మత్స్య మహా పురాణము
23 - చంద్రవంశ వర్ణనము- చంద్రోత్పత్తి మొదలగు వృత్తాంతములు
ఋషయః: సోమః పితృణా మధిపః కథం శాస్త్రవిశారద ।
తద్వంశ్యా యే చ రాజానో బభూవుః కీర్తివర్దనాః॥
సూతః: ఆదిష్టో బ్రహ్మణా పూర్వ మత్త్రి స్సర్గవిధౌ పురా ।
అనుత్త్రమం నామ తప స్సృష్ట్వర్థం తప్తవా స్ర్పభుః॥
యదానన్దకరం బ్రహ్మ జగతః క్లేశ నాశనమ్ ।
బ్రహ్మ విష్ణ్వర్కరురుద్రణా మభ్యన్తర మతీన్ద్రియమ్॥
శాన్తకృచ్ఛా శ్రమనసాం త దత్రినయనే స్థితమ్ ।
మహాన్తం తపసో విప్రాః పరమానన్దకారకమ్॥
కస్మా దుమాపతి స్సార్ద ముమయా తదధిష్ఠితమ్ ।
తద్దృష్ట్వా చాష్టమాం శేన తస్మా త్సోమోఽభవ చ్ఛిశుః॥
అథ సుస్రావ నేత్రాభ్యాం త త్తేజ శ్చామ్బుసమ్భవమ్ ।
దీపయ న్విశ్వ మఖిలం జ్యోత్స్నయా సచరాచరమ్॥
తద్దిశో జగృహుర్దామ స్త్రీరూ పేణ సుతేచ్చయా ।
గర్భో భూత్వోద రే తాసా మాస్థిత శ్ఛాయుతత్రయమ్॥
ఆశా స్తం ము ముచు ర్గర్బ మశ క్తా ధారణే తతః ।
సమాదాయాథ తం గర్బ మేకీకృత్య చతుర్ముఖః॥
యువాన మకరో ద్భ్రహ్మా సర్వాయుధధరం నరమ్ ।
స్యన్దనేఽథ సహస్రా శ్వే దేవశ క్తిమయే ప్రభుః॥
ఆరోప్య లోక మనయ దాత్మన స్స పితామహః ।
తతో బ్రహ్మర్షిభిః ప్రోక్త మస్మత్స్వామీ భవత్వయమ్॥
ఋషిభి ర్దేవగన్దర్వై రోషధీభి స్తథైవచ ।
తుష్టువు స్సోమదైవత్యై ర్భ్రహ్మాద్య మ స్త్రసజ్ఞ హైః॥
స్తూయమానస్య తస్యాభూ దధితో ధామసఞ్చయః ।
తేజో వితానా దభవ దువి దివ్యౌషధీగణః॥
తద్దీప్తి రధికా తస్మా ద్రాత్రౌ భవతి సర్వదా ।
తదోషధీశ స్సోమోఽభూద్ద్విజేశ శ్చ నిగద్య తే॥
వేదధామరసశ్చాపి యదిదం చన్దమజ్ఞలమ్ ।
క్షీయతే వర్దితం చైవ శుక్లే కృషేచ సర్వదా॥
వింశతిశ్చ తథా సప్త దశ: ప్రాచేతసో దదౌ ।
రూపలావణ్యసంయుక్తా స్తస్మై కన్యా స్సువర్చసః॥
ఋషులు సూతునితో ఇట్లు పలికిరి: సూతా! మీరు సర్వ పురాణ శాస్త్రములను బాగుగా ఎరిగిన వారు. సోముడు పితరులకు ఆధిపతి ఎట్లు ఆయ్యెను? ఆతని వంశమునందు లోకమున తమ కీర్తిని వృద్ధి చేసికొ, గలిగిన రాజులు ఎవరెవరు జన్మించిరి? .
సూతుడు ఇట్లు చెప్ప నారంభించేను: బ్రహ్మ మానస పుత్రుడును ప్రజా పతియును ఆగు అత్రి మిగుల సమర్థుడు. అతనిని బ్రహ్మ ఆదేశించగా అతడు లోక సృష్టిని కొనసాగించుటకై సంకల్పించి సర్వోత్త్రమమగు తపస్సాచరించెను.
