15 - దానవాదులును నాలుగు వర్ణములవారును అర్చించు పితరుల వృత్తాంతము -  (బర్హిషద్-సుకాలి-హవిష్మత్-ఆజ్యప-సోమప-పితరుల చరితము)

సూతః: విభ్రాజా నామతోఽన్యేతు దివి స న్తి సుపర్చసః

లోకా బర్హిషదో యత్ర పితర స న్తి సువతాః

 యత్ర బర్హి ణ యుక్తాని విమానాని సహస్రశః

సజ్కల్పబర్హి షో యత్ర తిష్ఠ న్తి ఫలదాయినః

 తత్రాభ్యుదయశాలాసు మోద నే శ్రాద్దదాయినః

యాన్దానవాసురగణా గన్దర్వాప్సరసాం గణాః 

యక్షర క్షోగణా శ్చైవ యజ న్తి దివి దేవతాః

పులస్త్యపుత్తా శ్శతశ స్తపోయోగ(సమన్వితాః)బలాన్వితాః

 మహాత్మానో మహాభాగా భక్తానా మభయప్రదాః

 ఏతేషాం (బదరీ)ఓవరీ కన్యా మాన సీ దీవి విశ్రుతా

యోగినీ యోగమాతాచ తపశ్చ క్రే సుదారుణమ్

 ప్రసన్నో భగవాం స్తస్యా వరం వ వ్రే చ సా హరేః

 యోగవ న్తం సురూపంఛ భర్తారం విజితేన్ద్రియమ్

 దేహి దేవ ప్రసన్నస్త్వం యది మే వదతాంవర

ఉవాచ దేవో భవితా వ్యాసపుత్త్రో యదా శుకః

భవిత్రీ తస్య భార్యా త్వం యోగాచార్యస్య సువతే

 భవిష్యతిచ తే కన్యా కృత్తి ర్నామ్నాచ యోగినీ

 పాఞ్చాలాధిపతే ర్దేయా మానుషస్య త్వయా తదా

 జననీ బ్రహ్మదత్తస్య యోగ సిద్దాశ్చ యత్సుతాః

కృష్ణో గౌరః ప్రభు శ్శమ్భు ర్భవిష్య నిచ తే సుతాః

 మహాత్మానో మహాభాగా గమిష్య న్తి పరంపదమ్

 తానుత్పాద్య పునర్యోగా త్సవరా మోక్ష మేష్యసి  

ద్విజాదిపితృగణగణనమ్

సూతః: యేమూర్తిమత్తః పితరో వసిష్ఠస్య సుకాలినః

 నామ్నాతు మానసాస్సర్వే సర్వే తే ధర్మమూర్తయః

  జ్యోతిర్భాసిషు లో కేషి యేవసన్తి దివఃపరమ్

 విరాజమానాః క్రీడన్తి యత్ర తే శ్రాద్ధదాయినః

 సర్వకామసమృద్ధేషు విమానేష్వపి పాదజాః

 కింపునః శ్రాద్దదా విప్రా భక్తిమన్త: క్రియాన్వితాః

 గౌర్నామ కన్యా తేషాoతు మానసీ దివి రాజతే

శుక్రస్య దయితా పత్నీ సాధ్యానాం కీర్తివర్ధనీ  

సూతుడు ఇంకను ఇట్లు చెప్పనారంభించెను: ద్యులోకమునందు శోభనమగు వర్చస్సు (కాంతి కలిగిన మరి కొన్ని లోకములు గలవు. వాని పేరు విభాజములు. వానియందే సువతులు ఉత్త్రమ నియమానుష్టాన పరులు) అగు బరి షదులు అను " పితరులు నివసింతురు. వానియందు నెమళ్ళచే మోయబడు విమానములు వేలకొలదిగా ఉండును. ఈ పితరులు వానియందు కూర్చుండి సంచరింతురు. (బరి -సద్ జబర్హిషద్ - నెమిళ్ళపై కూర్చుండువారు. ఆ లోకముల యందలి పితృ దేవతల విషయములో చక్కగా ఆచరింపబడిన యజ్ఞములు (శ్రాద్ధములు) బ ర్టిస్-యజ్ఞము) విశేషముగా ఫలములను ఇచ్చునవియగును. వారినుద్దేశించి శ్రాద్ధములను