76 - ఫల సప్తమీ వ్రతము

ఈశ్వరః : అన్యా మపి ప్రవక్ష్యామి నామ్నా తు ఫలసప్తమీమ్

యా ముపోష్య నరః పాపా ద్విముక్త స్స్వర్గభా గ్భవేత్

మార్గశీర్షే మాసి శుభే పక్చామ్యాం నియత ప్రతః

షష్ఠి ముపోష్య కమలం కారయిత్వా తు కాఇ్చనమ్

శర్కరాసంయుతం దద్యా ద్భ్రాహ్మణాయ కుటుమ్బినే

రూపం చ కాఇ్చనం కృత్వా పల స్యైకస్య ధర్మవిత్

 దద్యా ద్ద్వికాలవేళాయాం భాను ర్మే ప్రీయతా మితి

శక్త్యా చ విప్రా న్త్సమ్పూజ్య సప్తమ్యాం క్షీరభోజనమ్

కృత్వా కుర్యా త్ఫలత్యాగం యావతా కృష్ణసప్తమీ

తామప్యు పోష్య విధివ దనేనైవ క్రమేణతు

తద్వ ద్దేమఫలం దత్వా సువర్ణ కమలాన్వితమ్

శర్కరాపాత్రసంయుక్తం వస్త్రమాల్య సమన్వితమ్

సంవత్సర మనేనైవ విధినోభయసప్తమీం

 ఉపోష్య దద్యా త్క్రమశ సూర్య మన్త్రా నుదీరయేత్

భాను రర్కో రవి ర్ర్బహ్మా సూర్య శ్మక్రో హరి శ్శివః

శ్రీమా న్విభావసు స్త్వష్టా అరుణః ప్రీయతా మీతి

ప్రతిమాసంచ సప్తమ్యా మేకైకం నామ కీర్తయేత్

ప్రతిపక్షం ఫలత్యాగ మేతత్సర్వం సమాచరేత్

వ్రతాన్తే విప్రమిథునం పూజయే ద్వస్త్రభూషణైః

శర్కరాకలశం దద్యా ద్దేమపద్మఫలాన్వితమ్

 యథా న విఫలాః కామా స్త్వద్భక్తానాం సదా రవే

తథాఽన స్తఫలావాప్తి ర్బవే జ్జన్మ ని జన్మని

 ఇమా మనన్త ఫలదాం కుర్యాద్యః ఫలసప్తమీమ్

 సర్వపాపవిశుద్దాత్మా సూర్యలో కే మహీయతే

సురాపానాదీకం కించి ద్యదగ్రాముత్ర వాకృతమ్

తత్సర్వం నాశమాయాతీ యః కుర్యా త్ఫలసప్తమీమ్

కుర్వాణ సప్తమీ మేతాం సతతం సజ్గవర్జితః

భూతభవ్యంశ్చ పురుషాం స్తారయే దేకవింశతిమ్

యశ్శృణోతి పఠేద్వాపి సోపి కల్యాణభా గ్భవేత్

ఇతి శ్రీమత్స్యమహాపురాణే వలస ప్రమీవ్రత కథనం నామ షట్స ప్తతిత మోఽధ్యాయః

ఈశ్వరుడు బ్రహ్మకిట్లు చెప్పెను: ఫల సప్తమియను సప్తమి విషయము తెలి పెదను. ఈనాడుపవసించినవాడు పాపముక్తుడై స్వర్గమందును.

మార్గశిర శుక్ల పంచమినాడు వ్రత నియమములు పాటించి గడపి షష్టినాడు ఉపవసించవలెను. (విశోక సప్తమివలెనే సప్తమినాడు బంగారు పద్మమును శర్కరను బంగారుతో ఫలపు బొమ్మను కుటుంబియగు బ్రాహ్మణునకు రెండు పూటలందును ధర్మతత్వము నెరిగి 'భానుర్నే ప్రీయతాం 'భానుడు నాయందు ప్రీతుడగుగాక!' అనుచు దానమీయ వలెను. యథాశ క్తిగా విప్రులను పరమాన్నముతో భుజింపజేసి తానునట్లే భుజించి ఫలత్యాగము చేయవలెను. ఇట్లు కృష్ణ పక్ష సప్తమివరకు చేయుచు మరల ఆ కృష్ణ (మార్గ శిర) సప్తమినాడును ఉపవసించి హేమఫలమును సువర్ణపద్మమును శర్కరా పొత్రమును వస్త్ర మాల్యములను దానమీయవలెను. ఈ విధముగ సంవత్సరకాలము ఉభయ సప్తములందును (శుక్ల సప్తమితో ఆరంభించి కృష్ణ సప్తమివరకు) ఉపవాన పూర్వకముగా (రెండు సప్తములందును దానములు-నడుమ దినములలో నియమమును పాటించుట) క్రమముగా సూర్య దేవతాక మంత్రముల పఠించుచు చేయుచుండవలెను. ఫల త్యాగము చేయునపుడు మార్గశిరము మొదలు కార్తీకమువరకు ప్రతి మాసమునందును వరుసగా.భానుఃప్రీయతాం-ఇట్లే. అర్కః.రవిః-బ్రహ్మా-సూర్యః శక్ర 2.హరిః శివః-శ్రీమాన్-విభావసుః త్వష్టా-అరుణకి. అను నామములను ప్రియతాం' అను పదముతో చేర్చి పలుకవలయును. ప్రతిపక్షమునను -న ప్రమీనాడు ఇట్లు దానమును ఫలత్యాగమును చేయవలయును.

వ్రతాంతమునందు విప్ర దంపతులను వస్త్రభూషణములతో పూజించి శర్కరాపూర్ణ కలశమును సువర్ణఫల ప్రతిమను వారికి దానము ఈయవలెను. “రవీ! భక్తుల కోరికల సఫలము చేయు నీ దయచేత నాకును జన్మ జన్మమునందును అనంతఫలములు లభించుగాక!” అని ప్రార్థించుచు దానమీయవలయును.

అనంత ఫలప్రదయగు ఈ ఫల సప్తమీ వ్రతము చేసినవాడు సర్వపాపముక్తుడై పవిత్రత నొంది సూర్యలోక మున పూజితు డగును. వానికి సురాపానాది పాపము లేవై న ఎప్పటికైన ఉన్నను అవియు నశించును. అతని వెనుక ముందు ఇరువది యొక తరముల వారును తరింతురు. దీనిని చదివిన వినినవారికి కూడ ఈ ఫలము లభించును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఫలసప్తమీ వ్రత కథనమను డెబ్బదియారవ అధ్యాయము.