22 - శ్రాద్ధము జరుపదగిన తీర్థ క్షేత్రములును - కాలమును

ఋషయః : కస్మి న్కాలే చ త చ్ఛ్రాద్ద మన న్తఫలదం భవేత్

కస్మి న్వాసర భాగే తు శ్రాద్ధకృచ్చ సమాచరేత్

 తీర్దేషు కేషు చ కృతం  శ్రాద్ధం బహుఫలం భవేత్

 సూతః: అపరాహ్ణేతు సంప్రాప్తే హ్యభిజి ద్రౌహిణోదయే

యత్కించిద్దీయతే తత్ర త దక్షయ ముదాహృతమ్

తీర్థాని యాని శస్తాని పితృణాం వల్లభాని చ

 నామత స్తాని వక్ష్యామి సజ్క్షే పేణ ద్విజోత్త్రమాః  

పితృతృప్తికరగయాదితీర్థకథనమ్

పితృతీర్థం గయా నామ సర్వతీర్థవరం శుభమ్

తత్రా స్తే దేవదేవేశ స్స్వయ మేవ పితామహః

త త్రైషా పితృభి ర్గీతా గాథా భాగ మభీప్సుభిః

 ఏష్టవ్యా బహవః పుత్త్రా యద్యేకోఽపి గయాం వ్రజేత్

 యజేత వాశ్వమేధోన నీలం ఐ వృష ముత్సృజేత్

 తథా వారాణసీ పుణ్యా పితృణాం వల్లభా సదా

తత్రావిముక్తసాన్నిధ్యం భుక్తిముక్తి ఫలప్రదమ్

పితృణాం వల్లభం తద్వ త్పుణ్యం చ విమలేశ్వరమ్

పితృతీర్థం ప్రయాగంతు సర్వకామఫలప్రదమ్

వటేశ్వరంతు సుభగం సర్వకామపప్రదమ్

వటేశ్వరస్తు భగవా న్మాధ వేన సమన్వితః

 యోగనిద్రాశ్రయ స్తద్వ త్సదా వసతి కేశవః

దశాశ్వమేధికం పుణ్యం గజ్గాద్వారం తథైవచ

నన్దాథ లలితా తద్వ త్తీర్థం మాయాపురం శుభమ్

తీర్థం బ్రహ్మసర స్తద్వ చ్ఛతద్రుసలిలే ప్రదః

 తీర్థం తు నై మిశం నాయ సర్వతీర్థఫలప్రదమ్

గజ్గోద్భేదంతు గోమత్యాం యత్రోద్భూత సనాతనః

తథా యజ్ఞవరాహస్తు దేవదేవశ్చ శూలభృత్

యత్ర తత్కాఇ్చనం ద్వార మష్టాదశ భుజో హరః

 నేమిస్తు హరిచక్రస్య శీర్జా యత్రాభవ త్పురా

తదేవ నైమిశారణ్యం సర్వతీర్థని షేవితమ్

 దేవదేవస్య తత్రాపి వారాహస్య చ దర్శనమ్

యః ప్రయాతి స పూతాత్మా నారాయణపదం వ్రజేత్

 కృతశౌచం మహారణ్యం సర్వపాపనిషూద నమ్

 యత్రాస్తే నర సింహస్తు స్వయమేవ జనార్దనః

 తీర్థ మిక్షుమతీ నామ పితృణాం వల్లభం సదా

 సజ్గమే యత్ర తిష్ఠ న్తి గ జ్గయాః పితర స్సదా

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి : “ఏ సమయమునందు- అనగా పగటి ఏ అంశమునందు శ్రాద్ధకర్త శ్రాద్ధము జరిపినచో అనంతమగు ఫలము లభించును? ఏ తీర్థములందు కాని క్షేత్రములందుగాని శ్రాద్ధము జరిపిన యెడల బహుఫలము లభించును? తెలుప వేడుచున్నాము.”

సూతుడు ఇట్లు చెప్పనారంభించెను : అభిజిన్ముహూర్తము రౌహిణ ముహూర్తము ఉదయించు సమయము ఆగు అపరాష్ట్ర కాలమున జరిపిన శ్రాద్దము అనంతమగు ఫలమును ఇచ్చును.

పితృదేవతలకు ప్రీతికరములగు తీర్థములను క్షేత్రములను పేర్కొని వాటిని గూర్చి సం క్షేపముగా తెలుపు చున్నాను.

