మత్స్య మహా పురాణము
141 - నిమేషాది దివ్య వత్సరాంతకాల నిర్ణయము
ఋషయః : చతుర్యుగాని యాని స్యుః పూర్వే స్వాయంభువేఽన్తరే ।
ఏషాం నిసర్గం సజ్ఖ్యాంచ శోతుమిచ్ఛామ విస్తరాత్॥
సూతః : పృథివీద్యు ప్రసజ్గేన న మయా ప్రాగుదాహృతమ్ ।
తేషాం చతుర్యుగం త్వేవం తద్వక్ష్యామీ నిబోధత॥
తత్ప్రమాణం ప్రసజ్ఖ్యాయ విస్తరాచ్చైవ కృత్స్నశః ।
లౌకి కేన ప్రమాణేన నిష్పద్యాబ్దంతు మానుషమ్॥
తేనాపీహ ప్రసజ్ఖ్యాయ వక్ష్యామిహ చతుర్యుగమ్ ।
నిమేషతుల్యకాలాని మాత్రా లఘ్వక్షరాణిచ॥
కాష్ఠానిమేషా దశపఞ్చచైవ త్రింశచ్చ కాష్ఠా గణయేత్కలాంతు ।
త్రింశత్కలా శ్చైవ భవేన్ముహూర్త స్తైస్త్రింశతా రాత్యహనీ సమేతే
అహోరాత్రై ర్విభజతే సూర్యో-మానుష లౌకిక : ।
రాత్రి స్వప్నాయ॥ భూతానాం చేష్టాయై కర్మణా మహః॥
ప్రిత్యే రాత్ర్యహనీ మాసః ప్రవిభాగ స్తయోఃపునః ।
కృష్ణపక్ష స్వహస్తేషాం శుక్ల స్స్వప్నాయ శర్వరీ॥
త్రింశ ద్వై మానుషా మాసాః పితృమాస స్స ఉచ్యతే ।
శతాని త్రీణి మాసానాం షష్ట్యా చాభ్యధికానితు॥
పిత్ర్య సంవత్సరో హ్యేష మాను షేణ విభావ్యతే ।
మానుషేణైవ మానేన వర్షాణాం యచ్ఛతం భవేత్॥
పితృణాం తాని వర్షాణి నజ్ఖ్యాతానితు త్రీణివై ।
దశ చైకా (చత్వారశ్చా)ధికామాసాఃపితృసఖ్యైహ కీర్తితాః॥
లౌకి కేన ప్రమాణేన ఆబ్ధో యో మానుష స్మృతః ।
ఏత ద్ధివ్యమహో రాత్ర మిత్యేషా వైదికీ శ్రుతిః॥
దివ్యే రాత్ర్యహనీ వర్షం ప్రవిభాగ స్తయోఃపునః ।
అహస్తు యదుదర్కశ్చ రాత్రిర్యాదక్షిణాయనమ్॥
ఏతే రాత్ర్యహనీ దివ్యే ప్రసజ్ఖ్యాతం తయోః పునః ।
త్రింశ ద్యానితు వర్షాణి దైవో మాసస్తు స స్మృతః॥
మానుషాణాం శతం యచ్చ దివ్యమాసాస్త్రయస్తుతే ।
దశ చైకా తథాఽహాని దివ్యఏష విధి స్మృతః॥
త్రీణి వర్షశ తాన్యేవ షష్టివర్షా స్తథైవచ ।
దివ్యసంవత్సరో హ్యేష మానుషేణ ప్రకీర్తితః:
ఋషులు సూతుని 'పూర్వము స్వాయంభువ మన్వంతరమున వ్యవస్థ చేయబడిన చతుర్యుగముల వ్యవస్థను స్వరూపమును సంఖ్యా పరిమాణమును సవిస్తరముగ వినగోరుచున్నాము.' అని అడిగిరి. సూతు డిట్లు చెప్పసాగెను. పృథివీలోక ద్యులోక ( భూగోళ, ఖగోళ వ్యవస్తాకథన) ప్రసంగమున నేను ఇదివరకు మీకు అది చెప్పి యుండ లేదు. ఇపుడది మీకు తెలి పెదను. ఎరుగుడు. మొదట మీకు మానుష ప్రమాణముతో సంవత్సర పరిమాణమును నిష్పన్నము చేసి దాని ఆధారమున చతుర్యుగ పరిమాణమును తెలి పెదను. పదునై దు నిమేషములు జెప్పపాటు కాల ములు) కాష్ఠ; ముప్పదికాష్ఠలు కల; ముప్పది కలలు ముహూర్తము; ముప్పది ముహూర్తములు ఒక రేయింబగలు; రవి రేయింబవళ్లుగా మానవ లౌకిక కాలమును విభజించుచున్నాడు. మానవులు పనులు చేసికొనుటకు పగలు-నిద్రించుటకు రాత్రి ఉపయోగపడుచున్న వి. ఒక మానవమాసము పితరులకు ఒక రేయింబవలు; అందునను కృష్ణపక్షము పగలు; శుక్ల పక్షమురాతి; మానవ మాసములు ముప్పది కలిసి పితరుల కొక మాసము; మానవ మాసములు మున్నూ టరువదిక లిసి పితృ సంవత్సర ము; మానవ మానము చే సూరు సంవత్సరము లైనచో పితరులకు-మూడు సంవత్సరముల నాలుగు మాసము లగును. మానవ లౌకిక ప్రసూణమున సంవత్సరము దేవత లకు రేయింబగలు. అని వేదము తెలుపుచున్నది. అందును. మానవుల ఉత్తరాయనము దేవతలకు పగలు దక్షిణాయనము రాత్రి; మానవ లౌకిక వత్సరములు ముప్పది దేవమాన మాసము; మానవ వత్సరములు నూరే నచో దేవతలకు మూడు మాసములు (మరి పది దినములు) అగును; మానవ లౌకిక వత్సరములు మూడువందలఆరువది యైనచో ఒక దేవవత్సరము. (మాత్రా.లఘూచ్చారణ కాలము నిమేషము)
