84 - గుడపర్వత దానము

 ఈశ్వరః : అతఃపరం ప్రవక్ష్యామి గుడపర్వత ముత్తమమ్

యత్ర్పదానాన్నర స్స్వర్గ మాప్నోతి సురపూజితమ్

ఉత్తమో దశభి ర్భారై ర్మధ్యమః పఞ్చభి ర్మతః

 త్రిభిర్భారై : కనిష్ఠ స్యా త్తదర్దే నాల్పవి త్రవాక్

 తద్వ దావాహనం పూజా హేమవృక్షసురార్చనమ్

 విష్కమ్భపర్వతాం స్తద్వ త్సరాంసి వనదేవతాః

 హోమం జాగరణం చైవ లోక పాలాధివాసనమ్

 ధాన్యపర్వతవ త్కుర్యా దిమం మ ముదీరయేత్

 యథా దేవేషు విశ్వాత్మా ప్రవరోఽయం జనార్దనః

 సామవేదస్తు వేదానాం మహా దేవస్తు యోగినామ్

 ప్రణవ స్సర్వమన్త్రాణాం నారీణాం పార్వతీ యథా

 తథా రసానాం ప్రవర స్సదై వేక్షురసో మతః

 మమ తస్మా త్పరాం లక్ష్మీం ప్రయచ్చ గుడపర్వత

యస్మా త్సౌభాగ్య దాయీ త్వం(శ్రాంతాత్మ) భ్రాతా త్వం గుడపర్వత

 నివాసశ్చాపి (పార్వత్యా స్తస్మా చ్చాన్తిం ప్రయచ్చమే)పార్వత్యా స్తస్మా త్త్వం

పాహి సర్వదా

అనేన వీధినా యస్తు దద్యా ధ్గుడమయం గిరిమ్

పూజ్యమాన స్స గన్దర్వై ర్గౌరీలో కే మహీయతే

తతః కల్పశతా న్తేతు సప్తద్వీపాధిపో భవేత్

ఆయురారోగ్యసమ్పన్న శ్శత్రుభి శ్చాపరాజితః

ఇతి శ్రీమత్స్యమహాపురాణే గుడపర్వత దానమాహాత్మ్య కథనం నామ చతుర శీతిత మోఽధ్యాయః

ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను : ఇపుడిక మీదట గుడ పర్వత దానవ్రతమును తెలిపెదను. అది ఉత్తమ మయినది. దానినాచరించినవారు సురల పూజలనందుకొనుచు స్వర్గమున సుఖింతురు. దీనికే పది (24 తులములు = 1 సేరు; 5 సేరులు = 1 వీశే;8 వీశేలు = 1మణుగు;20మణుగులు=1 భారువా) బారువలు కాని ఐదు బారువలు కాని మూడు బారువలు కొని తగినంత ధనములేని వారు ఒకటిన్నర బరువలు కానీ బెల్లమును వినియోగించ వలేను. ధాన్య పర్వత దానమందువలెనే ఆవాహనమును పూజయు హేమ వృక్షముల ఆషురికయు విష్కంభ పర్వతము లను సరన్పులను వనములను దేవతలను విన్యాసము చేయవలెను. హోమమును జాగరణమును లోకపాలాధి వాసనమును ( ఆమరికను కూడ ధాన్య పర్వత దానమందువలెనే. దాన మంత్రము:) దేవతలయందు విశ్వాత్ముడగు జనార్దనుడును వేదములయందు ప్రణవమును స్త్రీలయందు పార్వతీయును శ్రేష్టమయినట్లు రసములలో ఇక్షు (చెరకు) రసము  శ్రేష్టము. కావున గుడ పర్వతమా! నాకు మేలగు లక్ష్మిని ఇమ్ము, నీవు పార్వతికి నివాసమవు; కావున నీవు నన్నెల్లప్పుడును కాపా డుము. ఈ విధానమున గుడ పర్వత దానము చేసిన వారు గంధర్వులచే కీర్తిగానము చేయబడుచు గౌరీ లోక మున సుఖం తురు. ఇట్లు నూరు కల్పములయిన తరువాత న ప్రద్వీపాధి పతియై జన్మించి ఆయురారోగ్య సంపన్నుడై శత్రువులకు ఆజేయు డై వర్ధిల్లును.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున గుడ పర్వత దానమాహాత్మ్య కథనమను ఎనుబది నాలుగవ అధ్యాయము.