ఆచరించిన వారు అభ్యుదయ శాలల ప్రాపంచిక సుఖముల నిచ్చెడు గృహముల) జ ందు ఆనందింతురు. వీరిని అసుర దానవ గంధర్వాపరో యక్షర క్షోగణముల వారును ద్యులోకమునందలి దేవతలను ఆరాధింతురు. వీరు పులస్త్య ప్రజాపతి కుమారులు. తపస్సు చేతను యోగసాధనము చేతను కలిగిన నూర్ల కొలది శక్తులు కలవారు. మహాత్ములును మహాభాగులును భక్తులకు అభయమును ఇచ్చువారును, వీరి మానసీకన్య పీవరి అను పేరుతో ద్యు ---కమున ప్రసిద్ధయైయున్నది. ఈమె యోగమున కే తల్లి అనదగిన యోగిని. ఈమె మిగల భయంకరమగు తపస్సాచరించెను. భగవానుడగు హరి ఆమె ననుగ్రహి) చెను. , పురుషోత్త్రమా! నీకు నా యందు అనుగ్రహము కలిగినచో నాకు యోగసిద్ధి కలవాడును సుందరుడును విజితేంద్రియుడును అగు భర్తను ఇమ్ము! ఆని ఆమె వరము కోరెను. హరి ఇట్లు పలి కెను. “ముందుముందు వ్యాసునకు శుకుడను కుమారుడు కలుగును. అతడు యోగాచార్యుడు. నీవు ఆచరించిన ఈ సుతపోవ్రతముకు ఫలముగా నీకు అతడు భర్తయగును. యోగిని కాగల కృత్రి ఆను కూతురు నీకు కలుగును. నీవామెను మానవుడగు పాంచాల దేశ రాజునకు ఇమ్ము . ఆమెకు బ్రహ్మదత్తుడను కుమారుడు కలుగును. అతనికినీ యోగసిద్దులగు కుమారులు కలుగుదురు. నీకు కృష్ణుడు గౌరుడు ప్రభుడు శంభుడు అను కుమారులు కలుగుదురు. వారు మహాత్ములును మహాభాగులునే పరమపదమును చేరుకొందురు. ఇట్టి కుమారులకు తల్లివే నీవు నీ భర్తతో కూడ మోక్షమును పొందుదువు.”

ఇది అమూర్తులు-మూర్తి లేనివారు) ఆగు పితృ దేవతా గణముల విషయము.

[ ఇచట మూలములో పండ్రెండవ శ్లోకమున మొదట "అమూర్తి మంత:” అని యున్నది. ఇది తప్పు. యే మూర్తి మంతః' అని ఉండవలెను. అనువాదకుడు. ఇక మూర్తి మంతులగు పితృదేవతల విషయము. సుకాలిన్ అను పేరుగల పితృదేవతల గణమువారు వసిష్ఠుని మానసపుత్త్రలు. వారందరును ధర్మమూర్తులు. వారు ద్యులోక మునకు పైగా ఉన్న 'జ్యోతిర్భాసి' (నక్షత్రాది జ్యోతిస్సులతో ప్రకాశించు) లోకములందు నివసింతురు. తమ పూర్వులనుద్దేశించి శ్రాద్ధము లను జరిపిన శూద్రులై నను ఈ లోకములందు విమానముల పై ప్రకాశించుచు క్రీడించుచు వివిధ భోగములను అనుభవించు చుందురు. ఇక భ క్తిమంతులై సరిగా కర్మలను అనుష్టించువారై శ్రాద్ధములను జరుపు బ్రాహ్మణుల విషయము చెప్ప వలసిన దేమున్నది? గౌః అను పేరుకల వారి మానసపుత్రి డ్యులోకమున ప్రకాశించుచుండును. ఆమె శుక్రునకు ప్రియ భార్యయయ్యెను. ఆమె సాధ్యులను దేవతలకు కీర్తిని వర్ధిల్లజేయునది. ( ఈ పితృదేవతా గణమును విప్రులారాధింతురు.)