గయా తీర్థము పితృ తీర్థములన్నిటిలో మేలయినది. శుభకరమయినది. అక్కడ దేవదేవులకును ఈశుడు అగు బ్రహ్మస్వయముగా సన్నిహితుడై యుండును. తమ పితృథాగమగు కవ్యమును ఆసుభవింపగోరు పితృదేవతలు గానము చేసిన గాథ (యొక్క అర్థము) ఈ విధముగా నున్నది: “పితరులు అనేకులగు పుత్రులు కలుగవ లేనని కోరుకొనవలెను. ఏలయన వారిలో ఒకడైన గయకు పోయి పితృ  శ్రాద్ధము జరుపునేమో: అశ్వమేధ యాగము న జరుపునేమో! నీల వృషభమును విడుచునేమో!” వారాణసి సదా పితరులకు ప్రియమయినది. దానిని ఎన్నడును పార్వతీ పరమేశ్వరులు విడువనందున దానిని ఆవిముక్త క్షేత్రము అందురు. వారి నిరంతర సన్నిధి వలన అది భుక్తి ముక్తి ఫలములను శ్రాద్ధకర్తకు ఇచ్చును. విమలేశ్వరము ప్రయాగ కటీశ్వరము అను క్షేత్రములును పితరులకు ప్రియములై నవి పుణ్యకరములై నవి సర్వ కామము లను తీర్చునవి. వటేశ్వర క్షేత్రమునందు వటేశ్వరుడను శివుడు యోగనిద్రతో శయనించియుండు కేశవునితో కూడి నివసించును. దశాశ్వ మేధము -గంగా ద్వారము హరిద్వారము) నందా లలితాతీర్థములు మాయాపురము (జగన్నాధపురి) బ్రహ్మసరమను తీర్థము శతద్రు (సట్ లజ్) జలపుమడుగు గంగాగోమతీ సంగమ స్థానము నై మిశము పితృప్రీతికరములు. గంగాగోమతీ సంగమమున శాశ్వతుడగు యజ్ఞవరాహ విష్ణుడును శూలధారియగు శివుడును సన్నిహితులై యుందురు. అచట బంగారుద్వారము కలదు. అచటి శివుడు అష్టాదశ భుజుడు. విష్ణుచక్రపు నేమి (అంచు) శీర్ణము (శిథిలము) అయిన స్థలమే నై మిశము. ఈ క్షేత్రమునందు యజ్ఞ వరాహ మూర్తిని దర్శించినచో విష్ణులోకమును పొందును. కృతశాచ మను మహారణ్యము సర్వపాప నాశకము. అచట సాక్షాత్ నారాయణుడు నరసింహ రూపమున నున్నాడు. ఇక్షుమతీగంగా సంగమము పితృప్రియమగు తీర్థము. అచట పితృదేవతలు ఎల్లప్పుడును నివసించుచుందురు.