త్రీణి వర్షసహస్రాణి మాను షేణ ప్రకీర్తితః ।
త్రింశదన్యాని వర్షాణి స్మృత స్సప్తర్షివత్సరః
నవ యాని సహస్రాణి వర్షాణాం మానుష్యాణిచ ।
వర్షాణి నవతి శ్చైవ ధ్రువసంవత్సర స్మృతః॥
షట్త్రింశత్తు సహస్రాణి వర్షాణి మానుషాణితు ।
వర్షాణాం తచ్ఛతం జ్ఞేయం దివ్యో హ్యేష విధి స్మృతః॥
త్రీణ్యేవనియుతా న్యాహుర్వర్షాణాం మానుషాణీచ షష్టి శ్చైవ సహస్రాణి సజ్ఖ్యాతానితు సజ్ఖ్యాయా॥
దివ్యం వర్షసహస్రంతు ప్రాహు సృజ్ఖ్యావిదో జనా
ఇత్యేత దృషిభిర్గితం దివ్యయా సజ్ఖ్యాయా ద్విజాః,
కృతయుగాదిపరిమాణమ్
దివ్యేనై వం ప్రమాణేన యుగసజ్ఖ్యా ప్రకల్పితా ।
చణ్వారి భారతేవర్షే యుగాని ఋషయోఽ బ్రువః॥
కృతం త్రేతా ద్వాపరంచ క లించైవ చతుర్యుగమ్ ।
పూర్వం కృతయుగం నామ తతస్త్రేతాఽభిధీయతే॥
ద్వాపరంచ కలించైవ యుగాని పరికల్పయేత్ ।
చత్వార్యాహు స్సహస్రాణి వర్షాణితు కృతం యుగమ్॥
తస్య తావచ్ఛతీ సన్ద్యా సన్ద్యాoశశ్చ తథా విధః ।
ఇత రేషు ససన్ద్యేషు సనన్ద్యాం శేషు చ త్రిష॥
ఏకపాదేన వర్తన్తే సహస్రాణి శతానిచ ।
త్రేతా త్రీణిసహస్రాణి యుగసజ్ఖ్యా విదో విదుః॥
తస్యాపి త్రిశతీ సన్ద్యా సన్ద్యాంశ స్సన్ద్యాయా సమః ।
ద్వేసహ సే ద్వాపరంచ సన్ద్యా సన్ద్యాంశతశ్చ తే॥
సహస్ర మేకం వర్షాణాం కలిరేవ ప్రకీర్తితః ।
ద్వేశ తేచ తథాన్యేచ సన్ద్యాసన్ద్యాంశ యో స్మృతః॥
ఏషా ద్వాదశ సాహస్రీ యుగ సంఖ్యాతు సంజ్ఞితా ।
కృతం త్రేతా ద్వాపరoచ కలి శ్చేతి చతుష్టయమ్॥
మూడువేల ముప్పది - మానవ లౌకిక సంవత్సరములు ఒక న పరి వత్సరము. దీనికి మూడింతలు. అనగా తొమ్మిది వేల తొంబది మానవ లౌకిక సంవత్సరములు ఒక ధ్రువ సంవత్సరము. ముప్పది ఆరు వేల మానవ లౌకిక సంవత్సరములు నూరు దివ్య సంవత్సరములు; మూడు లక్షల అరువది వేల మానవ లౌకిక సంవత్సరములు వేయి దివ్య సంవత్సరములు; ఇట్లు దివ్య దేవ సంబంధి) ప్రమాణానుసారము చతుర్యుగవ్యవస్థ పెద్దలచే చేయబడినది; ఋషి వచనాను సారము భారత వర్షమున కృత త్రేతా ద్వాపర కలియుగములు నాలుగు వ్యవహార మందున్న ఏ. నాలుగువేల దివ్య వర్ష ములు కృతయుగము; అన్ని వందల దివ్య వర్షములు కృత త్రేతా సంధికాలము; అవే నాలుగు వందల దివ్య వర్షములు సంధ్యాంశ కాలము; ఇట్లే మూడు వేల దివ్య వర్షములు త్రేతాయుగ పరిమాణము; మూడు వందల దివ్య వర్ష ములు దాని సంధ్యాకాలము; మరి మూడు వందల దివ్య వర్షములు దాని సంధ్యాంశ కాలము; రెండువేల దివ్య వర్షములు ద్వాపరయుగ ప్రమాణము; రెండు వందల దివ్య వరములు దాని సంధ్యాకాలము; రెండు వందల దివ్య వర్గములు దాని సంధ్యాంశ కాలము; వేయి దివ్య వర్షములు కలియుగ ప్రమాణము; నూరు దివ్య వర్షములు దాని సంధ్యా కాలము; నూరు దివ్య వర్ష ములు దాని సంధ్యాంక కాలము.
