితా! అనంతా! అచ్యుతా! అజితా! అమేయా! ఆవ్య కస్థితీ! పరమార్థవ స్తురూపా: సర్వజ్ఞా! జ్ఞాతృజ్ఞానప్లేయరూపా! స్వయంభూరూపా! అశేష జగత్సాక్షిన్! జగత్కర్తా! జగద్గురూ! జగల్గితిలయక రా! జగత్పాలక! శేషా! ఆ శేషా! ఆఖిల హృదయావాసా! ఆదిమధ్యాంత రూపా! సర్వజ్ఞానవిధీ! ముముక్షువులును ఇట్టివాడవని నిర్దేశింపనలవికాని దేవా! ఆత్మతృప్తి? జనేశ్వరా! యోగిముక్తి ఫల ప్రదా! దమాది గుణవిభూషణా! అతిసూక్ష్మా! దుర్జయా! స్థూలజగన్మయా? అతీంద్రియా! సేంద్రియా! మాయాయోగస్థితా శేషభోగశయనా! ఆక్షరా? ఒక కోర కొనతోనే వసుంధరను పైకెత్తినవాడా! నృసింహా; శత్రువక్షఃస్థల విదారణా! విశ్వాత్మన్! వామనాః కేశ వాః స్వనయా వస్తాచ్చాదితజగన్మూ క్లీ! జనార్ధనాః అనేక రూపా! ఏక రూపొ! ప్రభూ! వర్థిల్లుము; వర్దితా శేష వికారయుత ప్రకృతీ! హరీ! జగదీశుడవగు నీయందే ధర్మ మార్గము నిలిచియున్నది; నేను కాని రుద్రుడు కాని ఇంద్రాది దేవతలు కాని మునులును సనకాది యోగులునుకాని నిన్నే రుగజాలరు. జగత్పతీ! నీమాయయను వస్త్రముతో కవువడిన ఈ జగమందు సర్వే: నీ యనుగ్రహమందక ఎవడు నిన్నే రుగును? నిన్నా రాధించి ప్రసాద సుముఖునిగా చేసి కొనినవారు మాత్రమే కాక ఇతరులు నిన్నె రుగజాలరు; నందీశ్వరేశ్వరా! ఈశానా! ప్రభూ! వామనా! విశ్వాత్మన్! విశాల లోచనా! ఈ జగద భ్యుదయమునకై వర్దిల్లుము.
శౌనకః : ఏవం స్తుతో హృషీ కేశ స్స తదా వామనాకృతిః ।
ప్రహస్య భావగమ్భీర మువాచాబ్జసముద్భవమ్॥
స్తుతోహం భవతా పూర్వ మింద్రాద్యైః కశ్య పేన చ ।
మయా చ వః ప్రతిజ్ఞాత మిన్హస్య భువనత్రయమ్॥
భూయశ్చాహం స్తుతోఒదిత్యాతస్యాశ్చాపి ప్రతి శ్రుతమ్ ।
యథా శయ దాస్యామి త్రైలోక్యం హతకణ్ణకమ్॥
సోహం తథా కరిష్యామి మ హేనో జగతః పతిః ।
భవిష్యతి సహస్రాక్ష సత్య మేత దవీమి వః॥ ॥
తతః కృష్ణాజినం బ్రహ్మా హృషీ కేశాయ దత్తహాక్ ।
యజ్ఞోపవీతం భగవా న్దదౌ తస్మై బృహస్పతిః॥
ఆషాఢ మదదా దణ్ణం మరీచి రహ్మణ స్సుతః ।
కమణలుం వసిష్ణశ్చ కౌశం వేద మథాక్టిరా॥
అక్ష సూత్రం చ పులహః పులస్త్య సీతవాససీ ।
ఉవతస్థుశ్చ తం వేదాః ప్రణవోచ్చార భూషణాః॥
శ్రీ వామనమూ ర్తెర్బలియజ్ఞవాటగమనమ్॥
శాస్త్రిణ్యనే కాని తథా సాజ్యయోగో క్షయశ్చ యాః ।
సవామనో జటి దణ్ణి ఛత్రీ భృతకమణ్డలుః॥
సర్వదేవమయో భూత్వా బలే రధ్వర మథ్యగాత్ ।
యత్ర యత్ర పదం భూయో భూభాగే వామనో దదే॥
దదాతి భూమి ర్వివరం తత్ర తత్రాతిపీడితా ।
స వామనో జడగతి ర్మృదు గచ్ఛ నపర్వతామ్॥
సాబ్దిద్వీపవతీం సర్వాం చాలయామాస మేదినీమ్॥
ఇతి శ్రీమత్స్యమపుహారాణే శౌనకార్జునసంవాదే శ్రీవామనచరిత్రే వామనస్య బలి యజ్ఞవాటగమనం నామ చతుశ్చత్వారింశత్తమోఽధ్యాయః॥॥
ఇట్లు స్తుతింపబడి వామనాకృతియగు హృషీ కేశుడు నవ్వి వద్మభవునితో భావ గంభీరముగ ఇట్లనెను: పూర్వము నేను నీచే ఇంద్రాదులచే కశ్యపునిచే స్తుతింపబడి ఇంద్రునకు భువనత్రయ రాజ్యమిత్రునంటిని; మరల ఆదితి చేతను స్తుతింపబడి ఇంద్రునకు నిష్కంటకమగు త్రైలోక్య రాజ్యము నిత్తునంటిని; నేనట్లే చేయుదును; సహస్రాక్షుడగు ఇంద్రుడు మహేంద్రుడై జగత్పతియగును; ఇది సత్యము; అని నంతట హృషీ కేశునకు బ్రహ్మ కృష్ణాజినమును బృహస్పతి యజ్ఞోపవీతమును బ్రహ్మసుతుడగు మరీచి ఆషాఢ దండమును వసిష్టుడు కమండలువును ఆంగీరుడు కుశపవిత్రమును పులహుడవసూత్రమును పులస్త్యుడు తెల్లని వస్త్రములను ఇచ్చిరి; ప్రణవోచ్చరణాలంకృతములగు వేదములును అనేక శాస్త్రములును సాంఖ్యము యోగము ఆతనిని స్వయముగ వచ్చి ఆశ్రయించి సేవించెను; ఆ వామనుడును జటా దండ చ్ఛత్త కమండలు ధారియై సర్వదేవ మయు డై బలి యజ్ఞమునకు పోయెను; ఆతడడుగిడిన ప్రతి భూమ్యంశమును ఆతి పీడితమయి వివరము నిచ్చుచుండెను; వామనుడును మంద మృదుగతియై పోవుచున్నను సముద్ర ద్వీపాదయుతయగు మేదిని చలించుచుండెను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున వామన చరిత్రమున వామన మూర్త్యవతారమను రెండు వందల నలువది నాల్గవ అధ్యాయము.
Summary of chapter 244 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya initiates the glorious narrative of Bhagavān Vishṇu's divine advent as Bhagavān Vāmana, the dwarf incarnation born to Aditi and Maharshi Kaśyapa. Bhagavān Vishṇu appeared in a radiant dwarf Brāhmaṇa form holding a wooden staff, water pot, and sacred thread to restore cosmic order after the pious Asura king Bali conquered Svarga through righteous sacrifices. Bhagavān Vāmana arrived at King Bali's sacrificial arena on the banks of river Narmadā, dazzling the assembled sages with His divine effulgence.