కురుక్షేత్రం మహాపుణ్యం సర్వతీర్థసమన్వితమ్

తథాచ సరయూః పుణ్యా సర్వదేవనమస్కృతా

 ఇరావతీ నదీ తద్వ త్పితృతీర్థాధివాసినీ

యమునా దేవికా కాళీ చన్ద్రభాగా దృషద్వతీ

 నదీ వేణుమతీ పుణ్యా పారా వేత్రవతీ తథా

పితృణాం వల్లభా హ్యేతా శ్శ్రాద్దే కోటిగుణా మతాః

జమ్బూ మార్గం మహాపుణ్యం యత్ర మార్గో హి లక్ష్యతే

ఆద్యాపి పితృతీర్థం త త్సర్వకామఫలప్రదమ్

 నీలకుణ్డ మితి ఖ్యాతం పితృతీర్థం ద్విజోత్తమాః

తథా భద్రసరః పుణ్యం సరో మానస మేవ చ

మన్దాకినీ తథా చ్చోదా విపాశాథ సరస్వతీ

పూర్వం మిత్రపదం తద్వ ద్వైద్యనాధం మహాఫలమ్

 శి(క్షి) ప్రానదీ మహాకాలం తథా కాళఞ్జరం శుభమ్

వంశోద్భేదం ఫలోద్భేదం గజ్గోద్భేదం మహాఫలమ్

భద్రాస్పదం విష్ణుపదం నర్మదాద్వార మేవ చ

గయాపిణ్డప్రదానేన సమా న్యాహు ర్మహర్షయః

ఏతాని పితృతీర్థాని సర్వపాపహరాణి చ  

స్మరణా దపి లోకానాం కిము శ్రాద్ధకృతాం నృణామ్

 ఓజ్కారం పితృతీర్థం చ కావేరీ కపిలోదకమ్

సమ్భేద శ్చణ్డవేగాయా స్తథైవామరకణ్టకమ్

 కురుక్షేత్రా చ్ఛతగుణం తస్మిన్త్స్నా నాదికం భవేత్

శుక్ల తీర్థం చ విఖ్యాతం తీర్థం సోమేశ్వరం పరమ్

సర్వవ్యాధిహరం పుణ్యం శతకోటిఫలాధికమ్

శ్రాద్ధదానే తథా బ్రహ్మ న్త్వాధ్యాయం జలసన్నిధౌ

 కాయావరోహణం నామ తథా చర్మణ్వతీ నదీ

గోమతీ చారుణా తద్వ తీర్థ మౌశనసం పరమ్

భైరవం భృగుతుజ్గం చ గౌరీతీర్థ మనుత్తమమ్

తీర్థం వైనాయకం నామ వస్తేశ్వర మతః పరమ్

 తథా పాపహరం నామ పుణ్యా చ తపతీ నదీ

భూతిదా చ వయోష్ణీ చ పయోష్ణీసజ్గమ స్తథా

మహా మ్భోధిః పాటలా చ నాగతీర్థమవ న్తికా

తథా వేణునదీ పుణ్యా మహాశాలం తథై వచ

 మహారుద్రం మహాలిజ్గం దశార్ణాచ నదీ శుభా

శతరుద్రా శతాహ్వా చ తథా విశ్వపదం పరమ్

 అజ్గార వాహికా తద్వ న్నదౌ తౌ శోణఘర్ఘరౌ

 కాళికా చ నది పుణ్యా వితస్తాచ నదీ తథా

ఏతాని పితృతీర్థానీ శస్య న్తే స్నా నదానయోః

 శ్రాద్ద మేతేషు యద్దత్తం తదన స్తఫలప్రదమ్

కురుక్షేత్రము మహాపుణ్యకరము. అచట సర్వతీర్థములు చేయుండును. సరయూ నది పుణ్యకరమయినది. సర్వదేవతలకును ఆది పూజ్యమయినది ఇరావతీ-యమునా-దేవికా- కాశీ-చంద్రభాగా-దృషద్వతీ-వేణుమతీ-పారా-వేత్రవతీ నదులును పితరులకు ఇష్టములైనవి. ఇచట శ్రాద్ధము జరుపుట చేత కోటి రెట్లు ఫలితము గలుగును.

నేటికిని మహామార్గము కనబడు జంబూ మార్గము నీలకుండము భద్రసరము మానస సరస్సు అచ్చోదానది-మందాకిని-విపాశా (బియాస్)-సరస్వతీ - మిత్రపదము- వైద్యనాధము శిప్రా క్షిప్రా నది (ఉజ్జయినిదగ్గర) మహాకాల క్షేత్రము కాలంజరము (పర్వతము) వంశోద్భేదము ఫలోద్భేదము -గంగోద్భేదము- భద్రాస్పదము విష్ణుపదము నర్మదాద్వారము (నర్మదా సాగర సంగమము) ఈ ప్రదేశములందు పితరులకు పిండదానము చేసినచో గయలో పిండదానము చేసినట్లగును. ఈ పితృతీర్థములు స్మరణమాత్రముననే జనుల సర్వపాపముల హరించును. శ్రాద్దమువలన కలుగు ఫల మింతయని చెప్ప నేల? ఓంకారము పితృతీర్థము కావేరీ-కపిలా-చండ వేగా నచే సాగర సంగమము - అమరకంటకము- వీటియందు స్నానము కురుక్షేత్ర తీర్థములందు స్నానము కంటెను నూరు రెట్లు ఎక్కువ ఫలము నిచ్చును. శుక్ల తీర్థ సోమేశ్వర తీర్థములందు శ్రాద్ధము జరిపినను స్వాధ్యాయము చేసినను సర్వవ్యాధులును నశించును. ఇతర క్షేత్రములందు కంటే నూరుకోట్ల రెట్లు ఎక్కువ పుణ్యము కలుగును.

కాయావరోహణ క్షేత్రము చర్మణ్వతీ గోమతి అరుణ- ఔశనస తీర్థము బైరవము భృగుతుంగము గౌరీతీర్థము వై నాయక తీర్థము వస్తేశ్వర తీర్థము పాపహరమను తీర్థము తపతీనది-భూతిదా-పయోషీ-పయోషీ సంగమము మహాంభోధి తీర్థము పాటలాతీర్థము నాగ తీర్థము అవంతికా-వేణునదీ-మహాశాలము-మహారుద్రము-మహాలింగము దశార్ణానది -శతరు దాశ తాహ్వానదులు-విశ్వపదము - అంగార వాహికానది-శోణ-ఘర్ఘరము లను నదములు- కాళికా వితస్తానదులు- ఈ పితృ తీర్థములు స్నా నదానములందు ప్రశస్తములు. ఈ తీర్థ క్షేత్రములందు శ్రాద్ధము జరిపినచో అనంత పుణ్యము లభించును.