తత్ర సంవత్సరా స్సృష్టా మాసుషా స్తాన్ని బోధత ।
చత్వారింశ తథా త్రీణినియుతానా మిహోచ్యతే॥
వింశతిశ్చ సహస్రాణి కాలో హ్యేష చతుర్యుగః ।
పృథ క్త్వేనేహ వక్ష్యామి యుగానితు నిబోధత॥
యుగాని దశ ద్వేషఞ్చ పఞ్చచై వాత్రజ్ఖ్యయా ।
అష్టావింశతసహస్రాణి కృతంయుగ మిహోచ్యతే॥ ప్రయుతంతుతథాపూర్ణేద్వేచాన్యేనియు తేపునః ।
షణ్ణవతి సహస్రాణి సజ్ఖ్యాతానితు సజ్ఖ్యయా॥
త్రేతాయుగ స్య సజ్ఖ్యైవ మాను షేణతు కీర్తితా ।
అష్టౌ శత సహస్రాణి వర్షాణాం మానుషాణి తు॥
చతుష్టష్టిసహస్రాణి వర్షాణాం ద్వాపర యుగమ్।
చత్వారి నియుతాని స్యు ర్వర్షాణి తు కలిర్యుగమ్॥
ద్వాత్రింశచ్చ తథాన్యా ని సహస్రాణితు సజ్ఖ్యాయా ।
ఏత త్కలియుగం ప్రోక్తం మాను షేణ ప్రమాణత॥
ఏషా చతుర్యు గావస్థా మాను షేణ ప్రకీర్తితా ।
చతుర్యుగస్య సజ్ఖ్యాతా సన్ద్యానన్ద్యాoశ కై స్సహ॥
మన్వ న్తరపరిమాణనిర్ణయః,
ఏషా చతుర్యుగాఖ్యాతు సాధికా శ్వేకసప్తతిః ।
కృతత్రేతాదియుక్తా సా మనోర న్తర ముచ్యతే॥
మస్వ న్తర స్య సజ్ఖ్యాతు మాను షేణ నిబోధత ।
ఏకత్రింశ త్తథాకోట్య స్స్యజ్ఖ్యాతా సజ్ఖ్యాయా ద్విజై:॥
తథాశ తసహస్రాణి దశ చాన్యాని భాగశః ।
సహస్రాణిచ ద్వాత్రింశ చ్ఛతాన్యష్టాధికాని చ॥
ఆశీతి శ్చైవవర్షాశ్చ మాసా శ్చైవాధికాస్తు షట్ ।
మన్వన్తరస్య సజ్ఖ్యైషా మాను సేణ ప్రకీర్తితా॥
దివ్యే సచ ప్రమాణేన ప్రవక్ష్యామ్య న్తరం మనోః ।
సహస్రాణాం శ తాన్యాహు ర్న వచైవతు సజ్ఖ్యయా॥
చత్వారింశత్సహస్రాణి మనోర న్తర ముచ్యతే ।
మన్వ న్తరస్య కాలస్తు యుగై స్సహ ప్రకీర్తితః,
ఏషాచతుర్యుగాఖ్యాతు సాధికా హ్యేకసప్తతిః ।
క్రమేణపరివృత్తాస్తా మనోర న్తర ముచ్యతే॥
ఏతచ్చతుర్దశగుణం కల్పమాహుస్తు తద్విదః ।
కల్పప్రమాణా ద్ద్విగుణీయథా భవతి సజ్ఖ్యయా॥
తతస్తు ప్రళయః కృత్స్న స్సతు సంప్రళయో మహా ।
చతుర్యుగం సమా ఖ్యాతా ద్వాపరం కలిమేవచ॥
యుగవత్సమ వేతో ద్వౌ ద్విధా వక్తుం న శక్యతే ।
ప్రమాగతం మయాఽ ప్యేత త్తుభ్యం నోక్తంయుగద్వయమ్॥
ఋషివంశ ప్రసజ్గేన వ్యాకులత్వా తథా క్రమాత్ ।
నోక్తం త్రేతాయుగం శేషం తద్వక్ష్యామి నిబోధత॥
దీప్యమానముచే యుగ ప్రమాణము సంవత్సర ములలో
యుగము । యుగపు మానము । యుగ సంధ్య । యుగ సంధ్యాంశము । మొ త్తము
కృత 4000+ 400 +400 = 4800
త్రేతా 3000+ 300 +300 = 3600
ద్వాపర 2000+ 200 +200 = 2400
కలి 1000+ 100 +100 = 1200
చతుర్యుగము । 10000+ ।1000 । +1000 । = 12000
మానవ మానముచే యుగ ప్రమాణము సంవత్సరములలో
యుగము । యుగ ప్రమాణము । యుగ సంధ్యాం । యుగ సంధ్యాంశము।మొ త్తము
కృత 1440000+ 144000+ 144000 = 1728000
త్రేతా 1080000+ 1080000+ 1080000= 1296000
ద్వాపర 720000+ 72000+ 72000= 864000
కలి 360000+ 36000+ 36000= 432000
। 3600000+ ।360000+ । 360000= । 4320000
ఈ విధమగు చతుర్యుగమునకు దివ్య యుగమని వ్యవహారము. ఇటువంటి దివ్యయుగములు డెబ్బదియొకటి పై చిల్లర యైనచో ఒక మన్వంతరమగును. ఇది మనుష్య లౌకిక మానానుసారము ముప్పదియొక్క కోట్ల పదిలక్షల ముప్పది రెండువేల ఎనిమిది వందల ఎనుబది సంవత్సరముల ఆరు మాసములగును. ఇదే మన్వంతర పరిమాణము దివ్య మానము ననుసరించి తొమ్మిది లక్షల నలువదివేల సంవత్సరములగును.