పరబ్రహ్మ తత్వము లోకముల కన్నిటికిని క్లేశమును నశింప జేయునది. ఆనందమును కలిగించునది. బ్రహ్మ విష్ణు రవి రుద్రులకును అంతరంగ రూపమయినది. ఇందియములకు గోచరించనిది. శాంతమగు మనస్సు కల వారిని శాంతి నొందించునదీ! గొప్ప వాటికం టెను గొప్పది. తపస్సు వలన కలిగెడి పరమానందమును కలిగించునది. ఇట్టి తత్వము అతి మహాముని తపోమహిమచే అతని కన్నుల యందే నిలిచియుండెను.
దానిని చూచి ఉమాపతి యగు శివుడు ఉమతో కూడి జలమునుండి సంభవమయిన తన ఎనిమిదవ అంశము చే ఆ అతి నేతమును ఆశయించేను. తత్పభావమున కలిగిన ఆనంద బాష్పముల వెంట జలములనుండి పుట్టిన ఆ శివుని అష్ట మా శమగు తేజస్సు అతి మహాముని నేతములనుండి సవించెను. దాని నుండియే సోముడు అను శిశువు ఏర్పడెను. ఆ శిశువు తన వెన్నెలలచే చరాచర పాణులతో నిండిన సమస్త విశ్వమును ప్రకాశింప జేయుచుండెను.
దిక్కులు తాము పుత్తుని కనగోరి స్త్రీ రూపమును ధరించి ఆ తేజస్సును తమయందు నిలుపుకొనెను. అది గర్భము అయి వారి ఉదరముల యందు ముప్పది వేల సంవత్సరముల పాటు ఉండెను. అంతట దిక్కులు ఆ గర్బమును ధరించలేక విడిచి వేసెను. చతుర్ముఖుడగు బహ్మ అంతవరకు దిక్కుల యందు వ్యాపించియున్న ఆ తేజో రూప గర్బమును ఒకటిగా చేసి సర్వాయుధ ధరుడును యువకుడునగు నరునిగా రూపొందించేను. తరువాత మహా శక్తి శాలి యగు బ్రహ్మ దేవశక్తితో ఏర్పడి వేయి అశ్వములచే లాగబడు రథమునందు ఎక్కించి అతనిని తన లోకమునకు తీసి కొని పోయెను. అంతట ఋషులును బ్రహ్మరులును దేవతాత్మక ములగు ఓషధులును దేవ గంధర్వులును ఈ యువకుడు మాకు ప్రభువగు గాక ! అని కోరుకొని, బ్రహ్మ మొదలగు అచటి వారందరును సోమదేవతాకములగు మంత్రసము ఈ కనబడు చంద్రమండలము ఈ హేతువులచే వేదములకు స్థానమును రసాత్మకమును ఐ యున్నది. ఇదీ నిరంతరమును శుక్లపక్షమున వృద్ధి పొందుచు కృష్ణపక్షమున క్షీణించుచు ఉండును.
అనంతరము దక్షప్రజాపతి రూపమును లావణ్యమును కలవారును శోభనమగు వర్చస్సు కలవారును అగు తన ఇరువది ఏడుమంది కన్యలను సోమునకు ఇచ్చెను.