ద్రోణీ వటనదీ ధారా సరి ద్వీర నదీ తథా

గోకర్ణం గజకర్ణంచ తథాచ పురుషోత్తమమ్

ద్వారంచ కర్ణ ద్వారంచ కృష్ణతీర్థం సరస్వతీ

నదీ మణిమతీ నామ తథాచ గిరికర్ణికా

 ధూతపాపం తథా తీర్థం సముద్రో దక్షిణ స్తథా

 ఏతాని పితృతీర్థాని శ్రాద్ధ మానన్త్య మశ్నుతే

తీర్థం మేఖలకం నామ స్వయమేవ జనార్దనః

 యత్ర శార్గ్జధరో విష్ణు రేఖలాయా మవస్థితః

తథా మన్దోద రీతీర్థం తీర్థం వంశ నదీ తథా

తథా చామరనాధంచ మహీ శాలనదీ తథా

 చిత్రకూటంచ మర్కోటం తథా జన్మేశ్వరం మహత్

అర్జునం త్రిపురంచైవ సిద్దేశ్వర మతఃపరమ్

శ్రీ శైలం శాంకరం తీర్థం నారసింహ మతః పరమ్  

 మహేన్ద్రంచ తథా పుణ్యం తథా శ్రీశజ్గు సంజ్ఞితమ్

 ఏతేష్వపి దద చ్చ్రాద్ద మన నఫల మశ్నుతే

దర్శనాదపి చై తాని సద్యః పాపహరాణి వై

 తుజ్గభద్రా నదీ పుణ్యా త్రిసన్ద్యాతీర్థ ముత్త్రమమ్

ఏత తీర్థం మహాపుణ్యం తథా భీమనదీ సరిత్

భీమేశ్వరం కృష్ణవేణీ కావేరీ వఞ్జుళా నదీ

నదీ గోదావరీ పుణ్యా త్రిసన్ద్యా తీర్థ ముత్తమమ్

తీర్థం త్రైయమ్బకం నామ సర్వతీర్ధనమస్కృతమ్

యతా స్తే భగవా నీశ స్స్వయమేవ త్రిలోచనః

శ్రాద్ధ మేతేషు తీర్దేషు దత్తం కోటిగుణం భవేత్

స్మరణాదపి పాపాని నశ్యన్త్యాశు తథా ద్విజాః

శ్రీపర్ణా చ నదీ పుణ్యా దానతీర్థ మనుత్తమమ్

తథా వంశ నదీ ధారా శివా ధారా తథైవ చ

భావతీర్ణం చ విఖ్యాతం పఞ్చతీర్థంచ శాశ్వతమ్

పుణ్యం రామేశ్వరం తద్వ దేలాపుర మలమ్పురమ్

అజ్గభూతిచ విఖ్యాత మాపాణ్డర మలమ్బుకమ్

 నామ్నాఽ నో కేశ్వరం తద్వ దేకామ్రకమత పరమ్

గోవర్థనం హరిశ్చన్ద్రం సరః పుణ్యం పృథూదకమ్

సహస్రాక్షం హిరణ్యాక్షం తథాచ కదళీ నదీ

రామచిత్రాఽజితాచైవ తథా సౌమిత్రిసజ్గమమ్

ఇన్ద్రకీలం మహానాదం తథా చ ప్రియమాలకమ్

ఏతాన్యపి సదా శ్రాద్ద ప్రశస్తా న్యధికాని తు

ఏతేషు సర్వదేవానాం సాన్నిధ్యం విదితం యతః

 దానం చై తేషు సర్వేషు భవేత్కోటీప్సితాధికమ్

 బాహుదా చ నదీ పుణ్యా తథా సిద్ధవనం శుభమ్