విశేషాంశ ము : వాస్తవమున వేయి దివ్య యుగములు. అనగా వేయి మాసవ మహాయుగ ములు. అయినచో బహ్మకు ఒక పగలు; బ్రహ్మ దేవుని రాత్రికి కూడ ఇదే పరిమాణము; అనగా 12000000 దివ్య సంవత్సరములు = 12000000x3604820000000 మానవ సంవత్సరములు బ్రహ్మకు ఒక పగలు; అనగా సృష్టి కాలము; ఇంతయే బ్రహ్మకు రాత్రి-అనగా ప్రళయకాలము; ఒక సృష్టి కాలములో 14గురు మనువులు జీవించి తమతమ ప్రవృత్తులను లోకమున ప్రవర్తిల్లజేయుదురు; కావున 1 మన్వంతరము 12000000-1 = సుమారుగా 857148 దివ్య సంవత్స "రములు - 432000000 ,14 - 80857148.సంవత్సరములమీద 7 మాసములు కావలయును; కాని ఇచ్చట పురాణములో ఇచ్చిన మన్వంతర వరిమాణములో దేవమానముచేకాని మానవ మానము చేకాని సరి పోవుటలేదు. ఇంతే కాదు; పైని దివ్యమానానుసారము ఇచ్చిన మన్వంతర పరిమాణమగు 940000 దివ్య వర్షములను 860తో గుణించగా మానవమాన సంవత్సరములు 888400000 మానవ వర్షములు కావలయును. కాని పెని - మానవ . మానానుసారము ఇచ్చిన మన్వంతర పరిమాణ సంఖ్య వేరుగా నున్న ది.
ఇది సరిపోవుట ఎట్లు? ఆలోచించవలెను.
యుగ పరిమాణములకు నాలుగింటికిని దివ్యమానములోగాని మానవ మానము లో కాని సంధ్యా సంధ్యాంశములు ఉన్న బ్లీ సృష్టికాలము (బ్రహ్మదినము)నకు కూడ సంధ్యా సంధ్యాంశలు కలవు. కాని యుగముల విషయములో దివ్య మానమున యుగ పరిమాణము ఎన్ని వేల దివ్య సంవత్సరములో అన్ని వందల దివ్య సంవత్సరములే ఆయుగపు సంధ్యయు. అంతయే ఆయుగపు సంధ్యాంశమును; కాని ఈ సృష్టి కాలమునకు కల సంధ్యా సంధ్యాంగ పరిమాణము. అట్లు కాదు. ఈ చెప్పిన 12000000 దివ్యమాన సంవత్సరములు = 4320000000 మానవ సంవత్సరములలో 14 వంతును మరియు ఆ 14వ వంతులో 8వ వంతును కలిసి యగునంత కాలము మొత్తము సంధ్యా సంధ్యాంశము లగునని తోచు చున్నది. అట్లు చూడగా 12000000లో 14వ వంతు 857148 దివ్య వత్సరములును దీనిలో 8వ వంతు 285714 దివ్య వర్షములును కలిసి 1142857 దివ్య వర్షము లగును. ఈ సంఖ్యను సహస్ర దివ్య యుగముల కగు సంవత్సరము లతో కలిపి 14తో భాగించగా అవి ఇక్కడ ఇచ్చిన దివ్యమాన మన్వంతర పరిమాణము ఇంచుమించుగా అగును. దానిని 860తో గుణించగా మానవ మానములో ఇంచుమించుగా 388032885 సంవత్సరముల పై ఆరు మాసము లగును. దీనిని బట్టి దూల ప్రతులలో ఒకానొక కాలమున పాఠభ్రంశము జరిగెననియు పై మూల శ్లోకపు పంక్తులు:
“త్రయస్త్రింశ త్తథా కోట్యః సంఖ్యాతా సంఖ్యయా ద్విజై: ।
తథాఽశీతి సహస్రాణి దశ చాన్యాని భాగశః॥
సహస్రాణి చ ద్వాత్రింశ చ్ఛతా న్యష్టాధికానిచ ।
ఆశీతి శ్చైవ వరాశ్చ మాసా శ్చై వాధి కాస్తు షట్॥
అని యుండవలెననియు తోచుచున్నది,
అపుడు ముప్పది మూడు కోట్లును. అశీతి సహ సాణి-దశ -ఆన్యానీచ భాగశ ? - అనగా xX - అగును. మిగిలిన వేలు వందలు అను సంఖ్యలు సమానమే. కాగా పైన చెప్పిన అగును. ఇది ఇంకను లోతుగా ఆలోచించవలసిన విషయము. )
మన్వంతరమునకు పదునాలుగు రెట్లు కల్ప ప్రమాణము; ఇదే బ్రహ్మకు పగలు.
దీనికి రెండింతలు సంపూర్ణ ప్రళయకాలము; దీనికి మహా ప్రళయకాల మనియు పేరు; ద్వాపర కలియుగములు రెండును పర స్పరము విడదీయరానివై కలిసియుండుటచే వాని లక్షణము వేరువేరుగా వివరించ వీలుగాక నేను మీకు వివరించలేదు. అట్లే త్రేతాయుగ లక్షణములను గూడ ఋషివంక ప్రసంగమున నాకు కలిగిన వ్యగ్రతచే - ప్పీయుండలేదు. శేషాంశమగు ఆత్రేతాయుగ విషయము ఇపుడు చెప్పే వినుడు.
