మత్స్య మహా పురాణము
198 - కశ్యపగోత్ర ప్రవరాను కీర్తనము॥
శ్రీమత్స్యః : మరీచేః కశ్యపః పుత్రః కశ్యపస్య తథా కులే ।
గోత్రకారా నృషీ న్వక్ష్యే తేషాం నామాని మే శృణు॥
ఆశ్రాయణి రృషిగణో మేషకీరీటకాయనా ।
ఉదగ్రజా మాఠరాశ్చ భోజా వినయలక్షణాః॥
శాలాహలేయాః కౌరిష్టాః కన్యకా శ్చాసురాయనా ।
మన్దాకిన్యాం పై మృగయా శ్రుతయో భీరుపాయనాః॥
దేవయానా గోమయానా హ్యథ చ్చాయాభయాశ్చయే ।
కాత్యాయనా శ్ళాక్రయాణా బరి యోగగదాయనా॥
భవనస్థీమహాచకి రౌక్షపాయన ఏవ చ ।
యోధయానా కార్తివయో హ స్తిదానా స్తథై వచ॥
వాత్స్యాయనా నీకృతజా హ్యాశ్వలాయనిన స్తథా ।
ప్రాగాయణాః పౌలమౌలిరాశ్వవాతాయని స్తథా॥
కౌబేర కాశ్చశ్యాకారా అగ్నిశర్మాయనాశ్చ యే ।
మేషః కైకరసపా స్తథా చైవతు బభవః॥
ప్రాచేయో జ్ఞానసంక్షేయా ఆగ్ని ప్రా సేవ్య ఏవచ ।
శ్యామోదరా వై వశపా స్తథా చై వోద్బలాయణాః॥
కాష్ఠి హారిణమారీచా ఆజిహాయన హాస్తికాః ।
వైకల్గేయాః కాశ్య పేయా సాససాహారితాయనాః॥
మాతజ్ఞానశ్చ భృగవ స్త్యారేయాః పరికీర్తితాః ।
వత్సారః కశ్యప శ్చైవ నీధ్రువశ్చ మహాతపాః॥
పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః ।
ఏతే స్వసాజ్ఞ్యమిత్రస్య తే వంశా యే ప్రకీర్తితాః॥
వత్సారః కాశ్యప శ్చైవ సర్వే హ్యేతే మహాతపాః ।
పరస్పర మవై వాహ్యా గోత్రోక్తాః పరికీర్తితాః॥
మత్స్య జనార్దనుడు వైవస్వత మనువునకిట్లు చెప్పెను:
మరీచి ప్రజాపతి (ఋషి) పుత్రుడగు కశ్యపుని సంతతివారగు గోత్ర ప్రవర్తక ఋషులను పేర్కొందును; వీరిలో మొదటి వర్గమువారు; ఆజ్రాయణులు మేషులు కిరీటకాయనులు ఉదగ్రజులు మాఠరులు (వినయమే తమ లక్ష ణముగా గల) భోజులు శాలాహలేయులు కౌరిష్టులు కన్యకులు ఆసురాయణులు (మందాకినియందలి) మృగయులు శ్రుతయులు భీరు (భౌత) పాయనులు దేవయానులు॥ గోమయానులు ఛాయాభయులు కాల్యొయనులు శా కోయణులు బరి రోగులు గదాయనులు భవనంది మహాచక్రి దాక్షపాయనులు యోధయానులు కార్తవులు హస్తిదారులు వాత్స్యా యనులు నీకృతజులు ఆశ్వలాయనులు ప్రాగాయణులు పౌలమావి ఆశపోతాయని కౌబేర కుల్యుకారులు ఆగ్ని శర్మా యనులు మేషపులు కైకరసపులు తుల భ్రువులు చేయులు జ్ఞాన సంగ్లేయులు ఆగ్నులు ప్రా సేవ్యులు శ్యామోదరులు వైవశపులు ఉద్భటాయణులు కాష్ఠులు హారిణులు మారీచులు అజిహాయనులు హా క్రికులు వేక గ్లేయులు కాశ్యపేయులు సాసీసులు హరితాయనులు మాతంగులు భృగువులు॥ ఈ ఋషుల వర్గముల గోత్రముల వారలకు వత్సాత్స)రుడు కశ్య పుడు నిధ్రువుడు అనువారు ప్రవర ఋషులు: ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు॥
అతః పరం ప్రవక్ష్యామి ద్వ్యాముష్యాయణ గోత్రజా ।
అనసూయో నాకురయ సునయా రాజువర్తపః॥
శై శిరోదవహి శ్చైవ సైరనీరోప సేవకీః ।
యామునిః కద్రుపిజ్జాక్షీః స్సజాతమ్వి స్తథైవచ॥
దివావాష్ట్రాశ్వ ఇత్యేతే భక్త్యా జ్ఞేయాశ్చ కాశ్యపాః ।