తీర్థం పాశుపతం నామ నదీ పర్వతికా తథా

శ్రాద్ధ మేతేషు సర్వేషు దత్తం కోటిశతోత్తరమ్

ద్రోణీనది.వటనది-ధారానది-వీరనది - గోకర్ణము-గజకర్ణము-పురుషో త్త్రమ క్షేత్రము  (జగన్నాధము)-ద్వారము-కర్ణద్వారము-కృష్ణతీర్థము-సరస్వతీ-మణిమతీ గిరికర్ణికానదులు ధూతపాప తీర్థము-దక్షిణ సముద్రము -ఈ పితృతీర్థము లందు చేసిన శ్రాద్దము అనంతమగును.  మేఖలక మను తీర్థమునందు సర్వాంతర్యామియు శార్జధరుడునగు జనార్దనుడు స్వయముగా ఎల్లప్పుడు మేఖలయందు సంసాహితుడై యుండును. ( మేఖల = పర్వతపు నిలువు పెత్తులో నడుమ భాగము) మండోదరీ తీర్థము వంశ నదీ తీర్థము అమర నాధము మహీశాలనది.చిత్రకూటము మరోటము జన్మేశ్వరము అర్జునము త్రిపురము సిద్దేశ్వరము శ్రీ శైలము శాంకర తీర్థము నార సింహతీర్థము మ హేంద్రము. శ్రీశంకు క్షేత్రము. వీటిని దర్శించినను వెంటనే పాపములన్నియు నశించును. వీటియందు జరుపబడిన శ్రాద్దము అనంత ఫలమును ఇచ్చును.

తుంగభద్రానది-త్రిసుధ్యాతీరము-భీమనదీ-భీమేశ్వరక్షేత్రము-కృష్ణవేణ- కావేరి- వంజులానది గోదావరి త్ర్యంబక తీర్థము ఇవి ప్రశస్తములగు పితృప్రీతికర తీర్థములు. త్ర్యంబక తీర్థమునందు ఎల్లప్పుడును త్ర్యంబక శివుడు సంనిహితుడై  యుండును. వీటిని స్మరించినను పాపములు వెంటనే నశించు. ఇచట చేసిన, శ్రాద్ధము కోటి రెట్లు ఫలమును ఇచ్చును.

శ్రీపర్ణానది-వంశ నడి శివానది - భావతీర్థము-పంచతీర్థము రామేశ్వరము- ఏలాపురము అలంపుర ము అంగభూతి క్షేత్రము ఆపాణురము. అలంబుకము అనో కేశ్వరము ఏకామ క్షేత్రము గోవర్ధనము హరిశ్చంద్రము.పృథూదక సరస్సు. సహస్రాక్షము హిరణ్యాక్షము కదశీనది.రామచిత్ర.అజితానది సౌమిత్రిసంగమము.ఇంద్రకీలము మహానాదము ప్రియ మాలము ఇవి శ్రాద్ధము జరుపుటకు ప్రశస్తములు. అధిక ఫలప్రదములు. వీటియందు దేవతలు ఎల్లప్పుడు సంనిహితులయి యుందురు. వీటియందు గానము చేసినచో కోరిన కోరికలు కోటి రెట్లుగా ఫలించును.