మరీచిగర్బా నామ్నా తు లోకా మార్తాణ్డ మండలే

పితరో యత్రతిష్టన్తి హవిష్మన్తోం గిరస్సుతాః

 తీర్థ శ్రాద్దప్రదా యాన్తి యే చ క్షత్రియసత్త్రమాః

 రాజ్ఞాంతు పితర సేవే స్వర్గ మోక్షఫలప్రదాః

ఏతేషాం మానసీ కన్యా యశోదా లోక విశ్రుతా

 పత్నీ హ్యంశుమత: శ్రేష్టా స్ను షా పఇ్చజనస్యతు

జననీచ దిలీపస్య భగీరథపితామహీ

 లో కాః కామదుహో నామ కామభోగఫలప్రదాః

 సుస్వధా నామ పితరో యత్ర తిష్టన్తి సువ్రతాః

ఆజ్యపా నామ లోకేషు కర్దమస్య ప్రజాపతేః

పులహస్యచ దాయాది వైశ్యా స్తా నావయ న్తిచ

యత్ర శ్రాద్ధకృత స్సర్వే పశ్య న్తి యుగపద్గతాః

 మాతృభాతృపితృష్వసృ సఖిసమ్బన్దిబాంధవాః

అపీజన్మా యుతై ర్దుష్టా ననుభూతా న్స్రహస్రశః

 ఏతేషాం మానసీక న్యా విరజానామ విశ్రుతా

 యా పత్నీ నహుషస్యాసీ ద్యయాతే ర్జననీ తథా

 ఏకాష్ట కాఽభవత్పశ్చా ద్ర్బహ్మలోకం గతాసతీ

 త్రయవతే గణాః ప్రోక్తా శ్చతుర్థంతు వదామ్యహమ్

 లోకాస్తు మానసా నామ్నా బ్రహ్మణః పురి సంస్థితాః

ఏతేషాం నూనసీకన్యా నర్మదానామ విశ్రుతా

 సోమపా నామ పితరో యత్ర తిష్ట న్తి శాశ్వతాః

ధర్మమూర్తిధరా స్సర్వే పరతో బ్రహ్మణ స్థితాః

 ఉత్పన్నా స్వధయా తేతు బ్రహ్మత్వం ప్రాప్య యోగినః

కృత్వా సృష్ట్యాదికం సర్వం మాన సే సా సాంప్రతం స్థితాః:

 నర్మదానామ తేషాంతు కన్యా తోయవహా సరిత్

 భూతాని యా పావయతి దక్షిణాపథగామినీ  

సూర్యమండలమునందు 'మరీచి గర్బములు’ తమ అంతర్భాగమునందు కిరణములు కలవి) అను లోకములు గలవు. అంగిరః ప్రజాపతికి పుత్రులగు బర్హిష్మంతులను పితృ దేవతలు ఈ లోకములందు వసింతురు. తీర్థ శ్రాద్ధములను జరుపు క్షత్రియ శేషులు ఈ లోకములకు పోవుదురు. ఈ పితరులు క్షత్రియులకు స్వర్గ మోక్షఫలములను ఇత్తురు. వీరి మానసపుత్రి యశోద అను పేర లోకప్రసిద్ధురాలు. ఈమే పంచ జనుని కుమారుడగు అంశుమంతుని భార్య. దిలీపుని తల్లి. భగీరథుని నాయనమ్మ.

 కోరిన భోగఫలములను ఇచ్చు 'కామదుఘములు' అను లోకములు కలవు. సత్కర్మములను అనుష్ఠించువారు ఆజ్యపులు అను పితృదేవతలు ఈలోకములందు వసింతురు. వీరు కర్దమ ప్రజాపతి కుమారులును పులహుని కుమారులును. వీరినీ వైశ్యులారాధింతురు. వీరిని ఆరాధించినవారు ఈ లోకములకు పోయి అచ్చట తమ పూర్వమృతులగు తల్లులు సోదరులు మేనత్త్రలు మిత్రులు వియ్యాలవారు ఇతర బంధువులు మొదలగువారు. అప్పటికి పదివేల జన్మలను ఎత్తిన వారే నను వేలకొలది ఏయే విధములుగా పోరిని తాము చూచి అనుభవము పొందియున్నారో అదే విధములుగా వారిని చూడగలుగుదురు. వీరి మానసపు తి విరజ అను పేర ప్రసిద్ధురాలు. ఈమె తరువాత నహుషుని భార్య. యయాతికి తల్లి ఆయ్యెను. ఈమె బ్రహ్మలోకమునకు చేరిన తరువాత “ఏకాష్టక' అను పేర ప్రసిద్ధురాలయ్యేను. ఇట్లు మూర్తిమంతము లగు మూడు పితృగణముల వృత్తాంతము చెప్పుటయైనది నాలుగవ గణము విషయము వినుడు.

 బ్రహ్మదేవుని నగరమునందు మానసములు అనులోకములు కలవు. నర్మద అను మానసపు కి తండ్రులగు సోమపులు అను పితృదేవతలు ఈ లోకములందు నివసింతురు. వీరు అందరును ధర్మచూర్తిని ధరించినవారు. శాశ్వతులు, బ్రహ్మకు పైస్థానమునందుండు వారు. వీరు ‘స్వధ'నుఁ డి జనించిరి. యోగసిద్ధిచే బ్రహ్మత్వమును పొందిరి. సృష్టి మొదలగు వ్యాపారములను నిర్వహించి ఇప్పుడు మానస లోక ముందున్నారు. వారి మానసపు తియగు నర్మద నీటిని ప్రవ హింపజేయుచు నదిగానై నది. ఆమే దక్షిణాపథము (వింధ్యకు దక్షిణమునందు ఉన్న భారత దేశము) నందు ప్రవహించుచు ప్రాణులను పవిత్రులనుగా చేయుచున్నది..