త్రేతాయుగధర్మా :-
అథ త్రేతాయుగ స్యాదౌ మను స్సప్తర్షయశ్చ యే ।
శ్రౌతస్మార్తం ధ్రువం ధర్మం ప్రహ్మణాతు ప్రచోదితాః॥
దారాగ్ని హోత్రసమ్భన్దం ఋగ్యజుస్సామసంహితమ్ ।
ఇత్యాది -బహులం శ్రౌతం ధర్మ సప్తర్షయోఽబ్రువన్॥
పరమ్పరాగతం ధర్మం స్మార్తం త్వాచార లక్షణమ్ ।
వర్ణాశ్రమాచారయు క్తం మనస్స్వాయమ్బువోఽబ్రవీత్॥
సత్యేన బ్రహ్మచర్యేణ శ్రుతేస తపసా తథా ।
తేషాం సుత ప్తతపసా మార్షేణాను క్రమేణ హ॥
సప్తర్షిణాం మనోశ్చైవ ఆదౌ త్రేతాయుగే తతః ।
అబుద్ధిపూర్వకం తేస సకృత్పూర్వక మేవచ॥
ఆభివృత్తాస్తు తే మన్త్రా దర్శనే స్తార కాదిభిః ।
ఆధికల్పేహి దేవానాం ప్రాదుర్భూతాస్తు తే స్వయమ్
ప్రమాణీష్వథ సిద్దానా మన్యేషాంచ ప్రవర్తతే ।
మన్త్రయోగో వ్యతీతేషు కల్పేష్విహ సహస్రశః॥
తే మన్త్రావై పున స్తేషాం ప్రతిభాయా ముపస్థితాః ।
ఋ చోయజూంషి సామాని మన్త్రాశ్చాథర్వణాశ్చయే
సప్తర్షిభిస్తు తే ప్రోక్తా స్స్మార్తంతు మనుర బ్రవీత్ ।
త్రేతాదౌ సంహతా వేదా: కేవలం ధర్మ సేతవః॥
సంరోధా దాయుష శ్చైవ వ్యస్యంతే ద్వాపరేతు తే ।
ఋషయ స్తపసా వేదా నహోరాత్రమధీయతే॥
అనాదినిధనా దివ్యాః పూర్వే ప్రోక్తాః స్వయమ్బువా ।
స్వ ధర్మసంస్కృతా న్త్సాజ్గా న్యథాధర్మం యుగేయుగే॥
విక్రియ న్తే స్వధర్మాత్తు వేదా వేదా ద్యథాయుగమ్ ।
ఆరమ్భయజ్ఞాః క్షత్రస్య హవిర్యజ్ఞా విశ స్స్మృతాః॥
పరిచారయజ్ఞా శూద్రాశ్చ జపయజ్ఞాశ్చ బ్రాహ్మణాః।
తత స్సముదితా వర్ణా స్త్రేతాయాం ధర్మశాలినః॥
క్రియావన్తః ప్రజావ త్త స్సమృద్ధా స్సుఖినశ్చ వై।
బ్రాహ్మ ణై శ్చ విధీయ న్తే క్షత్రియాః క్షత్రియై ర్విశ కి॥
వైశ్యా శూద్రాఽనువర్త న్తే తతఃపర మనుగ్రహాత్ ।
శుభాః ప్రకృతయ స్తేషాం ధర్మా వర్ణాశ్రమాశ్రయా:॥
శుభకరములగు త్రేతాయుగ ధర్మములను వినుడు. త్రేతాయుగారంభమున స్వయంభూ - బ్రహ్మ స్వాయంభువ మనువునకును మరీచ్యాది సప్త ప్రజాపతులగు) సప్త ఋషులకును శాశ్వతమగు శౌత స్మార్తమగు ధర్మమును విధి రూపమున బోధించెను. దొరాగ్ని హోత సంబంధము గల అగ్ని హోత్ర విధాన సంబంధులగు శ్రాత కర్మముల నను ష్ఠించు విధానము ఋగ్యజుః సామాత్మకమగు వేద సంహితలు తత్సంబంధి ధర్మములు తదంగములు తత్సంబంధీ విద్యలు ఈ మొదలగు విస్తృత శ్రేత ధర్మమును సప్త ఋషులును తమ తరువాతి తరముల వారికి ప్రతిపాదించి లోకమున ఆ ధర్మములను ప్రవర్తిల్ల చేసిరి. సామయాచారికధర్మమను ప్రసిద్ధిగల వర్ణాశమాచార ధర్మములను తనకు బ్రహ్మనుండి గురు పరంపర గా లభించిన వానిని స్వాయంభువ మనువు ఈ లోకమున ప్రవర్తిల్ల జే నేను. ఇవి స్మార (స్మృతిప్రో క) ధర్మములు .
ఈ సప్తర్షులును స్వాయంభువ మనువును కల్పాది త్రేతాయుగాదియందు - సత్యము బ్రహ్మచర్యము శ్రుతము (శాస్త్రములను సంప్రదాయ శుద్ధితో అధ్యయనము చేయుట తపస్సు నియమ పాలనముతో శరీరమును శ్రమకు పాల్పరచుట. ఆ నేడు ఈ ప్రక్రియలతో అతి తీవ్రమగు తపస్సు, ఆచరించిరి. (ఇచ్చట తపస్సు అనగా చిత్తమునకు ఆత్యుత్తమ సంస్కారమును సంపాదించుట); తత్పలముగా వారికి తమ సంకల్ప మేమియు లేక యే వారికి మరెవ్వరి నుండియు ఉపదేశము లేక యే ఆదియే ఈ కల్పమున ప్రథమ పర్యాయముగా వేదమంత్రములు అన్నియు ఆభివృత్తము లయ్యెను (వారి దగ్గరకు అవి తమంతట తామే వచ్చెను.) వైదిక మంత్రములు వీరికి సాక్షాత్కరించుట దర్శనమున (మంత్రములందు ప్రతిపాదింపబడు విషయము