తతః పద్మ సహస్రాణాం సహస్రాణి దశైవతు ।
తపశ్చచార శీతాంశు ర్విష్ణుధ్యానై కతత్పరః॥
తత సుష్టస్తు భగవాం స్తస్మై నారాయణో హరిః ।
వరం వృణీష్వ చోవాచ పరమాత్మా జనార్దనః॥
తతః ప్రాప్య వరం సోమ శ్శక్రలో కే ప్రజా మ్యహమ్ ।
ప్రత్యక్ష మేవ భోక్తారో భవన్తు మమ మన్దిరే॥
రాజసూయే సురగణా బ్రహ్మాద్యా స్సన్తు మే ద్విజాః ।
రక్ష పాల శ్శివోఽస్మాక మాస్తాం శూలధరో హరః॥
తథేత్యుక్త స్సమాజగ్మూ రాజసూయే తు విష్ణునా ।
హోత్రధ్వరూ గురుభృగూ హ్యుద్ధాతాఽభూ చ్చతుర్ముఖః॥
బ్రహ్మత్వ మగమ త్తస్య ఉపద్రష్టా హరి స్వయమ్ ।
సదస్యా సనకాచ్యాస్తు రాజసూయవిధౌ స్మృతాః ॥
చమసాధ్వర్యవ సత్ర విశ్వేదేవా దశైవతు ।
త్రైలోక్యం దక్షిణా తేన ఋత్విగ్భ్యః ప్రతిపాదితమ్॥
తత స్సమాప్తేఽవభృథే తద్రూపాలోకనేప్సవః ।
కామబాణాభితప్రాంగ్యో నవ దేవ్యః ప్ర పేది రే॥
లక్ష్మీ ర్నారాయణం త్యక్త్వా సినీవాలీచ కర్ద మమ్ ।
ద్యుతి ర్విభావసుం తద్వ తుష్టి రౌతార మవ్యయమ్॥
ప్రభా ప్రభాకరం త్యక్త్వా హవిష్మత్తం కుహూః పతిమ్ ।
కీర్తి ర్జయన్తం భర్తారం వసు ర్మారీచిక శ్యపమ్॥
ధృతి స్త్యక్త్వా పతిం దేవీ సోమమే భజం స్తదా ।
స్వకీయా ఇవ సోమోపీ కామయామాస తా స్తదా॥
ఏవం కృతాపచారస్య తాసాం భర్తృగణ స్తదా ।
న శశా కాపచారాయ శా పై శ్శస్త్రాదిభిః పునః॥
తథాప్య రాజత విభు ర్దశధా భావయ న్దిశ ।
సోమః ప్రాప్యాథ దుష్ప్రావ మైశ్వర్య మృషిసత్కృతమ్॥
సురలో కైక నాధత్వ మాప్తస్స తపసా తదా ।
తరువాత చంద్రుడు విష్ణుధ్యానైక తత్పరుడయి దశ సహస్ర పద్మ సహస్ర సంవత్సరములు (10x1000x 1000x1000000000) తపమాచరించెను. నారాయణుడగు (సమస్త జీవులకు ఆశ్రయమగు) హరీభగవానుడు అతని తపస్సు విషయమున సంతుషి చెందెను. పరమాత్ముడగు జనార్ధనుడు (జనులచే ప్రార్థింపబడు దేవుడు). వరము కోరు కొమ్మని చంద్రునితో ననెను. విష్ణుని వలన వర దానమును పొందిన చంద్రుడు ఆ భగవానుని ఇట్లు కోరెను. నేను ఇంద్ర లోకమునకును వేళ్ళగలుగ వలయును. (ఇంద్ర లోకమును జయించగలుగ వలయును.) నేను జరుపు రాజసూయ యాగ మున దేవతలు ఆందరును ప్రత్యక్షముగా ఆ యజ్ఞమున ఇచ్చు హవిస్సులను భుజించవలయును. బ్రహ్మ మొదలగు వారు నా యజ్ఞమున ఋత్విక్కులగు బ్రాహ్మణులుగా కావలయును. లోకముల లయింపజేయగల దేవుడును శూలధారియునగు శివుడు ఆ యజ్ఞమున మాకు యాగ రక్షకుడై యుండవలయును. అని కోరగా విష్ణువు సరే యనెను.
చంద్రునకు విష్ణువు ఇచ్చిన వర ప్రభావమున అతని రాజసూయయాగములో గురుడు హోతగా భృగువు అధ్వర్యు డుగా బ్రహ్మదేవుడు ఉద్దాతగా న్వయముగా హరి ఉపద్రష్టయగు బ్రహ్మగా సనక సనందనాది మహర్షులు సద స్యులుగా వి శ్వేదేవతలు పది మందియు చమగౌధ్వర్యువులుగా ఉండిరి. అతడు మూడు లోకముల రాజ్యమును ఋత్విక్కులకు దక్షిణగా దానము చేసెను. ఇట్లు యజ్ఞము ముగి సెను. అవభృథ స్నానము జరిగేను. ఆ సమయమున కాముని బాణములచే ములు తపింపగా తొమ్మిది మంగిమ అతనిని చూడగోరి వచ్చిరి. వారు ఎవరనగా లక్ష్మీదేవి నారాయణుని.సి నామె కర్దముని-ద్యుతి ఆ శరీర సుడను సూర్యుని తుష్టి ఆనునామే అవ్యయుడగు ధాతను -ప్రభా అనునా కరుడను సూర్యుని-కుపున పతియగు హవిష్మంతుని-కీర్తి ఆనుకామె తన పతియగు జయంతు నామె తన భర్తయగు ధృతి ఆనుసా మే తన పతియగు నంది అనునత సోముని ఆశ్రయించిరి సోముడును వారిని అందరను స్వకీయలనుగా (తాను ధర్మానుసారము పెండ్లాడిన భార్యలను వలె) స్వీకరించేను.