తథైవ పితృతీర్థంతు యత్ర గోదావరీ నదీ

యుతా లిజ్గసహ స్రేణ సర్వాన్తర జలావహా

జామదగ్న్యస్య తీర్థంతు క్రమా దాయు రనుత్తమమ్

ప్రతీకస్య భయా ద్బిన్నా యత్ర గోదావరీ నదీ

త త్తీర్థం హవ్యక వ్యానా మప్సరోయుగసంజ్ఞతమ్

 శ్రాద్దాగ్ని కార్యదానేషు తథా కోటిశ తాధికమ్

తథా సహస్రలిజ్గంచ రాఘవేశ్వర ముత్తమమ్

 ఇన్ద్ర ఫేనా నదే పుణ్యా యత్రేన్ద్రః పతితం పురా

 నిహత్య సముచిం శక్ర స్తపసా స్వర్గ మా ప్తవాక్

తత్ర దత్తం నరై శ్శాద్ద మన న్తఫలదం భవేత్

తీర్ధంతు పుష్కరం నామ సాలగ్రామం తథైవచ

శోణపాశశ్చ విఖ్యాతో యత్ర వైశ్వానరాలయమ్

తీర్థం సారస్వతం నామ స్వామితీర్థం తథైవచ

మలందరా నదీ పుణ్యా కౌశికీ చన్ద్రికా తథా

విదర్భాచ తథా వైరా పయోష్ణీ ప్రాజ్ముఖా పురా

కావేరీ చోత్తరా కార్యా తథా జాలన్దరో గిరిః

ఏతేషు శ్రాద్దతీర్దేషు శ్రాద్ధ మానన్త్య మశ్నుతే

 లోహదణ్డం తథా తీర్థం చిత్రకూట స్తథైవచ

విన్ద్య యోగేశ్వరం గజ్గా తథా నద్యా స్తటం శుభమ్

కుబ్జామ్రకంతు తత్తీర్థ మూర్వశీపుళినం తథా

 సంసార మోచనం తీర్థం తథైవ ఋణ మోచనమ్

ఏతేష్వపిచ తీర్దేషు శ్రాద్ధ మానన్త్య మశ్నుతే

అద్రుహాసం తథా తీర్థం గౌతమేశ్వర మేవచ

తథా వసిష్టతీర్థం తు హారీతంతు తతఃపరమ్

బ్రహ్మావర్తం కుశావర్తం హయతీర్థం తథైవ చ

పిణ్డారకoచ విఖ్యాతం శజ్ఖాధారం తథైవచ

 ఘటేశ్వరం బిల్వకంచ నీలపర్వత మేవచ

 సుగ్రీవం ధరణీ తీర్థం రామతీర్థం తథైవచ

 అశ్వతీర్థంచ విఖ్యాత మాన న్త్యం శ్రాద్దదానయోః

తీర్థం వేదశిరో నామ తథై వోద్యవతీ నదీ

 తీర్థం చ వసుదం నామ ఛాగలాణ్డం తథైవచ

ఏషు శ్రాద్దప్రదాతారః ప్రయా న్తి పరమం పదమ్

 తథాచ బదరీతీర్థం గణతీర్థం తథైవచ

జయన్తం విజయంచైవ శుక్రతీర్థం తథైవచ

 శ్రీపతేశ్చ తథా తీర్థం తీర్థం రై వతకం తథా

తథైవ శారదా తీర్థం భద్రకాళేశ్వరం తథా

వైకుణ్ఠతీర్థంచ పరం భీమేశ్వర మథాపివా

 ఏష శ్రాద్దప్రదాతారః ప్రయా న్తి పరమాం గతిమ్

తీర్థం మాతృగృహం నామ కరవీరం తథైవచ

జలేశ్వరం చ విఖ్యాతం గౌరీశిఖర మేవచ

 లకుటీశ స్య తీర్థంతు కర్దమాలం తథైవచ

 దణ్డిముణ్డికరం తద్వ త్పుణ్డరీకపురం తథా

సప్తగోదావరం తీర్థం సర్వతీర్ధేశ్వరేశ్వరమ్

 తత్ర శ్రాద్ధం ప్రదాతవ్య మన స్తఫల మీప్సుభిః

ఏష తూద్దేశతః ప్రోక్త సీర్థానాం సజ్గమో మయా

వాగీశోపి న శక్నోతి గదితుం కిము మానవః

సత్యం తీర్థం దయా తీర్థం తీర్థ మిన్ద్రియనిగ్రహమ్

 వర్ణాశ్రమాణాం గే హేపీ తీర్థం సమ ముదాహృతమ్

 ఏషు తీర్దేషుయచ్ఛ్రాద్దం తత్కోటిగుణ మిష్యతే

యస్మా త్తస్మా త్ప్రయత్నేన తీర్థ శ్రాద్ధం సమాచరేత్

గోదావరి నది సమీపమునందలి పితృతీర్థమను తీర్థము చాల ప్రశస్తమయినది. ఇచ్చట గోదావరి నది అన్ని చోటులందు కంటే చాల లోతుగా ప్రవహించుచు వేయి శివలింగములతో కూడి ఉన్నది. ఈ తీర్థమున కే జామదగ్న్య తీర్థము అని నామాంతరము. ఇది శ్రాద్ధ కర్తలకు సర్వోత్త్రమమగు దీర్ఘాయువును ఇచ్చును. ఇచ్చటనే గోదావరీ నది ప్రతీకుడను ఋషివలన భయముచే చీలినది. ఇది దేవతలనుద్దేశించి హవ్యములను ఇచ్చుటకును పితృ దేవతల నుద్దేశించి కవ్యములను ఇచ్చుటకును కూడ ప్రశస్తమయినది. అందుచే దీనికి అప్సరోయుగ తీర్థము అని పేరు. ఇచట శ్రాద్దములు కాని అగ్ని కార్యములు కాని (యజ్ఞ హోమాదికము కాని) దానములు కాని చేసినచో నూరు కోట్ల రెట్ల పుణ్యము లభించును.

సహస్ర లింగ క్షేత్రమును రాఘవేశ్వర క్షేత్రమును పితృ కార్యములకు ప్రశస్తములు. ఇంద్ర సేనా నదీ పితృ కౌద్దము విషయమున పుణ్యకరము. పూర్వము నముచి దానవుని చంపినందున పతితు డైన ఇంద్రుడు ఇచట తపస్సాచరించి పుణ్యము సపాదించి స్వర్గమును పొంద గలిగెను. ఇచ్చట మానవులు శ్రాద్ధము జరిపినచో అనంత ఫలము కలుగును.