శబ్దరూపమున చిత్తమునకు మాత్రమే కాక చెవికి గూడ గోచరించుట) ‘తారక' రూపమున (నక్షత్రములందు అంతరిక్షముననే ఈ మంత్రరూపములును వానియందు ప్రతిపాదింపబడు దేవతా తత్వములును పానితో ఆచరించవలసిన యాగాది ప్రక్రియలును గోచరించుట -దతా తేయాది యోగులు ఎరిగిన తారక యోగసిద్ధిచే ఈ విషయములు వారి చిత శ్రవణములకు గోచరించుట). ఇట్టి అద్భుత విధానములతో జరిగేను. ఈ వేద మంత్రములు దేవతలకు అందర కును శబ్దాత్మక ములగు ఆశ్రయములు. మరి ఈ వేదమంత్రములు సప్తరులకు ఎట్లు మొదటిసారిగా ఈ కల్పమున ప్రతిభాతములు స్పురించినవి అయ్యెను? అనిన - ఇతః పూర్వపు కల్పములందును ఆయా ప్రమాణ జ్ఞానమునందు సిద్ది నందిన ఆయా మహానుభావులకు అంతకు ముందటి కల్పములందు వలెనే స్ఫురించగా వారు వానిని ఆ కల్పములందు లోకములందు ప్రవర్తిల్ల జేసిరి. ఇవి వేలకొలది మంత్ర ద్రష్టలకు వేలకొలదిగా ప్రతిభాతములై యుండెను. అవియే ఈ కల్పమునందు మరల ఈ సప్తర్షులకును స్వాయంభువ మనువునకును వారి వారి ప్రతిభ (స్వయం సిద్ధమగు బుద్ధి స్పందన యందు గోచరించెను. అని సమాధానము. ఇవి ఋగ్యజుః సామాథర్వణ రూపములగు నాలుగు వేదములు. వీనినే సప్తర్షులు తాము దర్శించి లోకమున ప్రవచించిరి (ఇచట సపరులనగా వారును వారి వంశజులగు మరి ఇతరులగు ఋషులును) స్మార్త ధర్మమును స్వాయంభువ మనువు లోకమున ప్రవ రిల్లజేసెను. ఇట్లు కల్పాది. యందలి త్రేతాయుగాదియందు సంహతములయిన వ్యవస్థాపూర్వకముగా అమర్చబడిన) వేదములు ధర్మ సేతువులుగా ధర్మాతిక్రమణము జరుగకుండ కాపాడు అడ్డుకట్టలుగా) అయ్యెను. ఆయుః పరిమాణము మొదలగు శక్తులు తగ్గుటచే ఈ ద్వాపరయుగము నాటికి అవి మొదటివలె నుండక వ్యత్యాస మందినవి. ఈ వేదములను ఋషులు తమ తపోబలా ధిక్యముచే అహోరాత్రములు అధ్యయనము చేయుచుందురు. దీనికి ఆదియు అంతమును లేదు. ఇవి నిత్యశబ్దములు) వీటిని స్వయంభూ బ్రహ్మ తాను స్వయముగా. ఆ ని ప్రతిపాదించు ధర్మము పొటియందు చక్కగా ముస్కరింపబడిన రూప ములో నిలిపి ఆయా యుగ ధర్మములకు అనుగుణముగా ఉండు రూపములో వాటి ఆంగములతో కూడ- ప్రతియుగము (కల్పభేదమునందును ప్రవచించును. కాని ఆయా యుగములలో ధర్మ వ్యవస్థయందలి మార్పుల ననుసరించి ఒక వేదముకంటె మరియొక వేదము మార్పు నొంది కనబడును. ఈ శుతులను అనుసరించి తెలియు తత్వము ఏమనిన లోక క్షేమకర మగు కర్మలను ఉత్సాహముతో తమ విక్రమముతో ఆచరించుటయే క్షత్రియులకును. హవిస్సులు (ప్రజల నిత్య జీవనములకు సాధనము లగు ఆహారాది పవిత్ర వస్తువులు) జనులకు సమకూర్చుటయే వైశ్యులకును. తమ శారీరక శ్రమతో జనులకు ఉపయోగించు పరిచర్యలు (కృత్యములు) F సేవ అని అర్థము కాదు. ) చేయుటయే శూద్రుల కును యజ్ఞములు; బ్రాహ్మణులకు జపమే జనులకు క్షేమము కూర్చవలేనను దృష్టి చేయు వేదాధ్యయనమే అని అర్థము; మంత్రజపమని అర్థము కాదు; } వాస్తవమగు యజ్ఞము. దీనిని ఇప్లే అందరును ఆచరించేడు వారు కావునను నాటి జనులు స్వధర్మాచరణశాలురు కావునను వారు కార్యపరులు నత్సంతానవంతులు సమృద్ధి కలిగి సుఖించువారునై యుండిరి. బ్రాహ్మణులు ఉపదేశించినట్లు క్షత్రియులు క్షత్రీయు లుపదేశించినట్లు వైశ్యులు వైశ్యు లుపదేశించినట్లు శూద్రులు ఆచరించుచు అనుగ్రహము (జసానుకూల ప్రవర్తనము)తో నడ చెడివారు. నాటి జనుల ప్రకృతులు (స్వభావ ములు) శుభకరములయి వర్ణాశ మానుకూల ధర్మరూపములయి యుండెడివి.