ఆయా దేవుల భర్తలు చంద్రుడు తమకు చేసిన అపచారమునకు ప్రతీకారముగా అతనిని శపించికొని ఆతని పై శస్త్రాస్త్రములు ప్రయోగించి కానీ అతనికి అపచారము ఏమియు చేయజాలక పోయిరి. వారు తనకు ఎన్ని విధముల హాని కలిగింప యత్నించినను శ క్తి సంపన్నుడగు ఆ చంద్రుడు. పది దిక్కులను పది విధములుగా ప్రకాశింపచేయుచు వెలిగెను. ఇట్లు ఆ చంద్రుడు తన తపః ప్రభావము చేత ఋషులు కూడ ఆదరించేడు ఐశ్వర్యమును దేవలోకమునకు ఏకై కాధి పతిత్వమును పొందెను.
చన్ద్రకృత తారాపహరణమ్॥
కదాచి దుద్యానగతా మపశ్య దనేక పుష్పాభరణోపశోభామ్॥
బృహన్ని తమ్బ స్తనభార నమ్రాం పుష్పావతంసా మతిదుర్మదాంగీమ్ ।
భార్యాంచ తాం దేవగురో రసజ్గబాణాభిరామాయత చారునేత్రామ్॥
తారాం న తారాధిపతిః స్మరార్తః కే శేషు జగ్రాహ వివి క్తభూమౌ ।
సాపి స్మరార్తా సహ తేన రేమే తద్రూపకాన్త్యాహృతమాన స్రవ॥
చిరం విహృత్యాథ జగామ తారాం విధు ర్గృహీత్వా స్వగృహం తతోఽపి ।
న తృప్తి రాసీ త్స్వగృ హేఽపి తస్య తారానుర క్తస్య సుఖాగ మేషు॥
బృహస్పతి స్తద్విరహాగ్ని దగ్గ స్తద్ద్యా నదృష్ట్యేకమనా బభూవ ।
శశాక శాపం న చ దాతుమ స్మై న మన్త్రశస్త్రాగ్ని విషైశ్చ తస్మై॥
తస్యాపక ర్తుం వివిధై రుపాయై ర్నై వాపచారైరపి వాగధీశః ।
స యాచయామాస తతస్తు దైన్యా త్సోమం స్వభార్యార్థ మనతప్తః॥
స యాచ్యమానోఽపి దదౌ న తారాం బృహస్పతే స్తత్సుఖపాశబద్దః ।
మహేశ్వరేణాథ చతుర్ముఖేన సాధ్యై ర్మరుద్భి స్సహ లోకపాలై॥
దదౌ యదా తాం న కథఞ్చ దిన్దు స్తదా శివః క్రోధపరో బభూవ ।
యో వామదేవః ప్రథితః పృథివ్యా మనేకముద్రార్చితపాదపద్మః॥
పినాకిసోమయోర్యుద్దమ్॥
తత స్సశిష్యో గిరిశః పినాకీ బృహస్పతి స్నేహరసానుబద్ధః ।
ధనుర్గృహీత్వాఽ జగవం పురారి ర్జగామ భూతేశ్వర సిద్ధజుష్టః॥
యుద్దాయ సోమేన విశేషదీప్త స్తృతీయనే తానలభీమవ కః ।
సహైవ జగ్ము స్సగణేశ కోట్యా వింశచ్చతుష్షష్టి రథాశ్వయుక్తాః॥
యజేశ్వరః కోటి శతై రనే కై ర్యుతోఽన్వగా త్స్యన్దనసంస్థితానామ్ ।
వై తాళ యక్షోర గ కిన్న రాణాం పద్మేన చై కేన తథార్బుదేన॥
లక్షై స్త్రిభి ర్వాదశ భీ రథానాం సోమోఽప్యగా త్తత్ర వివృద్దమన్యుః ।
నక్షత్ర దైత్యా సుర సైన్యయుక్త శ్శనైశ్చరాజ్గారక వృధ్ధతేజాః॥
జగ్ము ర్భయం సప్త తథైవ లోకా శ్చలచ్చలద్ద్వీపసముద్రగర్భాః ।