తేభ్య స్సర్వేతు మనవః ప్రజాసర్గేషు నిర్మితాః

 జ్ఞాత్వాశ్రాద్దాని కుర్వీత ధర్మభా వేపి సర్వదా  

 (సర్వం పాత్రేభ్య ఏవస్యాచ్చ్రాద్ధ మేవవినిర్మితం)తేభ్య ఏవ పునఃప్రాప్తు

ప్రసాదా ద్యోగస స్తతిం

 పితృణా మాదిసర్గేతు శ్రాద్దమేప వినిర్మితమ్  

 శ్రాద్దే దెయాదేయవస్తువివరణమ్

సర్వేషాం రాజతం(పాత్రమథవారాజతాన్విథం) పాత్రంపితృ న్ప్రీణాతి సర్వదా

 దత్తం స్వధా పురోధాయ పితృనుద్దిశ్య సర్వదా

 అగ్నీ షోమయమాభ్యాంతు కార్య మాప్యాయనం బుధైః

 అగ్న్య భా వేపి విప్రస్య పాణాపథ జలేపివా

 అజాకర్ణేశ్వకర్ణేవా గోష్ఠేవాథ శివాన్తికే

పితృణా ముత్తమం స్థానం దక్షిణా దిక్ప్రశస్యతే

 ప్రాచీనావీత ముదకం తిలా స్సవ్యాజ్గ మేవచ

దర్బా మాంసంచ పాఠినం గోక్షీరం మధురో రసః

 (ఖడ్గలోహమిషంచైవ)ఖడ్గవార్ద్రామిషంచైవ మధుశ్యామాక

శాలయః

యవ నీవార ముద్గేక్షుగుడపుష్ప ఘృతానిచ

 వల్లభానీ ప్రశస్తాని పితృణా మేవ సర్వదా

 గ్రాహ్యాణ్యే తాని; వక్ష్యామి శ్రాద్దే వర్జ్యాని యాని చ

 మసూర చణనిష్పావ రాజమాష కుళుత్థకాః

పద్మబిల్వార్క ధుత్తూర పారిభద్రౌటరూష కాః

 న దేయాః పితృకార్యేషు పయశ్చాజావికం తథా

 కోద్రవోద్దాలకరక కపిత్థమధుకాలసీ

ఏతాన్యపి న దేయాని పితృభ్య శ్శ్రియమిచ్ఛతా

 పితృన్ప్రీణాతి యో భోక్తా తే పునః ప్రీణయ ని తమ్

 ఇచ్ఛన్తి పితరస్తుష్టిం స్వర్గారోగ్యం ప్రజాః ఫలమ్

 దేవకార్యా దపి పునః పితృకార్యం విశిష్యతే

 దేవతానాం పితృణాంతు పూర్వమాప్యాయనం స్మృతమ్

శీఘ్రప్రసాదా స్వక్రోదాః ప్రశాన్తస్స్థిరసౌహృదః

 శాన్తాత్మాన శ్శౌచపరా స్సతతం ప్రియవాదినః

భక్తానురక్తా స్సుఖదాః పితరః పూర్వదేవతాః

 హవిష్మతా మాధిపత్యే శ్రాద్ధదేవో రవి స్మృతః

 ఏతద్వ స్సర్వమాఖ్యాతం పితృవంశానుకీర్తనమ్

 పుణ్యం పవిత్ర మాయుష్యం కీర్తనీయం సదా నృభిః

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే ద్వీజాదిపితృగణ గణనం నామ పజ్ఞ్చదశోఽధ్యాయః

ప్రజాపతులు తాము చేసిన ప్రజా సృష్టులలో ఈ పితృదేవతల నుండియే మనువులనందరను సృజించిరి. ఈ విషయమును ఎరిగి జనులు ఏ యజ్ఞయాగాది ధర్మము నైనను ఆచరించినను ఆచరించకున్న ను ఎల్లప్పుడును శ్రాద్ధము లను మాత్రమాచరించవలెను. వారి అనుగ్రహమువలననే మరల ప్రజలు యోగసిద్ధిని నిరంతరముగా (అవిచ్చిన్న ముగా) పొందగలరు. ఏలయన ఆదిసృష్టియందు జనులు అనుష్ఠింపవలసిన కర్మముగా పితృశ్రాద్ధమే విధింపబడినది.

అన్ని వర్ణములవారు పెట్టు శ్రాద్ధములందును రజత (వెండితో చేసి ) పాత్ర మే పితృప్రీతికరము. పితృ దేవతలనుద్దేశించి సమర్పించు ఏపదార్తమునై నను ఏవర్ణము వారైనను రజత పాత్రమునందే సమర్పించవలెను.) పితరుల నుద్దేశించి ఏది సమర్పించినను స్వధాకార పూర్వకముగా ఈయవలెను. సంప్రదాయమును . ఎరిగినవారు ఆగ్నీషోములకును యమునకును (అగ్ని ష్వాత్తులకు అని మరియొక విధముగ పాఠము) శ్రాద్దదానము చే తృప్తిని కలిగించవలెను. ఇది అగ్ని యున్న చో అగ్నియందును లేనిచో విప్రుని చేతియందో జలమునందో మేక చెవియందో గుర్రపు చెవియందో గోవులు నిలుచు స్థానమునందో శివ సన్నిధియందో చేయవచ్చును. దక్షిణదిశ పితరులకు ప్రశస్తమయిన స్థానము (దిక్కు).

 ప్రాచీనావీతము (కుడి భుజము మీదకు ధరించిన యజ్ఞోపవీతము) ఉదకము నూవులు సవ్యమయిన (ఎడమవై పు) అవయవము దర్భలు కూర్మమాంసము ఆవుపాలు మధురరస ద్రవ్యములు ఖడ్గమృగపు మాంసము తేనే చామలు అను వడ్ల బియ్యము వరిబియ్యము యవలు నివ్వరి బియ్యము పెసలు చెరకు బెల్లము పూవులు నేయి ఇవి ఎల్లపుడును పితృ దేవతలకు ప్రియములై నవియు ప్రశస్తములై నవియును. కనుక శ్రాద్ధమున ఇవి గ్రహించదగినవి. విడువదగినవి - ప్పెదను వినుము. చిరు సెనగలు నెనగలు అనుషులు బొబ్బరలు ఉలవలు తామర పూవు బిల్వము జిల్లేడు ఉమ్మెత్త్ర వేప అడ్డసరము మేకల గొర్రెలపాలు కొర్రలు అడవి కొర్రలు దానిమ్మ వెలగ ఇప్ప అవిసె గింజలు ఇవి శ్రాద్ధమునందు వినియోగించకూడదు. అట్లు చేయుటచే వారి అనుగ్రహము కలుగదు. శోభ సిరి తగ్గును. భ క్తిచే పితరులను తృప్తిపరచిన వానిని పితరులును సంతృప్తి పర తురు. పితరులు తుష్టి చెందినచో వారు కర్తకు గూడ తుష్టిని స్వర్గమును ఆరోగ్యమును సంతానమును ఫలముగా ఇతురు.

దేవకార్యముకం టెసు పితృకార్యము విశిష్టతరమయినది. దేవతలను తృప్తిపర చుటకంటెను ముందు పితరులను తృప్తి పరచవలయును. పితృదేవతలు శీఘ్రముగా అనుగ్రహించు పొరును క్రోధము లేనివారును మిగుల శాంతులును స్థిరముగా నిలిచియుండు సుహృద్భావము ( అనుగ్రహము) కలవారును శుద సత్వగుణ ప్రధానమగు చిత్త్రవృత్తి కల వారును దేహమునను చిత్త్రమునను శుచిత్వమునందు శ్రద్ధ కలవారును ఎల్లప్పుడు ప్రీతికరముగా మాటలాడు వారును భక్తులయందు ప్రీతికలవారును వారికీ సుఖమును ఇచ్చువారును ఐయున్నారు. ఇంత ఏల? వారు దేవతలలో మొదటివారు.  సూర్యుడు హవిష్మంతులు అను పితృదేవతల ఆధిపతిత్వము కలవాడును శ్రాద్ధ కర్మానుష్టానమునకు అధిష్టాన దేవతయునై యున్నాడు.

 మహర్షులారా! మీకు నేను పితృవంశాను కీర్తనము అంతయు చెప్పితిని. ఇది పుణ్యకరము.పవిత్రమయినది. ఆయుష్యమును వృద్ధి చేయునది. మానవులు ఎల్లప్పుడును కీర్తింపదగినది.

ఇది శ్రీ మత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున పితృగణ గణనమను పంచదశాధ్యాయము.