సజ్కల్పితేన మనసా వాచా వా హస్తకర్మణా ।
త్రేతాయుగే హ్యవిక లే కర్మారమ్బః ప్రసిధ్యతే॥
ఆయూ రూపం బలం మేధా ఆరోగ్యం ధర్మశీలతా ।
సర్వసాధారణం హ్యేత దాసీ త్రేతాయుగేతు వై॥
వర్ణాశ్రమవ్యవస్థానం తేషాం బ్రహ్మా తథాఽకరోత్ ।
సంహితాశ్చ తథా మన్త్రా ఋషిభి ర్ర్బహ్మణ స్సుతే
యజ్ఞాః ప్రవర్తితా శ్చైవ తదా హ్యేవతు దైవతై : ।
యామై శ్శుక్లై ర్జయై శ్చైవ సర్వ సాధనసమ్భృతే
సార్థం విశ్వసృజా చైవ దేవేన్ద్రేణ మహౌజసా।
స్వాయంభువేఽన్తరే దేవై స్తైర్యజ్ఞాః ప్రాక్పవర్తితాః॥
సత్యం జప స్తపో దానం పూర్వధర్మోయ ఉచ్యతే ।
యథా ధర్మస్య ప్రాసతో శాఖాఽధర్మస్య వర్ధతే,
జాయంతే చ తదా శూరా ఆయుష్మన్తో మహాబలాః ।
న్య స్తదణ్డా మహాయోగా యజ్వానో బ్రహ్మవాదినః॥
పద్మపత్రాయతాక్షాశ్చ పృథువక్త్రా సుసంహతాః ।
సింహోరస్కా మహాసత్త్వా మత్తమాత జ్గగామినః॥
మహాధనుర్ధరా శ్చైవ త్రేతాయాం చక్రవర్తినః ।
సర్వలక్షణసమ్పూర్ణా స్య గ్రోధపరిమణ్డలాః
న్య గ్రోదౌతు స్మృతౌ బాహూ వ్యామో న్యగ్రోధ ఉచ్యతే ।
వ్యా మేన తూచ్చ్రయో యస్య త్వధ ఊర్ద్వంచ దేహినామ్॥
సముచ్చ్రయః పరీణాహో న్యగ్రోధపరిమళ్లిలః ।
చక్రం రథో మణి ర్భార్యా నిధి రశ్వో గజ స్తథా,
ప్రోక్తాని సప్తరత్నాని పూర్వే స్వాయంభువేఽ న్తరే ।
విష్ణో రం శేన జాయన్తే పృథివ్యాం చక్రవర్తినః॥
మన్వ న్తరేషు సర్వేషు అతీతానాగ శేష వై ।
భూతభవ్యాని యానీహ వర్తమానాని యానిచ॥
త్రేతాయుగాని తేష్వత్ర జాయన్తే చక్రవర్తినః ।
భద్రాణీమాని నై తేషాం విభావ్య నే మహీభృతామ్॥
త్రేతాయుగమున ధర్మము సమగ్రముగా నడుచుచుండ మనస్సుతో చేయు సంకల్పము నోటితో చెప్పెడి మాట చేతితో చేయు పనీ ఈ మనోవాక్కాయిక కర్మములు మూడును ఏక రూపములు కాగా జనుల కర్మాచరణములు సఫల ములయి యుండెను. జనుల ఆయువు రూపము బలము మేధా ఆరోగ్యము ధర్మశీలము _ఇవి జనులలో తేతా యుగమున సర్వ సాధారణమయి యుండెను. బ్రహ్మ ఆనాటి వారికి వర్ణాశ్రమ వ్యవస్థను అట్లే చేసేను. వేద సంహితలను వేద మంత్రములను బ్రహ్మమానస పుత్తులగు ఋషులు అంత బాగుగా ప్రవర్తిల్లజేసిరి. వారు యజ్ఞముల నంత తిన్నగా ఆనాడు ప్రవర్తిల్ల జేసిరి. స్వాయంభువ మన్వంతరమునందు యాములు శుక్లులు జయులు అను దేవ వర్గములును విశ్వ నష్టయగు స్వయంభూబ్రహ్మయును సర్వ సంభారములతో సమృద్ధిగా నుండు యజ్ఞములను ప్రవర్తిల్లజేసిరి. సత్య జప తపో దానములు పూర్వ యుగములందలి ధర్మములయి యుండెను. కానీ క్రమముగ ధర్మశాఖ తగిన కొలది అధర్మ మధికము కాసాగెను. ఆ యుగములందు జనులు శూరులు ఆయుష్మంతులు మహాబలులు క్షమావంతులు (ఎవరిని దండిం చనివారు) న్య స్తదండులు మహాయోగులు యజ్ఞానుష్టాతలు వేదాధ్యయన తత్వజ్ఞానపరులు పద్మపత్రనేత్రులు విశాల ముఖులు చక్కని దేహపు అమరిక కలవారు సింహవక్ష ముకంటే దృఢ విశాలవక్షము కలవారు మహాసత్వులు మదపు పేనుగువలే నడుచువారు మహాధనుషులు న్యగ్రోధ పరిమండలులు సర్వ లక్షణ సంపూర్ణులు నై నొటి చక్రవర్తు లుండెడి పాడు. న్యగ్రోధము అనగా ' బార' అని అర్థము; బార కొలతకు వచ్చుటచే బాహువులకును న్యగ్రోధములు అని నామము; నిలువునగాని అడ్డమునగాని, బారలతో కొలువదగినంత పొడవు లావు(చుట్టు కొలత కల వారీని న్యగ్రోధ పరిమండలులు అందురు. ఆ స్వాయంభువ మన్వంతరమున చక్రవర్తులు విష్ణు నంశమున చక్రము రథము మణులు భార్య నిధి ధనరాశి) అశ్వములు గజములు అనేడు సప్త రత్నములు కలిగియుం డేడు పోరు. గడిచిన గడచుచున్న గడువనున్న త్రేతాయుగ ములందెల్ల చక్రవర్తులు ఇట్టివారే; ఈ చెప్పిన సప్త రత్న ములును ముందు చెప్ప బోవు లక్షణములును వారికి శుభకర లక్ష ణములుగా నుండును.