త్యారేయాశ్చతథా వంశాః కీర్తితాః ప్రవరాశ్శుభాః॥
వత్సారః కశ్యపశ్చైవ వసిష్ఠశ్చ మహాతపాః ।
పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః॥
సంయాతిశ్చ నభశ్చాభౌ పిప్పల్యో థ జలద్గరః ।
భుజాతపూరః పూర్యశ్చ కర్దమో గర్దభీముఖ॥
హిరణ్యబాహుః కైరాతో ఉభౌ కాశ్యపగోభితా ।
కులహో వృషకణ్ణశ్చ మృగ కేతు స్తథోత్తరః॥
నిదాఘమసృణా భత్యా మహానః కేర లాశ్చయే ।
శాబ్దిల్యో దానవా శ్చైవ తథావై దేవజాతయః॥
వైపులాది సప్రవరా ఋషయః పరికీర్తితాః ।
త్ర్యార్జేయాభిమతా శ్చైషాం ప్రవరాః పరికీర్తితాః॥
అసితో దేవల శ్చైవ కశ్యపశ్చ మహాతపాః ।
పరస్పర మవ్ర వాహ్యా ఋషయః పరికీర్తితాః॥
ఋషి ప్రధానస్య తు కశ్యపస్య దాక్షాయణీభ్య స్సకలం ప్రసూతమ్ ।
జగత్సమగ్రం మనుసింహ ముఖ్యం తత్తే ప్రవక్ష్యామ్యహ ముత్తరేణ॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే గోత్రప్రవరానుకీర్తనే కశ్యపగోత్ర ప్రవర
వివరణం నామ ఆష్టనవత్యుత్తర శతత మోఽధ్యాయః ॥
రెండవ వర్గమువారు: ఇక మీదట ద్వ్యాముషాయణ గోత్రముల వారిని పేర్కొందును; అనసూయుడు నాకు రయుడు సునయుడు రాజవ ర్రపుడు శై శిరోదవహి సైరంధ్రి రోవ సేవకి -యాముని కద్రుపింగాక్షసజాతంబి వివాష్ట్రా శ్వుడు అను ఈ ఋషుల ( గోత్రముల వారల)కు వత్సారుడు కశ్యపుడు వసిష్ఠుడు అనువారు ప్రవర ఋషులు; వీరు పర స్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు॥
ఇక మూడవ వర్గము వారు: సంయాతి నభుడు పిప్పల్యుడు జలంధరుడు భుజాతపూరుడు పూర్యుడు కర్గముడు॥ గర్గభీముఖుడు హిరణ్యబాహువు కై రాతుడు కాశ్యపుడు గోభిలుడు॥ కులహుడు వృషకంఠుడు మృగ కేతుడు ఉత్తరుడు, నిదాఘుడు మసృణుడు భత్స్యులు కేరలులు శాండిల్యుడు దానవులు దేవ జాతులు పైప్పలాది- ఈ వర్గముల వారలకును ఈ ఋషుల గోత్రముల వారలకును అసితుడు దేవలుడు కశ్యపుడు అను మువ్వురును ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారు పరస్పరము వివాహ సంబంధములు చేసి కొనరాదు॥ ఋషి ముఖ్యుడగు కశ్యపునకు దక్షపుత్రికల వలన సకల జగత్తును జనించినది; ఆ ముఖ్య విషయము నీకు ఇకముందు చెప్పెదను॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున కశ్యపగోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది ఎనిమిదవ అధ్యాయము॥
Summary of chapter 198 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya outlines the dynamic Gotra lineages and Pravaras descending from the royal sage turned Brahmarshi Maharshi Vishvāmitra. The text enumerates major sub-clans including Kaushika, Gāthi, Ashtaka, and Shunahshepa, highlighting their unique spiritual power and Pravara requirements for sacred rituals.