మత్స్య మహా పురాణము
237 - ప్రాసాద పతనాది దుర్నిమిత్తశాంతి.
గర్గః : ప్రాసాదతోరణాట్టాల ద్వార ప్రాకార వేశ్మనామ్ ।
నిర్ని మి త్తం తు పతనం దృడానాం రాజమృత్యవే॥
రజసా వాపి ధూ మేన దిశో యత్ర సమాకులాః ।
ఆదిత్య చంద్రతారాశ్చ వివర్ణ భయవృద్దయే॥
రాక్షసా యత్ర దృశ్య నే బ్రాహ్మణాశ్చ విధర్మిణః ।
ఋతవశ్చ విపర్యస్తా అపూజ్యా న్పూజయే జ్జనః॥
కి నక్షత్రాణి వియోగీని త న్మహదయలక్షణమ్ ।
కేతూదయోపరాగౌ వా ఛిద్రం వా శశిసూర్యయోః॥
గ్రహర్జ వికృతి ర్యత్ర తత్రాపి భయమాది శేత్ ।
యశ్చ కలహాయ నే బాలా నిమ్న స్తి బాలకాక్॥
క్రియాణా ముచితానాం చ వ్యుచ్ఛిత్తిర్యత్ర జాయతే ।
అగ్ని ర్యత్ర నదీ ప్యేత హూయమానోశ్పి శా నిషు॥
పిపీలికాశ్చ క్ర వ్యాదా యా న్త చోత్తరత స్తథా ।
పూర్ణకుమ్భా స్రవస్తే చ హవిర్వాపి ప్రలుప్యతే॥
మజ్జళ్యాశ్చ గిరో యత్ర శ్రూయ నే న సమ స్తతః ।
క్షవథు ర్బాధతే చాథ ప్రహసన్త నద నిచ॥
న చ దేవేషు వర్తనే యథావ బ్రాహ్మణేషు చ ।
మన్డఘోషాణి వాద్యాని వాద్య నే విస్వరాణి చ॥
గురుమి తద్విషో యత్ర శత్రుపూజార తా నరాః ।
బ్రాహ్మణా న్సుహృదో మాన్యాన్షనో యతాఒవమన్యతే॥
శా స్త్రీమజ్ఞళహోమేషు నాస్తిక్యం యత్ర జాయతే ।
రోజా వై ప్రియతే తత్ర స దేశ వా వినశ్యతి॥
రాజో వినా శే సమ్ర్పస్తే నిమిత్తాని నిబోధ మే ।
బ్రాహ్మణా న్పథమం ద్వేష్టి బ్రాహ్మణే శ్చ విరుద్ద్యతే॥
బ్రాహ్మణస్వాని చాద త్తే బ్రాహ్మణాంశ్చ జిఘాంసతి ।
నై తా నరతి కృత్యేషు యాచితం చ ప్రకువ్యతి॥
రమతే నిన్గయా తేషాం ప్రశంసాం వాధిగచ్ఛతి ।
అపూర్వం తు కరం లోథా తథా పాతయతే జనే॥
ఏతేష్వభ్యర్చయే త్సమ్య కపత్నీకం ద్విజోత్తమమ్ ।
భోజ్యాని చైవ కార్యాణి సురాణాం బలయ స్తథా ॥
సన్తో విప్రాశ్చ పూజ్యాః స్యు క్షేభ్యో దానం చ ధీయతామ్ ।
గావశ్చ దేహ ద్విజపుజ వేభ్యో వాసాంసి రత్నాని సమన్దిరాణి॥
హోమశ్ప కార్యో ఒమర పూజనం చ ఏవం కృతే శాంతి ముపైతి పాపమ్॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే గర్గాత్రిసంవాదే ప్రాసాదపతనాదిదుర్నిమిత్త
శాంతికథనం నామ సప్తత్రిశందుత్తర ద్విశతతమోఽధ్యాయః॥
గర్గుడు ఆత్రితో ఇట్లు చెప్పెను: మేడలును పుర ద్వారములును బురుజులును ద్వారములును ప్రాకారములును మహాగృహములును గట్టిగనున్న వియు ఆకస్మిక ముగ పడుట రాజమృత్యు సూచకములు; దిక్కులు ధూళులతో పొగలతో అకారణముగ వ్యా ప్తమయినను ఆదిత్యచంద్ర తారలు వివర్లములయినను రాష్ట్ర భయమును సూచించును; రాక్షసులు కనబడుట బ్రాహ్మణులు తమ ధర్మము తప్పుట ఋతుధర్మములు వ్యత్యాసమందుట జనులు అపూజ్యులను పూజించుట నక్ష త్రములు ఎడ మెడ ముగా కనబడుట మహాభయ సూచక ములు; ధూమకేతువులు కనబడుట చంద్ర సూర్య గ్రహణములు తరచగుట చంద్ర సూర్య మండలములు రంధముతో కనబడుట గ్రహ నక్ష త్ర వైకృతము స్త్రీలు అకారణముగ అధికముగ కలహించుట బాలురు బాలురతో కలహించుచు కొట్టుచుండుట ఉచితక్రియలు జరుగక విచ్చిన్నములగుట శాంత్యాది కర్మములందు హోమము చేయుచుండగా అగ్ని జ్వలించక పోవుట చీమలును మాంసాహారి మృగ పక్ష్యాదులును ఉత్తరముగా పోవుచుండుట నిండు కడవలు ఆకారణముగా కారుట హవిస్సు లు ప్రమగుట అన్ని వైపులనుండియు శుభవాక్కులు వినబడ కుండుటజనులలో జలుబు బాధ ఎక్కువగుట అకారణముగ నవ్వులు అరపులు అధికమగుట దేవ బ్రాహ్మణులను సరిగా ఆదరించక పోవుట వాద్యములను మోగించగా అవి సరిగా ! మోగక పోవుట జనులు గురువులను మిత్రులను ద్వేషించుట శత్రువులను పూజించుట బ్రాహ్మణులను సుహృదులను మాన్యులను అవమానించుట శాంతికృత్య మంగళకృత్య హోమ కృత్యముల విషయమున నా సికతా భావము ప్రబలుట. ఇటీవి రాజమరణమును దేశ నాశమును రాజునకు నాశమున నూచిం చును. మృత్యువు దాపురించినచో రాజును బ్రాహ్మణులను ద్వేషించును; బ్రాహ్మణులకు తాను ద్వేష్యుడగును; వారీ ధనములు హరించును; వారిని చంపగోరును; పనులు పడినపుడును వారిని తలచుకొనడు; వారు యాచించినచో కోపించును; వారిని నిందించుచో సతోషించును; ప్రశంసించినచో మేచ్చడు.నొచ్చుకొనును; జనుల పై కొత్త కొత్త పన్నులు వేయును; ఇట్టి సందర్భములలో బ్రాహ్మణదంపతుల నర్చించవలేను; జాహ్మణ సంతర్పణములును దేవతా బలులును జరుపవలయును; సజ్జనులను విప్రులను పూజించవలయును - వారికి దానమీయవలెను; బ్రాహ్మణులకు గోవస్త్ర రత్న గృహ దానములు చేయవలయును; హోమములును దేవతా పూజలును జరుపవలయును; దీనిచే దోష శాంతియగును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున ప్రాసాద పతనాది దుర్నిమిత్త శాంతియను రెండు వందల ముప్పది ఏడవ అధ్యాయము.
Summary of chapter 237 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon internal security protocols, counter-intelligence measures, and strategies to prevent treason, rebellions, and subversion within the realm. Bhagavān Matsya details how secret agents monitor regional governors, military officers, and border posts to detect corruption or foreign manipulation early. The text provides guidance on winning the hearts of citizens through justice, affordable healthcare, and fair taxation, establishing that popular contentment is the strongest defense against internal instability.