156 - పార్వతి బ్రహ్మ వరమున గౌరదేహ (గౌరి) యగుట॥

దేవీ : మాతరం మాం పరిత్యజ్య యస్మా త్వం స్నేహవిక్లబామ్

విహితావసరస్స్త్రిణాం శఙ్కరస్య రహో విధౌ

తస్మా త్తే పరుషా రూక్షా జడా హృదయవర్జితా

గణేశ శార నదృశీ శిలా మాతాభవిష్యతి

నిమిత్త ఏష విఖ్యాతో వీరకస్య శిరోదయే

శామ్భవే ప్రక్ర మేడైవ విచిత్రాఖ్యానసంశయః

ఏవముత్సృష్టశాపాయా గిరిపుత్ర్యా స్వన స్తరమ్

నిర్జగామ ముఖాతోధస్సింహరూపీ మహాబలః

స తు సింహః కరాళాస్యః సటాజటిలకనరః

ప్రోద్భూతలమ్బలాజాలో దంష్టోత్కటముఖోద్బదః

వ్యాదితాస్యో లలజ్జిహ్వః క్షామకుడి శ్చిఖాదిమః

తస్యాశు వర్తితుం దేవీ వ్యవస్యత సతీ తదా

జ్ఞాత్వా మనోగతం తస్యా భగవాంశ్చతురాననః

ఆజగామాశ్రమపదం సమ్పదామాశ్రయే యతః

ఆగత్యోవాచ దేవేశో గిరిజాం స్పష్టయా గిరా

బ్రహ్మా : కిం పుత్తి ప్రాపు కామాసి కిమలభ్యం దదామి తే

విరమ్యతామతి క్లేశా తపసోఒస్మాన్మదాజ్ఞయా

తచుత్వోవాచ గిరిజా గురుం గౌరవగర్భితమ్

వాక్యం వాచా చిరోధీర్ల నిర్ణీతం చితవాజ్ఞ్చయా

దేవీ : తపసా దుష్క రేణా ప్తః పతిత్వ శఙ్కరో మయా

స మాం శ్యామలవన్డేతి బహుశః ప్రోక్తవాక్ హరః

స్యామహం కాష్చోనాకారా వాల్లభ్యేని చ సంయుతా

భర్తుర్భూతపతేర మేక తో నిర్విశేజ్గవత్

వీరకా! నీవు నీయందతివాత్సల్య పరవశనయియున్న నన్ను ఖండించి (లెక్క పెట్టక) శంకరుని రహస్య సుఖ మున అన్యస్త్రీల కవకాశమిచ్చితివి కావున పరుష యు రూక్ష (టెరు సైనది)యు జడ (అచేతన) హృదయహీన యగుశిల నీకు తల్లియగును అని పార్వతి వీర కుని శపించెను శివ మహిమ తత్వములందు గల ప్రక్రమానుసారము ఇట్టి విచిత్ర కథాశ్రయమగు ఈ వృతాంతమే వీరకుడు శిల నుండి జనించుటకు హేతువు (మరియొక జన్మమున ఈ వీర కుడు శిల నుండి జనించెనని దీనినిబట్టి ఎరుగవచ్చును)

ఇట్లు శపించిన తత్క్షణమే పార్వతీ ముఖమునుండి ఆమే హృద్రత మహాక్రోధము మహాబలశాలియగు సింహ మయి వేలికి వచ్చెను ఆ సింహము మిట్ట పల్లములు గల ముఖము కలది; జడలు నిండిన కంఠము పైకిలేచి యాడుచు వ్రేలాడుచునుండు పొడవుతోక కోరలతో వికటమగు ముఖ విస్తారము విశాలముగా తెరచిన నోరు కదలియాడు నాలుక సన్న ని పొట్టకల దై (కనబడిన దేల్ల ఆహారముగా) తిను కోరిక తో నుండెను సతియగు పార్వతియు తానే దానికాహారము కాదలచి యుండెను ఆమె సంకల్పమేరిగి బ్రహ్మ సకల సంపదలకు నిలయమగు ఆమే యాశ్రమమునకువచ్చి దేవితో ఇట్లు పలికెను