స సోమ మేవాభ్యగమత్పినాకీ గృహీత దీప్తా స్త్రవిశాలవహ్నిః॥
అథాభవ ద్బీషణభీమసోమ సైన్యద్వయస్యాపి మహాహవోఽసౌ ।
ఆ శేషసత్వక్షయకృత్ర్పవృద్ద స్తీక్ష్ణాయుధా స్త్రజ్వలనై కరూపః॥
శ స్త్రై స్తథాన్యోన్య మ శేష సైన్యం క్షయోగమ తత్క్షణముగ్రతీక్ష్ణై ।
పతన్తి శస్త్రాణి తథా బలాని స్వర్భూమిపాతాళ తలం దహ ని॥
రుద్రః కోపా ద్ర్బహ్మశీర్షం ముమోచ సోమోపి సోమాస్త్ర మమోఘవీర్యమ్ ।
తయో ర్నిపాతేనచ దివ్యభూమ్యో రథాన్తరిక్షస్యచ భీతిరాసీత్॥
తతస్తు యుద్దే జగతః క్షయాయ ప్రవర్ధమానేచ పితామహోపి ।
అన్తఃప్రవిశ్యాథ కథంకథఞ్చి న్ని వారయామాస సురై స్స హైవ॥
అకారణం కిం క్షయకృజ్జనానాం సోమ త్వయాపీద మకా ర్యకార్యమ్ ।
యస్మా త్పరస్త్రీహరణాయ సోమ త్వయా కృతం యుద్ద మిదం నిభీషమ్॥
పాపగ్రహ స్వం భవితా జనేషు శాన్తోఽప్యలం నూన మభీప్సితంతే ।
భార్యా మీమా మర్పయ వాక్పతే స్త్వం న చావమానో స్త్రీ పర స్వహారే॥
సూతః: తధేచి చోవాచ హిమాంశుమాలీ యుద్దా దపా కామ దతః ప్రశా నః ।
బృహస్పతి స్తామపి గృహ్య తారాం హృష్ణో జగామ స్వగృహం సరుద్రః॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే చన్ద్రవంశానువర్ణనే చన్ద్రోత్పత్త్యాదికథనం నామ త్రయోవింశతిత మోఽధ్యాయః ॥
చంద్రుడు తార నపహరించుట
ఒకమారు చంద్రునకు ఉద్యానవనములో దేవగురువగు బృహస్పతికి భార్యయగు తార కనబడెను. ఆమె అనేక ములగు పుష్పములతోను ఆభరణములతోను ఉపశోభించుచుండెను. పెద్ద పిరుదులు కలిగి స్తనముల భారముచే వంగి యుండెను. పుష్పములు శిరోలం కారముగా ధరించి యుండెను. మీగుల మదించిన దేహము కలదై యుండెను. మన్మథ బాణములవలే మనస్సునకు హాయి గొల్పుచు విశాలములును మనోహరములునైన కన్నులు కలిగియుండెను.
(దక్షుడు భార్యలుగా ఇచ్చిన) తారలకు (నక్షత్రములకు) (అప్పటికే) అధిపతిగా ఉన్న ఆ చంద్రుడు కామ వశుడై ఏకాంత ప్రదేశమున ఆమె జడ పట్టెను. ఆతని రూపముచే కాంతిచే ఆప్పటికే తన మనస్సు హరింపబడి ఉన్న ఆ తార ఆ స్థితిలో కామ పీడితురాలయి ఆతనితో విహరించి ఆనందించెను. చాల సేపటివరకు ఆమెతో క్రీడించియు తృప్తినొందక చంద్రుడు అక్కడి నుండి తారను స్వగృహమునకు తీసికొని పోయెను. ఆ మేవలన తనకు కలుగు సుఖము లందు అనురక్తుడగు ఆ చంద్రునకు స్వగృహమునందు కూడ ఆమెతో ఎంత కాలము కామ సుఖములనుభవించినను తృప్తి కలుగలేదు.