పుష్కర తీర్థము సాల గ్రామ తీర్థము శోణ పాదము వైశ్వానరుడను పేరుగల అగ్ని విశేషమునకు స్థానమగు వైశ్వానరాలయ తీర్థమును దాని సమీపమందలి సారస్వత తీర్థము స్వామి తీర్థము మలందరానదీ కౌశికీ నది చంద్రికానది విదర్భానది వై రానది పూర్వము ప్రాజ్ముఖ ప్రవాహముతో నుండిన పయోషీనది ఉత్త్రర వాహినిగా నున్న కావేరి జాలంధర పర్వతము - ఈ ప్రదేశము లందు జరిపిన పితృ శ్రాద్ధము అనంత ఫలము నిచ్చును. లోహదండ తీర్థము చిత్రకూటము వింధ్య-యోగేశ్వరము గంగానదీ తటము కుబామకము ఊర్వశీ పులినము సంసార మోచన తీర్థము ఋణమోచన తీర్థము  అద్రుహాసము గౌత మేశ్వరము వసిష్ణ తీర్థము హారీతము బ్రహ్మావర్తము కుశావర్తము హయతీర్థము పిండారకము శంఖాధారము ఘటేశ్వరము బిల్వకము నీల పర్వతము సుగ్రీవము ధరణీతీర్థము రామతీర్థము అశ్వతీర్థము వేదశిర సీర్థము ఉద్యవతీనది వసుద తీర్థము ఛాగలాండము బద రీతీర్థము గణతీర్థము జయంతము విజయము శుక్ర తీర్థము శ్రీపతితీర్థము రైవతక తీర్థము శారదాతీర్థము భద్రకా శేశ్వరము వైకుంఠ తీర్థము భీమేశ్వరము మాతృగృహతీర్థము కరవీర తీర్థము జలేశ్వరము గౌరీ శిఖరము లకుటీశము కర్తమాలము దండిముండికరము పుండరీక పురము సప్తగోదావరము - ఇవన్నియు పితృ శ్రాద్దమునకు ప్రశ స్తములగు తీర్థరాజములు. పేరులు మాత్రమే గ్రహించి (వాటి మహిమములను విస్తరింపక) కొన్ని కొన్ని పితృ తీర్థములను మీకు తెలిపితిని. అన్నిటిని సంపూర్ణముగా తెలుపుట బ్రహ్మకు కూడ సాధ్యము కాదు.

ముఖ్యముగా-సత్యము దయ ఇంద్రియ నిగ్రహము - ఇవి అత్యుత్త్రమములగు తీర్థ ములు. ఇవి కలిగి తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి నడచుకొను వారికి ఇంటియందే పితృ తీర్థస్థానము ఉండును.

ఏమయినను ఈ చెప్పిన తీర్థములందు శ్రాద్ధము చేసినచో కోటి రెట్లు పుణ్యము కలుగును. కనుక సర్వ విధముల ప్రయత్నించి తీర్థ శ్రాద్దమును జరుపవలయును.