అత్యద్భుతాని చత్వారి బలం ధర్మ స్సుఖం ధనమ్ ।
అన్యోన్యస్యావిరోధేన ప్రాప్య న్తే తై ర్నృవై స్సమమ్॥
అర్ధో ధర్మశ్చ కామశ్చ యశో విజయ ఏవచ ।
ఐశ్వర్యేణాణిమాద్యేన ప్రభుశ క్తి బలాన్వితాః॥
శ్రుతేన తపసాచైవ ఋషీం స్తేభిభవన్తి హి ।
బలేనాభిభవం త్యేతే తేన దానవమానవా॥
లక్ష ణైశ్చైవ జాయన్తే శరీరస్థై రమానుషైః ।
కేశాః స్థితా లలా టేన జిహ్వాచ పరిమార్జనీ॥
శ్యామప్రభా శ్చతుర్దంష్ట్రాసు వంశాశ్చోర్ధ్వరేతసః ।
ఆజానుబాహవశ్చైవ తాలహస్తా వృషాకృతీకి॥
పరిణాహప్రమాణాభ్యాం సింహస్కన్దాశ్చ మేధినః ।
పాదయో శ్చ కమత్సౌతు శజ్ఖపద్మేచ హ స్తయోః॥
పఞ్చాశీతిసహస్రాణి జీవ న్తే హ్య జరామయాః ।
అసజ్గా గతయ స్తేషాం చతస్ర శ్చక్రవర్తినామ్॥
అన్తరిక్షే సముద్రేష పాతా శే పర్వతేషుచ ।
ఇజ్యా దానం తప సత్యం త్రేతాధర్మాస్తు వై స్మృతాః॥
తదా ప్రవర్తతే ధర్మో వర్ణాశ్రమవిభాగశః ।
మర్యాదాస్థాపనార్థంచ దణ్డనీతిః ప్రవర్తతే॥
హృష్టపుష్టా జనాస్సర్వే ఆరోగ్యాపూర్ణమానసాః ।
ఏకో వేద శ్చతుష్పాద స్త్రేతాయాం త్రివిధ స్మృతః॥
త్రీణి వర్ష సహస్రాణి జీవ న్తే తత్ర తాః ప్రజాః ।
పుత్త్రపౌత్రసమాకీర్ణా మ్రియన్తేచ క్ర మేణ తాః॥
ఏష భావ స్త్రేతాయుగే త్రేతాసంధ్యాం నిబోధత ।
త్రేతాయుగస్య భావానాం సన్ద్యా పాదేన వర్తతే॥
నన్ద్యాపాదే స్వభావాచ్చ యోఽoశః పాదేన తిష్ఠతి॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మన్వన్తరానుకీర్తనే నిమేషాదికాలనిర్ణయాది కథనం నామ ఏక చత్వారింశదు త్తర శతతమోఽధ్యాయః॥
బలము ధర్మము సుఖము ధనము ఇవి అత్యద్బుతములగు లక్షణములు; వీటిని పరస్పర విరోధము లేకుండ ఆ త్రేతాయుగ రాజులు సమముగా నిర్వహింతురు. ధర్మార్థ కామ యశో విజయైశ్వర్యాణిమాది ప్రభుశ క్తి శాస్త్ర తపో లక్షణములందు వారు (నాటి చక్రవర్తులు) ఋషులను మానవులను దానవులనుకూడ తిరస్కరించగలిగియుందురు. మానవ సహజ శరీర లక్షణములు కూడ వారికున్న తములుగా నుండును. ఎట్లన వారి జుట్టు నుదుటి వైశాల్యమును కమ్మివేయునంతగా మీదికివచ్చి పడుచుండును. నాలుక నోటినంతటిని ఒరయునంతగా పొడవుగా నుండును. బొమన చాయ. నాలుగు కోర దంతములు కలిగి ఉన్నత వంశమున పుట్టి జితేంద్రియులు ఆజాను బాహువులు తాటికాండమువంటి చేతులు వృషభములవంటి తీవికల ఆకృతితో వృషభములకువలె దేహనిర్మాణము పెద్ద కొలత కలిగి సింహపు చూపు వంటి మూపులతో మేధావంతులయియుందురు. వారి పాదములందు శంఖచక్ర రేఖలు హ సములందు శంఖపద్మ రేఖలు కలిగి ఎనుబది ఐదువేల సంవత్సరములు ఏరోగమును పార్లక మును లేక జీవింతురు. ఆ చక్రవర్తులు అంత రిక్షమున సముద్రములందు పాతాళమున పర్వతములందు ఈ నాలుగు చోట్లకూడ వీరు ఆడ్డు లేక సంచరింతురు.
మీ తముమీద లేతాయుగమున యజ్ఞదాన తపస్సత్యములు ప్రధాన ధర్మములు; వర్ణాశ్రమ ధర్మములు సరిగా నడచును; ఐనను ఎవరి మేరలో వారిని నిలుపుటకై దండనీతియు నామమాత్రముగా ప్రవర్తిల్లును. జనులు ఎల్లరు హర ముతో పుష్టితో మానస శారీరారోగ్యములతో నుందురు. త్రివిధ వేదములును కర్మవరములు ఉపాసనాపరములు జ్ఞానపరములు) ఋగ్యజుఃసామాథర్వణములను నాలుగు పాదములతో ఏకవస్తువుగా అఖండ రూపమున నుండును. ప్రజలు మూడు వేలేండ్లు జీవింతురు. వారు పుత్ర పౌత్రాది పరివారము నడుమ క్రమముగా నెప్పుడో మర ణింతురు. ఇది తేతాయుగ ధర్మము; త్రేతా సంధ్యాకాలములో ఈ ధర్మములన్ని యు ఇందు. నాల్గవవంతున నడుచును. సంధ్యాంశ కాలమునందు సంధ్యా కాల ధర్మములో నాల్గవవంతు మాత్రము నడుచును.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మన్వంతరాను కీర్తన కాల పరిమాణ కథన
తేతాయుగధర్మ ప్రతిపాదనమను నూట సలువది యొకటవ అధ్యాయము.
Summary of chapter 141 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes the divine post-marital life of Mahādeva and Goddess Pārvatī on the secluded peaks of Mount Gandhamādana and Mount Kailāsa. The divine couple engaged in cosmic conversations, spiritual games, and contemplative sports, filling the Himalayan realms with peaceful energy while the Devas anxiously awaited the birth of the divine child destined to destroy Tārakāsura.