బృహస్పతియును తన భార్యయగు తారతోడి ఎడబాటు సహించలేక విరహాగ్నితో దగ్గుడగుచు తన మనోధ్యాన మున నిరంతరమును ఆమెనే చూచుచు బాధనొందుచుండెను. కాని అతడు చంద్రుని శపించుటచే కాని మంత్రములతో కాని శస్త్రములతో కాని అగ్ని తో కానీ విషాదీకముతో కాని అపకారము చేయ జాలక పోయేను. తాను వాచస్పతి (వేదాది విద్యలకు అన్నింటికి అధిపతి) ఐయుండియు వివిధములగు ఉపాయములతోను అప(భీ) చారములతోను కూడ బృహస్పతి చంద్రునకు ఏమియు ఆపకారము చేయలేక పోయెను. అతడు కామ బాధ చేతపించి దీనుడై తన భార్యను తనకిమ్మని చంద్రుని వేడుకొనెను. మహేశ్వరుడు చతుర్ముఖుడు సాధ్యులు మరుత్తులు లోకపాలురు మొదలగు వారు ఎవరు ఎవరు వేడి నను తారాసుఖపాశములచే బద్దుడైన ఆ చంద్రుడు తారను బృహస్పతికి తిరిగి ఈయలేదు.
ఈ కారణమున సదాశివునకు చంద్రుని పై తీవ్రమగు కోపము కలిగెను. అతడు సామాన్యుడా! వామదేవుడు, (కోపించినచో ఎవరికిని అనుకూలుడు కాక హాని కలిగింవ కలవాడు) అని లోకములందు ప్రసిద్ధుడు. అనేకములగు ముద్రలతో (భావ విశేష ప్రకటనములతో) అతని పాదపద్మములను ఎల్లవారును అర్చింతురు. పైగా ఆయనకు బృహస్పతి యందు స్నేహము ఆధికము. ఇట్టి సదాశివుడు త్రిపురాసుర సంహారి. పినాకధనుర్ధారియగు పరమేశ్వరుడు జయముతప్ప ఓటమి నేరుగనీయని అజగవమను ధనుస్సు ధరించి చంద్రునితో యుద్ధమునకై బయలుదేరెను. అతని శిష్యులును విధేయులును అత నివేంట నుండిరి. భూతనాథులును సిద్దులును ఆతనిని పరివేష్టించి వచ్చుచుండిరి. తృతీయ నేత్రము అగ్ని జ్వాలలను ప్రకటించుచుండ అతని ముఖము భయను గొల్పుచుండెను. ఇట్లాయన విశేషముగా దీపించు చుండెను. రథములతోను అశ్వములతోను కూడి గణేశులు ఇరువది అరువది నాలుగు కోట్లమంది (10000 000x20x64) శివుని వెంట బయలుదేరి వెళ్ళిరి. అదే విధముగా కుబేరుడును రథముల నెక్కిన వీరులు అనేక శతకోటి సంఖ్యలో తనకు తోడు రాగా శివుని వెంట వెళ్ళేను. వేతాళులు యకులు ఉరగులు కిన్నరులు పద్మము అర్బుదము సంఖ్యలో (పద్మము = 1000000000, అర్బుదము = 100000000) కుబేరునివెంట నుండిరి. సోముడును అధికమగు కోపముతో మూడు పండ్రెండు లక్షల రథముల పే నక్షత్రులు దైత్యులు అసురులు తనవెంట వచ్చుచుండ శనైశ్చరుడు అంగారకుడు తన తేజస్సును వృద్ధిపర చుచుండ యుద్ధమునకు వచ్చెను. ఈ భయంకర యుద్ధోద్యమమునకు సప్తలోక ములును భయమునందెను. సముద్రములు అన్ని యును వాని నడుమనున్న సమ స్తద్వీపములును అత్యంతముగా చలించు చుండెను. ప్రజ్వలించుచున్న అస్త్రముల నుండి విశాలములగు వహ్ని జ్వాలలు దిక్కుల వ్యాపించుచుండ పినాక ధారియగు శివుడు సోముని ఎదుర్కొనెను.