శ్రాద్ధకాల నిర్ణయః

ప్రాతఃకాలే ముహూర్తాం స్త్రీ న్పూర్వాహ్ణే తవదేవతు

 మధ్యాహ్న స్త్రీమూహూర్త స్స్యా దపరాహ్ణ స్తతఃపరమ్

సాయాహ్న శ్రీముహూర్తస్స్యా చ్చ్రాద్ధం తత్ర న కారయేత్

రాక్షసీ నామ సా హోరా గర్హితా సర్వకర్మసు

అహ్నో ముహూర్తా విఖ్యాతా దశపఞ్చచ సర్వదా

తత్రాష్టమో ముహూర్తో య స్స కాలః కుతపః స్మృతః

మధ్యా హ్నే సర్వదా యస్మా న్మన్దీభవతి భాస్కరః

తస్మా దన స్తఫలద సదారమ్భా ద్భవిష్యతి

 మధ్యాహ్న: ఖడ్గపాత్రం తు తథా నేపాలకమ్బళః

దీపో దర్భా స్తిలా గావో దౌహిత్ర శ్చాష్టమః స్మృతః

పాపం కుత్సిత మిత్యాహు స్తస్య సన్తోపకారిణః

అష్టా వేతే యత స్తస్మా త్కుతపా ఇతి విశ్రుతాః

ఊర్ధ్వం ముహూర్తా త్కుతపా ద్య న్ముహూర్తచతుష్టయమ్

ముహూర్తవఞ్చకం చేతా స్వధాభవన మిష్యతే

విష్ణో ర్దేహసముద్భూతాః కుశాః కృష్ణా స్తిలా స్తథా

శ్రాద్ధస్య లక్షణాయేమే తత్రాహు ర్ధివి దేవతాః

తిలోద కాంజలి ర్దేయో జలస్థై స్తీర్థవాసిభిః

సదర్భహస్తే నైకేన శ్రాద్ధ సేచన మిష్యతే

 పుణ్యం పవిత్ర మాయుష్యం సర్వపాపవినాశనమ్

పరా మత్స్యేన కథితం తీర్థ శ్రాద్దానుకీర్తనమ్

 శృణోతి యః పఠేద్వాపి శ్రీమా స్త్సంజాయతే నరః

 శ్రాద్ధ కాలేచ కర్తవ్యం తథా తీర్థనివాసిభిః

సర్వపాపోపశా న్త్యర్థ మలక్ష్మీనాశనంపరమ్

 ఇదం పవిత్రం యశసాం నిదాన మిదం మహాపాపహరం చ పుంసామ్

బ్రహ్మార్కరుధ్రై రభిపూజితంచ శ్రాద్ధస్య మాహాత్మ్య ముశన్తి తద్ జ్ఞాః

ఇతి శ్రీమత్స్య మహాపురాణే మత్స్యమనుసంవాదే శ్రాద్ధకల్పే పితృప్రీతికర తీర్థకాలకథనం నామ ద్వావింశతీత మోఽధ్యాయః

పగటి కాలము మొత్త్రము పదునైదు ముహూర్తము లగును. వరుసగా ప్రాతఃకాలము పూర్వాహ్లాము మధ్యాహ్న ము అపరాహ్లాము సాయాహ్నము . ఇవి ఒక్కొక్కటి మూడేసి ముహూర్తములు. సాయాహ్న మునకు రాక్షసీ హోరా అనియు పేరున్నది. ఆ సాయాహ్న కాలమునందు శ్రాద్ధము జరుపరాదు. ఏలయన రాక్ష సీహోరా ఏ కర్మములకును పనికిరాదు. వీనిలో ఎనిమిదవ ముహూర్తమునకు కుతప కాలమని శాస్త్రమున పేరు. మధ్యాహ్న కాలమున ఏ సమయము నుండి రవి చల్లదనము పొందునో అప్పటినుండి సాయాహ్న మారంభమగు లోపల శ్రాద్ధము జరిపిన వారికి రవి అనంత ఫలము ఇచ్చును.

ఇదియును కాక - మధ్యాహ్న కాలము ఖడ్గము నుంచు పాతము (ఒర) నేపాళ దేశమున నేసిన కంబళము దీపము దర్భలు తిలలు గోవులు దౌహిత్రుడు - ఈ ఎనిమిదింటికిని కుతపము అని పేరు. కుతపము ఆను శబ్దము నందలి కు. . అనగా కుత్సితము . పాపము అని అర్థము. తపము అనగా దాని  తపింప చేయునది.

ఇదియును కాక పగటి ముహూర్తములలో ఎనిమిదవది అగు కుతప ముహూర్తమును దాని తరువాత వచ్చు నాలుగు ముహూర్తములును- మొత్త్రము ఈ అయిదు ముహూర్తములకు స్వధా భవనములు అని వ్యవహారము.

దర్భలును నల్లని నువ్వులును విష్ణు శ రీరము నుండి ఉత్పన్నమయినవి. శ్రాద్ధము శుభ ఫలమును ఈయవలె ననినచో శ్రాద్ధమున దీనిని వినియోగించవలయును. ఆని ద్యులోక నివాసులగు పితృ దేవతలు స్వయముగా చెప్పిరి. కనుక శ్రాద్దము లందును చేతియందు (ఒక చేతిలోనే) దర్భలు ధరిచి తిలోదకమును పితరుల నుద్దేశించి ఈయవ లేను.

పూర్వము మత్స్య రూపుడగు నారాయణుడు మనువునకు చెప్పిన శ్రాద్దాసు కీర్తనము పుణ్యకరము - పవిత్రము- ఆయుః ప్రదము - సర్వ పాపములను నశింపజేయునది. దీనిని చదివినను వినినను నరుడు శ్రీ మంతుడగును. తీర్థ శాద్ధ సమయమున దీనిని తప్పక చదువుటయో వినుటయో చేయవలెను. దాని వలన అశుభము - నశించును. ఇది పవిత్ర మయినది. కీర్తికలుగుటకు మూల కారణ మయినది. మహా పాప హరము. ఈ శ్రాద్ధ మాహాత్మ్యము బ్రహ్మార్కరుదులు కూడ ఆదరించునది. అని దాని తత్వము నెరిగిన వారు చెప్పుచున్నారు.

ఇది శ్రీ మత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున శ్రాద్ధ యోగ్య దేశ కాలాను కీర్తసము అను ఇరువది రెండవ అధ్యాయము