అంతట భీముని , శివుని) -సోముని- భయంకర సేనలకు రెండింటికిని మహాయుద్ధము జరిగేను. ఆయుద్దము నమస్త ప్రాణులకును నాశము కలిగించునదియు మిగుల క్రమక్రమముగా వృద్ధి పొందుచు పోవుచున్న దియు తీక్షములగు ఆయుధములనుండియు అస్త్రములనుండియు వెలువడు మంటలు దట్టమై గనబడుచున్నదియునై భయంకరముగా ఉండెను. పరస్పరము ప్రయోగించుకొనుచున్న భయంకర తీక్ష శస్త్రములతో ఇరుపక్షములవారి సేనయంతయు తత్ క్షణమే నాశము నొందసాగెను. సేనల పై పడుచుండిన శక్తి సంపన్నములగు ఆయుధములు ఆ సేననే కాక స్వర్గమర్త్య పాతాళ లోకములను కూడ కాల్చి వేయు చుండెను,
రుద్రుడు కోపించి బ్రహ్మశ్రాస్త్రమును ప్రయోగించెను. సోముడు వ్యర్థము కాని శ క్తిగల సోమాస్త్రమును వదలేను. వాటిని ప్రయోగించుటవలనను అవి పరస్పరము డీకొనుటవలనను ద్యు భూమ్యంతరిక్షములకు మూడింటికిని (ఈ మూడు లోక ములందలి సకల భూతములకును) భయము గలిగెను.
ఇట్లా భీమ సోముల యుద్ధము క్రమక్రమముగా వృద్ధి పొందుచుండెను. లోకములు క్షయమునొందునట్లుండెను. ఇది చూచి లోక పితామహుడగు బ్రహ్మ ఎంతో శ్రమతో (దేవతలతో కూడ) లోపల ప్రవేశించి వారి యుద్ధమును నివా రించెను. బ్రహ్మ సోమునితో నిట్లు పలికెను: “సోమా ! నీవిట్లు ఆకారణముగా భూతములకు నాశమును కలిగించు యుద్దమునకు పూనితివి. ఇది చేయరాని దుష్కృత్యము. ఇది కాక నీవు పర స్త్రీహరణము అనెడు ఆకృత్యమునకు సంక ల్పించితివి. అందులకయియే నీవీ భయంకర యుద్ధమును చేయుచున్నావు. నీవు సహజముగ శాంత స్వభావుడవే కావచ్చును. కానీ నీవు చేసిన ఈ దోషమునకు ఫలితముగా జనులయందు పాపగ్సహముగానే ప్రసిద్ధినొందుదువు. నీకు కలిగిన ఈ కోరిక (పరదార హరణవాంఛ) ఇంతటితో చాలింపుము. బృహస్పతి భార్యయగు తారను మరల అతనికి ఆప్పగించుము. పరుల ధనమును హరించిన వారు దానిని మరల దాని సొంతగానీ కప్పగించుటలో అవమానము ఏమియు లేదు.”
పితా మహుని మాటలు విని సోముడు సరేయని అంగీకరించెను. ప్రశాంత భావముతో యుద్ధము నుండి తొలగి పోయెను. బృహస్పతియును భార్యయగు తారను వెంట తీసికొని హరించుచు రుద్రునితో కూడి స్వగృహమునకు పోయెను.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున చందవంశానువర్ణనమున చంద్రుని ఉత్పత్తి మొదలగు వృత్తాంతములు అను ఇరువదిమూడవ అధ్యాయము.
Summary of chapter 23 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya begins the detailed chronicle of the Chandra-vaṁsha, tracing its origin to Chandra, who emerged from the eye of Maharshi Atri through intense meditation. Appointed by Bhagavān Brahmā as the sovereign ruler of stars, vegetation, and Brāhmaṇas, Chandra performed the great Rājasūya sacrifice, which filled him with vanity and led him to abduct Tārā, the beautiful wife of Bṛhaspati. Despite repeated entreaties by Bṛhaspati and the Ṛshis, Chandra refused to return her, leading to a catastrophic cosmic conflict known as the Tārāmaya war, in which Śukrāchārya and the Asuras sided with Chandra, while Indra and the Devas sided with Bṛhaspati. The destruction ceased only when Bhagavān Brahmā intervened, compelling Chandra to restore Tārā to Bṛhaspati, after which Tārā gave birth to Budha, whose radiant divine form was acknowledged by Chandra as his true son.